1. పరిచయం - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Friday, June 7, 2024

1. పరిచయం

  I  - పరిచయం


డి.యస్.సి. సైకాలజీ విభాగంలో ఈ పాఠ్యాంశానికి సంబంధించి 3 నుండి 5 ప్రశ్నలు వస్తున్నాయి. ఈ పాఠ్యాంశంను 6 అంశాలుగా విభజించి వివరించడం జరిగింది.

1. మనోవిజ్ఞాన శాస్త్రం

2. సాంప్రదాయాలు

3. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు

4. మనోవిజ్ఞాన శాస్త్రవిభాగాలు

5. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం

6. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు


1. మనోవిజ్ఞాన శాస్త్రం

  • విజ్ఞానాన్ని ఒక శాస్త్రీయ పద్దతిలో అందించడానికి ఉపయోగపడే వ్యవస్థే - పాఠశాల
  • సాంప్రదాయ పద్దతిలో విద్యను బోధించే వ్యవస్థ - పాఠశాల
  • పాఠశాల నిర్వహణ సౌలభ్యం కోసం రూపొందించబడిన విభాగం - తరగతి గది
  • తరగతి గదికి కేంద్రబిందువు - విద్యార్థి
  • తరగతి గది విధానంలో మార్గదర్శకుడు, స్నేహితుడు, తాత్వికుడు- ఉపాధ్యాయుడు
  • విద్య అనే పదంలో గల ప్రక్రియలు - వికసింపచేయడం, నేర్పించడం లేదా అభ్యసింపచేయడం
  • “సైకాలజీ" అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించినది - రుడాల్ఫ్ గోయెకల్ (1590)
  • 19వ శతాబ్దం వరకు మనోవిజ్ఞాన శాస్త్రం ఏ శాస్త్రంలో భాగంగా ఉండేది - తత్వశాస్త్రం
  • 1879 లో జర్మనీ లోని లీగ్ నగరంలో మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను స్థాపించినది - ఊంట్
  • మనో విజ్ఞాన శాస్త్ర పితామహుడు - ఊంట్
  • మనో విజ్ఞాన శాస్త్రం ఒక శాస్త్రంగా మారి సుమారు 125సం||లు అయింది.
  • సైకాలజీ అనే పదం సైకె, లోగస్ అనే రెండు గ్రీకు పదాల నుండి ఉద్భవించింది.
  • సైకె అనగా ఆత్మ అని, లోగస్ అనగా అధ్యయనం అని అర్థం.
  • సైకాలజీని, ఆత్మను అధ్యయనం చేయు శాస్త్రంగా పేర్కొన్నది. - ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు
  • సైకాలజీని, మనస్సును అధ్యయనం చేయు శాస్త్రంగా పేర్కొన్నది. సెయింట్ అగస్టీన్
  • సైకాలజీని, చేతనత్వంను అధ్యయనం చేయు శాస్త్రంగా పేర్కొన్నది. - ఊంట్, జేమ్స్, టిష్నర్
  • సైకాలజీని, అచేతనత్వంను అధ్యయనం చేయు శాస్త్రంగా పేర్కొన్నది - సిగ్మండ్ ఫ్రాయిడ్
  • సైకాలజీని, ప్రవర్తనను అధ్యయనం చేయు శాస్త్రంగా పేర్కొన్నది. - జె.బి.వాట్సన్ (20 శతాబ్దంలో)
  • ప్రవర్తన రెండు రకములుగా ఉంటుంది. అవి 1. బాహ్య ప్రవర్తన - ఉదా:- గీయడం, వ్రాయడం

                                                                                       2. అంతర్ ప్రవర్తన- ఉదా:- ఆలోచించడం.

  • జీవి యొక్క ప్రవర్తనను మూడు రంగాలకు అన్వయించారు.



2. సాంప్రదాయాలు


1. సంచరనాత్మక వాదం :

- ఈ వాదం ప్రకారం మనోవిజ్ఞాన శాస్త్రం చేతనత్వాన్ని అధ్యయనం చేస్తుంది.

- ఈ వాదం ప్రకారం మనస్సులోని అంశాలు - సంవేదనలు, ప్రతిమలు, అనుభూతులు

- ఈ వాదం యొక్క లక్ష్యం - మనసులోని అంశాలను విశ్లేషించడం

- మనస్సు నిర్మాణం, మనస్సు అంటే ఏమిటి ? ఏ విధంగా ఉంది ? అనే విషయాలను తెలియజేస్తుంది.

- కంజెంట్ సైకాలజీ అందురు.


2. కార్యకరణ వాదం :

- ఈ వాద మూలపురుషుడు విలియం జేమ్స్ (అమెరికా)

- Principles of Psychology గ్రంధ రచయిత

- మనస్సు చేసే పనులు గురించి తెలుపుతుంది.

- పరిసరాలతో సర్దుబాటు చేసుకొనే కారకాలైన అవధానం, ప్రత్యక్షం, ప్రజ్ఞలను గురించి తెలుపుతుంది.


