3.2 మహిళా & శిశు సంక్షేమం విధానాలు & సంక్షేమ కార్యక్రమాలు - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Wednesday, July 19, 2023

3.2 మహిళా & శిశు సంక్షేమం విధానాలు & సంక్షేమ కార్యక్రమాలు

3.2 మహిళా & శిశు సంక్షేమం విధానాలు & సంక్షేమ కార్యక్రమాలు


    నోట్‌: మహిళలకు గల రాజ్యాంగపరమైన మరియు శాసనపరమైన హక్కులను & రక్షణలను యూనిట్‌-2లో మహిళలపై జరుగుతున్న చట్టపరమైన సంరక్షణ అనే ఛాప్టర్‌ నందు వివరించడమైనది.


    బాలలు మరియు మహిళలకు సంబంధించిన జాతీయ విధానాలు


    బాలలు మరియు మహిళల యొక్క సమగ్ర అభివృద్ధి మరియు వికాసం కోసం, ఆరోగ్య సంరక్షణ కోసం, బాల కార్మికత లాంటి సమస్యల నుండి వారిని సంరక్షించడం కోసం కొన్ని ప్రత్యేక విధానాలు రూపొందించి అమలు చేస్తున్నవి. అవి..


    1. మొదటి జాతీయ బాలల విధానము 1974 (National Policy on Children)

    2. సవరించిన జాతీయ బాలల విధానము 2013 (New National Policy on Children)

    3. 1979వ సంవత్సరంను అంతర్జాతీయ బాలల సంవత్సరంను జరుపుకుంటున్నాం (International Year of Children)

    4. జాతీయ విధ్యావిధానం 1986 నందు బాలల విద్యకు సంబంధించిన ప్రణాళికలు ఏర్పాటు చేశారు. (National Policy on Education)

    5. మొదటి జాతీయ పోషణ విధానము 1993 (National Nutrition Policy)

    6. నూతన జాతీయ పోషణ విధానము 2018 (New Nutrition Policy)

    7. జాతీయ ఆరోగ్య విధానము 2002 (National Helath Ploicy)

    8. National Charter of Children - 2003

    9. జాతీయ బాలల కార్యాచరణ ప్రణాళిక (National Plan of Action for Children - 2005 & 2016)

    10. జాతీయ పూర్వ బాల్యదశ సంరక్షణ మరియు పూర్వబాల్యదశ విద్యావిధానము (National Early Childhood care and Education Policy) - 2013

    11. India New Born Action Plan - 2014

    12. జాతీయ మహిళా సాధికారత విధానము - 2001 (National Policy on Empowerment of Women)

    13. జాతీయ మహిళా విధానం ముసాయిదా (National Policy for Women (Draft)) - 2016

    14. జాతీయ నూతన విద్యావిధానం - 2020

    15. జాతీయ బాలకార్మిక విధానం - 1987


    నూతన జాతీయ బాలల విధానము 2013 (National Policy for Children)


    26 ఏప్రిల్‌, 2013న ఆమోదించారు. రాజ్యాంగ పరంగా మరియు ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల సాంప్రదాయం (UNCRC) నందు పిల్లలకు గల హక్కులు, అవకాశాలు పూర్తి స్థాయిలో అందుబాటులోనికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. పిల్లల అభివృద్ధి విషయంలో Need - Based అనే ఫ్యూహం కాకుండా Rights - Based అనే వ్యూహంను అమలుపరుస్తుంది.


    జాతీయ బాలల విధానం 2013 ప్రకారం


    1. 18 సంవత్సరాలలోపు వారు బాలలు

    2. బాల్యం అనేది జీవితం నందు ఒక కీలక దశ

    3. అందరు బాలలను ఒకే రకంగా చూడలేము వారిలో వైవిధ్యత ఉంటుంది మరియు వారి వారి సామాజిక ఆర్థిక పరిస్థితులను బట్టి వారి యొక్క సమస్యలుంటాయి.


    బాలల యొక్క వికాసంకోసం సుద్‌ర్హ సుస్థిర, బహుళ, రంగాల, సమీకృత మరియు సంలీన విధానంను పాటించాలి.


    జాతీయ బాలల విధానము 2018 మరియు జాతీయ బాలల కార్యాచరణ ప్రణాళిక 2016 ప్రకారం ఎంపిక చేసిన ప్రాముఖ్య అంశాలు:

    1. బాలల మనుగడ, ఆరోగ్యం మరియు పోషణ _ 
    2. విద్య మరియు వికాసం
    3. బాలల రక్షణ 
    4 బాలలను భాగస్వాములను చేయడం


    జాతీయ మహిళా సాధికారత విధానము 2001: (National Policy on Empowerment of Women)

    • Towards Equality అనే పేరుతో నివేదికను రూపొందించిన First Committee on the Status of the Women in India - 1974 వారు మహిళాసాధికారత విధానంను ఉండాలని సిఫారసు చేశారు.
    • లింగ అసమానతలు, సాంస్కృతిక వేదాలు, అసమాన అవకాశాలు, జీవితకాలంలో వివిధ దశల యందు ఎదురవుతున్న రకరకాల హింసల నుండి మహిళలను రక్షిస్తూ వారి యొక్క “సాధికారత కోసం "National Policy of Empowerment of Women" ని 2001వ సంవత్సరంలో ప్రారంభించారు.


    ఈ విధానం యొక్క లక్ష్యాలు:

    1. మహిళల అభివృద్ధి మరియు సాధికారతను సాధించడం.
    2. మహిళల సాధికారతకు కావలసిన పర్యావరణంను ఏర్పాటుచేయడం.
    3. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, పౌర మరియు సామాజిక రంగంలో మహిళా సమానత్వం సాధించడం.
    4 గృహం నుండి మొదలుకొని జాతీయ స్థాయి వరకు మహిళలు అన్నిరకాల కార్యక్రమాలలో పాల్గొనేలా చేయడం.
    5. మహిళా సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన యంత్రాంగంను బలోపేతం చేయడం.
    6. బాలికలపై చూపెడుతున్న వివక్షతను రూపుమాపడం.
    7. చట్టాలు సమర్థవంతంగా అమలు చేయడం.
    8. అఖివృద్ధిలో “6ల4ల 2ల906017ల ని ప్రవేశపెట్టడం.
    9. విపత్మర పరిస్థితులలో నున్న మహిళలను ఆదుకోవడం.
    10. సమాజం నందు లింగపరమైన సునిశితత్వం (Gender Sensitization) పై అవగాహన పెంచడం.
    11. మహిళా సాధికారత కోసం అంతర్జాతీయ సహకారం సాధించడం.

    2001వ సంవత్సరంను అంతర్జాతీయ మహిళా సాధికారత సంవత్సరం (International Year of Empowerment of Women) గా జరుపుతారు, ఆ సందర్భంగానే 2001లో మహిళా సాధికారత విధానంను రూపొందించారు.


    జాతీయ మహిళల విధానము (ముసాయిదా) 2016

    • ఏ సమాజంనందైతే మహిళలు సమాజం నందు అన్ని రకాల రంగాలలో పూర్తి శక్తి సామర్థ్యాలతో పాల్గొంటారో ఆ సమాజంనందే సామాజిక పరివర్తన సులభతరమవుతుంది అనే విజన్‌ తో ఈ ముసాయిదా రూపొందించారు.
    • కుటుంబం నందు, సముదాయం నందు, పనిచేసే దగ్గర మరియు పరిపాలన ప్రక్రియ నందు మహిళలకు సమాన హక్కులు మరియు అవకాశాలు కలిగేలా చర్యలు చేపట్టడమే ఈ విధానం యొక్క మిషన్‌.

    ఈ విధానము యొక్క లక్ష్యాలు

    1. మహిళల యొక్క శక్తి సామర్థ్యాలు పూర్తిస్థాయిలో వృద్ధి చెందేలా, అందుకు కావలసిన సామాజిక - సాంస్కృతిక, ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులు కల్పించడం

    2.  అభివృద్ధి నందు లింగ సమానత్వం సూత్రం పాటించడం

    3.మహిళలకు జీవితకాలంలో వివిధ దశలలో అవసరమయ్యే వైద్య సదుపాయాలు అందించడం

    4. బాలికలకు మరియు మహిళలకు నాణ్యతతో కూడిన విద్యను అందుబాటులోనికి తేవడం

    5. ఆర్థిక వ్యవస్థలో మహిళా భాగస్వామ్యం పెంపొందించడం

    6. సమాజం నందు అన్ని రంగాలలో సమాన ప్రాతినిధ్యం కల్పించడం

    7. బాలికల పట్ల చూపే వివక్షతలను రూపుమాపడం

    8. లింగ సునిశితత్వంతో కూడిన న్యాయ మరియు చట్ట వ్యవస్థను రూపొందించడం

    9. మహిళలపై జరుగుతున్న అన్ని రకాల హింసను బలమైన చట్టాలు, విధానాలు, కార్యక్రమాలు మరియు సంస్థల ద్వారా రూపుమాపడం

    10. బలహీన మరియు దుర్భల వర్గాలకు చెందిన మహిళల యొక్క అభివృద్ధి మరియు సాధికారతను సాధించడం

    11. లింగ అసమానత్య్వంపై మూల్యాంఖనం, పర్యవేక్షణ కార్యక్రమాలు చేపట్టడం

    ఈ విధానం నందు గుర్తించిన ముఖ్య రంగాలు

    1. అరోగ్యం, ఆహార భద్రత మరియు పోషణ
    2. విద్య
    3. ఆర్థిక పరమైన అంశాలు (పేదరికం, వ్యవసాయం, పరిశ్రమ రంగం, సేవారంగం, శాస్త్ర సాంకేతిక రంగం)
    4. పరిపాలన మరియు నిర్ణయాధికారం
    5. మహిళలపై జరుగుతున్న హింస
    6. సమర్థవంతమైన ఆవరణ కల్పించడం
    7. మహిళలు - పర్యావరణం & వాతావరణ మార్పులు.

    మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Women & Child Development Ministry)

    2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా నందు మహిళలు మరియు బాలలు కలిసి 67.7% ఉన్నారు. వీరి యొక్క సంక్షేమం, అభివృద్ధి విధానాలు రూపొందించడం లాంటి కార్యక్రమాలు నిర్వహించడం కోసం కేంద్ర ప్రభుత్వంలో ఖాగంగా కేంద్ర మహిళా మరియు బాలల అభివృద్ధి మంత్రిత్వశాఖను 30 జనవరి 2006వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయక మునుపు కేవలం ఒక డిపార్ట్‌మెంట్‌గా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో భాగంగా ఉండేది. బాలలు మరియు మహిళల యొక్క సంక్షేమ డ్‌ కార్యక్రమాల రూపకల్పన అమలు మరియు వీరికి సంబంధించిన విధానాలు అమలు చేసే బాధ్యతలను నిర్వహిస్తుంది. మహిళా & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖతన యొక్క విధులను నిర్వర్తెంచెందుకు గాను ఈ క్రింది 6 స్వయం ప్రతిపత్తిగల సంస్థలను ఏర్పాటు చేసింది.

    మహిళా శిశు అభివృద్ధి - సంస్థలు (Women & Child Development & Organization)

    మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నందు 6 స్వయం ప్రతిపత్తి గల సంస్థలు తమ విధులను నిర్వహిస్తున్నవి. అవి...

    1. National Institute of Public Cooperation and Child Development (NIPCCD)

    2. National Commission for Women (NCW)

    3. National Commission for Protection of Child Rights (NCPCR)

    4. Central Adoption Resource Authority (CARA)

    5. Central Social Welfare Board (CSWB)

    6. Rashtriya Mahila Kosh (RMK)


    పై ఆరు స్వయం ప్రతిపత్తిగల సంస్థలకు అదనంగా 'Food and Nutrition Board' అను సంస్థ కూడా కలదు. పై ఆరు సంస్థల యందు NCW, NCPCR, CARA అనునవి చట్టబద్ధ సంస్థలు అనగా పార్లమెంట్‌ చట్టం ద్వారా ఏర్పాటు చేసినవి.

