7. మార్గదర్శకత్వం - మంత్రణం - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Wednesday, June 12, 2024

7. మార్గదర్శకత్వం - మంత్రణం

VII మార్గదర్శకత్వం - మంత్రణం


డి.యస్.సి. సైకాలజీ విభాగంలో ఈ పాఠ్యాంశానికి సంబంధించి 1 నుండి 2 ప్రశ్నలు వస్తున్నాయి. ఈ పాఠ్యాంశంను 2 అంశాలుగా విభజించి వివరించడం జరిగింది.

1. మార్గదర్శకత్వం

2. మంత్రణం


1. మార్గదర్శకత్వం

  • వ్యక్తితాను ఎదుర్కొన్న సమస్యలను తనకుతాను సాధించలేక కుంఠనానికి లోనయ్యే సమయంలో మార్గదర్శకత్వం కావాలి.
  • వ్యక్తికి దిశా నిర్దేశకం చెప్పేది - మార్గదర్శకత్వం
  • వ్యక్తి తన ప్రజ్ఞను, శక్తి సామర్థ్యాలను, మూర్తిమత్వాంశాలను, భావోద్వేకాలను మొ॥ సరిగా అర్ధం చేసుకొని వాటిని సక్రమంగా వినియోగించుకోవడానికి మార్గదర్శకత్వం తోడ్పడుతుంది.
  • మార్గదర్శకత్వమనేది సరియైన నిర్ణయాలు తీసుకోవడానికి, సర్దుబాటు సక్రమంగా చేసుకోవడానికి దోహదం చేసే చర్య.
  • మార్శదర్శకత్వం వ్యక్తికి తనకై తాను “సమస్యా పరిష్కార మార్గం" తెలుసుకోవడానికి దోహదం చేస్తుంది.
  • వ్యక్తిని “ఆత్మనిర్దేశకుడుగా" తయారుచేయునది - మార్గదర్శకత్వం.
  • మార్గదర్శకత్వమంటే వ్యక్తి తనను తాను, తన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడే చర్య - షెర్జర్, స్టోన్.

మార్గదర్శకత్వం నమూనాలు :

మార్గదర్శకత్వము లో మూడు నమూనాలను పేర్కొన్నది - ఆల్పోర్ట్

1. మనిషి ప్రతిస్పందించే జీవి. ఈ నమూనా ప్రకారం మనిషి ప్రవర్తనను S-R బంధం ద్వారా విశదపరచవచ్చు. ప్రకృతి వాదం, ప్రవర్తనావాదం ఈ నమూనా కింద వస్తాయి.

2. రెండో నమూనా ఏమంటే మనిషిలో చాలా లోతైన ప్రతిస్పందన వుంటుంది. దీనికింద మనోవిశ్లేషణ వాదం వస్తుంది.

3. మూడో నమూనా ప్రకారం మనిషి ఇంకా తయారువుతునే వుంటాడు. మాస్లో, రోజర్స్ తదితరులు ఈ తెగ కింద వస్తారు. ఈ అభిప్రాయం ప్రకారం సాంస్కృతిక, సాంఘిక, మతపరమైన విషయాలకు ప్రాముఖ్యత నివ్వాలి” వ్యక్తి సమర్థతకు ప్రాముఖ్యతనివ్వాలి.

మార్గదర్శకత్వం రకాలు :

1. విద్యావిషయక మార్గదర్శకత్వం : దీని ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థుల అభిరుచులకు, ప్రజ్ఞకు, సామార్థ్యాలకు సరిపోయే కోర్సులను, పాఠశాలను ఎన్నుకోవడంలో సహాయపడటం. విద్యామార్గదర్శకత్వ మంటే వ్యక్తి జ్ఞానాభివృద్ధికి దోహదం చేసే చేతనాత్మక ప్రయత్నం ఇది బోధన లేదా అభ్యసనానికి సంబంధించినది - బ్రెవర్

2. ఔద్యోగిక మార్గదర్శకత్వం : ఔద్యోగిక మార్గదర్శకత్వమనే చర్య వ్యక్తి ఉద్యోగం ఎన్నుకోవడానికి, దానికి సిద్దమవడానికి, దానిలో ప్రవేశించి పురోగమించడానికి దోహదపడుతుంది - అమెరికాలోని జాతీయ ఔద్యోగిక మార్గదర్శకత్వ సంఘం

- వ్యక్తిలో ఉద్యోగ సంతృప్తి లోపించినపుడు.

