4. అభ్యాసకులు - ప్రత్యేక అవసరాలు - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Monday, June 10, 2024

4. అభ్యాసకులు - ప్రత్యేక అవసరాలు

 IV అభ్యాసకులు - ప్రత్యేక అవసరాలు


డి.యస్.సి. సైకాలజీ విభాగంలో ఈ పాఠ్యాంశానికి సంబంధించి 1 నుండి 2 ప్రశ్నలు వస్తున్నాయి. ఈ పాఠ్యాంశం నుండి ప్రధానంగా వ్యాధుల పై ప్రశ్నలను అడగడం జరుగుతుంది. తదానుగుణంగా ఈ పాఠ్యాంశంను వివరించడం జరిగింది.


  • శారీరక లోపాలు - దృష్టిలోపం, వినికిడి లోపం, సంభాషణ లోపాలు
  • మానసిక లోపాలు - బుద్ధి మాంధ్యత
  • సామాన్య జనాభాలో శారీరక, మానసిక లోపాలు కలిగిన శిశువులు శాతం 10% - 15%
  • టార్ట్ అనే శాస్త్రవేత్త ఏ శిశువు పై 5 సం॥ పరిశీలించాడు. - విక్టర్ (ఈ శిశువు అడవిలో పెరిగాడు)
  • ప్రత్యేకమైన శిశువులను డన్ అనే శాస్త్రవేత్త ఎన్ని రకాలుగా విభజించాడు - 12.
  • మన దేశంలో సుమారు 2 కోట్ల మంది పాఠశాలలకు వెళ్లే శిశువులను ప్రత్యేకమైన శిశువులుగా పరిగణించవచ్చు.


1. ప్రతిభావంతులైన పిల్లలు :

  • వీరి IQ 140 కంటే ఎక్కువగా వుంటుంది.
  • “ఎవరు నిష్పాదన అత్యంత విలువైన మానవ చర్యలలో చాలా వరకు చెప్పుకోదగిందిగా వుంటుందో అతడు ప్రతిభావంతుడైన శిశువు" - విట్టి
  • “ప్రతిభ అనేది నిజాలను, భావాలను, సంబంధాలను సమర్థవంతంగా ఉపయోగించగల అత్యధికమైన సమర్థత" - కిర్క్
  • ప్రతిభావంతులను గుర్తించుటకు ఉపయోగించు పద్దతులు:- 1. మానసిక పరీక్షలు 2. సహజ సామర్థ్య పరీక్షలు 3. ఉపాధ్యాయుల రిపోర్టు 4. తల్లిదండ్రుల రిపోర్టు.
  • కరోల్ ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిభను గుర్తించకపోవడానికి కారణాలు :- 1. పక్షపాతం 2. అసమగ్రపరిశీలన 3. పోల్చడానికి సరియైన ప్రమాణాలు లేకపోవడం.
  • ప్రతిభావంతులైన శిశువులకు విద్య గరుపుటకు ఏర్పాట్లు : 1. సంపన్న వంతమైన కార్యక్రమాలు 2. సంపన్నవంతమైన పాఠ్యప్రణాళిక 3. ప్రత్యేకమైన తరగతులు 4. ప్రత్యేకమైన పాఠశాలలు
  • ప్రతిభావంతులైన పిల్లలకు మూడు రకాలైన విద్యా సర్దుబాట్లు చేయవచ్చు.1. ప్రత్యేకీకరించడం 2. సంపన్నవంతం చేయడం. 3. త్వరణం.
  • ప్రతిభావంతులైన శిశువులకు కల్పించే ప్రత్యేకమైన సౌకర్యాలు గురించి పేర్కొన్నది - కిర్క్.
  • ప్రకారం ప్రజ్ఞావంతులైన శిశువులు త్వరగా అవగాహన చేసికొంటారు." - టెర్మన్, ఓడన్.