    NIPCCD

    • దీనినే  National Institute of public cooperation and child development అని పిలుస్తారు.
    • ఈ సంస్థని న్యూఢిల్లీ కేంద్రంగా 1966వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.
    • ఈ సంస్థ Societies Registration act - 1860 ప్రకారం స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పాటు చేశారు.
    • NIPCCD నకు ప్రధాన కేంద్రం ఢిల్లీ కాగా గౌహతి, బెంగుళూర్‌, లక్నో ఇండోర్‌ మరియు మెహలీ నగరాల యందు ప్రాంతీయ కేంద్రాలు కలవు.
    • బాలల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి సిబ్బందికి శిక్షణనిస్తుంది మరియు పరిశోధనలు నిర్వహిస్తుంది.

    National Commission for Women (NCW)

    • ఇది జనవరి 91, 1992న ఏర్పాటు చేసినటువంటి చట్టబద్ధ సంస్థ.
    • ఈ యొక్క జాతీయ మహిళా కమీషన్‌ని  National Commission for women act - 1990 ద్వారా ఏర్పాటు చేశారు.
    • మహిళలకు సంబంధించిన రాజ్యాంగపరమైన రక్షణలు, చట్టపరమైన రక్షణల యొక్క అమలు తీరును సమీక్షిస్తుంది మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు, సలహాలు అందజేస్తుంది.
    • 1974లో ఏర్పాటు చేసిన First High Level Committee మరియు 1988లో ఏర్పాటు చేసిన  National Respective Plan for Women 1988ల యొక్క సూచనల మేరకు ఏర్పాటు చేశారు.
    • మహిళా కమీషన్‌ నందు ఒక ఛైర్మన్‌ మరియు అయిగురు సభ్యులుంటారు వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది మరియు వీరి యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు.
    • 31 జనవరి 1992న ఏర్పాటు చేసిన మొదటి మహిళా కమీషన్‌కు ఛైర్మన్‌గా శ్రీమతి జయంతి పట్నాయక్‌ గారు వ్యవహరించారు మరియు ప్రస్తుత ఛైర్మన్‌ రేఖా శర్మ.

    మహిళా కమీషన్‌ క్రింది అధికారాలు మరియు బాధ్యతలు నిర్వహిస్తుంది.

    1. మహిళా సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను సమీక్షిస్తుంది.

    2. మహిళా యొక్కస్థితిగతులపై వార్షిక నివేదికలను రూపొందిస్తుంది.

    3. మహిళ విధానాలు, కార్యక్రమాల రూపకల్పనలో పాలు పంచుకుంటుంది.

    4. మహిళలపై దాడులు మరియు హక్కుల ఉల్లంఘనలపై ఫిర్యాధులు స్వీకరించి విచారణ చేస్తుంది మరియు సుమోటుగా కూడా విచారణ జరుపుతుంది.

    5. మహిళా హక్కుల ఉల్లంఘనలు తరచుగా జరిగే అవకాశమున్న మహిళా జైల్లు లాంటి
    ప్రదేశాలను సందర్శిస్తుంది.

    6. మహిళా హక్కులపై అధ్యయనం, పరిశోధన మరియు శిక్షణా కార్యక్రమాలు చేపడుతుంది.

    7. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదించినప్పుడు తగు సూచనలు సలహాలను అందిస్తుంది.

    • ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమీషన్‌ చైర్మన్‌గా “వాసిరెడ్డి పద్మ" గారు సేవలందిస్తున్నారు.
    • మహిళా కమీషన్‌ విచారణ నిమిత్తం ఎవరినైనా హాజరుకమ్మని అదేశించవచ్చు మరియు రికార్డులను ఇతర సంబంధిత ఫైల్స్‌ని ప్రదర్శించమని ఆదేశిస్తుంది. విచారణ సందర్భంగా సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలుంటాయి. హక్కుల ఉల్లంఘన జరిగిన సందర్భంలో సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవలసిందిగా సిఫారసు చేస్తుంది.

    National Commission for Protection of Child Rights (NCPCR)

    • దీనినే బాలల హక్కుల పరిరక్షణ కమీషన్‌ అందురు.
    • కమీషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ వైల్డ్‌ రైట్స్‌ చట్టం - 2005 ఆధారంగా చట్టబద్ధ సంస్థగా 2007వ సంవత్సరంలో మొదటి కమీషన్‌ని ఏర్పాటు చేశారు.
    • ఈ కమీషన్‌ బాలల (0-18 సం॥) కు సంబంధించిన అన్ని రకాల హక్కులు, చట్టాలు, అంతర్జాతీయ తీర్మానాల యొక్క అమలు తీరును సమీక్షిస్తుంది.
    • ఈ కమీషన్‌ మొదటి ఛైర్మన్‌గా శాంతా సిన్హా గారు సేవలందించారు. ప్రస్తుత ఛైర్మన్‌ “ప్రియాంక్‌ కాన్గూ”.
    • ఈ కమీషన్‌నందు ఒక ఛైర్‌ పర్సన్‌ మరియు అరుగురు సభ్యులు మరియు ఒక మెంబర్‌ సెక్రటరీ ఉంటారు. మొత్తం కమీషన్‌ సభ్యులలో కనీసం ఇద్దరు మహిళలు ఉండాలి. వీరిని కేంద్రం నియమిస్తుంది మరియు వీరి యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు.

    బాలల హక్కుల పరిరక్షణ కమీషన్‌ ఈ క్రింది విధులను నిర్వర్తిస్తుంది.

    1. బాలల కోసం ఉద్ధేశించిన రక్షణలు, హక్కులు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు, బాలల విధానాలు లాంటి వాని యొక్క అమలు తీరును పర్యవేక్షిస్తుంది.

    2. బాలల యొక్క స్థితిగతులపై వార్షిక నివేదికలు రూపొందించి కేంద్రంనకు అందజేస్తుంది.

    3. బాలలకు సంబంధించిన కార్యక్రమాలు మరియు విధానాల యొక్క రూపకల్పన
    యందు భాగస్వామిగా ఉంటుంది.

    4 బాలల హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులపై విచారణ చేపడుతుంది [| 6 కి 6 గ
    మరియు సుమోటుగా కూడా ఫిర్యాదులను చేపడుతుంది.

    5. ఫిర్యాధులపై విచారించే సందర్భంలో కమీషన్‌నకు సివిల్‌ కోర్టుకుండే అధికారాలుంటాయి, ఎవరైనా తన ముందు హాజరు కమ్మని ఆదేశించే అధికారం ఉంటుంది, కేసుకు సంబంధించిన రికార్డులను హాజరుపరచాల్సిందిగా ఆదేశిస్తుంది మరియు హక్కుల ఉల్లంఘనలు జరిగిన ప్రాంతాలు మరియు హక్కుల ఉల్లంఘనలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను తరచుగా సందర్శిస్తుంది.

    6. బాలల హక్కులకు సంబంధించి అధ్యయనం, పరిశోధన మరియు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.


    జువైనైల్‌ జస్టిస్‌ చట్టం - 2015, విద్యా హక్కు చట్టం 2009 మరియు లైంగిక దాడుల నుండి బాలల సంరక్షణ చట్టం - 2012 చట్టాలు అమలు తీరును ప్రత్యేకంగా సమీక్షిస్తుంది.

    Central Adoption Resource Authority (CARA)

    1990వ సంవత్సరంలో స్వయం ప్రతిపత్తి సంస్థగా ఏర్పాటు చేశారు, కాని ఈ సంస్థ Juvinile Justice Act- 2015 ద్వారా చట్టబద్ధ సంస్థగా మారింది (Section 6B)
    బాలల యొక్క దత్తతకు సంబంధించిన కార్యక్రమాలు చట్టబద్ధంగా జరిగేలా తన విధులను నిర్వహిస్తుంది.
    CARA కు అనుబంధంగా రాష్ట్ర స్థాయిలో దత్తత సంబంధించిన వ్యవహారాలను నిర్వహించేందుకు ప్రతీ రాష్ట్రం నందు State Adoption Resource Agency (SARA) లు ఉంటాయి.
    దత్తతకు సంబంధించిన Hague Conevtion - 1993, పై 2003వ సంవత్సరంలో భారతదేశం సంతకం చేసింది.
    జె.జె. యాక్ట్‌ సూచించిన విధంగా CARA సంస్థ 2017వ సంవత్సరంలో దత్తత మార్గదర్శకాలు (Adoption Guidelines) రూపొందించింది. ఈ మార్గదర్శకాలు 16 జనవరి 2017 నుండి అమలులోనికి వచ్చినాయి. ఈ మార్గదర్శకాల ప్రకారం మాత్రమే తీసుకున్న దత్తతలు చట్టం ప్రకారం గుర్తింపబడతాయి.
    దత్తత కార్యక్రమాలు పారదర్శకంగా ఉండేందుకుగాను CARA వారు Child Adoption Resource Information and Guidance System (CARINGS) అనే 0916 వ్యవస్థని ప్రవేశపెట్టింది. మరియు 1800 - 11 - 1811 అనబడే హెల్ప్‌లైన్‌ ప్రవేశపెట్టింది.

    Central Social Welfare Board (CSWB)

    • దీనినే కేంద్ర సాంఘిక సంక్షేమ మండలి అని అంటారు.
    • CSWB ని 12 ఆగస్టు 1958న ఢిల్లీ నందు ఏర్పాటు చేశారు.
    • గ్రామీణ ప్రాంతాలు మరియు మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న మహిళలు మరియు బాలల సంక్షేమం కోసం NGO లు మరియు SSWB ల సహకారంతో పని చేస్తుంది.
    • CSWB లకు అనుబంధంగా రాష్ట్ర స్థాయిలో State Social Welfare Board (SSWB) ల పనిచేస్తాయి. వీనిని 1954న ఏర్పాటు చేశారు.
    • ప్రజల భాగస్వామ్యంతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన మొట్టమొదటి సంస్థ CSWB.
    • నెహ్రు, గోవింద వల్లభ పంత్‌ మరియు దుర్దాభాయ్‌ దేశ్‌ముఖ్‌ల యొక్క కృషి ఫలితంగా CSWB ఏర్పడింది.
    • CSWB యొక్క మొదటి చైర్మన్‌ శ్రీ దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ మరియు ప్రస్తుత ఛైర్మన్‌ 'అజయ్‌ టెర్కే'.

    Rashtriya Mahila Kosh (RMK)

    • దీనినే National Credit Fund for Women (NCFW) మరియు జాతీయ మహిళా నిధి అని కూడా పిలుస్తారు.
    • 1993వ సంవత్సరంలో స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పాటు చేశారు. ఈ సంస్థని Societies Registration Act - 1860 ప్రకారం ఏర్పాటు చేశారు.
    • గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న మహిళల యొక్కరుణ పరమైన అవసరాలను సూక్ష్మ బుణ పధ్ధతి (Micro Credit) లో తీర్చేందుకై 31 కోట్లతో ప్రారంభించారు.
    • నిరుపేద మహిళలకు సూక్ష్మ రుణాల రూపంలో ఆర్థికంగా సహాయం చేస్తారు మరియు NGO ల సహకారంతో ఈ కార్యక్రమాలను అమలు పరుస్తున్నారు మరియు 1. Loan Promotion Scheme  2. Main Loan Scheme  3. Gold Credit Scheme  4. Housing Loan Scheme  5. Working Capital Team Loan లాంటి పథకాలు అమలుపరుస్తున్నారు.
    • కేంద్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఈ సంస్థకు ఛైర్మన్‌గా ఉంటారు.

