3.7 ఇతర వెనుకబడిన వర్గాల సంక్షేమం: విధానాలు & సంక్షేమ కార్యక్రమాలు - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Thursday, July 20, 2023

3.7 ఇతర వెనుకబడిన వర్గాల సంక్షేమం: విధానాలు & సంక్షేమ కార్యక్రమాలు

3.7 ఇతర వెనుకబడిన వర్గాల సంక్షేమం: విధానాలు & సంక్షేమ కార్యక్రమాలు


    OBCలకు రాజ్యంగ పరమైన రక్షణలు


    • నిబంధన 15(4) ప్రకారం సామాజికంగా మరియు విద్యా పరంగా వెనుకబడిన వారి అభివృద్ధి కోసం ఆయా రాష్ట్రాలు ప్రత్యేకమైన నిబంధనలు చేయవచ్చు.
    • నిబంధన 15(5) ప్రకారం సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన వారి అభ్యున్నతి కోసం ప్రైవేట్ విద్యాసంస్థలతో సహా అన్ని విద్యాసంస్థలో వారి ప్రవేశానికి చట్ట పూర్వకంగా ప్రత్యేక నిబంధనలను ప్రభుత్వం జారి చేయవచ్చు.


    నోట్: పై Clause ని 93వ రాజ్యాంగ సవరణ చట్టం 2005 ద్వారా చేర్చారు. దీని అనుసరించి కేంద్రం Central Educational Institutions Act (Reservations in Admissions) 2006ని రూపొందించింది. ఈ చట్టం ద్వారా IIT లు, IIM మరియు ఇతర Higher Education సంస్థలలో 20% OBC Reservation లను ప్రవేశపెట్టింది, కాని 2008లో Supreme Court Creamy layer ని పాటించమని సూచించింది.


    • ఆర్టికల్ 16(4) ప్రకారం ఉద్యోగాలలో వెనుకబడిన వర్గాలకి సరైన ప్రాతినిధ్యం లేదని భావించినప్పుడు ఆయా రాష్ట్రాలు వారికి రిజర్వేషన్లు కల్పించవచ్చు.
    • ఆర్టికల్ 164(1) ఛత్తీస్ఘడ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ మరియు ఒరిస్సా రాష్ట్రాలలో గిరిజన శాఖా మంత్రి ఉండాలి. ఇతనికి షెడ్యూల్డ్ కులాలు మరియు ఇతర వెనుకబడిన వర్గాల సంక్షేమ బాధ్యతలు కూడా అప్పగించవచ్చు.
    • అధికరణం 342 (ఎ) ప్రకారం వెనుకబడిన తరగతులను రాష్ట్రపతి గుర్తిస్తాడు.
    • అధికరణం 366(26సి) వెనుకబడిన తరగతుల నిర్వచనం
    • ఆర్టికల్ 340 ఆధారంగా సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబాటు తనానికి గురైన తరగతుల పరిస్థితులను అధ్యయనం చేయడానికి మరియు కేంద్రం లేదా రాష్ట్రం తీసుకోవలసిన చర్యలు సూచించడానికి రాష్ట్రపతి ఒక జాతీయ కమీషన్ని ఏర్పాటు చేయవచ్చు.


    నోట్: పై అధికరణం ఆధారంగా

    1. కాక సాహెబ్ కాలేక్కర్ కమీషన్

    2. Mandal Commission లు ఏర్పడ్డవి.


    340 అధికరణం క్రింద రాష్ట్రపతి నియమించిన కమీషన్ కాకుండ National Commission for Backward Classes Act 1993 ద్వారా ఏర్పడిన National Commission for BC's అనుసంస్థ నిర్ణీత కాలం పాటు ఎల్లవేలల కొనసాగుతుంది. ప్రస్తుతం దీని స్థానంలో రాజ్యాంగబద్ధ కమీషన్ని ఓబిసిల కోసం 338(బి) అధికరణం ద్వారా ఏర్పాటు చేశారు.