- వ్యక్తి ఉద్యోగంలో ఎక్కువగా నిలకడగా పనిచేయలేకపోయినపుడు

- సంస్థలోని ఇతర వ్యక్తులతో సరైన సంబంధాలు నెలకొల్పలేకపోయినపుడు

- విధి నిర్వహణలో సంఘర్షణకు లోనైనపుడు ఔద్యోగి మార్గదర్శకత్వం అవసరమౌతుంది.

3. వ్యక్తిగత మార్గదర్శకత్వం:

- వ్యక్తిగత సమస్యలైన చదువు మీద దృష్టి నిలవకపోవడం, మానసిక ప్రశాంతత లోపించడం, పాఠశాలపై ఏకాగ్రత చూపలేకపోవడం మొదలైనవి.

-కుటుంబ సమస్యలైన ఆర్ధిక సమస్యలు మొదలైనవి

- వైవాహిక సమస్యలైన సహధర్మచారులను ఎన్నుకోవడం, వివాహ జీవితం అన్యోన్యంగా జరపడం మొ||నవి పై సమస్యలకు వ్యక్తిగత మార్గదర్శకత్వం అవసరమౌతుంది.

- వ్యక్తి కుంఠనానికి లోనయ్యేటప్పుడు అతనికి అవసరమయ్యేది మార్గదర్శకత్వం మూర్తిమత్వ సమస్యలతో సతమతమయ్యేటప్పుడు అతనికి అవసరమయ్యేది - మంత్రణం.


2. మంత్రణం

  • మంత్రణం అనేది మార్గదర్శకత్వంలో ఒక సలహా ప్రక్రియ.
  • సలహాలకు ప్రాధాన్యతనిచ్చే మార్గదర్శికత్వానికి మంత్రణం అని పేరు.
  • వ్యక్తి బాధ్యతతో వ్యవహరించే తన సమస్యకు పరిష్కారాన్ని తాను ఏర్పరచుకున్నందుకు కౌన్సిలింగ్ దోహదం చేస్తుంది.
  • కౌన్సిలింగ్ లో మూర్తిమత్వంలో కొంతమార్పు కల్పించి, వ్యక్తి లో సక్రమమైన సర్దుబాటు సాధ్యపడేటట్లు చేస్తారు.
  • ఒక వ్యక్తి మూర్తిమత్వం సమస్యలతో వచ్చినపుడు ఆ వ్యక్తి మూర్తిమత్వంలో కొంతమార్పు కలిగేటట్లు చేసి అతను ఘర్షణలు లేకుండా, తన్యతలు లేకుండా, సక్రమమైన సర్దుబాటు పొందేటట్టు చూడటం కౌన్సిలింగ్ లో చేయవలసిన పని.
  • కౌన్సిలింగ్పై మనోవిశ్లేషణం ప్రభావం పడి మూర్తిమత్వం పునర్వ్యవస్థీకరణ సాధించడానికి ప్రయత్నించడం జరుగుతుంది.
  • పెపిన్స్కీ అండ్ పెపిన్స్కీ ప్రకారం కౌన్సిలింగ్ మూడు విషయాలుంటాయి.

  1. కౌన్సిలీ, కౌన్సలర్ మధ్య జరిగే వ్యతిచర్య
  2. అది ఒక వ్యక్తి సంబంధమైన పరిస్థితిలో జరుగుతుంది.
  3. అది కౌన్సిలీ ప్రవర్తనలో మార్పుకు దారి తీస్తుంది.

కౌన్సిలింగ్ చేసే విధానాలు: మూడు

1. నిర్దేశిక కౌన్సిలింగ్ :

- సమస్యా కేంద్రీకృత మంత్రణం

- దీనిలో కౌన్సిలర్ ప్రముఖ స్థానం ఆక్రమిస్తాడు.

- కౌన్సిలింగ్ చేసేటప్పుడు కౌన్సిలర్ తన అభిప్రాయాలను, ఆలోచనలను, సలహాలను స్వేచ్ఛగా బహిర్గతం చేస్తాడు.

- ఇక్కడ సహాయార్థి (కౌన్సిలీ) కి స్వేచ్ఛగా తన సమస్యలను చర్చించే అవకాశం వుండదు.