    Food and Nutrition Board (FNB)

    FNB అనబడే సంస్థని 1964లో వ్యవసాయ మంత్రిత్వశాఖలో భాగంగా స్థాపించారు, మరియు 1993లో మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖలో భాగంగా మార్చారు.

    ఆహారం మరియు పోషణ సంబంధిత విషయాలలో మహిళా మంత్రిత్వశాఖకు సాంకేతికపరమయిన సలహాలు మరియు సూచనలు అందిస్తుంది.


    మహిళా శిశు సంక్షేమ పథకాలు

    ( Programmes & Schemes for Women and Child Development)

    ప్రధానమంత్రి మాతృ వందనా యోజన (PMMVY)

    • 31 డిసెంబర్‌ 2016న ప్రకటించారు మరియు మే 19, 2017 నుండి అమలు పరుస్తున్నారు.
    • ఈ పథకం ద్వారా మూడు విడతలలో 5000/- లను గర్భిణీ స్రీలకు అందిస్తారు.
    • మాతృత్వ కారణాల వల్ల జీవనోపాధికి, పోషకాహారణ లాంటి విషయాలలో ఇబ్బందులు లేకుండా 5000/-లను మూడు విడతలలో అందిస్తున్నారు. లబ్ధిదారుల యొక్క ఖాతకే నేరుగా డబ్బులను జమ చేస్తారు.
    • Early Registration of Pregnancy సమయంలో మొదటి విడతగా 1,000/-లు అకౌంట్‌లో వేస్తారు. 6 నెలలు దాటిన తరువాత కనీనం ఒక Antenatal Checkup చేయించుకున్న తరువాత 2000/లు నేరుగా ఖాతాలో జమ చేస్తారు. చివరగా మూడవ విడతలో భాగంగా పాప జన్మించిన తరువాత, జనన నమోదు చేసిన తరువాత మరియు మొదటి విడత టీకాలు వేయించిన తరువాత 2000/- అందిస్తారు.
    • రాష్ట్రాలు మరియు అసెంబ్లీని కలిగియున్న కేంద్ర పాలిత ప్రాంతాలు 40% నిధులు మరియు కేంద్రం మిగతా 60% నిధులు సమకూరుస్తాయి కాని ఈశాన్య రాష్ర్టాలు మరియు ప్రత్యేక ప్రతిపత్తి గల రాష్ట్రాలకు సంబంధించి కేంద్రమే 90% నిధులు సమకూరుస్తుంది. శాసనసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాల విషయంలో 100% కేంద్రమే నిధులు భరిస్తుంది.
    • National food Security Act - 2013 నందు పొందుపరిచిన నిబంధనల మేరకు ఈ పథకం అమలు చేస్తున్నారు.
    • ఈ పథకంనకు అదనంగా NRHM లో భాగంగా అమలు చేస్తున్న జననీ సురక్ష యోజన పథకం క్రింద 1000/- అదనంగా ఇస్తారు.

    మహిళా శక్తి కేంద్రాలు (MSK)

    • నవంబర్‌, 2017న ప్రకటించారు మరియు 2017-18 ఆర్థిక సంవత్సరం నుండి అమలు పరుస్తున్నారు.
    • సముదాయ భాగస్వామ్యం ద్వారా గ్రామీణ మహిళలలో సాధికారత తీసుకురావడం, శిక్షణను మరియు సామర్థ్యాలను పెంపొందించడం లాంటి కార్యక్రమాలు చేపడతారు.
    • కేంద్రం 60% నిధులు రాష్ట్రాలు 40% నిధులు సమకూర్చుతాయి, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు మరియు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం 90% నిధులు అందిస్తుంది మరియు కేంద్ర పాలిత ప్రాంతాలయందు 100% నిధులు కేంద్రమే అందిస్తుంది.

    One Stop Centers (OSC)

    • వీటినే “సఖీ కేంద్రాలు” అని కూడా అందురు.
    • నిర్భయ నిధుల సహాయంతో ప్రతీ జిల్లా కేంద్రంలో ఒక సఖి కేంద్రం సేవలందిస్తుంది.
    • మొదటి సఖి కేంద్రంను 1 ఏప్రిల్‌ 2015 నందు ప్రారంభించారు.
    • వివిధ రకాల హింసలు, దాడులు మరియు రకరకాల వేధింపులకు గురవుతున్న మహిళలకు ఈ కేంద్రాల యందు షెల్టర్‌ సదుపాయాలు, కౌన్సిలింగ్‌ Casework సేవలు, న్యాయసేవలు, ఆరోగ్య సేవలు అందిస్తారు.
    • సఖి కేంద్రాలకు నేరుగా వెల్లి సహాయం పొందవచ్చు లేదా 181 అనబడే Women help line ద్వారా వారి యొక్క సేవలను పొందవచ్చును.
    • 181 Women help line number సదుపాయంను కూడా 1 ఏప్రిల్‌ 2015న ప్రారంభించారు. వివిధ రకాల హింసలకు గురవుతున్నవారు మరియు విపత్మర పరిస్థితులను ఎదుర్కొంటున్న మహిళలు సహాయం కోసం 181నకు కాల్‌ చేయవచ్చును. దేశవ్యాప్తంగా ఈ సదుపాయం కలదు.

    Mahila Police Volunteers (MPV)

    సముదాయంనకు లేదా సమస్యలతో బాధపడుతున్న మరియు పోలీసు వ్యవస్థ మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరించే ఉద్ధేశ్యంతో MPV లను నియమించారు. ఈ పథకం కూడా నిర్భయ నిధులతోనే అమలుపరుస్తున్నారు.

    స్వధార్‌గృహ

    విపత్మర పరిస్థితులలోనున్న మహిళలకు షెల్టర్‌ సదుపాయాలు, జీవనోపాది కోసం శిక్షణ మరియు నైపుణ్యాల పెంపుదల లాంటి సదుపాయాలు కల్పించేందుకు 2001-02 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం ప్రారంభించారు. విపత్మర పరిస్థితిలోనున్న మహిళలకు మానసిక, ఆర్థిక్క నివాస పరమైన పునరావాసం అందిస్తారు. ఈ పథకం క్రింద లబ్దిదారులు

    1. అనాధ వితంతులు 
    2. HIV బాధిత మహిళలు
    3. జైలు నుండి విడుదలైన మహిళలు 
    4. వ్యాధుల బారిన పడిన మహిళలు
    5. వివిధ రకాల అక్రమ రవాణా నుండి రక్షింపబడిన మహిళలు 
    6. విపత్తుల వలన ఒంటరైన మహిళలు లాంటివారు

    విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న మహిళలకు 'సేవలు అందిస్తారు. స్వధార్‌ గృహ పథకంను "Umbrella Scheme for Empowerment of Women") అనే పథకంలో భాగంగా అమలుపరుస్తున్నారు.

    ఈ పథకంను NGO ల సహకారంతో అమలుపరుస్తున్నారు. ఈ పథకం అమలునకై కేంద్రం 60% మరియు రాష్ట్రాలు 40% నిధులు అందిస్తాయి కాని ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల యందు, ఈశాన్య రాష్ట్రాల యందు కేంద్రం 90% నిధులను అందిస్తుంది. కేంద్రపాలిత ప్రాంతాల యందు 100% నిధులను కేంద్రమే అందిస్తుంది.

    ఈ పథకం క్రింద ప్రతీ జిల్లా కేంద్రం నందు 30 మంది మహిళలకు సేవలు అందించేందుకై “'స్వధార్‌ గృహాలను” నెలకొల్పారు. దుస్తులు, ఆహారం, నివాసం, వైధ్యం, మానసిక, శారీరక, ఆర్ధిక పునరావాసం మరియు వృత్తిపరమైన శిక్షణను అందించి వారి కాల్లపై వారే నిలబడే విధంగా సేవలందిస్తారు.

    ఈ పథకంలో భాగంగా గృహహింస బాధితులైన మహిళలు ఒక సంవత్సర కాలంపాటు స్వధార్‌ గృహల యందు నివాసం ఉండవచ్చు. ఇతర ఇబ్బందులలో ఉన్న మహిళలైతే 8 సం॥ల వరకు ఉండవచ్చు. 60 సం॥ నిండిన తర్వాత వృద్ధాశ్రమాలకు పంపిస్తారు. ఒక వేళ బాధిత మహిళకు పిల్లలు ఉన్న సందర్భంలో కూతురును 18 సం॥[ల వరకు, కుమారుడు ఉన్నట్టైతే 8 సం॥ వరకు తల్లితో పాటే ఈ గృహంలో ఉండవచ్చు.

     National Data Base On Sexual Offenders (NDSO)

    లైంగిక నేరాలకు పాల్పడిన నేరస్తుల యొక్క సమాచారంను (data base) NDSO రూపంలో Online ఉంచారు. NDSO ను గృహమంత్రిత్వశాఖవారు ఏర్పాటు చేశారు (Ministry of Home Affairs). NDSO ని  National Crime Records Bureau వారి సహాయంతో Ministry of Home Affairs వారు రూపొందించారు.

    నిర్ణయ నిధి (Nirbhaya Fund)

    నిర్భయ సంఘటన డిసెంబర్‌, 2012న ఢిల్లీలో జరిగిన తరువాత మహిళల రక్షణ కోసం రకరకాల కార్యక్రమాల అమలు చేసేందులకై 2018న కేంద్ర అర్ధిక మంత్రిత్వ శాఖ వారు నిర్భయ నిధిని 1000 కోట్ల రూపాలతో ఏర్పాటు చేశారు. వీటి సహాయంతోనే One Stop Centers, Women Helpline, మహిళా పోలీస్‌ వాలంటీర్లు (MPV) లాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.

    పై కార్యక్రమాలతో పాటుగా Integrated Emergency Response Management System (IERMS), Central Victim Compensation Fund (CVCF), Cybercrime Prevention Against Women and Children (CCPWC), Fast Track Special Courts (FTSC) కార్యక్రమాలు కూడా నిర్భయ నిధులతోనే అమలు చేస్తున్నారు.

    IERMS ద్వారా దేశవ్యాప్తంగా 983 రైల్వే స్టేషన్ల యందు CCTV లను ఏర్పాటు చేసి మహిళా భద్రతకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

    Central Victim Compensation Fund (CVCF) ద్వారా హింసా బాధితులకు ఆర్థిక సహాయం అందించేందుకై నిర్భయ నిధుల నుండి 200 కోట్లు కేటాయించారు.

    Cyber Crime Prevention Again Woman and Children (CCPWC) ని 20 సెప్టెంబర్‌ 2018న హోం మంత్రిత్వశాఖ వారు ఏర్పాటు చేశారు. Online మరియు సైబర్‌ నేరాలను ఈ యొక్క Platform పైన ఫిర్యాధులు చేయవచ్చు మరియు Child Pronography, Child Sexual Abuse, లాంటివి ఆన్‌లైన్‌లో ప్రదర్శించిన వారిపై కూడా ఈ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చును. Cyber Crimes పై అవగాహన పెంచేందుకై @Cyberdost అనే ట్విట్టర్‌ హ్యాండెల్‌ ద్వారా SMS ల రూపంలో, Radio ద్వారా మరియు విద్యార్థినులు, కౌమారుల కోసం హ్యాండ్‌బుక్‌ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

    నిర్భయ నిధులతో 1023 Fast Track Special Courts లను దేశవ్యాప్తంగా నెలకొల్పారు. వీని ద్వారా Rape నేరాలు, మరియు బాలలపై జరిగే నేరాలు మరియు Protection of Children from Sexual Offence (POCSO) చట్టం ద్వారా నమోదైన నేరాలను త్వరగతిన విచారిస్తున్నారు.

