2. పెరుగుదల - వికాసం - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Saturday, June 8, 2024

2. పెరుగుదల - వికాసం

 II పెరుగుదల - వికాసం


డి.యస్.సి. సైకాలజీ విభాగంలో ఈ పాఠ్యాంశానికి సంబంధించి 5 నుండి 7 ప్రశ్నలు వస్తున్నాయి. ఈ పాఠ్యాంశంను 7 అంశాలుగా విభజించి వివరించడం జరిగింది.

1. పెరుగుదల - వికాసం - పరిపక్వత

2. అనువంశికత - పరిసరాలు

3. వ్యక్తివికాస దశలు

4. వికాసాంశాలు

5. నైతిక వికాస దశలు

6. సంజ్ఞానాత్మక వికాస దశలు

7. వికాస నియమాలు


1. పెరుగుదల - వికాసం - పరిపక్వత


పెరుగుదల :

  • శారీరక పరిమాణం లో మార్పును తెలుపుతుంది.
  • అంతర్గత భాగాలైన మెదడు, జీర్ణాశయం, జననేంద్రియాలలో వచ్చే మార్పును కూడా తెలుపుతుంది.
  • కొంతకాలం తరువాత ఆగుతుంది.
  • వ్యక్తి వికాసానికి పెరుగుదల పునాది వేస్తుంది.
  • ఇది వికాసం లో ఒక భాగం

వికాసం:

  • వ్యక్తి ప్రవర్తనకు వికాసం ఆధారంగా వుంటుంది.
  • వికాసం = f (పరిపక్వత X అభ్యసనం)


పరిపక్వత:

  • జన్మతః వ్యక్తిలో ఉన్న సహజసామర్ధ్యాలు వయసు తో పాటు క్రమంగా వికసించడాన్నే పరిణతి లేదా పరిపక్వత అంటారు.
  • ఇది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది.
  • అభ్యసనం వల్ల వచ్చే మార్పు పరిణతి కాకపోయినా ఏ చర్యను అభ్యసించాలన్నా దానికి అవసరమయ్యే ముఖ్యకారకం పరిణతి.
  • ప్రత్యేక శిక్షణ ఎంతమాత్రము అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావం కలిగిన చర్యే పరిణతి.
  • పరిణతి జన్యు ప్రభావం వల్ల ఏర్పడుతుంది.
  • వికాసంలో ప్రముఖపాత్ర వహించే అంశం పరిపక్వత


2. అనువంశికత - పరిసరాలు

- వ్యక్తి వికాసనమూనా అనువంశికత, పరిసరాల ప్రభావం వలన ఏర్పడుతుంది.


అనువంశికత:

  • వ్యక్తి పుట్టుకతో వంశపారంపర్యంగా పొందిన లక్షణాలను అనువంశికత అంటారు.
  • అండం, శుక్రకణం తో ఫలదీకరణం చెంది సంయుక్త బీజం (ZYGOTE) తయారువుతుంది.
  • మానవునిలో 23 జతల క్రోమోజోములు వుంటాయి.
  • క్రోమోజోము ఒక సూక్ష్మమైన దారంలా వుంటుంది.
  • క్రోమోజోము లో జన్యువులు వుంటాయి.
  • జన్యువులు ద్వారా అనువంశిక లక్షణాలు సంక్రమిస్తాయి.
  • తల్లి లో సెక్స్ క్రోమోజోములు X - X
  • తండ్రిలో సెక్స్ క్రోమోజోములు X - Y
  • ప్రముఖ అనువంశిక వాది - గాల్టన్
  • అనువంశక వాదులు - గొడ్డార్డ్, కెల్లాగ్
  • రాజవంశీయుల, పండితుల, సంగీత విద్వాంసుల కుటుంబ చరిత్రను పరిశీలించినది - గాల్టన్
  • ప్రజ్ఞలో అనువంశకత ప్రముఖపాత్ర వహిస్తుందని పేర్కొన్నది - గాల్టన్
  • కల్లికాక్ కుటుంబాన్ని పరిశీలించినది - గొడ్డార్డ్
  • తమ బిడ్డ డోనాల్డ్, చింపాంజీ శిశువు గువా లను పరిశీలించినది - కెల్లాగ్ దంపతులు.
  • వ్యక్తిలో మొట్టమొదట ప్రభావం చూపేకారకం - అనువంశికత

పరిసరాలు :

  • ప్రముఖ పరిసరవాది - వాట్సన్
  • పరిసరాలను సమర్ధించినవారు - న్యూమన్, స్కోడక్
  • 19 జతల సమరూప కవలలమీద పరిశోధనలు జరిపినది - న్యూమన్
  • న్యూమన్ పరిశోధనలో ఒకే చోట పెరిగిన సమరూప కవలల మధ్య ప్రజ్ఞాలబ్ధి తేడా - 5.9.
  • న్యూమన్ పరిశోధనలో సమరూప కవలలు వేర్వేరుగా పెరిగినపుడు ప్రజ్ఞా సూచిలో తేడా - 8.2
  • తనకు ఎటువంటి శిశువునిచ్చినా ఆశిశువును దొంగగా లేదా రౌడిగా లేదా మంచి వ్యక్తిగా తీర్చిదిద్ద గలనని పేర్కొన్నది వాట్సన్
  • పెంపుడు శిశువులపై పరిశోధనలు చేసినది - స్కోడక్
  • స్కోడక్ పరిశోధనలో పెంపుడు శిశువుల అసలు తల్లుల సరాసరి ప్రజ్ఞాసూచి - 87.7
  • స్కోడక్ పరిశోధనలో పెంపుడు శిశువుల సరాసరి ప్రజ్ఞాసూచి 116.
  • క్వాకిటల్ సంస్కృతిలో లక్షణాలు - దౌర్జన్య స్వభావం, ఘర్షణ.
  • హోపి సంస్కృతిలో లక్షణాలు- సహకార స్వభావం, సౌమ్యస్వభావం

