3.4 దివ్యాంగుల సంక్షేమం: విధానాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Thursday, July 20, 2023

3.4 దివ్యాంగుల సంక్షేమం: విధానాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు

3.4 దివ్యాంగుల సంక్షేమం: విధానాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు


    వికలాంగత్వం అనునది శారీరకంగా గాని లేదా మానసికంగా గాని ఉండవచ్చు. వినలేకపోవడం, చూపులేకపోవడం, మాటలు రాకపోవడం, నడవ లేకపోవడం కాళ్ళు మరియు చేతులకు సంబంధించినవి శారీరక వైకల్యాలు అయితే బుద్ధి మాంధ్యం (మెంటల్‌ రిటార్‌దేషన్‌) అనునది పిల్లలలో ప్రజ్ఞాలబ్ధి తక్కువగా ఉండడం వల్ల ఏర్పడే మానసిక వైకల్యం. సమాజం ఆమోదించిన ప్రవర్తనా రీతులను కాకుండా ఆలోచన, ప్రత్యక్షం, సంజ్ఞానాత్మకత మరియు ఉద్వేగసరమైన అసమతుల లక్షణాలు ఉంటే ఆ స్థితిని మానసిక అనారోగ్యం అందురు. దివ్యాంగులు సాధారణ మనుషుల వలె సమాజంలో ఉన్న అవకాశాలను, వనరులను వినియోగించుకోలేరు మరియు వివక్షతలకు గురవుతూ ఉన్నారు కావున కుటుంబ స్థాయి నుండి సామాజిక స్థాయి వరకు సామాజిక వెలికి గురవుతున్నారు. ఈ ఛాప్టర్‌ నందు దివ్యాంగులకు సంబంధించిన భావనలు, జనాభా వివరాలు, వికలాంగుల కోసం పనిచేస్తున్న సంస్థలు మరియు అశక్తత తీవ్రతను గురించి వివరించడం జరిగింది.


    నిర్వచనాలు మరియు ప్రాథమిక భావనలు


    • వికలాంగులు అనే పదం స్థానంలో ప్రత్యేక సామర్భాలు గల వారు లేదా దివ్యాంగులు అని పిలుస్తున్నారు, వికలాంగులను మొదటిసారి దివ్యాంగులని పిలిచినవారు ప్రధాని నరేంద్రమోదీ.
    • దివ్యాంగుల యొక్క సమక్షేమం కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వశాఖ పరిధిలోనికి వస్తుంది.
    • మానవుడు సాధారణ స్థితిలో చూపెట్టగలిగే లేదా ప్రదర్శించగలిగే సామర్థ్యాలను చూపెట్టలేకపోవడంనే వికలాంగత్వం లేదా అశక్తత అని కూడా అందురు.
    • ఒకటి కంటే ఎక్కువ వైకళ్యాలు ఉన్నట్లయితే బహుళ వైకల్యం అంటారు. ఉదా: మాటలు రాకపోవడం మరియు వినబఐడక పోవడం.
    • ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి ప్రకారం ఒక వ్యక్తి ప్రదర్శించే వివిధ రకాల సామర్థ్యాలను ప్రదర్శించక పోవడంనే అశక్తత అందురు.
    • పైన తెలిపిన వికలాంగత్వాలతో పాటుగా అభ్యసనకు సంబంధించినటువంటి వైకల్యాలు కూడా ఉంటాయి.
    • సవరించిన వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం సామాజిక కార్యక్రమాలలో పాల్గొనలేని స్థాయిలో భౌతిక, మానసిక, ప్రజ్ఞాపరమైన లేదా జ్ఞానేంద్రియాల పరమైన లోపాన్ని కలిగి ఉండటంనే పర్సన్స్‌ విత్‌ డిసెబులిటీ అని పిలిచారు.


    అశక్తతల రూపాలు

    వికలాంగుల హక్కుల చట్టం 1995 ప్రకారం 7 రకాల అశక్తులను గుర్తించారు.

    1. అంధత్వం 

    2. దృష్టి మాంధ్యము

    3. తె కుష్టు వ్యాధి బాధితులు 

    4. శ్రవణలోపం (వినికిడి శక్తి లేకపోవడం)

    5. చలన వైకల్యం 

    6. బుద్ధి మాంధ్యత

    7. మానసిక అనారోగ్యం

    పైన తెలిపిన 7 రకాల వైకల్యాల వలన 10% కంటే ఎక్కువ అశక్తులను కలిగి ఉన్నట్లయితే వారిని వికలాంగులుగా పరిగణిస్తారు.


    సవరించిన వికలాంగుల హక్కుల సంరక్షణ చట్టం 2016 (19.042017 నుండి అమలులోనికి వచ్చింది) ప్రకారం వికలాంగులను 21 రకాలుగా గుర్తించారు.

    1. అంధత్వం 
    2. దృష్టి మాంధ్యము
    3. లెప్రసీ బాధితులు 
    4. వినికిడి లోపం గలవారు
    5. చలన వైకల్యం 
    6. మరుగుజ్జు
    7. బుద్ధి మాంధ్యం 
    8. మానసిక అరోగ్యం
    9. అటిజం 
    10. సెరిబ్రల్‌ ప్లాసీ
    11. మస్మ్కులార్‌ డిస్త్రోఫి 
    12. దీర్హకాల నరాల సంబంధిత
    13. ప్రత్యేక అభ్యసన వైకల్యాలు మేడ 
    14. మల్టీపుల్‌ స్మీరోసిస్‌
    15. తలసేమియా 
    16. వాక్కు మరియు బాషపరమైన వైకల్యాలు
    17. హిమోఫీలియా 
    18. సికెల్‌సెల్‌ అనిమియా
    19. బహుళ వైకల్యం 
    20. ఆమ్లదాడి బాధితులు
    21. పార్మిన్‌సన్‌ వ్యాధిగ్రస్తులు

    గమనిక: 

    1. ప్రజ్ఞాలబ్ధి 70 కంటే తక్కువ ఉన్నవారిని మందబుద్ధులు లేదా బుద్ధిమాంద్యత కలిగి ఉన్నవారిగా పరిగణిస్తారు, గుర్తింపు పొందిన ప్రభుత్వ సైకియాట్రిస్ట్‌ రూపొందించిన నివేదికల ప్రకారం ఒక వ్యక్తిని మానసిక అనారోగ్యం కలిగి ఉన్నవాడిగా పరిగణిస్తారు.

    2. అంధత్వం అనగా పూర్తిగా చూపులేకపోవడం మరియు దృష్టిమాంద్యము అనగా విజువల్‌ అక్సుటి 6/60 లేదా స్నెలన్‌చాట్‌ నందు 20/200 కంటే తక్కువగా ఉండటం మరియు దృష్టిక్మేతం 20 డిగ్రీలను మించి లేకపోవడం.