    SHE-BOX

    దీనినే 'Sexual Harasment Electronic Complaint Box' అని అందురు. పనిచేసే చోట వివిధ రకాల లైంగిక వేధింపులు ఎదుర్కుంటున్న మహిళా ఉద్యోగులు వారికి ఎదురవుతున్న వేదింపులను ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసుకునే సౌకర్యమే షీబాక్స్‌.

    ప్రభుత్వ మరియు పైవేటు ఉద్యోగులు, విద్యార్థినులు మరియు ఇతరులు కూడా ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు. ఫిర్యాదు చేసినవారి యొక్క వివరాలు గోష్యంగా ఉంటాయి మరియు ఫిర్యాదు నేరుగా కేంద్ర మహిళా మంత్రిత్వ శాఖ వారికి చేరుతుంది. వీరు సంబంధిత స్థానిక అధికారులకు కేసులను బదిలి చేస్తారు. చేసినటువంటి ఫిర్యాధులపై తీసుకున్న చర్యలు మరియు కేసు యొక్క పురోగతి వివరాలు ఎప్పటికప్పుడు బాధితులు తెలుసుకోవచ్చు.

    NGOe-Samvad

    మహిళా మరియు శిశు సంక్షేమ రంగంనకు సంబంధించి కృషి చేస్తున్న స్వచ్చంద సంస్థలు మరియు పౌరులు, కేంద్ర మహిళా సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి వివిధ అంశాలపై చర్చించేందుకై ఏర్పాటు చేసిన Online Portal నే NGOe-Samvad అందురు.

    నారీశక్తి పురస్కారం

    మహిళా సంక్షేమం మరియు అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వారికి, మార్చి 8 అనగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున అవార్డుతో పాటుగా 2 లక్షల రూపాయల నగదుతో సత్మరిస్తారు.

    Mahila Kisan Yojana

    మే 01, 2008న National Small Farmers Development Corporation వాళ్ళు ప్రారంభించారు. గ్రామీణ
    ప్రాంతంలో వ్యవసాయ & వ్యవసాయ అనుబంధ రంగాలలో జీవనం కొనసాగిస్తున్న మహిళలు దీని క్రింద లబ్ధిదారులు.

    New Swarnima For Women

    ఈ పథకాన్ని National Backward Classes Finance & Development Corporation (NBCFDC) వారు అమలు పరుస్తున్నారు. ఈ పథకం క్రింద 3 లక్షల కంటే వార్షిక ఆదాయం తక్కువగా వున్న OBC మహిళలకు వారు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు 2ల|| రూపాయల లోన్‌ని 5% వార్షిక వడ్డీకి అందిస్తారు. 

    అంగన్‌వాడీ సర్వీసెస్‌ పథకం

    ఇంతకు మునుపు ఈ పథకంను ICDS అని పిలిచే వారు, ప్రస్తుతం “అంగన్‌వాడీ సర్వీసెస్‌ పథకం” లేదా "Umbrella Integrated Child Development Services Scheme" గా పిలుస్తున్నారు. ICDS అనునది ప్రపంచంలోనే, మహిళా, శిశు సంరక్షణ మరియు పూర్వ పాఠశాలకు సంబంధించిన అతిపెద్ద పథకం. ఈ పథకం కింద లబ్ధిదారులు.

    1. 0-6 సంవత్సరాల బాలలు 2. గర్భిణీ స్త్రీలు 3. పాలిచ్చే తల్లులు

    నోట్‌: పైవారితో పాటుగా “Scheme for Adolescent Girls", సాక్ష్యం పథకాలు, పోషణ అభియాన్‌, అనిమియాముక్త్‌ భారత్‌, టీకా కార్యక్రమాలకు సంబంధించిన లబ్ధిదారులకు కూడా ICDS నకు సంబంధించిన గ్రామస్థాయి కేంద్రం అయిన Anganwadi Center నందు సేవలందిస్తారు.

    ICDS సేవల యొక్క లక్ష్యాలు

    1. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల యొక్క ఆరోగ్య మరియు పోషకాహార స్థాయిలను శుద్ధి చెందించడం.
    2. పూర్వ ప్రాథమిక విధ్య మరియు పూర్వ బాల్య దశ సంరక్ష సేవల ద్వారా బాలలయందు సరైన శారీరక, మానసిక మరియు సామాజిక వికాసం జరిగే విధంగా సేవలు అందించడం.
    3. శిశు మరణాలు, మాతృత్వ మరణాలు తగ్గించడం మరియు వివిధ వ్యాధుల బారిన పడకుండా సంరక్షించడం.
    4. బాలల వికాసంనకు సంబంధించి వివిధ శాఖలు అమలుపరుస్తున్న కార్యక్రమాలను సమన్వయం చేయడం.
    5. తల్లులకు అవగాహన మరియు ఆరోగ్య విద్యను అందించి తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకునేలా చేయడం.

    ICDS కార్యక్రమాలలో భాగంగా 6 రకాల సేవలను అందిస్తారు. అవి..

    1. Supplementary Nutrition Programme (SNP) లేదా అనుబంధ పోషణ కార్యక్రమం.
    2. పూర్వ పాఠశాల విద్య సేవలు మరియు పూర్వ బాల్యదశ అభివృద్ధి సేవలు (Early Childhood (or) Preschool Education and Development Services)
    3. పోషణ మరియు ఆరోగ్య విద్య సేవలు (Nutrition & Health Education Services)
    4. టీకా కార్యక్రమ సేవలు (Immunization Services)
    5. Health Checkups
    6. Referral Services

    అనుబంధ పోషణ సేవలను 0-6 సం॥ల పిల్లలకు, గర్భిణీ 'స్తేలు మరియు పాలిచ్చే తల్లులకు అందిస్తారు. మరియు వీరికే Immunization సేవలను కూడా అందిస్తారు. పై వానితో పాటుగా వీరికే Health Check up సేవలు, Referral Services కూడా అందిస్తారు.

    పూర్వ బాల్య దశ సంరక్షణ మరియు అభివృద్ధి (Early Childhood Care and Development Services) మరియు పూర్వపాఠశాల విద్య (Pre-School Education లేదా Early Childhood Education) సేవలను 3-6 సం॥ వయస్సు గల పిల్లలకు అందిస్తారు.

    పోషణ మరియు ఆరోగ్య విద్యను 15-45 సంవత్సరాల మధ్య గల బాలికలు మరియు మహిళలకు అందిస్తారు. 'Scheme for Adolescent Girls' పథకం క్రింద లబ్ధిదారులైన కౌమార, బాలికలకు కూడా ICDS నందే సేవలందిస్తారు.

    అంగన్‌వాడీ సేవలు అమలుపరిచేందుకై, సాధారణ రాష్ట్రాల విషయంలో కేంద్రం 60% నిధులు మరియు 40% నిధులు రాష్ట్రాలు సమకూరుస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు మరియు హిమాలయ రాష్ట్రాల విషయంలో కేంద్రమే 90% నిధులను సమకూరుస్తుంది మరియు కేంద్రపాలిత ప్రాంతాలు (Without Legislature) విషయంలో కేంద్రమే 100% నిధులను సమకూరుస్తుంది.

    అంగన్‌వాడీ సిబ్బందికి సంబంధించిన వేతనాల ఖర్చులో కేంద్రం 25% భరిస్తుంది, మిగతా 75% ఆయా రాష్ట్రాలు భరిస్తాయి, కాని ప్రత్యేక హోదా కలిగిన ఈశాన్య రాష్ట్రాల విషయంలో 90% కేంద్రమే భరిస్తుంది మరియు కేంద్ర పాలిత ప్రాంతాల విషయంలో (Without Legislature) విషయంలో 100% విధులను కేంద్రమే భరిస్తుంది.

    అనుబంధ పోషణ అమలు (Supplementary Nutrition) విషయంలో 50% నిధులు కేంద్రం, మిగతా 50% నిధులు ఆయా రాష్ట్రాలు భరిస్తాయి, కానీ ప్రత్యేక హోదా కలిగిన, ఈశాన్య రాష్ట్రాల విషయంలో 90% నిధులు కేంద్రమే భరిస్తుంది మరియు కేంద్ర పాలిత ప్రాంతాల (Without Legislature) విషయంలో 100% నిధులు కేంద్రమే సమకూరుస్తుంది.

    ICDS పథకం యొక్క ప్రస్తుత స్థితి

    • ICDS పథకంను అక్టోబర్‌ 2, 1975న అనగా 5వ పంచవర్ష ప్రణాళికా కాలంలో పైలట్‌గా 33 ప్రాజెక్టుల క్రింద 4891 అంగన్‌వాడీ సెంటర్‌ల యందు ప్రారంభించారు.
    • 9వ పంచవర్ష ప్రణాళికా కాలం నాటికి దేశవ్యాప్తంగా అమలు చేశారు.
    • దేశ వ్యాప్తంగా 7075 ప్రాజెక్టులు మరియు 1377995 అంగన్‌వాడీ సెంటర్‌లు ప్రస్తుతం సేవలందిస్తున్నవి. ఆంధ్రప్రదేశ్‌ నందు 257 అంగన్‌వాడీ ప్రాజెక్టులు కలవు.
    • ప్రస్తుతం అనుబంధ పోషణ కార్యక్రమం క్రింద అనుబంధ పోషణ అందించేందుకై 6-72 నెలల పిల్లల కోసం ఒక్కరికి ఒక రోజునకు 9 రూపాయలు తల్లుల కోసం ఒక్కరికి ఒక రోజునకు 9-50 రూపాయలు.
    • తీవ్ర పోషకాహార సమస్య ఉన్న పిల్లల (6-72 నెలలు) కోసం ఒక్కరికి, ప్రతిరోజునకు 12/- లు ఖర్చు పెడుతున్నారు.
    • ICDS లో భాగంగా గ్రామస్థాయిలో సేవలందించే కేంద్రంనే అంగన్‌వాడీ సెంటర్‌ (Anganwadi Center) అందురు, అంగన్‌వాడీ సెంటర్‌ ఏర్పాటుకై ఈ క్రింది జనాభాపరమైన నిబంధనలను పాటిస్తారు.
    • గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల యందు 100 నుండి 800 జనాభాకుగాను ఒక అంగన్‌వాడీ సెంటర్‌ని, 800 నుండి 1600 జనాభా ఉన్నట్లయితే రెండు సెంటర్‌లను మరియు 1600 నుండి 2400 జనాభా ఉన్నట్లయితే మూడవ అంగన్‌వాడీ సెంటర్‌ని ఇలా ప్రతీ కనీసం 800 జనాభాకు ఒక అంగన్‌వాడీ సెంటర్‌ని నెలకొల్పుతారు. 400 కంటే తక్కువ జనాభా ఉన్నట్లయితే మినీ అంగన్‌వాడీ సెంటర్‌ (MAW) నెలకొల్పుతారు.
    • గిరిజన, నదితీర, ఎడారి మరియు కొండ ప్రాంతాల యందు కూడా 00 నుండి 800 నుండి జనాభాకు ఒక అంగన్‌వాడీ సెంటర్‌ని నెలకొల్చుతారు. మరియు 150 నుండి 300 వరకే జనాభా ఉన్నట్లయితే మినీ అంగన్‌వాడీ సెంటర్‌ని మరియు అంతకంటే కూడా జనాభా తక్కువగా ఉండి కనీసం 40 మంది 6 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నట్లయితే అంగన్‌వాడి సెంటర్‌ ఆన్‌ డిమాండ్‌ (Anganwadi Center on Demand (AOD)) ని ప్రారంభిస్తారు.