3. ప్రవర్తనా వాదం :

- ఈ వాద మూలపురుషుడు - జే.బి.వాట్సన్ (అమెరికా)

- ఇది జంతువుల మీద పరిశోధనలు చేయడానికి తోడ్పడుతుంది.

- పావ్లోవ్, డైక్, స్కిన్నర్ ప్రయోగాలు ఈ వాదాన్ని సమర్ధిస్తున్నాయి.

- Behavior : An Introduction to comparative Psyhology గ్రంధ రచయిత - వాట్సన్


4. మనోవిశ్లేషణా వాదం :

- ఈవాద మూలపురుషుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ (ఆస్ట్రియా)

- వ్యక్తులు యొక్క చింతనలు, అనుభూతులు, కలలు, పగటి కలలు విశ్లేషణ ద్వారా అర్ధం చేసుకోవచ్చు అనేది ఈ వాదం.

- పైకి చెప్పలేని, సమాజం ఆమోదించని భావాలు, ఆలోచనలు, కోరికలు, భయాలు అచేతనత్వంలో వుంటాయి.

- వ్యక్తుల నాడీరుగ్మతలు, స్వప్నాలు, నోరు జారడం ద్వారా అచేతన ప్రక్రియను బహిర్గత పరుస్తారు.

- అచేతన ప్రేరణ సిద్ధాంతంను ప్రతిపాదించెను.

- మూర్తిమత్వాన్ని వివరించడం దీనియొక్క ముఖ్య ఉద్దేశ్యం.

"ఇంటర్ ప్రిటేషన్ ఆఫ్ డ్రిమ్స్" గ్రంథరచయిత - ఫ్రాయిడ్


5. గెస్టాల్ట్ వాదం :

- ఈవాద మూలపురుషులు - వర్థిమర్, కోఫ్కా, కొహిలర్ (జర్మనీ)

-సంచరనాత్మక, కార్యకరణ, ప్రవర్తనా వాదాలకు వ్యతిరేకంగా ఉద్భవించింది.

- గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి అర్ధం - సమగ్ర ఆకృతి

- మనస్సును, సంవేదనలు, ప్రతిమలు, అనుభూతులుగా విడగొట్టడాన్ని విమర్శించింది.

- భాగాలన్నింటిని మొత్తంగా పరిశీలించినపుడే అర్ధవంతంగా ఉంటుంది.

- వీరు అంతర్ దృష్టి అభ్యసనం పై ప్రయోగాలు చేసారు.

- గెస్టాల్ట్ సంప్రదాయాన్ని అనుసరించి మూర్తిమత్వ సిద్ధాంతాన్ని వివరించినది - లెవిన్

- క్షేత్ర సిద్ధాంతాన్ని రూపొందించినది - లెవిన్


6. ప్రయోజనతా వాదం :

-ఈ వాద మూలపురుషుడు - విలియం మెక్ డోగల్ (బ్రిటన్)

- దీనినే హర్మిక్ సిద్దాంతం అని కూడా అంటారు.

- అంతఃప్రేరణ వ్యక్తిని గమ్యచర్య శీలత వైపు నడిపిస్తుంది.

-సహజాత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది - విలియం మెక్ డోగల్

7. వైయక్తిక మనోవిజ్ఞాన శాస్త్రం - అడ్లర్

8. విశ్లేషణాత్మక మనో విజ్ఞాన శాస్త్రం - యాంగ్

9. సంజ్ఞానాత్మక వాదం - పియాజె

10. సంసర్గవాదం - జాన్ లాక్

11. మానవతా వాదం- అబ్రహం మాస్లో


3. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు

- మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మనస్సును విశ్లేషించి అందులోని భాగాలను ఏమన్నారు - భావనలు, సంవేదనలు

- "నిన్ను గురించి నీవు తెలుసుకో" అనే సూక్తి గ్రీక్ డెల్ఫీ దేవాలయంపై వ్రాయబడివుంది.

- ప్రాచీన తత్వవేత్తలు సంవేదనలు స్వీకరించే అంగంగా దేనిని పరిగణించారు - మనస్సును

- జగత్తు నుంచి వచ్చే సంవేదనలను సమగ్ర పరిచే ప్రక్రియ - బుద్ధి


సోక్రటీస్ (గ్రీస్) :

- అచేతనమైన మానసిక కృత్యాలను వివరించడానికి మొదట ప్రయత్నం చేసినవారిలో చెప్పుకోదగినవాడు.

- ఆత్మలో జ్ఞానం ఇమిడి ఉందనీ, అది అంతర్గతంగా నిగూఢంగా ఉంటుందనీ, దాన్ని చైతన్య మానసిక స్థితిలోకి తీసుకురావచ్చని తెలిపాడు.


ప్లాటో (గ్రీస్) :

- సోక్రటీస్ శిష్యులలో పేరొందినవాడు, ఇతడు భావవాది.

- మనస్సు మెదడులోను, ఇచ్ఛ హృదయం లోను, తృష్ణ లేదా వాంఛ ఉందరం లోను ఉంటాయని అభిప్రాయపడినాడు.