    కాక సాహెబ్ కాలేక్కర్ కమీషన్ 1953


    • 340 అధికరణం ఆధారంగా రాష్ట్రపతి 1953 జనవరి 29న ఏర్పాటు చేశారు.
    • బి.సి. లకు సంబంధించి ఇది మొదటి కమీషన్, ఈ కమీషన్ మార్చి 30, 1955న తన నివేదికను రాష్ట్రపతికి నివేదించింది.
    • ఈ కమీషన్ దేశ వ్యాప్తంగా 2399 BC కులాలు, మరియు వీరిలో 837 తీవ్రంగా వెనుకబడిన కులాలను గుర్తించింది. వీరినే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు.
    • ఈ కమీషన్ ప్రకారం బి.సి. లు అనగా ఎస్.సి, ఎస్.టి. లు మినహాయించి తీవ్రంగా వెనుకబడిన వర్గాలు.


    ఈ కమీషన్ ఈ క్రింది సూచనలు చేసింది.

    1. 1961 జనాభా లెక్కలు కులప్రాతిపదికన చేపట్టాలి.

    2. హిందూ సమాజంలో కులం యొక్క హెూదాను బట్టి సామాజిక వెనుకబడిన కులాన్ని గుర్తించాలి.

    3. స్త్రీలకు, బి.సి. విద్యార్థులకు సాంకేతిక మరియు వృత్తి విద్యల యందు 70% రిజర్వేషన్ కల్పించాలి.

    4. ప్రభుత్వ ఉద్యోగ రంగంలో Class I ఉద్యోగాలలో 25%, Class - II ఉద్యోగాలలో 33%, Class - III ఉద్యోగాలలో 40% రిజర్వేషన్లు కల్పించాలి.

    5. సెప్టెంబర్ 1965న కేంద్రం పార్లమెంట్లో వీరి సూచనలను చర్చకు పెట్టింది. కాని వీరి సూచనలకు ఆమోదం లభించలేదు.

    6. ఈ Commission వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి ప్రాతిపదికగా ఈ క్రింది అంశాలను పరిగణించింది.

    1. కులం ఆధారంగా వెనుకబాటుతనం

    2. విద్యాపరంగా వెనుకబాటుతనం

    3. ప్రభుత్వ ఉద్యోగ రంగంలో అసమాన ప్రాతినిధ్యం 

    4. వాణిజ్య వ్యాపార రంగాలలో వెనుకబాటు తనం


    మండల్ కమీషన్


    • 340 అధికరణం ఆధారంగా రాష్ట్రపతి బి.పి. మండల్ అధ్యక్షతన వెనుకబడిన వర్గాల స్థితిగతులను అధ్యయనం చేయడానికి జనతా ప్రభుత్వ పాలనలో 1979లో ఈ కమీషన్ ఏర్పాటు చేశారు.
    • ఇది 340 అధికరణం కింద ఏర్పాటు చేసిన రెండవ కమీషన్.
    • దేశవ్యాప్తంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించేందుకు ఈ కమీషన్ను ఏర్పాటుచేశారు.
    • ఈ కమీషన్ డిసెంబర్ 31, 1980న తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది.
    • Vishwanat Pratap Singh యొక్క ప్రభుత్వం వీరి సూచనలను ఆమోదించింది.
    • OBC లను గుర్తించేందుకు ఈ కమీషన్ 11 అంశాలను పరిగనలోనికి తీసుకుంది.
    • సామాజిక అంశాలు (4), విద్యాపరమైన అంశాలు (3), ఆర్థిక పరమైన అంశాలు (4).
    • పై అంశాల సూచికల ఆధారంగా దేశవ్యాప్తంగా 3743 OBC లను గుర్తించింది.
    • ఈ కమీషన్ 1931 జనాభా లెక్కల ఆధారంగా దేశ జనాభాలో 52% OBC లు ఉన్నట్లు అంచనా వేసింది.
    • ఈ కమీషన్ OBC లకు విద్యా మరియు ఉపాధి రంగాలలో 27% రిజర్వేషన్ కల్పించాలని సూచనలను చేసింది మరియు 40 రకాల వివిధ సూచనలు చేసింది.


