3. అభ్యసనం - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Monday, June 10, 2024

3. అభ్యసనం

 III అభ్యసనం


డి.యస్.సి. సైకాలజీ విభాగంలో ఈ పాఠ్యాంశానికి సంబంధించి 9 నుండి 10 ప్రశ్నలు వస్తున్నాయి. ఈ పాఠ్యాంశంను 9 అంశాలుగా విభజించి వివరించడం జరిగింది.

1. అభ్యసనం - లక్షణాలు

2. అభ్యసనాన్ని నిర్ణయించే కారకాలు

3. అభ్యసన సిద్ధాంతాలు

4. అభ్యసన వక్రరేఖలు

5. అభ్యసనా బదలాయింపు - రకాలు

6. అభ్యసనా బదలాయింపు - సిద్ధాంతాలు

7. భావన

8. స్మృతి

9. విస్మృతి


1. అభ్యసనం లక్షణాలు

  • అభ్యసనం సార్వత్రికమై, ప్రతిజీవిలో జరుగుతుంది.
  • జీవిత పర్యంతం జరిగే ప్రక్రియ
  • అభ్యసనం ఒక ప్రక్రియ, ఫలితంకాదు.
  • అభ్యసన ఫలితం ప్రవర్తనలో సంభవించే మార్పు.
  • ఈ ప్రవర్తనలో మార్పు శాశ్వతమైనది.
  • అభ్యసనం అనుభవంద్వారా, ఆచరణ ద్వారా, శిక్షణ ద్వారా వస్తుంది.
  • ఇది ప్రయోజనాత్మకమైంది.
  • ఇది గమ్యనిర్దేశికమైంది.
  • అభ్యసన ఫలితం మంచి లేదా చెడ్డ కావచ్చు
  • ప్రవర్తనలో అన్ని విషయాలను అభ్యసనం ప్రభావితం చేస్తుంది.
  • అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ.
  • అభ్యసనం సంచిత స్వభావం గలది.
  • అభ్యసనం శారీరక పెరుగుదల, మానసిక పరిణతిపై ఆధారపడి వుంటుంది.
  • అభ్యసన రేటు, అభ్యసన వేగం అందరిలోను ఒకేలాగ, ఒకరిలోనైనా అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు.
  • సహజప్రక్రియలు అయిన పరిపక్వత, పెరుగుదల వలన వచ్చిన మార్పులు అభ్యసనం లో భాగం కాదు.


2. అభ్యసనాన్ని నిర్ణయించే కారకాలు

  • అభ్యసనాన్ని నిర్ణయించే కారకాలు మూడు అవి సంసిద్ధత, పరిపక్వత, ప్రేరణ.

సంసిద్దత :

  • అభ్యసనం లో ముఖ్యపాత్ర వహించే అంశం - సంసిద్ధత.
  • హెర్బర్ట్ తయారు చేసిన బోధన పద్దతిలో మొదటి దశ విద్యార్ధుల్ని సంసిద్దం చేయడం.

పరిపక్వత:

  • పరిపక్వతను అనుసరించి అభ్యసనం జరుగుతుంది.
  • విద్యార్ధి పరిపక్వతను దృష్టిలో పెట్టుకునే బోధనా కార్యక్రమాలను ఏర్పాటుచేయాలి.
  • శిశువుకు 5 సం||రాలు వచ్చినపుడే పాఠశాలలో చేర్చడం అనేది ఏ అభ్యసన కారకానికి సంబంధించినది - పరిపక్వత.
  • పాఠశాల పూర్వ విద్యలో కొన్ని పాటలు, ఆటలు మాత్రమే ప్రవేశపెట్టడం అనేది పరిపక్వతకు సంబంధించినది.
  • మాంటిస్సోరీ, కిండర్ గార్డెన్ పద్దతులు పరిపక్వత కారకాన్ని సమర్ధిస్తున్నాయి.
  • ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు మూర్తచింతనకు సంబంధించిన కార్యక్రమాలు ఏర్పాటు చేయటం పరిపక్వత కారకాన్ని సమర్ధిస్తున్నాయి.
  • ఉన్నత స్థాయిలో విద్యార్థులకు అమూర్తచింతనకు సంబంధించిన కార్యక్రమాలను కూడా జోడించవచ్చు అనేది పరిపక్వత కారకాన్ని సమర్ధిస్తున్నాయి.

ప్రేరణ:

  • అభ్యసనానికి రాచబాట - ప్రేరణ
  • వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే శక్తి, ఉత్సాహంను పెంపొందించేది - ప్రేరణ
  • ప్రేరణ అనేది వ్యక్తి అవసరాలతో ముడిపడి వుంటుంది.
  • అవసరాలు రెండు రకాలు 1. ప్రాధమిక అవసరాలు 2. గౌణ అవసరాలు.
  • ప్రాధమిక అవసరాలంటే వ్యక్తి మనుగడకు అవసరమైన ఆహారం, నీరు, నిద్ర, వ్యాయామం మొదలైనవి.
  • గౌణ అవసరాలంటే సాంఘికావసరం, గౌరవ అవసరం. ఉదా: రక్షణావసరం, సాంఘికావసరం, గౌరవ అవసరం.
  • అభ్యసనంలో ప్రేరణా ప్రభావాన్ని గురించి పేర్కొన్నది - హర్లాక్
  • హర్ లాక్ నాలుగు ఎలుకుల సమూహలపై ప్రయోగం చేసారు.
  • హర్లాక్ ప్రయోగంలో
  1. 1 వ సమూహం ఎలుకలు - ఆకలి, దప్పిక కలిగి వుంటాయి.
  2. 2వ సముహం ఎలుకలు - ఆకలి మాత్రమే వుంటుంది.
  3. 3 వ సముహం ఎలుకలు - దప్పిక మాత్రమే వుంటుంది.
  4. 4వ సముహం ఎలుకలు - ఆకలి, దప్పిక కలిగి ఉండవు.


3. అభ్యసన సిద్ధాంతాలు

  • అభ్యసనం ఎలా సంభవిస్తుందో పేర్కొన్న సిద్ధాంతాలను అభ్యసన సిద్ధాంతాలు అంటారు.
  • అభ్యసనం సిద్ధాంతాలు రెండు రకాలు 1. సంసర్గ వాద సిద్ధాంతాలు. 2. సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు.
  • ఉద్దీపన, ప్రతిస్పందనల మధ్య లేదా గత, ప్రస్తుత అనుభవాల మధ్య సంసర్గం ద్వారా అభ్యసనం జరుగుతుందని తెలిపే సిద్ధాంతాలను సంసర్గవాద సిద్ధాంతాలు అంటారు.
  • సంసర్గవాద సిద్ధాంతాలు - నిబంధన సిద్ధాంతాలు, యత్న - దోష పద్దతి, నిబందనోద్ధిత అభ్యసనం, గత్రి, హాల్ సిద్ధాంతాలు.
  • వ్యక్తి యొక్క సంజ్ఞానాత్మకత పై ఆధారపడి అభ్యసనం జరిగే సిద్ధాంతాలను సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు అంటారు.
  • సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు - అంతర్ దృష్టి అభ్యసనం, క్షేత్ర సిద్ధాంతం, సాంకేతిక సిద్ధాంతం


  • పరిశీలన అభ్యసనం
  • శిక్షణా సిద్ధాంతం.