- ప్రాచీన పాఠశాల ఉద్యమ ప్రారంభికుడు

- విద్య అనేది వ్యక్తిలో మంచిని బయటకు తేవడానికి చేసే ప్రయత్నమని పేర్కొనెను.

- రిపబ్లిక్ గ్రంధ రచయిత

- జిమ్నాషియా పాఠశాలలో మంచి భాష, మంచి అలవాటు, మంచి అందం, శరీర వ్యాయామం, సంగీతం మొదలైన కళలు ప్రవేశపెట్టాడు.


అరిస్టాటిల్ (గ్రీస్) :

- మనోవిజ్ఞాన శాస్త్రానికి తాత్విక రూపంను తీసుకువచ్చాడు.

- ప్రాచీన పాఠశాల ఉద్యమానికి జీవం పోసాడు

- డి అనిమో, పర్వతురాలియా, ఎథిక్స్, పాలిటిక్స్ గ్రంథాలను రచించాడు.

- ఆత్మను క్రియాత్మక, నిష్క్రియాత్మలుగా విభజించెను.


సెయింట్ అగస్టీన్ (ఆస్ట్రియా) :

- మనస్సు కొన్ని శక్తుల సముదాయమని పేర్కొనెను.

- మానసిక అనుభవాలను స్వయంగా పరిశీలించడం ద్వారా మనస్సు స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చునని పేర్కొనెను.

- ఇతను రూపొందించిన అంతఃపరీక్షణ పద్ధతి ద్వారా వ్యక్తి తన అనుభవాలను తానే స్వయంగా పరిశీలించుకోవచ్చు.

- ఈయన అంతఃపరీక్షణ పద్ధతి ద్వారా మానసిక ప్రాకర్యాలను గుర్తించాడు.

- ఇతని పాండిత్యవాదం ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంలో సంరచనాత్మకవాదానికి దారి తీసింది.

- మనస్సును పరిశీలించడానికి అంతఃపరీక్షణ పద్దతిని ఉపయోగించెను.

- పాండిత్యవాదం - విద్యావిధానంలో కంఠతపెట్టడం, మానసిక, శారీరక విషయాలలో శిక్షణ యివ్వడం, పిల్లల హస్త నైపుణ్యాలను అభ్యాసం ద్వారా పెంపొందిచడం మొదలైన పద్ధతులకు ఆధారభూతమైనది.

- వ్యక్తి చైతన్య పూరితుడుగా ఉన్నప్పుడు వ్యక్తి యొక్క మనస్సును అధ్యయనం చేయవచ్చునని చెప్పారు.


రూసో (ఫ్రాన్స్)

- విద్యాతత్వంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చినారు.

- ప్రాకృతిక వాదానికి మూలపురుషుడు.

-ప్రాకృతిక వాదం విద్యాతత్వానికి ఆధారమైనది.

-ఈయన గ్రంథాలు - సోషల్ కాంట్రాక్ట్ (సామాజిక ఒడంబడిక), ఎమిలి.

- ఈయనరూపొందిన ఆదర్శ విద్యార్థికి నమూనా - ఎమిలి

- విద్యా విధానంలో అనుభవం ద్వారా విద్య, స్వయం ప్రేరణ పద్ధతులను, క్రీడా విధాన పద్ధతిని ప్రతిపాదించాడు.

- "ప్రకృతికి తిరిగి పోదాం" అనే నినాదం ను యిచ్చారు.


పెస్టాలజీ (స్విట్జర్లాండ్)

- ఈయన 1805 - 1825 మధ్య యోర్డాన్ బోర్డింగ్ స్కూల్లో తన విద్యా ప్రయోగాలు చేసాడు.

- తెలిసిన విషయాలనుంచి తెలియని విషయాలకు బోధన కొనసాగాలని చెప్పాడు.

- విద్యార్ధి స్వయం అనుభవం ద్వారా విద్య నేర్చుకోవాలని చెప్పాడు.

-సామూహిక కృత్యాలను నిర్వహించాలని చెప్పాడు.

- భోదనాభ్యసన ప్రక్రియలో విద్యార్థి కేంద్ర బిందువని పేర్కొన్నాడు.

- ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవసరమని పేర్కొన్నాడు.

- 1780 లో "ఈవినింగ్ ఆఫ్ హెర్మిట్" గ్రంధాన్ని రచించారు.

- విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినవారిలో పెస్టాలజీ అగ్రగణ్యుడు

- ఈయన సిద్ధాంతాలు వ్యక్తులు లోని వైయక్తిక బేధాలను, సహజ సామర్ధ్యాలను గుర్తించడంలో సహాయపడ్డాయి.


ప్రోబెల్ (జర్మనీ)

-పెస్టాలజీ సమకాలికుడు

- కిండర్ గార్డెన్ అనే చిన్నపిల్లల పాఠశాల వ్యవస్థకు పితామహుడు.

- 1837లో ఇతను స్థాపించిన "CHILD NURTURE AND ACTIVITY INSTITUTE" కిండర్ గార్డెన్ పాఠశాలగా రూపొందింది.