    జాతీయ వెనుకబడిన వర్గాల కమీషన్ (National Commission for Backward classes)


    • ఇది చట్టబద్ధ సంస్థ. 1992వ సంవత్సరంలో Supreme Court సుప్రసిద్ధ Mandal Case లో తీర్పునిస్తు జాతీయ స్థాయిలో శాశ్వత ‘BC’ కమీషన్ ఏర్పాటు చేయమని సూచించింది. దీని ఆధారంగా National Commission for BC Act 1993ని రూపొందించి ఈ కమీషన్ని ఏర్పాటు చేశారు.
    • ఈ కమీషన్ ఏప్రిల్ 2, 1993 నుండి అమలులోనికి వచ్చింది.
    • ఈ కమీషన్ యొక్క ముఖ్యమైన విధి OBC జాబితాకి సంబంధించిన అంశాలని పరిశీలించడం.
    • ఈ కమీషన్ ఒక ఛైర్మన్ మరియు 4 సభ్యులతో ఏర్పాటు చేశారు. అనగా ఈ కమీషన్ మొత్తం 5 గురు సభ్యులతో ఏర్పాటైనది.
    • ఈ కమీషన్ సభ్యుల పదవీకాలం 3 సం||. వీరిని కేంద్రం నియమిస్తుంది.
    • సమాజం నుండి వచ్చే OBC జాబితాలో చేర్చేందుకై చేసే విజ్ఞప్తులను పరిశీలించడం లేదా ఇంతకు ముందే ఉన్న OBC ల జాబితాకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించడం మరియు ఆయా అంశాలపై కేంద్రానికి సిఫార్సులు చేయడం చేపడుతుంది. ఈ కమీషన్ సూచనలకు సాధారణంగా కేంద్రం కట్టుబడి ఉంటుంది.

    ఈ కమీషన్ OBC జాబితాకి సంబంధించి ఈ క్రింది మార్గదర్శకాలను రూపొందించింది.

    1. Social Backwardness

    2. Educational Backwardness 

    3. Economic Backwardness


    జాతీయ వెనుకబడిన వర్గాల రాజ్యాంగబద్ధ కమీషన్


    నేషనల్ కమీషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చట్టం 1993 ఆధారంగా ఏర్పడిన నేషనల్ కమీషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 2016 వరకు కొనసాగింది. ప్రస్తుత కమీషన్ (8వది)నకు 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 ద్వారా రాజ్యాంగ బద్ధతను కల్పించడం జరిగింది.

    102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 338(బి) అధికరణంను రాజ్యాంగంనకు చేర్చి జాతీయ స్థాయిలో ఓబిసిలకు కమీషన్ ఉండాలని పేర్కొన్నాడు. దీని ఆధారంగానే ప్రస్తుత బి.సి. కమీషన్ ఏర్పడింది. మొదటి కమీషన్ ఛైర్మన్ భగవాన్ లాల్ సాహిణి, ప్రస్తుత కమీషన్ ఛైర్మన్ హనాజ్ గంగారామ్ అహిర్.


    OBC ల సంక్షేమ పథకాలు


    1. Pre & Post metric Scholarshipలు మరియు Hostel సౌకర్యాలు అందిస్తున్నారు.

    2. 2014 నుండి National Overseas Scholarship ఇస్తున్నారు

    3. జవనరి 13, 1992న 'National Backward Classes Finance Corportaion' (NBCFDC) ని ఏర్పాటు చేసి OBC ల Socio - Economic Devlopment కోసం రుణాలు అందిస్తున్నారు.

    4. Central Educational Institutions నందు 27% రిజర్వేషన్లు కల్పిస్తున్నారు.

    5. Creamy Layer నిబంధనల మేరకు OBC లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల యందు 27% రిజర్వేషన్ కల్పిస్తున్నారు.


    నోట్: Creamy Layer అంటే వెనుకబడిన వారిలో ముందంజలో ఉన్నవారు.


    ♦ వార్షిక ఆదాయం 8 లక్షలు దాటిన వారు క్రిమి లేయర్ గా గుర్తింపబడతారు. 2016 వ సంవత్సరం వరకు వార్షిక ఆదాయం పరిధి 6 లక్షలుగా ఉండేది. దీనితో పాటు గెజిటెడ్ ఉద్యోగాలు, పారిశ్రామిక వేత్తలు లాంటి వారు కూడా క్రిమిలేయర్ పరిధిలోకి వస్తారు.