2. మందకొడిగా అభ్యసించే వారు, తక్కువ సాధనగలవారు :

  • వీరికి కొద్దిగా బుద్ది మాంద్యత వుంటుంది.
  • మందకొడిగా అభ్యసించే వారి కేంద్రనాడీ మండలం పుట్టుక ముందుగాని, పుట్టేటప్పుడు గాని పుట్టిన తరువాతగాని దెబ్బతిని వుండవచ్చు.
  • అమెరికన్ అసోసియన్ ఆన్ మెంటల్ డెఫీషియాన్సీ ప్రకారం మానసిక మాంద్యత అంటే సరాసరి ప్రజ్ఞకంటే తక్కువ ప్రజ్ఞ వుండటం, అనుగుణ్యతా ప్రవర్తన లోపంగా వుండటం మొ॥
  • పై నిర్వచనం ప్రకారం బుద్ది మాంద్యత వున్న వారి ప్రజ్ఞా లబ్ది 67, అంతకంటే తక్కువగా ఉంటుంది. బుద్ధి మాంద్యత లో నాలుగు స్థాయిలు గుర్తించింది.

  1. స్వల్పబుద్ది మాంద్యత - 52 -67 ప్రజ్ఞాలబ్ధి -సాధారణ జనాభాలో 2%
  2. కొద్దిపాటి బుద్ది మాంద్యత - 36-51 ప్రజ్ఞాలబ్ధి - సాధారణ జనాభాలో 1%
  3. తీవ్రమైన బుద్ధిమాంద్యత - 25-35 ప్రజ్ఞా లబ్ధి
  4. అత్యధిక బుద్ధిమాంద్యత - 19 కంటే తక్కువ

  • స్వల్ప బుద్ధిమాంద్యత : ఈ శిశువు సాధారణ పాఠశాలలో చెప్పే విషయాలను గ్రహించలేకపోతాడు. ఇతనికి మూడు విషయాల్లో శక్తి సామర్థ్యాలుంటాయి.

  1. విద్యా సంబంధిత విషయాలలో కొద్దిపాటి విద్యార్హత వుండటం.
  2. సాంఘిక సర్దుబాటు అలవర్చుకొనేందుకు తగిన శక్తి సామార్థ్యాలు వుండటం.
  3. తగిన ఔద్యోగిక విద్యను పొంది పాక్షికంగా లేదా పూర్తిగా తన కాళ్లమీద నిలబడగల శక్తి వుండటం.

  • కొద్దిపాటి బుద్ధి మాంద్యత - లక్షణాలు - పైవాటికి తోడు

  1. మానసిక వికాసం సాధారణ శిశువుల కంటే సగం లేదా 3/4 వరకు ఉంటుంది.
  2. సాధారణ శిశువుతో పోల్చినపుడు పాఠశాల పురోభివృద్ధి సగం లేదా 3/4 వంతు ఉంటుంది.
  3. చదవగల శక్తి 9సంవత్సరాలపుడు వస్తుంది.
  4. 9-12 సం|| మధ్య మామూలు లెక్కలు అర్ధం చేసుకోగలుగుతాడు. 16 సంవత్సరాలప్పటికి 2 లేదా 3 వతరగుతుల స్థాయికి వస్తాడు.
  5. పదపరిజ్ఞానం, భాష పరిమితంగా వుంటుంది.
  6. వీరు నైపుణ్యం లేని, పాక్షిక నైపుణ్యం గల పనులు చేయగలుగుతారు.

  • వీరు మామూలు పాఠశాల కార్యక్రమాలను అవగాహన చేసుకోలేరు. వీరికి క్రింది సామర్థ్యాలుంటాయి.

