5. వైయక్తిక భేదాలు - ప్రజ్ఞ - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Tuesday, June 11, 2024

5. వైయక్తిక భేదాలు - ప్రజ్ఞ

 V వైయక్తిక భేదాలు - ప్రజ్ఞ


డి.యస్.సి. సైకాలజీ విభాగంలో ఈ పాఠ్యాంశానికి సంబంధించి 6 నుండి 7 ప్రశ్నలు వస్తున్నాయి. ఈ పాఠ్యాంశంను 8 అంశాలుగా విభజించి వివరించడం జరిగింది.

1. వైయక్తిక భేదాలు

2. ప్రజ్ఞ - లక్షణాలు

3. ప్రజ్ఞ - సిద్ధాంతాలు

4. ప్రజ్ఞాలబ్ధి

5. ప్రజ్ఞా - పరీక్షలు

6. సహజ సామర్ధ్యాలు

7. అభిరుచులు - వైఖరులు

8. సృజనాత్మకత


1. వైయక్తిక భేదాలు

  • ఒక వ్యక్తిని ఇతరుల నుంచి వేరుచేసి, ప్రత్యేకించి చూపగల లక్షణాలను వైయక్తిక భేదాలు అందురు.
  • వైయక్తిక భేదాలు రెండు రకాలు అవి :- 1. అంతరవ్యక్తిగత బేధాలు 2. వ్యక్తి అంతరభేదాలు
  • వివిధ వ్యక్తుల ప్రవర్తనా తీరులలో కనిపించు భేదాలను అంతరవ్యక్తిగత భేదాలు అంటారు. ఉదా:- రాముడు, సీత లలో ప్రజ్ఞ విషయంలో ఉన్నతేడాలు
  • వివిధ వ్యక్తుల సామర్థ్వాలలో, అభిరుచులలో, ఆసక్తులలో గల వైవిధ్యాలు అంతర వ్యక్తి భేదాలు అంటారు.
  • ఒకే వ్యక్తి ప్రవర్తనలో వివిధ సన్నివేశాలలో ద్యోతకమయ్యే వ్యత్యాసాలను వ్యక్తి అంతర విభేదాలు అందురు.
  • వ్యక్తిల్లో భిన్నత్వాన్ని తెలుసుకోవడానికి శాస్త్రీయ దృక్పధంతో పరిశీలించిన వారిలో అగ్రగణ్యుడు - సర్ ఫ్రాన్సిస్ గాల్టన్.
  • మానవ శాస్త్ర పరిశోధనాశాలను స్థాపించినది - గాల్టన్
  • వైయక్తిక భేదాలకు సంబంధించిన మొదటి శాస్త్రీయ రచన - Inquiry into human faculty and its development.
  • గాల్టన్ వలన ప్రభావితుడైన అమెరికా శాస్త్రజ్ఞుడు - జె. మెకిన్ కాటిల్
  • జె. మెకిన్ కాటిల్ రచించిన గ్రంధం - Mental test and measurment
  • వైయక్తిక భేదాలు ఏర్పడటానికి ముఖ్యకారకాలు - అనువంశికత, పరిసరాలు.
  • వైయక్తిక భేదాలుకు అనుగుణంగా విద్యను జరపడానికి మన రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన పథకం - APPEP
  • APPEP ఆరు అభ్యసనా సూత్రాలు

  1. ఉపాధ్యాయులు రూపొందించిన అభ్యసన ప్రక్రియలు కల్పించడం.
  2. క్రియలు, అన్వేషణలు, ప్రయోగాలు ద్వారా అభ్యసనాన్ని అభివృద్ధి పరచడం.
  3. వ్యక్తిగత, జట్టు, పూర్తి తరగతి పనిని అభివృద్ధి పరచడం.
  4. వైయక్తిక భేదాలకు అనుగుణంగా అభ్యసనాన్ని కల్పించడం
  5. స్థానిక పరిసరాలను - వనరులను వినియోగించుకోవడం
  6. ఆసక్తికరమైన తరగతి గదిని రూపొందించడం.

