1.1 సమాజ శాస్త్రం - సామాజిక నిర్మితి పరిచయం - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Tuesday, July 4, 2023

1.1 సమాజ శాస్త్రం - సామాజిక నిర్మితి పరిచయం

1.1 సమాజ శాస్త్రం - సామాజిక నిర్మితి పరిచయం


సమాజశాస్త్రంను ఒకప్పుడు సామాజిక తత్త్వశాస్త్రం (Social Philosophy), చరిత్ర యొక్క తత్త్వశాస్త్రం (Philosophy of History), సామాజిక భౌతిక శాస్త్రం (Social Physics) గా పిలిచేవారు. 19వ శతాబ్దం నుండి సమాజ శాస్త్రం (Sociology) ఒక స్వయం ప్రతిపత్తి గల శాస్త్రంగా ఆవిర్భవించింది. ఫ్రాన్స్కు చెందిన 'ఆగస్ట్ కామ్టే'ని సమాజశాస్త్ర పితామహుడి (Father of Sociology) గా పరిగణిస్తారు, వీరే 1839వ సంవత్సరంలో 'Sociology' అనే పదంను మొదటిసారిగా వినియోగించారు. Sociology అనబడే ఆంగ్లపదం 'Socious' అనే లాటిన పదం మరియు 'Logos' అనబడే గ్రీకు పదాల యొక్క కలయిక వలన ఏర్పడింది. లాటిన్ భాషలో Socious అనగా Companion లేదా Associate అనగా సహచరుడు అని అర్థం మరియు గ్రీకు భాష యందు Logos అనగా శాస్త్రం లేదా అధ్యయనం.  కావున  Sociology అనగా సమాజం యొక్క అధ్యయనం లేదా సమాజం యొక్క శాస్త్రంగా అర్థం చేసుకోవచ్చును. జాన్ స్టువర్ట్ మిల్ Sociology నకు బదులుగా Ethnology అనే పదం ఉపయోగించారు. కాని చాలా మంది శాస్త్రవేత్తలు Sociology అనే పదంనే వినియోగించడం వల్ల ఈ పదమే స్థిరపడిపోయింది.


సమాజంను శాస్త్రీయంగా అధ్యయనం చేసే సమాజశాస్త్రం, 19వ శతాబ్దం నుండి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందినప్పటికి, ఇంతకు మునుపే ప్రాచీన శాస్త్రవేత్తల యొక్క రచనలలో సమాజం అధ్యయనం కనిపిస్తుంది. ప్లేటో రాసిన 'రిపబ్లిక్' గ్రంథం నందు మానవుని యొక్క నగర జీవనం గురించి వివరించాడు. అరిస్టాటిల్ రచించిన 'ఎథిక్స్' మరియు 'పాలిటిక్స్' అనే గ్రంథాలలో సమాజం, రాజ్యం మరియు చట్టాల గూర్చి శాస్త్రీయంగా వివరించాడు.


రోమ్కు చెందిన సిసిరో యొక్క 'డీ - అఫీషియస్' అనే గ్రంథం, మాకియవెల్లి రాసిన 'ప్రిన్స్' అనే గ్రంథాలు కూడా సమాజశాస్త్రంనకు సంబంధించిన విషయాలను మౌళికంగా తెలిపినవి. సర్ థామర్ మూర్ వ్రాసిన 'ఉటోపియా' అనే గ్రంథం నందు మానవుల యొక్క దైనందిక సామాజిక సమస్యలు వివరించబడినవి. అడమ్స్మత్ యొక్క 'వెల్త్ ఆఫ్ ద నేషన్స్', కాండర్సెల్ యొక్క ‘Historical Sketch of the Progress of the Human Mind, కాంపినెల్లా యొక్క City of the Sun లాంటి గ్రంథాలు ఆ కాలం నాటి సామాజిక సమస్యలను వివరించినది. ఇటలికి చెందిన 'వీకో' తన గ్రంథం 'దిన్యూసైన్స్' నందు మానవ సమాజం కొన్ని ఉమ్మడి సూత్రాలపై ఆధారపడి ఉంటుందని తెలిపాడు. రామాయణ మహాభారతాలు మరియు పురాణాల యందు మరియు కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం' నందు మరియు జైన బౌద్ధ సాహిత్యాలలోను సమాజశాస్త్ర లక్షణాలున్నవి.


19వ శతాబ్ధం నందు యూరప్లో సమాజశాస్త్రం ఆవిర్భవించుటకు మూడు ప్రధాన కారణాలున్నవి ఇయాన్ రాబర్ట్సన్ తన యొక్క గ్రంథం 'సోషియాలజీ' నందు పేర్కొన్నాడు. అవి...

