3.3 అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం విధానాలు & సంక్షేమ కార్యక్రమాలు - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Wednesday, July 19, 2023

3.3 అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం విధానాలు & సంక్షేమ కార్యక్రమాలు

3.3 అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం విధానాలు & సంక్షేమ కార్యక్రమాలు


    ఎవరు అల్ప సంఖ్యాక వర్గాలు


    భారతదేశంలో జనసంఖ్య పరంగా తక్కువ జనాభా ఉన్న సమూహాలైన మైనార్టీలను/అల్పసంభఖ్యాక వర్ణాలను ప్రధానంగా 2 రకాలుగా గుర్తించారు. (1) భాషాపరమైన మైనార్టీలు (2) మతపరమైన మైనార్టీలు.

     

    నేషనల్‌ కమీషన్‌ ఫర్‌ మైనార్టీస్‌ చట్టం 1992 నందు పేర్కొన్న విధంగా 1993వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 5 మతపరమయిన సముదాయాలను మతపరమైన మైనార్టీలుగా గుర్తించింది, వారు.. (1) ముస్లింలు (2) క్రిస్టియన్లు (3) సిక్కులు (4) బౌద్దులు (5) జొరాష్ట్రియన్లు (పార్శిలు). వీరికి అదనంగా జనవరి 27, 2014లో జైనులను కూడా మైనార్టీలుగా గుర్తించారు. అనగా ప్రస్తుతం భారతదేశంలో 6 రకాల మతపరమయిన మైనారిటీ సముదాయాలు కలవు.


    రాష్ట్రాల స్థాయిలో చాలా తక్కువ సంఖ్యలో జనాభా ఏ భాషనైతే ఉపయోగిస్తుందో ఆ భాషను ఉపయోగించే సముహాలను భాషాపరమైన మైనారిటీలు అంటారు, వీరు రాష్ట్ర ప్రాతిపదికన గుర్తించబడతారు కాని మతపరమైన మైనారిటీలు మాత్రం దేశం ప్రాతిపదికన గుర్తించబడతారు.


    అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం మంత్రిత్వ శాఖ


    మైనార్టీల సంక్షేమం అనేది జనవరి 29, 2006నకు పూర్వం సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వశాఖ నందు భాగంగా ఉండేది, 2006వ సంవత్సరం నుండి ప్రత్యేక మంత్రిత్వశాఖగా ఏర్పడింది.


    వీరి సంక్షేమం మరియు అభివృద్ధి నిమిత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగపరంగా మైనార్టీల సంక్షేమం కోసం పొందుపరచిన ఏర్పాట్లను అమలుచేస్తూ, సామాజిక శాసనాలను రూపొందిస్తూ వారి హక్కులను సంరక్షిస్తున్నది మరియు జాతీయ స్థాయి సంస్థను స్థాపించి అలాగే సంక్షేమ పథకాలను రూపొందించి ఈ వర్గాల అభివృద్ధికి కృషిచేస్తున్నారు.


    మైనార్టీల సంక్షేమం-రాజ్యాంగపరమైన ఏర్పాట్లు


    అధికరణ 15      : మతపరమైన వివక్షత కూడా ఉండకూడదు

    అధికరణ 25    : మతవిశ్వాసాలను కలిగి ఉండే హక్కు మరియు మతమును ప్రచారం చేసుకునే హక్కు కలదు.

    అధికరణ 26      : మతసంస్థల నిర్వహణ యందు స్వేచ్చనివ్వడం జరిగింది.

    అధికరణ 27      : మతవ్యాప్తికై పన్నులను విధించరాదు.

    అధికరణ 28     : ప్రభుత్వ విద్యాలయాల్లో మరియు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నిర్వహిస్తున్న ఏ విద్యాలయంలో మతభోదన చేయరాదు.

    అధికరణ 29  : అల్పసంఖ్యాక వర్గాలకు వారి యొక్క ఖాష, లిపి మరియు సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు ఉంటుంది. ప్రభుత్వ విద్యాలయాల్లో మతప్రాతిపదికన వివక్షత చూపరాదు.

    అధికరణ 30        : అల్పసంఖ్యాక వర్గాలు విద్యాలయాలను స్థాపించి నిర్వహించుకోవచ్చు.