    బాల శిక్షా కేంద్ర (BSK)

    నాణ్యమైన పూర్వపాఠశాల విద్యను అందించేందుకు గాను మధ్యప్రదేశ్‌ రాష్ట్రం నందు 3183 బాలళిక్షా కేంద్రాలను అభివృద్ధి చేశారు. వీటి యొక్క నాణ్యతా ప్రమాణాలకు గుర్తుగా ISO 9001: 2015 సర్టిఫికేట్‌ను పొందాయి.

    Applied Nutrition Programme (ANP)

    ఈ పథకాన్ని పైలట్‌ పథకంగా ఒరిస్సా రాష్ట్రం నందు 1963లో ప్రారంభించారు. కూరగాయలు మరియు పండ్ల ఉత్పత్తిని పెంపొందించడం మరియు గర్భిణీ స్త్రీలు, బాలలు, పండ్లు, కూరగాయలు అధికంగా వినియోగించేలా చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం. 1973లో ఈ పథకం దేశమంతా విస్తరించబడింది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రదర్శనలు ఇస్తూ పోషకాలకు సంభవించిన అవగాహన పెంపొందించేవారు.

    6 సం॥॥లలోపు పిల్లలు, గర్భిణీ ప్తీలు మరియు పాలిచ్చే తల్లులు ఈ పథకం క్రింది లబ్ధిదారులు.

    బాలల కోసం ప్రతిదినం 25 పై॥ గర్భిణీ స్త్రీల కోసం 50 పై॥ కేటాయిస్తూ ఈ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం క్రింద Kitchen Gardens, Poultry Farms లాంటివి ప్రోత్సహించారు.

    ప్రత్యేక పోషణ పథకం (Special Nutrition Programme)

    ఈ పథకం 1970-71 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించారు. ఆరంభంలో ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కాగా 5వ ప్రణాళికా కాలం నుండి రాష్ట్రాలు అందించే పథకంగా మార్చారు.

    పూర్వ పాఠశాల దశలో వున్న బాలల్లో, బలహీన వర్ణాలకు చెందిన గర్భిణీ ప్తీలు మరియు పాలిచ్చే తల్లులలో పోషకాల స్థాయిని పెంపొందించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. ఈ పథకం యొక్క లబ్ధిదారులు పూర్వపాఠశాల దశలో వున్న విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు...

    ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు Suplimentary feeding అందించేవారు. ఇందులో భాగంగా పూర్వపాఠశాల విద్యార్థులకు 200 కిలో కాలరీల శక్తి మరియు 10 గ్రా॥ మాంసకృత్తులు లభించే ఆహారాన్ని ప్రతిదినం ఇచ్చేవారు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల కోసం 500 కిలోకాలరీస్‌ శక్తినిచ్చే & 25 గ్రా॥ మాంసకృత్తుల శక్తినిచ్చే అహారాన్ని ప్రతీదినం వారానికి 6 రోజుల పాటు ఇచ్చేవారు.

    SNP కార్యక్రమం Minimum Needs Programme లో భాగంగా అమలు చేయబడింది. ICDS ఏర్పాటుతో SNP అందులో భాగం అయ్యింది.

    పోషణ్‌ అభియాన్‌ (POSHAN ABHIYAN)

    Poshan Abhiyan అనగా Prime Ministers Overarching Scheme for Holistic Nourishment అని అర్ధం. ఈ కార్యక్రమాలను National Nutrition Mission అనే పేరుతో మరియు 9046 కోట్ల నిధులతో మార్చి 8, 2018న రాజస్థాన్‌లోని జున్‌జున్‌ నందు శ్రీ నరేంద్రమోడీ గారు ప్రారంభించారు.

    3 సంవత్సరాల నిర్ధేశిత సమయంలో 6 సంవత్సరాల లోపు పిల్లల యందు, కౌమార బాలికల యందు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లుల యందు పోషణకు సంబంధించి క్రింది లక్ష్యాలు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


    మొత్తం మీద 0-6 సంవత్సరాల పిల్లల యందు గల ఎదుగుదల లోపం (Stunting) 38.4% నుండి 2022 కల్లా 25% నకు తీసుకురావడం.

    పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమం విజయవంతంగా అమలు జరిగేందులకై విధానపరమైన సూచనలు, సలహాలు మరియు సమీక్షలు అందించేందులకై నీతి అయోగ్‌ యొక్క ఉపాధ్యక్షుడి సారధ్యంలో National Council on Nutrition (NCN) ని ఏర్పాటు చేశారు.

    పోషణ్‌ అభియాన్‌ పథకం అమలు పరిచేందుకు గాను 200 మిలియన్‌ డాలర్ల లోన్‌ని ప్రపంచ బ్యాంకు నుండి తీసుకున్నారు.

    Light House India

    ప్రపంచ బ్యాంకు వారి సహాయంతో కేంద్ర మహిళా మంత్రిత్వ శాఖ వారు 1 నుండి 5 ఫిబ్రవరి 2019లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా 12 దేశాల ప్రతినిధుల మధ్య పోషకాహారంనకు సంబంధించిన పరిజ్ఞానం పరస్పరం మార్చిడి చేసుకున్నారు. మరియు World Bank వారి సహకారంతోనే Optima Nutrition అనే కార్యక్రమంను 18 నుండి 20 ఫిబ్రవరి 2019న నిర్వహించారు. దీని యొక్క నినాదం A Drive to Fight With Under Nutrition.

    National Early Childhood Care and Education under ICDS

    National Early Childhood Care and Education (NECCE) అనునది ICDS సేవలలో భాగంగా 3 నుండి 6 సంవత్సరాల మధ్యలో నున్న బాలలకు అందిస్తున్నారు.

    అక్టోబర్‌ 12, 2013న ఆమోదించబడిన National Early Childhood Care and Education (NECCE) పాలసీలో పేర్కాన్న విధంగా బాలల పెరుగుదల, వికాసం మరియు ప్రతి బాలుడి పూర్వ పాఠశాల విద్య అందే విధంగా సేవలందిస్తున్నారు.

    గ్రామ స్థాయిలో అంగన్‌వాడీ సెంటర్‌ల యందు పూర్వబాల్యదశ సంరక్ష మరియు విద్యాసేవలను అందిస్తారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 3.05 కోట్ల మంది బాలలు ఈ సేవలు పొందుతున్నారు. 5000/-ల విలువ చేసే Pre-School Education మరియు Child Assessment పరికరాలను అందిస్తున్నారు.

    ICDS - CAS

    ICDS సేవలను అమలు చేసే సూపర్‌వైజర్లు మరియు అంగన్‌వాడీ టీచర్లకు ICDS - CAS అనబడే Common Application Software తో రూపొందించబడిన Smart Phone లు అందిస్తున్నారు.

    జన ఆందోళన్‌ కార్యక్రమాలు

    పోషకాహారం అవశ్యకతపై ప్రజలలో అవగాహన పెంచేందుకై మరియు పోషణ అభియాన్‌ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకై ఉద్యమస్థాయిలో చేస్తున్న కార్యక్రమం జన అందోళన్‌. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం, ప్రజల యొక్క పోషకాహార ప్రవర్తన మార్చు తీసుకురావడం. అందులో భాగంగానే Community Based Events నిర్వహిస్తున్నారు. మరియు సెప్టెంబర్‌ 2019న రాష్ట్రీయ పోషణ్‌ మహ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 5 అంశాలపై ప్రచారం నిర్వహించారు. అవి...

    1. బాలల యొక్క మొదటి 1000 రోజుల జీవనకాలం - తీసుకోవలసిన జాగ్రత్తలు
    2. డయోరియా నియంత్రణ 
    3. పౌష్టికాహారం
    4 పరిశుభ్రత - Handwash 
    5. అనిమియా నియంత్రణ

    భారతీయ పోషణ్‌ క్రిషి కోశ్‌ (BPKK)

    BPKK అనే పథకంను  Bill and Melinda Gates Foundation వారి సహకారంతో మహిళా మంత్రిత్వశాఖ ప్రారంభించింది. ఈ పథకం క్రింద సమీకరించిన నిధులతో భారతదేశంలోని 127 వివిధ వ్యవసాయ వాతావరణ మండలాలలో, ఆయా ప్రాంతాలకు అనుగుణమైన విభిన్న పంటలను సమర్థవంతమైన పోషకాలు లఖించే విధంగా అభివృద్ధి చేస్తారు.

    నేషనల్‌ క్రెష్‌ స్కీం (SNCS)

    జనవరి 1, 2017న బాలలకు Day Care సౌకర్యాలు అందించేందుకై ప్రారంభించారు. ఈ పథకం ద్వారా చంటి పిల్లలు ఉన్న పని చేసే మహిళలు, ఆయా పిల్లలకు ఆలనా కేంద్రాలు క్రైష్‌ సెంటర్స్‌/ల వద్ద వదిలి వేసే వారి వారి పనులకు వెళతారు.

    ఈ పథకం అమలు కోసం కావలసిన నిధులలో 60% కేంద్రం, 230% రాష్ట్రం మిగిలిన 10% ఆలనా కేంద్రాలు నడుపుతున్న సంస్థలు భరించాలి.

    హిమాలయ, ఈశాన్య మరియు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల యందు 80% నిధులు కేంద్రం సమకూర్చగా, 10% ఆయా రాష్ట్రాలు మిగిలిన 10% నిధులను ఆలనా కేంద్రాలు నడుపుతున్న సంస్థలు భరిస్తాయి. కేంద్ర పాలితా ప్రాంతాల విషయంలో 90% నిధులు కేంద్రం సమకూరుస్తుండగా మిగిలిన 10% నిధులు ఆలనా కేంద్రం నడుపుతున్న సంస్థలు భరించాలి.

    ఈ పథకం నందు ఈ క్రింది సేవలు అందిస్తున్నారు.

    1. Daycare facilities and Sleeping facilities.
    2. 3 సంవత్సరాలలోపు పిల్లలకు ఉద్ధీపణ కార్యక్రమాలు చేపట్టడం.
    3. 3 నుండి 6 సంవత్సరాల మధ్య గల పిల్లలకు పూర్వ పాఠశాల విధ్యను అందించడం.
    4. అనుబంధ పోషణ సేవలు.
    5. Growth Monitoring among Children.
    6. ఆరోగ్య మరియు టీకా సేవలు అందించడం

    ఈ సేవలు పొందెందుకై BPL లబ్ధిదారులు నెలకు 20/- చెల్లించాలి.

    UNICEF తో సహకార ఒప్పందం

    దీనినే  Basic Co-operation Agreement (BCA) with United Nations Childrens Fund (UNICEF) అని కూడా పిలుస్తారు.

    మే 10, 1949న మరియు 5 ఏప్రియల్‌, 1978న ప్రభుత్వం UNICEF వారితో సహకార ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం UNICEF వారి సహకారంతో Current - Country Programme Action Plan 2018-22 ప్రకారం ఉమ్మడి ప్రణాళికా అమలు చేస్తున్నారు. ఇందుకోసం 651 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లతో మహిళా మరియు శిశు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయనున్నారు.

    CSP With WFP

    దీనినే Country Strategic Plan (CSP) with United Nations World Food Programme (WFP) అని పిలుస్తారు. 1961లో స్థాపించబడిన WFP, 1963 నుండి తన 'సేవలను మన దేశంలో అందిస్తున్నాయి. ఈ సంస్థ ప్రస్తుతం అంగన్‌వాడి సర్విసెస్‌ పథకంనకు కావలసిన సాంకేతిక సహకారంను అందిస్తున్నది.

    ఫిబ్రవరి 01, 2019న కేంద్రం World Food Programme వారితో కలిసి A new Country Strategic Plan (CSP) 2019-23 ఏర్పరచుకుంది.

    Wheat Based Nutrition Programme (WBNP)

    FCI వారి సహకారంతో గోధుమలు వినియోగించే రాష్ట్రాలలో గోధుమలు మరియు ఇతర ధాన్యాలు ICDS సేవలతో భాగంగా అందిస్తున్నారు. National Food Security Act-2013 అమలులో భాగంగా ఈ పథకం అమలు చేస్తున్నారు. 