- ఈయన బోధనా పద్దతులు - స్వయం వివర్తనం, స్వయం ప్రకాశం, స్వయం బోధన,

- బోధనలో బహుమతులను, క్రీడల ద్వారా విద్య, సంగీతం ద్వారా విద్యలను ప్రవేశపెట్టాడు.

- "PLAY WAY" అనే పదాన్ని రూపొందించిన వ్యక్తి

-ఉపాధ్యాయుడిని తోటమాలితోనూ, విద్యార్థిని తోటలోని మొక్కతో పోల్చాడు.


హెర్బార్ (జర్మనీ)

- ఈయన ప్రకారం “అభ్యసమనేది భావాలను చర్యల రూపంలో తర్జుమా చేసే ఒక చైతన్యవంతమైన ప్రక్రియ"

- బోధనా విధానంలో సోపానాలను రూపొందించాడు.

- పాఠ్యప్రణాళికను రూపొందించడానికి సోపానాలను తయారు చేసాడు. అవి :

1.సన్నాహం 2. ప్రదర్శనం 3. సంసర్గం 4. సాధారణీకరణం 5. అన్వయం 6. సింహావలోకనం.

- నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు.


మారియా మాంటిస్సోరి (ఇటలీ)

- ఈమె వైద్యవృత్తిలో ప్రవేశించి ఉపాధ్యాయ వృత్తికి మారెను.

-ఈమె మందబుద్ధిగల పిల్లల మీద ప్రయోగాలు చేసింది.

- విద్యావిధానంలో జ్ఞానేంద్రియ ప్రత్యక్షం, చొరవ, స్వేచ్ఛ, ఆత్మప్రకటనలను ప్రతిపాదించెను.

- ఇంద్రియాలకు తర్ఫీదు యివ్వటం ఈమె విద్యా విధానంలో మొదటి సోపానం.


జాన్ డ్యూయీ (అమెరికా)

-వ్యవహారిక సత్తావాదాన్ని రూపొందించారు.

- వ్యక్తి జీవితాన్ని, అతను పరిసరాలతో సర్దుబాటు చేసుకునే కృత్యాలను వివరించే వాదం - వ్యహారిక సత్తావాదం.

-కార్యకారణవాదంను కనుగొన్నాడు.

- పాఠశాలను "చిన్న మోతాదు సమాజం" గా పేర్కొన్నాడు.

-“డెమోక్రసీ మరియు ఎడ్యుకేషన్" గ్రంథకర్త.


జోహన్స్ ముల్లర్ (జర్మనీ)

- నిర్ధిష్టనాడీశక్తుల సిద్ధాంతాన్ని రూపొందించాడు.

- అనేక ఉద్దీపనలు ఒకే రకమైన ప్రతిస్పందనను కలుగజేయవచ్చునని తెలిపాడు.


సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ (బ్రిటన్)

- డార్విన్ సిద్ధాంతాల వల్ల ప్రభావితం అయ్యెను

-అనువంశికత, ప్రజ్ఞకు ఉన్న సంబంధాలను గురించి పరిశోధనలు చేసారు.

-అనువంశిక వాది

- "Heriditary Genius", An Inquiry into the Human Faculty and its Development" గ్రంథాల రచయిత.

- మానవశాస్త్ర ప్రయోగశాలను స్థాపించాడు.


విల్హెల్మ్ ఊంట్ (జర్మనీ)

- ఊంట్ తన పరిశోధనలను విద్యా విషయాలకు అన్వయించారు.

-చేతనత్వాన్ని పరిశీలించడానికి అంతఃపరీక్షణ పద్ధతిని ఉపయోగించెను.


విలియమ్ జేమ్స్ (అమెరికా)

- స్మృతి, విసృతి, అభ్యసన బదలాయింపు లపై సిద్ధాంతాలు చేసెను.

- ఆధునిక మనో విజ్ఞాన శాస్త్ర పితామహుడు

స్టాన్లీ హాల్ (అమెరికా)

- బాల మనో విజ్ఞాన శాస్త్ర మూలపురుషుడు

- ఊంట్ ప్రయోగపద్ధతులను శిశు అధ్యయనానికి అన్వయించాడు.

- శిశు అధ్యయన పద్ధతులను రూపొందించాడు.

- 1883 లో "THE CONTENT OF CHILDREN MIND" పుస్తకాన్ని రాసాడు.

- అమెరికన్ సైకలాజికల్ అసోషియేషన్ ను ప్రారంభించాడు.

- బాలల అధ్యయన ఉద్యమానికి మూలపురుషుడు


ఆల్ఫ్రెడ్ బిన్ (ఫ్రాన్స్)

- ప్రజ్ఞామాపక ఉద్యమానికి ప్రారంభికుడు

- పిల్లలలో మందబుద్ధులు ఎందుకు ఉంటారో తెలుసుకోవడానికి అన్వేషించాడు.