- దీనిని ప్రవేశ పెట్టినది - విలియం సన్, డార్లీ

- ఇది కౌన్సిలర్ నిర్దేశిమైన కౌన్సిలింగ్

- సమస్యకు ఎక్కువగా ప్రాముఖ్యత యివ్వబడుతుంది.

- కౌన్సిలర్ నిర్దేశిమైన కౌన్సిలింగ్

  • సమస్యకు ఎక్కువగా ప్రాముఖ్యత యివ్వబడుతుంది.
  • కౌన్సిలర్ కు శ్రేష్టమైన తర్పీదు, అనుభవం కలిగి వుంటుంది.
  • తగువైన దృక్పథం లేదా కౌన్సిలీ తన సమస్యకు పరిష్కారం కనుకోకలేకపోతాడు.
  • సమస్యా పరిష్కారం ద్వారా కౌన్సిలింగ్ ఉద్దేశం నెరవేరుతుంది.
  • పరిష్కారం ద్వారా కౌన్సిలింగ్ ఉద్దేశం నెరవేరుతుంది.

2. అనిర్దేశిక కౌన్సిలింగ్ :

  • దీనిని ప్రవేశపెట్టినది - కార్ల్ రోజర్స్
  • ఈ విధానంలో కౌన్సిలీ ప్రముఖ స్థానమాక్రమిస్తాడు.
  • మంత్రణం కోసం వచ్చిన వ్యక్తికి తన సమస్యను పరిష్కరించుకోవడనాకి అవసరమైన ప్రజ్ఞ, ఆలోచన, శక్తి, సామర్థ్యాలు వుంటాయని తన సమస్యను తానే పరిష్కారం చేసుకుంటాడని కౌన్సిలర్ భావిస్తాడు.
  • దీనిని సహాయార్థి కేంద్రీకృత కౌన్సిలింగ్ అంటారు.
  • కౌన్సిలీ ఒక నిర్దేశకుడు గా మాత్రం వ్యవహారిస్తాడు.
  • కౌన్సిలీ నిర్ణయం తానే స్వతహాగా తీసుకొని తన సమస్యను తానే పరిష్కరించుకుంటాడు.
  • ఇక్కడ కౌన్సిలర్ ఒక నిర్ధేశకుడు గా మాత్రం వ్యవహారిస్తాడు.
  • అవకాశమిస్తే కౌన్సిలీ తన సమస్యకు తానే పరిష్కారం కనుక్కొనగలుగుతాడు.
  • ఇక్కడ కౌన్సిలీకి స్వతంత్రంగా వ్యవహారించడానికి పరిస్థితులు కల్పించాలి.

3. శ్రేష్టగ్రహణ కౌన్సిలింగ్ :

  • దీనినే మిశ్రమ లేదా దార్శినిక కౌన్సిలింగ్ అని కూడా అందురు.
  • దీనిని ప్రతిపాదించినది - ఎఫ్.సి. థార్న్
  • ఈ రకం కౌన్సిలింగ్ వివిధ రకాలైన మంత్రణాల నుంచి మంచి విషయాలను గ్రహించి వాటిని అమలు చేస్తారు.
  • గ్రహించిన విషయాలు మంత్రాణార్థి మూర్తిమత్వాన్ని బట్టి అతని సమస్యను గ్రహిస్తారు.
  • ఈ విధానం విషయాలు మంత్రాణార్థి మూర్తిమత్వాన్ని బట్టి అతని సమస్యను గ్రహిస్తారు. కౌన్సిలింగ్ కు ఉపయోగించే సాధనాలు - పరిపృచ్ఛ, మనోవైజ్ఞానికి పరీక్షలు, నిర్థారణమాపనలు.


గ్రంధాలు - శాస్త్రవేత్తలు



Important Points

  • ఆంధ్రరాష్ట్ర పిత - పొట్టి శ్రీరాములు.
  • ఆంధ్రనాటక పితామహుడు - ధర్మవరం క్రిష్ణమాచార్యులు.
  • "సమస్యలతో సతమతమపుతున్న వ్యక్తికి, అనుభవం శిక్షణ గల వ్యక్తికి మధ్య జరిగే ప్రతిచర్యే కౌన్సిలింగ్" - మెకన్లీ
  • ఆంధ్రా గాంధీ - వావిరాల గోపాలక్రిష్ణయ్య.




No comments:

Post a Comment

Post Bottom Ad