6. మూర్తిమత్వం - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Wednesday, June 12, 2024

6. మూర్తిమత్వం

 VI మూర్తిమత్వం


డి.యస్.సి. సైకాలజీ విభాగంలో ఈ పాఠ్యాంశానికి సంబంధించి 6 నుండి 8 ప్రశ్నలు వస్తున్నాయి. ఈ పాఠ్యాంశంను 9 అంశాలుగా విభజించి వివరించడం జరిగింది.


1. మూర్తిమత్వం - నిర్వచనాలు

2. మూర్తిమత్వం - లక్షణాలు

3. మూర్తిమత్వం- సిద్ధాంతాలు

4. మూర్తిమత్వం - అంచనా వేసే పద్ధతులు

5. మూర్తిమత్వం - కారకాలు

6. మానసిక ఆరోగ్యం

7. సర్దుబాటు - విషమయోజనం

8. రక్షణ తంత్రాలు

9. సంఘర్షణలు


  • మూర్తిమత్వం అనే పదం పర్సొనలైట్ అనే ఫ్రెంచ్ పదము నుండి పర్సోనా అనే లాటిన్ పదము నుండి ఉద్భవించింది
  • పర్సొనా అనగా ముసుగు అని అర్ధం.


1. మూర్తిమత్వం నిర్వనచాలు

  • వాట్సన్ : దీర్ఘకాలిక వాస్తవ పరిశీలనలో వ్యక్తమయ్యే లక్షణాల సముదాయం
  • హిలార్డ్ : వ్యక్తి లక్షణ సమగ్రరూపాన్ని, అతని ప్రవరన్తనా విధాన్ని సూచించి అది వ్యక్తి తన పరిసరాలతో సర్దుబాటు చేసుకునే విధానం.
  • కాంటర్ - వ్యక్తి ప్రతిచర్యల మొత్తం, చేసే కృత్యాల మొత్తం.
  • రెమండ్  బి. ఒక సన్నివేశంలో వ్యక్తి ప్రవర్తించే తీరు.
  • విల్బర్డ్ జేమ్స్ - వ్యక్తి పరిసరాలతో ప్రతిచర్యను పొందినపుడు ప్రస్ఫుటమయ్యే అతని శాశ్వత మానసిక లక్షణాలు.
  • ఆల్ఫోర్డ్ - పరిసరాలతో సర్దుబాటు చేసుకునే శారీరక, మానసిక రీతులు (ఇది సమగ్ర నిర్వచనం)
  • ఐసంక్: ఒక వ్యక్తి యొక్క సమగ్ర లక్షణాల సముదాయం
  • లెవెన్: మూర్తిమత్వం ఒక సమగ్ర వ్యవస్థ (లేక) సంపూర్ణ వ్యవస్థ
  • డేషియల్ : సాంఘిక సర్దుబాటులో లక్షణాల సముదాయం.
  • మూర్తిమత్వ మూలకాలను 8 రకాలుగా పేర్కొన్నది - పీటర్ సాండిఫర్డ్

  1. భౌతిక లేదా శారీరక లక్షణాలు - ఎత్తు, జట్టు రంగు, చర్మం రంగు, ఆరోగ్యం, అందం.
  2. శరీర నిర్మాణ లక్షణాలు: జీవనక్రియలు, రక్తం వర్గం, రక్తంలోని ఖనిజాలనిష్పత్తి, అంతఃస్రావసమతౌల్యం
  3. బౌద్దిక సామర్ధ్యాలు - ప్రజ్ఞ, విద్యా సాధన.
  4. సహజ సామర్ధ్యాలు - సంగీత, చిత్రరేఖన, నాట్య, గణిత, భాషా
  5. కౌశలాలు - సులభంగా, నిర్దిష్టంగాను చేయగలిగే క్రియలు, ఆటలాడటం, గీయడం, రాయడం.
  6. అలవాట్లు - వ్యక్తి తన దైనందిన జీవితంలో చేసే ఆర్జిత ప్రతిస్పందనలు.
  7. శక్తులు సంవేదనలు, వివేచన, విషయ నిర్ణయం, ధారణ శక్తి, భాషాశక్తి, పరిశీలన, స్మృతి, అవధానం
  8. లక్షణాంశాలు : సౌమ్యం, దౌర్జన్యశీలం, సరళం, కోపశీలత, మందకొడి స్వభావం.


2. మూర్తిమత్వ లక్షణాలు

1. మూర్తిమత్వం ప్రత్యేకమైనది. సమరూప కవలల్లో కూడా ఒకే విధంగా ఉండదు.

2. ఇది అనేక లక్షణాల సముదాయం కాదు. అన్ని అంశాల సమగ్రరూపం.

3. దీనిని వివరించవచ్చు, అంచనా వేయవచ్చు.

4. వంశపారంపర్య లక్షణాలు, పరిసరాలపై ఆధారపడి వుంటుంది.

5. దీనిని లక్షణాంశాలు ద్వారా అంచనా వేయవచ్చు.

6. ఇది స్థిరంగా ఉంటుంది, కాని స్తబ్దంగా వుండదు (గతిశీలమైనది)

7. ఇది అభ్యసన, అనుభావాల ద్వారా ఏర్పడుతుంది.

8. మూర్తిమత్వలో ముఖ్య అంశం - స్వీయ చేతనత్వం.


3. మూర్తిమత్వం- సిద్ధాంతాలు

1. సిద్ధాంతాలు - వ్యక్తిరూపరేఖలు గురించి వివరించేది

2. లక్షణాంశ సిద్ధాంతాలు - వ్యక్తి లక్షణాలను అనుసరించే వివరించేది

3. మనోవిశ్లేషణ సిద్ధాంతం(నిర్మితీయ సిద్ధాంతం)

రూపసిద్దాంతాలు :

1. హిప్పోక్రాటిస్ వర్గీకరణ : రసాలు - చిత్తవృత్తులకు 4 రకాలుగా సంబంధం వుంటుందని పేర్కొన్నాడు.

ఎ. ఔత్సాహికుడు - రక్తం, సంతోషంగా, ఆశాజీవి, త్వరగా సర్దుబాటు, ప్రతీ విషయం తేలికగా తీసుకొనే స్వభావం, ఉద్వేగ, శారీరకంగా బలంగా వుంటారు.

బి. పైత్య ప్రవృత్తిగలవారు : పైత్యరసం - కోపశీలుడు, చిరాకు స్వభావం, ఉద్వేగ అస్థిరత ఎక్కువ, శారీరకంగా బలంగా, ఉద్వేగ పరంగా బలహీనంగా వుంటారు.

సి. శ్లేష్మప్రవృత్తిగలవారు : శ్లేష్మరసం - నెమ్మదస్తులు, నిదానంగా, సోమరిగా వుంటారు, సంఘంతో సంబంధంలేనివారు, ఏకాకులు, ఉద్వేగ పరంగా, బలంగా, శారీరకంగా బలహీనంగా వుంటారు.

డి. విషణ్ణువు : నల్లని పైత్యరసం- విచారంగా, మందకొడిగా, నిరాశవాదులు, శరీరంగా, ఉద్వేగ పరంగా బలహీనంగా వుంటారు.

2. ఎర్నస్ట్ క్రెష్మర్ వర్గీకరణ : ఈయన పిచ్చివాళ్లను పరిశీలించి శరీర నిర్మాణం, ఆధారంగా మూర్తిమత్వాన్ని వివరించేను. మూడు రకములుగా వర్గీకరించెను.

ఎ. పీవరకాయులు : పొట్టిగా, లావుగా - ఉల్లాసం, ఉద్వేగస్థిరత్వం ఎక్కువ, కలుపుగోరులు, ప్రతివిషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు. మేధావులు, బహిర్వుర్తునులు.

బి. క్రీడాకాయులు : శరీరధారుడ్యం అనుపాతం - ఆశావాదులు, ఉభయవర్తునులు.

సి. ప్రాంశుకాయులు : సన్నగా, పొడువుగా - అంతర్వర్తునులు, ఆదర్శజీవులు, భావవాదుల, ఖచ్చితత్వాన్ని పాటించేవారు, సిగ్గు ఎక్కువ.

3. షెల్డన్ వర్గీకరణ : యువతియువకుల ఫోటోలను పరిశీలించి వారి “శరీర ఆకృతిని" బట్టి మూర్తిమత్వాన్ని వివరించారు.

1. స్థూలకాయులు :- ఉల్లాసప్రియులు, సంతోషప్రియులు, సాంఘిక పరిపక్వత చెందినవారు, బహిర్వర్తునులు.

2. మధ్యమకాయులు :- శరీరధారుడ్యం కలవారు, ఆరోగ్యవంతులు, స్వయం ప్రతిపాదన గలవారు, కష్టసుఖాలను సమంగా ఎదుర్కొన్నవారు, సాహసాలు చేయడానికి ఇష్టపడతారు.