    అభ్యసన వైకల్యం మరియు ఆటిజం

    అభ్యసన వైకల్యం: అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటిసారి 'Samuel A. Krick' అనునతడు ప్రవేశ పెట్టాడు. 'Done' అనునతడు ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలని 12 రకాలుగా వర్గీకరించాడు. అభ్యసన వైకల్యాలకు బుద్ధి మాంధ్యత లోపం, పోషకాల లోపం, సామాజిక ఆర్థిక వెనుకబాటు లాంటివి ఏదైనా కారణం కావచ్చు. అభ్యసన వైకల్యత అనునది భాషకు సంబందించింది గాని, Reading కి సంబందించింది గాని, Writing కి సంబందించింది గాని, గణితానికి సంబందించింది కావచ్చు.

    Speech and Language Problems: ఇతరులు వ్యక్తం చేసిన పదాలని అర్ధం చేసుకొని తిరిగి వాటిని వ్యక్తపరచడంలో సమస్యలు ఉంటే 'Disphasia' అంటారు మరియు భాషలోని పదాలు మరియు ఇంగితాలను గ్రహించడంలో, వాడడంలో సమస్యలు ఉంటే దానిని 'Aaphasia' అంటారు.

    Reading Disabilities (పఠన వైకల్యాలు): చదవడంలో వైకల్యం ఉన్నట్లయితే Dislexia అంటారు మరియు ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవకపోవడాన్ని Alexia అంటారు.

    రాతపరమైన సమస్యలు (Writing related disability): అస్తవ్యస్తమైన చేతి రాతను కలిగి ఉండి చూసి రాసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండకపోతే అ స్థితిని 'Disgraphia' అంటారు మరియు 100% లేదా పూర్తి స్థాయిలో రాయలేకపోవడాన్ని Aagraphia అంటారు.

    కనీస గణిత సామర్థ్యాలు లోపించినట్లయితే దానిని Discalculia అంటారు. సమాజంలో ఇతర వ్యక్తులతో కలిసిపోలేకపోవడాన్ని Dispraxia అంటారు.

    ఆటిజం (Autism): ఇది మగ పిల్లలలో ఎక్కువగా కన్పించే అవకాశం కలదు, దీనిని 'Leo Canner' నునతడు మొదటి సారి తెల్పాడు. ఆటిజం ఉన్న పిల్లల్లో ఈ క్రింది లక్షణాల సమూహం కనపడుతుంది.

    1. అంతర్‌వ్యక్తిగత సంబంధాలు, సామాజిక సంబంధాలు కనపడవు. ఉదా: ఇతరుల కళ్ళలోకి కల్లుపెట్టి చూడలేరు, తల్లి దండ్రులతో అనుబంధం ఉండదు, ఒంటరి అటలు ఆడుకుంటారు, మిత్రులు ఉండరు, అనుకరణ మరియు భాషా నైపుణ్యాలు ఉండవు.

    2. ఎదురుగా ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నప్పటికి కూడా స్పందించరు.

    3. విద్యా వికాసం, బౌద్ధిక వికాసం, సామాజిక వికాసం లాంటివి కనపడవు.

    4. ప్రత్యేకమైన ప్రవర్తన రీతులు అనగా తలను ఒకే వైపుకు మాత్రమే తిప్పడం లాంటివి కనపడతాయి.

    5. ఆటిజం ఉన్న పిల్లల్లో బౌద్ధిక వైకల్యం మరియు మూర్చ సర్వసాధారణంగా కన్పిస్తాయి.

    అశక్తతలకు ప్రధాన కారణాలు

    1. జన్యుపరమైన లోపాలు 
    2. ప్రమాదాలు మరియు విపత్తులు
    3. పోషకార లోపాలు (అయోడిన్‌ లోపం వల్ల - బుద్ధిమాంద్యం వచ్చే అవకాశం కలదు) 
    4 టీకాల కార్యక్రమం పూర్తిగా విజయవంతం కాకపోవడం
    5. పుట్టుకతోనే లోపాలుండడం
    6. మేనరిక వివాహాలు

    జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే ముఖ్యమైన అశక్తతలు

    5వ క్రోమోజోమ్‌ నందు లోపం వలన కై-డూ-చాట్‌ సిండ్రోమ్‌ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన బాలల యందు తల చిన్నదిగా ఉంటుంది మరియు ఎల్లప్పుడు పిల్ల శబ్ధంతో కూడిన ఏడుపును ఏడూస్తూ ఉంటారు.

    21వ క్రోమోజోమ్‌ నందు లోపం వలన మంగోలిజమ్‌ లేదా డౌన్‌సిండ్రమ్‌ అనే వ్యాధి కలుగుతుంది, ఈ వ్యాధికి గురైన వారిలో 47 క్రోమోజోమ్‌లుంటాయి, ఈ వ్యాధి వలన బుద్ధి మాంధ్యంనకు గురవుతారు. ఈ వ్యాధి సోకిన బాలలు మంగోలులను పోలిన తల నిర్మాణం మరియు అకారాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఈ వ్యాధిని మంగోలిజమ్‌ అనికూడా పిలుస్తారు.

    18వ క్రోమోజోమ్‌ నందలి లోపం వలన ఎడ్వర్డ్‌ సిండ్రోమ్‌ అనే వ్యాధి వస్తుంది, దీని వలన తీవ్ర బుద్ధిమాంధ్యం ఏర్పడుతుంది. లైంగిక క్రోమోజోమ్‌లలో అసాధారణత వల్ల పురుషుల యందు క్లెన్‌ఫిల్డర్‌ సిండ్రోమ్‌ అనే వ్యాధి వస్తుంది. దీని వల్ల మానసిక అనారోగ్యం మరియు బుద్ధి మాంధ్యత కలుగుతుంది.

    లైంగిక క్రోమోజోముల యందు అసాధారణతల వల్ల స్త్రీల యందు టర్నర్‌ సిండ్రోమ్‌ అనే వ్యాధి వస్తుంది. మాతృత్వ హైపోథైరాయిడిజమ్‌ వల్ల పిల్లల యందు క్రెటెనిజమ్‌ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారిలో బుద్ధి మాంధ్యం కనబడుతుంది.

    బి-విటమిన్‌ లోపం మరియు అయోడిన్‌ లోపం వలన మానసిక బుద్ధి మాంధ్యతలు వచ్చే అవకాశం కలదు. ఫీనైల్‌ కీటోన్యూరియా అనబడే అమైనో ఆమం యొక్క అసాధారణత వల్ల కూడా బుద్ధి మాంధ్యం వస్తుంది. పుట్టుకతోనే లోపాలు అనగా తల చాలా పెద్దదిగా (మాక్రో సెఫాలి), తల చిన్నదిగా (మైక్రో సెఫాలి) మరియు తల యందు ద్రవాలు పేరుకుపోవడం (హైడ్రోసెఫాలి) లాంటి వాని వల్ల కూడా వికలాంగత్వం సంభవిస్తుంది.