నిబంధనం:

  • “ఒక ఉద్దీపనకు, వస్తువుకు లేదా పరిస్థితికి అంతకు ముందు లేనటువంటి ఒక స్వభావ సిద్ధంకాని ప్రతిస్పందనను కల్పించడాన్ని నిబంధనం అంటారు"- డ్రైవర్
  • నిబంధనం అనే ప్రక్రియను ప్రవేశపెట్టినది - ఇవాన్ పావ్లోవ్ (రష్యా)
  • ఇవాన్ పావ్ లోవ్ జంతు శరీర ధర్మ శాస్త్రవేత్త
  • జీవి ప్రవర్తనకు దోహదం చేసే మార్పులను కలిగించే ఏ విషయాన్నైనా ఉద్దీపన అంటారు.
  • ఉద్దీపన కు ఇచ్చే ప్రతిచర్యను ప్రతిస్పందన అంటారు.
  • నిబంధనం రెండు రకాలు . అవి 1. శాస్త్రీయ నిబంధనం 2. కార్యసాధక నిబంధనం.

శాస్త్రీయ నిబంధనం:

  • శాస్త్రీయ నిబంధనం ను మొట్టమొదట జంతు శరీరధర్మ శాస్త్రంలో ఇవాన్ పావ్లోవ్ ప్రతిపాదించెను.
  • నిబంధిత ప్రతిక్రియా చర్యను నిరూపించుటకు పావ్లోవ్ చేసిన ప్రయోగాల ఫలితమే - శాస్త్రీయ నిబంధనం.
  • శాస్త్రీయ నిబంధనం ను ఫిజియాలజీ నుంచి సైకాలజీకి అన్వయించినది - వాట్సన్
  • పావ్ లోవ్ కుక్కల మీద ప్రయోగం చేసి శాస్త్రీయ నిబంధనంను ప్రవేశ పెట్టెను.
  • సహజ ఉద్దీపనకు బదులుగా ఒక అసహజ ఉద్దీపనను ఉపయోగించి అదే సహజ ప్రతిస్పందనను తెప్పించి అభ్యసన ప్రతిస్పందనగా మలిచి ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చే ప్రక్రియను "శాస్త్రీయ నిబంధనం" అంటారు.
  • ఒక సారి ఒక సన్నివేశాన్ని అనుభవించిన వ్యక్తి రెండవసారి ఆ సన్నివేశం పూర్తిగా అనుభవం లోకి రాకముందే మొదటిసారిలాగ ప్రతిస్పందన చూపితే దాన్ని "శాస్త్రీయ నిబంధనం" అంటారు.

పావ్లోవ్ ప్రయోగం :

  • కుక్కపై ప్రయోగం చేసెను.
  • ఈ ప్రయోగం మూడు దశలుగా వుంటుంది.


పై ప్రయోగంలో ...

  • సహజ ఉద్దీపన (నిర్నిబంధిత ఉద్దీపన) - ఆహారం
  • సహజ ప్రతిస్పందన (నిర్నిబంధిత ప్రతిస్పందన) - ఆహారంనకు లాలాజలం స్రవించడం
  • అసహజ ఉద్దీపన (నిబంధిత లేదా కృత్రిమ ఉద్దీపన) - గంట
  • అసహజ ప్రతిస్పందన (నిబంధిత లేదా కృత్రిమ ప్రతిస్పందన) - గంటకు లాలాజలం స్రవించడం.
  • శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంను నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం అని కూడా అంటారు.
  • శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఉద్దీపనకు ఎక్కువగా ప్రాముఖ్యత నిస్తుంది. కావున దీనిని S-TYPE THEORY అందురు.
  • శాస్త్రీయ నిబంధనం లో ప్రతిచర్యను రూపొందించేది - నిర్మింబంధిత ఉద్దీపన (ఆహారం)
  • శాస్త్రీయ నిబంధనం లో కుక్క దేనికి ప్రతిస్పందిస్తుంది - నిబంధిత ఉద్దీపన (గంట)


శాస్త్రీయ నిబంధనం - నియమాలు :


పునర్బలన నియమం :- సహజ ఉద్దీపనకు, అసహజ ఉద్దీపనను జోడించడం వల్ల నిబందనం ఏర్పడుతుంది. ఈ జోడించడం ఎంత ఎక్కువగా వుంటే అంత బలంగా నిబంధిత ప్రతిస్పందన ఏర్పడుతుంది. దీనినే పునర్బలనం అంటారు.


విరమణ :- ప్రయోగాత్మకంగా ఒకసారి నిబంధనం జరిగిన తరువాత అసహజ ఉద్దీపన ఇచ్చి, సహజ ఉద్దీపన యివ్వడం మానిస్తే క్రమేణా నిబంధనం నశించడాన్ని విరమణ లేదా విలుప్తీకరణ అంటారు.


అయత్నసిద్థస్వాస్వం :- ప్రయోగత్మకంగా నిబంధనం విరమణ చేసినప్పటికి ఒక్కొక్కసారి నిబంధన చర్య ఉన్నట్లుండి బల్పడటాన్ని అయత్న సిద్ధ స్వాసం అందురు.


విచక్షణ :- ఒక ప్రత్యేకమైన ఉద్దీపనకు మాత్రమే నిబంధనం జరిగితే దానిని విచక్షణ అందురు.


సామాన్యీకరణం :- ఒక సారి ఒక ఉద్దీపనకు నిబంధనం జరిగినపుడు అదే ఉద్దీపనను పోలిన ఉద్దీపనలకు కూడా నిబంధనం విస్తరించడం జరిగితే దానిని సామాన్యీకరణం అంటారు.


ఉన్నత క్రమనిబంధనం :- ఒక గంట శబ్దానికి లాలాజలం ఊరటం అనే ప్రక్రియను నిబంధనం చేసిన తరువాత గంటతో పాటు ఒక దీపాన్ని జతపరచినపుడు ఆదీపానికి కూడా లాలాజలం ఊరడాన్ని ఉన్నత క్రమనిబంధనం అందురు.


నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన ల మధ్య గల సంబంధం :- వీటి వలనే అభ్యసనం జరుగుతుందని శాస్త్రీయ నిబంధనం పేర్కొంటుంది. ఈ రెండింటి మధ్యకాలం 0.5 సెకెండ్స్ ఉండాలి.


కార్యసాధక నిబంధనం:

  • దీనిని ప్రతిపాదించినది - బి.ఎఫ్.స్కిన్నర్
  • దీనిని పరికరాత్మక లేదా యాంత్రిక నిబంధన సిద్ధాంతం అని కూడా అందురు.
  • స్కిన్నర్ ఈ సిద్ధాంతం ను ప్రతిస్పందన ఆధారంగా రూపొందించెను.
  • స్కిన్నర్ ప్రతిస్పందనలను రెండు రకాలుగా పేర్కొన్నారు అవి:
  1. రాబట్టిన ప్రతిస్పందనలు - ఇవి ఉద్దీపనలకు ప్రతిచర్యగా వచ్చేవి
  2. బయటకు వదిలిన ప్రతిస్పందనలు - ఇది ఉద్దీపనలు లేకపోయిన వచ్చే ప్రతిచర్యలు (నిరుద్దీపన ప్రతిచర్యలు)
  • స్కిన్నర్ ప్రకారం కార్యసాధక నిబంధనం ఏర్పడుటకు కారణమైన ప్రతిస్పందనలు - బయటకు వదిలిన ప్రతిప్పందనలు.

స్కిన్నర్ ప్రయోగం :- పావురాలు, ఎలుకలు పై ప్రయోగం చేసారు.

- మీట - నిబంధిత ఉద్దీపన

- మీటనొక్కడం - నిబంధిత ప్రతిస్పందన (యాదృచ్ఛికంగా జరుగుతుంది)

- ఆహారం - సహజ ఉద్దీపన

- ఆహారం తినడం - సహజ ప్రతిస్పందన

  • స్కిన్నర్ ప్రయోగంలో ముందుగా మీటనొక్కడం అనే ప్రతిస్పందనను ఎలుక లేదా పావురం వదిలినపుడే ఆహారం అనే ఉద్దీపన యివ్వడం జరుగుతుంది.
  • ఈ సిద్ధాంతంలో ముందుగా ప్రతిస్పందన వదలబడుతుంది. కావున దీనిని R-TYPE THEORY అందురు.