    అధికరణ 30(1) : అల్పసంఖ్యాక వర్ణాల వారు మతపరమైన సంస్థలను స్థాపించుకొని నిర్వహించుకోవచ్చు

    అధికరణ 30(2) : ఆర్థికసహాయం అందించడంలో ప్రభుత్వాలు అల్పసంఖ్యాక విద్యాసంస్థలపై వివక్షత చూపరాదు.

    అధికరణ 347     : రాష్ట్రాల స్థాయిలో అల్బసంఖ్యాకులు వినియోగిస్తున్న భాషలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వవలసిందిగా రాష్ట్రపతి రాష్ట్రాలను అదేశించవచ్చు.

    అధికరణ 350              : ప్రభుత్వానికి ఆర్జిలు మరియు ఫిర్యాదులు ఏ భాషలోనైనా ఇవ్వవచ్చు.
    అధికరణ 350(ఎ) : భాషాపరమైన మైనార్టీలకు ప్రాథమిక విద్యాస్థాయిలో మాతృభాషలో విద్యాబోధన అందించాలని రాష్ట్రాలను రాష్ట్రపతి అదేశించవచ్చు.
    అధికరణ 350(బి)    : భాషాపరమైన మైనార్టీల హక్కుల సంరక్షణ మరియు వాటి అమలుతీరు పరిరక్షించేందుకై రాష్ట్రపతి ప్రత్యేక అధికారిని నియమించవలెను.

    మైనార్టీలకు సంబంధించిన సామాజిక శాసనాలు

    • The Dargha Khwaja Saheb Act - 1955
    • National Commission for Minorities Act - 1992
    • National Commission for Minority Educational Institutes Act, 2004 (Amended 2006)
    • Waqf 1995 (Amended 2013)
    • భారతీయ హజ్‌ కమిటీ చట్టం - 2002
    మైనార్టీల సంక్షేమం మరియు సంస్థలు

    మైనార్టీల సంక్షేమం కోసం ఈ క్రింది సంస్థలు జాతీయస్థాయిలో కృషిచేస్తున్నవి. అవి...

    National Commission for Minority Educational Institutes

    • ఈ సంస్థని 2004వ సంవత్సరంలో National Commission for Minority Educational Institutes Act, 2004ని అనుసరించి ఏర్పాటు చేసారు, కావున ఇది చట్టబద్ధసంస్థ.
    • ఈ సంస్థకి సివిల్‌కోర్టుకు ఉందే అధికారాలుంటాయి మరియు క్వాసి జ్యుడిషియల్‌ సంస్థ.
    • రాజ్యాంగబద్ధంగా మైనార్టీలు కలిగిఉన్న విద్యాపరమైన సంస్థలను స్థాపించుకొని నిర్వహించుకునే హక్కును అమలుపర్బేందుకై మరియు పర్యవేక్షించేందుకై ఏర్పాటుచేసిన సంస్థ.

    సెంట్రల్‌ వక్ఫ్ కౌన్సిల్‌

    • వక్ఫ్ చట్టాన్ని మొదటగా 1954లో రూపొందించారు, మరలా 1995లో సవరించారు.
    • ఈ సంస్థను డిసెంబర్‌ నెల 1964వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.
    • ఇది మైనార్టీ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది, దీనికి అనుబంధంగా రాష్ష్రాలలో వక్స్‌బోర్ట్డులను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణ మరియు పరిరక్షణకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వాలకు సలహాలనిస్తుంది.
    • ఈ సంస్థకి కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎక్స్‌ అఫిషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తాడు.

    భాషాపరమైన మైనార్టీల జాతీయ కమీషనర్‌

    • ఈ కమీషనర్‌ని నేషనల్‌ కమీషన్‌ ఫర్‌ లింగ్విస్టిక్‌ మైనార్టీస్‌ (NCLM) అని కూడా అంటారు.
    • ఈ కమీషనర్‌ని రాజ్యాంగ అధికరణం 350(బి)ని అనుసరించి ఏర్పాటు చేసారు కావున ఇది రాజ్యాంగ బద్ధ సంస్థ.
    • అలహాబాద్‌ కేంద్రంగా కమీషనర్‌ కార్యాలయంను 1957లో ఏర్పాటుచేశారు మరియు ఈ కార్యాలయానికి అనుబంధంగా బెల్లామ్‌, చెన్నై మరియు కోల్‌కత్తాల యందు ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేశారు.
    • వీరు మైనార్టీ సంక్షేమ మంత్రిత్వశాఖ ద్వారా రాష్ట్రపతికి వార్షిక నివేదిక సమర్పిస్తారు, రాష్ట్రపతి ఆ నివేదికను పార్లమెంట్‌కు సమర్పిస్తారు.
    • భాషాపరమైన మైనార్టీల హక్కుల సంరక్షణ కోసం ఈ కమీషనర్‌ తన విధులను నిర్వర్తిస్తాడు.
    • రాష్ట్రాల పునర్విభజన చట్టం (1958-55) సూచనల మేరకు 7వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని 17వ విభాగంలో అధికరణం 350(బి)ని చేర్చి తద్వారా ఈ కమీషన్‌ని ఏర్పాటు చేశారు.
    • ప్రస్తుత కమీషనర్‌గా అక్తరుల్‌ వాసీ విధులను నిర్వరిస్తున్నారు.