    ఇతర కారణాలు: భారతదేశంలో లోకోమోటార్‌ అనగా కాళ్ళుచేతులకు సంబంధించిన వికలాంగత్వం అధికంగా ఉంది. దీనికి ప్రధాన కారణం ప్రమాదాలు మరియు విపత్తులు. పోలియో టీకాలు వేయించని పిల్లల్లో భవిష్యత్తులో కాళ్ళు, చేతులకు సంబంధించిన వికలాంగత్వం సంభవించే ప్రమాదం ఉంటుంది. పోషకాహార లోపం వల్ల ముఖ్యంగా అయోడిన్‌ లోపం, విటమిన్‌ బి లోపం, ప్రోటీన్‌ల లోపం, విటమిన్‌ డి లోపం మరియు కాల్షియం & పాస్పరస్‌ లాంటి ఖనిజ లవణాల లోపం వలన కూడా బాలల యందు వికలాంగత్వం సంభవించే అవకాశం కలదు. వృద్ధులలో వికలాంగత్వానికి ప్రధానకారణం వయస్సు మీరడం మరియు అవయవాలు క్షీణించడం. గర్భావది కాలం తీరక ముందే శిశువులు జన్మించడం (ప్రీమెచ్యుర్‌ డెలివరీస్‌), ఆసుపత్రుల్లో కాకుండా గృహం వద్ద డెలివరీ అవడం మరియు మేనరిక వివాహాల వల్ల కూడా బాలల యందు వివిధ రకాల వికలాంగత్వం ముఖ్యంగా జన్యుపరమైన వికలాంగత్వాలు సంభవించే అవకాశం కలదు. ఫ్లోరిన్‌ అధిక గాఢత గల ప్రాంతాలలో నివసించడం వల్ల కూడా వికలాంగత్వానికి గురయ్యే అవకాశం కలదు.

    భారతదేశంలో అశక్తత తీవ్రత

    2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం జనాభా నందు 2.18% శాతం వికలాంగులు ఉండేవారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో 2. 21% ప్రజలు వివిధ రకాల అశర్తులతో ఇబ్బందులెదుర్ముంటున్నారు (జన సంఖ్యాపరంగా 26810557)

    షెడ్యూల్‌ కులాల యందు అశక్తత 2.2% కలదు. షెడ్యూల్‌ తెగల యందు అశక్తత 1.929 కలదు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్‌ నందు వికలాంగుల సంఖ్య అధికంగా కలదు మరియు అత్యల్పంగా మిజోరాం రాష్ట్రం నందు కలదు.

    2011 జనాభా లెక్కల ప్రకారం అన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో కెల్లా ఢిల్లీ నందు వికలాంగుల జనాభా అధికంగా కలదు మరియు తక్కువగా లక్షద్వీప్‌ నందు కలదు. 2011 జనాభా లెక్కల ప్రకారం 36% మంది వికలాంగులు మాత్రమే ఉపాధి పొందగలుగుతున్నారు.

    ఆంధ్రప్రదేశ్‌లో అశక్తతల తీవ్రత

    2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 12. 19 లక్షల మంది వికలాంగులు కలరు, మొత్తం ఆంధ్రప్రదేశ్‌ జనాభాలో వీరు 2.&7% ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా చలన వైఖల్యంనకు సంబంధించిన వికలాంగులు అధికంగా ఉన్నారు.

    భారతదేశంలో వికలాంగత్వంనకు ప్రధాన కారణం ప్రమాదాలు మరియు అన్ని రకాల అశక్తతలలో కెల్లా అధికంగా చలన వైకల్యంనకు సంబంధించిన వైకల్యం కలదు. 2010వ సంవత్సరం నుండి భారతదేశంలో అశర్తులకు సంబంధించిన వార్షిక నివేదికలను రూపొందించే బాధ్యతను నల్సార్‌ లా యూనివర్సిటి వారు తీసుకున్నారు.

    డిసెబిలిటి - ప్రపంచ స్థాయి చర్యలు

    13, డిసెంబర్‌ 2006న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ “United Nations Convention on the Rights of person with disabilities"ని రూపొందించింది. దీనిపై భారతదేశం అక్టోబర్‌ 01, 2007న సంతకం చేసింది. ఈ Convention (సంప్రదాయం) మే 08, 2008 నుండి అమలులోనికి వచ్చింది.

    డిసెంబర్‌ 03 ని అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా జరుపుకుంటారు. (International Day for Disabled Person (IDDP)) 1983-1992 ని UN Decade of Disabled Person జరుపుకుంటారు. 1981వ సంవత్సరంను United Nations Year of Disabled గా జరుపుకుంటారు.

    9 డిసెంబర్‌ 1975న  United Nations Declaration of the Rights of Disabled (UNDRD) అమలులోనికి వచ్చింది. 1993-2002ని Asia Pacific Decade of the Disabled గా జరుపుకున్నారు. సెప్టెంబర్‌ 28ని ప్రపంచ మూగవారి దినోత్సవంగా జరుపుకుంటారు.

    ఏప్రిల్‌ 02 ని ప్రపంచ ఆటిజం దినోత్సవంగా జరుపుకుంటారు. జనవరి 4ని బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటారు. World Programme for Action for Disables ని 1985లో ప్రారంభించారు.

    వికలాంగుల కోసం పనిచేస్తున్న సంస్థలు (Organizations and Institutions Related to Disables)

    శరీరంలో ఏదైనా అవయవలోపం ఉండడం కాని లేదా వివిధ కారణాల వల్ల ఏదైనా అవయవం పనిచేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిని ఇంపేర్‌మెంట్‌ అంటారు, ఏ అవయవం అయితే ఇంపేర్‌మెంట్‌ నకు గురైనదో వ్యక్తులు ఆయా అవయవాలకు సంబంధించిన సామర్థ్యాలను కోల్పోతారు, ఆ స్థితినే డిసెబిలిటి అంటారు.

    సామర్ధ్యాలను కోల్పోయినారు కాబట్టి సమాజంలో సాధారణ వ్యక్తి వలేతమ జీవనాన్ని కొనసాగించలేరు కావున సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడుతారు వ్యక్తికి గల ఇలాంటి స్థితినే వికలాంగత్వం అంటారు. వ్యక్తులు ఇంపేర్‌మెంట్‌నకు లోనయినప్పుడు వారికి సరైన పునరావాసం అనునది వైద్యం ద్వారా, కృత్రిమ పరికరాల ద్వారా మరియు ఇతర విధానాలలో అందించినప్పుడు వారు ఇంపేర్‌మెంట్‌ దశ నుండి వికలాంగత్వ దశకు చేరకుండా తమ పనులు తాము కొంత వరకు చేసుకోగలుగుతారు.