  1. తమ పనులు తాముచేసుకోగల నైపుణ్యం వుంటుంది.
  2. కుటుంబంలో ఇతరులతో, ఇరుగుపొరుగు వారితో సాంఘిక సర్దుబాటు చేసుకోగల శక్తి వుంటుంది.
  3. పర్యవేక్షణలో ఏదైన వృత్తి చేయగలుగుతారు.
  4. భుజించడం, దుస్తులు ధరించడం, మరుగుదొడ్లును పయోగించడం, పరిశుభ్రంగా వుండటం మొ|| నేర్పు వుంటుంది.
  5. యాంత్రికంగా చేసే పనులను ఇంట్లో, పాఠశాలలో, వృత్తిలో చేయగలుగుతారు.
  6. బట్టీ అభ్యసనం చేయగలుగుతారు.

తక్కువ సాధన గలవారు :

  • సాధనలో వెనుకబడిన శిశువులంటే వారి విద్యా సాధన, వారి సామర్ధ్యత కన్నా తక్కువగా ఉంటుంది. అనగా ప్రజ్ఞేతర విషయాలు దీనికి కారణమవుతాయి.
  • సమాజంలో వెనుకబడిన వర్గాలలోని శిశువులు సాధనలో వెనుకబడడం ఎక్కువగా ఉంటుంది. వారిలో ప్రేరణ తక్కువ, సృజనాత్మకత తక్కువ.
  • గోవన్ ప్రకారం సాధనలో వెనుకబడడానికి కింది కారణాలు ఉంటాయి.

  1. సరియైన విద్య, ఔద్యోగిక విషయాలు లేకుండడం
  2. నాడీ రుగ్మతకు చెందిన ప్రవృత్తులు వుండడం.
  3. కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం
  4. ప్రభావం చూపే తల్లిదండ్రులలో బాధ్యత, ఆత్మవిశ్వాసం లోపించడం.

  • తల్లిదండ్రులు తమ పిల్లల శక్తి సామర్థ్యాలకతీతంగా శక్తిసామర్థ్యాలను ఆశించడం.
  • కిరాతను రచించిన "Educating the exceptional Children" అనే పుస్తకంలో సాధన తక్కువ గలశిశువులకు సూచనలు చేసాడు.
  • సాధన తక్కువగల శిశువులకు ముఖ్యంగా మూడు కారకాలను పేర్కొనవచ్చు.

   1.వ్యక్తిగత కారకాలు :- జబ్బు పడడం, ప్రేరణ లోపించడం, తక్కువ ఆత్మభావన

   2.పరిసర కారకాలు :- గృహ వాతావరణం సరిగా లేకపోవడం, నియంతృత్వం చూపే తల్లిదండ్రులు, సరియైన బోధన పద్దతులు లేకపోవడం, పాఠశాల ప్రణాళికలో లోపాలుండటం.

   3.ఉద్యోగకారకాలు :- పాఠశాలలో ఋణాత్మక వైఖరి వుండటం, ఉపాధ్యాయులంటే ఇష్టం లేకుండటం.

  • ఒక్కోక్క సారి శిశువులో సాధన చేయలేకపోవడం అనే సిండ్రోమ్ వుంటుంది. అటువంటి శిశువులు తాము పాఠశాలల్లో సాధించకూడదనుకుంటారు.


3. అభ్యసనా సామర్థ్యం లోపించిన పిల్లలు :

  • ప్రతితరగతిలో కూడా నూటికి 20 మంది పిల్లలు తక్కువ మార్కులు తెచ్చుకొంటారు.
  • ఒక శిశువు సరిగా మార్కులు తెచ్చుకోలేదంటే ఆ శిశువు అభ్యసన సమస్యతో సతమతమవుతున్నట్టే.
  • నిష్పాదనలో వెనుకబడటానికి కారణాలు - నాలుగు

  1. భౌతిక సమస్యలు - దృష్టికి, వినికిడికి సంబంధించిన సమస్యలు.
  2. ప్రజ్ఞా సంబంధిత కారణాలు
  3. అభ్యసన సామర్థ్య రాహిత్యం - ఒక్కోసారి ప్రజ్ఞావంతులైన వారి మెదడులోని కొన్ని ప్రాంతాలు సరిగా వికాసం చెందక పిల్లలు చదవడం, రాయడం, భాషణ చేయడం మొ|| నైపుణ్యాలలో వెనకబడి వుంటారు. అటువంటి లోపాన్ని డిస్లెక్సియా అంటారు.

