3.8 ఆంధ్రప్రదేశ్‌ సంక్షేమ పథకాలు - APPSC Indian Society Notes - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Thursday, July 20, 2023

3.8 ఆంధ్రప్రదేశ్‌ సంక్షేమ పథకాలు - APPSC Indian Society Notes

3.8 ఆంధ్రప్రదేశ్‌ సంక్షేమ పథకాలు

    నవరత్నాలు


    నవరత్నాలను 2019-20 బడ్జెట్‌ నందు వ్రకటించారు.

    1. జగనన్న అమ్మ ఒడి పథకం 

    2. వైయస్సార్‌ రైతు భరోసా-పి.యం కిసాన్‌ పథకం 



    3. వైయస్సార్‌ పింఛను పథకం 

    4. వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ

    5. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన

    6. పేదలందరికీ ఇళ్ళు

    7. వైయస్సార్‌ ఆసరా, వైయస్సార్‌ చేయూత

    8. మద్యపాన నిషేధం

    9. వైయస్సార్‌ జలయజ్ఞం


    జగనన్న అమ్మ ఒడి పథకం


    09-02-2020న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం అక్షరాన్వతా శాతాన్ని మెంచుతు జాల కార్జిక వ్యవస్థను నిర్భూలించి మరియ్యు తల్లిదండ్రులపై ఆర్థిక భారం తర్ధించదం థటధాన ఉద్దేత్చుం. అక్షరాన్వుత శాతంను వెంచదం, చదువుల భారాన్ని వ్రభుత్వమే భరించడం, విద్యార్థి తల్లిదండ్రులకు ఆర్థిక భరోసాను కల్ఫించడం, ఐడిమానేనే బాలల శాతంను తగిన్తూ హాజరు శాతంను పెంచడం అనునవి ఈ వథకం యొకు ఇతర లక్ష్యాలు.


    “మీ పిల్లలను మీరు బడికి పంపించండి. బడికి పంపించినందుకుగాను ప్రతి తల్లికి సంవత్సరానికి రూ! 15,000/- మీ చేతుల్లో పెడతానని మాట ఇస్తున్నాను” - వై.ఎస్‌. జగన్‌.


    లబ్దిదారులు


    • కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ॥ 10,000 లోపు, పట్టణ ప్రాంతాలలో రూ॥ 12,000 లోపు కల్గిన కుటుంబాలు.
    • కుటుంబంలోని పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ పథకం వర్తిస్తుంది.
    • ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్‌ కార్డు ఉండాలి. తెల్ల రేషన్‌కార్డు లేనివారికి అర్హత కల్గిన కుటుంబాలకు చెందిన వారు అవునా లేక కాదా 6 అంచెల పరిశీలన ద్వారా అర్హతను నిర్ణయించి వారికి కూడా లబ్బిచేరూరుస్తారు.
    • లబ్టిదారుడు తల్లికి చెల్లుబాటయ్యే ఆధార్‌ కార్డు ఉండాలి.
    • 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న విద్యార్తిని, విద్యార్థులకు ఆధార్‌ కార్డు ఉండాలి.


    చేకూర్చే లబ్ధి


    • పేద కుటుంబాల పిల్లల చదువులకు సంబంధించి పిల్లలను ప్రభుత్వం లేదా ప్రయివేటు స్మూళ్ళకు పంపించే ప్రతి తల్లి యొక్క బ్యాంకు పొదుపు ఖాతాలో సంవత్సరానికి రూ! 15 వేల చొప్పున జమ చేస్తారు.
    • 2021-22 విద్యా సంవత్సరం నుంచి అర్హులైన 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల తల్లులు కోరినట్లయితే విద్యా వికాసం కోసం నగదు బదులు ల్యాప్‌టాప్‌లను అందిస్తారు.
    • 2021-22 అమ్మఒడి సాయంలో రూ॥ 1000 మినహాయించి వాటిని ఆయా విద్యాసంస్థలలో మరుగుదొడ్ల నిర్వహణకు బదిలీ చేయనున్నారు.


    వైయస్సార్‌ రైతు భరోసా-పి.యం కిసాన్‌ పథకం


    రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కౌలు రైతులతో నవో రైతు కుటుంబాలకు (వ్రతి రైతు కుటుంబానికి నంవత్సరానికి రూ. 13,500/- చొవ్పున రైతులకు ఆర్థిక నవోయం అందించడం కోనం ఆంధ్రవ్రదోల్‌ వ్రభుత్సం అక్టోబర్‌ 15, 2019 నుండి 'వైఎన్‌ఆర్‌ రైతు భరోసా” అమలు చేస్తోంది.

    అధిక వంట ఉత్సాదకత కోనం నాజ్యమైన ఇన్‌వుటిలు మరియు నేవలను నకాలంలో సోర్సింగ్‌ చేయడానికి వీలుగా వంట సీజన్ లో పెట్టుబడిని చేరుకోవడం.

    భూమి హోల్డింగ్స్‌ పరిమాణంతో సంబంధం లేకుండా సమిష్టిగా సాగు చేయదగిన భూమిని కలిగి ఉన్న భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలకు మూడు విడతలుగా భారత ప్రభుత్వం నుండి రూ. 6,000/-తో సహా ప్రతి కుటుంబానికి రూ. 13,500/- ప్రయోజనం అందించబడుతుంది. .

    రాష్ట్రంలోని SC, ST, BC మైనారిటీ వర్గాలకు చెందిన భూమిలేని కౌలు రైతులు ROFR సాగుదారులకు సంవత్సరానికి రూ. 13,500/-, అంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ బడ్జెట్‌ నుండి ఆర్థిక సహాయం అందించబడుతుంది.

