1.8 మతం - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Saturday, July 8, 2023

1.8 మతం

1.8 మతం


    మతం అనేది నేడు వ్యక్తిగత స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు సమాజంలో ప్రభావాన్ని చూపెడుతున్నది ఆయా ప్రభావాలు మనుషుల మధ్య కొన్ని సందర్భాలలో పరస్పర ఆధారితను మరియు నైతికతను పెంపొందిస్తుండగా మరికొన్ని సందర్భాలలో మూఢనమ్మకాలు మరియు మత సంఘర్షణల రూపంలో రుణాత్మక ప్రభావాన్ని కూడా చూపెడుతున్నాయి, అందుకే కాబోలు కారల్ మార్క్స్ మహాశయుడు మతాన్ని సమాజానికి మత్తుమందు లాంటిదని మరియు ఉపశమన కారిణి అనికూడా సంభోదించాడు. మతం అనే అంశానికి సంబంధించిన ప్రాథమిక భావనలు, నిర్వచనాలు సమాజంపై మతం యొక్క ప్రభావం, మత ఆవిర్భావ సిద్ధాంతాలు, భారతదేశం నందుగల వివిధ మతరూపాలు మరియు మతపరమైన జనాభా వివరాలను ఈ పాఠ్యాంశం నందు పొందుపర్చడం జరిగింది.


    మతం యొక్క పురాతన రూపాలు


    ఆదిమ మానవుడు వానలు కురియడం, జననం, మరణం లాంటి సంఘటనలకి కారణాలు తెలియక అతౌకిక శక్తులు కారణం అని భావించి వాటిపట్ల తన యొక్క భావాలని 4 రూపాలలో వ్యక్తపరిచాడు.

    1. మతం

    2. ఇంద్రజాలం

    3. టోమ్ వాదం

    4. టాబూలు (నిషేదాలు)

    మానవులు అతేంద్రియ శక్తుల్ని పూజించి, ఆరాధించి మంచి నడవడికతో తమవైపుకు తిప్పుకోవాలని భావిస్తే మతం అని వాటిని బలప్రయోగం ద్వారా లోబర్చుకోవాలని ప్రయత్నిస్తే అది ఇంద్రజాలం.

    ప్రతీ మతంలోనూ మానవాతీత శక్తుల అంశాలు, విశ్వాసాలు & సంస్కారాల రూపంలో ప్రకటితమవుతాయి.

    మతపరమైన సంకేతాలను వ్యక్తం చేసే చర్యలనే మత సంస్కారాలు అంటారు.

    ఆదిమ మానవుని యొక్క అలౌకిక సంస్కారాలను నిర్వహించడానికి 4 రకాల వ్యక్తులు ఉండేవారు.

    1. ఆటవిక మాంత్రికుడు లేదా షామాన్

    2. ఇంద్రజాలికుడు

    3. అసాధారణ శక్తులు కల్గిన వ్యక్తి

    4. పురోహితుడు


    ఇంద్రజాలం (Magic)


    మంత్ర తంత్రాల ద్వారా మానవ అతీత శక్తుల్ని లొంగదీసుకోవచ్చనే విశ్వాసంతో కూడిన ఆచరణలనే ఇంద్రజాలం అంటారు. ఈ విధానంలో మానవాతీత శక్తులతో పాటు భౌతిక శక్తుల్ని కూడా లొంగ దీసుకోవచ్చు అనే విశ్వాసం కలదు.

    సర్ జేమ్స్ ఫ్రేజర్ అనే మానవశాస్త్రవేత్త 'ది గోల్డెన్ బౌ' అనే పుస్తకంలో

    1. అనుకరణ ఇంద్రజాలం

    2. సాంక్రమిక ఇంద్రజాలంగా పేర్కొన్నాడు.


    అనుకరణ ఇంద్రజాలం


    ఉదా 1: కొండ నుండి బండలను దొర్లించడం వల్ల ఆ ధ్వనికి మేఘాలు వర్షిస్తాయని నమ్మడం.

    ఉదా 2: జంతువులను బలిచ్చినప్పుడు రక్తం కురిసినట్టుగానే వర్షం కురుస్తుందనే నమ్మకం.


    సాంక్రమిక ఇంద్రజాలం


    • శరీరం నుండి విడిపోయిన భాగాలకి హాని కల్గిస్తే ఆ శరీరంనకు కూడా హాని కల్గుతుందనే సూత్రం ఆధారంగా పని చేస్తుంది. ఉదా: రాలిన వెంట్రుకలకి, వ్రేలి గోళ్ళకి ఇంద్రజాలం చేయడం.
    • మంచికోసం ఉపయోగించే ఇంద్రజాలాన్ని White Magic (తెలుపు ఇంద్రజాలం) అంటారు. ఉదా: వ్యాధులను అరికట్టడం, యుద్ధంలో గెలవడం కోసం చేసేది.
    • చెడును కలిగించే ఇంద్రజాలాన్ని నలుపు ఇంద్రజాలం అంటారు. (Black Magic) ఉదా: ఇది చేతబడి, బాణామతి, మంత్రవిద్య అనే రూపాలలో ఉంటుందనే విశ్వాసం కలదు.