3. లంబకృశకాయులు :- సున్నిత స్వభావులు, సాంఘిక సంబంధాలు ఇష్టపడరు, అంతర్ముఖునులు నిరాశావాదులు, ముభావంగా వుంటారు.

పై వర్గీకరణ ఆధారంగా లాల్బహుదూర్ శాస్త్రి, గాంధీజీ మూర్తిమత్వం 1.1.7

4. యాంగ్ వర్గీకరణ : ఈయన మానసిక గుణాలు లేదా సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనే అభిరుచి ఆధారంగా రెండు రకాలుగా విభజించాడు.

ఎ. బహిర్వర్తునలు : సంఘజీవులు, ఉల్లాస ప్రియులు, వదరుబోతులు, జీవితాన్ని వినోదంగా గడుపుతారు. చింతన సామర్ధ్యం తక్కువ, చొరవ చూపిస్తారు. సాహసాలు ఇష్టపడతారు, తొందర స్వభావం కలవారు, చురుకుగా వుంటారు. మాటకారులు, నాయకత్వ లక్షణాలు కలిగిన వారు, మార్పును తేలికగా అంగీకరిస్తారు, ఆతృత ఎక్కువ. రాజకీయనాయకులు, సంఘసేవకులు, నటులు, వ్యాపారస్తులు, క్రీడాకారులు ఈ రకానికి చెందినవారు. ఆశవాదులు.

బి. అంతర్వర్తునులు : ముభావంగా, ఉపసంహరణ ధోరణితో తమలో తామే ఆలోచించుకుంటూ ఏకాకులుగా ఉండటం ఇష్టపడతారు, ఇతరులతో కలవరు, మితభాషులు, శాంతి స్వభావులు, నిశబ్దంగా ఉంటారు. స్థిరమైన ఆలోచన కలవారు, నిరాసవాదులు, ఊహాశక్తికలవారు, కళలు సాహిత్యంలో ప్రావీణ్యం చూపిస్తారు. పుస్తక పఠనం ఇష్టపడతారు. తమ బాధలను ఇతరులకు వ్యక్తపరచరు. తత్వవేత్తలు, రచయితలు, శాస్త్రవేత్తలు ఈ రకానికి చెందినవారు.

ఉభయ వర్తనులు :- ఈయన విలువలను ఆధారంగా వర్గీకరించారు.

5. స్పాంగ్లర్ వర్గీకరణ :

ఎ) సైద్ధాంతిక విలువ - ఆదర్శాలను సూత్రాలను ఏర్పరచుకొని నిర్థిష్ట పద్ధతిలో ప్రవర్తిస్తారు. మేధావులు, రచయితలు, శాస్త్రవేత్తలు ఈ రకానికి చెందినవారు. ఉదా: అబ్దుల్ కలాం.

బి) ఆర్ధిక విలువలు కలవారు :- ప్రతి పనిని లాభనష్టాలతో, ధనం దృష్టితో చూస్తారు. ఉదా : బిల్ గేట్స్

సి) సాంఘిక విలువలు కలవారు : ఉద్యమాలు నడపడం, సంఘసేవలలో ఆసక్తిచూపడం, నాయకత్వం వహించడం చేస్తారు. ఉదా : గాంధీజి

డి) రాజకీయ విలువలు కలవారు తనచుట్టూ ఉన్నవారిని ఒప్పించగలరు, సమస్యలను పరిష్కరించగలరు, సృష్టించగలరు. ఉదా: ఎన్.టి. రామారావు

ఇ) మత విలువలు కలవారు : మతసూత్రాలను ఆధారంగా జీవిస్తారు ఉదా : కె.ఎ.పాల్

ఎఫ్) సౌందర్యోపాసన విలువలు కలవారు అందానికి ప్రాముఖ్యత ఇస్తారు. వ్యక్తిగత, గృహ అలంకరణకు, పారిశుద్ధ్యానికి పాకులాడుతారు. లలిత కళలన్న చేతిపనులన్నా యిష్టపడతారు.


లక్షణాంశ సిద్ధాంతాలు :

వ్యక్తిలోని దాదాపు శాశ్వతంగా ఉండే గుణాన్ని లక్షణాంశం అందురు. ఉదా : వదరుబోతుతనం, మౌన స్వభావం, దౌర్జన్య స్వభావం

1. ఆల్పోర్టు వర్గీకరణ : ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనావేయడానికి అతని లక్షణాంశలు తెలుసుకోవడం అవసరం -  ఆల్ పోర్టు

ఎ. వ్యక్తిగత లక్షణాంశాలు (కేంద్ర లక్షణాంశాలు) - ఒక వ్యక్తి తదితర వ్యక్తుల నుంచి వేరుచేసే ప్రత్యేక లక్షణాంశాలు. ఉదా : హస్యం, వీటిని పరిశీలన ద్వారా వ్యక్తిగత రికార్డులద్వారా అధ్యయనం చేస్తారు.

బి. సామాన్య లక్షణాంశాలు (ప్రాధమిక లక్షణాంశాలు) - అందరి వ్యక్తులలోను ఎంతోకొంత ఉండే గుణాలు. ఉదా : దయ, జాలి, వీటిని మూర్తిమత్వ పరీక్షల ద్వారా మాపనం చేస్తారు.

2. రెమండ్ బి. కాటిల్ వర్గీకరణ : ఈయన లక్షణాలను వివరించే పట్టికను తయారుచేసే కారక విశ్లేషణ ఉపయోగించి లక్షణాంశాలను రెండు రకాలుగా వివరించాడు.

  • ఈయన 17,953 ప్రవర్తణ లక్షణాలను క్రోడీకరించి, సారుప్య పదాలను తీసివేసి 171 లక్షణాలను ప్రాధమిక లక్షణాలుగా గుర్తించారు.
  • ప్రాధమిక లక్షణాంశాలు కొన్నింటికి మధ్య సహసంబంధం ఎక్కువగాను, కొన్నింటి మద్య తక్కువగాను వుంది. వీటిని 35 ప్రత్యేకమైన సమూహాలుగా గుర్తించడం జరిగింది. ఇవి ఉపరితల లక్షణాంశాలు.
  • ఉపరితల లక్షణాంశాలు ప్రత్యేకంగా పరిశీలించగలిగిన ప్రవర్తనా గుణాలు
  • ఉపరితల లక్షణాంశాలలో స్థిరత్వం లేదు.
  • ఉపరితల లక్షణాంశాలను విశ్లేషించి పరస్పర సంబంధమున్న పదాలను తీసివేయగా వున్న లక్షణాలను 16 మూల లక్షణాంశాలు అంటారు.
  • మూల లక్షణాంశాలు స్థిరంగా ఉంటాయి.
  • ఉపరితల లక్షణాంశాలు, మూల లక్షణాంశాల పై ఆధారపడి వుంటుంది.
  • మూల లక్షణాంశాలు, ఉపరితల లక్షణాంశాల ద్వారా వ్యక్తపరచడం జరుగుతుంది.
  • సాధారణ పరీక్షలు, ప్రశ్నావళులు, నిర్ధారణ మాపనలు ద్వారా ఉపరితల లక్షణాలను గుర్తించి, ఆ తరువాత విశ్లేషణ పద్దతుల ద్వారా మూల లక్షణాంశాలను గుర్తిస్తారు.
  • మూల లక్షణాంశాలు మాత్రమే వ్యక్తి మూర్తిమత్వానికి తోడ్పడతాయి అని చెప్పింది - కాటిల్.
  • మూర్తిమత్వం ఏర్పడటానికి మూలలక్షణాంశాలు మూల కారణం
  • కాటిల్ వర్గీకరణ లో రకాలు - 2 అవి 1. ఉపరితల లక్షణాంశాలు- ధైర్యం, పట్టుదల (బాహ్యలక్షణాలు) 2. మూల లక్షణాంశాలు - విశ్వాస భావన

3. ఐసెంక్ వర్గీకరణ :

ఈయన కారల్ విశ్లేషణ పద్దతి ప్రకారం రెండు మూల లక్షణాంశాలు : అంతర్వర్తనం బహిర్వర్తనం, రెండు మూల విశేషకాలు : సుస్థిరం - అస్థిరంను గుర్తించెను.

నిర్మితి సిద్ధాంతాలు:

  • వ్యక్తి సమగ్ర రూపాన్ని, అతని ప్రవర్తనా ప్రకార్యాలను వివరించే ధోరణే - నిర్మితి సిద్దాంతాలు.

1. మనో విశ్లేషణ సిద్ధాంతం:

దీనిని రూపొందించినది - సిగ్మండ్ ఫ్రాయిడ్ (ఆస్ట్రియా).