గమనిక :

  • భౌతిక వికాసంలో ప్రముఖస్థానం ఆక్రమించునది అనువంశకత
  • ప్రజ్ఞలో ప్రముఖస్థానం ఆక్రమించునది - అనువంశకత
  • మూర్తిమత్వ వికాసం, ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం మొదలైన వాటిలో ప్రముఖస్థానాన్ని ఆక్రమించునది
  • పరిసరాలు


3. వ్యక్తి వికాసదశలు

  • వ్యక్తి  వికాసంను పది దశలుగా విభజించినది - ఎలిజబెత్ హార్లాక్
  • నవజాత శిశువు :
  • జననం నుంచి 2 వారాలు వరకు ఉంటుంది.
  • జనన పూర్వ పరిసరానికి, జననాంతర పరిసరానికి మధ్య ఏర్పడిన పరిస్థితిలో సర్దుబాటు చేసుకోవాలి.

శైశవదశ:

  • 2 వారాలు నుండి 2 సం॥ల వరకు ఉంటుంది
  • ఏకాంతర క్రీడ ఈ దశలో ఉంటుంది.
  • హత్తుకునే ప్రవర్తన ఈ దశలో ఉంటుంది.
  • పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది.
  • ఎక్కువ రోగాలు వస్తాయి.
  • శిశుమరణాలు ఎక్కువ.
  • క్లిష్టమైనద
  • ఈ దశలోవారికి సరైన సంరక్షణ అవసరం
  • దంతాలు రావడం 6 నుండి 8 నెలల మధ్య జరుగుతుంది. క్రింద కొరికే పన్ను వస్తుంది 2సం||లు పూర్తి అయ్యేసరికి 16 పళ్ళు వస్తాయి.
  • జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువగా జరుగుతుంది.
  • రంగుల భేదాన్ని గుర్తించడం, వినికిడి జ్ఞానం - 2 నెలలు నుంచి ప్రారంభమౌతుంది.
  • శిశువు మొదట వెల్లకిలా పడుకోవడం, తరువాత బోర్లాపడటం, దోగాడటం, ఆధారం పట్టుకొని నిలబటం, మొదలైన చలన కౌశలాలు గమనించవచ్చు.
  • పాలబుగ్గలు ఏర్పడతాయి
  • "మొక్కై వంగనిది మానై వంగునా !" అనేది ఈ దశకు సంబంధించినది.
  • ఈ దశలో పెరుగుదల శిరోభాగంలో ఎక్కువగా వుంటుంది - సాంఘిక ప్రవర్తన కనపడదు
  • శారీరక మార్పులు అనుపాతంగా జరుగుతాయి.

పూర్వ బాల్యదశ :

  • 3సం॥ నుండి 5సం॥ మధ్య ఉంటుంది.
  • పాఠశాల పూర్వదశ - అభ్యసించేందుకు సిద్దమయ్యే వయస్సు
  • అన్వేషించే వయస్సు,
  • ప్రమాదవయస్సు
  • తోటిపిల్లలతో ఆడుకోవడం
  • ఈ దశలో పిల్లలు చాలా చురుగ్గా వుంటారు.
  • అనుకరించడం ప్రారంభమౌతుంది.
  • తృష్ణ ఈ దశలో ఉంటుంది.
  • "ఆత్మభావన" ప్రారంభమవుతుంది. ఇది సాంఘిక వికాసానికి మొదటి మెట్టు.
  • చిలిపి చేష్టలు చేయడం, వస్తువులను పాడుచేయడం, ఇసుకలో బొమ్మరిల్లు కట్టుకోవడం వంటి సహజాత కార్యక్రమాలు ఈ దశలో ఉంటాయి.
  • ఈ చర్యలు సాంఘిక వికాసానికి పునాది వేస్తాయి.
  • సమాంతర క్రీడ ఈ దశలో ఉంటుంది.
  • పాలబుగ్గలు తగ్గిపోతాయి.
  • ప్రశ్నించే వయస్సు
  • సాంఘిక క్రీడ
  • 5సం|| పూర్తయ్యే నాటికి పాలదంతాలు ఊడిపోవడం మొదలవుతుంది.
  • పిల్లలు అనేక పనులు తమంతట తాముచేయాలని చూస్తారు.
  • పరుగెత్తడం, దూకడం, ఎగరడం మొదలైన నైపుణ్యాలను గమనించవచ్చు
  • స్నేహితులతో జట్లుకట్టుకోవడం లాంటి సాంఘిక చర్యలు ఈ దశలో ప్రారంభమౌతాయి.
  • చొరవ చూపటం తప్పు చేసాననే భావన ఈ దశలో ఉంటుంది.