  • పిల్లల మానసిక అవసరాలు అయిన ప్రేమ, విజయసాధనావసరాలను తీర్చు APPEP సూత్రం - 6వ సూత్రం.
  • వైయుక్తిక భేదాలను నిర్ణయించే అతిముఖ్యమైన అంశాలు : 1. ప్రజ్ఞ 2. సహజసామర్థ్యాలు 3. వైఖరులు 4. అభిరుచులు 5. సృజనాత్మకత.

2. ప్రజ్ఞ - లక్షణాలు

  • ప్రజ్ఞ వ్యక్తి సహజ అంతర్గత శక్తి.
  • ప్రజ్ఞ వ్యక్తులందరిలో ఒకేలా ఉండదు.
  • జ్ఞాన, ప్రావీణ్యత, స్మృతి, నైపుణ్యం ప్రజ్ఞ లో భాగాలు కావు.
  • ప్రజ్ఞ ప్రక్రియ సంక్లిష్టమైన సమస్య సాధనకు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొవటానికి సహకరిస్తుంది.
  • ప్రజ్ఞను అనువంశికత ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
  • ప్రజ్ఞ వల్లనే విషయ అభ్యసన, నూతన పరిస్థితులకు సర్దుబాటు జరుగుతుంది.
  • ప్రజ్ఞాభివృద్ధి కౌమారదశ వరకు కొనసాగుతుంది.
  • ప్రజ్ఞ మాపనం చేసే ప్రక్రియ. దీనిని నిర్థిష్టంగా కొలవవచ్చు.
  • జాతి, మత, లింగబేధాలు ప్రజ్ఞకు లేవు.
  • ప్రజ్ఞా వల్ల జ్ఞాన సముపార్జన జరుగుతుంది.
  • జ్ఞానం సహాయంతో ప్రజ్ఞను మెరుగుపరుచుకోలేం
  • సృజనాత్మకత గల వారందరికీ ఎంతో కొంత ప్రజ్ఞ వుంటుంది.
  • ఆలోచనకు కావలసిన సామర్థ్యం
  • ప్రజ్ఞ పుట్టినపుడే నిర్ణయించబడుతుంది.
  • హేతుబద్దంగా ఆలోచించడానికి కావలసిన సామర్థ్యం.


3. ప్రజ్ఞ సిద్ధాంతాలు


ఏకకారక సిద్ధాంతం:

  • బినే, టర్మన్, స్టెర్న్ లు ప్రతిపాదించారు.
  • దీని ప్రకారం ప్రజ్ఞ అనేది ఒకే అంశపై ఆధారపడి వుంటుంది.
  • ఒక రంగంలో ప్రావీణ్యం ఉన్నట్లయితే మిగిలిన అన్ని రంగాలలో అదే విధమైన ప్రావీణ్యం ఉంటుందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది.

ద్వికారక సిద్ధాంతం:

చార్లెస్ స్పియర్మెన్ దీనిని ప్రతిపాదించారు.

దీని ప్రకారం ప్రజ్ఞ అనేది రెండు కారకాలు పై ఆధారపడి వుంటుంది.

వ్యక్తుల్లోని సామర్థ్యాలలో సంబంధాలను కనిపెట్టినది - స్పియర్మన్

సామర్థ్యాల మధ్య సహసంబంధాలను కారక విశ్లేషణ పద్ధతి ద్వారా స్పియర్మన్ కనుగొన్నారు.

ఒక వ్యక్తి అన్ని సామర్థ్యాలలో గల కారకాన్ని సామాన్య కారకం లేదా జి-ఫేక్టర్ అందురు.

ఒక ప్రత్యేక సామర్థ్యానికి సంబంధించిన కారకాన్ని నిర్థిష్టకారకం లేదా ఎస్- ఫేక్టర్ అందురు.

ప్రత్యేక కారకం అనేది ఒక అభిరుచి.

గణితంలో వ్యక్తి ప్రతిభ అతని సాధారణ ప్రజ్ఞ (జి), తీవ్రమైన గణిత అభిరుచులపై (ఎస్) ఆధారపడి వుంటుంది.


