3.5 షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమం: విధానాలు & సంక్షేమ కార్యక్రమాలు - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Thursday, July 20, 2023

3.5 షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమం: విధానాలు & సంక్షేమ కార్యక్రమాలు

3.5 షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమం: విధానాలు & సంక్షేమ కార్యక్రమాలు


    షెడ్యూల్డ్‌ కులాలు ప్రాథమిక అంశాలు


    • 1931 జనాభా లెక్కల నుండి డింప్రెస్‌డ్‌ క్లాస్‌ అనే పదాన్ని ఉపయోగించారు. ఆ తర్వాత భారత ప్రభుత్వ చట్టం 1935 మొదటిసారిగా షెడ్యూల్డ్‌ కులాలు అనే పదాన్ని ఉపయోగించింది మరియు ఈ చట్టం ఆధారంగానే 1936వ సంవత్సరంలో మొదటిసారి గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా (షెడ్యూల్డ్‌  కాస్ట్‌) ఆర్డర్‌ ద్వారా మొదటిసారి షెడ్యూల్డ్‌ కులాల పట్టికను రూపొందించింది.
    • షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమం అనునది కేంద్ర సామాజిక న్యాయం మరియు మంత్రిత్వశాఖ పరిధిలోనికి వస్తుంది.
    • అధికరణ 341(1) అధారంగా భారత రాష్ట్రపతి ఇప్పటి వరకు 27 రాష్ట్రాలు మరియు క్‌ కేంద్ర పాలిత ప్రాంతాలలో 1263 కులాలను షెడ్యూల్డ్‌ కులాలుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లో 61 ఎస్‌.సి కులాలు గుర్తింపబడినవి, అత్యధికంగా కర్నాటక రాష్ట్రంలో 101 కులాలను ఎస్‌.సి కులాలుగా గుర్తించడం జరిగింది. అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, అండమాన్‌, లక్షద్వీప్‌ లలో SCలు లేరు.
    • భారతదేశంలో SC జనాభా శాతం - 16.6% (20. 14 కోట్ల జనాభా)
    • ఆంధ్రప్రదేశ్‌లో SC జనాభాశాతం - 17.08% (8469 లక్షలు)
    • భారతదేశంలో SC లలింగనిప్పత్తి - 945
    • ఆంధ్రప్రదేశ్‌లో 5౮0ల లింగ నిష్పత్తి - 1007 (961 బాలల లింగనిష్పత్తి)
    • ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌.సి ల అక్షరాస్యత శాతం - 66.47
    • SC జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం - ఉత్తరప్రదేశ్‌
    • SC జనాభా అల్పంగా ఉన్న రాష్ట్రం - మిజోరాం
    • పంజాబ్‌ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ SC జనాభా శాతంని కలిగి ఉంది.
    • అతి తక్కువ SC జనాభా శాతంని కలిగి ఉన్న రాష్ట్రం - మిజోరాం
    • బీహార్‌ రాష్ట్రంలోని Coach జిల్లాలో 50% మంది SC లు కలరు.
    • SC లపై నేరాలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుచున్నవి.


    షెడ్యూల్డ్‌ కులాలు మరియు షెడ్యూల్డ్‌ తెగల సంక్షేమం


    రాజ్యము SC, ST ల సంక్షేమం కోసం ఈ క్రింది విధానాల ద్వారా కృషి చేస్తుంది.

    1. రాజ్యాంగ పరంగా

    2. సామాజిక శాసనాల ద్వారా

    3. వివిధ రకాల సంస్థల ద్వారా 

    4 సంక్షేమ పథకాల ద్వారా


    రాజ్యాంగం ద్వారా షెడ్యూల్డ్‌ కులాలు మరియు షెడ్యూల్డ్‌ తెగల సంక్షేమం

    ఆర్టికల్‌ 14 : చట్టం ముందు అందరు సమానులే

    ఆర్టికల్‌ 15 : వివక్షత ఏ రూపంలో ఉన్న నిషేధం

    ఆర్టికల్‌ 15(4) : వెనుకబడిన వారికోసం లేదా SC, ST ల కోసం ప్రత్యేక నిబంధనలు తయారు చేయచ్చు (1వ రాజ్యాంగ సవరణ)

    ఆర్టికల్‌ 15(5) : అన్ని రకాల విద్యా సంస్థలో బలహీన వర్గాలకి Reservations కల్పించబడినవి.