    కౌమార బాలికల పథకం

    ఈ పథకంనే Scheme for Adolescent Girls (SAG) గా పిలుస్తారు. ఈ యొక్క SAG పథకంను Umbrella ICDS పథకంలో భాగంగా అమలుపరుస్తున్నారు.

    2000 సంవత్సరంలో 11 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల కౌమార బాలికల యొక్క పోషణ మరియు అరోగ్య స్థాయిలు పెంపొందించేందుకై కిశోర శక్తి యోజన (KSY) అనే పథకంను ICDS కేంద్రాల వద్ద అమలు చేసేవారు.

    తక్కువ బరువున్న (Under Weight) కౌమార బాలికలకు ప్రతినెల 6 కె.జీల ఆహార ధాన్యాలు అందించేందులకై 2002వ సంవత్సరంలో 'National Programme for Adolescent Girls' (NPAG) పథకంను ఫైలట్‌గా 51 జిల్లాలలో ప్రారంభించారు.

    2010వ సంవత్సరంలో KSY మరియు NPAG పథకాలను కలిపివేసి “రాజీవ్‌ గాంధీ స్కీం ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ అడాలిసెంట్‌ గర్ల్స్‌” (RGSEAG) పథకం ప్రారంభించారు. దీనినే సబల అని కూడా పిలిచేవారు.

    సబల పథకం యొక్క విధి విధానాలను మార్చివేసి 2017వ సంవత్సరంలోనే ఈ పథకంను Scheme for Adolescent Girls (SAG) లేదా కౌమార బాలికల పథకంగా మార్చివేసారు.

    SAG పథకం యొక్క ముఖ్య లక్ష్యం పాఠశాలకు వెల్లకుండా ఉన్నటువంటి 11 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలను తిరిగి పాఠశాలలో చేర్చడం మరియు వారి యొక్క పోషణ మరియు ఆరోగ్య అవసరాలు తీర్చడం.

    SAG పథకం యొక్క ఇతర లక్ష్యాలు

    1. కౌమార బాలికల యొక్క స్వయం వికాసం మరియు సాధికారత.
    2. కౌమార బాలికల పోషణ మరియు ఆరోగ్యం మెరుగుపరచడం.
    3. ఆరోగ్యం, పరిశుభ్రత మరియు పోషణలపై అవగాహనలు పెంచడం.
    4. పాఠశాల మానివేసిన కౌమార బాలికలను తిరిగి పాఠశాలకు చేర్చడం లేదా నైపుణ్యాలు పెంచడం.
    5. కౌమార బాలికల యందు గృహ మరియు జీవన నైపుణ్యాలు పెంపొందించడం.
    6. ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ సేవలపై అవగాహన పెంపొందించడం.

    మొదటి దశలో భాగంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో అవసరం అధికంగా ఉన్నటువంటి 3083 జిల్లాలలో అమలు చేశారు, రెండవ దశలో (2018-19) దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. అనగా ఏప్రిల్‌ 01, 2018 నుండి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు.

    ICDS నందు భాగంగా (గ్రామస్థాయిలో 'సేవలందిస్తున్నటువంటి అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా SAG పథకంను అమలు చేస్తున్నారు.

    SAG పథకం నందు అందిస్తున్న సేవలు

    1. Nutrition provisions
    2. Iron and folic acid supplementation
    3. Health check up and referral services
    4. Nutrition and health education
    5. Mainstreaming out of school girls to join formal schooling
    6. Life skill education and health education
    7. Counseling and guidance on Government services

    పై సేవలను రెండు ౮0మ్రి0260 క్రింద అమలు చేస్తున్నారు. అవి....
    1. Nutrition component
    2. Non - nutrition component

    Nutrition component నందు భాగంగా పాఠశాలకు వెల్లకుండా ఉన్నటువంటి 11 నుండి 12 సంవత్సరాల బాలికలకు పోషణ సదుపాయాలు కల్పిస్తారు. ఇందులో భాగంగా ఒక్కరికి, ఒక్క రోజునకు 600 కేలరీల శక్తినిచ్చే మరియు 18.20 గ్రాముల మాంసకృత్తులు కలిగియున్న ఆహారంను సంవత్సరానికి 300 రోజులు అందిస్తారు. ఈ ఆహారం Take Home Ration లేదా Hot Cooked Meals (HCM) రూపంలో కాని అందిస్తారు. ఈ అహారం అందించేందుకై ఒక్కరిపైన ప్రతిరోజునకు 9.50/- రూపాయలు ఖర్చు చేస్తున్నారు. Nutrition component నకు అయ్యే ఖర్చులో కేంద్రం మరియు రాష్ట్రాలు 50:50 నిష్పత్తిలో నిధులు అందిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు (Without Legislature) మరియు ప్రత్యేక హోదా కల్గిన రాష్ట్రాల విషయంలో కేంద్రం 90% నిధులు అందిస్తుంది. మిగతావి ఆయా రాష్ట్రాలు భరిస్తాయి.


    Non - Nutrition నందు భాగంగా 11 నుండి 14 సంవత్సరాలు గల పాఠశాలకు వెల్లని బాలికలను తిరగి పాఠశాలలో చేర్చించడం, Bridge School ల నందు చేర్చించడం మరియు నైపుణ్యాలు పెంచడం చేస్తారు. పై సేవలతో పాటు IFA మాత్రలు ఇవ్వడం, ఆరోగ్య సేవలు, జీవన నైపుణ్యాలపై కౌన్సిలింగ్‌ ఇవ్వడం లాంటి 'సేవలు అందిస్తారు. Non - Nutrition సేవలు అమలు పరిచేందుకై ఒక్క గ ప్రాజెక్టునకు సంవత్సరానికి ఒక లక్షా పది వేలు ఖర్చు చేస్తారు. ఈ యొక్క Component ను అమలు పరిచేందుకై కేంద్రం మరియు రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో ఖర్చును బరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల విషయంలో 90% నిధులు కేంద్రం భరిస్తుంది మిగిలిన 10% ఆయా రాష్ట్రాలు భరిస్తాయి.

    Child Protection Services Scheme (CPS)

    2009వ సంవత్సరంలో ప్రారంభించిన Integrated Child Protection Services Scheme (CPS) ని CPS Scheme గా పిలుస్తున్నారు. బాలల యొక్క సమగ్ర రక్షణ ముఖ్యంగా విపత్మర పరిస్థితులలో నున్న బాలికలకు రక్షణను అందించేందుకై ఈ పథకం అమలు చేస్తున్నారు.

    CPS పథకం యొక్క లక్ష్యాలు

    1. బాలన్యాయ చట్టం ద్వారా విపత్మర పరిస్థితులలోనున్న బాలలకు ఇవ్వబడిన ప హక్కులు అమలు అయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టడం.

    2. అక్రమ రవాణా, బాల కార్మికత, Child neglect, Child abuse, Child exploitation లాంటి వానిని రక్షించడం మరియు ఆయా సంస్థల బారిన పడకుండా కాపాడడం.

    3. Quality Child Protection Services అందించడం

    4. బాలల హక్కులు మరియు బాలలపై జరుగుతున్న వివిధ రకాల హింసపై సమాజంలో అవగాహన కలిగించడం 

    5. బాలలకు సేవలందించేందుకై కావలసిన ఏర్పాట్లు చేయడం.

    6. అందిస్తున్న సేవల యొక్క 'ప్రభావంను మూల్యాంఖనం చేయడం.

    బాల న్యాయ చట్టం - 2015 ప్రకారం విపత్మర పరిస్థితుల్లోనున్న బాలలకు మరియు చట్టంతో స సంఘర్షణ పడుతున్న లేదా బాల అపరాదులకు అందచేయవలసిన నివారణ మరియు పునరావస సేవలను అందిస్తారు.

    CPS పథకం నందు గల Components

    • బాల న్యాయ చట్టం ప్రకారం, Child Welfare Committee (CWC), Juvenile Justice Board (JJB) మరియు Special Juvenile Police Unit జిల్లా స్థాయిలో చట్టబద్ధంగా ఏర్పాటు చేసారు.
    • Central Adoption Resource Authority (CARA), State Child Protection Society (SCPS), State Adoption Resource Authority (SARA) మరియు  District Child Protection Unit (DCPU) ల ద్వారా సేవలు అందించడం.
    • విపత్కర పరిస్థితులలోనున్న పిల్లల (అనాథలు, గృహం వదిలిన పిల్లలు, హింసకు గురవుతున్న పిల్లలు, వెట్టిచాకిరి, బాలకార్మికత, అక్రమ రవాణాకు గురవుతున్న పిల్లల లాంటి వారు) కోసం Childrens Home, దత్తత సంస్థలు, Foster Homes, Foster Families ద్వారా సేవలందించడం మరియు చట్టంతో సంఘర్షణ పడుతున్న బాలలకై  Special Homes, Observation Homes ల ద్వారా సేవలందిస్తారు.
    • Foster Care, Adoptio, After Care (18 సంవత్సరాలు దాటిన తరువాత 21 సంవత్సరాలు నిండే వరకు అందించే సేవలు) మరియు Foster Family ద్వారా సేవలు అందిస్తారు.
    • 1098 అనేటువంటి Child helpline సేవల ద్వారా విపత్మర పరిస్థితులలోనున్న బాలల సమాచారంను CPS వారికి అందజేస్తే CPS వారు బాలలను సంరక్షిస్తారు.
    • తప్పిపోయినటువంటి బాలల కోసం Khoya-Paya అనే Website ద్వారా సేవలు అందిస్తున్నారు. ఈ సేవలను 2, జూన్‌ 2015న ప్రారంభించారు.
    • 1098 అనబడే Child helpline సేవలను Child Line India Foundation అనే సంస్థ సహకారంతో అమలు చేస్తున్నారు.

    Beti Bachao Beti Padao Scheme (BBBPS)

    BBBPS పథకంను 22 ఫిబ్రవరి 2015న హర్యాణ రాష్ట్రంలోని ఫానిపట్‌ నందు ప్రారంభించారు. ఈ పథకం నినాదం 'Save the girl child, educate the girl child' మరియు 'Towards a Newdhan'.

    హర్యాణ రాష్ట్రం నందు లింగనిపష్పత్తి అత్యల్బంగా ఉంది కాబట్టి అక్కడ నుండే ప్రారంభించారు.

    లింగనిప్పత్తి తగ్గకుండా చూడడం, బాలికకు సంరక్షణ మరియు విద్యా అవకాశాలు కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.

    1000 మంది 0-6 సం॥ బాలురకు గాను ఉన్నటువంటి బాలికల సంఖ్యను Child Sex Ratio (CSR) అందురు. CSR అనునది 1961లో 976 ఉండగా 2011 జనాభా లెక్కల ప్రకారం 918 నకు తగ్గింది. ఈ సమస్యను ఎదుర్మొనేందుకు ఈ పథకం ప్రారంభించారు.

    ఈ పథకం యొక్క అమలు నందు మూడు మంత్రిత్వశాఖలు పాలు పంచుకుంటున్నవి. అవి..

    1. Ministry of Women and Child Development
    2. Ministry of Women Health and Family Welfare
    3. Ministry of Women Human Resource Development

    బాలికల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం లింగ నిర్ధారణ పరీక్షలు జరిపించి, ఆడశిశువులను భ్రూణ హత్యలకు గురిచేయడమే అందులకే ఈ పథకం PCPNDT Act- 1994 అమలును కట్టుదిట్టం చేస్తున్నది.