గమనిక :-

- నిష్క్రియాత్మక ఆత్మ - ఇది వ్యక్తిని చైతన్యపరచదు. పనులు చేయుటకు తోడ్పడదు. ఇది ఏమి రాయనటువంటి నల్లబల్ల, టాబ్యూలారాసా అని అందురు. చిన్న పిల్లల మనస్సు ఈ విధంగా ఉంటుంది. చిహ్నాలు దీనిపై పడితే జీవిత కాలం ఉండిపోతాయి.

- క్రియాత్మక ఆత్మ - ఇది వ్యక్తిని చైతన్యపరుస్తుంది. పనులు చేయుటకు తొడ్పడుతుంది.

- మనో విజ్ఞాన శాస్త్రం ఆత్మను అధ్యయనం చేయు శాస్త్రం అని అరిస్టాటిల్ "డి ఆనిమో" గ్రంథంలో పేర్కొన్నాడు.

- మనో విజ్ఞాన శాస్త్రం ప్రవర్తనాశాస్త్రంగా మార్చాలనుకున్నది వాట్సన్


4. మనోవిజ్ఞాన శాస్త్రం - విభాగాలు

- మనో విజ్ఞాన శాస్త్ర విభాగాలు రెండు రకాలు :- 1. శాస్త్రీయ మనో విజ్ఞాన శాస్త్రం 2. అను ప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రం

- కొన్ని రకాల ప్రవర్తనలను గురించి నిర్థిష్టంగా అధ్యయనం సాగించే దానిని శాస్త్రీయ మనో విజ్ఞానశాస్త్రం అందురు.

- వివిధ రంగాలకు మనో విజ్ఞాన శాస్త్ర సూత్రాలను, సిద్ధాంతాలను అన్వయించగా వచ్చు మనో విజ్ఞాన శాస్త్రవిభాగాలను అను ప్రయుక్త మనో విజ్ఞాన శాస్త్రం అందురు.




5. విద్యా మనోవిజ్ఞానశాస్త్రం

- 'బోధనాభ్యసన కృత్యాలను గురించి తెలిపేదే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం' - చార్లెస్ ఇ. స్కిన్నర్

- 'విద్యాశాస్త్రమే విద్యా మనో విజ్ఞానశాస్త్రం' - పీల్

- ‘ఒక వ్యక్తి ఆజన్మాంతం పొందే అభ్యసనానుభవాలను వర్ణించి విశదపరిచేదే విద్యా మనోవిజ్ఞానశాస్త్రం' - క్రో & కో.

- 'మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలను, సిద్ధాంతాలను విద్యారంగానికి అన్వయించేదే విద్యా మనో విజ్ఞానశాస్త్రం' - కొలెస్నిక్

- మనోవిజ్ఞాన శాస్త్రం జీవితంలోని అన్ని దశలో కనబరిచే ప్రవర్తనను గురించి అధ్యయనం చేస్తే, విద్యా మనో విజ్ఞాన శాస్త్రం పాఠశాల పరిసరాలతో విద్యార్థుల ప్రవర్తనను గురించి మాత్రమే వివరిస్తుంది.

- బోధనాభ్యాస ప్రక్రియలో ఉత్పన్నమయ్యే సమస్యలను కనుగొనడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించే పద్థతి కార్యాత్మక పరిశోధన (చర్యాత్మక పరిశోధన).

- విద్యను మనోవిజ్ఞాన శాస్త్ర పరంగా మార్చాలని పేర్కొన్నది - పెస్టాలజీ.

పరిధి:

పరిధిని అయిదు రకాలుగా వర్గీకరించినది - సాండీఫర్డ్



6. విద్యామనోవిజ్ఞానశాస్త్రం అధ్యయన పద్ధతులు

పురాతన పద్ధతులు: 1879 సం॥వరకు ఈ పద్దతులను ఉపయోగించారు. అవి

1. ఊహా పద్ధతి - ఊహించి చెప్పడం

2. సంఘటన రచనా పద్థతి - వ్యక్తి జీవితంలో ఏదో ఒక సంఘటనం ఆధారంగా (ఉపఖ్యానిక పద్థతి)


ఆధునిక పద్ధతులు :

1. అంతఃపరిశీలన పద్ధతి:

- దీనిని ప్రవేశపెట్టినది సెయింట్ అగస్టీన్

- ఊంట్ తన ప్రయోగశాలలో ఈ పద్ధతిని ఉపయోగించారు.

- అంతఃపరీక్షణం అంటే ఓ వ్యక్తి తన అనుభూతులను తాను పరీక్షించుకోవడం

- అంతఃపరీక్షణం స్వీయ పరిశీలన అని ఉడ్వర్త్ పేర్కొన్నారు.

- Introspection అను ఆంగ్ల పదం Intro (లోపలికి), Spere (తొంగిచూడటం) అను రెండు లాటిన్ పదాల నుండి ఉద్భవించింది.

- దీనిలోని లోపాలు - వ్యక్తి నిష్టత, భాషాలోపాలు, ఉద్వేగాల మార్పులు.

- ఇతరులతో చెప్పుకోలేని మానసిక ప్రక్రియలు (ఉదా:-లైంగిక అనుభవాలు) ను కూడా ఈ పద్దతి ద్వారా పరిశీలించవచ్చు.