బహుకారక సిద్ధాంతం:

  • దీనిని ప్రతిపాదించినది - ఇ.ఎల్. థారన్ డైక్
  • ప్రజ్ఞ నాలుగు గుణాలుంటాయని పేర్కొన్నది - థారన్ డైక్ -> 1. అంతస్తు లేదా స్థాయి 2. వ్యాప్తి లేదా విస్తరణ 3. వైశాల్యం 4. నిష్పాదన వేగం
  • కృతంలో పై నాలుగు కారకాలు కలిపి పనిచేస్తాయని పేర్కొన్నాడు.
  • అన్ని కారకాల సముదాయమే ప్రజ్ఞ అని థార్క్ పేర్కొన్నారు.
  • థారన్ డైక్ మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి - CAVD అనే ప్రజ్ఞ పరీక్షను తయారు చేసాడు.

           C - వాక్యపూరణం

           A- గణితం

           V - పదజాలం

           D - నిర్దేశాలు

  • పాఠశాల కార్యక్రమాలు ప్రజ్ఞలోని గుణాలను పెంపొందించే విధంగా ఉండాలని సూచించినది - థారన్ డైక్


సామూహిక కారక సిద్ధాంతం: 

  • దీనిని ప్రతిపాదించినది - లూయూ . ఎల్. థర్ స్టన్
  • Primary Mental Abilities అనే గ్రందంలో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
  • ఈయన మానవునిలో 7 రకాల ప్రాధిమిక మానసిక సామర్ధ్యాలు ఉన్నట్లు కనుగొన్నారు.

                1.శాబ్దిక సామర్ధ్యం                    -  V

                2. స్మృతి                                   -  M

                3. తార్కిక సామర్ధ్యం                -  R

                4. సంఖ్యాక సామర్ధ్యం             -  N

                5. ప్రాదేశిక సామర్ధ్యం              -  S

                6. ప్రత్యక్షాత్మక సామర్ధ్యం       -  P

                7. పదధారాళత                       -  W

  • ఈ సిద్ధాంతం ఆధారంగా థర్ స్టన్ తయారుచేసిన ప్రజ్ఞా మాపని - థర్ స్టన్ ప్రాదమిక సామర్థ్యాల పరీక్ష
  • థర్ స్టన్ ప్రతిపాదించిన ఈ మూల సూత్రాలను తరువాత వచ్చే సహజ సామర్థ్యాల పరీక్షలకు ఆధారమైంది.

ప్రజ్ఞ స్వరూప సిద్ధాంతం:

  • దీనిని ప్రతిపాదించినది - గిల్ఫర్డ్
  • ఈయన 'అంశ విశ్లేషణ' పద్దతి ద్వారా ప్రజ్ఞలోని అంశాలను మూడుగా పేర్నొన్నారు. 1. విషయాలు 2. ప్రచాలకాలు 3. ఉత్పన్నాలు
  • విషయాలు - 4 +1 చిత్రాలు, ధ్వనులు, చిహ్నాలు, మాటలు, ప్రవర్తన
  • ప్రచాలకాలు - 5, మూల్యాంకనం, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, స్మృతి, సంజ్ఞానం.
  • ఉత్పన్నాలు - 6, అంతర్భావాలు, యూనిట్లు, వర్గాలు, సంబంధాలు, రూపాంతరాలు, పద్ధతులు (కోడ్ : “అ-యు-వ-స-రూ-ప")
  • గిల్ఫర్డ్ ప్రజ్ఞ 4x5x6 = 120 కారకాల సమూహం

ప్రజ్ఞ రకాలు:

- ప్రజ్ఞను మూడు రకాలుగా పేర్కొన్నది - థారన్ డైక్

1. అమూర్త ప్రజ్ఞ :- అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, మాటలు, సంఖ్యలు, పదాలను అర్ధం చేసుకోవడం, వాటి ద్వారా అర్ధాలను తెలియజేయడానికి అవసరమయ్యే శక్తిని అమూర్త ప్రజ్ఞ అందురు.


2. యాంత్రిక ప్రజ్ఞ:- భౌతికంగా కనిపించే వస్తువులను నిర్వహించే సామర్ధ్యాన్ని యాంత్రిక ప్రజ్ఞ అందురు.


3. సాంఘిక ప్రజ్ఞ:- మానవ సంబంధాల తో తెలివిగా ప్రవర్తించే సామర్థ్యం.