    అర్హతలు

    • సాగు భూమిని కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రైతులు ఈ పథకం కింద అర్హులు.
    • పీఎం-కిసాన్‌ పథకం కింద నమోదు చేసుకున్న రైతులు కూడా ఈ పథకంలో భాగం అవుతారు.
    • ప్రభుత్వం ప్రకారం, దేవాదాయశాఖ/దేవాలయాలు/ఇనాం భూముల్లో సాగుచేసే వారు కూడా అర్హులే.
    • వై.ఎస్‌.ఆర్‌ రైతు భరోసా కింద ప్రయోజనం కోసం (మాజీ) & ప్రస్తుత మంత్రులు, ఎం.పి.లు, ఎమ్మెల్యేలు &ఉ ఎమ్మేల్సీలు లుగా నియోజకవర్గ పదవిని కలిగి ఉన్న రైతులు మరియు వారి కుటుంబ సభ్యులు మినహాయించబడ్డారు మరియు ఇతర ప్రజా ప్రతినిధులందరూ ఈ పథకం కింద అర్హులు.
    • ఒక రైతు యొక్క పెళ్లికాని పిల్లలు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లేదా ఆదాయపు పన్ను మదింపుదారు అయితే, అతను లేదా ఆమె ఏ మినహాయింపు కేటగిరీ కిందకు రానట్లయితే ఆ రైతు ఈ పథకం కింద అనర్హులను చేయరు.
    • ప్రతి సంవత్సరం జులై 8ని డా॥ వై.యస్‌.ఆర్‌ రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

    వైయస్సార్‌ పింఛను పథకం

    మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ. 10,000 మరియు పట్టణ ప్రాంతాలలో అయితే రూ. 12,000 కంటే తక్కువ ఉండాలి.

    మొత్తం కుటుంబానికి 3 ఎకరాల మాగాణి భూమి లేదా మెట్ట లేదా 10 ఎకరాల మాగాణి మరియు మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాలకు మించరాదు. కుటుంబం మొత్తానికి నాలుగు చక్రాల వాహనము వుండరాదు. (అయితే, ట్యాకీ. ట్రాక్టర్స్, ఆటోలు వున్న వారు మినహాయింపు. కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుడై ఉండరాదు.

    • కుటుంబం నివసిస్తున్న గృహం (సొంతం/ అద్దె) యొక్క నెలవారీ విద్యుత్ వినియోగ బిల్లు 300 యూనిట్లు లోపు ఉండవలెను. (గత 6 నెలల విద్యుత్ వినియోగ బిల్లు యొక్క సగటు 300 యూనిట్లు లేదా అంతకు తక్కువ ఉండవలెను).
    • పట్టణ ప్రాంతంలో నిర్మాణపు స్థలము 1000 చదరపు అడుగులు కంటే తక్కువ ఉండాలి.
    • కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో వుండరాదు. సాధారణంగా ఒక కుటుంబానికి ఒక పింఛను (40% మరియు ఆపైన అంగవైకల్యం కలవారు మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మినహా) మాత్రమే.

     క్యాటగిరి వారిగా నెలవారి పెన్షన్ మరియు అర్హతలు


    వైయస్సార్ ఆరోగ్యశ్రీ

    • ఈ పథకాన్ని 01-11-2019న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించినారు.
    • “జనం ఆరోగ్యమే - జగనన్న ఆశయం పేదలందరికీ నాణ్యమైన వైద్యం అందించటమే లక్ష్యం".
    • పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యభద్రతను కల్పించుట నాణ్యమైన వైద్యసేవలను కార్పోరేట్ వైద్య శాలలో కూడా అందిస్తారు.
    • ఈ పథకం కింద క్యాన్సర్తో సహా 2,436 వైద్య ప్రక్రియలకు ఉచితంగా చికిత్సలు అందిస్తారు.

    అర్హులు

    • బియ్యం కార్డు, పింఛను కార్డు, జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకాలకు అర్హులైన వారు ఈ పథకానికి అర్హులు.
    • మాగాణి భూమి 12 ఎకరాలు లేదా మెట్ట/మెరక భూమి 35 ఎకరాలు లేదా మెట్ట మరియు మాగాణి కలిపి 35 ఎకరాల లోపు కలిగినవారు.
    • 5 లక్షలు లేదా అంతకు తక్కువ కుటుంబ వార్షిక ఆదాయము కలిగిన వారు.
    • 5లక్షల లోపు ఆదాయపన్ను చెల్లింపులను చేస్తున్న కుటుంబాలు.
    • శాశ్వత ప్రభుత్వ ఉద్యోగి/పింఛనుదారు మినహాయించి మరే ఇతర ఉద్యోగి ప్రభుత్వంలో గానీ లేదా ప్రైవేటుగా గానీ కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగులు, పార్ట్-టైం ఉద్యోగులు, శానిటరీ వర్కర్లు, గౌరవ వేతనం ఆధారంగా పనిచేసే ఉద్యోగులు ఎవరైనా 5 లక్షల లోపు వార్షికాదాయం కలిగియున్న వారు అర్హులు.
    • 3000 చదరపు అడుగుల స్థలం లోపు వైశాల్యానికి మునిసిపల్ ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు.
    • ఒక కుటుంబానికి/గృహానికి ఒక వ్యక్తిగత కారును మించి ఉండరాదు.