కార్యక్రమయుత బోధన:

  • కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఆధారంగా విద్యారంగంలో వచ్చిన నూతన బోధన విధానం - కార్యక్రమయుత బోధన.
  • కార్యక్రమయుత బోధన అనేది ఒక స్వీయ బోధన విధానం.
  • కార్యక్రమయుత బోధన లో ఉపయోగించు యంత్రం - బోధనా యంత్రం
  • బోధనాయంత్రంను కనుగొన్నది - ప్రెస్సి.
  • బోధనా యంత్రంను అభివృద్ధి పరిచినది - స్కిన్నర్.

శాస్త్రీయ - కార్యసాధన నిబంధనల మధ్య భేదాలు :



నిబంధిత అభ్యసనం :

  • పావ్లోవ్ శాస్త్రీయ నిబంధిత ప్రతిచర్యను మనస్తత్వ శాస్త్రానికి అన్వయించి వాట్సన్ నిబంధిత అభ్యసనంను రూపొందించాడు.
  • వాట్సన్ ఆల్బర్ట్ అనే 11 నెలలు శిశువుపై ప్రయోగం చేసి నిబంధిత అభ్యసనం ను రూపొందించాడు.

యత్న- దోష పద్ధతి :

  • దీనిని ప్రతిపాదించినది - ఎడ్వర్డ్ లీ. థార్ డైక్.
  • ఇది సంసర్గవాదం లేదా సంధానవాదం యొక్క ప్రధాన సృష్టి.
  • దీనినే ఉద్దీపన - ప్రతిస్పందన సిద్ధాంతం అంటారు.
  • S-R సైకాలజీ అందురు.
  • దీనినే కనక్షనలిజం అందురు.
  • ఈ సిద్ధాంతం ప్రకారం అభ్యసనం అనేది ఒక సంధానం ద్వారా జరుగుతుంది.


థారన్ డైక్ ప్రయోగం :- ఈయన పిల్లి పై ప్రయోగం చేసెను.

థారన్ డైక్ ప్రయోగంలో ఉత్సుకత (అవసరం), గమ్యం చేరే యత్నం, చేరే దారిలో ఆటంకాలు, త్వరితగతిన వ్యర్థ కదలికలు, ఒక్కసారిగా యాధృచ్ఛిక విజయం సాధించడం దాని ఆధారంగా విజయానికి తోడ్పడని వ్యర్థ కదలికలను విసర్జించి, విజయవంతమైన చర్యలను (ప్రతిస్పందనలు) ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఇలా అనేక ప్రయత్నాలలో దోషాలు తగ్గి అభ్యసనం సాధ్యపడటం జరుగుతుంది. కావున దీనిని ' విజయపధ వరణరీతి అభ్యసనం' అంటారు.

  • థారన్ డైక్ ప్రయోగం వల్ల క్రొత్త విషయం నేర్చుకోవడం ఒక్కసారిగా కష్టసాధ్యమని, నాలుగైదు ప్రయత్నాలు చేయాలని థారన్ డైక్ పేర్కొనెను.
  • చలన కౌశలాలు అన్నీ కూడా యత్నదోష పద్దతి ఆధారంగా నేర్చుకోవటం జరుగుతుంది. ఉదా:- సైకిల్ తొక్కడం, ఈతకొట్టడం, టైప్ రైటింగ్, మొదట పలకపై వ్రాయడం.

అభ్యసన నియమాలు :

  • వీటిని ప్రతిపాదించినది - థారన్ డైక్
  • అభ్యసన ప్రధాన నియమాలు మూడు

1. ఫలిత నియమం:

- ఈ నియమం ప్రకారం అభ్యసనం ఫలితాన్ని బట్టి ఉంటుంది.

- ఒక ఉద్దీపనకు, ప్రతిస్పందనకు మధ్య సంధానం ఏర్పడినపుడు సంతృప్తికరమైన పరిస్థితి నెలకొన్నపుడు ఆ సంధానం పటిష్టమౌతుంది.

- ఫలిత నియమం ప్రకారం తరగతి గదిలో ఏర్పరిచే అనుభవాలు సంతృప్తికరంగా ఉండాలి.

-విద్యార్థుల అవసరాలకు తగినట్లు బోధనాంశాలను సవరించాలి.

- విజయంతో కూడిన నియోజనాలు యివ్వాలి.

-బహుమతులు, ప్రసంశలు ఏర్పాటు చేయాలి.

- బోధిస్తున్న అంశంపై విద్యార్థి సంశయం అడిగినపుడు ప్రోత్సాహకంగా స్పందించి ఉపాధ్యాయుడు పొగడ్తతో కూడిన సమాధానం చెప్పాలి.


2. సంసిద్ధత నియమం :-

- థారన్ డైక్ ప్రతిపాదించిన అత్యంత ఆమోదయోగ్యమైన సూత్రం ఇది.

- ఏవైనా భౌతిక మానసిక చర్యలు జరపాలంటే అవి నిర్వర్తించేందుకు కనీసంగా అవసరమైన స్థాయిలో శారీరక, మానసిక పెరుగుదల ఉండాలని ఈ నియమం పేర్కొంటుంది.

- తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు బోధన చేయడం అనేది ఈ నియమం పేర్కొంటుంది.


3. అభ్యాసనియమం :

- ఈ నియమంలో రెండు సూత్రాలు ఇమిడి వున్నాయి.

1. ఉపయోగత నియమం - ఒక విషయాన్ని పదే పదే ఉపయోగించినపుడు అభ్యసనం పటిష్టమౌతుంది.

2. నిరుపయోగ నియమం - ఒక విషయాన్ని ఉపయోగించకుండా ఉన్నపుడు అది నిరుపయోగమవుతుంది.

- నిరుపయోగ నియమం చలనకౌశలాలకు వర్తించదు.

- అభ్యాసనియమం డ్రిల్లును, ఇంటి పనిని ప్రోత్సహిస్తుంది.

- ఇది పునఃస్మరణను సమర్ధిస్తుంది.

- సమర్థవంతమైన అభ్యసనం నకు అమితంగా దోహదం చేసేది - పునఃస్మరణ.


అంతర్ దృష్టి సిద్ధాంతం:

  • ఈ సిద్ధాంతంను గెస్టాల్ట్ వాదులు (సంజ్ఞానాత్మకవాదులు) ప్రవేశపెట్టారు.
  • గెస్టాల్ట్ వాదులు - మాక్స్ వర్థిమిర్, కర్ట్ కోప్కా, డబ్ల్యూ. జి. కోయిలర్
  • గెస్టాల్ట్ వాదులు జర్మనీ కి చెందినవారు.
  • గెస్టాల్ట్ అనే జర్మన్ భాషా పదానికి అర్థము - సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృత మొత్తము
  • ఒక అంశము లోని విడివిడిభాగాలు జ్ఞానం కంటే ఆ అంశాన్ని మొత్తంగా అధ్యయనం చేస్తేనే సమగ్రజ్ఞానం సంభం అనేది గెస్టాల్ట్ వాదుల భావన.
  • గెస్టాల్ట్ వాదులు ప్రధానంగా అధ్యయనం చేసిన రంగాలు - అవధానం, ప్రత్యక్షం, అభ్యసనం ఎక్కువగా
  • అంతర్ దృష్టి అభ్యసన సిద్దాంతాన్ని రూపొందించిది - గెస్టాల్ట్ వాది అయిన కోయిలర్
  • కోయిలర్ యత్న - దోష పద్ధతిలోని లోపాలు ఆధారంగా అంతర్ దృష్టి అభ్యసన సిద్ధాంతంను ప్రతిపాదించెను.
  • యత్నదోష పద్ధతిపై కోయిలర్ చేసిన విమర్శలు: 1. సమస్యా కఠిన స్థాయి. 2. అంశాల పరిజ్ఞానలేమి 3. అంశాల సమన్వయ అవకాశలేమి
  • కోయిలర్ తన ప్రయోగంలో ఉపయోగించిన జంతువు - చింపాంజీ (సుల్తానా)
  • కోయిలర్ చింపాంజీలను ఎన్నుకొనుటకు కారణం - మెదడు నిర్మాణములోను, పరిమాణంలోను మానవుడిని పోలి వుండుటవలన మరియు మానవుని తరువాత తెలివైన జంతువు చింపాంజీ.
  • కోయిలర్ తన ప్రయోగాలను 1914లో టెనరీఫ్ దీవులలో నిర్వహించెను.
  • కోయిలర్ తన ప్రయోగ ఫలితాలను వివరించు గ్రంథం - మెంటాలటీ ఆఫ్ ఏఫ్స్.

కోయిలర్ ప్రయోగంలో మొదట చిన్న కర్రతో ప్రయత్నించడం - విఫలమవడం, తరువాత పెద్ద కర్రతో ప్రయత్నించడం విఫలమవడం, తరువాత పరిస్థితి సంపూర్ణంగా, సమగ్రంగా ఆలోచిస్తూ కర్రలతో ఆడుకోవడం, యాదృచ్ఛికంగా ఆ రెండు కర్రలు కలిసి పెద్ద కర్రగా మారడం, అప్పుడు వెంటనే చింపాంజీ, ఆ పెద్ద కర్రతో అరటిపండ్లును తీయవచ్చు అనే ఆలోచన కలగడం (ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ) జరిగింది.

  • ఇలా సమస్యకు పరిష్కారం ఉన్నట్లుండి మెరుపులాగ వచ్చే దానినే అంతర్ దృష్టి అభ్యసనం అందురు.
  • ఈ సిద్ధాంతం ప్రకారం అభ్యసనానికి కారణం మెదడులో మెరుపులా జనించిన పరిష్కారమార్గం. అంతర్ దృష్టి అభ్యసన ముఖ్య లక్షణాలను పేర్కొన్నది - యర్న్స్

  1. ఎదురైన సమస్యను, సమస్యా సన్నివేశాన్ని సంపూర్ణంగా, నిశితంగా పరిశీలించాడు.
  2. మనసంతటిని లగ్నం చేసి అవధానం చేయడం, సమస్యలోని జరిలత గూర్చి ఆలోచిచడం, కాసేపు విరమణ యివ్వడం.
  3. అవసరమైన ప్రతిస్పందనలు సరిగా లేకపోతే ప్రత్యమ్నాయ ప్రయత్నాలు చేయడం.
  4. గమ్యం వైపు చూపు సాగించి తీక్షణంగా యోచన చేయడం.
  5. హఠాత్తుగా ప్రత్యక్షంగా సరైన ప్రతిస్పందన యివ్వడం.
  6. మళ్ళీ అదే ప్రతిస్పందనను యిచ్చేందుకు సిద్దం కావడం.

  • ప్రాజెక్ట్ పద్దతిలోను, సమస్య పద్దతిలోను అంతర్ దృష్టి అభ్యసనం ఉపయోగపడుతుంది.
  • అంతర్ దృష్టి సిద్ధాంతం ప్రకారం అభ్యసనం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే - అర్థసహితంగా (Meaningful) బోధించేటప్పుడు.
  • అర్థవంతమైన బోధన, అర్ధవంతమైన అభ్యసనం.
  • విద్యార్థులకు విషయాలను బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు వ్యవస్థాపనం మీద దృష్టికేంద్రీకరించాలని పేర్కొన్న సిద్దాంతం - అంతర్ దృష్టి సిద్ధాంతం.

పరిశీలనాభ్యసనం :

  • ఒక వ్యక్తినిగాని, ఒక పరిస్థితిని గాని అనుకరించడవలన, పరిశీలించడం వలన జరిగే అభ్యసనాన్ని అనుకరణఅభ్యసనం లేదా పరిశీలన అభ్యసనం అందురు.
  • ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లలు, పెద్దలను పాత్ర క్రీడ ద్వారా అనుకరిస్తారు.
  • ఈ సిద్ధాంతం సాంఘికీకరణలో ప్రముఖపాత్ర వహిస్తుంది.
  • ఈ సిద్ధాంతం ను ప్రతిపాదించినది - బండూర (కెనడా)
  • బండూర ప్రకారం పిల్లలకు సరైన నమూనాలుండాలి.
  • దీని ప్రకారం ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులకు ఆదర్శప్రాయుడుగా ఉండాలి.
  • పరిశీలన అభ్యసన విధానాన్ని తెలియజేసిన ఆద్యులు - మిల్లర్, డిల్లార్డ్
  • మిల్లర్, డిల్లార్డ్ రచించిన పుస్తకం - సామాజిక అనుకరణ అభ్యసనం
  • బండూర గ్రంథం Social Learning & Personality Development, Psychological Modeling

బ్రూనర్ శిక్షణా సిద్ధాంతం :

  • ఏ అంశం మూల సూత్రాలైన ఏ వయస్సులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అనే ప్రాదమిక సూత్రం ఆధారంగా జెరోమ్ బ్రూనర్ అనే మనస్తత్వవేత్త ప్రతిపాదించిన సూత్రమే - బ్రూనర్ బోధనా సిద్దాంతం.
  • ఈ సిద్ధాంతం లోని ప్రధానాంశాలు - విద్యార్ధి ఆసక్తి, కుతుహాలం,
  • ఈ సిద్ధాంతం ప్రకారం ఉపాధ్యాయుడు పర్యవేక్షిస్తు సలహా పూర్వకమైన పాత్రను మాత్రమే స్వీకరించాలి.
  • విద్యార్థికి స్వీయ అభ్యసనంకి ఎక్కువ ప్రాముఖ్యాన్ని కల్పించాలి.
  • స్వీయాభ్యసనం, పర్యవేక్షితాభ్యసనం కూడా ఉంటుంది.


4. అభ్యసన వక్రరేఖలు

ఇవి ప్రధానంగా మూడు రకాలు.

  • ఒక నిర్ధిష్ట సన్నివేశంలో అభ్యసనం ఏవిధంగా జరుగుతుందో రేఖాపటంలో చూపడాన్ని అభ్యసన వక్రరేఖ అంటారు.

1. కుంభాకార వక్రరేఖ : 

  • ఈ రేఖ మొదట అభ్యసనం చాలా వేగంగా వుండి, సమయం గడిచే కొలది అభ్యసనం వేగం తగ్గడం చూపిస్తుంది.
  • అభ్యసనాంశము తేలికగా వుండి అటువంటి అభ్యసనాంశాలతో అభ్యాసకునికి పూర్వ పరిచయం వుంటే అభ్యసనరేఖ కుంభాకారంగా వుంటుంది.
  • కుంభాకార వక్రరేఖ అవరోహణ వక్రరేఖ అని కూడా అందురు.