ఫ్రాయిడ్ వైద్యశాస్త్ర పట్టభద్రుడు.

ఫ్రాయిడ్ మనోరోగ చికిత్స గురువు - చార్కాట్ (పారిస్)

హిస్టీరియా రుగ్మతకు గాఢమైన కారణాలను అన్వేషించి, చివరికి మనోవిశ్లేషణ సిద్ధాంతంను రూపొందించాడు.

మనో విశ్లేషణ సిద్ధాంతం మానసిక వ్యాధులకు చికిత్స చేసే ఒక పద్దతే కాదు, మూర్తిమత్వాన్ని వివరించే ఒక సిద్దాంతం.

మనోవిశ్లేషణ సిద్ధాంతం అచేతన ప్రేరణ ద్వారా ప్రవర్తనను, తద్వారా మూర్తిమత్వాన్ని వివరించడానికి ప్రయత్నిస్తుంది.

మనో విశ్లేషణ సిద్ధాంతంలో 3 అంశాలున్నాయి : 1. మూర్తి మత్వనిర్మాణంలో అచిత్తు అహం అధ్యహం 2. మూర్తిమత్వ గతిశీలతలో  చేతనం ఉపచేతనం అచేతనం 3. మనోలైంగిక వికాసంలో 5దశలు

అచిత్తు

  • ఇది పుట్టుకతో వచ్చే సహజ సిద్దమైన గుణాలు, సహజాతాలు, జంతు వాంఛలు, దౌర్జన్య స్వభావి.
  • ఇది వినాశకారి, మొరటైనది, విచక్షణ లేనిది, ఇది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది.
  • ఇది అచేతన వ్యవస్థలో వుంటుంది.
  • ఇది మనసులో మెదిలే భావన వెంటనే తీర్చడానికి తొందరపెడుతుంది.
  • ఇది మనిషి సహజ ప్రవృత్తి (నైతిక విలువలు పాటించదు.)

అహం

  • అనుభవాల ద్వారా, శిక్షణ ద్వారా అచిత్తులోని భాగం అహంగా రూపొందుతుంది.
  • ఇది కోరికలను పరిస్థితులకు అనుగుణంగా సాధిస్తుంది.
  • ఇది వ్యక్తి ఉనికి ని రూపొందిస్తుంది. ఇది చేతనావ్యవస్థ లో వుంటుంది.
  • వాస్తవిక సూత్రాన్ని పాటిస్తుంది.
  • నైతిక, అనైతిక విషయాలను ఆలోచిస్తుంది.
  • అనైతిక ఆలోచనలను కట్టడి చేస్తుంది.

ఆధ్యహం 

  • ఇది ఈగోను పర్యవేక్షిస్తుంది. నీతిని బోధిస్తుంది. అచిత్తును విమర్శిస్తుంది. ఇది వ్యక్తి అంతరాత్మ్య.
  • శిశువు తల్లిదండ్రులతో, గురువులతో, స్నేహితులతో, పాఠశాలల్లో సమాజంలో జరిపే చర్యల వలన ఇది వికసిస్తుంది.
  • ఇది ఆదర్శ సూత్రాన్ని పాటిస్తుంది. ఇది పూర్తిగా నైతికతకు సంభందించినది.
  • అచిత్తు, ఆధ్యహంల మధ్య సయోధ్య కుదిర్చేది : అహం.
  • మంచి, చెడ్డలను గుర్తించి సాంఘిక ఆచారాలను పాటించేలా చేస్తుంది.
  • పరీక్షలో విద్యార్ధిని అధిక మార్కులు కోసం ప్రక్కవాని నుంచి చూసి రాయమనేది ఇడ్ అయితే, అలాకూడదు అని నిర్ణయించేది ఇగో, తప్పుచేయవద్దని హెచ్చరించేది సూపర్ ఇగో.

చేతనం

  • వ్యక్తి చైతన్యవంతుడుగా ఉన్నప్పుడు తన జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించే అనుభవాలన్నింటినీ చేతనం అంటారు.
  • వర్తమాన అనుభవాలు చేతనావస్థలో వుంటాయి.
  • తక్షణం మనం గుర్తుకు తెచ్చుకునే
  • విషయాలు ఈ చేతనం వల్ల జరుగుతాయి.
  • మన కళ్లు ఎదుట జరిగే విషయాలను గుర్తించడం.

ఉపచేతనం

  • ఇది మనస్సులో కొంచెం లోతులో వుంటుంది.
  • అవసరమున్నపుడల్లా అనుభవాలు లేదా విషయాలను గుర్తుకు తెచ్చుకొనే భాగం
  • కొద్దికాలం క్రితం చదివిన పాఠాలు ఉపచేతనంలో వుంటాయి.

అచేతనం

ఇక్కడ ఉన్న విషయాలు ఎంత ప్రయత్నించినా జ్ఞప్తికి రావు.


మనోలైంగి వికాస దశలు :

  • ఫ్రాయిడ్ ప్రకారం ప్రతిశిశువులో కొంతమెతాదులో లైంగిక శక్తివుంటుంది. దానినే LIbido (లిబిడో) అందురు.
  • లిబిడో మనో లైంగిక దశలు ద్వారా క్రమంగా ఆయా కేంద్రాల ద్వారా అభివ్యక్తమవుతూ లైంగిక సహజత్వాన్ని తృప్తిపరుస్తూ వికసిస్తుంది.
  • ఫ్రాయిడ్ ప్రకారం ఒక్కొక్క దశలో శరీరంలోని ఒక్కొక్క కేంద్రం, కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది.

1. మౌఖిక దశ :

  • ఇది 1 సం॥లో వుంటుంది.
  • నోరు కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది.
  • తల్లిపాలు తాగుతున్నప్పుడు లైంగిక సహజాతం, సంతృప్తి చెందుతుంది.
  • ఈ దశలో స్థిరీభవనం పొందినవారికి దనదాహం, ప్రేమదాహం, అధికారదాహం, నిరాశావాదులు, వివాదస్వభావులు, ద్వేషభావం, గోళ్లు కొరకటం, వేళ్లు చీకటం, అతిగా తినడం, అన్ని అతిగా ప్రదర్శించడం చేస్తారు.

2. ఆసన దశ :

  • ఇది 2-3 సం|| వయస్సులో వుంటుంది.
  • పాయువు కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది.
  • మలవిసర్జన కార్యాల ద్వారా లైంగిక సహజాతం సంతృప్తి చెందుతుంది.
  • ఈ దశలో స్థిరీభవనం చెందిన వారు ఉదార స్వభావులుగా, దానధర్మాలు చేసేవారుగా, ప్రేమానురాగాలు అందించేవారుగా, సహాకారిగా, మొండివారిగా, క్రమాన్ని కాలాన్ని పాటించనివారిగా, స్వార్థపరులుగా, పిసినార్లుగా వుంటారు. (ప్రామాణీకతను పాటించారు)

3. శిశ్నదశ:

  • ఇది శిశువు పూర్వ బాల్య దశలో జరుగుతుంది.
  • జననేంద్రియాలు కామోద్దీపన కేంద్రంగా ప్రాముఖ్యత వహిస్తాయి.
  • ఈ దశలో మగపిల్లలు తల్లిప్రేమ, అనురాగాలు పొందాలను కోవడాన్ని ఇడిపస్ కాంప్లెక్స్ అంటారు.
  • వీరికి తండ్రి ప్రత్యర్ధి. ఆడపిల్లలు తండ్రి ప్రేమాను రాగాలను పొందాలను కోవడాన్ని ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారు.

4. గుప్తదశ:

  • ఇది యవ్వనారంభ, పూర్వకౌమార వయస్సులో వుంటుంది. మగపిల్లలు తల్లిప్రేమాభిమానాలను, పొందడానికి తండ్రిలోని లక్షణాలను అవలంభించడం ప్రారంభిస్తారు.
  • అమ్మాయిలు తండ్రి ప్రేమాభిమానాలను పొందడానికి తల్లిలో గల లక్షణాలను అవలంబించడం ప్రారంభిస్తారు.
  • పై చర్యలో పిల్లలు తాదాత్మీకరణం, అంతరీకరణం అనే మానసిక తంత్రం ద్వారా అలవరచుకొంటారని ఫ్రాయిడ్ పేర్కొన్నాడు.

5. జననాంగాలదశ:

ఇది  ఉత్తర  కౌమార, తొలి వయోజన వయస్సులో వుంటుంది. ఈ దశ ప్రారంభంలో సజాతి లైంగిక అభిమానం వుంటుంది. మెల్లగా విజాతి లైంగిక అభిమానం కనబడుతుంది.

