3.6 షెడ్యూల్డ్‌ తెగల సంక్షేమం: విధానాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Thursday, July 20, 2023

3.6 షెడ్యూల్డ్‌ తెగల సంక్షేమం: విధానాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు

3.6 షెడ్యూల్డ్‌ తెగల సంక్షేమం: విధానాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు



    నోట్: షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన ప్రాథమిక అంశాలు, జనాభా వివరాలు యూనిట్ -1 నందు గల గిరిజనులు అనే ఛాప్టర్ నందు వివరించడం జరిగింది.


    రాజ్యము SC, ST ల సంక్షేమం కోసం ఈ క్రింది విధానాల ద్వారా కృషి చేస్తుంది.

    1. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

    2. రాజ్యాంగం ద్వారా గిరిజనుల సంక్షేమం

    3. సామాజిక శాసనాల ద్వారా గిరిజనుల సంక్షేమం

    4. వివిధ రకాల సంస్థల ద్వారా గిరిజనుల సంక్షేమం

    5. కేంద్ర ప్రభుత్వ గిరిజను సంక్షేమ పథకాలు

    6. రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ పథకాలు


    కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

    1999వ సంవత్సరంలో కేంద్రం నందు గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖను ఏర్పాటుచేశారు. మంత్రిత్వశాఖ ఏర్పాటునకు ముందు గిరిజనుల వ్యవహారాలు సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వశాఖలో భాగంగా ఉండేవి. ఈ మంత్రిత్వశాఖ గిరిజనులకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పన మరియు అమలు, గిరిజన చట్టాల రూపకల్పన మరియు అమలు, గిరిజన అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేసేందుకు నోడల్ మంత్రిత్వశాఖగా పనిచేస్తుంది.


    రాజ్యాంగం ద్వారా షెడ్యూల్డ్ తెగల సంక్షేమం



    షెడ్యూల్డ్ కులాల సంక్షేమం-సామాజిక శాసనాలు


    • Protection of Civil Rights Act 1976
    • Scheduled castes ST's (Prevention of Atrocities) Act 1989
    • Bonded Labour Abolition Ordinance 1975
    • Bonded labour Abolition Act 1976
    • Prohobition of Child Labour Act 2017
    • Amended Child Labour Act 2017
    • Minimum Wages Act 1948
    • Legal Services Authority Act 1987
    • Central Education Institutions Act (Reservations in Admissions) 2006
    • The Forest Rights Act (FRA), 2006
    • Panchayats (Extension to Scheduled Areas) Act, 1996 or PESA


    గిరిజన సంక్షేమం కోసం కృషిచేస్తున్న సంస్థలు


    జాతీయ షెడ్యూల్డ్ తెగల కమీషన్ (National Commission for Scheduled Tribes, NCST)

    • రాజ్యాంగంలోని 16వ విభాగం నందు గల ఆర్టికల్ 338 (ఎ) ఆధారంగా 2004లో ఏర్పడిన రాజ్యాంగ బద్ధ సంస్థ.
    • ఈ సంస్థ నందు ఒక ఛైర్మన్, ఒక వైస్ఛైర్మన్ మరియు ముగ్గురు సభ్యులతోకూడి మొత్తం 5 గురు సభ్యులతో ఏర్పడి ఉంటుంది. వీరిని 3 సం|| పదవీ కాలానికి గాను రాష్ట్రపతి నియమిస్తాడు.
    • మొదటి ఛైర్మన్ కున్వర్సింగ్ వ్యవహరించాడు. ప్రస్తుత ఛైర్మన్ హర్ష చౌహాన్


    కమీషన్ ఈ క్రింది విధులను కలిగి ఉంటుంది.

    1. ఎస్.టి. లకు సంబంధించిన రాజ్యాంగ బద్ధ, చట్ట బద్ధ హక్కుల ఉల్లంగన అమలు తీరు మరియు వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు లాంటి అంశాలపై విధులను కలిగి ఉంటుంది.

    2. ఎస్.టి.ల సామాజిక ఆర్థిక వికాసం కోసం తగిన సూచనలను, సలహాలు ఇస్తుంది.

    3. వార్షిక నివేదికలను మరియు అవసరమైన సందర్భంలో ఇతర నివేదికలను President కి సమర్పిస్తుంది.

    4. రాష్ట్రపతి నివేదికను పార్లమెంట్ ముందు ఉంచుతారు. వీరి సూచనలపై ప్రభుత్వం చర్య తీసుకొని సందర్భంలో పార్లమెంట్కు వివరణ ఇవ్వవలసి ఉంటుంది.