- లైటువేస్తూ చీకటిని చూడటం అని ఈ పద్ధతిని విలియం జేమ్స్ విమర్శించారు.

- చిన్నపిల్లలు, మానసికరోగులు, నిరక్షరాస్యులు, మూగవాళ్లు, పశుపక్ష్యాదులు విషయంలో ఇది పని చేయదు.

- ఈ పద్ధతిలో పరిశీలించబడేవాడు - పరిశీలించేవాడు తానే అవుతాడు.


2. పరిశీలన పద్ధతి :

విషయనిష్టతతో, సన్నద్ధతతో, ఆసక్తితో చూడటాన్ని పరిశీలన అందురు.

సహజ పరిశీలన (అనియంత్రత) :- పరిశీలనాంశాలను సహజ పరిస్థితులలో పరిశీలించడం, ఇక్కడ పరిశీలింపబడేవారికి తాము పరిశీలింపబడుతున్నామని తెలియదు. ఉదా:- పావ్లోవ్, స్కిన్నర్, థార్క్, కోహెలర్ ప్రయోగాలు.

నియంత్రణ పరిశీలన (కృతిమ) :- పరిశీలనాంశాలను నియంత్రించి కృత్రిమమైన పరిస్థితులలో పరిశీలించడం, ఇక్కడ పరిశీలింపబడేవారికి తాము పరిశీలింపబడుతున్నామని తెలిసివుంటుంది. ఉదా:- పావ్లోవ్, స్కిన్నర్, థార్ డైక్, కోహెలర్ ప్రయోగాలు.

సంచరిత పరిశీలన (సహభాగి) :- పరిశీలనా సన్నివేశంలో తాను కూడా భాగమై పరిశీలించడం. ఉదా:- పిల్లలతో పాటు ఆటలో పాల్గొని పరిశీలించడం.

అసంచరిత పరిశీలన (సహభాగేతర) :- పరిశీలనా సన్నివేశం నకు దూరంగా ఉండి పరిశీలించడం. ఇటువంటి పరిశీలన ఎవరో కొత్త వ్యక్తి ఉన్నాడని తెలిసిభయాందోళనలకు గురై నిజప్రవర్తన మరగున పడుతున్నప్పుడు చేపట్టాలి. పసిపిల్లలు, జంతువుల, పక్షుల ప్రవర్తనాంశాలను అధ్యయనం చేయుటకు ఈ పద్ధతి శ్రేష్ఠమైనది.

- అమెరికాలోని ఏల్, అయోప యూనివర్సిటీలలో అబ్జర్వేషన్ డోమన్ను గెసెల్ ఏర్పాటు చేసారు.

- అబ్జర్వేషన్ డోమ్ వన్ - వే - విజన్ తెర ఉపయోగిస్తారు.

- అబ్జర్వేషన్ డోమ్ అసంచరిత పరిశీలనకు సంబంధించినది.

- గెసెల్ బాలల వికాస దశలను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ను అమర్చారు.

- పరిశీలన పద్ధతిలో లోపాలు - విషయనిష్టత, ఇగో ఇన్వాల్వెమెంట్


3. వ్యక్తి చరిత్ర పద్ధతి:

- దీనినే సమగ్ర వ్యక్తి పరిశీలన లేదా చికిత్స పద్దతి అని అందురు.

- సమస్యాపూరిత విద్యార్థికి సంబంధించి సమగ్రవిచారణ జరిపి, ఆ వ్యక్తి సమస్యలను నివారించేందుకు ఉపయోగించే పద్దతి వ్యక్తి చరిత్ర పద్దతి - బోని అండ్ హలపిల్మాన్

- వ్యక్తి అధ్యయనం లో రెండు దశలుంటాయి. అవి 1. సమస్య నిర్ధారణ దశ 2. సమస్య నివారణ దశ


4. క్రమాభివృద్ది పత్రం:

-విద్యార్థి సమగ్రాభివృద్ధి పై వ్యాఖ్యానించే పాఠశాల రికార్డు

- సెకండరీ విద్యా కమీషన్ (మొదిలియార్ లేదా మధ్యమిక) దీనిని మొదటిగా ప్రతిపాదించినది.

-భారతీయ విద్యాకమీషన్ (కొఠారీ) దీని అవశ్యకతను పునరుద్ఘాటించింది.

- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1970-71 లో దీనిని ప్రవేశపెట్టింది.

- దీనిలో మూడు భాగాలుంటాయి. 1. విద్యార్థి బోగట్టా 2. ఇంటిని గురించి 3. విద్యా ప్రగతి


5. పరిపృచ్ఛా పద్ధతి :

-“ఒక వ్యక్తి, మరో వ్యక్తితో లేదా వ్యక్తులతో ముఖాముఖి సంభాషించి, వారి నుంచి కావలసిన సమాచారాన్ని రాబట్టి నమోదు చేసి, విశ్లేషించి వాఖ్యానించే పద్ధతిని పరిపృచ్చ పద్దతి అందురు" - మెకాబే

- ప్రశ్నలడిగే వ్యక్తి - పరిపృచ్ఛకుడు

- ప్రశ్నించబడే వ్యక్తి - పరిపృచ్ఛకుడు అని అందురు

-సంచరిత పరిపృచ్ఛముందుగా ప్రశ్నలు తయారు చేసుకుంటారు.