4. ప్రజ్ఞాలబ్ధి:

  • వ్యక్తుల తెలివితేటలు కొలవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వాడే కొలమానాన్ని ప్రజ్ఞాలబ్ది సూచి అంటారు.
  • ప్రజ్ఞాలబ్ధి మానసిక వయస్సుకు, వాస్తవిక వయసుకు గల సంబంధాన్ని తెలుపుతుంది.
  • ప్రజ్ఞాలబ్ధి పిల్ల మానసిక స్థాయిని అంచనావేస్తుంది.
  • ప్రజ్ఞాలబ్ధి భావనలను తొలిసారిగా ప్రతిపాదించినది - స్టెర్న్
  • తొలిసారిగా ప్రజ్ఞాలబ్ధి భావనను 'స్టాన్ఫోర్డ్-బినే ' పరీక్షలలో ఉపయోగించడం జరిగింది.
  • మానసిక వయస్సు అనుభావనను ప్రతిపాదించినది - బినే
  • మానసిక వయస్సును ప్రజ్ఞా పరీక్షలు ద్వారా నిర్ణయిస్తారు.
  • శారీరక వయస్సును పుట్టిన తేదిని బట్టి నిర్ణయిస్తారు. ప్రజ్ఞాలబ్ధి స్థిరంగా వుంటుంది.

ప్రజ్ఞాలబ్ధి పరిమితులు :

  • ప్రజ్ఞాలబ్ధి ఒక వ్యక్తి ప్రజ్ఞకు ప్రమాణం కాదు.
  • ఏదైనా ఒక పరీక్ష నిర్వహించి సూచించిన ప్రజ్ఞాలబ్ది పూర్తిగా విశ్వసనీయం కాదు.
  • ఏ ఒక్క వ్యక్తి పూర్తిగా ప్రజ్ఞావి హీనంగా ఉండడు. కాని ప్రజ్ఞా లబ్ధి సూచి శూన్య స్థానంతో ఆరంభమవుతుంది.
  • యోజనులు ప్రజ్ఞాలబ్ధి వివాదస్పదమైనది. ఊహస్పదమైనది.
  • గారట్ ప్రకారం పరసరాలలో మార్పు వ్యక్తి ప్రజ్ఞా లబ్ధిని ప్రభావితం చేస్తుంది.

ప్రజ్ఞాలబ్ధి విభాజనం: టెర్మన్ - మెర్రిల్ లు 2-18 సం|| వయోపరిమితి వారిని పరిశీలించి క్రింది విభాజనాన్ని ప్రతిపాదించాడు.

  • ఉపాధ్యాయులకు అధిక ప్రజ్ఞా వంతులు సమస్యగా కనిపిస్తారు.
  • భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన మానవవనరుల క్రింద అధిక ప్రజ్ఞావంతులు వస్తారు.


5. ప్రజ్ఞా పరీక్షలు

  • ఉద్యమానికి ఆద్యుడు- ఆల్ఫ్రెడ్ బినే.
  • 1904 లో ఫ్రాన్స్ లోని పబ్లిక్ పాఠశాలలపై వేసిన కమీషన్లో సభ్యుడు - ఆల్ఫ్రెడ్ బినే.
  • బినే పరీక్షలు విద్యా సాధన మీద కాక మానసిక సామార్థాలను కొలిచే విధంగా వుండేవి.
  • పాఠశాల విద్యార్థులలో వైయక్తిక భేదాలు కనుక్కోవడానికి బినే ఎవరి సహాయం తీసుకున్నాడు - సైమన్
  • 1905 లో 30 చిన్న పరీక్షలతో “బినే - సైమన్" ప్రజ్ఞా మాపనిని రూపొందించెను. (ఇదే మొదటి ప్రజ్ఞామాపని.)
  • 1908 లో 50 అంశాలతో 3 నుంచి 13సం|| వయస్సు వారికి సరిపోయే విధంగా 'సైమన్-బినే ప్రజ్ఞామాపనిగా రూపాంతరం చెందింది.
  • 1916 లో అమెరికా స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎమ్. టర్మన్ అతని అనుచరలు తయారుచేసిన ప్రజ్ఞామాపని
  • స్టాన్ఫోర్డ్, బినే ప్రజ్ఞామాపని.
  • ఇది 3 నుంచి 14 సం॥ వారి కోసం ఉద్దేశించినది.
  • 1973లో మెర్రిల్, టర్మన్ లు కలసి 2-18 సం||ల వయస్సులు కలవారికి ఉపయోగపడే విధంగా ఫారం ఎల్, ఫారం యం. అని రెండు నమూనాలను తయారుచేసారు.