2. పుటాకార వక్రరేఖ : 

  • ఈ రేఖ అభ్యసనం తొలుత నెమ్మదిగా జరుగుతున్నట్లు సమయం గడిచిన కొలది దాని ప్రగతి అంతకంతకూ ఎక్కువ జరుగుతున్నట్లు చూపుతున్నది.
  • అభ్యసనాంశం కొత్తదైనప్పుడు లేక ప్రారంభలో కష్టతరమైనప్పుడు అభ్యసన వక్రరేఖ పుటాకారంగా ఉంటుంది.
  • పుటాకార వక్రరేఖకు ఆరోహణ వక్రరేఖ అని కూడా అందురు.

3. మిశ్రమ వక్రరేఖ (పుటాకార - కుంభాకార వక్రరేఖ):

  • పై రెండు వక్రరేఖ లక్షణాలు కలిగి ఉంటుంది.

లాక్షనిక అభ్యసన వక్రరేఖ:


ఎ. ప్రారంభ స్పూర్తి : అభ్యసనం చాలా వేగంగా జరుగుతుంది.


బి. చాంచల్య దశ : అభ్యసన వేగంలో హెచ్చుతగ్గులు లేదా ఒడుదుడుకులు వస్తాయి.


సి. పీఠభూమి దశ : ఇది అభ్యసన ప్రక్రియలో కీలకమైన దశ.

  • ఈ దశలో అభ్యసనం స్తంభించి ఎటువంటి పురోగమం లేకుండా నిలిచిపోతుంది.
  • ఈ దశలో అభ్యసనం నిలిచిపోవుటకు కారణాలు -లోపభూయిష్టమైన అధ్యయన పద్ధతులు, కష్టమైన అభ్యసనాంశం, అలసట చెందడం, అభ్యసనా శక్తి లేకపోవడం.
  • అభ్యసనలో ఈ దశను తొలగించుటకు మార్గాలు సమర్థవంతమైన బోధనా పద్ధతులను అనుసరించడం, ఆశక్తిని రేకెత్తించడం.
  • ఈ దశలో అభ్యసన వక్రరేఖ x- అక్షానికి సమాంతరంగా ఉంటుంది.

డి. పీఠభూమి తరువాత స్ఫూర్తి : పీఠభూమి దశను అధిగమించి ఈ దశలో అభ్యసనం పుంజుకుంటుంది.


ఇ. శారీరక ధర్మ హద్దు (ద్వితీయ స్పూర్తి) : ఈ దశ చేరిన తరువాత వ్యక్తి ఎంత ప్రయత్నించిన అభ్యసనాన్ని మెరుగుపర్చుకోలేడు.


5. అభ్యసన బదలాయింపు - రకాలు

అభ్యసన బదలాయింపంటే ఒక స్థితిలో జరిగిన అభ్యసనం, పూర్తిగాగానీ, పాక్షికంగాగానీ ఇతర పరిస్థితులకు అనుప్రయుక్తంకావడం గారెట్


అభ్యసన బదలాయింపులో నాలుగు రకాలున్నాయి - అవి


1. అనుకూల బదలాయింపు :- ఒక రంగంలో నేర్చుకున్న నైపుణ్యం ఇంకొక రంగంలో తోడ్పడటాన్ని అనుకూల బదలాయింపు అందురు.

ఉదా: కారు నడపడంలో యిచ్చిన శిక్షణ ట్రాక్టర్ నడపడంలో సహాయ పడటం, టైపు కొట్టడం వచ్చిన వ్యక్తి కంప్యూటర్ సులభంగా నేర్చుకోవడం. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతాన్ని సులభంగా నేర్చుకోవడం.


2. వ్యతిరేక బదలాయింపు:- ఒక వ్యక్తికి ఒక రంగంలో యిచ్చిన శిక్షణ ఇంకొక రంగంలో అభ్యసనానికి ఆటంకం కలిగించడాన్ని వ్యతిరేక బదలాయింపు అంటారు.

ఉదా:- తెలుగు లేదా హిందీ నేర్చుకున్న వాళ్ళు ఇంగ్లీషు నేర్చుకోవడం చాలా కష్టం.

House అనే ఇంగ్లీష్ పదానికి బహువచనం Houses అని నేర్చుకున్న విద్యార్ధి.

Mouse అనే పదానికి బహువచనం Mice బదులు Mouses అని పలకడం.


3. శూన్య బదలాయింపు:- ఇక్కడ ఎటువంటి బదలాయింపు జరగదు.

ఉదా: ఆటలలో ప్రతిభ చూపడం, పాఠ్యాంశాలలో ప్రతిభ చూపడం.


4. ద్విపార్శ్వ బదలాయింపు :- ఒక వైపు చేతితో నేర్చుకున్న విషయం లేదా కౌశలాన్ని ఇంకొక చేతితో చేయడానికి దోహదం చేయడాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటారు.

ఉదా : ఒక చేతితో బాణాలు వేయడం బాగా వస్తే రెండో చేతితో కూడా బాణాలు వేయడం.

ఏకపార్శ్వ బదలాయింపు కుడిచేతితో చేసిన పనిని, కుడికాలితో కూడా చేయడాన్ని ఏకపార్శ్వ బదలాయింపు అందురు.

ఉదా : కుడి చేతితో చేసిన పనిని, కుడికాలు తో కూడా చేయడం.


6. అభ్యసన బదలాయింపు - సిద్ధాంతాలు


1. విద్యుక్త క్రమశిక్షణా సిద్ధాంతం: ఇది చాలా పురాతన సిద్దాంతం. దీని ప్రకారం మనస్సులో కొన్ని విభాగాలుంటాయి. అవి :

వివేచన

పరిశీలన

సైన్స్

ఏకాగ్రత

లెక్కలు


2. సమరూప మూలకాల సిద్ధాంతం : ఇ.ఎల్. థారన్ డైక్

  • రెండు విషయాల మధ్య సారుప్యం వుంటే బదలాయింపు జరుగుతుంది.
  • విషయంలో సారూప్యం, వైఖరిలో సారూప్యం, పద్దతిలో సారూప్యం కావచ్చును.
  • గణితశాస్త్ర నైపుణ్యం సక్రమంగా వుంటే దీన్ని యాంత్రిక, సాంకేతిక విద్యలకు బదలాయింపు చెయవచ్చు. 
  • భాషా సూత్రాలలో సారూప్యం వల్ల శిక్షణ బదలాయింపు జరుగుతుంది.

3. సామాన్యీకరణ సిద్ధాంతం: చార్లెస్ జడ్

  • సామాన్యీకరణ వల్ల అభ్యసన బదలాయింపు సక్రమంగా జరుగుతుంది.
  • జెడ్ తన ప్రయోగంలో రెండు సమూహాలు తీసుకున్నాడు - అందులో ప్రయోగ సమూహానికి పరావర్తన సిద్ధాంతం గురించి వివరించాడు.
  • ఈ సిద్ధాంతం ప్రకారం విద్యార్థులకు సూత్రాలు నేర్పించడం, సిద్ధాంతాలు నేర్పించడం చేయాలి. ఉదా : ఒక మోటరు కారు ఇంజన్ ను బాగు చేయగలిగిన మెకానిక్, మోటరు బోటును బాగుచేయగలుగుతాడు.

4. ఆదర్శాల సిద్ధాంతం : బాగ్లే

  • దీనికి సామాన్యీకరణ సిద్ధాంతానికి పోలికలు ఉన్నాయి.
  • దీని ప్రకారం ఒక విషయం ప్రాముఖ్యాన్ని, ప్రాధాన్యతను గుర్తించడం వల్ల ఒక వైఖరి విధానం రూపొందించబడుతుంది. ఆ వైఖరి విధానం అభ్యసన బదలాయింపుకు మూలమవుతుంది. ఉదా : ఇంటిలో పరిశుభ్రతను పాటించే వ్యక్తి ఆఫీసులో కూడా పరిశుభ్రత పాటిస్తాడు.