  • ప్రతి 1000 పాఠశాల పిల్లలోను 100 మంది డిస్లెక్సియాతో సతమతమవుతుంటారు.


4. ఉద్వేగ అవ్యస్థలు:

  • అభ్యసన సమర్థత లోపాలకు కారణం - మెదడులోని కొన్ని ప్రాంతాలు సరిగా అభివృద్ధి చెందకపోవడం, మెదడులోని భాగాలన్ని సరిగా వున్నా పనిచేయడంలో లోపాలుండటం. వీరిలో అమూర్త సామర్థ్యం కుంటుబడిపోతుంది.
  • డెస్లెక్సియా ను గుర్తించడం: 1. ఉపాధ్యాయుని రిపోర్టు, 2. శిశువు సమస్యలను చూపడం 3. శిశువును పరీక్షించడం.
  • పఠన కౌశలాన్ని పరీక్షించేందుకు ఉపయోగించే పరీక్ష - స్కోనల్ పఠన పరీక్ష
  • దేని ద్వారా డెస్లెక్సియా గల పిల్లల ఆత్మగౌరవం పెంపొందించవచ్చు తర్ఫీదు
  • డెస్లెక్సియా పిల్లలకు ప్రత్యేక నివారణ సౌకర్యాలను ఏర్పరచినదేశం - బ్రిటన్.


5. దృష్టి లోపం గల పిల్లలు :

వీరు రెండు రకాలు

1. పూర్తి దృష్టిలోపం గలవారు :- వీరి దృష్టి 2/200. బ్రెయిలీ లిపిని ఉపయోగించి వీరికి విద్యను ఏర్పాటు చేస్తారు.

2. పాక్షికంగా దృష్టిలోపం గలవారు :- వీరి దృష్టి 20/200.

  • ఒక శిశువుకు సంపూర్ణ దృష్టి లోపం వున్నట్లు గుర్తించడానికి 1 సం॥ పడుతుంది.
  • దృష్టి లోపాన్ని గుర్తించడానికి జరుపు పరీక్షలలో ఒకటి - స్నెలెన్స్ పరీక్ష. ఇది దూరదృష్టికి సంబంధించినది. పాఠశాలకు అవసరమైన దగ్గర దృష్టికి ఉపయోగపడదు.
  • పాఠశాలలో ఉపయోగపడే దృష్టి పరీక్షలు - మాసాచూట్స్ దృష్టి పరీక్ష, కిస్టన్ టెలిబైనాక్యులర్ పరీక్ష, ఆర్థోలేటర్ పరీక్ష,
  • కెర్బి ప్రకారం పాక్షికంగా దృష్టి లోపం గల పిల్లలకు కింది లోపాలు ఉంటాయి.

  1. వక్రీభవన దోషాలు - దీని కింద (హ్రస్వ దృష్టి Mypoia) దూరదృష్టి ( Hyperopia )మొ||వుంటాయి. ఈ లోపాలు సుమారు 50% పాక్షిక దృష్టి లోపం గల పిల్లలకు కలుగుతాయి.
  2. కండరాలు పనిచేయడంలో లోపాలు - స్ట్రాబిస్మస్ లేదా మెల్లకన్ను
  3. వికాసానికి సంబందించిన దృష్టి లోపం - కాటరాక్ట్ (కంటిమసక) ఆల్బినిజం