    ఇలా వ్యక్తి కోల్పోయిన సామర్థ్యాలను కొంతమేరకు తిరిగి పునరుద్ధరింపజేయడాన్నే పునరావాసం అంటారు. వివిధ రకాల అశక్తతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పునరావాసం కోసం ప్రత్యేక పరికరాలు, ప్రత్యేక పరిస్థితులు మరియు ప్రత్యేక సిబ్బంది సేవలు అవసరమవుతాయి. అయా సేవలు మరియు పరికరాలు అందించేందుకుగాను ఈ క్రింది సంస్థలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి.

    1. Chief Commissioner for persons with Disability (CCPD) - వికలాంగుల హక్కుల చట్టం 1995 ప్రకారం ఏర్పాటు చేశారు.
    2. National Institute for Orthopedically Handicapped (NIOH) - Kolkata 1978
    3. Pandit Deen Dayal Upadyaya Institute for Physically Handicapped (PDUIPH) - New Delhi 1960.
    4. Swami Vivekananda National Institute of Rehabiliation Training & Research - Kotak - 1984 (SVNIRTR)
    5. Ali Yavar Jung National Institute for the Hearing Handicapped & Impairment - Mumbai, (AYJNIHHI) 1983
    6. National Institute of Empowerment of Intellectual Disables (NIEID)- Secunderabad 1984
    7. National Institute for Empowerment of Persons with Multiple Disabilites (NIEPMD) - Chennai 2005
    8. National Institute for the Visually Handicapped (NIVH) - Dehradoon 1979.
    9. Rehabilitation council of India (RCI) - 1986
    10. Artificial Limbs Manufacturing Corporation of India (ALMICO) - Kanpoor, 1972
    11. All India Institute of Speech & Hearing - Mysore
    12. The Indian sign Language Research - Training Center - NewDelhi, 2015
    13. National Institute of Mental Health & Neuro logical Sciences - Bangalore (NIMHANS)

    దివ్యాంగుల సాధికారత శాఖ

    దివ్యాంగుల సంక్షేమం అనునది రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌ నందు గల రాష్ట్రాల జాబితాలో ఉన్నప్పటికిని కేంద్రం దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖలో 12-05-2012వ సంవత్సరంలో మక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నవి. ఈ శాఖ 9 జాతీయ సంస్థల్ని 20 ప్రాంతీయ సంస్థల ద్వారా వికలాంగులకు పునరావాస సేవలు అందిస్తున్నది మరియు ఎన్‌.జి.ఓ ల సహకారంతో సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నది. భారతదేశం బీజింగ్‌లో జరిగిన ఆసియా-పసిఫిక్‌ ప్రాంతానికి సంబంధించిన వికలాంగుల యొక్క పూర్తిస్థాయి భాగస్వామ్యం మరియు వికలాంగులకు సమానత్వం అనే ఒప్పందంపై డిసెంబర్‌ 1992న సంతకం చేసంది మరియు మే 2008 నుండి అమలులోనికి వచ్చిన ఐఖ్యరాజ్యసమితి వికలాంగుల హక్కుల సాంప్రదాయం (యునైటెడ్‌ నేషన్స్‌ కన్వెన్షన్‌ ఆన్‌ ది రైట్స్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిసెబులిటిస్‌)పై సంతకం చేసింది కావున అయా ఒప్పందాల సూచనల మేరకు వికలాంగ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది.

    పై సాంప్రదాయంను డిసెంబర్‌ 18, 2006న ఐఖ్యరాజ్యసమితి ఏర్పాటుచేసింది మరియు 2007లో భారతదేశం సంతకం చేసింది.

    వికలాంగుల సంక్షేమం మరియు రాజ్యాంగం

    రాజ్యాంగ పీఠికలో పేర్మొన్నటువంటి సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం, స్వేచ్చ, సమానత్వం అనునవి వికలాంగులకు అందించాలంటే సాధారణ వ్యక్తులకోసం అందుబాటులో ఉంచినటువంటి అవస్థాపనా సౌకర్యాలతో పాటు వీరికోసం వారి వికలాంగత్వానికి అటంకం లేనటువంటి పర్యావరణాన్ని కల్పించాలి. ఉదాహరణ: మెట్లు ఎక్కలేరు కాబట్టి, ర్యాంపులను నిర్మించాలి.

    • ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి వివక్షతల నుండి రక్షణ (ఆర్జికల్‌ 15 'స్వేచ్చలు (ఆర్జికల్‌ 19), మరియు గౌరవంగా జీవించే హక్కు (ఆర్టికల్‌ 21) లను వికలాంగుల విషయంలో ప్రభుత్వాలు పగడ్బందీగా అమలుచేస్తున్నాయి.
    • ఆదేశిక సూత్రాలలోని అధికరణం 41 అనునది వికలాంగులైన సరే పనిచేసే హక్కు ఉంటుందని, చదువుకునే హక్కు ఉంటుందని మరియు సామాజిక సహాయాన్ని పొందే హక్కు ఉంటుందని తెలియజేస్తుంది. దీని ఆధారంగానే వికలాంగులకు ఆసరా పథకం అందించడం జరుగుతుంది.
    • రాజ్యాంగంలోని అధికరణం 248 (జి), 11వ షెడ్యూల్‌ 26వ ఎంట్రీ ప్రకారం గ్రామీణ స్థానిక సంస్థలు మరియు ఆర్టికల్‌ 248 (డబ్ల్యు), 12వ షెడ్యూల్‌ 9వ ఎంట్రీ ప్రకారం, పట్టణ స్థానిక సంస్థలు వికలాంగుల సంక్షేమం కోసం కార్యక్రమాలు అమలుచేయాలి.

    జాతీయ దివ్యాంగుల విధానం (National Policy For Persons with Disabilities, 2006 - NPPD)

    • ఈ విధానాన్ని 2006వ సంవత్సరంలో కేంద్రం రూపొందించింది.
    • ఈ విధానం ప్రకారం దివ్యాంగులు కూడా విలువైన మానవ వనరులుగా గుర్తించడం జరిగింది మరియు వీరికి సమాజంలో సమాన అవకాశాలు కలిగేలా ఆటంకాలు లేని పర్యావరణాన్ని కల్పించి మరియు వీరి హక్కులను పరిరక్షించి సామాజిక ప్రక్రియలో వీరు పూర్తిస్థాయిలో పాల్గొనేలా తయారుచేసేలా చర్యలు ఉండాలని ఈ విధానం పేర్కొంది.
    • దివ్యాంగులకు సరియైన అవకాశాలు కల్పించడం మరియు పునరావాస సేవలను అందించడం ద్వారా వారి యొక్క జీవన నాణ్యతను పెంపొందించవచ్చని ఈ విధానం ప్రకటించింది.