1. పారిశ్రామిక, ఫ్రెంచి విప్లవాలు

2. ప్రకృతి శాస్త్రాల ప్రగతి మరియు వాటి నుండి లభించిన స్ఫూర్తి

3. భిన్న సాంస్కృతిక సమ్మెళనాలు మరియు వలసవాద వ్యాప్తి


సమాజ శాస్త్రంను లేదా సామాజిక జీవనంను శాస్త్రీయంగా మరియు సమగ్రంగా అధ్యయనం చేయడం ఆగస్టే కామ్టే ప్రారంభమైనది. ఇందుకు 19వ శతాబ్ధంలో వచ్చిన సామాజిక పరివర్తనలైన ఐరోపా విప్లవాలు మరియు పారిశ్రామికీకరణ కారణాలైనవి.


ఆగస్టే కామ్టే చిన్న చిన్న మానవ సమాజాలను అధ్యయనం చేసి 'Positive Philosophy' అనే గ్రంథం రచించాడు. ఈ గ్రంథం ద్వారా భౌతికాంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసినట్లే సమాజంను కూడా శాస్త్రీయంగా అధ్యయనం చేయవచ్చని తెలిపాడు. వీరి తరువాత, హెర్బర్ట్ స్పెన్సర్, కార్ల్ మార్క్స్, ఎమైలేడరైమ్ మరియు ఇతర శాస్త్రవేత్తల కృషి వల్ల సమాజశాస్త్రం పూర్తిస్థాయి సామాజిక శాస్త్రం (Social science) గా స్థిరపడింది.


భారతదేశంలో సమాజశాస్త్రం జి.ఎస్. ఘర్యే, రాథాకమల్ ముఖర్జీ, డి.పి. ముఖర్జీ, డి.ఎన్. మజుందార్, కె.ఎం. కపాడియా, యం.ఎన్.శ్రీనివాస్, ఎస్.సి. ధూబె, MSA రావ్, ఎ.ఆర్. ధేశాయ్ మరియు ఐరావతి కార్యే లాంటి శాస్త్రవేత్తల కృషి ఫలితంగా వృద్ధి చెందింది. జి.ఎస్. ఘర్యే గారిని Founding Father of Indian Sociology గా పరిగణిస్తారు.


సమాజశాస్త్రం నిర్వచనాలు మరియు స్వభావం


'సమాజంను అధ్యయనం చేసేదే సమాజశాస్త్రం అని సాధారణ పరిభాషలో అర్థం చేసుకోవచ్చును’

సమాజాన్ని, సామాజిక సంబంధాలను, సామాజిక శైలులను, సమూహాల్లోని వ్యక్తులను, వారి ప్రవర్తనారీతులను, సామాజిక చర్యలను, సామాజిక సంస్థలను, వాటిలో జరిగే వివిధ సామాజిక ప్రక్రియలను మరియు మార్పులను అధ్యయనం చేసేదే సమాజశాస్త్రం. ఆగస్ట్ కామ్టేసమాజశాస్త్రంను సోషల్ స్టాటిక్స్ మరియు సోషల్ డైనమిక్స్ విభజించాడు. సామాజిక వ్యవస్థ అధ్యయనం సోషల్ స్టాటిక్స్ కాగా సమాజంలో జరిగే మార్పులను సోషల్ డైనమిక్స్ అధ్యయనం చేస్తుంది.


  • ‘భౌతికశాస్త్రాలలో లాగే శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి సమాజాన్ని, సమాజంలోని మానవుని చర్యలను అధ్యయనం చేయడమే సమాజశాస్త్రం - ఆగస్ట్ కామ్టే
  • 'సామాజిక చర్యలపై అవగాహన కలిగించే శాస్త్రమే, సమాజశాస్త్రం - మాక్స్ వెబర్
  • 'సామాజిక సంస్థలు మరియు సామాజిక పరస్పర చర్యలను అధ్యయనం చేసేదే సమాజశాస్త్రం' - డర్క్ హైమ్
  • 'సమాజం ఏ విధంగా వ్యవస్థీకృతమైనది, ఎలా మార్పులకు గురి అవుతున్నది అనే అంశాలను అధ్యయనం చేసేదే సమాజశాస్త్రం - కార్ల్ మార్క్స్
  • 'సమాజం నందు గల విభిన్న సామాజిక నిర్మితుల మధ్య సమైక్యతా శ్రమ విభజనకి దోహదం చేసే మూల సూత్రాలను అన్వేషించేదే సమాజశాస్త్రం - మకైవర్
  • సామాజిక సమూహాలను అధ్యయనం చేసేదే సమాజశాస్త్రం - జాన్సన్
  • సామాజిక సమూహంతో వ్యవహరించే శాస్త్రమే సమాజశాస్త్రం - గిల్లిన్ & గిల్లిన్
  • మానవ సంబంధాల శాస్త్రీయ విషయ పరిజ్ఞానమే సమాజశాస్త్రం - జె.ఎఫ్. క్యూబర్
  • మానవ పరస్పర చర్యలను, పరస్పర సంబంధాలను వాటి స్థితిగతులను ఫలితాలను పరిశీలించేదే సమాజ శాస్త్రం - గిన్స్బర్గ్
  • కుటుంబం, రాజకీయాలు, మతం, సామాజిక నియంత్రణ, పరిశ్రమలు, శ్రమ సంఘాలు, సముదాయాలు, శ్రమ విభజన మరియు సామాజిక విభేదాలు లాంటి అంశాలను అధ్యయనం చేయడమే సమాజశాస్త్రం - స్పెన్సర్
  • సామాజిక సంబంధాలను వివరించేదే సమాజశాస్త్రం - మకైవర్ & ఫేజ్
  • సామాజిక దృగ్విషయాలను అధ్యయనం చేసేదే సమాజశాస్త్రం - ఎల్.ఎఫ్ వార్డ్
  • సమూహాల యందు మానవుల ప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రమే సమాజశాస్త్రం - కింబాల్ యంగ్
  • Sociology is a General Science of Society - కింగ్స్ డేవిస్
  • సామాజిక సంస్థల అధ్యయనమే సమాజశాస్త్రం - డర్క్ హైమ్
  • ఉమ్మడి లేదా సమూహ ప్రవర్తనను అధ్యయనం చేసేదే సమాజ శాస్త్రం - పార్క్
  • సామాజిక సంబంధాల అధ్యయనమే సమాజశాస్త్రం - స్మాల్
  • సామాజిక జీవన అధ్యయనమే సమాజశాస్త్రం - అగ్బర్న్ & నిమ్ కాఫ్