  • ఒక రకమైన రంగులోపించడం.
  • పాక్షిక దృష్టిలోపంగల పిల్లలకు, సాధారణమైన పిల్లలకు ఎక్కువ తేడా కనబడదు. - లోవెన్ఫెల్డ్
  • సాధారణ శిశువులకు, దృష్టి లోపం గల పిల్లలకు మధ్య ప్రజ్ఞలో తేడాలు లేవు అని చెప్పినది - మైయిర్స్ దీనికి వ్యతిరేకంగా పింటర్న్ ప్రజ్ఞలో వారి మధ్య తేడాలను గుర్తించాడు.
  • లివింగ్స్టన్ ప్రకారం పాక్షిక దృష్టిలోపం గల పిల్లల ప్రజ్ఞాలబ్ధి - 98.6
  • వివేచనం, భాషా వికాసం మొదలైన వాటిలో సాధారణ శిశువుకు, దృష్టిలోపం గల శిశువుకు తేడాలు లేవు.
  • పాక్షిక దృష్టిలోపం గల పిల్లల పఠన వేగం నిమిషానికి 100 పదాలు, సాధారణ దృష్టి గల పిల్లల పఠనవేగం నిమిషానికి 200 పదాలు అని చెప్పినది - నోలన్

విద్యా కార్యక్రమాలు పాక్షిక దృష్టి లోపం గల పిల్లలు :

  • ఇంగ్లాండ్లో 1908 సం॥లో పాక్షిక దృష్టిలోపం గల పిల్లలకు ప్రత్యేక తరగుతులు ఏర్పాటు చేసారు. అట్లాంటి మొట్టమొదటి తరగతి బౌండరీలైన్ అనే ప్రదేశంలో ఏర్పాటుయింది. ఇది ఇంగ్లాండ్లో వుంది.
  • అమెరికా లోని బోస్టన్ లో 1913 సం॥లో ప్రత్యేక క్లాసు ఏర్పాటయింది. దీన పేరు సెమిబ్లైండ్ క్లాస్ తరువాత సైట్సేవింగ్ క్లాస్ అని మార్చారు. దీనికి మిస్ హెలెన్ స్మిత్ ఉపాధ్యాయినిగా వ్యవహిరించారు. మొదట ఆరుగురు విద్యార్థులు మాత్రమే చేరారు. తరువాత యిటువంటి తరగతులు - క్లీన్లాండ్, ఒహియాలలో నెలకొల్పారు.
  • పాక్షిక దృష్టిలోపంగల పిల్లలకు నెలకొల్పిన ప్రత్యేక పాఠశాలలో కింది కార్యక్రమాలను ఏర్పాటుచేసారు. వాటిని నాలుగు రకాలుగా విభజించవచ్చు.

   1.ప్రత్యేకమైన తరగతి : బోస్టన్ లో ఏర్పరిచిన మొట్టమొదటి తరగతి ప్రత్యేకమైనటువంటిది. ఇది ఇప్పుడు అంగీకరించడం లేదు.

   2.సహకార ప్రణాళక : ఇందులో పిల్లలు కొన్ని విషయాలు బోధించడానికి మాత్రమే ప్రత్యేక తరగతిలో ఉంచుతారు.
ప్రత్యేక ఉపాధ్యాయునిపర్యవేక్షణ పద్ధతి

   3.వనరుల కేంద్రం : ఇప్పుడు ఈ పద్దతి చాలా ప్రాచుర్యం పొందింది.

  • దృష్టిలోపం గల పిల్లల తరగతి గదులలో బ్లాక్ బోర్డుకు బదులు బూడిద రంగు లేదా ఆకుపచ్చ రంగు బల్లలుండాలి. దీని వలన నీడలు పడడటం తగ్గిపోయి సరిగా చూడడానికి తోడ్పడుతుంది.
  • పాక్షిక దృష్టిలోపంగల పిల్లలకు ఇచ్చే పుస్తకాలలో పెద్ద అచ్చులు (18 నుంచి 24 పాయింట్లు వరకు) వుండాలి.


5. వినికిడి లోపాలు గలవారు :

  • “బధిరులు అంటే పుట్టికతో సంపూర్ణంగాగాని లేదా పాక్షికంగా గాని వినికిడి కోల్పోయి, భాషణనెలకొల్పుకోలేక పోయేవారు" - వైట్ హౌస్ సమావేశం
  • వినికిడి లోపంలో గల స్థాయిలు- రెండు

  1. వినికిడి లోపం ఎక్కువ గలవారు - 60-70 డెసిబెల్స్ లోపం వున్నవారు.
  2. వినికిడి లోపం చాలా ఎక్కువ గలవారు - 70-75 డెసిబెల్స్ లోపం వున్నవారు.