5. ట్రాన్స్పోజిషన్ సిద్దాంతం : గెస్టాల్టు వాదులు

  • ఈ సిద్ధాంతం ప్రకారం వ్యవస్ధానికి సమస్తానికి మధ్య వుండే సంబంధాన్ని కొత్త పరిస్థితులలో కూడా అవలంబించి బదలాయింపు చేయడం జరుగుతుంది.
  • గెస్టాల్ట్ వాదులు సూత్రాలుగాక సంబంధాలను ముఖ్యంగా పరిగణిస్తారు.
  • బట్టీ అభ్యసనం కాకుండా విద్యార్థులు అర్థ సహితంగా నేర్చుకోనేటట్లు చూసినచో వారిలో అంతర్ దృష్టి ఏర్పడుతుంది.


7. భావన

  • వివిధ వస్తువులు మధ్య సంబంధాన్ని, పరిస్థితులకు, సంఘటనలకు మధ్య గల సంబంధాన్ని ప్రతీకల ద్వారా తెలపేదాన్ని భావన అందురు.
  • మూర్త భావనలు ఉదా: కుక్క, పుస్తకం, పర్వతం, (కంటికి కనిపించేవి)
  • అమూర్త భావనలు - ఉదా : దేశభక్తి, పాపం, న్యాయం (కంటికి కనిపించనివి)
  • భావనలు ఏర్పడడానికి గతానుభావాలు దోహదం చేస్తాయి.
  • పిల్లలు పెరిగె కొద్ది భావనలు అనేక రకాలైన అర్థాలతో కూడిన మాటల ద్వారా ఏర్పడతాయి.
  • భావనా వికాసం ముఖ్యంగా రెండు పద్దతులలో జరుగుతుంది.

  1. అమూర్తీకరణ - ఇందులో ఒక వస్తువు, ఒక సంఘటనకు సంబంధించిన వివిధ విషయాలను విశదపరచడం జరుగుతుంది. ఉదా:- ఏనుగును చూసి దాని గురించి చెప్పడం.
  2. సామాన్యీకరణ - ఆకాశంలో ఎగిరేవన్నీ పక్షులని పేర్కొంటారు. కాని ఆకాశంలో ఎగిరేవన్ని పక్షులు కావు. గబ్బిలాలు పక్షులు కాకపోయినా ఎగురుతాయి.

  • భావనా వికాసానికి మూడు ముఖ్య కారణాలు పేర్కొనవచ్చును.

  1. ప్రజ్ఞ - భావనా వికాసానికి ప్రజ్ఞ చాలా ముఖ్యం
  2. జ్ఞానేంద్రియ లోపం - దీని వలన భావనా వికాసం కుంటిపడుతుంది.
  3. మూర్తానుభావాలు - పిల్లలలో మొట్టమొదట ఏర్పడే భావనా వికాసం అతని మూర్తానుభావాల మీద ఆధారపడి వుంటుంది. ఆ తరువాత విద్య వల్ల, చలన చిత్రాలు చూడడం వల్ల వివిధానుభావాలు వల్ల భావనా వికాసం పెంపొంది  అమూర్త భావనలు కూడా ఏర్పడతాయి.

  • పిల్లల వయస్సు, ప్రజ్ఞ, వాళ్లకిచ్చిన అవకాశాలు మొదలయిన వాటి ప్రభావం వారి భావనల మీద పడుతుంది.

భావనలు - రకాలు :

1. సంఖ్యాభావనలు : టెర్మన్, మెర్రిల్ ప్రకారం సంఖ్య భావనలు క్రింది విధంగా ఉంటాయి.

4 సం॥ల - రెండు వస్తువులు

5 సం॥ల - నాలుగు వస్తువులు

6 సం॥ల - పన్నెండు వస్తువులు లెక్కించే సామర్థ్యం వస్తుంది.

  • సంఖ్యాభావనలు పెంపొందిచడంలో అభ్యసనం, శిక్షణ కల్పించే అవకాశాలు మొదలయిన వాటి ప్రభావముంటుంది.
  • మగపిల్లల కంటే ఆడపిల్లలలో సాధారణంగా సంఖ్యాభావనా వికాసం ఎక్కువగా వుంటుంది.

2. కాలానికి సంబంధించిన భావనలు:

  • కాలం అనేది అమూర్త భావన.
  • పిల్లలలోకాలానికి సంబంధించిన భావన, సంఖ్యా భావన వికాసం మీద చాలా వరకు ఆధారపడి వుంటుంది.
  • 5సం॥ల తరువాత పిల్లలకు కాలానికి సంబంధించిన భావనలు కొంతవరకు ఏర్పడతాయి.

3. ప్రాదేశిక భావనలు :

  • కౌమారదశ వచ్చేటప్పటికి గాని, వ్యక్తులు రెండు వస్తువులు మధ్య దూరాన్ని సరిగా అంచనావేయలేరు.
  • ఈ భావనలు చాలా వరకు శిక్షణ, గత అనుభవాలు, అందుబాటులో వుంటే అవకాశాలు మొ|| వాటి మీద ఆధారపడివుంటాయి.
  • 5సం||లకు గాని పిల్లలకు కుడి, ఎడమల తేడా తెలియదు.
  • తూర్పు, పడమరల మొదలయిన దిశలను గుర్తించడం ప్రాథమిక పాఠశాల వయస్సులో అభివృద్ధి చెందుతుంది.

4. జీవితం - మరణం పట్ల భావనలు :



5. ఆత్మభావన : అనగా నేనేమిటి అనే భావన.

  • ఆత్మభావన సక్రమంగా వున్న వ్యక్తులలో వ్యాకులత తక్కువగా వుంటుంది. సర్దుబాటు సామర్థ్యం ఎక్కువ.
  • ఇతరులతో సరియైన సంబంధాలను వ్యక్తి ఏర్పరచుకుంటారు.
  • వీరిలో నిజాయితీ కూడా ఎక్కువ.
  • ఇది అన్నింటి కంటే ముందుగా ఏర్పడుతుంది.

6. బరువుకు సంబంధించిన భావన : ఇది చిన్న పిల్లలలో తక్కువ. 9 సం॥ లకు ఏర్పడుతుంది.


7. కారణీయతకు సంబంధించిన భావన:

  • ఇది అనుభవం, అభ్యసనం వల్ల ఏర్పడుతుంది.
  • 8,9 సం॥లకు వచ్చేసరికి కార్యకారణ సంబంధాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉదా: 8 సం||ల వచ్చే సరికి శిశుజననంలో తల్లిపాత్రను అర్ధం చేసుకుంటారు.

8. ధనానికి సంబంధించిన భావన:

  • ఇది 8 సం||ల వయస్సు వచ్చేటప్పటికి ఏర్పడుతుంది.
  • 4,5 సం॥లకే పిల్లలకు డబ్బుతో వస్తువులను కొనవచ్చునని తెలుసుకొంటారు.
  • 6,7 సం||లకు అర్ధరూపాయి కంటే రూపాయి విలువైనదనే భావనను పెంపొందించుకుంటారు.
  • ధనానికి సంబంధించిన భావనను పెంపొందించుకోవడంలో అభ్యసనం తగిన పాత్ర వహిస్తుంది.

9. అందానికి సంబంధించిన భావన : ఇది చాలా క్లిష్టమైన భావన

  • ఈ భావన వికాసం సంస్కృత మీద ఆధారపడి వుంటుంది.
  • అందాన్ని అంచనా వేయడం సామూహిక ప్రమాణాలను బట్టి ఆధారపడి వుంటుంది.
  • భావనోద్భవం సరళం నుంచి సంక్లిష్టతకు, మూర్త నుంచి అమూర్తానికి వెళ్తుంది.