  • వ్యక్తి మూర్తిమత్వ నిర్మాణం
  • వికాసం లో శైశవ, బాల్య దశలకు ఫ్రాయిడ్ ఎక్కువగా ప్రాముఖ్యత యిచ్చెను.
  • పిల్లలలోని దౌర్జన్య శీలం, లైంగిక వాంఛలు ప్రకృతి సిద్దమనీ ఫ్రాయిడ్ పేర్కొనెను.

2. మనో - సాంఘిక వికాస సిద్ధాంతం : (అహం కేంద్రీకృత సిద్ధాంతం)

  • దీనిని ప్రతిపాదించినది - ఎరిక్ ఎరిక్సన్
  • ఈయన ఫ్రాయిడ్ మనో విశ్లేషణ వాదాన్ని అనుసరించాడు.
  • ఈయన ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోలైంగిక వికాస దశలను వ్యతిరేకించి మనో-సాంఘిక వికాస దశలను ప్రతిపాదించెను.
  • మనో సాంఘిక - వికాస సిద్ధాంతంలో కీలకాంశాలు:

  1. వ్యక్తి అహం సృజనాత్మకమైనది
  2. వ్యక్తి అహం సాంఘిక అంశాల ప్రభావానికి లోనవుతూ, క్రమానుగతంగా 8 సాంఘిక వికాస దశల గుండా పయనిస్తూ వికసిస్తుంది.
  3. వ్యక్తి అహం ప్రతిసాంఘిక దశలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆ క్లిష్ట పరిస్థితిని పరిష్కరించుకోవడం వలన తన నాణ్యతను పెంచుకుంటుంది.


ఎరిక్సన్ ప్రకారం మధ్యవయోజన దశవారి వల్లనే సమాజం జీవించగలుగుతుంది. సమాజంలో విలువలు పరిరక్షింపబడతాయని. నూతన విలువలు సమాజంలో ఉద్యమిస్తాయని పేర్కొన్నారు.

సాంఘిక పరిస్థితలలో వ్యక్తి జరిపే చర్యా ప్రతిచర్యలు అతని అహం నాణ్యతను పెంచుతాయనీ, అదే మూర్తిమత్వ వికాసం అని ఎరిక్సన్ పేర్కొన్నారు.


4. మూర్తిమత్వాన్ని అంచనావేసే పద్దతులు

మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్దతులను ముఖ్యంగా మూడు రకాలుగా వర్గీకరించారు.

1. వ్యక్తి ప్రధాన పద్ధతులు - వ్యక్తి అధ్యయనం, పరిపృచ్ఛ, స్వీయచరిత్ర, ప్రశ్నావళి

2. విషయగత పద్దతులు - మూర్తిమత్వశోధికలు, నిర్ధారణ మాపనలు, శోధన సూచికలు, జీవితచరిత్ర, సన్నివేశ పరీక్ష (స్థితి పరీక్ష) సంఘటనా రచన పద్దతి, సాంఘికమితి.

3. ప్రక్షేపక పద్ధతలు - సిరామరకల పరీక్ష, థీమాటిక్ ఎప్పర్ సెప్షన్ పరీక్ష, చిల్డ్రన్ ఎప్పర్ సెప్షన్ పరీక్ష, పద సంసర్గ పరీక్ష, వాక్యపూరణ పరీక్ష, మనో ప్రక్షేపక నాటిక, క్రీడా పద్దతి.

1. వ్యక్తిగత పద్ధతులు : వీటిలో వ్యక్తినుండి సమాచారాన్ని రాబట్టి అతని మూర్తిమత్వాన్ని అంచనా వేయడంజరుగుతుంది.

ఎ. వ్యక్తి అధ్యయన పద్ధతి : సమస్యా పూరిత వ్యక్తి నుండి ఆ సమస్యకు గల కారణాలను రాబట్టి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు.

బి. ఇంటర్వ్యూ : ఇది ముఖాముఖిగా జరిగే చర్య. వ్యక్తిని ప్రత్యక్షంగా, మౌఖికంగా ప్రశ్నించడం ద్వారా సమాచారాన్ని రాబడతారు.

సి. ప్రశ్నావళి : మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి తరుచుగా ఉపయోగించే పద్దతి ఇది. ప్రశ్నావళి రెండు రకాలు: 1. నిర్దిష్ట ప్రశ్నావళి 2. స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి

ఒకే సారి ఎక్కువమంది మూర్తిమత్వాన్ని ఈ పద్దతి ద్వారా అంచనా వేయవచ్చు.

డి. స్వీయచరిత్ర : ఎవరి చరిత్రను వారు రాసుకోవడాన్ని స్వీయచరిత్ర అంటారు.


2. విషయాగత పద్ధతులు : వ్యక్తికి తెలిసిన ఇతర వ్యక్తులనుండి సమాచారం సేకరించి ఆ వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు.

ఎ. మూర్తిమత్వ శోధికలు : ఇవి ప్రశ్నావళుల రూపంలో ఉంటాయి. ఉన్న విషయాన్ని యథాతదంగా ప్రకటిస్తాయి. ఉదా : ది బెల్ ఎడ్జస్ట్ మెంట్ ఇన్వెంటరీ, మిన్నెసోట మల్టిఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ

మిన్నెసోట మల్టిఫిసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీని రూపొందించినది - హథవె, మెకిని. ఇందులో 550 ప్రవచనాలు వుంటాయి.

బి. శోధనా సూచికలు : తరగతి గదిలో విద్యార్థుల మూర్తిమత్వాన్ని వీటిని ఉపయోగిస్తారు.

సి. నిర్థారణ మాపనలు : వ్యక్తి లక్షణాంశాలు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.

నిర్ధారణ మాపనలు రెండు రకాలు - 1. స్వీయ నిర్ధారణ మాపనలు, 2. ఇతరులు నిర్ధారణ చేయడం

నిర్ధారణ మాపనిలోని దోషాలు :

1) హాలోప్రభావం (పరివేషదోషం) - ఒక వ్యక్తిని చూడడం తోటే ఒక నిర్ణయానికి రావడాన్ని హాలో ప్రభావం అంటారు. (వ్యక్తి గురించి పూర్వం ఏర్పడిన అభిప్రాయాన్ని దృష్టి లో వుంచికొని మాపనం చేయడం.)

2) కేంద్రీయ ప్రవృత్తి దోషం - మాపనం చేసే వ్యక్తి అధికంగా సగటు మార్కును గుర్తించడం.

3) ఔదార్య దోషం - ఉదారంగా ఎక్కువ స్థాయిలో గుర్తించడం. వాడుకలో వున్న నిర్ధారణ మాపనలు - ది వినిలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, దివిటిన్ బర్నస్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్, ది ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్

డి. సన్నివేశ పరీక్ష : ఒక సన్నివేశంలో వ్యక్తి ప్రవర్తించే తీరు ఆధారంగా వ్యక్తి మూర్తిమత్వాన్ని అధ్యయనం చేస్తారు. ఇది వర్తమాన కాలానికి సంభవించినది. ఉదా : పరీక్ష రాస్తుండగా ఒక విద్యార్థి ప్రవర్తనను ఉపాధ్యాయుడు పరిశీలించుట

ఇ. సంఘటనా రచనా పద్దతి : దీనినే ఉపఖ్యానిక పద్ధతి అని ఎనడోటికల్ రికార్డు అని అందురు. వ్యక్తి గత జీవితం నుండి కొన్ని సంఘటనలు తీసుకొని అతని మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు.

ఎఫ్. జీవిత చరిత్ర : ఒక వ్యక్తి చరిత్రను వేరొక వ్యక్తి వ్రాయడాన్ని జీవితచరిత్ర అంటారు.

జి. సాంఘికమితి : దీనిని ప్రతిపాదించినది జాకబ్. ఎల్. మెరీనో. సాంఘిక సంబంధాలను గుర్తించడానికి ఈ పద్దతి తోడ్పడుతుంది. ఈ పద్దతిలో ఎక్కువమంది ఇష్టపడే వ్యక్తిని స్టార్ అని, ఎక్కువ మంది ఇష్టపడని వ్యక్తిని ఐసోలేట్ (ఏకాకి) అని అంటారు.


3. ప్రక్షేపణ పరీక్షలు :

  • ప్రక్షేపణ మనేది ఒక రక్షణ తంత్రం.
  • ఇందులో వ్యక్తి తనకు తెలియకుండా తనలోని లక్షణాంశాలను, అవసరాలను, ఘర్షణలను ఇతర వ్యక్తులకు లేదా వస్తువు గాని ఆపాదించడం జరుగుతుంది.
  • ఈ ప్రక్షేపణ పరీక్షలో ఒక అస్పష్టమైన ఉద్దీపన వుంటుంది.
  • వ్యక్తి ఈ అస్పష్టమైన ఉద్దీపనకు ప్రతిస్పందించి, మూర్తిమత్వ అంతర్గత లక్షణాంశాలను తనకు తెలియకుండానే వ్యక్తపరుస్తాడు.