ఉత్తర బాల్యదశ :

  • 6-10 సంవత్సరాలు మధ్య ఉంటుంది.
  • పాఠశాల దశ.
  • ముఠాదశ.
  • శాశ్వత దంతాలు ఏర్పడతాయి.
  • అనుకరణ ఎక్కువగా వుంటుంది.
  • సాంఘిక ప్రవర్తన పెరుగుదల చెందుతుంది.
  • కొన్ని అభిరుచులు పెంపొందించుకోవడం జరుగుతుంది.
  • రాయడం, పాటలను, పద్యాలను పాడటం, రంగులు వేయడం, తోటపని చేయడం మొ|| నైపుణ్యాలు కనిపిస్తాయి.
  • ఈ దశలో పెరుగుదల ఇంతకు పూర్వపు దశలతో పోల్చి చూస్తే అంతవేగంగా జరగదు.
  • బరువు కూడా అంతవేగంగా పెరగదు.
  • స్వయం పోషకకౌశలాలు, సాంఘిక కౌశలాలు, పాఠశాల కౌశలాలు వికాసం చెందుతాయి.
  • 6-9 సం॥ల వరకు భాషా వికాసంలో చెప్పుకోదగ్గ పెరుగుదల కనిపిస్తుంది.
  • భావాలను వ్యక్తం చేసే నైపుణ్యం, పదజాలాన్ని పెంచుకోవడం ఈ దశలో జరుగుతుంది.
  • బడాయిలు చెప్పుకోవడం, ఇతరులను వెక్కిరించడం, విమర్శించడం మొదలైన చేష్టలు ఈ దశలో గమనించవచ్చు.

యవ్వనారంభ దశ:

  • అనేక శారీరక మార్పులు అకస్మాత్తుగా జరుగుతాయి
  • ప్యూబర్టీ అంటారు - ప్యూబర్టీ అనే పదం "ప్యూబర్టస్" అనే లాటిన్ పదం నుండి పుట్టింది.
  • ఇది నూతన పరిణతి
  • ఈ దశ ఆడపిల్లలో 11 సం॥ల వయస్సులోను, మగపిల్లలో 12 సం॥లలోను ప్రారంభమగును.
  • 1. యవ్వనారంభ పూర్వదశ : యవ్వనారంభాన్ని సూచించే గౌణలైంగిక లక్షణాలు కనిపిస్తాయి. ఇది అపరిపక్వదశ, పునరుత్పాదన దశ ఇంకా ప్రారంభం కాదు.
  • 2. యవ్వనారంభ దశ : పరిపక్వదశ. స్త్రీలలో పిండోత్పత్తి, పురుషులలో శుక్రకణోత్పత్తి ప్రారంభమౌతుంది. శరీర లక్షణాలలో మార్పులు జరుగుతాయి.
  • 3. యవ్వనారంభ ఉత్తర దశ: పునరుత్పాదక అవయవాలు పరిపక్వత పొందుతాయి. లైంగిక అవయవాల వికాసం పూర్తవుతుంది
  • సృష్టికార్యానికి స్త్రీ పురుషులను అనురక్తులుగా చేసేందుకు ఉపయోగపడేవి గౌణలైంగిక లక్షణాలు.
  • హస్తమైథునం ఈ దశలో గమనించవచ్చు.
  • తీవ్రమైన మానసిక ఒత్తిడి ఈ దశలో వుంటుంది.
  • అనేక పనులు చేయాలనీ, సాధించాలని ఈ దశలోని వారు అనుకుంటారు.

పూర్వకౌమార దశ:

  • దీన్నే టీనేజ్ అని కూడా అంటారు.
  • ఇది 13-17 సం॥వరకు ఉంటుంది.
  • ఈ దశలో ఇతరులు చెప్పే ప్రతి విషయాన్ని, చేసే పనిని విమర్శిస్తారు. అనగా వీరిలో విరోధ స్వభావం వుంటుంది.
  • తల్లిదండ్రుల మీద అతి తీవ్రమైన నిరసన భావాలుంటాయి.
  • సంఘాన్ని విమర్శిస్తారు.
  • విశ్రాంతి సమయాన్ని ఒంటరిగా గడపడానికి ప్రయత్నం చేస్తారు.
  • పగటి కలలు కంటూ ఏదో ఒక విషయంపైన కుతుహలం చూపుతారు.
  • లైంగిక విషయాలు గురించి ఆలోచించడం జరుగుతుంది.
  • లైంగిక విషయాలును తెలుసుకోవాలనే ఆత్రుత ఎక్కువగా వుంటుంది.
  • ఉద్వేగ అస్థిరత ఎక్కువగా వుంటుంది.
  • ఉద్వేగ అస్థిరత నుండి స్థిరత్వంలోనికి మారును.
  • ఈ దశలో నైతిక దృక్పధం మూర్తదశ నుండి అమూర్త దశకు చేరుతుంది.
  • ఒత్తిడి వయస్సు అంటారు.
  • సందిగ్ధ వయస్సు.
  • శరీరంలో వచ్చే మార్పుల బాహ్య పరిస్థితుల పట్ల తీవ్రమైన వత్తిడికి గురవుతారు.