    ఈ విధానం నందలి గల ముఖ్యాంశాలు

    1. శారీరక, మానసిక మరియు బెద్యోగిక పునరావాసాన్ని అందించే చర్యలు వేగవంతం చేయడం
    2. వికలాంగత్వానికి గురయ్యే అవకాశాలను ముందుగానే గుర్తించడం మరియు వికలాంగత్వం తీవ్రతరం కాకమునుపే పునరావాస సేవలను అందించే చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
    3. విద్యాపరమైన పునరావాసం మరియు వృత్తిపరమైన శిక్షణ కూడా అందించాలని నిర్ణయించింది.
    4. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లను కల్పిస్తూ దీనికి తోడుగా స్వయం ఉపాధి కల్పించే విధంగా చర్యలు రూపొందించాలని నిర్ణయించింది.
    5. దివ్యాంగులకు పునరావాస సేవలు అందించే వృత్తి నిపుణుల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.
    6. దివ్యాంగులకు సమాజంలో ఉన్నటువంటి అన్ని అవకాశాలు వినియోగించుకునేలా ఆటంకం లేని పరిస్థితులను కల్పించాలని నిర్ణయించారు.
    7. దివ్యాంగ పెన్నన్లు మరియు దివ్యాంగ నిరుద్యోగ పెన్నన్లు లాంటి సామాజిక భద్రతను అందించాలని నిర్ణయించారు.
    8. దివ్యాంగుల సంక్షేమ రంగంలో పనిచేస్తున్న స్వచ్చంద సంస్థలను మరియు ఇతర ప్రభుత్వేతర సంస్థలను ప్రోత్సహించాలని నిర్ణయించారు.

    ఈ విధానంని ఆచరణలోకి తీసుకొచ్చేందుకై మే 12, 2012న దివ్యాంగుల కోసం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖలో ప్రత్యేక విభాగాన్ని/ డిపార్ట్‌మెంట్‌ను ప్రారంభించారు.

    వికలాంగుల సంక్షేమం కోసం రూపొందించిన సామాజిక శాసనాలు (Law Relating to Welfare of the Disables)

    1. The Rights of Persons with Disability (RPWD) Act, 2016

    నోట్: పై చట్టంను Persons with Disability Act- 1995 స్థానంలో తీసుకువచ్చారు.

    2. Mental Health Act, 1987 (Amended in 2017)
    3. The Rehabilitation Council of India Act - 1992
    4. The National Trust for Welfare of Persons with Autism, Cerebral palsy, Mental Retardation and
    Multiple Disabilites Act, 1999

    The Rights of Persons with Disabilites (RPWD) Act - 2016

    • 28-12-2016న చట్టంను రూపొందించారు మరియు 19-04-2017 నుండి అమలులోనికి వచ్చింది.
    • సమాన అవకాశాలు, ఆటంకాలు లేని వాతావరణం (Barrier free Environment) ప్రత్యేక అవకాశాలు, రక్షలు, సదుపాయాలు, వివక్షతలు లేని వాతావరణం లాంటి హక్కులు కల్పించారు.
    • ఈ చట్టం వికలాంగులను 21 రకాలుగా గుర్తించింది.
    • 5% రిజర్వేషన్ల విద్యలో మరియు 4% రిజర్వేషన్లు ప్రభుత్వ ఉద్యోగాలలో కల్పించారు.
    • Chief Commissioner of Persons with Disabilites and State Commissioners of Disabilites లు ఈ చట్టం అమలు తీరును పర్యవేక్షిస్తారు.
    • ఈ చట్టం ప్రకారం జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో నిది (Fund) ఏర్పాటు చేశారు.
    • ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి మరియు వికలాంగులకు సమాన అవకాశాలు కల్పించకపోయినా, విచక్షణతకు గురిచేసిన మరియు ఇతర రకమైన దాడులు నేరంగా పరిగణింపబడతాయి.
    • ప్రజలందరి కోసం ఉద్దేశించిన ప్రదేశాలు మరియు కార్యాలయాల యందు అశక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. ఉదా: ర్యాంపులు ఏర్పాటు చేయడం.


    మానసిక ఆరోగ్య చట్టం (31021 2102 తం 1987 (Amened in 2017)

    • ఈ చట్టాన్ని అనుసరించి జాతీయ స్థాయిలో సెంట్రల్‌ మెంటల్‌ హెల్త్‌ అథారిటీని మరియు రాష్ట్రాల స్థాయిలో స్టేట్‌ మెంటల్‌ హెల్త్‌ అథారిటీలను ఏర్పాటు చేసారు.
    • ఈ చట్టాన్ని బ్రిటీష్‌వారి కాలంలో రూపొందించిన Indian Lunacy Act - 1912 స్థానంలో ఈ చట్టాన్ని ఏర్పాటు చేశారు. మానసిక అనారోగ్యులకు మానవ హక్కుల భంగం కలగకుండ కాపాడటమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం.
    • ఈ చట్టాన్ని మినిప్టే ఆఫ్‌ హెల్త్‌ & ఫ్యామిలీ వెల్ఫేర్‌ వారు అమలుపరుస్తున్నారు.

    జాతీయ పునరావాస మండలి (Rehabilitation Council of India)

    • ఈ సంస్థని జూలై 31, 1986న ఒక లాభాపేక్షలేని సంస్థగా ప్రారంభించారు.
    • దివ్యాంగులకి సంబంధించిన పునరావాస కార్యక్రమాలకు మార్గదర్శకత్వం వహించేందుకు, అయా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థల్ని గుర్తించి మరియు నియంత్రించేందుకు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశారు.
    • ఈ సంస్థ దివ్యాంగుల పునరావాసానికి సంబంధించిన పునరావాస ప్రణాళిక లను, విధానాలను, పునరావాస విద్య మరియు శిక్షణ, ప్రత్యేక బోధనా పద్ధతులు లాంటి అంశాలకు సంబంధించి దేశ వ్యాప్తంగా సేవలందిస్తున్న సంస్థలకి గుర్తింపుని కూడా జారీచేస్తుంది.
    • ఈ సంస్థని చట్టబద్ధ సంస్థగా మార్చి మరింత బలోపేతం చేసేందుకై The Rehabilitation Council of India Act - 1992 ని రూపొందించారు, ఈ చట్టంని అనుసరించి 1998వ సంవత్సరం నుండి ఈ సంస్థ చట్టబద్ధ సంస్థగా మారింది.
    • ఈ సంస్థ యొక్క ముఖ్యలక్ష్యం దివ్యాంగుల పునరావాసానికి సంబంధించిన మానవ వనరులను పెంపొందించడం మరియు పరిశోధనా కార్యక్రమాలు చేపట్టడం.

    ప్రస్తుతం ఈ సంస్థ ఈ క్రింది ముఖ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నది

    1. నవశికార్‌ అనే చానల్‌ద్వారా 2007వ సంవత్సరం నుండి దివ్యాంగులకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నది.
    2. పునర్భవ అనే పేరుతో మీడియా ల్యాబ్‌ ఆసియా వారి సహకారంతో పునరావాసానికి సంబంధించిన అంశాలపై అవగాహన కోసం వెబ్‌పోర్టల్‌ని ప్రారంభించింది.
    3. దేశవ్యాప్తంగా వికలాంగుల పునరావాస కోర్సులను అభ్యసించేందుకు ఉద్దేశించిన ప్రవేశపరీక్షలకు సహజ సామర్థ్య పరీక్షలని నిర్వహిస్తుంది.