    నేషనల్‌ కమీషన్‌ ఫర్‌ మైనార్టీస్‌ (NCM)

    • ఈ సంస్థని జనవరి 12, 1978న కార్యానిర్వాహక సంస్థగా ఏర్పాటు చేశారు, కాని 1992వ సంవత్సరంలో రూపొందించిన నేషనల్‌ కమీషన్‌ ఫర్‌ మైనార్టీస్‌ యాక్టు ద్వారా ఈ సంస్థ 1998లో చట్టబద్ధ సంస్థగా మారింది.
    • ఈ సంస్థకి మొదటి ఛైర్మన్‌గా సరూర్‌ అలీఖాన్‌ వ్యవహరించారు మరియు ప్రస్తుత ఛైర్మన్‌గా నసీమ్‌ అహ్మద్‌ తమ సేవలు అందిస్తున్నారు.
    • ఈ సంస్థ ఒక ఛైర్మన్‌, ఒక వైస్‌చైర్మన్‌ మరియు 5గురు సభ్యులతో రూపొందించబడుతుంది, వీరి పదవి కాలం 33 సం॥॥లు మరియు వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.
    • మైనార్టీల అభివృద్ధికి సంబంధించిన చర్యలను సమీక్షిస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మైనార్టీల అంశాలపై సలహాలు, సూచనలు అందిస్తుంది, మైనార్టీల హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి విచారిస్తుంది.
    • ప్రధానమంత్రి 15 సూత్రాల పథకం అమలుతీరును పర్యవేక్షిస్తుంది మరియు వార్షిక నివేదికలను కేంద్ర ప్రభుత్వంనకు సమర్పిస్తుంది.

    పై భాద్యతలు నిర్వహించే నిమిత్తం ఈ కమీషన్‌కి సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలు, ఫిర్యాదులకు సంబంధించి నిందితులను హాజరును కోరే అధికారం, మైనార్టీ హక్కులకు సంబంధించిన రికార్డులను డ్‌ సమాచారాన్ని పొందే అధికారంను కలిగి ఉంటుంది.

    మౌలాన ఆజాద్‌ నేషనల్‌ అకాడమీ ఫర్‌ స్కిల్స్‌

    ఈ సంస్థను 2014లో అల్బసంఖ్యాక వర్షాల వారికి జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారంతో ప్లేస్‌మెంట్‌ ఆధారిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నారు.

    మౌలాన ఆజాద్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ (MAEF)

    • దీనిని రాజకీయేతర స్వచ్చంద సంస్థగా కేంద్రం జూలై 06, 1989లో రిజిస్ట్రేషన్ల చట్టం 1860ని అనుసరించి స్థాపించింది.
    • ఈ సంస్థ విద్యాపరంగా వెనుకబడిన మైనార్టీలలో విద్యాపరమైన అభివృద్ధిని సాధించడం కోసం స్థాపించబడింది.
    • ఈ సంస్థ Grant in aid to NGO's for infrastructure development of educational institutions అనే పథకాన్ని అమలుచేస్తున్నది.
    • మైనార్టీ విద్యార్ధినులకు మౌలాన అజాద్‌ నేషనల్‌ మెరిట్‌ స్మాలర్‌షిప్‌లను అందిస్తున్నారు.

    National Minorities Development & Finance Corporation (NMDFC)

    చట్ట ప్రకారం గుర్తించిన 6 రకాల మతపరమైన మైనార్టీల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి మరియు ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు రుణాలను అందిస్తుంది. ఈ సంస్థని 230 సెప్టెంబర్‌ 1994న లాభాపేక్షలేని సంస్థగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

    నేషనల్‌ వక్ఫ్ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌

    ఈ సంస్థని 2014 జనవరిలో ఏర్పాటుచేశారు. ఈ సంస్థ వక్ఫ్‌ ఆస్తుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా వక్‌ ఆస్తులను కలిగిఉన్న దేశం - భారతదేశం.