ఉత్తర కౌమార దశ:

  • 17,18సం॥ నుండి 21 సం॥ వరకు ఉంటుంది.
  • సాంఘిక ప్రవర్తనలో ఎక్కువ మార్పులు వస్తాయి.
  • భిన్నలైంగిక వ్యక్తులను ఆకర్షించడానికి చేసే ప్రయత్నాలు ఎక్కువగా వుంటాయి.
  • విందులు, వినోదాలు మీద ఎక్కువ అసక్తి వుంటుంది
  • వ్యక్తి నిలకడగా వ్యవహరిస్తాడు.
  • విషయాలను సరిగా అవగాహన చేసుకుంటారు.
  • సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనడం, భిన్న లింగవ్యక్తుల సహచర్యలు, ఇత్యాదివిషయాలలో నిలకడగా ప్రవర్తించడం జరుగుతుంది.

వయోజన దశ:

  • 21-40సం|| మధ్య ఉంటుంది.
  • వ్యక్తి తనకున్న సామర్థ్యాలన్నింటిలోను పరిపూర్ణత పొందుతాడు.
  • ప్రపంచంలో అనుభవాలను పొంది ఒక పరిపూర్ణతను పొందుతారు.
  • శారీరక, మానసిక పెరుగుదల నిలిచిపోతుంది.

మధ్య వయస్సు:

  • 40-60సం||లు మధ్య ఉంటుంది.
  • వ్యక్తులలోని శక్తులు తగ్గుముఖంపడతాయి.
  • పునరుత్పాదక శక్తి ఆగిపోతుంది.
  • స్త్రీలలో ఋతుక్రమం 40-45 సం॥ ల మధ్య ఆగిపోతుంది.
  • ఇది సర్దుబాటు దశ
  • కొంతమందిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది.
  • ఆరోగ్యం కొంతవరకు కుంటి పడుతుంది.

వృద్ధాప్యం :

  • నిష్క్రమణ వయస
  • శారీరక శక్తులు క్షీణిస్తాయి
  • చర్మం ముడతలు పడుతుంది
  • జ్ఞాపకశక్తి మందగిస్తుంది
  • కొంతమంది వృద్ధుల్లో పనిచేయడం తగ్గిపోయి 'సెనైలిటి'కి దారితీస్తుంది.


4. వికాసాంశాలు

  • భౌతిక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక వికాసాలను, వికాసాంశాలు అందురు.
  • వికాంసాంశాల విభజన కృత్రిమమైనది మాత్రమే
  • ఒక వికాసం లో పెరుగుదల ఇంకొక వికాసంలో పెరుగుదలలకు దోహదం చేయవచ్చు లేదా ఆటంకం కలుగచేయవచ్చు.

భౌతిక వికాసం :

  • జ్ఞానేంద్రియ వికాసం, నాడీవ్యవస్థ, శరీరావయవాలలో జరిగే మార్పులు, చలన వికాసం భౌతిక వికాసంలో భాగం.
  • భౌతికఅభివృద్ధి అత్యంత చురుగ్గా జరిగేదశ శైశవదశ
  • భౌతికాభివృద్ధి ఎక్కువగా జరుగుదశ- యవ్వనారంభ దశ
  • భౌతికాభివృద్ధి చాలా తక్కువగా జరుగుదశ - వయోజన దశ, వృద్ధాప్యం,
  • పునరుత్పాదక అవయవాలు పెరుగుదల - కౌమారదశ, దీని వల్ల అన్యలైంగిక శక్తి ఏర్పడుతుంది.
  • 3 సం॥ లకు శిశువు తనకు, తానే మెట్లెక్కడం, దిగడం చేస్తాడు.
  • భౌతిక వికాసంకు అనుగుణంగా పాఠశాలలో వ్యాయామ విద్యను ఏర్పాటు చేయాలి.

మానసిక వికాసం:

  • భాషా వికాసం, ప్రజ్ఞా వికాసం, చింతన, అవధానం, సమస్యాపరిష్కారం, వివేచనం మానసిక వికాసంలో భాగం.
  • ప్రజ్ఞ అనేది పుట్టినప్పుడే నిర్ణయమై వుంటుంది.
  • భాషవల్ల శిశువు తన కోరికలను వ్యక్త పరిచి, అవసరాలను తీర్చుకుంటాడు అని పేర్కొన్నది హాలిడే.
  • పిల్లలలో భాషా వికాసం నాలుగు దశలుగా జరుగుతుంది.

భాషా వికాసదశలు - 1. పూర్వ భాషా దశ 2. ముద్దుపలుకు దశ 3. శబ్దానుకరణ దశ 4. శబ్దగ్రాహ్యక దశ. పూర్వభాషా దశ: - ఇందులో శిశువు తన కిష్టమొచ్చిన రీతిలో శబ్దాలు చేస్తాడు. ఇది 4 నెలల నుంచి 12 నెలల మధ్య జరగవచ్చు.


ముద్దుపలుకులదశ :- శిశువు తన తల్లిదండ్రులను, ఇతర వ్యక్తులను గమనించి కొన్ని శబ్దాలను చేస్తాడు. ఇది 4 నెలల నుంచి 12 నెలల మధ్య జరగవచ్చు.