సామాజిక నిర్మితి (Social Structure)


సామాజిక నిర్మితి అనే పదంను మొదటగా ఉపయోగించినవారు హెర్బర్ట్ స్పెన్సర్, మరియు ఏమైల్డర్పం సామాజిక నిర్మితిని ‘Social Phisiology' గా పిలిచాడు. సమాజం నందు గల వివిధ సామాజిక సంస్థలు, విభిన్న పాత్రలు, అంతస్థులు మరియు మానవుల మధ్య పరస్పర సంబంధాలను క్రమబద్దీకరించే వివిధ రకాల ఏర్పాట్లు సమాజంనకు ఆధారంగా నిలుస్తుంటాయి. సమాజం నందలి ఆయా అంశాలనే సామాజిక నిర్మితి అందురు.


H.M జాన్సన్ అనునతడు తన యొక్క సోషియాలజి అనే గ్రంథంలో ఒక సామాజిక వ్యవస్థలో వివిధ అంగాలు తగిన రీతిన వివిధ స్థాయిలయందు పొందుపరిచేవిధానమే సామాజిక నిర్మితి అని పేర్కొన్నారు.


వివిధ సమూహాల మధ్యగల సంబంధంనే సామాజిక నిర్మితి అంటారని 'ఇవాన్ ప్రిచర్డ్' అనే శాస్త్రవేత్త తెలిపారు. సమాజం నందలి వివిధ అంశాలు ఒక క్రమ పద్ధతిలో ఏర్పడి, పరస్పర సంబంధంతో కలిసి పనిచేయడంనే సామాజిక నిర్మితి అంటారని పోర్టెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు.


పునశ్చరణ


  • సోషియాలజీ అనే పదంను మొదటగా ఉపయోగించిన వారు ఆగస్టు కామ్టే
  • మానవుడు సంఘజీవి - అరిస్టాటిల్
  • సామాజిక జీవన అధ్యయనమే సమాజ శాస్త్రం - అగ్బర్న్ & నిమ్ కాఫ్
  • సామాజిక సంబంధాల అధ్యయనమే సమాజ శాస్త్రం - మకైవర్ & ఫేజ్
  • సామాజిక నిర్మితి అనే పదాన్ని మొదటిగా ఉపయోగించిన వారు - హెర్బర్ట్ స్పెన్సర్
  • సామాజిక నిర్మితిని సోషల్ ఫిజియాలజీగా పిలిచినవారు - ఎమైలీ డర్క్ హైమ్
  • సమూహాల మధ్యగల సంబంధమే సామాజిక నిర్మితి అని వాఖ్యానించినవారు - ఇవాన్ ప్రిచర్డ్స్


Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


15 comments:

  1. Exlent notes madam thank you very much

    ReplyDelete
  2. Hlo mam or sir , can u please upload the sociology in English

    ReplyDelete
  3. Thank you so much madam for this easily understandable notes

    ReplyDelete
    Replies
    1. Thanks plz some of papers or previous questions and upload plz

      Delete
  4. Please provide in English sir ,we are oweful to you if you provide in English

    ReplyDelete
  5. Hi sir or mam please uplode english version

    ReplyDelete
  6. Hi sir or mam
    Please uplode english version

    ReplyDelete
  7. Good content Sir or madam

    ReplyDelete
  8. Tnq and set pages with topics pages clearly

    ReplyDelete
  9. Medam bit bank emina unte provided cheyandi

    ReplyDelete
  10. Please provide english version

    ReplyDelete

Post Bottom Ad