8. స్మృతి

  • గతంలో నేర్చుకొన్న విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడాన్నే స్మృతి అంటారు.
  • స్మృతి గురించి మొదట ప్రయోగాలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు - ఎబ్బింగ్స్ (జర్మనీ)
  • ఎబ్బింగ్ హాస్ స్మృతి మీద చేసిన ప్రయోగాలలో అర్థరహిత అక్షరాలను మొదటిసారిగా ఉపయోగించాడు.
  • ఎబ్బింగ్ హాస్ 1885 లో "ఆన్ మెమరి" అనే గ్రంధం ను రచించెను.
  • ఎబ్బింగ్ హాస్ స్మృతి లో మూడు దశలున్నాయని పేర్నొన్నారు.

  1. ఒక అనుభవం లేదా ఉద్దీపన మెదడు మీద ముద్రించబడటం.
  2. నాడీ వ్యవస్థపై ఈ అనుభవాలు తెచ్చేమార్పులు.
  3. ఈ మార్పులు ప్రవర్తనపై తెచ్చే మార్పులు.

  • స్మృతి చిహ్నాలను న్యూరోగ్రామ్స్ లేదా ఎనోగ్రామ్స్ అందురు.

స్మృతి అంశాలు :

స్మృతి లోని అంశాలు అయిదు. అవి.


1. అభ్యసనం:

  • స్మృతి అనేది అభ్యసనానికి పునాది మెట్టు.
  • స్మృతి లేనిదే అభ్యసనం జరుగదు.
  • స్మృతి మొదటి మెట్టు - అభ్యసనం.

2. ధారణ

  • ఏ విషయాన్ని అయిన గుర్తించుకోవడమంటే ఆ విషయం మనమనసులో కొంతకాలం నిలిచి ఉండటాన్ని 'ధారణ'
  • ధారణ వక్రరేఖకు ను రూపొందించినది - ఎబ్బింగ్ హాస్.
  • ధారణను తెలుసుకోవడానికి మూడు పద్ధతులను ఉపయోగిస్తారు. అవి 1. పునఃస్మరణ 2. గుర్తింపు 3. పునరభ్యసనం.

3. పునఃస్మరణ:

  • ఏ విషయమైనా గుర్తికి తెచ్చుకోవడాన్ని పునఃస్మరణ అందురు.
  • పునఃస్మరణ రెండు రకాలు 1. అశాబ్దిక పునఃస్మరణ 2. శాబ్దిక పునఃస్మరణ
  • జంతువులలో, అక్షర జ్ఞానం లేని వారిని ధారణ ను పరీక్షించడానికి అశాబ్దిక పునఃస్మరణ పద్ధతిని ఉపయోగిస్తారు.
  • అశాబ్దిక పునఃస్మరణ పద్ధతిలో విలంబిత ప్రతిచర్య ముఖ్యమైనది.
  • విలంభిత ప్రతిచర్యను పరీక్షించడానికి ఉపయోగించే పరికరం, విలంబిత ప్రతిచర్య పరికరంను ప్రతిపాదించినది - హంటర్స్.
  • అక్షర రూపాలలోను, అంకెల రూపాలలోను ఉన్న సంకేతాలను పునఃస్మరణ చేయుటకు ఉపయోగించే పద్ధతులను శాబ్దిక పునఃస్మరణ పద్ధతి అందురు.
  • శాబ్దిక పునఃస్మరణ పద్ధతులు :- స్మృతి విస్తృతి, ద్వంద్వ సంసర్గలు, కధనాలు, ఆకృతుల పునరుత్పాదనం, శబ్ద ప్రమాణం.
  • ఒకసారి చూసిన, విన్న లేదా తాకిన విషయాన్ని వెంటనే తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడం, అదే విషయాన్ని తప్పులు లేకుండా చెప్పడాన్ని స్మృతి విస్తృతి అంటారు.
  • స్మృతి విస్తృతిని ప్రయోగశాలలో కనుక్కోవడానికి ఉపయోగించే పరికరం - టాచిస్టోస్కోప్
  • టాచిస్టోస్కోప్ను కనుగొన్నది - విలియం హామిల్టన్.
  • అర్ధరహిత అక్షరాలను పునఃస్మరణ చేసుకొవడానికి ఉపయోగించే పరికరం - స్మృతి పేటిక (MEMORY DRUM)
  • కథనాల పై ప్రయోగం చేసినది - బార్టెట్.
  • ఆకృతుల పునరుత్పాదనం గూర్చి పేర్కొన్నది - బార్ట్ లెట్.
  • ఒక విషయం జరిగిన తరువాత ఆ విషయం గురించి కొంతకాలం తరువాత చెప్పమన్నపుడు పరిస్థితులలో మార్పు వలన స్మృతి సక్రమంగా జరగపోవడం ను శబ్దప్రమాణం అందురు.

4. గుర్తింపు:

  • పునఃస్మరణ కంటే గుర్తింపు తేలిక
  • గుర్తింపు సరిగా జరగకపోవడానికి కారణం డెజావూ
  • జావూ అనగా మిధ్యాయ పరిచయం.
  • డెజావూ అనునది ఫ్రెంచ్ భాషా పదం.
  • మిద్యాపరిచయం అనగా ప్రస్తుతం చూసినది, ఎప్పుడో చూసినట్లు అనుకోవడం.
  • మిద్యా పరిచయ భావన కలగడానికి కారణం- ఇప్పుడు చూస్తున్న దానికి, మనం ఇది వరకు చూసినదానికి పోలికలు వుండటం.
  • ఒక్కొక్కసారి స్మృతి విరూపన వల్ల కూడా డెజావూ కలగవచ్చు.

5. పునరభ్యసనం:

  • నేర్చుకున్న ఒక విషయాన్ని మరల నేర్చుకోవడాన్ని 'పునరభ్యసనం' అందురు.
  • పునరభ్యసనం ను పొదుపు పద్ధతి అనికూడా అందురు.
  • పొదుపు పద్ధతిని ప్రతిపాదించినది - ఎబ్బింగ్ హాస్


స్మృతి - రకాలు :


  • రెడిన్టెగ్రేటివ్ స్మృతి : సంకేతాలు, ఉద్దీపనలు ద్వారా గల విషయాలును జ్ఞప్తికి తెచ్చుకొనే ప్రక్రియను రెడినైగ్రేటివ్స్మృతి అందురు.
  • మనోరుగ్మతలను చికిత్స చేయడంలో మనో విశ్లేషణావాదులు రెడిన్టేగ్రేటివ్ స్మృతిని ఉపయోగిస్తారు.

  • బట్టి స్మృతి : ఒక విషయాన్ని యధాతధంగా, అర్ధంతో సంబంధం లేకుండా నేర్చుకోవడమే బట్టి స్మృతి.

  • తార్కిక స్మృతి : ఒక విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని, తార్కికంగా ఆలోచన చేసి నేర్చుకోవడమే తార్కికస్మృతి.

  • స్వల్పకాలిక స్మృతి : దీనినే తక్షణ స్మృతి అంటారు. దీనిని ప్రవేశ పెట్టినది - విలియం జేమ్స్. నేర్చుకున్న విషయం కొద్దికాలము గుర్తుఉంటమే స్వల్పకాలిక స్మృతి.

  • దీర్ఘకాలికస్మృతి : దీనినే శాశ్వత స్మృతి అంటారు. నేర్చుకున్న విషయాన్ని ఎక్కువకాలం గుర్తించుకోవడమే దీర్ఘకాలిక స్మృతి. ఉదా :- కొన్ని చేదు అనుభవాలు, చిన్ననాటి అనుభవాలు.