    BBBP యొక్క లక్ష్యాలు

    1. భ్రూణ హత్యలను నివారించడం

    2. బాలికల మనుగడ మరియు సంరక్షణ కోసం పాటుపడటం

    3. బాలిక విద్యను కల్పించడం మరియు బాలికల యొక్క భాగస్వామ్యంను పెంపొందించడం


    BBBP యొక్క లక్షిత సమూహాలు (Target Groups)

    1. మొదటి ప్రాదాన్యతగా - నూతన దంపతులు, గర్భిణీస్త్రీలు మరియు పాలిచ్చే తల్లుల యందు అవగాహన పెంచడం.

    2. రెండవ ప్రాధాన్యతగా - యువకులు, కౌమారులు, డాక్టర్లు ఇతరులకు అవగాహన పెంచడం.

    3. మూడవ ప్రాధాన్యతగా - మహిళలు, పంచాయతీరాజ్‌ సభ్యులు, ౮౦, సాధారణ ప్రజల యందు అవగాహనలు పెంపొందించడం

    BBBP నందు భాగంగా 22 జనవరి 2015న బాలికల యొక్క ఆర్థిక భద్రత కోసం సుకన్య సంవృద్ధి యోజన పథకం ప్రారంభించారు.

    BBBP అమలు నందు మహిళా మంత్రిత్వశాఖ 'Nodal' మంత్రిత్వ శాఖగా పనిచేస్తుంది. ఈ పథకం ప్రారంభించినప్పుడు “మాధురి దీక్షిత్‌” ప్రచారకర్తగా ఉండేవారు. ఈ పథకం మొదటగా దేశ వ్యాప్తంగా 100 జిల్లాలో ప్రారంభించారు. ఇందులో హర్యానా రాష్ట్రం నుండి అధికంగా కలవు.

    ఈ పథకం అమలునకు జిల్లా స్థాయిలో కలెక్టర్‌ అధ్వర్యంలో 'District Task Force' ని ఏర్పాటు చేశారు. మరియు Block level Action plan & Village level Action plan రూపొందించారు.

    బాలశక్తి పురస్కారం

    5 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండి, విద్యా పరంగా, ఆటల పరంగా, కళల పరంగా, ఆవిష్మరణల పరంగా, ధైర్యసాహసాల పరంగా మరియు సామాజిక సేవా పరంగా అత్యున్నత ప్రతిభ ప్రదర్శించినవారికి బాలశక్తి పురస్కారం అందిస్తారు. అవార్డుతో పాటుగా మెడల్‌, లక్ష రూపాయల పురస్మారం 10,000/- విలువ చేసే Book Vouchers మరియు సర్టిఫికేట్‌ ఇస్తారు.

    బాల కళ్యాణ్‌ పురస్కారం

    బాలల సంక్షేమం, వికాసం మరియు రక్షణ కోసం 7 సంవత్సరాలకు పైగా విశేష కృషి జరిపిన వ్యక్తులకు మరియు నగదు, మెడల్‌ మరియు సర్టిఫికేట్‌ అందజేస్తారు. సంస్థల విషయంలో 10 సంవత్సరాలకు పైగా విశేష కృషి జరిపిన సంస్థలకు లక్షల రూపాయల నగదు, మెడల్‌ మరియు పురస్కారం అందజేస్తారు.

    HAUSLA

    Child Care Institute నందు ఆశ్రయం పొందుతున్నటు వంటి అనాధలు, గృహం వదిలివేసిన వారు మరియు ఇతర విపత్కర పరిస్థితులలో నున్న బాలల కోసం ఉద్ధేశించి సాంస్కృతిక ఉత్సవంనే HAUSLA అందురు. ఈ ఉత్సవంలో ఖాగంగా బాలలకు సాంస్కృతిక మరియు క్రీడలను నిర్వహిస్తారు.

    Gender Budgeting

    2005-06 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం Gender Budgeting విధానంను ప్రారంభించింది. ఈ విధానంలో భాగంగా లింగపరమైన బేదాలు తగ్గే విధంగా బడ్జేట్‌ రూపకల్పన చేయడమే Gender Budgeting ఇందులో భాగంగా మహిళా జనాభాకు తగిన విధంగా వనరులు కేటాయించడం జరుగుతుంది. Gender Budgeting ని అన్ని మంత్రిత్వ శాఖలు అమలు పరిచేలా మహిళా మంత్రిత్వశాఖ Nodal Ministry పని చేస్తుంది.

    మహిళ E - Haat

    • ఈ పథకంను 7 మార్చి 2016న ప్రారంభించారు.
    • మహిళా పారిశ్రామిక వేత్తలు, స్వయం సహాయక బృందాలు మరియు స్వచ్చంద సంస్థలు తాము ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తులను Online మార్కెటింగ్‌ ద్వారా అమ్ముకునే అవకాశం కల్పించే Online Portal నే E - Haat అందురు.
    • Digital Marketing Platform ద్వారా Make in India కు తోద్చడం మరియు మహిళా పారిశ్రామికవేత్తలకు Online Marketing సదుపాయలు కల్పించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం.
    • E - Haat నందు 18 రకాల విభాగాల యందు మహిళలు తమ యొక్క ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకోవచ్చును.

    POCSO - e - box

    Protection of Children from Sexual Offences Act 2012 చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన electronic complaint box నే POCSO - e - box అందురు. పౌర సమాజం, భాదిత బాలలు, NGO లు మరియు ఇతరులు బాలలపై జరుగుతున్న లైంగిక వేదింపులు మరియు లైంగిక దాడులను POCSO - e - box ద్వారా ఫిర్యాదులు చేయవచ్చును.

    NARI

    దీనినే  'National Repository of Information for Women' అని పిలుస్తారు మరియు పాపులర్‌గా NARI పోర్టల్‌ అని పిలుస్తారు. NARI పోర్టల్‌ని 2018వ సంవత్సరంలో (ప్రారంభించారు) కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ వారు ప్రారంభించారు. NARI పోర్టల్‌ నందు మరియు అన్ని రాష్ట్రాలు మహిళల యొక్క సంక్షేమం మరియు రక్షణ కోసం అమలు పరుస్తున్న చట్టాలు మరియు పథకాలకు సంబంధించిన సమాచారంను పొందుపరిచారు. ఈ పోర్టల్‌ ద్వారా మహిళలు తమ కోసం ఉన్నటువంటి సదుపాయాలు మరియు పథకాలను తెలుసుకోవచ్చు.

    STEP

    • దీనినే 'Support  to Training and Employment Programme (STEP)' అని అందురు.
    • STEP ని 1986-87 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించారు.
    • మహిళలు పారిశ్రామిక వేత్తలుగా మరియు స్వయం స్వావలంబకులుగా చేయడం మరియు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా చేయడమే ఈ పథకం యొక్క లక్ష్యం. ఇందుకోసమై కావలసిన నైపుణ్యాలను మరియు సామర్ధ్యాలను శిక్షణ ద్వారా పెంపొందిస్తారు.
    • ఈ పథకం క్రింద 16 సంవత్సరాలు దాటిన మహిళలను లబ్ధిదారులుగా పరిగణిస్తారు.
    • వ్యవసాయ రంగం, ఉద్యానవనరంగం, ఆహార పరిశ్రమలు, చేతివృత్తులు, చేనేత, టైలరింగ్‌, అల్లికలు, కంప్యూటర్‌ శిక్షణ, టూరిజం మరియు ట్రావెల్‌ రంగం మరియు నగలు లాంటి రంగాలలో మహిళలకు శిక్షణను ఇస్తున్నారు.

    National Mission For Empowerment of Women

    • దీనినే NMEW అని పిలుస్తారు.
    • ఈ మిషన్‌ని మార్చి 8, 2010న ప్రారంభించారు.
    • ఈ పథకం యొక్క నినాదం 'Hum Sunege Nari Ke Bath'.
    • సమగ్రమైన సాధికారతను మహిళలకు కల్పించడమే ఈ పథకం యొక్క లక్ష్యం.
    • ఈ మిషన్‌ని మిషన్‌ పూర్ణశక్తి అని కూడా పిలుస్తారు.

    జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన Governors Committee సూచనల ఆధారంగా ఏర్పాటు చేశారు. మహిళా సాధికారతకు సంబంధించి వివిధ శాఖలు అమలుచేస్తున్న కార్యక్రమాలు సమన్వయం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్ధేశ్యం. ఇందులకై జాతీయ స్థాయిలో 'Stering Committe' ని రాష్ట్ర స్థాయిలో State Resource Center for Women ని జిల్లా స్థాయిలో “పూర్ణశక్తి కేంద్రాలు” ఏర్పరచి అన్ని రకాల మహిళా సాధికారత పథకాల అమలు తీరును సమన్వయ పరుస్తారు.

    సాక్ష్యం పథకం

    • ఈ పథకంనే Rajiv Gandhi Scheme for Empowerment of Adolescent Boys (RGSEAB) అని కూడా పిలుస్తారు మరియు సాక్ష్యం యోజనా అని కూడా అందురు.
    • 2014 సంవత్సరంలో ప్రారంభించిన ఈ పథకం యొక్క లబ్ధిదారులు కౌమార బాలురు (Adolescent Boys).
    • కౌమారా బాలుర యొక్క సంపూర్ణ వికాసమే ఈ పథకం యొక్క లక్ష్యం మరియు ఈ పథకం ద్వారా కౌమార బాలురు తమ భవిష్యత్తులో స్వయం సంవృద్ధులుగా, లింగపరమైన సునిశితత్వంను కలిగి ఉండే పౌరులుగా తయారవుతారు.
    • 11 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన బాలురు ఈ పథకం పరిధిలోనికి వస్తారు.

    ఈ పథకం క్రింద చేపట్టే కార్యక్రమాలు

    1. కౌమార బాలురను స్వయం స్వావలంబకులుగా, లింగ సునిశితత్వం (Gender Sensitivity) గల వారిగా తయారు చేయడం.

    2. కౌమార బాలుర యొక్క శారీరకపరమైన, ఉద్వేగపరమైన, మానసిక పరమైన సమస్యలను పరిష్కరించడం.

    3. Vocational నైపుణ్యాలు వృద్ధి చేయడం.

    4. ARSH (Adolescent Reproductive & Sexual Health) పైన మరియు పోషణ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించడం.

    అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఈ పథకంను అమలు పరుస్తారు.


    ఉడాన్‌ పథకం (Udaan Scheme)

    మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో భాగంగా Central Board of Secondary Education (CBSE) వారు ఈ పథకంను నవంబర్‌ 14, 2014న ప్రారంభించారు.

    ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం సాంకేతిక, ఉన్నత మరియు ఇంజనీరింగ్‌ విద్య యందు బాలికల యొక్క సంఖ్య పెంచడం. ఇందులో భాగంగా బాలికలు IIT - JEE పరీక్షల యందు ప్రతిభ చూపెందుకు గాను Online Platform ద్వారా శిక్షణ అందిస్తున్నారు.

    కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయ పథకం (KGVB)

    KGVB పథకంను ఆగస్టు 2004న ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా గురుకుల విధానంలో Upper Primary Level నుండి ఇంటర్మీడియట్‌ వరకు విద్యను అందిస్తారు.

    పాఠశాల సౌకర్యాల లేమి ఉండే మరియు బాలికా విద్య విషయంలో వెనుకబడిన గిరిజన మరియు మారుమూల ప్రాంతాలను ప్రతి జిల్లా నందు గుర్తించి అక్కడ ప్రారంభిస్తారు.

    ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం బాలికా విద్యలో వెనుకబడి ఉన్నటువంటి SC, ST మరియు OBC బాలికలకు విద్యను అందించడం. ఇందుకోసం 75% సీట్లను SC, ST, OBC బాలికలకు మరియు 25% సీట్లను ఇతర పేదలకు కేటాయించారు.

    Working Womens Hostels Scheme (WWHS)

    ఈ పథకంను 1972-73వ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించారు.