    ప్రయోజనాలు

    • వైద్యఖర్చు రూ॥ 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది.
    • ఆంధ్రప్రదేశ్లోనున్న వైద్యశాలలో కాని, హైద్రాబాద్, బెంగుళూర్, చెన్నై మొదలైన నగరాలలోనున్న కార్పోరేట్ వైద్యశాలలో చేయించుకున్న వారికి కూడా ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది.
    • 9 రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి నెలకు రూ॥3,000 నుంచి 10,000 రూపాయల వరకు పెన్షన్ అందజేస్తారు.
    • ప్రభుత్వం ద్వారా గుర్తింపబడిన బి.పి.ఎల్ కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి రూ॥ 5 లక్షల పరిమితికి లోబడి ఎంప్యానెల్డ్ నెట్వర్క్ వైద్యశాలలో 2436 రకాల చికిత్సలకు నగదు రహిత ఆరోగ్య సేవలను అందిస్తారు.
    • నగదు రహిత చికిత్సలో ఓ.పి. రిజిస్ట్రేషన్, ఉచిత వైద్య పరీక్షలు, కన్సల్టేషన్ సర్జికల్ ప్రొసీజర్స్/వైద్య చికిత్సలు డిస్చార్జి అయిన తర్వాత 10 రోజులకు అవసరమైన మందులను ఉచితముగా సరఫరా చేస్తారు.

    జగనన్న “విద్యాదీవెన”, జగనన్న “వసతిదీవెన”

    • 24-02-2020న ప్రారంభించారు.
    • లక్ష్యం: పేద విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించుటకై ఆర్థిక భరోసా ఇచ్చి ప్రోత్సహించడం.

    అర్హతలు

    • కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,50,000/- లోపు ఉన్నవారు అర్హులు.
    • కుటుంబానికి వ్యవసాయ భూమి మాగాణి అయితే 10 ఎకరాలు కన్న తక్కువ లేదా మెట్ట భూమి అయితే 25 ఎకరాలకన్న తక్కువ లేదా మాగాణి మరియు మెట్ట కలిపి 25 ఎకరాలు లోపు ఉన్నవారు అర్హులు.
    • కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి / ఆదాయ పన్ను చెల్లింపుదారు / పెన్షన్ దారుడు ఉన్న యెడల అర్హులు కారు (పారిశుధ్య కార్మికులు మినహా).
    • పట్టణ ప్రాంతములో 1,500 చ.అ.లు కన్నా తక్కువ నివాస మరియు వాణిజ్య భవనం కలిగిన కుటుంబం అర్హులు.
    • ఐ.టి.ఐ. పాలిటెక్నిక్, డిగ్రీ ఆపై కోర్సులను ప్రభుత్వము గుర్తింపు వున్న కళాశాలల్లో చదువుతున్న వారు.

    ఆర్థిక ప్రయోజనాలు

    • ఫీజురీయింబర్స్మెంట్ తో పాటు అధనంగా వసతి, భోజనం, ప్రయాణం, పుస్తకాల కోసం ప్రతి విద్యార్థిని, విద్యార్థికి రూ॥ 20,000 చెల్లిస్తారు.
    • ఫీజురీయింబర్స్మెంట్ డబ్బులు విద్యార్థిని, విద్యార్థుల తల్లుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది.
    • 4 దఫాలలో పూర్తి ఫీజును రీయింబర్స్మెంట్ చేస్తారు.
    • 2 వాయిదాలలో ఐ.టి.ఐ చదువుతున్న విద్యార్థులకు, పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు రూ॥ 15,000, డిగ్రీ ఆపై కోర్సులు చదువుతున్న వారికి 25,000 రూ॥ చొప్పున వసతి, భోజనవసతి చెల్లిస్తారు.

    వైయస్సార్ గృహనిర్మాణ పథకం (పేదలందరికీ ఇళ్లు)

    • ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్ళ నిర్మాణం.
    • నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులైన లబ్దిదారులందరికి గ్రామీణ ప్రాంతాలలో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 1 సెంటు చొప్పున 30.66 లక్షల ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించినారు.
    • మొదటిదశలో 15.6 లక్షల ఇళ్ళు, రెండవ దశలో 12.70 లక్షల ఇళ్ళు, మొత్తము పైన 28.30 లక్షల వ్యక్తిగత గృహాలను నిర్మించాలని ప్రతిపాదించినారు.
    • ప్రతి ఇంటికి యూనిట్ వ్యయం రూ॥ 1.80 లక్షలు.
    • ఇళ్ళను 18 నెలల లోపల పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
    • వీటికి వై.యస్.ఆర్ జగనన్న కాలనీలు అని పేరు పెట్టినారు.

    అర్హతలు

    • ఆధార్ కార్డు కలిగి ఉండవలెను.
    • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు సొంత ఇంటిని కానీ, ఇంటి స్థలం కానీ కలిగి ఉండరాదు.
    • రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ గృహనిర్మాణ పథకాల లబ్దిదారుల జాబితాలో ఉండరాదు. ప్రజా సాధికారిత సర్వేలో పేరు నమోదై ఉండాలి.
    • 2.5 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట మించి కలిగి ఉండరాదు.
    • పట్టణ ప్రాంత లబ్ధిదారుని వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించి ఉండరాదు. గ్రామీణ ప్రాంతాలలోని లబ్దిదారులు బి.పి.ఎల్. కేటగిరీకి చెందినవారై ఉండవలెను.

    ప్రయోజనాల

    • ఇళ్ళ స్థలాలు లేని పేదవారందరికీ ఇంటి స్థలాలు మరియు గృహ నిర్మాణ పథకం వర్తిస్తుంది.
    • గృహ నిర్మాణం కొరకు 1.5 సెంట్ల వరకు ఉచితంగా స్థలం కేటాయింపు.
    • లబ్దిదారుని పేరుతో ఇంటి పట్టా చేయడంతో పాటుగా రిజిస్ట్రేషన్ కూడా చేయబడును.
    • లబ్ధిదారులకు ఇంటి పట్టాపై బ్యాంకు నందు రుణం తీసుకునే సౌకర్యం.
    • లబ్దిదారులు కోరుకున్నచో 5 సం॥ల తరువాత బదలాయింపునకు వీలు కల్పించబడినది.

    వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత

    వైయస్సార్ చేయూత

    11-08-2020న వై.యస్.ఆర్ చేయుత కార్యక్రమాన్ని ప్రారంభించినారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద మహిళా సాధికారితను సాధిస్తారు.

    అర్హతలు

    • మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ॥ 10,000, పట్టణ ప్రాంతాలలో రూ॥ 12,000 కంటే తక్కువుండాలి.
    • కుటుంబానికి 3 ఎకరాల మాగాణి భూమి లేదా 10 ఎకరాల మెట్ట లేదా మాగాణి మెట్టభూములు కలిపి 10 ఎకరాలకు మించరాదు.
    • కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించను దారుడై ఉండరాదు (పారిశుద్య కార్మికులకు మినహాయింపు).
    • కుటుంబం నివసిస్తున్న గృహం యొక్క నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లలోపు ఉండాలి.
    • పట్టణ ప్రాంతాలలో నిర్మాణ స్థలం 1000 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండాలి.
    • కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైన 4 చక్రాల సొంత వాహనం ఉన్నట్లయితే అనర్హులుగా పరిగణిస్తారు (ఆటో, ట్యాక్సి మరియు ట్రాక్టర్లను మినహాయించినారు).
    • కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో ఉండరాదు.
    • ఆధార్ కార్డును కలిగి ఉండాలి.
    • ప్రభుత్వం జారీ చేసిన సమగ్ర ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి.
    • వై.యస్.ఆర్ పెన్షన్ కానుక పొందుతున్న వారు ఈ పథకానికి అనర్హులు.

    లక్ష్యం

    • 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సులైన ఎస్.సి, ఎస్.టి, బి.సి మైనారిటీ మహిళలకు మొదటి ఏడాది తర్వాత దశల వారీగా సంబంధించి కార్పోరేషన్లు రూ॥75,000 లను ఉచితంగా అందిస్తారు.
    • సంవత్సరానికి రూ॥ 18,750 చొప్పున 4 సంవత్సరాలలో అందిస్తారు.
    • జగనన్న ఇ.డబ్ల్యు. ఎస్. చేయూత కింద ఆర్థికంగా వెనుకబడిన తరగతుల మహిళలకు కూడా 45 నుంచి 60 సంవత్సరాల వయస్సు లోపలి వారికి సంవత్సరానికి రూ॥ 15,000 చొప్పున 3 సంవత్సరాలలో రూ॥ 45,000 చెల్లిస్తారు.
    • ఈ పథకం క్రింద లబ్ధిదారులకు డబ్బు వాడుకొనే స్వేచ్ఛను కల్పించినారు.
    • ప్రభుత్వం సూచించిన జీవనోపాధిపై ఈ డబ్బును ఉపయోగిస్తే లబ్ధిదారుల నైపుణ్యాలను పెంచడంతో పాటు మార్కెటింగ్, సాంకేతికరకమైన సహకారాన్ని అందిస్తూ అదనపు బ్యాంకు రుణాలను మంజూరు చేస్తారు.
    • వై.యస్.ఆర్ పెన్షన్లు అందుకుంటున్న 45 నుంచి 60 సంవత్సరాల వయస్సులోపలి ఒంటరి మహిళలు, వితంతువులకు కూడా చేయూత ద్వారా రూ॥ 18,750లను చెల్లిస్తారు.
    • వీరికి పెన్షన్ల మొత్తం 27,000 + చేయూత మొత్తం 18,750 మొత్తం లబ్ధి 45,750 ఈ పథకానికి 2021-22 బడ్జెట్లో కోట్లను కేటాయించినారు.

    వైయస్సార్ ఆసరా

    11-09-2020 న ప్రారంభించారు. పొదుపు సంఘాల మహిళలను రుణ విముక్తి చేసి సంఘాల పునరుజ్జీవనానికి మరియు వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచడం ఈ పథకం యొక్క లక్ష్యం.

    • మహిళా ఎస్.హెచ్.జి లలో సభ్యులై ఉండాలి.
    • 11-04-2019 నాటికి వాణిజ్య బ్యాంకులు / సహకార బ్యాంకులు / గ్రామీణ బ్యాంకులలో రుణము తీసుకొని ఉండవలయును.
    • 11-04-2019 నాటికి ఉన్న మొత్తం రుణాన్ని 4 విడతలలో ప్రభుత్వం ఎస్.హెచ్. జి సభ్యులకు చెల్లిస్తుంది. అయితే సంఘ సభ్యులు ముందుగా రుణాలను చెల్లిస్తే ప్రభుత్వం వారి ఖాతాలలోకి జమ చేస్తుంది.
    • ఈ డబ్బులను లబ్ధిదారులు కుటుంబ అవసరాలకు గాను వ్యాపార అవసరాలకు గాని, వ్యక్తిగత అవసరాలకు గాని ఉపయోగించుకొనవచ్చును.

    వై.యస్.ఆర్ సున్నా వడ్డీలు

    మహిళా SHG ల మీద ఉన్న వడ్డీ భారమును తగ్గించడానికి సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే మహిళా SHG లు చెల్లించిన వడ్డీని మొత్తమును వారి ఖాతాలలోకి జమ చేస్తారు.