    Taboos (నిషేధాలు):


    • Taboo అనునది పాలినేషియా పదం, దీని యొక్క అర్థం నిషిద్ధం. ఉదా: హిందువులు ఆవును చంపరాదు, ఇస్లాం & ఇతర మతాలు పందిని అసహ్యించుకోవడం మరియు ఉల్లి నిషేదించడం లాంటివి.
    • ఒక సమాజంలో ప్రమాణాలకు కట్టుబడి ఉండేందకు ఆ సమాజంలోని వ్యక్తులు పాటించేవే Taboo లు, Taboo అనునది అలిఖిత చట్టంగా ఆచరించబడుతుంది. దీనిని అతిక్రమిస్తే శిక్షలు ఉండవు కానీ చెడు జరుగుతుందనే విశ్వాసం ఉంటుంది.


    మతం యొక్క నిర్వచనం


    • మతం అంటే ఏకీకృతమైన నమ్మకాలని సమూహంగా పాటించడం అని ఎమైలీడర్టైమ్ తన గ్రంథం 'The Elementary Forms of the Relegious Life' లో పేర్కొన్నాడు.
    • ప్రకృతిలో గల అతీతశక్తుల పట్ట మనుషులు ఉమ్మడిగా చూపే వైఖరిని మతం అంటారని అగ్బర్న్ తెలిపాడు.
    • మనిషికి, మనిషికి & మనిషికి, ఉన్నత శక్తులకి మధ్యగల సంబంధాన్ని మతం అని మెకైవర్ & ఫేజ్లు తెలిపారు. కావున మనిషి జైవిక, సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జంతువు.


    మతం - పరిణామం


    మానవ సమాజంలో మతం అనేది సమాజంతో పాటే పరిమాణంకు గురవుతూ వస్తున్నది. మొదటగా ఆత్మల ఆరాధన, ప్రకృతి ఆరాధన, పితృదేవత ఆరాధన, బహుదేవత ఆరాధన, ఏకదేవతారాధన దశకు చేరుకున్నది. ఆధునిక మతాలన్ని ఏకదేవతారాధనకు సంబంధించినవే. పురాతన మతాల్లో నిర్గునో పాసనా మరియు సద్గునోపాసనా మరియు విగ్రహారాధన అనునవి కన్పిస్తాయి. ఆధునిక మతాలు నిర్గుణోపాసనను కల్గి ఉంటాయి.


    నోట్: దేవుడికి రూపాన్ని ఇచ్చి పూజించే విధానాన్ని సద్గుణోపాసన అంటారు. దేవుడికి రూపం లేదని నమ్మే విశ్వాసాన్నే నిర్గుణోపాసన అంటారు.


    మతం నందు గల మౌళిక అంశాలు


    1. అతీత శక్తులపై నమ్మకం. ఉదా: బహుదేవతారాధన, ఏకదేవతారాధన, విగ్రహారాధన లాంటి శక్తులు

    2. పాపం, పుణ్యం, ధర్మం, మోక్షం లాంటి దృక్పథాలు

    3. అతీత శక్తులతో మానవుని యొక్క సమయోజనం

    4. క్రతువులు, ఉత్సవాలు

    5. సిద్ధాంతాలు, తత్వాలు, ఆలోచనా విధానాలు మరియు జీవన విధాన మార్గదర్శకాలు.

    6. పవిత్ర గ్రంథాలు, పవిత్ర స్థలాలు, మత గురువులు

    7. మత గుర్తులు, వేషధారణలు, పండుగలు


    మతం ప్రకార్యాలు (Functions of Religion)


    1. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక జీవనాన్ని అందిస్తుంది.

    2. సామాజిక నియంత్రణలో అనియత సాధనంగా పనిచేస్తుంది.

    3. వినోదం, సామాజీకరణం & సంస్కృతి ప్రసరణ సాధనంగా పనిచేస్తుంది.

    4. సామాజిక సమైక్యతకు, సాంస్కృతిక సమైక్యతను తోడ్పడుతుంది.

    5. సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకి సామాజిక రక్షణని & సామాజిక భద్రతని కల్పిస్తుంది.

    6. కళలు, కట్టడాలు, సంస్కృతి ప్రసరణం మరియు ఇతర లలిత కళల అభివృద్ధికి దోహదపడుతుంది.