- అసంచరిత పరిషృచ్ఛ - ముందుగా ప్రశ్నలను రచించుకోడు. ఉదా:- యిద్దరు స్నేహితులు మధ్య జరిగే సంభాషణ

-పరిపృచ్ఛ పద్దతిలో ముఖ్యాంశం - సామరస్యం (Rapport)

- అసంచరిత పరిపృచ్ఛను ప్రవేశపెట్టినది - కార్ల్ రోజర్స్


6. పరీక్షా పద్ధతి :

- వ్యక్తుల ప్రజ్ఞ, మూర్తిమత్వ లక్షణాలు, ఉద్వేగ స్థితులు, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, విలువలు మొదలగు వాటిని మాపనం చేయడానికి ఈ పద్దతిని ఉపయోగిస్తారు.

- ఈ పరీక్షలు ఎక్కువగా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ప్రామాణికమైన సాధనాలు


7. సర్వే పద్ధతి:

- ఎక్కువ మంది నుంచి విషయ సేకరణ చేయవలసి వచ్చినపుడు ఈ పద్దతి మంచిది.

ఉదా :- గేలప్ పోల్ - ఇది అమెరికా అధ్యక్షుడుగా ఎవరు ఎన్నికవుతారు అనే విషయంపై అభిప్రాయం సేకరిస్తుంది

.

8. ప్రయోగ పద్ధతి :

- ఉద్దీపనలలో మార్పులు కలుగజేసినపుడు తత్ఫలితంగా ఏర్పడే ప్రతిస్పందనలను కొలవడాన్ని ప్రయోగం అంటారు.

  • ఉద్దీపన - ప్రవర్తనలో మార్పుకు కారణమైనది.
  •  ప్రతిస్పందన - ఉద్దీపనకు వ్యక్తి చూపే ప్రతిచర్యే ప్రతిస్పందన
  •  ప్రయోక్త - ప్రయోగంను నిర్వహించే వ్యక్తి
  •  ప్రయోజ్యుడు - ప్రయోగంనకు గురి అయిన వ్యక్తి

చరాలు :- మార్చడానికి వీలుగా వున్నది లేదా తనంతట తానే మారేది సాధారణ ప్రయోగంలో చరాలు రెండు వుంటాయి.

1. స్వతంత్ర చరం - ఇది ప్రయోక్త ఆధీనం లో వుంటుంది - ఉద్దీపనలను స్వతంత్ర చరాలు అనవచ్చు

2. పరతంత్ర చరం - స్వతంత్ర చరాలకు ప్రయోజ్యుని ప్రతిస్పందనే పరతంత్రచరం

3. మధ్యస్త రం - ఇవి ప్రయోక్త ఆధీనంలో వుండవు (జోక్యం చేసుకొనేచరాలు) ఉదా :- ప్రయోజ్యుల అలసట, విసుగుదల, మానసిక సమస్యలు, భౌతిక పరిస్థితులు, వయస్సు, లింగం, ప్రయోగ పరికరాలు.

- ప్రయోక్త ప్రయోగానికి ముందు జోక్యం చేసుకునే చరాలు స్థిరంగా ఉండేటట్లు చూడాలి.

- సమూహాలు 1. నియంత్రిత సమూహం - ఇది సహజస్థితి 2. ప్రయోగాత్మక సమూహం - ఇది సహజ పరిస్థితికి భిన్నమైనది.

- ఏక సముహ నమూనా : ఈ నమూనాలో ఒక సమూహం ఉంటుంది. ఇది ఒక స్థితిలో నియంత్రిత సముహంగానూ, మరో స్థితిలో ప్రయోగాత్మక సమూహంగా వుంటుంది.

- సమాంతర సమూహ నమూనా :- ఇందులో రెండు సమూహాలుంటాయి. ఒక సమూహం నియంత్రిత స్థితికి, మరొక సమూహం ప్రయోగస్థితికి గురిచేయబడుతుంది.

- పరిభ్రమణ సమూహ నమునా :- ఇందులో రెండు సముహాలుంటాయి. భ్రమణపద్ధతిలో ఒక సమూహం నియంత్రిత స్థితికి, మరొక సముహం ప్రయోగ స్థితికి గురి చేయబడుతుంది.


ప్రయోగపద్దతి ప్రయోజనాలు:

- శాస్త్రీయమైన పద్ధతి.

-విశ్వసనీయత, లక్ష్యాత్మకత (వస్తునిష్టత) ఎక్కువగా ఉంటుంది.

- పరిశోధన ఫలితాలను మళ్లీమళ్లీ సరిచూసుకోవచ్చు.

-కార్యకారణ సంబంధాన్ని నెలకొల్పవచ్చు.