    మైనార్టీల సంక్షేమం మరియు కమీషన్‌లు

    రంగనాధ్‌ మిశ్రా కమీషన్‌

    2004వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లింలకు 10% మరియు క్రిస్టియన్లకు 5% రిజర్వేషన్లు కల్పించాలని ఈ కమీషన్‌ సూచించింది మరియు ముస్లిం కోటాలో మిగిలితే ఇతర మైనార్టీలకు బదలాయించాలని తెలిపింది. అన్ని మతాలలోని దళితులకు షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ హోదా ఇవ్వాలని సూచించింది.

    రాజేందర్‌ సింగ్‌ సచార్‌ కమిటీ

    మార్చి 09, 2005న కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. ఈ కమిటీనే ద ప్రైమ్‌ మినిస్టర్స్‌ హైలెవల్‌ కమిటీ ఆన్‌ద సోషల్‌ ఎకనామికల్‌ & ఎడ్యుకేషనల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ముస్లిం కమ్యూనిటి ఆఫ్‌ ఇండియాగా పిలుస్తారు.

    ఈ కమిటీ తన నివేదికను 2006లో సమర్పించింది మరియు 2007న ఈ కమిటీ యొక్కసూచనలను కేంద్రం ఆమోదించింది. ఈ కమిటీ యొక్క సూచనల ఆధారంగానే 15 సూత్రాల పథకాన్ని ప్రారంభించారు.

    అమానుల్లా కమిటీ

    ఈ కమిటీని 2017వ సంవత్సరంలో అల్బ సంఖ్యాక వర్షాల యందు విద్యాపరమైన వెనుకబాటు తనంను అధ్యయనం చేసేందుకై నియమించారు. వీరు కేంద్ర పాఠశాలలు, సముదాయ కళాశాలలు మరియు జాతీయ స్థాయి విద్యాసంస్థలను మైనార్టీల కోసం ఏర్పాటుచేయాలని సూచించారు.

    నోట్‌: తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల సామాజిక, ఆర్థిక మరియు విద్యాపరమైన స్థితిగతులను సమీక్ష చేసేందుకై 2015వ సంవత్సరంలో చెల్లప్పా మరియు సుదీర్‌ కమిటీలను నియమించారు, ఈ కమిటీలు తమ నివేదికలను సమర్చించినవి.

    మైనార్టీ వర్గాల సంక్షేమ పథకాలు

    ప్రధానమంత్రి 15 సూత్రాల పథకం

    దీనినే ప్రైమ్‌ మినిస్టర్స్‌ న్యూ 15 పాయింట్‌ ప్రోగ్రామ్‌ అని కూడా అంటారు. దీనిని 2006వ సంవత్సరంలో తిరిగి పునఃప్రారంభించారు (ఇంతకు మునుపు 1983లో మొదటి 15 పాయింట్‌ ప్రోగ్రామ్‌ని అమలుచేసారు. ఈ పథకాన్ని 2009లో మరలా పునర్‌నిర్మించారు.

    ఈ పథకం నందు పొందుపర్చిన 15 అంశాలు

    1. ఐసిడిఎస్‌ సేవల యందు సరైన వాటా
    2. పాఠశాల విద్యా సౌకర్యాలు
    3. ఉర్దూభోదన కార్యక్రమాలు
    4. మదర్శా విద్యా అధునీకరణ
    5. స్కాలర్‌షిప్‌లు
    6. మౌలాన అజాద్‌ ఫౌందేషన్‌ ద్వారా విద్యాసంబంధమైన అవస్థాపనా సౌకర్యాలను వృద్ధిచెందించడం
    7. పేదలకు స్వయం ఉపాధిని కల్పించడం
    8. నైపుణ్యాల వృద్ధి
    9. రుణ సౌకర్యాలు
    10. రాష్ట్ర మరియు కేంద్ర సర్వీసులకు ఎంపికయ్యేలా సేవలందించడం
    11. గ్రామీణ గృహ నిర్మాణ పథకాలలో సరైన వాటా కల్పించడం
    12. మైనార్టీలు అధికంగా ఉన్న మురికివాడలను అభివృద్ధి చేయడం
    13. మత అల్లర్లను అరికట్టడం
    14 మతపరమైన దాడులపై త్వరితగతిన విచారణ చేపట్టడం
    15. మత అల్లర్ల బాధితులకు పునరావాసం అందించడం.