ప్రజ్ఞా పరీక్షలు - రకాలు :

  • “ విషయాంశాలు ” ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు రకాలు 1. శాబ్దిక పరీక్షలు 2. అశాబ్దిక పరీక్షలు
  • శాబ్దిక పరీక్షలు - అక్షరజ్ఞానం కల్గిన వారికి వీటిని ఉపయోగిస్తారు.
  • అశాబ్దిక పరీక్షలు - అక్షర జ్ఞానం లేనివారికి వీటిని ఉపయోగిస్తారు.
  • 'సంఖ్య' ను బట్టి ప్రజ్ఞా పరీక్షలు రెండు రకాలు 1. వ్యక్తిగత పరీక్షలు 2. సామూహిక పరీక్షలు
  • “ప్రతిస్పందించేతీరు” ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు రెండు రకాలు 1. పేపర్ - పెన్సిల్ టెస్ట్స్ 2. నిష్పాదన పరీక్షలు
  • పర్ - పెన్సిల్ టెస్ట్స్ - ఇవి ప్రతిస్పందనలను పెన్సిల్ తో పేపర్పై వ్రాయగలిగేవి.
  • నిష్పాదన పరీక్షలు - ఈ రకం ప్రజ్ఞా పరీక్షలలో ప్రశ్నాంశాలకు కొన్ని కౌశలాలు లేదా పనుల ద్వారా ప్రదర్శించవలసి వుంటుంది.
  • “కాలం" ను ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు రెండు రకాలు 1. వేగ పరీక్షలు 2. శక్తి పరీక్షలు.
  • వేగ పరీక్షలు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి.
  • శక్తి పరీక్షలు - కాలంతో సంబంధ లేకుండగా పూర్తి చేయవలసి వుంటుంది.



ప్రజ్ఞా పరీక్ష మాలలు :

  • వీటిలో రెండు గాని అంతకంటె ఎక్కువగాని ప్రజ్ఞా పరీక్షలు వుంటాయి.
  • వెప్లర్ అడల్ట్ ఇంటిలిజెన్స్ స్కేల్ (WAIS), వెప్లర్ ఇంటిలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ (WISC)లు ప్రజ్ఞా పరీఓ మాలలు.
  • సిద్ధాంత రీత్య ద్వికారక సిద్ధాంతాన్ని ఆమోదించి, ప్రజ్ఞా పరీక్షలను తయారుచేసినది - విష్క్ (WISC)
  • వెష్ణరామాపనాలు రెంండింటిలోను రెండు విభాగాలున్నాయి. 1. శాబ్దిక అంశాలు 2. నిష్పాదక అంశాలు
  • సిద్ధాంతరీత్య ద్వికారక సిద్ధాంతాన్ని ఆమోదించి, సామాన్య కారకాన్ని పరీక్షించడానికి అనువైన అంశాలను ఎన్నుకొని పరీక్షలను ప్రామాణీకరిచాడు - వెష్లర్

విస్క్- wachsher intelligence sclae for children :

- 5-15 సం|| పిల్లలకు సంబంధించినది.

శాబ్దిక ఉపపరీక్షలు :


1. సమాచారం : ఇందులో పిల్లల నుంచి సేకరించే సమాచారం కోసం ప్రశ్నలుంటాయి.


2. అవబోధం : పిల్లలకున్న పదజాల పరిజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలుంటాయి. పిల్లలు యిచ్చే సమాచారమే కాక తమ భావాలను, ఆలోచనా పరిధి ఉద్వేగ భావాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు.

3. అంకగణితం : నిత్యజీవిత వ్యవహారంనకు సంబంధించిన నోటి లెక్కలు వుంటాయి.

4. సాదృశ్యాలు : సాదృశ్యం వున్న కొన్ని జతలు పదాలుంటాయి.

5. పదజాలం : కొన్ని పదాలు కష్టతరాన్ని బట్టి పేర్చబడి వుంటాయి.


నిష్పాదన పరీక్షలు :


1. చిత్ర పూరణ పరీక్ష : పిల్లలు చిత్తరువులో లోపించిన భాగాన్ని గుర్తించాలి.