ఎ. సిరామరకల పరీక్ష:

  • ఇది ప్రక్షేపణ పరీక్షలలో ఎక్కువగా వాడుకలో ఉంది.
  • దీనిని తయారు చేసినది హెర్మిన్ రోషాక్ (స్విట్జర్లాండ్).
  • ఇందులో 10 సిరామరకలున్న కార్డులు ఉంటాయి. (5 నలుపు, 2 నలుపు ఎరుపు, మూడు పంచరంగులు).
  • ఈ పద్దతిలో మూర్తిమత్వానికి అంచనా వేసే విషయాలు 4. అవి :


బి. ఇతి వృత్త గ్రాహ్యక పరీక్ష : దీనిని ముర్రే మార్గన్ లు రూపొందించారు. థీమా అనగా కథ, ఎప్పర్ సెప్షన్ అనగా సూక్ష్మంగా గ్రహించడం. ఇందులో 30+ 1 చతురస్రాకార కార్డు లుంటాయి. (10 కార్డులు పురుషులకు, 10 స్త్రీలకు, 10+1 స్త్రీ, పురుషులకు యిద్దరికి వాడుతారు) వీటి మీద నిజజీవితంలోని సంఘటనలో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల అస్పష్టచిత్రాలు ఉంటాయి. ఈ పరీక్షను విశ్లేషించడంలో నాయకుడు, కథాసారాంశం, పరిణామం మొదలగు విషయాలను పరిశీలిస్తారు. ఇది పెద్దవారికి పెట్టే పరీక్ష.

సి. చిల్డ్రన్స్ ఎప్పర్ సెప్షన్ టెస్ట్ : దీనిని రూపొందించినది - లియోపోల్డ్ బెల్లాక్

  • దీనిలో జంతువులకు, పక్షులుకు సంభందించి చిత్రాలు ఉంటాయి.
  • పద సంసర్గ పరీక్షను రూపొందించినది - కెంట్, రోసనాఫ్- సాంఘిక సంబంధాలు తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది.

డి. పదసంసర్గ పరీక్ష : దీనిని కెంట్ మరియు రొసనాఫ్లు రూపొందించారు.

ఇ. మనో ప్రక్షేపక నాటిక : మానసిక స్థిరత్వం లోపించిన వారికి దీనిని నిర్వహిస్తారు.

ఎఫ్. క్రీడాపద్దతి : పిల్లలు ఆటబొమ్మలతో ఆడుకుంటున్నపుడు వారి మూర్తిమత్వాన్ని ఈ పద్దతి ద్వారా అంచనా వేస్తారు.


5. మూర్తిమత్వం కారకాలు

  • ఇవి రెండు రకాలు 1. శారీరక కారకాలు 2. సాంఘిక సాంస్కృతిక కారకాలు.
  • శారీరక కారకాలలో ముఖ్యమైనవి - ఎ. నాడీ వ్యవస్థ, బి. అంతస్రావక గ్రంథులు
  • నాడీ మండల వ్యవస్థలో ముఖ్యమైనది మూడు భాగాలున్నాయి. అవి 1. కేంద్రీయ నాడీ వ్యవస్థ భాగాలు 2. పరిధీయ నాడీ వ్యవస్థ 3. స్వయం చోదిత నాడీవ్యవస్థ
  • కేంద్రీయ నాడీ వ్యవస్థ భాగాలు - మెదడు, కశేరు నాడీ దండం (వెన్నుపాము)
  • మెదడును మూడు భాగాలుగా విభజించారు 1. ముందు మెదడు 2. మధ్యమెదడు 3. వెనుక మెదడు
  • ముందు మెదడును మస్తిష్కం అంటారు. ఇది రెండు సమ అర్ధభాగాలుగా వుంది. వీటిని మస్తిష్క గోళార్థాలు అని అంటారు.
  • మస్తిష్క గోళార్థాలలో వెలుపలి భాగం బూడిద రంగులో, లోపలి భాగం తెలుపురంగులో వుంటుంది.
  • మస్తిష్క గోళార్థాలోని వెలుపలి మస్తిష్క వల్కలం ఉంటుంది.
  • మస్తిష్క వల్కలంలో వివిధ సమాచారాలను గ్రహించి విశ్లేషించే జ్ఞానకేంద్రాలు వుంటాయి.
  • అనుభూతులను ఇముడ్చుకొనే శక్తి మస్తిష్క వల్కలంకి వుంది.
  • వ్యక్తి ఆలోచన శక్తి, వివేచనాశక్తి, తెలివితేటలు మస్తిష్క వల్క నిర్మాణం, పని తీరుపై ఆధారపడి వుంటుంది.
  • మస్తిష్కం దిగువ నుండే మెదడు భాగాన్ని ద్వారగోర్థం అంటారు.
  • ద్వారగోర్థం వ్యక్తి ఉద్వేగాలైన కోపం, బాధ, ఆనందం, దుఃఖం, సంతోషం లాంటి భావావేశాలను నియంత్రించే కేంద్రాలున్నాయి.
  • ముందుమెదడును మధ్య మెదడుతో కలిపేది - ద్వారగోర్థం
  • ద్వారగోర్ధం లో హైపోథాలమస్, పీయాష గ్రంధి వుంటాయి.
  • వ్యక్తి శరీరం ఉష్ణాన్ని, దాహాన్ని, ఆకలిని నియంత్రించే కేంద్రాలు హైపోథాలమస్ వుంటాయి.
  • వ్యక్తి కండర వ్యవస్థను నియంత్రించేది - మధ్య మెదడు
  • మధ్య మెదడు పని తీరు మీద వ్యక్తి చాలకకౌశలాలు ఆధారపడి వుంటాయి.
  • థార్క్ పేర్కొన్న యాంత్రిక ప్రజ్ఞకు మూలం - మధ్యమెదడు
  • వెనుక మెదడులో అనుమస్తిష్కం, మెదడుకాండం అనే రెండు భాగాలున్నాయి.
  • వ్యక్తి శరీరాన్ని సమతాస్థితి లో ఉంచడానికి దోహదం చేసేది - అనుమస్తిష్కం
  • మెదడు కాండంలోని మజ్జాముఖం అనేది వ్యక్తి శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, లాలాజల స్రావకం, జీర్ణక్రియ మొ॥ అసంకల్పిత చర్యలను తన అధీనంలో ఉంచుకొంటుంది.
  • మెదడు నుంచి ఉద్భవించే 12 జతల నాడులను కపాలనాడులనీ, వెన్నుపాము నుంచి ఉద్భవించే 31 జతలు నాడులను వెన్నునాడులనీ అందురు.
  • నాడీకణంలో మూడు భాగాలుంటాయి. అవి : కణదేహం, డెండ్రైటులు, తంత్రికాక్షం
  • తంత్రికాక్షాలకు ఉండే తొడుగులను మైలిన్ తొడుగులు అందరు.
  • మైలిన్ తొడుగు తంత్రికాక్షాల ద్వారా ప్రసరించే విద్యుత్ ప్రచోదనాలు బయటికి పోకుండా కాపాడుతుంది.
  • ప్రచోదనాలను అతివేగంగా ప్రయాణింపజేస్తాయి.
  • తొడుగులచే కప్పబడిన తంత్రికాక్షలను నాడులు అందురు.
  • నాడులు మూడు రకాలు: అవి 1. జ్ఞాన నాడులు 2. చాలకనాడులు. 3. మిశ్రమ నాడులు
  • వ్యక్తిశరీరం లోపల, వెలుపల జరిగే మార్పులను గ్రాహకాలనే ప్రత్యేక కణాలు ద్వారా గ్రహించబడిన సమాచారాలను తక్కువస్థాయి విద్యుత్ ప్రచోదనాలుగా మార్చి మెదడుకుగాని, వెన్నుపాముకుగాని చేరవేసే నాడులను జ్ఞాననాడులు అంటారు.
  • మెదడుగాని, వెన్నుపాముగాని ఉత్పత్తి చేసే ప్రతిచర్యలను తక్కువస్థాయి విద్యుత్ ప్రచోదనాల రూపంలో అతి త్వరగా కండరాలకు, గ్రంధులకు చేర్చేవాటిని చాలకనాడులు అంటారు.
  • వ్యక్తి దృశ్య శ్రవణ విచ్ఛక్షణావేగం, వివిధ ఉద్దీపనలకు చేసే ప్రతిచర్యావేగం, కండర బలం, చలన వేగాలలో బలం మొ॥ నాడుల పనితీరుపై ఆధారపడి వుంటాయి.
  • వ్యక్తి బాధాకరమైన లేదా అపాయకరమైన ఉద్దీపనల నుంచి కాపాడేవి- అసంకల్పిత ప్రతీకార చర్యలు (ప్రతిక్రియ చర్యలు)
  • అసంకల్పిత ప్రతీకార చర్యలు మెదడుతో సంబంధ లేకుండా స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో వుంటాయి.
  • స్వయంచోదిత నాడీవ్యవస్థలో రెండు ఉపభాగాలున్నాయి. అవి 1. సహానువర్తి నాడీ వ్యవస్థ 2. సహానువర్తి పరనాడీ వ్యవస్థ.
  • శరీరాంగాలు పనుల వేగాన్ని తగ్గించేది - సహానువర్తి పరనాడీ వ్యవస్థ.
  • స్వయం చోదిత నాడీవ్యవస్థ జరిపే ప్రతిచర్యల రెండు రకాలు అవి 1. నిబంధన రహిత ప్రతిచర్యలు 2. నిబంధన సహిత ప్రతి చర్యలు
  • నిబంధన రహిత ప్రతి చర్యలు పుట్టుకతో వస్తాయి.
  • నిబంధన సహిత ప్రతిచర్యలు అభ్యసిస్తే వస్తాయి. (ఇవి ఒక పనిని అనేక సార్లు చేయడం ద్వారా ఏర్పడేవి)
  • ఇవాన్ పావ్ లోవ్ ప్రయోగాలు ఇచ్చిన నియమాలు నిబంధన సహిత ప్రతిచర్యలు ఫలితాలు
  • నాడీకణాలకు విభజన చెందేశక్తి ఉండదు. జీవి పిండదశలో మాత్రమే సమవిభజన ద్వారా ఒక ప్రత్యేకతను సంతరించుకొంటుంది. ఆ తరువాత విభజన చెందే శక్తి కోల్పోతుంది.
  • దెబ్బతిన్న నాడీకణ విభజన చెందేశక్తి ఉండదు. జీవి పిండదశలో మాత్రమే సమవిభజన ద్వారా ఒక ప్రత్యేకతను
  • సంతరించుకొంటుంది. ఆ తరువాత విభజన చెందే శక్తి కోల్పోతుంది.
  • దెబ్బతిన్న నాడీకణాలకు బదులు కొత్త నాడీకణాలు ఏర్పడవు. కాబట్టి నష్టం నాడీ మండాలనికి ఏర్పడితే ఆ నష్టం శాశ్వతం.
  • శరీరంలో మూడు ముఖ్యమైన భాగాల సమన్వయమే వ్యక్తి ప్రవర్తను రూపొందిస్తుంది. అవి : 1. గ్రాహకాలు 2. సంధానకాలు 3. ప్రభావకాలు