    నేషనల్‌ ట్రస్ట్‌

    • ఆటిజం, సెరిబ్రల్‌ ప్లాసీ, బుద్ధి మాంధ్యత మరియు బహుళ వైకల్యంను కలిగి ఉన్న బాలల సంక్షేమం కోసం ఈ సంస్థను జాతీయ స్థాయిలో ఏర్పాటుచేశారు.
    • ఈ సంస్థని  the National Trust for welfare of persons with Autism, Cerebral Palsy, Mental Retardation and Multiple Disabilities Act, 1999 ను అనుసరించి ఏర్పాటు చేశారు కావున ఇది చట్టబద్ధ సంస్థ ప్రస్తుతం ఈ సంస్థ ఈ క్రింది కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.
    • ఈ సంస్థ దివ్యాంగుల జీవనోపాదులను మరియు ఆధారాలను పెంపొందించేందుకు సేవలు అందిస్తున్నది మరియు ఈ సంస్థ ద్వారానే అనాధ దివ్యాంగులకు లీగల్‌ గార్జియన్స్‌ అధ్వర్యంలో సంరక్షణను అందిస్తున్నారు.
    • సమర్థ్‌ అనే పేరుతో దివ్యాంగులకు సంబంధించిన నైపుణ్యాలపై ప్రదర్శనలు నిర్వహిస్తున్నది మరియు వికలాంగులకు విశ్రాంతి మరియు తాత్కాలిక ఉపశమన కేంద్రాలను అందిస్తున్నారు.

    సహయోగి

    సహయోగి అనే పథకం క్రింద ఈ ట్రస్టులో భాగంగానే మాస్టర్‌ టైనీస్‌నకు శిక్షణనిస్తున్నారు.

    సంభవ్‌

    ట్రస్టు కార్యక్రమాలలో భాగంగా సంభవ్‌ అనే పేరుతో ఢిల్లీ నందు జాతీయ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటుచేశారు.

    ప్రేరణ

    నేషనల్‌ ట్రస్టు కార్యక్రమాలలో భాగంగా ప్రేరణ అనే పేరుతో దివ్యాంగులు రూపొందించిన వస్తువులను మరియు హ్యాండిక్రాఫ్ట్‌ని ప్రదర్శనలు మరియు మేళాలు నిర్వహించి మార్కెటింగ్‌ సహకారం అందిస్తున్నారు.

    లోకల్‌ లెవల్‌ కమీటీలు

    నేషనల్‌ ట్రస్టు యాక్టు 1999 సెక్షన్‌ 13 ప్రకారం ప్రతి జిల్లాలో 3 సంవత్సరాల కాలపరిమితితో కూడిన లోకల్‌ లెవల్‌ కమిటీలను ఏర్పాటుచేయాలి. ఈ కమిటీలు ఆయా జిల్లాలకు సంబంధించిన వికలాంగ సంరక్షకులను నియమించడం లేదా తొలగించడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాయి.

    దిశ

    నేషనల్‌ ట్రస్టు కార్యక్రమాలలో భాగంగా 0 నుండి 10 సంవత్సరాల మధ్య ఉన్న దివ్యాంగ బాలల యందు పాఠశాలకు సిద్ధం చేయడం మరియు వికలాంగత్వం తొలిదశలోనే జోక్యం చేసుకోవడం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సేవలను అందించే కేంద్రాలనే దిశా కేంద్రాలు అని పిలుస్తున్నారు. ఈ కేంద్రాల యందు పునరావాసం, శిక్షణ, వికలాంగ బాలల తల్లిదండ్రులకు శిక్షణ లాంటివి అందిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 115 దిశాకేంద్రాలు సేవలు అందిస్తున్నవి.

    వికాస్‌

    నేషనల్‌ ట్రస్టు కార్యక్రమాలలో భాగంగానే 10 సంవత్సరాలు దాటినటువంటి వికలాంగ బాలలకు డేకేర్‌ సేవలను వికాస్‌ పేరుతో అందిస్తున్నారు. ఈ యొక్క వికాస్‌ కేంద్రాలు దేకేర్‌తో పాటు వికలాంగ బాలలకు ఒకేషనల్‌ స్కిల్స్‌ నందు శిక్షణ నందిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 124 వికాస్‌ కేంద్రాలు సేవలు అందిస్తున్నవి.

    నోట్: 01-01-2018 నుండి ఎన్‌జీవోల సహకారంతో దిశా మరియు వికాస్‌ పథకాలను సంయుక్తంగా అమలు చేస్తున్నారు.

    నిర్మయ

    ఇది దివ్యాంగులకు సంబంధించిన ఆరోగ్య భీమా పథకం. దీనిని 2007వ సంవత్సరంలో ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా వైద్యసేవల కోసం లక్ష రూపాయల వరకు సహాయం చేస్తారు.

    ARUNIM (Association for Rehabilitation and National Trust Initiative of Marketing)

    ఈ సంస్థని సెప్టెంబర్‌ 22, 2008న శ్రీ అబ్బుల్‌ కలాం గారు ప్రారంభించారు, ఇది లాభాపేక్షలేని సంస్థ. ఈ సంస్థ దివ్యాంగులకు సంబంధించిన హస్తకళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తుంది, వారు తయారుచేసిన వస్తువులను ARUNIM అనే బ్రాండ్‌తో విక్రయించేందుకు మార్కెట్‌ సౌకర్యాలు, రుణసౌకర్యాలు మరియు ప్రచారాన్ని కల్పిస్తుంది.

    సమర్డ్‌ నివాస కేంద్రాలు

    దివ్యాంగులకు సంబంధించిన తాత్మాలిక మరియు దీర్హకాలిక నివాస కేంద్రాలనే సమర్థ్‌ నివాస రేంద్రాలంటారు. ఈ నివాస కేంద్రాలలో మొదటి ప్రాధాన్యాన్ని అనాధ దివ్యాంగులకు అందిస్తారు.

    గరుండ

    నేషనల్‌ ట్రస్టు పథకంలో భాగంగా ఆటిజం, సెరిబ్రల్‌ ప్లాప్స్‌ బుద్ధి మాంధ్యత మరియు బహుళ వైకల్యంతో ఇబ్బందిపడుతున్న 18 సంవత్సరాలు దాటిన వికలాంగుల కోసం ఉద్దేశించిన నివాస కేంద్రాలనే గరుండ అంటారు. దేశ వ్యాప్తంగా 50 గరుండ కేంద్రాలు పనిచేస్తున్నవి.