2. బ్లాక్ డిజైన్ పరీక్ష : ఇందులో తొమ్మిది వివిధ రంగుల్లో వున్న సమఘనాలుంటాయి.


3. చిత్రసమీకరణ పరీక్ష : ఈ పరీక్షలో బొమ్మలుంటాయి. వాటిని వరుస క్రమంలో పేర్చి కథను రూపొందించాలి.


4. వస్తు సమాఖ్య : ఈ పరీక్షలో 4 ఫార్మ్ బోర్డులుంటాయి. ఇవి చిన్నచిన్న ముక్కలుగా వుంటాయి. వీటిని పేర్చితే నాలుగు ఆకారాలు వస్తాయి.


5. చిహ్న పరీక్ష : దీర్ఘచతురస్రంలో కొన్ని చిహ్నాలు వుంటాయి. ఆ చిహ్నలలో కొన్ని గుర్తులుంటాయి.


6. సహజ సామర్థ్యాలు

  • ప్రజ్ఞతో పాటు వ్యక్తిలోని ప్రత్యేక కారకాన్నే సహజ సామర్ధ్యం అందురు.
  • ఒక వ్యక్తి లో నిర్ధిష్టమైన జ్ఞానం, నైపుణ్యం లేదా నిర్వచింపదగిన ప్రతిస్పందనల సముదాయమే - సహజసామర్ధ్యం.
  • సాధారణ విషయాలలో ఒక వ్యక్తి సాఫల్యం "ప్రజ్ఞ" పై ఆధారపడి వుంటుంది.
  • వృత్తి సంబంధమైన విషయాలలో వ్యక్తి సాఫల్యం “సహజ సామర్ధ్యం" పై ఆధారపడి వుంటుంది.
  • ఒక వ్యక్తి ప్రజ్ఞా విశేషాలను బట్టి ఆ వ్యక్తి అనేక రంగాలలో రాణిస్తాడని చెప్పవచ్చు. కాని సహజ సామర్థ్యాలను బట్టి వ్యక్తి ప్రత్యేకంగా ఒక రంగంలో రాణిస్తాడనేది తెలుస్తుంది.

ఇవి మూడు రకాలు:


1. విద్యా విషయక సహజ సామర్థ్యాలు : సైనిక పాఠశాలలో ప్రవేశం కోసం జరిగే పరీక్షలలోను, రక్షణశాఖలోను, విద్యా సంస్థల ప్రవేశాలలోను సహజ సామర్థ్య పరీక్షలనుపయోగిస్తున్నారు.

జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) వారు గణిత శాస్త్ర విభాగాల్లో, అనేక భాషల్లో సహజ సామర్థ్యాల పరీక్షలను రూపొందించి వున్నారు. ఉదా: మెట్రోపాలిటన్ రెడినెస్ టెస్ట్, డిఫెరెన్సియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్


2. వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలు :


ఎ) యాంత్రిక సహజ సామర్థ్యాలు : అంగుళీ నైపుణ్య పరీక్ష (Finger Dixterity Test) (Tweezer Dixterity test - శ్రవణ నైపుణ్య పరీక్ష, మినెసోటా మానిప్యులేషన్ టెస్ట్)


బి) గుమస్తాగిరి సహజ సామర్థ్యాల పరీక్ష - మిన్నెసోటా క్లరికల్ టెస్ట్, జనరల్ కైరికల్ టెస్ట్


సి) టీచింగ్ అప్టిట్యూడ్ టెస్ట్ - "Teachers are born not made"


డి) Flying Aptitude Test - వైమానికి దళానికి సంబంధించినది


3. కళా సంబంధ సహజ సామర్థ్యాలు :