  1. గ్రాహకాలు - వ్యక్తి శరీరంలోపల, వెలుపల జరిగే మార్పులను గ్రహించేది
  2. సంధానకాలు - గ్రహించిన సమాచారంను జ్ఞాన నాడుల ద్వారా మెదడుకు లేదా వెన్నుపాముకు చేర్చి, అక్కడ విశ్లేషణ చెందిన సమాచారంను చాలకాడుల ద్వారా కండరాలకు లేదా గ్రంధులకు చేర్చబడేవి.
  3. ప్రభావకాలు - మెదడు లేదా వెన్నుపాము ఇచ్చే సంకేతాలాధారంగా ప్రతిస్పందించేవి.

  • రసాయిన స్రావకాలను విడుదల చేసే విధానాన్ని బట్టి గ్రంధులు రెండు రకాలు అవి: 1. నాళసహిత గ్రంధులు 2. నాళ రహిత గ్రంధులు (అంతస్రావ గ్రంధులు)
  • నాళసహితగ్రంధులు : ఇవి తమ స్రావకాలను నేరుగా రక్తంలోకి స్రవించవు. ఉదాహరణకు లాలాజల గ్రంధులు, జఠర గ్రంధులు, కాలేయం, మూత్రపిండాలు, స్వేద గ్రంధులు, జననాంగ గ్రంధులు.
  • నాళరహిత గ్రంధులు : వీటికి నాళాలు వుండవు.

  1. ఇవి విడుదల చేసే రసాయిన పదార్థాలను హర్మోనులు అంటారు.
  2. హార్మోనులు ప్రత్యక్షంగా రక్తంలోకి విడుదల అవుతాయి.
  3. హార్మోనులు జీవిక్రియల స్థాయిని హెచ్చువేయడంగాని, తగ్గించటం గాని చేస్తాయి.

  • నాళరహిత గ్రంధులలో ముఖ్యమైనవి - పీయాషగ్రంధి, అవటు గ్రంధి (థైరాయిడ్ గ్రంధి), పార్శ్వ అవటు గ్రంధి, క్లోమం, అధివృక్క గ్రంధి, ముష్కం, స్త్రీబీజకోసం.

పీయూష గ్రంధి :

  • ఇది బఠాణిగింజ పరిమాణంలో ఉంటుంది.
  • ఇది మెదడుతో వుంటుంది.
  • మిగతా అంతస్రావ గ్రంధులను నియంత్రిస్తుంది.
  • ఇది వ్యక్తి కండరాలు, లైంగిక అవయవాలు, మానసిక వికాసం పై ప్రభావం చూపుతుంది.
  • ఇది స్రవించే పెరుగుదల హార్మోను పిన్నవయసులో తగినంత స్రవించపోతే మరుగుజ్జుతనం, ఎక్కువగా స్రవిస్తే అతి దీర్ఘకాయత్వం వస్తుంది.
  • ఈ గ్రంధి స్రవించే హార్మోనుల కారణంగా వ్యక్తి చతురుడుగా, సాత్విక స్వభావుడుగా, మానసిక స్థిరత్వం గలవాడుగా వుంటాడు.

అవటు గ్రంధి

  • ఇది మెడలో వాయునాళానికి దగ్గరగా వుంటుంది.
  • ఇది థైరాక్సిన్ అనే హార్మోను స్రవిస్తుంది.
  • ఈ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం
  • అయోడిన్ లోపంతో అవటుగ్రంధి పరిమాణం వృద్ధిచెంది, వాచి సామాన్య గాయిటర్ అనే లక్షణం కనబడుతుంది.
  • థైరాక్సిన్ స్రావకం వ్యక్తి యవ్వనదశలో లోపించినపుడు క్రెటివిజమ్ అనే స్థితి ఏర్పడుతుంది. దీని వలన మెదడు వికసించదు.
  • థైరాక్సిన్ స్రావకం వ్యక్తి యవ్వనదశలో ఏర్పడితే మిక్సోడిమా అనే స్థితి ఏర్పడతుంది.
  • థైరాక్సిన్ స్రావకం తీవ్రంగా ఉండే వ్యక్తి ప్రభావశీలిగా అత్యాశాపరుడుగా కనబడతాడు.

పార్శ్వటు గ్రంధి

  • ఇది అవటు గ్రంధికి దగ్గరగా వుంటుంది.
  • ఇది పారాథార్మోన న్ను స్రవిస్తుంది.
  • ఇది తక్కువైతే ఎముకలలో గట్టితనం ఏర్పడకపోవడం, ఎక్కువైతే కండరాలు ఉత్తేజపడి సంకోచ స్థితిలో ఉండటం జరుగుతుంది. దీనినే టిటాని స్థితి అంటారు.

 అధివృక్క గ్రంధి

  • ఇవి మూత్రపిండాలపై టోపిలా వుంటాయి.
  • ఈ గ్రంధులు స్రవించే హార్మోనులలో ఎడ్రినాలిన్ ఒకటి.
  • ఎడ్రినాలిన్ స్రావకం ఎక్కువైతే త్వరగా జననేంద్రియ వికాసం, అమ్మాయిలకు మీసాలు రావడం,
  • పురుషుల వలే స్వరం బొంగురు కావడం జరుగుతుంది.
  • దీనిని Fight or fight hormone అని కూడా అందురు.

ముష్కాలు

  • ఇవి పురుషలైంగిక హార్మోనులను స్రవిస్తాయి. అవి డెస్టోస్టిరాన్లు, అండ్రోజనులు.
  • ఇవి, ప్రాథమిక, గౌణలైంగిక లక్షణాలను ఉత్పత్తి చేస్తాయి.
  • డెస్టోస్టిరాన్లు విడుదల కాకపోతే మగలక్షణాలు వృద్ధికావు. ఈ పరిస్థితిని నపుంసకత్వం అంటారు.

స్త్రీ బీజకోశాలు

  • ఇవి స్త్రీలైంగిక హార్మోనులను స్రవిస్తాయి. అవి ఈస్ట్రోజనులు, పొజెస్టిరాన్,
  • ఇవి ప్రాథమిక గౌణలైంగిక లక్షణాలు కనబరుస్తాయి.