    SC లకు హక్కులు కల్పిస్తూ వారిపై జరుగుతున్న దాడుల నుండి రక్షించేందుకై సామాజిక శాసనాలను రూపొందించడం జరిగింది.

    • Untouchability Offences Act 1955
    • Protection of Civil Rights Act 1976
    • Scheduled castes ST's (Prevention of Atrocities) Act 1989
    • Bonded Labour Abolition Ordinance 1975
    • Bonded labour Abolition Act 1976
    • Prohobition of Child Labour Act 2017
    • Amended Child Labour Act 2017
    • Minimum Wages Act 1948
    • Legal Services Authority Act 1987
    • Prohibition of Employment as Manuals Scavengers & Their Rehabilitation Act 2013
    • Central Education Institutions Act (Reservations in Admissions) 2006
    • National Commission for 'Safai Karma Chary' Act 1993

    Untouchability Offences Act 1955

    అధికరణం 17 ప్రకారం అంటరాని తనం నిషేధించబడినది కావున ఈ అధికరణాన్ని అమలు పరచేందుకు గాను 08-05-1955న అంటరానితనం నేరాల చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టాన్ని 1976లో సవరించి ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ రైట్స్‌ యాక్టుగా మార్చారు మరియు 1977వ సంవత్సరంలో ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ రైట్స్‌ను యాక్టును అనుసరించి నిబంధనలు ఏర్పాటు చేశారు.

    ఈ చట్టం దేశ వ్యాప్తంగా వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం అంటరానితనం అనగా ప్రజలందరికి ఉద్ధేశించిన ప్రదేశాలలోకి వెళ్లకుండా ఆపడం, ప్రజాసౌకర్యాలైనటువంటి షాపులు, రెస్టారెంట్లు, హోటళ్ళ లాంటి వాటిలోకి వెళ్లకుండా అడ్డుకోవడం, విద్యా సంస్థల్లోకి మరియు అస్పత్రులలోకి రాకుండా అడ్డుకోవడం, వస్తువులని అమ్మకుండా ఉండడం, అవమాన పరచడం, జాతిపేరుమీద అంటరాని తనంతో పాకీపనులు చేయించడం. ఈ చట్టంలోని సెక్షన్‌ 15(ఎ) ప్రకారం ప్రత్యేక కోర్టులని ఏర్పాటు చేయాలి.

    SC, ST Atrocities Act (Prevention of Atrocities 1989)

    ఆర్టికల్‌ 17 ఆధారంగా ఏర్పడిన Untouchability Offences Act 1955, Civil Rights Protection Act 1976 లు కూడా SC, ST లపై దాడులను అరికట్టలేకపోయే సరికి SC, ST Atrocities Act 1989ను రూపొందించారు. ఈ చట్టం రూపొందడానికి కారంచేడులో దళితులపై జరిగిన క్రూరమైన దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చెలరేగిన ఉద్యమం భూమికగా పనిచేసింది.

    జనవరి 31, 1990 నుండి అమలులోనికి వచ్చింది. అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. ఈ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకై కేంద్రం 'Centrally Sponsored Scheme for Effective Implementation of the Provisions of this Act' అనే పథకాన్ని అమలు చేస్తున్నది. 1995లో ఈ చట్టానికి సంబంధించిన నిబంధనలు రూపొందించడం జరిగింది. 