  • సంగీత సామర్థ్యాల వైవిధ్యాలను వ్యక్తులలో మాపనం చేయడానికి అతిముఖ్యమైన పరీక్ష - సీషోర్
  • మెషర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్స్. ఇందులో 6 అంశాలుంటాయి. 1. స్వరస్థాయి విఛక్షణ 2. స్వర తీవ్రత విచక్షణ 3. కాల విచక్షణ 4. ధ్వని రూప విచక్షణ 5. లయనిర్ధారణ 6. స్వరస్మృతి
  • చిత్ర లేఖన సామర్థ్య పరీక్ష : మెయిర్ - సీషోర్ ఆర్ట్ జడ్జ్మెంట్ టెస్ట్
  • సహజ సామర్థ్య పరీక్షమాలలో ముఖ్యమైనది - DAT (Differential Aptitude Test) - డిఫెరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ దీనిని థర్జన్ ప్రాథమిక శక్తుల ప్రజ్ఞ సిద్ధాంతం ఆధారంగా - జార్జ్ కె. బెన్నెట్ అతని అనుచరలు తయారు చేసారు. 1. శాబ్దిక వివేచనం 2. సంఖ్యా సామర్థ్యం 3. అమూర్త వివేచనం 4. ప్రాదేశిక సంబంధాలు 5. యాంత్రిక వివేచనం 6. గుమస్తా సామర్ధ్యం పరీక్ష 7. పదనిర్మాణం.
  • DAT ను ఎక్కువగా విద్యా, వృత్తి సంబంధిత విషయాల్లో మార్గదర్శకత్వం కోసం ఉపయోగిస్తారు.


7. అభిరుచులు - వైఖరులు


అభిరుచులు:

  • జె.పి. తను రచించిన డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అభిరుచులను మూడు రకాలుగా నిర్వచించాడు.

  1. ఒక విషయం వైపు లేదా ఒక వ్యక్తి వైపు లేదా ఒక వస్తువు వ్యక్తి అవధానాన్ని ఎక్కువకాలం నిలిపే ఒక వైఖరిని అభిరుచి అంటారు.
  2. ఒక విషయం లేదా ఒక కృత్యం ఒక వ్యక్తికి అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతి అన్నాడు.
  3. ఒక వ్యక్తి ప్రవర్తనను ఒక వైపుకు లేదా ఒక గమ్యానికి నడిపించే ప్రేరణ స్థితిని అభిరుచి అన్నాడు.

  • సహజ సామర్థ్యంతో పాటుగా అభిరుచి వుంటేనే ఆ విషయంలో అభివృద్ధి సాధించగలడు.
  • అభిరుచులను ప్రత్యేకంగా గుర్తించడానికి జి. స్టాన్లీహాల్ మొదటి సారిగా పిల్లల రిక్రియేషన్కు సంబంధించిన అభిరుచులు ప్రశ్నావళిని తయారుచేసాడు.
  • విద్యార్థులలో అభిరుచులను మాపనం చేయడానికి 4 పద్దతులను ఉపయోగిస్తుంటారు. 1. ప్రకటిత అభిరుచి 2. వ్యక్త అభిరుచి 3. పరీక్షల ద్వారా 4. అభిరుచి శోధకలు ద్వారా
  • అభిరుచి మీద రూపొందించిన పరిశోధకలలో ముఖ్యమైనది - స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని. దీనిని స్ట్రాంగ్ అనే పరిశోధకుడు అమెరికా లోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో రూపొందించాడు.

వైఖరులు- లక్షణాలు :

  • ఇది వ్యక్తి ప్రత్యేకమైన ప్రతిస్పందనా విధానం
  • అనువంశికంగా ఏర్పడవు.
  • స్వతంత్రంగా ఉండవు
  • ఉద్వేగాలతో కలిసిపనిచేస్తాయి.
  • వీటిని వ్యక్తి బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు
  • ఇవి సాంఘిక మనోవిజ్ఞానానికి సంబంధించిన అంశాలు.
  • కులాలు, మతాలు, వివాహం, కుటుంబ సంబంధాలు మొదలైన సాంఘిసంస్థల వైఖరులకు పునాదిరాళ్ళు.

వైఖరి మాపనలు :



8. సృజనాత్మకత

  • ఆలోచనలును రెండు రకాలుగా విభజించినది - గిల్ఫర్డ్.

    1.సమైక్య ఆలోచన : ఏదైనా ఒక విషయం గూర్చి ఉన్నది ఉన్నట్లుగా ఆలోచించడాన్ని సమైక్య ఆలోచన అంటారు.
   
    2.విభిన్న ఆలోచన : ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలను సూచించే ఆలోచననే విభిన్న ఆలోచనఅంటారు.