  • రెండవ తెగకు చెందినవారికి వినికిడి యంత్రాలు పనిచేయవు. వీరు భాష నేర్చుకోవడం చాలా కష్టం. ప్రత్యేక శిక్షణనిస్తే తప్ప వీళ్లలో వాక్కు వికాసం చెందదు.
  • క్రింది పద్ధతుల ద్వారా వినికిడి లోపం వారిని గుర్తించవచ్చు.

    1.అధిక సంక్లిష్ట రిజష్టరు : ఇక్కడ తల్లికి ఒక ప్రశ్నావళి యిచ్చి శిశువు వినికిడిలోపం వల్ల సంభవించే సంక్లిష్ట కారకాలను పేర్కొంటారు.

    2.స్క్రీనింగ్ పద్ధతులు : ఇక్కడ వివిధరకాల శబ్దాలకు శిశువు ప్రతిస్పందనలను, అసంకల్పిత ప్రతీకారచర్యలను పరిశీలించి నమోదు చేస్తారు.

   3.విషయాగతమైన మాపనాలు : ఇక్కడ ఇంపిడెన్సీ, ఆడియోమెట్రి, బ్రెయిన్టెమ్ ఆడిటరి, ఇవోక్ రెస్పాన్స్ మొదలైన సాధనాల ద్వారా పిల్లలవినికిడి శక్తిని పరీక్షిస్తారు.

  • వినికిడి యంత్రాలలో ట్రాన్సిస్టర్స్ ఉపయోగించడం వల్ల వాటి పరిమాణం చాలా తగ్గిపోయింది.
  • వినికిడి తర్ఫీదులో ముఖ్యోద్దేశం తొలిదశ లోనే శిశువు శబ్దాలకు విచక్షణ చూపగలగడం.
  • సంభాషణ తర్ఫీదులో మొట్టమొదట చేయవలసిన పని - శిశువుభాషణలో ఎలాంటి దోషాలు చేస్తున్నాడో తెలుసుకోవడం.
  • వినికిడి లోపించిన వారి విద్యకు సంబంధించి గుర్తు పెట్టుకోవలసిన వ్యక్తులు - బోనెట్, పెరేరి.
  • పెదవుల అధ్యయనం (పఠనం) గురించి చాలా పరిశోధనలు చేసినది - పెరేరి.
  • వినికిడి లోపించిన వారికి రెండు రకాల పద్ధతులు ఉపయోగిస్తారు. 1. ఓరల్ పద్దతి 2. మాన్యువల్ పద్దతి.
  • క్విగ్లి, ఫిసినా అనే శాస్త్రజ్ఞులు 120 మంది రెసిడెన్సియల్ పాఠశాలల్లోని పిల్లలను, 120 మంది పగటి పాఠశాలల్లోని పిల్లలతో పోల్చిచూసారు. పగటి పూట మాత్రమే పాఠశాలకు హాజరయ్యే పిల్లలు భాషణలో, పఠనంలో శ్రేష్ఠులుగా వున్నారు.
  • వినికిడి లోపించిన పిల్లల విద్యా బోధనను మూడు ముఖ్యాంశాలుగా విభజించవచ్చు. 1. ఓష్ఠ్య పఠనం (శైశవ దశ నుండి ) 2. శ్రవణ పఠనం 3. వాక్కు శిక్షణ (శైశవ దశ నుండి)


6. శల్యలోపం గల పిల్లలు :

దీనికింద కుంటివారు, అనాకృతి కలవారు, భౌతిక అంగవైకల్యం గలవారు వస్తారు. ఉదా: పోలియో, మస్తిష్క పక్షపాతం

"మస్తిష్క పక్షవాతం అంటే కేంద్ర నాడీవ్యవస్థ లోపం వల్ల గాని లేదా వ్యాధి వల్ల సంభవించే అసాధారణ కండరాల మార్పు లేదా కదలిక లేదా చలన కార్యం" - ఫే

ఎవరిలో కన్ను, చేయి సమన్వయం చాలా హీనంగా ఉంటుంది - మస్తిస్క పక్షవాతం కలవారు.