    ఈ క్రింది చర్యలు అస్పృశ్యత చర్యలు లేదా నేరాలుగా భావిస్తారు

    1. SC, ST జనావాసాలలో కావాలని జల కాలుష్యం చేయడం
    2. భూములు మరియు ఆస్తులను ఆక్రమించడం
    3. వెట్టిచాకిరి, బానిసత్వం, జోగిని, జాతిపేరుతో దూషించడం, అంటరానితనాన్ని ప్రదర్శించడం మొదలైనవి నేరాలుగా పరిగణించబడుతాయి.
    4. బలవంతంగా తినకూడనివి తినిపించడం, తాగకూడనవి తాగిపించడం, చేయకూడని పనులు చేయించడం, ఓటు వేయకుండ నిరోధించడం, కులం పేరుపై అవమాన పరిచే చర్యలు, జంతువులపై ఊరేగించడం, బలవంతంగా ఓటు వేసేలా చేయడం లాంటివి నేరాలుగా పరిగణించబడతాయి.

    తీసుకోవలసిన చర్యలు

    1. బెయిల్ కి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవడం
    2. కనీసం DSP స్థాయి అధికారి విచారణ చేపట్టాలి, 30 రోజులలో విచారణ జరిపి నివేదికను DGP కి అందజేయాలి.
    3. DGP లేదా IG అధ్వర్యంలో రాష్ట్ర రాజధానిలో SC, ST 'Protection Cell' ఏర్పాటు చేయాలి, ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఉండాలి, Special Public Prosecutor Special Police Station లను ఏర్పాటు చేయాలి.
    4. రాష్ట్రం, జిల్లా స్థాయిలో Nodal Officers ఉండాలి. ఈ చట్టం Implementation ని Supervise చేసేందుకు State level లో Chief Minister అధ్యక్షతన, District - level లో District Magistrate అధ్యక్షతన 'Monitoring Committee' లు ఏర్పాటు చేయాలి.
    5. Atrocity Prone Area లను గుర్తించాలి.

    శిక్షలు

    • నీటిని కలుషితం చేస్తే 6 నెలల నుండి 5 సం॥ + ఫైన్.
    • ఆస్తులకు నష్టం కలిగిస్తే 7 years + Fine + Compensation.
    • IPC ప్రకారం 10 సం|| జైలు శిక్ష.
    • తప్పుడు సాక్షం చెప్పి SC, ST లకు ‘Life - time” punishment పడేందుకు కారకులు అయిన వారికి మరణ శిక్షను కూడా విధించవచ్చు.
    • ఎస్.సి, ఎస్.టిలపై హత్యాయత్నంకు పాల్పడితే జీవితఖైదు కూడా విధించవచ్చు.
    • చట్టంలో ఉన్న లోపాలను సవరిస్తూ మార్చి 2014 రాష్ట్రపతి Ordinance జారీ చేశారు. ఇలా సవరించిన Atrocities Act 2014 అనునది 2016 జనవరి 26 నుండి అమలులోనికి వచ్చింది.

    ఇందులోని ముఖ్యాంశాలు

    • తప్పుడు సాక్షం చెబితే 14 సం॥
    • Appeal కు వెళ్ళిన సందర్భంలో 3 నెలలలోపే కేసుని పరిష్కరించాలి.
    • బాధితులకు FIR Copy ఇవ్వాలి.
    • బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలి మరియు పోషణ ఖర్చులు చెల్లించాలి.

    Prohibition of Employment as Manuals Scavengers & Their Rehabilitation Act 2013

    తరతరాలుగా చేతులతో పాకీపనులు చేస్తున్న కార్మికులను, పాకీపనుల నుండి విముక్తి కలిగించేందుకు గాను ఈ చట్టాన్ని సెప్టెంబర్‌ 2018లో రూపొందించారు. ఈ చట్టం 06-12-2018 నుండి అమలులోనికి వచ్చింది. ఈ చట్టం ద్వారా చేతులతో మురికి కాలువల పనులు మరియు లావెట్రీల శుభ్రత పనులను చేసే వృత్తిని నిషేధించడం జరిగింది.