    నూతన ప్రదేశాల యందు ఉద్యోగం చేసే మహిళలకు, తక్కువ ఖర్చుతో, రక్షణతో కూడిన నివాస సదుపాయంను అందించడం మరియు ఆయా మహిళలకు చంటి పిల్లలు ఉన్నట్లయితే వారికి Day - Care సౌకర్యం కల్పించడం.

    ఈ పథకంను NGO ల యొక్క సహకారంతో అమలుపరుస్తున్నారు. ఈ పథకం అమలు అయ్యేందుకు కావలసిన నిధులను కేంద్రం 60% ఇస్తుంది, ఆయా రాష్ట్రాలు 15% మరియు హాస్టల్‌ని నడిపూ సంస్థలు మిగతా 25% నిధులు వెచ్చించాలి.

    మెట్రో పాలిటన్‌ నగరాల యందు నెలకు 50,000/- కంటే తక్కువ జీతం మరియు ఇతర ప్రాంతాల యందు 35,000 కంటే తక్కువ వేతనం పొందుతున్న మహిళా ఉద్యోగులు Working Womens Hostels నందు నామమాత్రపు చెల్లింపుతో నివాసం ఉండవచ్చును.

    నయి రోషిణి

    2012-13 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించారు, ఈ పథకం క్రింద మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలలో నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తారు.

    ఉజ్జవాల పథకం

    ఈ పథకం యొక్క పూర్తి పేరు 'Ujjawala Scheme for Combating Trafficking'. ఈ పథకంను 2007వ సంవత్సరంలో ప్రారంభించారు.

    స్త్రీలు మరియు బాలికల యందు జరుగుతున్న మనష్యుల అక్రమ రవాణాను నివారించడం, నియంత్రించడం, భాదితులను కాపాడి వారికి పునరావాసం కల్పించే సమగ్ర పథకం ఇది.

    ఈ పథకం యొక్క లక్ష్యాలు

    1. వ్యాపారపరమైన లైంగికదోపిడీ కోసం మహిళలు మరియు బాలికల పట్ల జరుగుతున్న అక్రమ రవాణాను నివారించడం.

    2. అక్రమ రవాణాకు గురైన వారిని రక్షించి వారిని రక్షిత ప్రదేశాలలో ఉంచడం.

    3. కనీసం అవసరాలు కల్పిస్తూ వారిని పునారావాసంనకు గురి చేయడం.

    4. బాధితులను వారి యొక్క కుటుంబాలతో మరియు తోటి సమాజంతో అనుసంధానం చేయడం.

    స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో ఈ పథకంను అమలు చేస్తున్నారు.

    ఈ పథకంనకు అయ్యే ఖర్చును కేంద్రం 60%, రాష్ట్రాలు 30% మరియు ఆయా స్వచ్చంద సంస్థలు 10%ను భరిస్తారు.

    ఈ పథకం నందు గల అయిదు Components

    1. Prevention of Trafficking
    2. Rescue of Victims
    3. Rehabilitation of Victims
    4. Re - Integration of Victims
    5. Repatriation of Victims

    ఈ పథకం ద్వారా చేపడుతున్న ముఖ్య కార్యక్రమాలు

    1. Community Vigilance Groups ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు గురయ్యే అవకాశం ఉన్నవారిని కాపాడడం మరియు సమాజంలో అవగాహన కల్పించడం.
    2. దోపిడికి గురవుతున్న పరిస్థితుల నుండి బాధితులకు విముక్తి కల్పించడం
    3. నివాస సౌకర్యాలు, కనీస అవసరాలు, వైద్య సౌకర్యాలు, న్యాయ సహాయం, వృత్తి శిక్షణ అందిస్తూ బాధితులకు పునరావాసం కల్పించడం.
    4. బాధితులను సమాజంతో మమేకం చేయడం
    5. Shelter Home సదుపాయాలు కల్పించడం.

    ధనలక్ష్మి పథకం

    • మార్చి 3, 2008న ఈ పథకం ప్రారంభించారు.
    • ఇది 'Conditional cash transfer scheme' for Girl Child.
    • కుటుంబంలో బాలికా సంరక్షణ మరియు విద్యను నిర్లక్ష్యం చేయకుండా చూడడమే ఈ పథకం యొక్క లక్ష్యం.
    • ఫైలట్‌గా దేశవ్యాప్తంగా 11 బ్లాక్‌లలో ప్రారంభించారు.
    • తెలంగాణ నందు ఖమ్మం మరియు వరంగల్‌ జిల్లాలలో అమలు చేశారు.
    • ఏప్రిల్‌ 2018 నుండి ఈ పథకం అమలును నిలిపివేశారు.
    • ఈ పథకం క్రింద ప్రతీ బాలికకు 18,500/- లు అందించేవారు.
    • బాలికలు కుటుంబంనకు బారం కాదు, వారు కుటుంబం యొక్క అస్తి అనే విధంగా ప్రతి కుటుంబం యొక్క దృక్పథం మార్చడమే లక్ష్యంగా ఈ పథకం ప్రారంభించారు.

    మహిళా సంక్షేమం-గొడుగు పథకాలు

    మహిళా సంక్షేమ శాఖలో అమలు చేస్తున్న పథకాలు సమర్ధవంతంగా అమలు చేసేందుకుగాను 3 గొడుగు పథకాలను 2022లో రూపొందించారు. అవి...

    1. సాక్ష్యం అంగన్‌వాడి & మిషన్‌ పోషణ్‌ 2.0
    2. మిషన్‌ వాత్సల్య
    3. మిషన్‌ శక్తి

    పై గొడుకు పథకాలను 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి 2025-26 ఆర్థిక సంవత్సరం కాలంలో అమలు చేస్తారు.

    సాక్ష్యం అంగన్‌వాడి & మిషన్‌ పోషణ్‌ 2.0

    దీని యందు ఐసిడిఎస్‌ సేవలు, పూర్వ పాఠశాల విద్య మరియు సంరక్షణ, కౌమార బాలికలకు పోషణ సేవలకు సంబంధించిన పథకాలు అమలు చేస్తున్నారు. కావున ఐసిడిఎస్‌, పోషణ అభయాన్‌, కౌమార బాలికల పథకం, నేషనల్‌ క్రెష్‌ పథకం ఇందులో బాగంగా కలవు. 2023-24 బడ్జెట్‌లో కేంద్రం 20,554 కోట్లు కేటాయించింది.

    మిషన్‌ వాత్సల్య

    శిశు సంరక్షణ సేవల పథకంనే 2022 నుండి మిషన్‌ వాత్సల్య గొడుగు పథకంగా అమలు చేస్తున్నారు. 2023-24 బడ్జెట్‌లో కేంద్రం 1,472 కోట్లు కేటాయించింది.

    మిషన్‌ శక్తి

    దీని యందు సంబల్‌ మరియు సమర్థ్య అనే ఉప పథకాలు కలవు. సంబల్‌ నందు భాగంగా సఖి కేంద్రాలు, మహిళా పోలీస్‌ వాలంటీర్లు, బేటీ బచావో-బేటీ పడావో మరియు నారీ అదాలత్‌ పథకాలు కలవు. మహిళల రక్షణ మరియు భద్రత సంబల్‌ యొక్క ముఖ్య ఉద్ధేశ్యం. మహిళల సాధికారత ముఖ్య లక్ష్యంగా సమర్థ్యను అమలు చేస్తున్నారు, ఇందులో భాగంగా ఉజ్జవాల, స్వదార్‌, ప్రధానమంత్రి మాతృ వందన యోజన, పాలన ఘర్‌ (ఆలనా కేంద్రాలు), జెండర్‌ బడ్జెటింగ్‌ లాంటి పథకాలు కలవు. 2023-24 బడ్జెట్‌లో కేంద్రం 3,144 కోట్లు కేటాయించింది.

    ఇతర పథకాలు 

    • National Programme for Education of Girls at Elementary Level (NPEGEL) ని 2003 లో ప్రారంభించారు.
    • ప్రధానమంత్రి విద్యా లక్ష్మి యోజన అనే పథకంను ఆగస్టు 15, 2015న ప్రారంభించారు. దీని ద్వారా ఒక ఆన్‌లైన్‌ పోర్టల్‌ని ప్రారంభించారు. విద్యా లక్ష్మి అనే ఈ యొక్క ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా బాలికలు స్కాలర్‌షిప్‌లు మరియు విద్యాపరమైన బుణాలు పొందవచ్చును.
    • జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమీషన్‌ వారు “బాల బందు” అనే పథకం ద్వారా అశాంతి రగిలిన ప్రాంతాలలో గల బాలలను సంరక్షిస్తున్నారు.
    • Women Component అనే విధానంను 9వ పంచవర్ష ప్రణాళికా కాలం నుండి అమలు పరుస్తున్నారు.
    • 2008లో ప్రారంభించిన ధనలక్ష్మి పథకం యొక్క ముఖ్య లక్ష్యం బాలికను కుటుంబం యొక్క సంపదగా తీర్చిదిద్దడం.
    • 1997వ సంవత్సరంలో National Childrens Fund ఏర్పాటు చేశారు. మరియు National Charter of Children ని 2003లో రూపొందించారు.
    • 1984వ సంవత్సరంలో కుటుంబ మంత్రణ కేంద్రాలు 'Family Counselling Centers' ని ప్రారంభించారు.
    • 2005వ సంవత్సరంలో 'Scheme for Welfare of Working Children' ని ప్రారంభించారు.
    • పాఠశాలల యందు మధ్యాహ్నా భోజన పథకంను ఆగస్టు 15, 1995న ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పథకంను ప్రధానమంత్రి పోషణ్‌ శక్తినిర్మాణ్‌ లేదా పి.ఎం. పోషణ అని పిలుస్తున్నారు మరియు ఈ పథకాన్ని 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు అమలుపరచనున్నారు.
    • గంగానది మైదాన ప్రాంతాలలో (UP, Bihar) నివసిస్తున్న మహిళల యొక్క జీవనోపాధులు మరియు సాధికారత కోసం 2011లో ఫైలట్‌ పథకంగా “ప్రియదర్శిని” పథకం ప్రారంభించారు.
    • Development of Women and Children in Rural Areas (DWCRA) ని 1982 ప్రారంభించారు. తరువాత ఈ పథకంను SJGSY తో కలిపివేశారు, SJGSY స్థానంలో ప్రస్తుతం NRLM ని తీసుకువచ్చారు.
    • సెప్టెంబర్‌ 8, 2009న సాక్షరా భారత్‌ పథకంను ప్రారంభించారు, దీని యొక్క ముఖ్య లక్ష్యం వయోజన మహిళలల్లో అక్షరాస్యతను పెంచడం.
    • నవంబర్‌ 14, 2014న స్వచ్చ ఖారత్‌ నందు భాగంగా “బాల స్వచ్భతో మిషన్‌ ప్రారంభించి పాఠశాల బాలల యందు స్వచ్చతపై అవగాహన పెంపొందించారు.
    • జూన్‌ 16, 2016న 'విద్యాంజలి అనే పథకంను ప్రారంభించి, బాలికలలో మానసిక వికాసం కోసం సేవలు అందిస్తున్నారు.
    • UNICEF వారి సహకారంతో బాలికా సంరక్షణ పథకాల అమలుతీరును పర్యవేక్షించేందులకై 'Digital Gender Atlas' ని తయారు చేశారు.
    • గోవా ప్రభుత్వ లాడ్లీలక్ష్మి అనే పథకం క్రింద 18 సంవత్సరాలు దాటిన బాలికకు వివాహం సందర్భంగా లక్ష్మ రూపాయలు అందిస్తున్నారు.

    పునశ్చరణ



Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


No comments:

Post a Comment

Post Bottom Ad