    5. రాష్ట్రపతి సూచించిన ఇతర బాధ్యతలు స్వీకరిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరినప్పుడు ఆయా బాధ్యతలు నిర్వర్తిస్తుంది.

    6. పై విధుల నిర్వహణ కోసం Commission కు ఈ క్రింది అధికారాలు ఉంటాయి.

    1. సొంత విధానాలను అనుసరిస్తారు.

    2. విచారణ విషయంలో Civil Court కు ఉండే అధికారాలు

    3. ఏ వ్యక్తిని అయిన తన ముందు హాజరు కమ్మని అడుగుతుంది.

    4. ప్రమాన పత్రాలు మరియు ఇతర రికార్డులను అడుగుతుంది.

    5. ఎస్.టి.ల హక్కుల ఉల్లంఘన తరచుగా జరుగుతున్న ప్రాంతాలను సందర్శిస్తుంది.

    6. ఎస్.టి.ల హక్కుల ఉల్లంఘనపై ఫిర్యాదులను స్వీకరిస్తుంది మరియు సుమోటోగా కూడా కేసులను చేపడుతుంది.

    7. విధాన పరమైన నిర్ణయాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమీషన్ని సంప్రదించాలి.


    నోట్: SC, ST Commission Chairman లు, NHRC (National Human Rights Commission) నందు Ex-Officio సభ్యులుగా ఉంటారు.


    Tribal Co-operative Marketing Development Federation of India (TRIFED)


    న్యూఢిల్లీ కేంద్రంగా 1987లో 'Tribal Corporation Marketing Development Foundation of India Ltd' ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా గిరిజన ఉత్పత్తులకు సంబంధించిన మార్కెటింగ్ సౌకర్యాలు పెంపొందిస్తున్నారు మరియు గిరిజన ఉత్పత్తులకు కనీస మద్దతుధరలు అందిస్తున్నారు.


    National Scheduled Tribes Finance Development Corportation


    2001లో National Scheduled Tribes Finance Development Corportation ని ఏర్పాటు చేసి దీని ద్వారా ఆదివాసి మహిళా స్వశక్తి కరణ్' యోజన అనే పథకాన్ని అమలు పరుస్తున్నారు.

    పై పథకంతో పాటు టెర్ములోను స్కీము, ఆదివాసీ శిక్షారిన్ యోజన అనబడే విద్యారుణ పథకం, ట్రైబల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ సాధికారత పథకం లాంటివి అమలుచేస్తున్నారు.


    కేంద్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ పథకాలు


    • 2013 - 2014 లో సంవత్సరం ప్రారంభించారు. 73 రకాల గిరిజన అటవీ ఉత్పత్తులకు ఈ పథకం కింద కనీస మద్దతు ధరని ప్రకటించారు.
    • 1998వ సం||లో PVTGల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు.
    • 2014లో వనబంధు కళ్యాణ్ యోజన పథకంను గిరిజనుల యొక్క సమగ్ర అభివృద్ధి కోసం ప్రారంభించారు. ఇందులో భాగంగా PVTGల అభివృద్ధి, అటవి ఉత్పత్తులకు కనీస ధరలు, గిరిజన పండుగలు, స్వచ్ఛంద సంస్థలకు సహకారం లాంటి పథకాలు అమలు చేస్తున్నారు.
    • 1997-98 ఆర్థిక సం॥లో ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలను ప్రారంభించారు. ఈ పథకమునకు అధికరణం 275 (1) ద్వారా నిధులు సమకూరుస్తున్నారు.
    • 2019లో ప్రారంభించిన వనధన్ వికాస్ కార్యక్రమం ద్వారా అటవీ ఉత్పత్తులకు సరసమైన ధరలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకాన్ని ప్రధాన మంత్రి జన్ జాతీయ వికాస్ మిషన్ పేరుతో అమలు చేస్తున్నారు.
    • 2011లో ప్రారంభించిన ఆదివాసీ శిక్ష రిన్ యోజన అనే పథకం ద్వారా గిరిజనులకు విద్య ఋణాలు అందిస్తున్నారు.
    • 2013లో ప్రారంభించిన అటవీ నివాసుల సాధికారత పథకం ద్వారా అటవీ ఉత్పత్తులకు మార్కెట్ లింకేజ్ సేవలు అందిస్తున్నారు.
    • ఆగస్టు 2020లో స్వాస్థ అనే పోర్టలు ప్రారంభించి దీని ద్వారా గిరిజనులకు సంబంధించిన పోషణ మరియు ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నారు.
    • 20,000 స్ప్రింగ్ ఇన్షియేటివ్స్ మరియు స్ప్రింగ్ వాటర్ అట్లాస్ అనే కార్యక్రమం ద్వారా గిరిజనులకు సురక్షిత తాగునీరు అందించే కార్యక్రమం ప్రారంభించారు.
    • గిరిజనుల యొక్క సమస్త సమాచారం కోసం ఆదివాసీ గ్రాంట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఆదిగ్రామ్స్) అనే పోర్టన్ని ప్రారంభించారు.
    • బిర్సాముండా జన్మదినమైన నవంబర్ 15ని కేంద్రం జన జాతీయ గౌరవ దివస్ గా 10 నవంబర్ 2021న ప్రకటించింది. ఈ దినం సందర్భంగా గిరిజన స్వాతంత్య్ర పోరాట వీరులను స్మరించుకుంటారు.