    ఈ చట్టానికి ముందే 1998వ సంవత్సరంలో డ్రై లావెట్రీల నిర్మాణం మరియు వీటిలో పనిచేయడాన్ని నిషేధించిన చట్టాన్ని రూపొందించినారు మరియు 1992లో పాకీపనులు చేసేవారికి స్వేచ్చను మరియు పునరావాసాన్ని కల్పించేందుకు గాను జాతీయ స్థాయి పునరావాస పథకాన్ని ఏర్పాటుచేశారు. అయినను పాకీవృత్తి చేసేవారు అధిక సంఖ్యలో ఉండే సరికి 2018లో పైచట్టాన్ని రూపొందించారు.

     Self Employment Scheme for Rehabilitation of Manual Scavengers (SRMS)

    నేషనల్‌ సఫాయి కర్మాచారి ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్బోరేషన్‌ వారి సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద మాన్యువల్‌ స్మేవెంజర్‌గా పనిచేస్తున్న వారిని గుర్తించి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.

    స్వయం ఉపాధి పథకాల కోసమై 15 లక్షల రూపాయల వరకు రాయితీ వడ్డీతో కూడిన రుణ సౌకర్యాలు ఇస్తున్నారు. పుణ్యాభివృద్ధి కోసమై శిక్షణ తీసుకుంటున్న వారికి నెలకు 3,000 రూపాయలు అందిస్తున్నారు. క్రెడిట్‌ లింక్‌డ్‌ బ్యాక్‌ఎండ్‌ క్యాపిటల్ సబ్సిడీ కింద 3,25,000 అందిస్తున్నారు.

    ఎస్. సి ల సంక్షేమం మరియు జాతీయ సంస్థలు

    జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమీషన్‌ ( National Commission for Scheduled Castes, NCSC)

    రాజ్యాంగంలోని 16వ విభాగం నందు గల ఆర్టికల్‌ 888 ఆధారంగా ఏర్పడిన రాజ్యాంగ ఐద్ధ సంస్థ 89వ రాజ్యాంగ సవరణ చట్టానికి ముందు ఎస్‌.సి, మరియు ఎస్‌.టి.లకు కలిపి ఒకే కమీషన్‌ ఉందేవి. 2004 నుండి SC, ST లకు వేరువేరుగా కమీషన్‌లు ఏర్పడినవి.

    National Commission for SC Present Status (ప్రస్తుత స్ధితి)

    • 2004లో ఏర్పడింది. ప్రస్తుత కమీషన్‌ 6వ కమీషన్‌.
    • ఒక ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ మరియు 3 సభ్యులు అనగా మొత్తం 5గురు సభ్యులతో కూడి ఉంటుంది.
    • 3 సం॥ పదవి కాలానికి గాను రాష్ట్రపతి నియమిస్తాడు.
    • మొదటి ఛైర్మన్‌ - సూరజ్‌ భాను కాగా ప్రస్తుత ఛైర్మన్‌-విజయ్‌ సంపాల.

    కమీషన్‌ ఈ క్రింది విధులను కలిగి ఉంటుంది

    1. ఎస్‌.సి. లకు సంబంధించిన రాజ్యాంగ బద్ధ చట్టబద్ధ హక్కుల ఉల్లంగన అమలు తీరు మరియు వారి సామాజిక ఆర్థిక, స్థితిగతులు లాంటి అంశాలపై విధులను కలిగి ఉంటుంది.

    2. ఎస్‌.సి. ల సామాజిక ఆర్థిక వికాసం కోసం తగిన సూచనలను, సలహాలు ఇస్తుంది.

    3. వార్షిక నివేదికలను మరియు అవసరమైన సందర్భంలో ఇతర నివేదికలను President కి సమర్పిస్తుంది.

    4. రాష్ట్రపతి నివేదికను పార్లమెంట్‌ ముందు ఉంచుతాడు. వీరి సూచనలపై ప్రభుత్వం చర్య తీసుకొని సందర్భంలో పార్లమెంట్‌కు వివరణ ఇవ్వవలసి ఉంటుంది.