    ప్రీ మెట్రిక్స్‌ స్కాలర్‌షిప్‌ పథకం

    కేంద్ర ప్రభుత్వం 2008లో ప్రారంభించింది. కేంద్రం 75% నిధులను సమకూరుస్తుంది మిగతా నిధులు ఆయా రాష్ట్రాలు ఖరిస్తున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాలలో 100% నిధులు కేంద్రమే భరిస్తుంది.

    పోస్ట్‌ మెట్రిక్స్‌ స్కాలర్‌షిప్‌ పథకం

    2007లో ప్రారంభించారు. 100% నిధులు కేంద్రమే సమకూరుస్తున్నది.

    ప్రధానమంత్రి జనవికాస్‌ కార్యక్రమం

    మల్టీసెక్టోరల్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ స్థానంలో 2018వ సంవత్సరంలో ప్రారంభించారు. మైనార్టీలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలలో సామాజిక, ఆర్థిక, అవస్థాపన సౌకర్యాల పెంపు మరియు కనీస అవసరాలను తీర్చడం లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు.

    ఈ పథకం అమలుకై కేంద్రం 60% నిధులను, రాష్ట్రాలు 40% నిధులను భరిస్తాయి. ఈశాన్య ప్రాంతాల రాష్ట్రాల విషయంలో 90% నిధులు కేంద్రమే భరిస్తుంది.

    వృత్తి విద్యా కోర్సులకు స్కాలర్‌షిప్‌లు

    2007లో ప్రారంభించారు. దీనినే మెరిట్‌ కమ్‌ మీన్స్‌ బేస్‌డ్‌ స్మాలర్‌షిప్‌ అని పిలుస్తారు. ఈ స్మాలర్‌షిప్‌ని సాంకేతిక మరియు వృత్తి విద్యలను అభ్యసిస్తున్న విద్యార్థులకు అందిస్తారు.

    మౌలనా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ (MANF)

    ఈ పథకంను 2009లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా M Phil and PhD ల కోసం పరిశోధన చేస్తున్న పరిశోధక విద్యార్థులకు 5 సంవత్సరాల పాటు నెలసరి ఉపకారవేతనాలు అందిస్తున్నారు.

    ఈ పథకాన్ని యూనివర్సిటి గ్రాంట్స్‌ కమీషన్‌ వారు అమలుపరుస్తున్నారు. 2.5 లక్షల వార్షిక ఆదాయం కంటే తక్కువ ఆదాయం గల కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

    నయి ఉడాన్‌

    2013-14 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సివిల్స్‌ ప్రిలిమ్స్‌ మరియు ఇతర పోటీపరీక్షలలో ఉత్తీర్ణత సాధించేందుకు గాను మైనార్టీ అభ్యర్థులకు సదుపాయాలు అందిస్తున్నారు. ఈ పథకాన్నే స్మ్‌మ్‌ ఆఫ్‌ సపోర్ట్‌ ఫర్‌ స్టూడెంట్స్‌ క్లియరింగ్‌ ప్రిలిమ్స్‌ అని కూడా పిలుస్తారు.

    పడోప్రదేశ్‌

    2013-14 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించారు. ఈ పథకం యొక్క ముఖ్యఉద్ధేశ్యం విదేశాలలో మైనార్టీ విద్యార్థులు విద్యనభ్యసించేందుకు కావలసిన రుణాలను సబ్సిడీతో కూడిన వడ్డీతో అందించడం.

    మైనార్టీ కాన్‌సన్‌ట్రేషన్‌ డిస్ట్రెక్స్‌ పథకం

    1987వ సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. మైనార్టీలు అధికంగా ఉన్న జిల్లాలలో ప్రభుత్వ పథకాలు సక్రమంగా లబ్ధిదారులకు చేరేలా చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యఉద్ధేశ్యం.

    మల్టీసెక్టోరల్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌

    2001 జనాభా లెక్కల ప్రకారం మైనార్టీ జనాభా అధికంగా ఉన్న 90 జిల్లాలను దేశవ్యాప్తంగా గుర్తించి అ జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని 2008న ప్రారంభించారు.