    మద్యపాన నిషేధం

    • మద్యపానం సామాజిక సమస్యగా, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దిగాజార్చే విధంగా మద్యపాన నిషేధాన్ని దశల వారీగా చేపడతామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వాగ్దానం చేశారు.
    • మద్యాన్ని 5 స్టార్ హెూటళ్లకే పరిమితంచేస్తూ మూడు దశల్లో మధ్యపాన నిషేధం చేస్తామని ప్రతిపాదించారు.
    • మొదటి దశలో బెల్జాపుల మూసివేత.
    • రెండవ దశలో మధ్యపాన షాపులను ప్రభుత్వ నియంత్రణలో నడుపుట.
    • మూడవ దశలో పరిమిత ప్రదేశాలలో తప్ప మిగిలిన అన్ని చోట్ల సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తారు.

    నోట్ : ఉమ్మడి నెల్లూరు జిల్లా దూబకుంటలో వర్ధినేని రోషమ్మ నాయకత్వంలో మధ్యపాన నిషేధ ఉద్యమం ప్రారంభమైంది. ఫలితంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం పాక్షిక మద్యపాన నిషేధాన్ని మరియు ఎన్.టి.ఆర్ ప్రభుత్వం సంపూర్ణ మధ్యపాన నిషేధాన్ని చేశారు.

    జలయజ్ఞం

    • ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2004లో జలయజ్ఞం కార్యక్రమాన్ని ప్రారంభించినది.
    • నదీ జలాలను సద్వినియోగం చేసుకొని వర్షపు నీటిని పునర్వినియోగమునకు, సాగునీటి కొరత లేకుండా చేయాలనే సంకల్పంతో జలయజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
    • జలయజ్ఞమును భారీ, మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రారంభించినారు.
    • గోదావరి నదీ జలాలను కృష్ణా, పెన్నా నదులతో అనుసంధానం చేసే రాయలసీమ, దక్షిణకోస్తా, ఉత్తరకోస్తాలో తాగునీరు, సాగునీటి కొరత తీర్చే ఉద్దేశంతో ప్రారంభించినారు.
    • జలయజ్ఞంకింద 54 ప్రాజెక్టుల నిర్మాణమును చేపట్టారు.
    • 14 ప్రాజెక్టులు పూర్తయినవి.
    • మిగతా 40 ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో అదనంగా 27.62 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలను కల్పించవచ్చును.
    • 5.3 లక్షల ఎకరాలకు ఆయకట్టును స్థిరీకరించవచ్చును.

    ఇతర పథకాలు

    జగనన్న చేదోడు

    • 10-06-2020న కోవిడ్-19 మహమ్మారి కారణంగా జీవనోపాధిని కోల్పోయిన టైలర్లు, నాయిబ్రాహ్మణులు మరియు రజక కార్మికులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించినాడు.
    • ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.10,000/- చొప్పున ఆర్థిక సహాయము అందించబడును.
    • బి.సి. వర్గానికి చెందిన రజకులు, నాయీ బ్రాహ్మణులు అర్హులు.
    • అన్ని కులాలకు చెందిన టైలర్లు సొంత షాపు కల్గి, వారి పేరు మీద రిజిష్టర్ అయిన వారు అర్హులు.
    • కుటుంబ నెలసరి ఆదాయము గ్రామీణ ప్రాంతాలలో రూ.10,000/- లోపు, పట్టణ ప్రాంతాలలో రూ.12,000/- లోపు ఉన్న వారు అర్హులు.
    • కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాణి, 10 ఎకరాల లోపు మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట కలిపి 10 ఎకరాల లోపు ఉన్న వారు అర్హులు.
    • పట్టణ ప్రాంతాలలో 1000 చ. అడుగులు, అంతకన్నా తక్కువ విస్తీర్ణములో భవనము ఉన్నవారు అర్హులు.
    • ఆదాయ పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు, 4 చక్రాల వాహనము (ఆటో, టాక్సీ, ట్రాక్టర్కు మినహాయింపు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అనర్హులు.

    వై.యస్.ఆర్. కాపు నేస్తం

    • 28-01-2020న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.ఆర్ కాపు నేస్తం జీవోను విడుదలచేశారు.
    • కాపు, తెలగ, బలిజ మరియు వీటి ఉపకులాలకు చెందిన పేద కుటుంబాల మహిళల జీవనోపాధి మెరుగుదలకు మరియు ఆర్ధిక స్వావలంబన కొరకు సంవత్సరానికి రూ.15,000/చొప్పున ఐదు సంవత్సరాలలో రూ. 75,000/- ఆర్థిక సహాయం.
    • 45 నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న కాపు, తెలగ, బలిజ మరియు వీటి ఉపకులాలకు చెందిన మహిళలు. నెలసరి కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.10,000/- లోపు పట్టణ ప్రాంతాలలో రూ.12,000/ లోపు ఉన్న వారు అర్హులు.
    • కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాణి 10 ఎకరాల లోపు మెట్ట లేదా మాగాణి & మెట్ట కలిపి 10 ఎకరాల లోపు ఉన్న వారు అర్హులు. పట్టణ ప్రాంతాలలో 1000 చదరపు అడుగులు, అంతకన్న తక్కువ విస్తీర్ణములో ఇల్లు ఉన్నవారు అర్హులు.
    • ఆదాయపు పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు, 4 చక్రాల వాహనము (ఆటో, టాటా ఏస్. ట్రాక్టర్లకు మినహాయింపు) కలిగి ఉన్న వారు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అనర్హులు.