    • గమనిక: గిరిజనులపై నేరాలు అధికంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంభవిస్తున్నవి.

    • Bhuvaneshwar SC, ST Research & Training Instituteని ఏర్పాటు చేశారు.
    • 2వ పంచవర్ష ప్రణాళికలో 43 Special Multipurpose Tribal Blocks ని ఏర్పాటు చేశారు. తర్వాత కాలంలో వీటినే “Tribal Development Blocks" గా పిలిచేవారు.
    • 2007లో  Corporate Education for Tribal Students పథకం ప్రారంభించారు.
    • గిరిజన వృత్తి విద్యార్థుల కోసం 'Book Bank Scheme' ని అమలు చేస్తున్నారు.
    • School dropout rate ని తగ్గించడం కోసం Pre metric మరియు Post Metric Scholorships అందిస్తున్నారు.
    • SC, ST లలో Creminal layer విధానం ఉండాలని K.L. Chungu (చుంగ్) Committee అభిప్రాయపడింది. మరియు ఈ వాదాన్ని Ashok kumar V/s State of Bihar ని సమర్ధించింది.
    • 2005లో ప్రారంభించిన Rajiv Gandhi Nation Fellowship ద్వారా U.G.C. మార్గదర్శకత్వంలో M.Phil మరియు PhD విద్యార్థులకు Fellowship ఇస్తున్నారు.
    • ఆర్టికల్ 275(1) నిధుల ద్వారా ఏకలవ్య పాఠశాలను 1997-98 ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేశారు.
    • జూన్ 7, 2013న వామపక్ష తీవ్రవాదం అధికంగా ఉన్న 24 జిల్లాలో 'Roshini scheme' ని ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా గిరిజన యువతకు ఉపాధి కల్పించి తీవ్రవాదం వైపు వెళ్ళకుండ నిరోధిస్తున్నారు.
    • Dr. Br Ambedkar Scheme for National Integration through inter-caste Marriage అనే పథకం ద్వారా Inter caste వివాహం చేసుకున్న దంపతులకు 2.5 లక్షల ప్రోత్సాహం అందిస్తున్నారు.
    • 11వ ప్రణాళిక కాలంలో PVTG ల కోసం 'Conservation cum development' అనే పథకాన్ని ప్రారంభించారు.
    • 2014 అక్టోబర్ 2 మానవ అభివృద్ధి సూచిలో గిరిజనులకు గిరిజనేతరులకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు 'Vana Bandhu Kalyan Yojana' అని పథకాన్ని ప్రారంభించారు.
    • కేంద్రం 5th five year plan కాలంలో గిరిజన ఉపప్రణాళిక ప్రారంభించారు. ఇందులో భాగంగా 50% కంటే ఎక్కువ గిరిజనులు ఉన్న ప్రాంతాలలో ITDA (ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలు) లు ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా 193 ITDAలు కలవు, అత్యధికంగా మధ్యప్రదేశ్ నందు 31 ITDAలు కలవు. ఆంధ్రప్రదేశ్లో 9 ITDAలు కలవు.
    • ITDA లేని ప్రాంతాలలో MADA లను ఏర్పాటు చేశారు. మరియు గిరిజనులు విచ్ఛినంగ ఉన్న ప్రాంతంలో గిరిజన Cluster లను ఏర్పాటు చేశారు.


Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


No comments:

Post a Comment

Post Bottom Ad