శబ్దానుకరణ దశ :- 1సంవత్సరం నుంచి 1 1/2 సంవత్సరం వరకు అనుకరణ ద్వారా, నిబంధనం ద్వారా శిశువులో భాషావృద్ధి జరుగుతుంది.


శబ్దగ్రాహ్యక దశ:- 5సం॥ నుంచి 10,12 సంవత్సరాల వరకు శబ్దాలను గ్రహించి వాటికి ప్రతిస్పందించడం జరుగుతుంది.

  • శిశువుకు సంభాషణ సంసిద్దత ఏర్పడటానికి సుమారు 1 1/2 సంవత్సరం పడుతుంది.
  • వయస్సు పెరిగే కొద్దీ పిల్లలలో పదజాలం పెరుగుతూ వుంటుంది - సీషోర్
  • 10సం॥ నాటికి సుమారు 34,300 పదాలేర్పడతాయి.
  • ఉత్తర బాల్యదశలో ఏర్పడే పదజాలలు - ఇతరులను గౌరవించే పదజాలం, సంఖ్యా పదజాలం, ధనానికి సంబంధించిన పదజాలం, నాణేల విలువలు మొదలైనవి. కాలానికి సంబంధించిన పదజాలం మొదలైనవి.

ఉద్వేగ వికాసం :

  • ఉద్వేగమంటే జీవి శరీరం, మనస్సు చలించే స్థితి.
  • ఉద్వేగ వికాసం మీద పరిశోధనలు చేసినది - బ్రిడ్జస్
  • మొట్టమొదట ఏర్పడే భావోద్వేగం - ఉత్తేజం
  • 3 నెలలు వయస్సులో ఉత్తేజంతో పాటు ఏర్పడే ఉద్వేగాలు - విచారం, ఆహ్లాదం.
  • 6 నెలలు వయస్సులో విచారం విభజన చెంది ఏర్పడే ఉద్వేగాలు - కోపం, విసుగు, భయం.
  • అసూయ శిశువులో ఎంత వయసుకు ఏర్పడుతుంది - 1సం॥
  • ఆహ్లాదము విభజన చెంది ఏర్పడే ఉద్వేగాలు - ఉప్పొంగటం, వాత్సల్యం
  • భయాన్ని నాలుగు రకాలుగా వర్గీకరించినది - లోటన్
  • అవి: 1. కొన్ని వస్తువులకు సంబంధించిన భయాలు 2. ప్రత్యక్ష అనుకరణ ద్వారా భయం ఏర్పడుట 3. బాధాకరమైన అనుభవాల ద్వారా భయాలు ఏర్పడటం. 4. వయస్సు తో పాటు ఏర్పడే భయాలు.
  • ప్రాక్ పాఠశాల వయసున్న పిల్లలకు పరిసరాలలో యేయే సన్నివేశాలు కోపాన్ని కలిగిస్తాయో పరిశీలన ద్వారా వ్యక్తపరిచినది - రికెట్స్
  • అసూయ అనేది విచారకరమైన భావోద్రేకం
  • సహోదర స్పర్ధ అసూయకు కారణమౌతుంది.
  • తల్లి శిక్షణావిధానం, పిల్లల పట్ల తల్లి వైఖరి అసూయ మీద ప్రభావం చూపుతుందని పేర్నొన్నది - సీవెల్
  • వ్యాకులత అనేది జరగబోయే కుంఠనం వల్ల జరుగుతుంది.
  • నిద్ర, జీర్ణశక్తి తగ్గిపోవుటకు కారణమైన ఉద్వేగం - వ్యాకులత

సాంఘిక వికాసం :

  • పాఠశాల పూర్వపు శిశువు లో ఒంటరి ఆటలు (ఏకాంతర క్రీడల పట్ల ఆసక్తి వుంటుంది.
  • ఏకాంతర క్రీడ 2 సం॥ వరకు వుంటుంది.
  • 2 సం॥ల తరువాత పిల్లలు సమాంతర క్రీడల్లో పాల్గొంటారు.
  • సమాంతర క్రీడలో పిల్లలు ఒకరిని అనుసరించి మరొకరు ఆడుకొంటారు.
  • 3,4 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి పిల్లలు సాంఘిక క్రీడలలో పాల్గొంటారు.
  • సాంఘిక వికాసం పెంపొందించడానికి సహపాఠ్యకార్యక్రమాలు, బాలభటులు, గర్ల్ గైడ్స్, ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్. లును నిర్వహించాలి.


5. నైతిక వికాస దశలు

  • హర్వార్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
  • ప్రతివ్యక్తి నైతికత్వం అతని సంజ్ఞానాత్మక వికాసం, సామాజిక అనుభవాలపై ఆధారపడి వుంటుంది.
  • నైతిక వికాసంలో కోల్బర్గ్ మూడు స్థాయిలను చెప్పాడు.
  • నైతిక వికాసం చాలా మందకోడిగా జరుగుతుంది.

పూర్వసాంప్రదాయ స్థాయి :

  • ఈ దశలో శిశువు ఏది మంచి ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు అనేది వాటి పరిణామాల ను బట్టి ఆలోచిస్తాడు.
  • నైతిక న్యాయం స్వీయకేంద్రీకృతంగా వుంటుంది.