ప్రయోగపద్దతి లోపాలు :

- జోక్యం చేసుకొనే చరాలను అదుపుచేయటం కష్టం.

- యుద్ధాలు, విప్లవాలపై ప్రయోగాలు చేయలేము.


గమనిక:

కన్సాలిడేషన్:

విస్మృతి అనేది తొలి దశలో అధికంగా ఉంటుందని ఎబ్బింగ్ హాస్ చేసిన ప్రయోగాల ద్వారా తెలుస్తుంది. కాని నేర్చుకున్న తరువాత మొదటి నిమిషం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ కాలంలోనే స్మృతి నిర్మాణం ఉంటుంది. ఇటువంటి ప్రక్రియనే కన్సాలిడేషన్ అంటారు. ఈ విషయాన్ని డంకన్ ప్రయోగాత్మకంగా నిరూపించాడు.

జైగార్నిక్ ప్రభావం :

సగంలో ఆపిన పనులు, పూర్తిగా నేర్చుకున్నపనులకంటే బాగా గుర్తుంటాయని చెప్పడాన్నే జైగార్నిక్ ప్రభావం అందురు. జైగార్నిక్ అనే అతను జర్మనీ దేశస్తుడు.

సాధన ప్రేరణ :

- అమెరికాలో వెలుగుచూసిన సాధనాప్రేరణ పూర్తిగా నూతనాంశం.

- మెల్లిలాండ్, అట్కిన్సన్లు సాధన ప్రేరణ మీద పరిశోధనలు చేశారు.

- 'ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం, రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకొని ఉండడమే. '

- మైకెవర్. ఈ వాక్యం సాధనా ప్రేరణకు మంచి ఉదాహరణ.

- సాధన ప్రేరణను మాపనం చేయు పరీక్షలు - TAT, సాధనా ప్రేరణ మాపనలు.

అవధానం:

- ఇతర ఉద్దీపనల పట్ల ఆకర్షితులవక, వాటిని అలక్ష్యం చేసి అవసరమైన ఒకటి లేదా కొన్ని ఉద్దీపనల పట్ల మనస్ను లగ్నం చేయడాన్ని అవధానం అంటారు.

- అవధానంలో ముఖ్యాంశాలు :1. అవధాన క్షేత్రం - మనకు కనిపించే మేర ఉన్న బాహ్య వాతావరణం. 2. అవధాన కేంద్రం : ఒక నిర్ణీత సమయంలో ఏ అంశంపై మనస్సు కేంద్రీకృతం చేస్తామో ఆ అంశం.

- అవధాన కారకాలు : 1. బాహ్య కారకాలు (వస్తురూప కారకాలు) - ఆకారం, తీవ్రత, మార్పు, కొత్తదనం, కదలిక, పునరుక్తి, వైవిద్యం, 2. అంతర్ కారకాలు (స్వీయకారకాలు లేదా వ్యక్తి రూపకారకాలు) - ఆవశ్యకత, వాత్సల్యం, అలవాటు, వైఖరి, అభిరుచి.

- అవధానంలో రకాలు : 1. సంకల్పిత అవధానం. 2. అసంకల్పిత అవధానం

- ఒక లిప్త పాటు కాలంలో ఎంత విషయాన్ని అవధానం చేయగలంఅనే అంశాన్ని అవధాన అవధి అంటారు.


Important Points


  • "మనో విజ్ఞాన శాస్త్రం మొదట తన ఆత్మను. తరువాత తన మనస్సును పొగొట్టుకొంది. చివరికి తన చేతనత్వాన్ని కూడా పొగొట్టుకొని ప్రస్తుతం తన ప్రవర్తనను మాత్రమే నిలుపుకొంది" - ఉడ్వర్త్
  • "మానవ స్వభావంను గురించి అధ్యయనం చేసే శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం" - ఎడ్విన్ జి.బోరింగ్
  • "మానవ స్వభావంను గురించి అధ్యయనం చేసే శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం" - ఎడ్విన్ జి.బోరింగ్
  • "జీవుల బాహ్య అనుభవాలే కాక అంతర్గత ప్రక్రియలను కూడా అధ్యయనం చేయుశాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం" - నార్మన్ ఎల్. మన్
  • మానవుల ప్రవర్తనను ఇతరులతో అతనికి గల సంబంధాలను గూర్చి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం" - క్రో & క్రో
  • "వ్యక్తి తన పరిసరాలకు అనుగుణంగా నిర్వహించే కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం" - ఉడ్ వర్త్
  • "ప్రవర్తనను, అనుభవాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం" - స్కిన్నర్
  • "సంవత్సరాల అపజయాన్ని ఒక క్షణంలో సాధించిన విజయంతో సరిదిద్దుకోవచ్చు." రాబర్ట్ బ్రౌనింగ్.
  • గమ్యంలేని నావలాగా ఆదర్శంలేని సేవ నిరర్ధకం" గాంధీజి.
  • “అసమర్ధులకు అవరోధాలుగా కనిపించేవి, సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి." ఠాగూర్.


No comments:

Post a Comment

Post Bottom Ad