  • సమైక్య ఆలోచన కలిగిన వారిలో ప్రజ్ఞ అధికంగా వుంటుంది.
  • విభిన్న ఆలోచన కలిగిన వారిలో సృజనాత్మకత అధికంగా వుంటుంది.

సృజనాత్మకత - లక్షణాలు:

  • సృజనాత్మకత సార్వజనీనమైనంది.
  • శిక్షణ, విద్య వల్ల సృజనాత్మకత ఇంకా బాగా వికసిస్తుంది.
  • సృజనాత్మకత వల్ల నూతన విషయాలు జనిస్తాయి.
  • సృజనాత్మకత ఆలోచనకు అంతం లేదు.
  • సృజనాత్మకత వ్యక్తీకరణ విస్తృతమైంది.
  • సృజనాత్మకత వ్యక్తీకరణ వ్యక్తికి సంతృప్తిని, ఆత్మస్థైర్యాన్ని కలగచేస్తుంది.

సృజనాత్మకత - దశలు:

- సృజనాత్మక ప్రక్రియలో నాలుగు దశలను పేర్కొన్నది వల్లాస్

1. సన్నాహం:

  • వ్యక్తి అవసరమైన విషయ సామగ్రిని సేకరించి, సమైక్యపరచి అన్ని అంశాలను పరిశీలించి, అవరసరమైన సన్నాహ దశ.
  • ఈ దశ నిర్వహించడానికి ఎక్కువ సమయం పడుతుంది.
  • ఈ దశ లో కొన్ని భావనలు ఉత్పన్నమవుతాయి. కాని అది పరిష్కారానికి దారి తీయవు.
  • ఈ దశలో నిరాశకు గురికావచ్చు.

2. భావోత్పత్తి :

  • ఇది విశ్రాంతి దశ
  • లక్ష్య సాధనకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడు.
  • నూతన పరిజ్ఞానాన్ని పొందడు.
  • తనకు ఇష్టమైన రీతిలో నచ్చిన పనులు చేస్తూ కాలం గడుపుతున్నా అచేతన ప్రవర్తన సమస్యాపరిష్కారం వైపు పని చేస్తూ వ్యక్తి స్పూర్తికి కారణమవుతుంది.
  • నూతన ఆలోచనలు, భావాలు మనస్సులో ఉత్పన్నమవుతాయి.
  • ఈ దశలో భావనలు గుప్తస్థితిలో వుంటాయి.
  • దీనినే భావనోత్పత్తి లేదా గుప్త స్థితి అందురు.
  • ఈదశలో సృజనాత్మక భావనలు ఉత్పన్నమవుతాయి.

3. ప్రకాశం :

  • ఈ దశలో వ్యక్తికి సమస్యా పరిష్కారం వెంటనే మెరుపులా తడుతుంది.
  • దీనినే అంతర్ దృష్టి లేదా ఉచ్ఛ్వాసస్థితి అందురు.
  • ఈ దశలో సమస్యా పరిష్కారం లభ్యమవుతుంది.

4. నిరూపణ :

  • లభించిన పరిష్కారం సరిగా ఉందో, లేదో ఈ దశలో చూస్తారు.
  • లభించిన పరిష్కారం మార్పులను చేర్చి ఈ దశలో చివరి రూపం ఇవ్వడం జరుగుతుంది.


సృజనాత్మక పరీక్షలు:

సృజనాత్మక పరీక్షలను రూపొందించినది - టోర్రన్స్


Important Points

  • "దూరదృష్టి లేకపోతే మనిషి యంత్రంలా ఉంటాడు."
  • రక్తాన్ని ఇవ్వండి - మీకు స్వతంత్ర్యం ఇస్తాను." - నేతాజి.
  • “జై జవాన్ - జై కిసాన్" - లాల్ బహదూర్ శాస్త్రి.
  • "స్త్రీలకు ప్రసవం ఎలాంటిదో దేశానికి యుద్ధం అలాంటిది." - ముస్సోలిని.
  • ఇండియన్ మాకియవెల్లి - కౌటిల్యుడు.శాంతి మనిషి - లాల్ బహదూర్ శాస్త్రి.
  • సెయింట్ ఆఫ్ ద గట్టర్స్ - మదర్ థెరీసా



No comments:

Post a Comment

Post Bottom Ad