సాంప్రదాయ స్థాయి :-

  • ఇది కౌమారదశ వచ్చేటప్పటికి ఏర్పడుతుంది.
  • ఇక్కడ కుటుంబంలోని, సమాజం లోని ఇతర వ్యక్తులు దేనిని ఆశిస్తారు అనేది మంచి, చెడును నిర్ణయిస్తుంది.
  • ఇక్కడ మంచి ప్రవర్తన అంటే ఇతరులను సంతోష పెట్టేది, ఇతరులకు సహాయపడేది.
  • ఇక్కడ సరియైన ప్రవర్తన అంటే ఎవరి బాధ్యతను వారు నిర్వర్తించడం, అధికారాన్ని గౌరవించడం, సాంఘిక క్రమబద్ధత నెలకొల్పడం.
  • సాంప్రదాయమైన నైతిక విలువ ఏర్పడుతుంది.
  • సంఘంలోని సభ్యులంతా ఒక నియమం అనుకున్నపుడు, దానిని అనుసరించాలని అనుకుంటారు.
  • సంఘంలోని వ్యక్తులు ప్రమాణాలుగా అంగీకరించిన వాటిని వీరు అనుసరిస్తారు.
  • నైతిక న్యాయం స్వీయాకేంద్రీకృతం కోల్పొతుంది.
  • ఈ దశలో నైతిక నమ్మకాలు నమ్యతగా ఉండాలి. అంటే నైతిక ప్రమాణాలను మార్పు చేయడం.
  • నైతిక దృక్పథం మూర్తదశ నుంచి అమూర్తదశకు మారుతుంది.

ఉత్తర సాంప్రదాయ దశ:

  • ఈ దశ లో వ్యక్తులు విశ్వవ్యాప్తమైన నైతిక విలువలు అనుసరించాలిని అనుకొంటారు.
  • వీరి ప్రకారం విశ్వజనీనమైన నియమాలు అంటే న్యాయం, సమానత్వం, మానవులను గౌరవించడం మొదలైనవి వుంటాయి.
  • ఇతరుల కోసం, సంప్రదాయాలకోసం లేదా సామాజిక నియమాలు, కట్టుబాట్ల కోసం నిర్ణయాలు తీసుకోవడం జరగదు.
  • తాను నిర్ధారించుకున్న నైతిక నియమాల ప్రకారం నడుచుకుంటాడు.

గమనిక:

  • పూర్వ బాల్యదశలో నైతికాభివృద్ది మందికొడిగా జరుగుటకు కారణం - ప్రజ్ఞావికాసం
  • పూర్వబాల్య దశలో వారు ఏది తప్పు, ఏది ఒప్పు అనేది నిర్ణయించలేక పోవడానికి కారణం వీరిలో ప్రజ్ఞావికాసం పూర్తికాకపోవడం.
  • పూర్వ బాల్యదశలో నేర్చకున్న విషయాలు త్వరగా మరచిపోవడానికి కారణం- ధారణ చాలా తక్కువగా వుండటం.
  • పిల్లలు కొన్ని నియమాలు యాంత్రికంగా శిరసావహించుదశ పూర్వ బాల్యదశ.
  • ఉత్తర బాల్య దశలోని శిశువుకు కొన్ని సమయాలలో అబద్ధం చెప్పడం అనేది ఎంత మాత్రం తప్పుకాదు.
  • నైతికాభివృద్ధి పూర్తిగా జరగాలంటే మూడు విషయాలు జరగాలి.
  • 1. ప్రత్యేకమైన నైతిక భావలను తొలగించి, సామాన్య నైతిక భావనలను ఏర్పాటు చేసుకోవడం.
  • 2. నైతిక నియమావళి ఏర్పాటు చేసుకోవడం.
  • 3. తమ ప్రవర్తనపై అదుపు ఏర్పరచుకోవడం.


6. సంజ్ఞానాత్మక వికాసం

  • వ్యక్తి తన గురించి, పరిసరాలను గురించి తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడంను సంజ్ఞానాత్మకత అంటారు.
  • పరిసరాలలో ఉన్న వస్తువులతో సర్దుబాటు చేసుకోవడం కోసం పిల్లలు, పెద్దలు ఉపయోగించుకొనే సంజ్ఞానాత్మక నిర్మితులను లేదా ప్రవర్తనా నమూనాలను స్కిమోటాలంటారు.
  • సంజ్ఞానాత్మక ప్రకారాల కింద స్కిమోటాలు వుంటాయి.
  • అప్పుడే పుట్టిన శిశువులో స్కిమోట కింద - అసంకల్పిత ప్రతీకార చర్యలు వుంటాయి. ఉదా:- పట్టుకొనే అసంకల్పిత ప్రతికారచర్య. చూసే ప్రతిచర్య
  • స్కిమోటలో మార్పులు జరగడానికి కారణం - వ్యవస్థీకరణ, అనుకూలత
  • సంజ్ఞానాత్మక వికాసం అంటే వ్యక్తి ప్రజ్ఞలో వికాసం జరగడం.
  • పియాజే సంజ్ఞానాత్మక వికాశదశలు - నాలుగు
  • సంజ్ఞానాత్మక వికాసం వయసు పై ఆధారపడదు గాని దశపై ఆధరాపడుతుందని పియాజే చెప్పారు.