    6. 1985 సం||నకు ముందు OBC సంక్షేమం అనేది Central Home Ministry పరిధిలో ఉండేది. కాని 1988 నుండి OBC సంక్షేమం ‘Ministry of Social Justice & Empowerment' లో భాగమైనది.


    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో BC రిజర్వేషన్లకు సంబంధించిన వివాదాలు


    • 1963లో 139 BC కులాలకు కల్పించిన చేసిన 25% రిజర్వేషనులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది.
    • 1968న 'Minister Manohar Prasad" Chairman గా Educationally & Socially, Backward Classes list ని తయారు చేయడానికి కమీషన్ నియమించారు.
    • Manohar Prasad Commission సూచనలని అమలుపరుస్తూ 25% రిజర్వేషన్లు కల్పించారు. కాని, ఈ రిజర్వేషన్లను హైకోర్టు కొట్టివేసింది కాని సుప్రీం కోర్టు ఆమోదించింది.
    • 1982లో 'Mr. Muralidhar Rao' కమీషన్ సూచనల ప్రకారం NTR ప్రభుత్వం కల్పించిన 44% రిజర్వేషన్లు కూడా కోర్టు ముందు నిలబడలేదు.


    రిజర్వేషన్లు జాతీయ స్థాయిలో వచ్చిన తీర్పులు


    1963లో Balaji V/s State of Mysore Case లో మరియు 1964 Devadasan Case లో సుప్రీం కోర్టు 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు కల్పించడం అనేది రాజ్యంగ వ్యతిరేఖమని తీర్పునిచ్చింది.


    V.P Singh ప్రధానిగా ఉన్నకాలంలో OBC లకు 27% రిజర్వేషన్ని ప్రకటించింది (మండల్ కమీషన్ సిఫార్సు మేరకు).


    1991లో పి.వి. నరసింహరావు గారి ప్రభుత్వం OBC లకు విద్యా మరియు ప్రభుత్వ ఉద్యోగ రంగంలో 27% రిజర్వేషన్లతో పాటుగా అగ్రకుల నిరుపేదలకు (Economically Backward Classes, EBC) కూడా 10% రిజర్వేషన్లు ప్రకటించింది.


    నోట్: పై రిజర్వేషన్లకి సంబంధించిన అంశాలపై 15-11-1992న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునే 'Indira Sahani V/s Union of India' Case (లేదా) మండల్ కేస్ అని కూడా అంటారు.


    మండల్ కేసుకి సంబంధించి సుప్రీం కోర్టు తీర్పునందలి ముఖ్యాంశాలు

    9 మందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పుని 6-3 తేడాతో వెలుబరిచింది. ఇందులోని ముఖ్యాంశాలు...

    1. EBC లకు కల్పించిన 10% రిజర్వేషన్లు చెల్లవు.

    2. OBC లకు కల్పించిన 27% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమని తెల్పింది.

    3. OBC లకు రిజర్వేషన్లను అమలుపరిచేటప్పుడు Creamy layer విధానాన్ని పాటించాలని సూచించింది.

    ♦ Science & Technology రంగంలో రిజర్వేషన్లు వర్తించవు.

    ♦ ఆర్టికల్ 16(4) అనేది విస్తృత అర్థంని కలిగి ఉంటుందని పేర్కొంది.

    ♦ OBC హెూదా ఇతర మతాల వారికి కూడా వర్తిస్తుంది.

    ♦ OBC వర్గాల యందు Sub Category కూడా ఉండవచ్చు అని సూచించింది.

    ఉదా: BC-A, BC-B, BC-C, BC-D

    ♦ మరియు ప్రభుత్వం అన్ని వర్గాలకు కల్పించే రిజర్వేషన్లు 50% మించరాదు అని తెల్పింది.

    ♦ OBC ల కోసం జాతీయస్థాయిలో శాశ్వత కమీషన్ ఉండాలని సూచించింది.