క్లోమం (మిశ్రమ గ్రంధి )

  • దీనిలో కొంతభాగం నాళాలుగల గ్రంథి కొంతభాగాన్ని లాంగర్ హన్స్ పుటిక అనే నాళరహితంగా వుంటుంది.
  • లాంగర్ హన్స్ పుటిక స్రావకం రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రిస్తుంది.

- వ్యక్తి మూర్తిమత్వ నిర్మాణం పై ప్రభావం చూపే సాంఘిక, సాంస్కృతిక కారకాలు - కుటుంబం, పాఠశాల, సమాజం.

- వ్యక్తి నవజాత శిశువుగా ఉన్నపుడు అతని మొదటి పరిసరం - తల్లి సహచర్యం.

- కుటుంబం తరువాత వ్యక్తి మూర్తిమత్వం పై ప్రభావం చూపేది - పాఠశాల.


6. మానసిక ఆరోగ్యం

  • మానసిక ఆరోగ్యానికి నిర్వచనాన్ని ఇచ్చినది- బెర్నార్డ్
  • దెయ్యాలు, భూతాలు అనే నమ్మకాన్ని ఖండించి చికిత్సలో మానవతా దృక్పధంను ప్రవేశపెట్టినది - పీనల్
  • మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూలపురుషుడు - క్లిఫర్డ్ బీర్స్
  • మానసిక చికిత్సాలయంలోని దారుణ పరిస్థితులను వర్ణిస్తూ ప్రచురించిన గ్రంథం - A Mind that found itself (1908).
  • బీర్స్ కృషి ఫలితంగా 1909 లో స్థాపితమైన సంస్థ - National Committee for Mental Health.
  • 1948లో ప్రపంచ మానసిక ఆరోగ్య ఫెడరేషన్ స్థాపించడం జరిగింది
  • WHO, UNICEF లు మానసిక ఆరోగ్యం గురించి కృషిచేస్తున్నాయి.
  • మానసిక ఆరోగ్యం లో మూడు అంశాలున్నాయి. 1. ధనాత్మక అంశం 2. నిరోధించే అంశం 3. రోగచికిత్స అంశం.
  • ధనాత్మక అంశంలో అంటే సక్రమమైన మానసిక ఆరోగ్యం నెలకొల్పేందుకు కావలసిన పరిస్థితులు నెలకొల్పడం.
  • నిరోధించే అంశం అంటే మానసికానరోగ్యాన్ని అరికట్టిదానిని జరుగకుండా చూడటం.
  • మానసిక అనారోగ్యానికి రెండు కారణాలు వుంటాయి. అవి

  1. ప్రోత్సాహించే కారణాలు సక్రమమైన వ్యక్తిత్వం లోపించడం, భద్రత లోపించడం
  2. పోగుచేసే కారణాలు - ఒక ప్రేమించే వ్యక్తిత్వం కోల్పోవడం, ఆర్థికంగా దెబ్బతినడం

  • రోగనివారణ అనగా విషమ యోజనం ఏర్పడినపుడు సక్రమైన పద్దతుల ద్వారా దాన్ని బాగుచేయడం.
  • సక్రమమైన మానసిక ఆరోగ్యం గల వ్యక్తి లక్షణాలు - 1. సరైన శారీరకారోగ్యం 2. బావోద్రేక సమతౌల్యత 3. ఆరోగ్యవంతమైన ఆత్మభావన 4. మూర్తిమత్వ సంధానం 5. అనుగుణ్యత 6. ఆరోగ్యవంతమైన వ్యక్తిగత సంబంధాలు 7. ఆరోగ్యవంతమైన విషయనిష్టత 8. సామాజిక పరిపక్వత.


7. సర్దుబాటు - విషమయోజనం

సర్దుబాటు:

  • సర్దుబాటు అంటే వ్యక్తి అవసరాలకు, వాటిని తృప్తి పరచడానికి మధ్య సమతుల్యత కలిగి ఉండటం.
  • సర్దుబాటు అనేది జీవితాంతం జరిగే ప్రక్రియ
  • అవసరాలు రెండు విధాలు - 1. ప్రాథమిక అవసరాలు - ఆహారం, నీరు, నిద్ర, విశ్రాంతి, 2. గౌణ అవసరాలు - రక్షణ అవసరాలు, మమతానురాగాలు, గౌరవ అవసరాలు
  • అవసరాలు వ్యక్తిలో ఉత్సుకతను కలిగిస్తాయి.
  • ఉత్సుకత వల్ల వ్యక్తిలో చలనం కలుగుతుంది.
  • ఉత్సుకత అనేది గమ్యం చేరడానికి తోడ్పడుతుంది

           అవసరాలు ----------- ఉత్సుకత ------------- చలనం ----------- గమ్యం చేరడం

           ఈ మొత్తం ప్రక్రియను ప్రేరణ వలయం అంటారు.

  • చాప్లిన్ రచించిన డిక్షనీరీ ఆఫ్ సైకాలజీలో సర్దుబాటును రెండు రకాలుగా నిర్వచించారు.

       ఎ. ఆటంకాల నదిగమించి అవసరాలు తీర్చుకోవడానికి జీవికనబరచే కృత్యాలలో వైవిద్యం

      బి. భౌతిక, సాంఘిక పరిసరాలతో సుహృద్భావం ఏర్పరచుకోవడానికి జీవి కనబరచే కృత్యాలలో వైవిధ్యం.

విషమయోజం :

  • సర్దుబాటు సరిగా లేనపుడు విషమయోజనానికి దారి తీస్తుంది.
  • విషమయోజనం గల వ్యక్తుల్లో అవధానంలోపిస్తుంది. నూన్యతాభావాలు ఏర్పడతాయి. విశ్రాంతి ఉండదు. నిద్రలేకపోవడం, గోళ్లు కొరుక్కోవడం, మొ॥ లక్షణాలు వుంటాయి.
  • విద్యార్థులకు శిక్ష, బహుమతుల ద్వారా సక్రమమైన ప్రవర్తనను నెలకొల్పుకొనేటట్లు చూడాలి
  • ప్రవర్తనా సమస్యలు గల శిశువులను సమగ్ర అధ్యయనం ద్వారా పరిశీలించి తగు నివారణ చర్యలను తీసుకోవాలి.


8. రక్షణ తంత్రాలు

- ఇవి అచేతన ప్రేరణ సిద్ధాంతంనకు సంబందించినవి.

- వ్యక్తులు కుంఠనం వల్ల ఏర్పడిన వ్యాకుల్యతను తగ్గించుకునేందుకు ఉపయోగించే పద్దతులను రక్షణతంత్రాలు అంటారు.

- ఇవి అచేతన ప్రక్రియలు.

- వీటిని ప్రతిపాదించిన సిగ్మండ్ ఫ్రాయిడ్.

- ఇవి వ్యక్తి అహాంను రక్షించి ఉపశమనం కలిగిస్తాయి.

1. ఉదాత్తీకరణం : తీరని కోర్కెలను ప్రత్యామ్నాయ కార్యాకలాపాల ద్వారా తీర్చుకోవడాన్ని ఉదాత్తీకరణం అందురు. సహజంగా ఉండే ప్రచోదనాలను అణచివేసి సమాజాంగీకార లక్ష్యం వైపు మరలించటం జరుగును. ఉదా: ప్రేమలో విఫలం అయిన వ్యక్తి పాటలు పాడి సంతోషపడటం.

2. నిరాకరించుట : ఇది చాలా పురాతనమైన రక్షణ తంత్రం. ఇందులో వ్యక్తి సహించలేని వాస్తవాన్ని అది వాస్తవం కాదని నిరాకరిస్తాడు. ఉదా : ఒక వ్యక్తికి తాను అమితంగా ఇష్టపడే స్నేహితుడు చనిపోయాడని చేప్తే ఆ వార్త వినలేక ఉట్టిదేనని కొట్టిపారేస్తాడు.

3. ప్రతిచర్యను రూపొందించుట : అభిలషణీయం కాని ఇతర వ్యక్తి ఉద్దేశాన్ని, అలవాట్లను, వైఖర్లును ఎదుర్కోవడానికి వ్యక్తి ఆడేనాటకం ఇది. ఉదా: ఎదుటి వ్యక్తిని అతని మార్గంలోనే వెళ్ళి మన మార్గం లోనికి తీసుకురావడం.