    జగనన్న తోడు

    • 25-11-2020న చిరువ్యాపారాలు మరియు సాంప్రదాయ వృత్తి దారులు వ్యాపారాభివృద్ధి కొరకు “జగనన్న తోడు పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.10,000/- లోపు సున్నావడ్డీతో ప్రభుత్వం ఋణ సహాయము అందించడానికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.
    • 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.
    • నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.10,000/- మరియు పట్టణ ప్రాంతాలలో అయితే రూ.12,000 లో కలిగిన వారు అర్హులు.
    • మాగాణి భూమి 3 ఎకరాలు లేదా మెట్ట భూమి 10 ఎకరాలు లేదా మాగాణి మరియు మెట్ట భూమి రెండు కలిపి 10 ఎకరాల లోపు ఉన్నవారు అర్హులు.
    • ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను (ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లేదా ఇతరములు) కలిగిన వారు అర్హులు.

    స్పందన కార్యక్రమం

    • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-21లో స్పందన కార్యక్రమాన్ని ప్రారంభించినది.
    • స్పందనా కార్యక్రమం ప్రజాసమస్యల పరిష్కార వేదిక.
    • ప్రజలు ఎదుర్కొనుచున్న సమస్యలను అర్జిల ద్వారా గాని, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా గాని 24×7తో కాల్ చేసి తమ సమస్యలను స్పందనకు నివేదించుకొనవచ్చును.
    • ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఎదుర్కొనుచున్న సమస్యలను సంబంధిత శాఖలకు పంపి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు.
    • స్పందనకు టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 4440 ని కేటాయించినారు.
    • ఆధునికీకరించిన స్పందన పోర్టల్ ద్వారా పౌరులు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసుకొనవచ్చును.
    • ఇచ్చిన ధరఖాస్తు ఏ స్థాయిలోనున్నదో వెల్జింక్ 1902 ద్వారా, గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా తెలుసుకొనవచ్చును.
    • ఆధునికీకరించిన స్పందనలో 27,919 సబ్జెక్టులు 3,758 ఉపసబ్జెక్టులు కలవు.
    • వినతులు, ఫిర్యాదులను 3 విధాలుగా వర్గీకరించినారు.
                     1. అత్యంత తీవ్రమైనది 
                     2. తీవ్రమైనవి 
                     3. సాధారణమైనవి
    • బియ్యం కార్డు, ఫించను కార్డులు 10 రోజులలో, ఆరోగ్య శ్రీ కార్డులను 21 రోజులలో, ఇంటిపట్టాలను 90 రోజులలో అందించాలి. తాగునీరు, పారిశుద్యము, వీధిదీపాలు మరియు ఇతర ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తారు.

    మనబడి నాడు- నేడు

    • సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 4వ లక్ష్యమైన 'నాణ్యమైన విద్య మరియు జీవిత కాల అభ్యసన' అవకాశాలను అందరికి అందుబాటులోకి తీసుకొని రావడానికి రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి పాఠశాలలో 9 రకాలైన మౌలిక వసతులను 3 విడతలలో కల్పించడానికి “మనబడి నాడు నేడు" అనే కార్యక్రమాన్ని ప్రకటించి అమలుపరుచుచున్నారు.
    • అక్టోబర్ 2019న ప్రకటించారు, 14 నవంబర్ 2019న ప్రారంభించారు. (బాలల దినోత్సవం సందర్భంగా).

    9 రకాల మౌలిక వసతులు

    1. సరిపడు నీటితో కూడిన శౌఛాలయాలు
    2. పాఠశాల విద్యుదీకరణ, ఫ్యాన్లు, లైట్లు
    3. తాగునీటి సరఫరా
    4. విద్యార్థులకు మరియు సిబ్బందికి సరిపడ ఫర్నిచర్
    5. స్కూళ్ళకు పేయింటింగ్స్
    6. స్కూల్ మరమ్మత్తులు
    7. గ్రీన్ చాకో బోర్డు
    8. ఇంగ్లీష్ ల్యాబ్లు
    9. కాంపౌండ్ వాల్స్ & కిచెన్ షెడ్స్

    ♦ మనబడి : నాడు-నేడును రాష్ట్రంలో నున్న 45,484 ప్రభుత్వ పాఠశాలలో, 471 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, 151 ప్రభుత్వ డిగ్రీకళాశాలలో, 3287 ప్రభుత్వ హాస్టళ్ళు, 55,607 అంగన్వాడీ కేంద్రాలలో సుమారు 14,000 కోట్లను వ్యయం చేసి ఆధునిక మౌలిక వసతులను కల్పిస్తారు.


    వై.ఎస్.ఆర్ కంటి వెలుగు

    • ఈ పథకాన్ని 10-10-2019న ప్రారంభించినారు.
    • ఈ పథకం కింద అంధత్వంను 1% నుంచి 0.25-0.36% నికి తగ్గిస్తారు.
    • ఈ పథకం కింద అవసరమైన వారికి కళ్ళజోళ్ళ పంపిణి, కంటి శుక్ల శస్త్ర చికిత్సలు, డయాబెటిక్ రెటినోపతి, గ్లకోమా మొదలైన శస్త్ర చికిత్సలను నిర్వహిస్తారు.
    • రాష్ట్ర ప్రజలందరికి కంటి పరీక్షలు చేసి వారి నేత్ర సమస్యలకు పరిష్కారం చూపడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
    • వై.ఎస్.ఆర్ కంటి వెలుగును 6 విడతలలో 3 సంవత్సరాల కాలవ్యవధిలో మిషన్ మోడ్లో నిర్వహిస్తారు.
    • మొదటి విడతను 10-10-2019న ప్రపంచ దృశ్య దినోత్సవము సందర్భంగా ప్రారంభించినారు.
    • రెండవ విడతను 01-11-2019 నుంచి 31-12-2019 వరకు నిర్వహించినారు.
    • మొదటి + రెండవ విడతలలో పాఠశాలలో చదువుతున్న పిల్లలకు కంటి పరీక్షలను నిర్వహించినారు.
    • మూడవ విడతను 18-02-2020 నుంచి 31-01-2022 వరకు నిర్వహించినారు. ఈ విడతలో కమ్యూనిటి కంటి పరీక్షలు 60 సంవత్సరాలు పైబడిన అవ్వ, తాతలకు నిర్వహిస్తున్నారు.
    • ఈ పథకానికి అవసరమైన నిధులను జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్.పి.సి.బి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం వాటా 60% కాగా, భారత ప్రభుత్వం 40% నిధులను సమకూర్చుతుంది.