    నోట్: ఈ సూచన ఆధారంగానే 1993లో జాతీయ వెనుకబడిన వర్గాల కమీషన్ చట్టాన్ని ఏర్పాటు చేసి దీని ఆధారంగా 1993లో జాతీయ వెనుకబడిన వర్గాల కమీషన్ని ఏర్పాటు చేశారు.


    ♦ Creamy Layer అంటే వెనుకబడిన వారిలో ముందంజలో ఉన్నవారు. వార్షిక ఆదాయం 8 లక్షలు దాటిన వారు క్రిమి లేయర్గా గుర్తింపబడతారు. 2016 వ సంవత్సరం వరకు వార్షిక ఆదాయం పరిధి 6 లక్షలుగా ఉండేది. దీనితో పాటు గెజిటెడ్ ఉద్యోగాలు, పారిశ్రామిక వేత్తలు లాంటి వారు కూడా క్రిమిలేయర్ పరిధిలోకి వస్తారు.

    ♦ క్రిమిలేయర్ ఆదాయ పరిమితి 1993లో సం॥నికి ఒక లక్ష ఉండగా, 2004లో 2.5 లక్షలు, 2008లో 4.5 లక్షలు, 2013లో 6 లక్షలు మరియు 2017 నుండి 8 లక్షలుగా నిర్ణయించినారు.

    ♦ క్రిమిలేయర్ పరిధిలో ఉన్నవారికి ఒబిసి రిజర్వేషన్లు వర్తించవు.


    నోట్ : అధికరణ 340 ఆధారంగా రాష్ట్రపతి జస్టిస్ రోహిణి అద్యక్షతన ఒ.బి.సి.ల వర్గీకరణ కోసం కమీషన్ని 2 అక్టోబర్ 2017న నియమించడం జరిగింది. ఈ కమీషన్ ఇంకను కొనసాగుతున్నది.


    సంక్షేమ పథకాలు


    • 1998వ సం|| నుండి ప్రి మెట్రిక్ స్కాలర్ షిప్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్లు అందిస్తున్నారు.
    • 2014-15 ఆర్థిక సం|| నుండి విముక్త జాతుల విద్యార్థులకై బి.ఆర్. అంబేద్కర్, ప్రీ & పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్లు అందిస్తున్నారు.
    • 2014-15 ఆర్థిక సం|| నుండి ఈబిసి విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్లు అందిస్తున్నారు.
    • ముక్త జాతుల విద్యార్థుల కోసం నానాజీ దేశముఖ్ పథకం ద్వారా హాస్టల్లు నిర్మిస్తున్నారు.
    • 1997లో ప్రారంభించిన న్యూ స్వర్ణిమ అనే పథకం ద్వారా బి.సి. మహిళలకు ఋణాలు అందిస్తున్నారు.
    • 1992వ సం||లో జాతీయ వెనుకబడిన వర్గాల ఆర్థిక అభివృద్ధిని సంస్థను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు.
    • 2022వ సం||లో ప్రధాన మంత్రి దక్షత మరియు కుశలత సంపన్న హిత్హి (పిఎం దక్ష) అనే పథకాన్ని ప్రారంభించి నైపుణ్యాలను పెంపొందిస్తున్నారు.
    • 2021వ సం||లో ప్రారంభించిన శ్రేయస్ అనే పథకం ద్వారా విద్యార్థులకు జాతీన పరిశోధన ఫెల్లోషిప్లు మరియు విద్య ఋణాలు అందిస్తున్నారు.
    • 2021వ సం|| నుండి 2026 వరకు అన్ని రకాల ఒబిసి విద్యార్థుల స్కాలర్షిప్ పథకాలను పిఎం యశస్వి అనే గొడుగు పథకం పేరు మీద అమలు చేయనున్నారు.
    • ఫిబ్రవరి 2022లో విముక్త జాతుల అభివృద్ధి కోసం స్కీం ఫర్ ఎకానమిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఎన్టిటి కమ్యూనిటీస్ అనే పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తున్నారు.


     (నోట్: 1993లో క్రిమిలేయర్ విధానంపై Ramanadhan Committee ని ఏర్పాటు చేశారు).



Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization



No comments:

Post a Comment

Post Bottom Ad