4. ఉపసంహరణం : వ్యక్తి తనకు వ్యతిరేక ఫలితం వస్తుందన భావించేటప్పుడు ఆ పనికి దూరంగా ఉండటాన్ని ఉపసంహరణ అందురు. ఉదా: పరీక్షకు సరిగా చదవని విద్యార్ధి పరీక్ష రాయకుండా తప్పించుకోవడం

5. హేతువాద వితరణ : దీన్ని సమర్ధించి చెప్పుకోవడమని పేర్కొంటారు. మనం చేసే పనులను సహేతుకంగా సమర్థించుకోవడం. నక్క ద్రాక్షపళ్లు కథ దీనికి ఉదాహరణ. అంటే అందని పండ్లు పుల్లన. వ్యక్తి తాను చేసిన న్యాయబద్దం కాని పనులకు సమాజం ఆమోదించే ధోరణిలో కారాణాలు చెప్పడం. తెలివితేటలు తక్కువగా ఉన్న విద్యార్ధి ఈ పోటీ ప్రపంచంలో చదవడం ఇష్టంలేదని చెప్పడం.

6. విస్థాపనం : ఒక వ్యక్తి తన కోపతాపాలను, కుంఠనాలను ఇతర వ్యక్తులపై చూపించడాన్ని విస్ధాపనం అంటారు. ఉదా: అధికారి చేత చీవాట్లు తిన్న ఉద్యోగి గృహంలో తన భార్యపై కోపాన్ని చూపించడం విస్థాపనం కింద వస్తుంది. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం దీని కిందకే వస్తుంది.

7. ప్రక్షేపణం : ఇక్కడ ఒక వ్యక్తి తనలోని ప్రేరణ, సంఘర్షణలను, ఉద్వేగాలను ఇతర వ్యక్తులకు ఆపాదిస్తాడు. ఉదా : ఒక వ్యక్తి అవినీతిపరుడైతే అతను ప్రపంచంలోనివారంతా అవినీతి పరులని పేర్కొంటాడు. ఆడలేక మద్దెల ఓడె అనే సామెత దీనికి సంబందించినది. అధ్యాపకులు పాక్షిక బుద్దే తాను తప్పడానికి కారణమని చెప్పడం. వ్యక్తి లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివాని లోపాలను భూతద్దంలో చూపించడం.

8. దమనం : విచారకరమైన విషయాలను, అనంగీకారమైన విషయాలను, వ్యాకులతతో కూడిన విషయాలను వ్యక్తి అచేతన మనస్సులోకి పంపి ఉపశమనం పొందడాన్ని దమనంగా చెప్పవచ్చు. అలా అచేతనం లోకి పంపబడ్డ విషయాలు చేతనంలోకి రావాలనుకుంటాయి. ఇవి కలల ద్వారా మానసిక వ్యాధుల ద్వారా బయల్పడుతాయి.

9. స్వైర్యకల్పన : పగటి కలలు కనడం ఒక రక్షణ తంత్రం. ఇక్కడ వ్యక్తి ఊహాలోకంలో విహరిస్తాడు. ఇది ఎక్కువగా ఉపయోగించనపుడు అనర్థదాయకమవుతుంది.

10. పరిహారం : ఒక విషయంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడం. ఉదా: చదువులో రాణించలేని విద్యార్ధి ఆటలలో ఉన్నత స్థానమాక్రమించుకొని పరిహారం చేసుకుంటాడు. కోడిరామూర్తి అనే ప్రపంచ ప్రసిద్దమల్లయోధుడు చిన్నతనంలో అమిత బలహీనంగా ఉండేవాడు. అతను పరిహారం ద్వారా సుప్రసిద్ద మల్లయోధుడైనాడు. పేదరికంలో ఉన్న నిరక్షరాస్యుడైన తండ్రి తమ పిల్లలకు ఉన్నతమైన చదువులు చెప్పించడానికి ప్రయత్నించడం.

11. ప్రతిగమనం : ఒక్కొక్కసారి కుంఠనం చెందిన వ్యక్తులు పెద్దవారైన చిన్న పిల్లలాగా ప్రవరిస్తారు. 20 సంవత్సరాల వ్యక్తి రెండు సంవత్సరాల బాలుడిలాగా ప్రవర్తించడం. దీన్ని ప్రతిగమనమంటారు. నూతన వధువు తరుచూ పుట్టింటికి రావడం దీనికిందకు వస్తుంది.

12. తాదాత్మీకరణం : తాను సాధించలేని పనిని తనవారు సాధించినపుడు తానే సాధించినట్లు సంతృప్తి చెందడాన్ని తాదాత్మీకరణం అంటారు. ఉదా : ఒక తండ్రి తాను అధికారి కాలేకపోయినా తన కుమారుడుగాని, కుమార్తెగాని దాన్ని సాధిస్తే, తానే దాన్ని సాధించినట్లు సంతృప్తి చెందడం.


9. సంఘర్షణలు

- "రెండు విరుద్ద కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే భాదాకర ఉద్వేగ స్థితే సంఘర్షణ” - డగ్లస్, హలెండ్

- సంఘర్షణ రకాలు : కర్ట్ లెవిన్ ప్రకారం సంఘర్షణ నాలుగు రకాలు

1. ఉపగమ - ఉపగమ సంఘర్షణ : రెండు ఆకర్షణీయమనైన లక్ష్యాల మధ్య ఎన్నిక జరగవలసివచ్చినప్పుడు ఉపగమ - ఉపగమ సంఘర్షణ ఏర్పడుతుంది. పరీక్షలలో రెండు తెలిసిన జవాబులు ఈ విధమైన సంఘర్షణకు గురిచేస్తుంది.

తెలిసిన జవాబు +          + తెలిసిన జవాబు

2. పరిహార - పరిహార సంఘర్షణ : రెండు ఆకర్షణీయం కాని లక్ష్యాల మద్య ఎన్నిక తప్పని సరి అవుతుంది. పరీక్షలో రెండూ తెలియని జవాబుల మధ్య ఏదో ఒకటి తప్పనిసరిగా రాయవలసిన వచ్చినప్పుడు ఈ సంఘర్షణ కలుగుతుంది.

తెలియని జవాబు -        - తెలియని జవాబు

3. ఉపగమ - పరిహార సంఘర్షణ : ఒక ఆకర్షణీయమైన, ఇంకొక ఆకర్షనీయంకాని లక్ష్యాల మధ్య ఎన్నిక జరగాల్సి ఉంటుంది. పిల్లవాడు చెట్టు ఎక్కిపండు కోయాలనుకుంటాడు. అదే సమయంలో చెట్టు ఎక్కితే పడతామోనని భయం ఉంటుంది. ఇది ఉపగమ పరిహార సంఘర్షణ.

చెట్టు మీద పండు కావాలి +                   - కింద పడతాననే భయం

4. ద్విఉపగమ - పరిహార సంఘర్షణ : రెండు లేదా అనేక లక్ష్యాలమధ్య అనుకూల, ప్రతికూల విషయాలుండటం. దూర ప్రదేశంలో ఎక్కువ వేనంతో మంచి ఉద్యోగం లేదా దగ్గరలో తక్కువ వేతనంతో ఉద్యోగం.

వేతనం ఎక్కువ +     -వేతనం తక్కువ

దూరం-              + దగ్గర


Important Points

  • "నీకు బానిసగా ఉండుటకు ఇష్టం లేనపుడు యజమానిగా ఉండటం కూడా ఇష్టపడకూడదు." - అబ్రహాం లింకన్.
  • “నేనే విప్లవాన్ని, నేను విప్లవం కన్న బిడ్డను" - నెపోలియన్.
  • "ఆధునిక విద్య, విజ్ఞానాలను ఆర్జించకుండా మనజాతి పురోగమించటం సాధ్యంకాదు." - రాజారామమోహనరాయ్. 
  • "సంగీతవిద్వాంసుడు ఫిడేలును ప్రేమించినట్లే నేను అధికారాన్ని ప్రేమిస్తాను" - నెపోలియన్.
  • "భూమిపై పుట్టే ప్రతీ వ్యక్తి ఆర్ధికంగా నరకాన్ని సృష్టించినవాడవుతాడు."- మాల్డస్.
  • "నేనే రాజ్యం." - 14వ లూయీ.
  • “నా తరువాత ప్రళయం వస్తుంది." - 15వ లూయీ.
  • భారతదేశం భారతీయులు కొరకే." - స్వామి దయానంద సరస్వతి."
  • ముందుకు సాగండి.." - మేడమ్ బికాజీ కామా.
  • "ఒకేదేశం, ఒకే దేవుడు, ఒకేకులం, ఒకేఆలోచన తేడా ఏమి లేకుండా, అనుమానమేమి లేకుండా మనమందరం అన్నదమ్ములం." - వి.డి. సావర్కర్.
  • ఫాదర్ ఆఫ్ ఇంగ్లీషు పోయెట్రీ - ఛాసర్.
  • “చిన్న లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం తప్పు" - అబ్దుల్ కలామ్.
  • "మనిషిలో యోగ్యత, పూవులలో సువాసన దాచినా దాగవు."- నెహ్రూ.
  • ఆంధ్రభీష్మ - న్యాపతి సుబ్బారావు.



No comments:

Post a Comment

Post Bottom Ad