    వై.ఎస్.ఆర్ సంపూర్ణ పోషణ

    • ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 257 ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టుల ద్వారా మహిళలు పిల్లలకు, పౌష్ఠికాహారాన్ని అందిస్తారు.
    • వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ కింద గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, 6 నుంచి 72 నెలల మధ్య వయస్సు గల పిల్లలకు ఉన్న రక్తహీనత మరియు పోషకాహార లోప సమస్యలను పరిష్కరిస్తారు.
    • గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు ఇచ్చే పౌష్ఠికాహారంలో ప్రతి నెలకు ఒక కె.జి. రాగి పిండి, 250 గ్రా॥ల బెల్లం, 250 గ్రా॥ల వేరుశనగ చిక్కి, 250 గ్రా॥ ఎండు ఖర్జురా, 1 కె.జి సజ్జ లేదా జొన్న పిండి, 1 కె.జి. అట్కులు అందిస్తారు.
    • బాలలకు 2.5 కె.జీల బాలామృతం, 25 గుడ్లు, 2.5 లీటర్ల పాలు ప్రతినెలకు అందిస్తారు.
    • తల్లులకు ప్రతిరోజు అన్నం, పప్పు, ఆకుకూరలు, సాంబారు, కోడిగుడ్డు, 200 మి.లీ పాలు అందిస్తారు.

    వై.ఎస్.ఆర్ సంపూర్ణ పోషణ+ (01-09-2020)

    • ఈ పథకాన్ని గిరిజన మహిళలు శిశువులకు అదనపు పౌష్టికాహారాన్ని అందించడానికి 77 గిరిజన మండలాలలో 01-09-2020న ప్రకటించినారు.
    • ప్రతినెలకు 2 కె.జీల బహుళధాన్యాల పిండి, 500 గ్రా॥ బెల్లం, 500 గ్రా॥ చిక్కి, 500 గ్రా॥ ఖర్జురాల, 500 గ్రా॥ రాగులు/సజ్జలు/జొన్నల పిండి.
    • తల్లులకు ప్రతిరోజు అన్నం, పప్పు, ఆకుకూరలు, సాంబారు, కోడిగుడ్డు, 200 మి.లీ పాలు అందిస్తారు.
    • ప్రతి నెలకు బాలలకు 2.5 కె.జీల బాలామృతం, 30 కోడిగుడ్లు, 6 లీ॥ పాలు అందిస్తారు.

    జగనన్న గోరుముద్ద

    • ఈ పథకాన్ని ప్రభుత్వ/ఎయిడెడ్ పాఠశాలలో అమలుపరుస్తున్నారు.
    • విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా పౌష్ఠికాహారాన్ని అందిస్తారు.
    • మధ్యాహ్నా భోజనంలో నాణ్యతను పెంచడానికి నాలుగు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసినారు.
    • ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందజేసే మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు చేసి రోజు ఒకే రకంగా కాకుండా నాణ్యమైన భోజనం పెట్టేందుకు మెనులో మార్పులు చేసినారు.
    • ఇటీవల రాగి ముద్దను అందిస్తున్నారు.

    వైఎస్ఆర్ పెళ్లి కానుక

    • రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు ఆడపిల్లల వివాహ వేడుకలకు ఆర్థిక సహాయం మరియు భద్రతను అందించడానికి మరియు వివాహం తర్వాత కూడా ఆర్థిక భద్రత కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ పెళ్లికానుక పథకాన్ని ప్రారంభించింది. పేద బాలికలకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు బాల్య వివాహాలను రద్దు చేయడంతోపాటు వివాహాన్ని నమోదు చేయడం ద్వారా వధువును రక్షించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.


    • వధువు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
    • వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18 సంవత్సరాలు మరియు వధువు వరుడు 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
    • కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి.
    • అమ్మాయి బీపీఎల్ కేటగిరీకి చెంది ఉండాలి. వధువుకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి.
    • మొదటిసారి వివాహం చేసుకున్న వారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే, వధువు వితంతువు అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
    • వివాహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జరగాలి.

    మత్స్యకారులకు డిజీల్ సబ్సిడీ

    మత్స్యకారులపై డిజీల్ రేట్ల భారం పడకుండా ఉండేందుకై ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఒక నెలకి 3,000 లీటర్ల మెకనైజ్డ్ బోట్ వారికి, మోటరైజ్డ్ బోట్ వారికి నెలకు 300 లీటర్లకు సబ్సిడీ కింద లీటరుకు రూ॥ 9 అందిస్తారు.

    వై.ఎస్.ఆర్ ఆదర్శం స్కీమ్

    • యువతకు స్వయం ఉపాధి అందించేందుకై ఉద్దేశించిన పథకం.
    • ఈ పథకం కింద వాహనాలను అందిస్తున్నారు.