సంవేదన - చాలక దశ :

  • దీనినే ఇంద్రియ చాలకదశ అంటారు.
  • పుట్టినపుడు నుంచి 2సం॥ వరకు జరుగుతుంది.
  • శిశువు తనకు యితర వ్యక్తులకు మధ్య తారతమ్యం తెలుసుకుంటాడు.
  • ప్రపంచంలోని వస్తువులను గురించి అవగహన చేసుకుంటాడు.
  • వస్తువులను అందుకోవడం, పట్టుకోవడం చేస్తాడు.
  • మొదట శిశువుకు వస్తువు శాశ్వతమైనదని తెలియదు.
  • ఈ దశలోనే వస్తుస్థిరత్వ భావన ఏర్పడుతుంది.
  • శిశువులో అనుకరణ ప్రారంభమవుతుంది.
  • శిశువులో అహం 10 నెలలప్పటికి ఏర్పడుతుంది.
  • 4,8 నెలలు మధ్య శిశువు ఒక గిలకను ఆడించి శబ్దంను వింటాడు.
  • 8,12 నెలల మధ్య తల్లి చేసిన శబ్దాలను అనుకరిస్తాడు.
  • 12,18 నెలల మధ్య ఆట వస్తువులను కిందపడేసి ఆనందిస్తాడు.

పూర్వప్రచాలక దశ :

  • దీనినే ప్రాక్ ప్రచాలక దశ అని కూడా అంటారు.
  • ఈ దశ 2సం|| నుండి 7 సం॥ మధ్య వుంటుంది.
  • శిశువు బాషనుపయోగించడం నేర్చుకొని పరిసరాల గురించి అవగాహన ఏర్పరచుకుంటాడు.
  • స్వీయకేంద్రీకృత ఆలోచనలు, స్వార్థ కేంద్రీకృత ఆలోచనాలు వుంటాయి.
  • ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఆపాదిస్తారు.
  • బొమ్మలకు స్నానం చేయడం, సీసాతో పాలు త్రాగించడానికి ప్రయత్నం చేయడం, జోలపాడి నిద్రపుచ్చడం గమనించవచ్చు.
  • సూర్యుడు, చంద్రుడు ప్రాణం గలవని భావిస్తారు.
  • శిశువుకు పూర్వక్రమాయుత తెలియదు.
  • ఏకమితి ఈ దశ యొక్క ముఖ్య లక్షణం.

మూర్త ప్రచాలక దశ :

  • ఈ దశ 7 నుండి 12 సం॥ల మధ్య వుంటుంది.
  • వాస్తవిక, తర్కంతో కూడిన ఆలోచనలు ప్రారంభమౌతాయి.
  • వీరి ఆలోచనలు మూర్త విషయాలకే పరిమితం.
  • ఏదైన విషయాన్ని కంటితో చూస్తేగాని అవగహన చేసుకోలేరు.
  • ఈ దశలో పదిలపరుచుకునే భావన ఏర్పడుతుంది.
  • పూర్వక్రమానుయుత భావన ఏర్పడుతుంది.
  • వర్గీకరణ శక్తి, విశ్లేషణ శక్తి అభివృద్ధి చెందుతాయి.
  • ఈ దశలో భావనల కన్సర్వేషన్ క్రింది విధంగా జరుగుతుంది.
  • సంఖ్యలకు సంబంధించినది - 6సం॥లకు
  • బరువుకు సంబంధించినది - 9 సం॥లకు
  • కాలానికి సంబంధించినది - 9 సం॥లకు

అమూర్త ప్రచాలక దశ :

  • దీనినే నియత ప్రచాలక దశ అని కూడా అంటారు.
  • ఈ దశ 12 సం॥ నుండి మొదలవుతుంది.
  • ఈ దశలో చింతనం అమూర్త విషయాల పట్ల కూడా జరుగుతుంది.
  • ప్రకల్పన - నిగమనాత్మక వివేచనం జరుగుతుంది.
  • శాస్త్రీయ చింతనకు సంబంధించినది.
  • ఈ దశలో శిశువు కొన్ని ప్రకల్పనలు పేర్కొని వాటిని నిరూపించడానికి లేదా తిరస్కరించడానికి ఆధారాలు సేకరిస్తాడు.
  • శిశువుకు కార్యకారక సంబంధం గురించి ఆలోచన జరుగుతుంది.
  • ఒక సమస్యకు అనేక పరిష్కారాలుంటాయని తెలుసుకుంటాడు.
  • విభిన్న ఆలోచన వుంటుంది.

గమనిక:

  • ఒక వస్తువు ఆకారం మారినా, పరిస్థితి మారినా దాని గుణాలు మారకపోవడాన్ని పూర్వక్రమాయుత అంటారు. దీనినే కన్సర్వేషన్ అని, బహుళనిత్యత్వ భావన అని కూడా అంటారు.
  • ఏకమితి అంటే శిశువు ఒకే విషయాన్ని గమనించడం.


7. వికాస నియమాలు

క్రమానుగత నియమం :- ప్రతీ జీవిలో ఒక నిర్థిష్టమైన క్రమంలో వికాసం సంభవిస్తుందని ఈ నియమం తెలుపుతుంది.

ఉదా:- శిశువులో మొదట బంగరటం తరువాత కూర్చోటం, ఆధారం పట్టుకొని నిలబడటం క్రమంగా జరుగుతాయి.