    ఈ పథకాన్నే స్కీమ్‌ ఆఫ్‌ మల్టీ సెక్టోరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ అని కూడా అంటారు. మైనార్టీలు అధికంగా నివసిస్తున్న ప్రాంతాలలో వారి యొక్క జీవన ప్రమాణాలు పెంపొందించడమే ఈ పథకం యొక్క ముఖ్యఉద్ధేశ్యం.

    నయి రోషిణి

    2012వ సంవత్సరంలో కేంద్రం ప్రారంభించింది. మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలలో నాయకత్వ సామర్థాలు పెంపొందించే ఉద్ధేశ్యంతో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకాన్ని స్కీమ్‌ ఫర్‌ లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ మైనార్టీ ఉమెన్‌ అనికూడా పిలుస్తారు. NGO లను మరియు పౌర సమాజాన్ని భాగస్వాములను చేస్తూ ఈ పథకం అమలుపరుస్తున్నారు.

    ఉస్తాద్‌

    మే 14, 2015న ఈ పథకంను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. తీకంతం 15 కలం ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన హస్తకళ నైపుణ్యంను వెలికితీసే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.

    మైనార్టీ సైబర్‌ గ్రామ్‌

    ఈ పథకాన్ని డిజిటల్‌ ఎంపవర్‌మెంట్‌ ఫౌందేషన్‌ వారి సహకారంతో పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ పద్ధతిలో మైనార్టీ వర్గాలలో డిజిటల్‌ లిటరసిని పెంపొందించేదుకై అమలుపరుస్తున్నారు. ఈ పథకాన్ని 2014 ఫిబ్రవరి నెలలో రాజస్థాన్‌ రాష్ట్రంలో పైలట్‌గా ప్రారంభించారు.

    జియో పార్మీ

    ఈ పథకాన్ని 2018లో ప్రారంభించారు. పార్భీలలో జనాభా విపరీతంగా తరిగిపోతుంది కావున అ ధోరణిని అరికట్టేందుకు ఉద్దేశించినది ఈ పథకం

    సికో జెర్‌ కామో

    ఈ పథకాన్ని 2013లో ప్రారంభించారు. ఈ పథకం యొక్క ముఖ్యలక్ష్యం మైనార్టీ వర్గాలలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం.

    హమారీ దరోహర్‌

    భారతీయ వారసత్వ సంపద సంరక్షణలో ఖాగంగా, మైనార్టీ వర్గాల సంస్కృతికి సంబంధించిన చారిత్రక వారసత్వ సంపదను సంరక్షించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు.

    మిషన్‌ ఎంపవర్‌మెంట్‌

    డిసెంబర్‌ 31, 2014న ప్రారంభించారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం “మైనార్టీ వర్గాల సంక్షేమ పథకాల అమలు తీరును నిరంతరం పర్యవేక్షించడం”

    మౌలాన ఆజాద్‌ సెహత్‌ కార్డులు

    ఈ కార్డులు ర్‌ నుండి 14 సంవత్సరాల లోపు బాలలకు అందించి వారికి సంవత్సరానికి రెండు సార్లు ఉచిత వైద్య పరీక్షలు చేయించుకునేందుకై అవకాశం కల్పిస్తున్నారు.

    ఇతర సంక్షేమ కార్యక్రమాలు

    • 17 జూలై, 2007న మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ సౌకర్యాలు కల్పించే పథకాన్ని నయా సవేరా పేరుతో ప్రారంభించారు.
    • ఆగస్టు 08, 2015న నయిమంజిల్‌ అనే పథకాన్ని ప్రారంభించి ఫార్మల్‌ ఎడ్యుకేషన్‌ లేనివారికి నైపుణ్యాలు పెంపొందించి వారికి జీవనోపాధులు లభించేలా చేస్తున్నారు.
    • స్కీమ్‌ ఫర్‌ కంప్యూటరైవేషన్‌ ఆఫ్‌ది రికార్డ్స్‌ ఆఫ్‌ద స్టేట్‌ వక్ఫ్‌ బోర్డు అనే పథకాన్ని 2009న ప్రారంభించారు.
    • 18 డిసెంబర్‌ 1992న ఐక్యరాజ్యసమితి మైనార్టీ హక్కులపై యునైటెడ్‌ నేషన్‌ డిక్షరేషన్‌ని రూపొందించింది.
    • తెలంగాణ ప్రభుత్వం నవంబర్‌ 11, 2014న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని మైనార్టీ సంక్షేమదినంగా ప్రకటించింది.

    పునశ్చరణ



Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


No comments:

Post a Comment

Post Bottom Ad