    జగనన్న జీవన క్రాంతి

    • డిసెంబర్ 10, 2020న ప్రారంభించారు. మహిళ సాధికారతే ఈ పథకం యొక్క లక్ష్యం.
    • ఈ పథకంలో భాగంగా ఎస్.సి, ఎస్.టి, బి.సి వర్గాలకు చెందిన మహిళలకు గొర్రెలు మరియు మేకల యూనిట్లను 3 దశలలో అందిస్తారు.
    • మహిళ సాధికారతతో పాటు సామాజిక స్థిరత్వాన్ని, పశుసంవర్థక రంగాన్ని బలోపేతం చేయడం ఈ పథకం ఉద్దేశ్యం.
    • ఎస్.సి, ఎస్.టి, బి.సి వర్గానికి చెందిన 45-60 సంవత్సరాల మధ్యవయస్సు గల మహిళలు లబ్ధిదారులు.
    • ఒక్కొక్క యూనిట్లో 5-6 నెలల వయస్సు గల 14 గొర్రెపిల్లలు /మేక పిల్లలతో పాటు ఒక యవ్వనపు పొటేల్/మేకపోతు పంపిణీ.
    • ఈ పథకంలో లబ్ధిదారులకు గొర్రెలు/మేకల కొనుగోలుతో పాటు, రవాణా, ఇన్సురెన్స్ ఖర్చులకు గాను వై.ఎస్.ఆర్. చేయుత కింద యూనిట్కు 75,000 ఆర్థికసహాయాన్ని ఉచితంగా అందిస్తారు.

    వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం

    చేనేత కార్మికులకు ఈ పథకం కింద సంవత్సరానికి 24,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. 5 సంవత్సరాలలో 1,20,000 అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

    వై.యస్.ఆర్. మత్స్యకార భరోసా: (21-11-2019)

    • “సముద్రంపై మరపడవలు మరియు తెప్పలపై చేపలు పట్టే మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచుటకు బై.యస్.ఆర్. మత్స్యకార భరోసా ద్వారా సంవత్సరానికి రూ.10,000/- ఆర్థిక సహాయం”.
    • మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.10,000/ మరియు పట్టణ ప్రాంతాలలో అయితే రూ. 12,000 కంటే తక్కువ ఉండాలి.
    • మొత్తం కుటుంబానికి 3 ఎకరాలు మాగాణి భూమి లేదా 10 ఎకరాలు మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట భూములు (రెండు కలిపి 10 ఎకరాలు మించరాదు).
    • కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుడై ఉండరాదు.
    • కుటుంబం నివసిస్తున్న గృహం సొంతం/అద్దె) యొక్క నెలవారి విద్యుత్ వినియోగ బిల్లు యొక్క సగటు 300 యూనిట్లు లోపు ఉండవలెను. (గత 6 నెలల విద్యుత్ వినియోగ బిల్లు యొక్క సగటు 300 యూనిట్లు/అంతకు తక్కువ ఉండవలెను).
    • పట్టణ ప్రాంతంలో స్వంత గృహ నిర్మాణపు స్థలము 1000 చదరపు అడుగులు కంటే తక్కువ ఉండాలి. కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో వుండరాదు.
    • బియ్యం కార్డు రేషన్ కార్డు కలిగి ఉండాలి (ఒక కుటుంబం ఒక లబ్ది ప్రాతిపదిక).
    • 21 నుండి 60 సంవత్సరాలలోపు వయస్సు కలిగి, మత్స్యశాఖ నందు రిజిస్టర్ అయిఉన్న మరపడవలు మరియు తెప్పలపై     సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు అర్హులు.
    • మత్స్యశాఖ ద్వారా రిజిస్ట్రేషన్ పొందిన ప్రతి మర & యాంత్రిక పడవలు డీజిల్ సబ్బిడి పధకంకు అర్హత కలిగి ఉంటాయి.
    • ప్రతి సంవత్సరం నవంబర్ 21ని వై.యస్.ఆర్ మత్స్యకార దినోత్సవంగా నిర్వహిస్తారు.
    • చేపల వేట నిషేధకాలంలో ప్రతి మత్స్యకారుని కుటుంబానికి రూ॥ 10,000/- ల ఆర్థికభృతిని చెల్లిస్తారు.
    • చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే వై.యస్.ఆర్ బీమా పథకం కింద రూ॥ 10 లక్షలు చెల్లిస్తారు.
    • డీజిల్పై 1 లీటరుకి సబ్సిడీ రూ॥ 9/- చెల్లిస్తారు.

    వై.ఎస్.ఆర్ లా నేస్తం

    డిసెంబర్ 29, 2019న జూనియర్ లాయర్లకు ప్రతినెల 5,000 స్టైఫండ్ అందించే నిమిత్తం ఈ పథకం ప్రారంభించారు.

    వై.ఎస్.ఆర్ స్వచ్ఛ పథకం

    • సెప్టెంబర్ 05, 2021లో ఈ పథకాన్ని ప్రారంభించారు. కౌమార దశలో ఉన్న బాలికలు ఆరోగ్యం మరియు వ్యక్తిగత పరిశుభ్రత అవసరాల కోసం ఈ పథకం అమలు చేస్తున్నారు.
    • ఈ పథకం కింద అన్ని ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న కౌమారదశలోని బాలికలకు నెలకు 10 బ్రాండెడ్ శానిటరీ న్యాప్కిన్స్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది.

     ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ (2023 - 24) నందు సంక్షేమం నకు కేటాయింపులు

    Sector Wise Allocation


    Scheme Wise Budget Allocation





No comments:

Post a Comment

Post Bottom Ad