    5. రాష్ట్రపతి సూచించిన ఇతర బాధ్యతలు స్వీకరిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరినప్పుడు ఆయా బాధ్యతలు నిర్వర్తిస్తుంది.

    6. పై విధుల నిర్వహన కోసం Commission కు ఈ క్రింది అధికారాలు ఉంటాయి.

    • సొంత విధానాలను అనుసరిస్తారు.
    • విచారణ విషయంలో Civil Court కు ఉండే అధికారాలు.
    • ఏ వ్యక్తిని అయిన తన ముందు హాజరు కమ్మని అడుగుతుంది.
    • ప్రమాన పత్రాలు మరియు ఇతర రికార్డులను అడగుతుంది.
    • SC ల హక్కుల ఉల్లంఘన తరచుగా జరుగుతున్న ప్రాంతాలను సందర్శిస్తుంది.
    • SC ల హక్కుల ఉల్లంఘనపై ఫిర్యాదులను స్వీకరిస్తుంది మరియు సుమోటోగా కూడా కేసులను చేపడుతుంది.
    • విధాన పరమైన నిర్ణయాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమీషన్‌ని సంప్రదించాలి.

    National Commission for Safai Karma Chary (NCSKC)

    • NCSKC Act 1993 ప్రకారం ఏర్పడిన చట్టబద్ధ సంస్థ కాని, 2004 నుండి చట్టబద్ధత లేని సంస్థగా మారింది. పాకి పనులు చేసే వారికోసం ఏర్పడింది.
    • ప్రస్తుత అధ్యక్షులు - Vaji Jala.

    నేషనల్‌ షెడ్యూల్డ్‌ కాస్ట్‌ ఫైనాన్స్‌ & డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ (NSFDC)

    • ఫిబ్రవరి 1989న కంపెనీల చట్టం ప్రకారం ఈ సంస్థను ఏర్పాటుచేశారు.
    • వార్షిక ఆదాయం 3 లక్షల కంటే తక్కువగా ఉన్న షెడ్యూల్డ్‌ కులాల కుటుంబాలకు ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి కోసం రుణసదుపాయాన్ని అందిస్తున్నారు.
    • ప్రస్తుతం ఈ సంస్థ క్రెడిట్‌ బేస్‌డ్‌ స్కీమ్‌ మరియు నాన్‌ క్రెడిట్‌ బేస్‌డ్‌ స్కీమ్‌ అను పథకాలను అమలు చేస్తున్నవి. క్రెడిట్‌ బేస్‌డ్‌ స్కీమ్‌లో ఖాగంగా మహిళా సంవృద్ధి యోజన, మహిళా అధికారిక యోజన, లఘు వ్యవసాయ యోజన, గ్రీన్‌ విజెనెస్‌ స్కీమ్‌, స్టాండప్‌ ఇండియా, స్వచ్చతా ఉదయం యోజన, అజీవక మైరో ఫైనాన్స్‌ యోజన, ఉదయం నిధి యోజన లాంటి పథకాలు అమలుచేస్తుండగా, నాన్‌ క్రెడిట్‌ బేస్‌డ్‌ స్మీమ్‌నందు ఖాగంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందిస్తున్నవి.

    Dr. B.R. Ambedkar Foundation

    • మార్చి 21 1992న డా|| బిఆర్‌ అంబేద్కర్‌ సెంటీనరి సెలబ్రేషన్‌ కమిటీ సూచనల మేరకు ఏర్పాటు చేశారు.
    • Ministry of Social Justice and Empowerment నందు భాగంగా పనిచేస్తుంది.
    • అంబేద్కర్‌ యొక్క భావజాలం ఆధారంగా మరియు ఆ యొక్క భావజాల వ్యాప్తి కోసం పనిచేస్తుంది.
    • దీనికి Chairman గా సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మంత్రి వ్యవహరిస్తారు.