  • నిష్క్రియాత్మక స్మృతి : ప్రయత్నం లేకుండా నేర్చుకున్న విషయాలు జ్ఞప్తి రావడమే నిష్క్రియాత్మక స్మృతి. ఉదా : బాల్య మిత్రుడు ఒకడు కనిపించినపుడు బాల్యానికి సంబంధించిన అంశాలన్ని గుర్తుకు రావడం.

  • క్రియాత్మక స్మృతి : వ్యక్తి ప్రయత్నం తో విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడమే క్రియాత్మక స్మృతి. దీనినే యత్నపూర్వక స్మృతి అందురు. ఉదా : పరీక్షలలో ప్రశ్నలకు సమాధానం ప్రయత్నం చేసి జ్ఞాపకం తెచ్చుకొని రాయటం.

  • సంసర్గ స్మృతి : ఒక విషయాన్ని నేర్చుకొని దానిని ఇతర అంశాలతో సంధానం చేస్తూ నేర్చుకుంటే దానిని సంసర్గస్కృతి అందురు. ఉదా :- బల్పును చూడగానే ఎడిసన్ గుర్తుకురావడం.

  • స్మృతిని పెంపొందించే పద్ధతులు : 1. ప్రేరణ 2. అభిరుచి, అవధానం 3. తక్కువ భావోద్రేకత 4. భావాల సంసర్గం. 5. వైషమ్యం 6. అతి అభ్యసనం 7. వల్లెవేయడం 8. కొండగుర్తులు. 


9. విస్మృతి:

విస్మృతి అంటే మరచి పోవడం.

చలన కౌశలాలకు సంబంధించి ఏమి నేర్చుకొన్నా వాటిని మరచిపోవడం జరగదు.

మనం నేర్చుకున్న దాన్ని పునఃస్మరించలేక పోవడాన్ని లేదా గుర్తించలేకపోవడమే విస్మృతి.

విష్కృతి పై ప్రయోగాలు చేసినది - ఎబ్బింగ్ హాస్.

ఎబ్బింగ్ హాస్ వివరణ....



విస్మృతి కారకాలు :

1. అనుపయోగం వల్ల స్మృతి క్షయం 2. అవరోధాలు 3. దమనం 4. అపసామాన్య విష్మృతి 5. కన్సాలిడేషన్ 6. వేర్పాటు.

  • నేర్చుకున్న ఒక విషయాన్ని కొంతకాలం పాటు ఉపయోగించకపోవడం వలన విస్మృతి సంభంవించడాన్ని అనుపయోగం వల్ల స్మృతి క్షయం అందురు.
  • నేర్చుకున్న ఒక విషయాన్ని కొంతకాలం పాటు ఉపయోగించకపోవడం వలన విస్మృతి సంభంవించడాన్ని అనుపయోగం వల్ల స్మృతి క్షయం అందురు.
  • చలన కౌసలాల విషయంలో అనుపయోగం వల్ల స్మృతి క్షయం జరగదు.
  • అవరోధాలనే జోక్య ప్రభావం అందురు.
  • జోక్య ప్రభావాలు రెండు రకాలు: 1. పురోగామి అవరోధం. 2. తిరోగామి అవరోధం.
  • పాత అభ్యసనం కొత్త అభ్యసనాన్ని ఆటంక పరచడాన్ని పురోగామి అవరోధం అంటారు.
  • కొత్త అభ్యసనం, పాత అభ్యసనాన్ని ఆటంక పరచడాన్ని తిరోగామి అవరోధం అందురు.
  • మనం అనగా కావాలని మరిచిపోవడం
  • దమనం ఒక క్రియాత్మక విస్మృతి
  • దమనం ఎక్కువయినపుడు ఆ విషయాలు, సంఘటనలు చేతన మనస్సులోకి వచ్చి కలల ద్వారా, మానసిక రుగ్మతల ద్వారా బయటపడతాయి.
  • మనోవిశ్లేషణవాదులు దమనం చేయబడ్డ విషయాలను, సంఘటనల గూర్చి కలల విశ్లేషణ ద్వారా తెలుసుకుంటారు.
  • స్వేచ్ఛా సంసర్గం ద్వారా దమనం చేయబడ్డ విషయాలు, సంఘటనలు వెలికి తీయడం జరుగుతుంది.
  • అమ్నేషియా అనగా స్మృతి నాశనం లేదా స్మృతి కొల్పొవడం.
  • నేర్చుకున్న మొదట నిమిషంలోనే స్మృతి నిర్మాణం జరుగుతుంది. దీనినే ' కన్సాలిడేషన్ ' అందురు.
  • కన్సాలిడేషన్ ను ప్రయోగ పూర్వకంగా నిరూపించినది - డంకన్
  • మాములు విషయాలు కంటే భిన్నంగా ఉన్న విషయాలు ఎక్కువగా గుర్తుండటాన్ని వేర్పాటు అందురు. దీనినే వాన్ రెస్టార్స్ ప్రభావం అందురు.
  • అపసామాన్య విస్మృతిలో ఏ విషయం జ్ఞాపకం ఉండదు.


సిద్ధాంతాలు - శాస్త్రవేత్తలు



Important Points

  • “చరిత్ర అనేది వేరు వేరు కాలాలకు సాక్ష్యం లాంటిది. సత్యానికి వెలుగు వంటిది." - సిసిరో
  • “విజయానికి రెండు ప్రధాన సూత్రాలున్నాయి. ఆచరణకు ముందు ఆలోచన, అనంతరం ఆత్మవిశ్వాసంతో ఆచరణ." - లయోర.
  • “విజయానికి రెండు ప్రధాన సూత్రాలున్నాయి. ఆచరణకు ముందు ఆలోచన, అనంతరం ఆత్మవిశ్వాసంతో ఆచరణ." - లయోర.
  • "ఆకారాలను, ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే ప్రక్రియే వికాసం" - ఆండర్సన్.
  • “ఇష్టమైన పని లభిస్తే మూర్ఖుడు కూడా చేయగలడు. అన్ని పనులను తనకిష్టమైనవిగా చేసుకోగలిగేవాడే నిజంగా తెలివైనవాడు." - వివేకానంద.
  • "మేథస్సు గొప్ప పనులను ప్రారంభిస్తుంది. శ్రమ వాటిని పూర్తి చేస్తుంది." - బోబర్ట్.
  • "గొప్ప ఉపాధ్యాయులుగా ఎవరూ జన్మించరు. వారిని అలా తీర్చిదిద్దినది ఉపాధ్యాయుడే." - లోలామే.
  • “సాహసవంతులున్నంత వరకే దేశం స్వతంత్రంగా మనగలుగుతుంది." - ఇ. డేవిస్.
  • “అవసరమైతే చినిగిన చొక్కా అయిన తొడుక్కో గాని ఒక మంచి పుస్తకం కొనుక్కో" - వీరేశలింగం.
  • “ఇవ్వడం నేర్చుకో - తీసుకోవడం కాదు" - రామక్రిష్ణ పరమహంస.
  • "గాయాలను దుమ్ములోను, సాయాలను పాలరాతి మీద రాయాలి." - బెంజిమన్ ఫ్రాంక్లిన్.
  • "మనకేమి తెలియదని తెలుసుకోవడమే విజ్ఞానానికి రాచబాట." - డిగ్రీలి.
  • "ఢిల్లీ ఛలో, జైహింద్" - నెతాజీ.            
  • "జీవితానికి లక్ష్యం ఆనందం కాదు - శీలం." - భీషర్.
  • "పరిస్థితులు బలహీనులను శాసిస్తాయి- విజ్ఞులకు అవి కేవలం సాధనాలు మాత్రమే' - సామ్యూల్ లవర్.


No comments:

Post a Comment

Post Bottom Ad