    బడాతే కదమ్‌

    సమాజంలో దివ్యాంగుల పట్ల ప్టెగ్యా లేదా చిన్నచూపు లేదా దివ్యాంగుల పట్ల సమాజం చూపే వివక్షాపూరితమైన వైఖరిలో మార్చును తీసుకువచ్చేందుకై బడాతే కదమ్‌ అనే పేరుతో సమాజంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దివ్యాంగుల పట్ల కుటుంబస్థాయి నుండి సమాజ స్థాయి వరకు సానుకూల దృక్పథాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం.

    ఉదయం ప్రభ

    దివ్యాంగులకు ఆర్థిక స్వావలంబన కల్గించేందుకు ఉద్దేశించినది. 2018లో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ లోతికా సర్కార్‌ నిధుల ద్వారా ఈ పథకాన్ని అమలుచేస్తారు. ఈ పథకం కింద 3 నుండి 5% వార్షికవడ్డీతో దివ్యాంగులకు స్వయం ఉపాధి నిమిత్తం 1 లక్ష రూపాయాల వరకు రుణాలను అందిస్తారు.

    చీఫ్‌ కమీషనర్‌ ఫర్‌ పర్సన్స్‌ విత్‌ డిసేబులిటిస్‌ (CCPD)

    వికలాంగుల హక్కుల చట్టం 1995 సెక్షన్‌ 57(1)ను అనుసరించి ఈ సంస్థని చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు. వీరికి అనుబంధంగా రాష్ట్రస్థాయిలో స్టేట్‌ కమీషనర్‌ ఫర్‌ పర్సన్స్‌ విత్‌ డిసెబులిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సవరించిన వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం ఈ సంస్థ సెక్షన్‌ 74(1) ప్రకారం ఏర్పడింది.

    వికలాంగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలుతీరును పర్యవేక్షించడం మరియు వికలాంగుల హక్కుల ఉల్లంఘన ఫిర్యాదులను విచారించడం అనునవి ఈ సంస్థ యొక్క ప్రధాన బాధ్యతలు. ఈ సంస్థకి సివిల్‌కోర్టుకు ఉండే అధికారాలుంటాయి.

    National Handicapped Finance Development Corporation (NHFDC)

    జనవరి 2%, 1997న కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారిత మంత్రిత్వశాఖలో ఖాగంగా ఈ సంస్థను ఏర్పాటుచేశారు. అది లాభాపేక్షలేని సంస్థ. ఈ సంస్థ దివ్యాంగులకు స్వయం ఉపాధి మరియు విద్యాసంబంధమైన రుణాలను అందిస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ విశేష్‌ ఉదయం మిత్ర మరియు ప్రశిక్షణ్‌ మిత్ర అనే పథకాలు అమలుచేస్తున్నది.

    యూనివర్సీటీ ఆఫ్‌ డిజెబులిటి స్టడీస్‌ & రీహాబిలిటేషన్‌

    2015-16 బడ్జెట్‌ స్పీచ్‌ నందు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నందు గల నేషనల్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ & ఇయరింగ్‌ అనే సంస్థని యూనివర్సిటి ఆఫ్‌ డిజెబులిటి స్టడీ & రీహాబిలిటేషన్‌గా మారుస్తున్నామని ప్రకటించారు. అయితే ఈ సంస్థని అస్సాం రాష్ట్రం నందు గల కామరూప్‌లో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.

    ALMICO

    ఈ సంస్థను Artificial Limbs Manufacturing Corporation of India గా పిలుస్తారు. ఈ సంస్థను కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వశాఖల పరిధిలో లాభాపేక్ష లేని సంస్థగా కంపెనీల చట్టం 1956 నందు గల సెక్షన్‌ 25 ప్రకారం ఏర్పాటు చేశారు.

    (ప్రస్తుతం కంపెనీల చట్టాన్ని 2013లో సవరించారు, సవరించిన ఈ చట్టం ప్రకారం ఈ సంస్థ కంపెనీ చట్టం 2013లోని సెక్షన్‌ 8 పరిధిలోనికి వస్తుంది).

    ఈ సంస్థను రాష్ట్రపతి పేరుమీద 1972 సెప్టెంబర్‌లో ఏర్పాటుచేశారు. ఈ సంస్థ వివిధ రకాల దివ్యాంగులకు కావలసిన పరికరాలను మరియు కృత్రిమ అవయవాలను తయారుచేసి అందిస్తుంది. మన దేశ అవసరాలే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నవి.

    ఈ సంస్థ స్వావలంబన్‌ అనే పేరుతో కృత్రిమ అవయవాలను గురించి మరియు దివ్యాంగులకు సంబంధించిన పునరావాస పరికరాలను గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.

    ADIP

    ఈ పథకాన్నే Assistance to Disabled Persons for Purchase అని పిలుస్తారు. ఈ పథకంలో భాగంగా దివ్యాంగులు కృత్రిమ అవయవాలు మరియు ఇతర పునరావాస పరికరాలు కొనుగోలు చేసుకొనేందుకై ఆయా పరికరాలను రాయితీలను కల్పించి అందిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సమగ్ర శిక్షా అభియాన్‌ క్యాంపులు నిర్వహిస్తూ దివ్యాంగులకు పరికరాలు అందిస్తున్నారు.

    రాజీవ్‌ గాంధీ నేషనల్‌ ఫెలోషిప్‌

    Ph D and M Phil లాంటి పరిశోధక విద్యను అభ్యసిస్తున్న దివ్యాంగ విద్యార్థులకు నెలవారీ ఉపకార వేతనాలు అందించేందుకై ఈ పథకంను ప్రారంభించారు. ఈ పథకాన్ని 01 ఏప్రిల్‌ 2012 నుండి అమలుచేస్తున్నారు.

    స్కీమ్‌ ఫర్‌ ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ రైట్స్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిసెబులిటి యాక్టు-2016 (SIPDA)

    వికలాంగుల హక్కుల చట్టంలో ఖాగంగా వికలాంగులకు పొందుపర్చబడిన హక్కులను అమలు పరిచేందుకు ఉద్ధేశించినదే ఈ పథకం. ఇందులో భాగంగా...

    ఎ. ప్రజాసౌకర్యాలు, విద్యాసంస్థలు మరియు ప్రజలకు 'సేవలందించేందుకే ఉద్ధేశించిన కార్యాలయాల యందు మరియు రోడ్డు రవాణాకు సంబంధించిన ప్రాంతాలలో వికలాంగులకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు.
    ఉదా: ర్యాంపులు కట్టడం

    బి. ప్రభుత్వ సమాచారాన్ని వికలాంగులకు అందించే విధానంలో ప్రత్యేకంగా DARPG అనే వెబ్‌సైట్‌ నందు పొందుపర్చుతున్నారు.

    సి. యాక్సిసబుల్‌ ఇండియా లేదా సుగమ్య భారత్‌ అభియాన్‌ అనే కార్యక్రమం ద్వారా వికలాంగులు, సకలాంగులతో సమానంగా అవకాశాలు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు.

    డి. యూనివర్సల్‌ డిసెబులిటీ ఐ.డి. కార్డు (UDID) ను అందిస్తున్నారు.

    దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధికై జాతీయ కార్యాచరణ ప్రణాళిక

    కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ వారి సహకారంతో మార్చి 21, 2015 నుండి ఈ కార్యక్రమాలను అమలు పరుస్తున్నారు. ఈ పథకంలో భాగంగా దివ్యాంగులకు వారివారి అభిరుచులు మరియు సామర్థ్యాల మేరకు నైపుణ్యాఖివృద్ధిని కలిగిస్తున్నారు.

    దివ్యాంగుల నైపుణ్య మండలి

    కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖలో భాగంగా వికలాంగులలో నైపుణ్యాన్ని అభివృద్ది చేయడం కోసం ఈ మండలిని ఏర్పాటు చేశారు.

    సుగమ్య భారత్‌ అభయాన్‌

    డిసెంబర్‌ 09, 2010న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా వికలాంగులకు వారివారి అవసరాల మేరకు ప్రభుత్వ సంస్థలు మరియు ప్రజాసంస్థల యందు వారికి ఎలాంటి ఆటంకాలు లేని పర్యావరణాన్ని కల్పిస్తున్నారు.

    వికలాంగులకు అనువైన నమాచార ప్రసార మాధ్యమాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. రైళ్ళు, విమానాలు మరియు ఇతర ప్రజా రవాణా సౌకర్యాలలో వికలాంగులకు అటంకాలు లేని సౌకర్యాలు కల్పిస్తున్నారు.ఈ పథకంలో భాగంగానే ప్రియా...ద ఆక్సిసబుల్‌ వారియర్‌ అనే కామిక్‌ యాక్టివిటి బుక్‌ను రూపొందించారు మరియు సుగమ్య భారత్‌ యాప్‌ని రూపొందించారు.

    బ్రెయిలీ లిపీ ప్రచురణ యంత్రాలకు సహకారం

    2014-15 ఆర్థిక సంవత్సరంలో బ్రెయిలీ లిపిని అందుబాటులోకి తీసుకొచ్చే వారికి సహకరించేందుకై ఈ పథకం ప్రారంభించారు. ఇందులో భాగంగా దృష్టి సంబంధిత దివ్యాంగులకు బ్రెయిలీ పాఠ్యపుస్తకాలను అందిస్తున్నారు.

    ఇతర ముఖ్య పథకాలు

    1985వ సంవత్సరం నుండి జిల్లా స్థాయిలో దివ్యాంగులకు పునరావాసం అందించేందుకు డిస్ట్రిక్ట్‌ డిసెబిలిటీ రీహాబిలిటేషన్‌ కేంద్రాలను ప్రారంభించారు.

    నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ రీహాబిలిటేషన్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిసెబిలిటీ కార్యక్రమాన్ని 1999లో ప్రారంభించారు.

    దివ్యా కళాశక్తి పేరుతో 2019వ సంవత్సరంలో దివ్యాంగ కళాకారుల ప్రదర్శనలు జరిపారు.

    జాతీయా టీకా కార్యక్రమం, మిషన్‌ ఇంధ్రధనస్సు 2.0, పల్స్‌పోలియో కార్యక్రమం, విటమిన్‌ ఎ కార్యక్రమం, గాయిటర్‌ నియంత్రణ కార్యక్రమం, అయోడిన్‌ లోప నివారణ కార్యక్రమం, లెప్రసీ నివారణ కార్యక్రమం, మూగతనం నియంత్రణ కార్యక్రమం మరియు ఫ్లోరోసిస్‌ నివారణ మరియు నియంత్రణ కార్యక్రమం లాంటి అరోగ్యసంక్షేమ కార్యక్రమాలు అందించి వికలాంగత్వంను రాకుండా నివారించే ప్రయత్నం చేస్తున్నారు.

    పునశ్చరణ


    • శరీరంలో అవయవం పనిచేయకపోవడాన్ని ఇంపేర్‌మెంట్‌ అంటారు, ఏ అవయవమైతే ఇంపేర్‌మెంట్‌కు గురయ్యినదో ఆ అవయవమునకు సంబంధించిన పనిచేయలేకపోవడాన్ని డిసెబులిటి అంటారు, డిజెబులిటి వలన సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురవడాన్ని వికలాంగత్వం అంటారు.
    • ఒకటి కంటె ఎక్కువ వైకల్యాలు ఉన్నట్లయితే బహుళ వైకల్యాలు అంటారు.
    • వికలాంగుల హక్కుల చట్టాన్ని 2016లో సవరించి, 21 రకాల వికలాంగత్వాలను పేర్కొన్నారు.
    • ప్రజ్ఞాలబ్ధి 70 కంటే తక్కువగా ఉంటే బుద్ధిమాంధ్యత లేదా ప్రజ్ఞా వైకల్యం అంటారు.
    • అటిజం అనే పదాన్ని మొదటిసారిగా లియోకానర్‌ అనునతడు వినియోగించాడు.
    • 21వ క్రోమోజోమ్‌ల లోపం వలన మంగోలిజమ్‌ లేదా డౌన్‌ సిండ్రోమ్‌ సంభవిస్తుంది.
    • 2011 జనాభా లెక్కల ప్రకారం దేశజనాభాలో 2.21% మంది వివిధ రకాల వైకల్యంతో జీవిస్తున్నారు.
    • షెడ్యూల్డ్‌ కులాల యందు వికలాంగత్వం 2.29 మరియు షెడ్యూల్డ్‌ తెగల యందు 1.92% కలదు.
    • వికలాంగులను నరేంద్రమోదీ దివ్యాంగులని సంభోదించారు. వికలాంగత్వం, డిజెబులిటి, భిన్న సామర్భులు మరియు ప్రత్యేక సామర్భ్యులు అనే పదాలను నానార్థాలుగా వినియోగిస్తారు.
    • అన్ని రాష్ట్రాలలో కెల్లా ఉత్తరప్రదేశ్‌ నందు మరియు అన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో కెల్లా ఢిల్లీ నందు వికలాంగుల సంఖ్య అధికంగా కలదు.
    • అన్ని రాష్ట్రాలలో కెల్లా మిజోరాం నందు మరియు అన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో కెల్లా లక్ష్యద్వీప్‌ నందు వికలాంగుల సంఖ్య అత్యల్పంగా కలదు.
    • 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభాలో వికలాంగులు 2.98% ఉన్నారు, వైకల్యానికి సంబంధించిన వికలాంగులు అధికంగా ఉన్నారు.
    • అన్ని రకాల వికలాంగత్వలలో కెల్లా చలనపరమైన వైకల్యం అధికంగా కలదు.
    • ఐక్యరాజ్యసమితి వికలాంగుల హక్కుల సాంప్రదాయాన్ని 2006లో రూపొందించింది.
    • డిసెంబర్‌ 03 ని వికలాంగుల దినోత్సవంగా జరుపుకుంటారు.


Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


No comments:

Post a Comment

Post Bottom Ad