విద్యా ప్రాముఖ్యత :- 1. అక్షరమాల నేర్పిన తరువాత గుణింతాలు నేర్పడం

2. అంకెలను నేర్చుకున్న తరువాత చతుర్విద ప్రక్రియలను నేర్చుకోవడం

3. వృత్తం గీయడం నేర్పిన తరువాత చతురస్రం గీయడం నేర్పడం


సంచిత నియమం :- వికాసం అవిచ్ఛన్నంగా జరిగే సంచిత ప్రక్రియ. శారీరక మార్పులైనా, మానసిక మార్పులైనా ఒక్కసారిగా సంభవించక గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పుల చేర్పుతో జరుగుతుంది. ఉదా:- పళ్ళు రావడం


విద్యా ప్రాముఖ్యత :- 1. అక్షరమాలను ఆధారంగా చేసుకొని గుణింతాలను నేర్చుకొనుట

2. అంకెలను ఆధారంగా చతుర్విద ప్రక్రియలను నేర్చుకోవడం


సులభం నుంచి జటిల నియమం :- నిలబడడం, నడవడం లాంటి తేలిక పనులనుంచి మెట్లెక్కడం, సైకిల్ తొక్కడం వంటి కఠినమైన పనులు చేయడం సాధ్యమవుతుంది.


విద్యా ప్రాముఖ్యత :- 1. మూడవ తరగతిలో ఒక పాఠం యొక్క ప్రాధమిక అంశాలను బోధించి ఐదవ తరగతిలో ఆ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను బోధించడం.


సాధారణ నుండి నిర్దిష్ట నియమం :- వయసుతో పాటు సంభవించే అసూయ, కోపం, భయం లాంటి నిర్దిష్ట ఉద్వేగాలు అభివృద్ది చెందే ముందు నవజాత శిశువలో సర్వసాధారణ ఉద్రిక్తత అనే ఒకే ఒక ఉద్వేగ రీతి ఉంటుంది.


విద్యా ప్రాముఖ్యత :- 1. ప్రాధమిక స్థాయిలో సాంఘిక అధ్యయనం ను ఉన్నత దశలో ప్రత్యేక శాస్త్రాలుగా బోధించడం

2. ఆడవాళ్ళందరిని అమ్మ అనుకొని వయసు పెరిగే కొద్ది ఆడవాళ్ళలో తమ తల్లిని గుర్తించడం


శిరః పాదాభిముఖ నియమం :- వికాసం తలనుంచి ఆరంభమై కింది శరీర భాగాలకు విస్తరిస్తుందని ఈ నియమం తెలుపుతుంది. ఉదా : - గర్భస్థ శిశువులో తల ఏర్పడిన తరువాతనే ఇతర అంగాలు ఏర్పడు-తాయి.


సమీప దూరస్థ నియమం :- వికాసం దేహ మధ్యస్థ భాగాన ఆరంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుందని ఈ నియమం తెలుపుతుంది. ఉదా :- శైశవ దశలో ఏదైన ఒక వస్తువును అందుకొనేందుకు భుజాలు, మోచేతులు ఉపయోగించిన తరువాతనే మణికట్టును చేతి వేళ్ళను ఉపయోగిస్తారు.


ఏకీకృ నియమం :- వికాసాంశాలన్ని కలిసి ఒకేసారి అభివృద్ధి చెందుతాయిని ఈ నియమం తెలుపుతుంది.


విద్యా ప్రాముఖ్యత :- పాఠశాలలో బోధనాభ్యసన కృత్యాలు ఈ నియమాన్ని సంతృప్తి పరిచేవిధంగా ఉండాలి.


శాస్త్రవేత్తలు - దేశాలు



Important Points

  • "శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది." - గాంధీజ
  • వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన ఆలోచన, ప్రవర్తనలో మార్పులు రావడం. ఇది జీవసంబంధిత, పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుంది" - క్రైగ్.
  • పరిపక్వత అనేది జన్యుప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పని చేస్తుంది." - గెస్సల్.
  • "పరిపక్వత అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికాయుతంగా జరుగుతుంది." - క్రైగ్
  • “నువ్వెంత కష్టపడి పని చేస్తావో చెప్పొద్దు. ఎంత పని పూర్తయిందో చెప్పు" - బెర్నార్డ్ షా.
  • "యువకులకు నేను మూడే మూడు సలహాలిస్తాను. శ్రమించడం, శ్రమించడం, శ్రమించడం" - బిస్మార్క్
  • "జీవితాన్ని యుద్ధభూమిలా భావించి పోరాటం చేయ్. జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోగలవు. భగత్ సింగ్.
  • “విద్య మానవుడిని వివేకవంతుడుగా మారుస్తుంది."- స్వామి వివేకానంద.
  • “ప్రయత్నిస్తేగాని మనమేం చేయగలమో మనకి తెలియదు." - పాస్కల్.
  • "విజయానికి రహదారి ఎల్లప్పుడూ నిర్మాణంలోనే ఉంటుంది." - ఆర్నాల్డ్ పాల్మర్.
  • "కష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో దానిని అధిగమిస్తే ఆ మనిషికి చేరుతుంది." - నెహ్రూ.



No comments:

Post a Comment

Post Bottom Ad