మస్తిస్క పక్షవాతం నాలుగు రకాలుగా ఉంటుంది.


   1.ఎథెటోసిస్ : ఇటువంటి పిల్లల్లో చేతులు, కాళ్లు, భుజాలు, నోరు మొదలగు వివిధ శరీర భాగాల్లో నిరంతరం అసంకల్పిత చలనం ఉంటుంది.

   2.గతలోపం(అటీక్షియ) : వీళ్లకు సమావస్థవుండదు. ఈ శక్తిని కోల్పోయినందువల్ల వీళ్ళ ప్రతి కదలిక అపసవ్యంగా వుండి ప్రాదేశిక సంబంధాలు చాలా హీనంగా వుంటాయి.

   3.స్పాస్టిసిటి : వీళ్లకు కండరాలు చాచే అసంకల్పిత ప్రతీకార చర్య వుంటుంది. అనగా చేతిని ఒక వైపుకు చాచాలంటే వేరొకవైపుకు పోతుందన్నమాట.

   4.అనమ్యత (రిజిడిటి) : ఈ తెగవాళ్లు కండరాలు బిగుసుకొని వుండడం వల్ల అవయవాలను కదల్చలేకపోతారు. అనగా కాళ్లు, చేతులు నొక్కుకొని పోయినట్లు ఉంటాయన్నమాట.

  • మస్తిష్క పక్షవాతం గల వారికి దృష్టి, శ్రవణ లోపాలు కూడా సంభవించవచ్చునని చెప్పినది - కార్ట్వెల్
  • మస్తష్క పక్షవాత పిల్లలో 75% బుద్ధిలో వెనుకబడి వుంటారని, 50% తీవ్ర బుద్ది లోపం లేదా మానసిక లోపాలున్న వారై ఉంటారని కనుగొన్నది - హాప్మన్
  • భుజం, చేతులు, అరచేతుల లోని కండరాల పక్షవాతం వల్ల ఏర్పడు స్థితి - మస్తష్క పక్షవాతం.
  • మస్తిష్క పక్షవాతంనకు ముఖ్యకారణం - శిశుజనన సమయంలో ముఖ్యంగా నెల తక్కువ పిల్లల్లో నాడీమండలంనకు గాయం కలగడం.
  • ప్రత్యేక విద్యా సౌకర్యాలను పేర్కొన్నది - మెక్కి (అంగవైకల్యం గలవారికి)
  • స్కూల్ ఫర్ క్రిపిల్డ్ - అంగవైకల్యం గలవారికి
  • అంగవైకల్యం అనేది మూర్తిమత్వంపై కూడా ప్రభావం చూపి మూర్తిమత్వం కుంటిపడేట్లు చేస్తుంది. క్రమరర్
  • వికలాంగ పిల్లలకు సాంఘిక సంబంధాల్లో తగినంత భద్రత వుండదని నిరూపించినవారు - స్మాక్, క్రూక్ షాంక్షలు.

Important Points

  • "కాలం కంటే మంచి సలహాదారు ఎవరు లేరు."
  • "చెయ్యటం ఒక కల - తెలుసుకోవటం ఒక విజ్ఞాన శాస్త్రం"
  • "ప్రపంచం చూసిన అత్యుత్తమ దినం ఈ రోజే."
  • "పని దాని యొక్క విలువ కంటే ముఖ్యమైనది."
  • "హిందువులు, ముస్లింలు భారతదేశానికి రెండు కళ్ళు లాంటివారు." - సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్.



No comments:

Post a Comment

Post Bottom Ad