    ఈ సంస్థ ఈ క్రింది కార్యక్రమాలను అమలుచేస్తున్నది

    1. డా॥ అంబేద్కర్‌ జీవితానికి సంబంధించిన ఉత్సవాలను జరపడం
    2. డా॥ అంబేద్కర్‌ పీఠాల నిర్వహణ
    3. డా॥ అంబేద్కర్‌ మెడికల్‌ ఎయిడ్‌ స్కీమ్‌: ఇందులో భాగంగా 3 లక్షలకంటే తక్కువ వార్షిక ఆదాయం గల నిరుపేదలైన ఎస్‌.సి.లకు వైద్య ఖర్చుల నిమిత్తం 1 లక్ష నుండి 3,50,000 వరకు సహకారం అందిస్తారు.
    4. డా॥ బి.ఆర్‌ అంబేద్మర్‌ నేషనల్‌ మెరిట్‌ అవార్డు.
    5. అకృత్యాలకు లోనైన దళితులకు 5 లక్షల వరకు సహాయం అందిస్తారు.
    6. డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ స్కీమ్‌ ఫర్‌ ఇంటిగ్రేషన్‌ త్రు ఇంటర్‌క్యాస్ట్‌ మ్యారేజస్‌: ఈ పథకం ద్వారా వివాహం చేసుకున్న దంపతులలో షెడ్యూల్డ్‌ కులాలకు చెందినవారైతే రూ॥ 2,50,000/- ల నగదు సహాయం అందిస్తున్నారు. ఇందులో 1,50,000 వివాహం అయినవెంటనే ఇస్తారు. మిగతా లక్ష రూపాయలు 3 సంవత్సరాల కాలానికి డిపాజిట్‌ రూపంలో అందిస్తారు. ఈ పథకం మొదటగా 2013-14లో ప్రారంభించారు.

    బాబు జగజ్జీవన్‌ రామ్‌ నేషనల్‌ ఫౌండేషన్‌

    • ఈ సంస్థని 14 మార్చి, 2008న ప్రారంభించారు.
    • కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ మంత్రి దీనికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు.
    • బాబు జగజ్జీవన్‌ రామ్‌ భావజాలాన్ని వ్యాప్తిచెందించి తద్వారా కులం మరియు వర్గం లేని సమాజాన్ని సృష్టించేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తున్నది మరియు షెడ్యూల్డ్‌ కులాల సాధికారత మరియు అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నది.

    National Commission for Safai Karma Chary Finance & Development Corporation

    24 జనవరి 1997న National Commission for Safai Karma Chary Finance & Development Corporation ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ పాకీ వృత్తిలో ఉన్న మహిళల కోసం “మహిళ అధికారత యోజన” అనే పథకం క్రింద 75,000 రుణాలని ఇస్తున్నారు మరియు లోన్‌ బేస్‌డ్‌ స్కీమ్‌ నందు భాగంగా మహిళా అధికారతా యోజన, మహిళా సంవృద్ధి యోజన, శానీటరీ మార్టులు, 'పే & యూస్‌ సమూదాయ శౌచాలయాలు మరియు శానిటరీ సంబంధిత పరికరాలను కొనుగోలు చేసుకొనేందుకై స్వచ్చతా ఉదయమని యోజన అనే పథకాన్ని అమలుపరుస్తున్నారు.

    స్వచ్చత ఉదయమని యోజన

    • ఈ పథకం యొక్క నినాదం స్వచ్చతా సే సంపన్నతాకి ఔర్.
    • ఈ పథకాన్ని 02 అక్టోబర్‌ 2014న ప్రారంభించారు.
    • పాకీపనులు చేసే కార్మికులను చేతులతో పాకిపనిచేసే దురవస్థ నుండి తప్పించడం ఈ పథకం యొక్క ఉద్ధేశ్యం.

    Pradhan Mantri Adarsh Gram Yojana (PMAGY)

    2009-2010 ఆర్థిక సంవత్సరం నుండి 50% కంటే ఎక్కువ 56 జనాభా ఉన్న గ్రామాలని 'Pradhan Mantri Adarsh Gram Yojana (PMAGY)' పథకం కింద ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నారు. దేశ వ్యాప్తంగా 1000 గ్రామాలను గుర్తించి పైలట్‌గా అమలుపరిచారు. మొదటిదశను 2014-15 సంవత్సరంలో ప్రారంభించి 1500 గ్రామాలలో అమలుపరుస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ నుండి 6 గ్రామాలు ఎంపికైనవి. అత్యధికంగా మధ్యప్రదేశ్‌ 327 గ్రామాలు ఎంపికైనవి. రెండోదశను 2018-19 ఆర్థిక సంవత్సరం నుండి ప్రారంభించారు.

    Self Employment Scheme for Rehabilitation of Manual Scavengers (SRMS)

    • 2007లో ప్రారంభించారు.
    • ప్రస్తుతం పాకిపని కార్మికుల నిషేదము మరియు పునరావాస చట్టం 2018ను అనుసరించి ఈ పథకంను అమలు చేస్తున్నారు.
    • పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అందించడమే ఈ పథకం యొక్క ఉద్ధేశ్యం, ఇందుకోసమై నైపుణ్యాల అభివృద్ధి బుణాలు మరియు 40,000 వరకు నగదు సహాయం అందిస్తున్నారు.

    Pradhan Mantri Anusuchit Jaati Abhyuday Yojana (PM - AJAY)

    • 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించారు.
    • ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన, సబ్‌ ప్లాన్‌ నిధులు మరియు బాబు జగ్జీవన్‌ రామ్‌ చాత్రవాస్‌ యోజన పథకాలను కలిపివేసి పై పథకాన్ని రూపొందించారు.

    National Schedule Caste and Schedule Tribes (SC/ST) Hub

    • ఈ పథకాన్ని సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్నది.
    • 2016లో పంజాబ్‌లోని లుధియానాలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా SC/ST పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వపరమైన సహాయాన్ని అందిస్తారు.

    ఇతర పథకాలు

    • 1994 నుండి Post Metric Scholarships ఇస్తున్నారు.
    • 1997 నుండి Uncleaned Profession చేపడుతున్న వారికి Pre-Metric Scholorship ఇస్తున్నారు.
    • 2008 నుండి ‘Babu Jagjeevan Rao Chatravass Yojana' పథకం క్రింద హాస్టల్ సౌకర్యం కల్పిస్తున్నారు.
    • 2005 నుండి ST లకు కల్పించినట్టుగానే M Phil, Ph D విద్యార్థులకు Rajiv Gandhi Fellowship అందిస్తున్నారు.
    • విదేశాలలో చదువుకునేందుకై 'National Overseas Scholarship for SC's" పథకం కింద 10 లక్షలు అందిస్తున్నారు.
    • 1979లో Special Component plan for Scheduled Caste ని రూపొందించారు.
    • 1992 నుండి పాకి పనులు చేస్తున్నవారిని ఇతర వృత్తులకు మల్లించేందుకై 'National Scheme of Liberation & Rehabilitation of Seavengers & their development అనే పథకం అమలు చేస్తున్నారు.
    • 2007 నుండి Self Emlployment Scheme for Rehabilitation అనే పథకాన్ని అమలు చేస్తున్నారు.
    • కేంద్ర విద్యాసంస్థల చట్టం 2006 ద్వారా 2008 నుండి SC లకు 15%, STలకు 7.5%, OBC లకు 27% రిజర్వేషన్ని ఉన్నత విద్యాసంస్థలు కల్పిస్తున్నారు.
    • కేంద్ర ఉద్యోగాలలో 15% కల్పిస్తున్నారు.
    • 2003లో SC బాలికల అక్షరాస్యత వృద్ధి పథకం ప్రారంభించారు.
    • 2007లో SC విద్యాభివృద్ధి పథకం ప్రారంభించారు.
    • 2003లో Manual Scavenger Education పథకం ప్రారంభించారు.
    • 2011 Indira Jala Prabha (ఉమ్మడి నీటి వనరు) ప్రారంభించారు.

    పునశ్చరణ



Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


No comments:

Post a Comment

Post Bottom Ad