    మతం-వికార్యాలు (Dysfunctions of Religion)


    • సామాజిక పరివర్తనకు పెద్ద ఆటంకం.
    • మత ప్రకర్శనలు/మత సంఘర్షణలు/ మత తత్వం లకు దారితీస్తున్నది.
    • జాతీయ సమగ్రతకి ఆటంకం ఏర్పరుస్తుంది.
    • మతం తన వెంటే మూఢనమ్మకాలని, మూఢాచారాలని, సాంఘిక దురాచారాలని తీసుకొని వచ్చింది.
    • మత సంబంధిత టెర్రరిజం పెచ్చురిల్లుతున్నది.
    • సామాజిక అసమానతలు & దురాచారాలు మత ఆచరణలో భాగంగా ఉన్నవి.
    • కొన్ని మతాలలో స్త్రీ, పురుష అసమానతలు మరియు సామాజిక అసమానతలు మరియు కొన్ని వర్గాల ఆధ్యాత్మిక ఆధిపత్యం స్పష్టంగా కలవు.


    మత ఆవిర్భావ సిద్ధాంతాలు (Theories of Origin of Religion)


    సమాజశాస్త్ర వేత్తలు మతం యొక్క పుట్టుక మరియు పరిణామం గురించి తమ విశ్వాసాలను, సిద్ధాంతాల రూపంలో తెలియజేశారు. అవి...


    సర్వాత్మావాదం (యానిమిజం)

    • ఈ వాదాన్ని టేలర్ పేర్కొన్నాడు.
    • ఈ వాదం ప్రకారం, ఆత్మలను పూజించడం తోటే మతం ఆరంభమైనది.
    • శారీరక ఆత్మ, స్వేచ్ఛగా సంచరించే ఆత్మ ఉంటుందనే భావన కలదు.
    • మనిషి విగతుడైనప్పుడు ఆత్మ అక్కడే ఉంటుందని అలాంటి పూర్వికుల ఆత్మను పూజిస్తే ఫలం దక్కుతుందని భావించి ఆత్మలకి రూపం ఇచ్చి పితృదేవతలని చేయడం జరిగింది.


    జీవాత్మవాదం (అనిమాటిజం)


    • దీనిని ఫ్రాయిస్ & ముల్లర్లు ప్రతిపాదించారు.
    • ఈ వాదంలో భాగంగా ఆర్.ఆర్. మారెట్ మానాయిజంను అభివృద్ధి పరిచాడు.
    • ఈ వాదం ప్రకారం, రూపం లేనటువంటి, కొందరు వ్యక్తులలో మాత్రమే దాగి ఉన్నటువంటి అతీత శక్తుల్ని నమ్మడమే మానాయిజం.
    • మలనేషియన్లు ఈ అతీత శక్తులని మన అని పిలిచేవారు.
    • అతీత శక్తులనే హెూ జాతి వారు 'బోంగా'గా పిలిచేవారు.


    ప్రకృతి ఆరాధన (నాచురలిజం)


    • Max Muller ప్రతిపాదించాడు.
    • ప్రకృతి అంటే భయం, భక్తి, గౌరవం వల్ల సూర్యదేవతారాధన, నదుల ఆరాధన లాంటివి ప్రారంభమైనవని తెలిపారు.


    ఏకదేవతారాధన (మోనోటిజం)

    • లాంగ్ మరియు సెడ్మన్లు ప్రతిపాదించారు.
    • సృష్టి మొత్తం ఒకే దేవుడి నుండి జరిగిందని, దానితోనే మతం ప్రారంభమైనదని తెలిపారు.
    • వీరి వాదన ప్రకారం బహుదేవతారాధన కంటే కూడా ఏక దేవతారాధన ప్రాచీనమైనది.


    ప్రకార్య వాదం (ఫంక్షనలిజం)


    • దీనిని రాడ్క్లిఫ్ బ్రౌన్ & మలినౌస్కి ప్రతిపాదించారు.
    • భయం, వ్యాకులతలను తొలగించి మనోనిశ్చలతని కలిగించే సాధనమే మతం అని వీరి అభిప్రాయం.
    • ఇలా మనిషి పట్ల & సమాజం పట్ల మతం నిర్వహిస్తున్న ప్రకార్యాల వల్లనే మనుష్యులు ఏదో ఒక మతాన్ని పాటిస్తున్నారని అభిప్రాయపడ్డారు.


    ఫిటిషిజం

    • Fittish అనగా మహత్యం అని అర్థం.
    • ఇది పోర్చుగీసు పదం. ఈ పదాన్ని చార్లెస్ డిబ్రూస్ అనునతడు తన గ్రంథం 'దూకల్ట్ దీస్ డై మైక్రో ఫిటిషిన్' లో తెలిపాడు.
    • భారతదేశంలో Fittishism గురించి 'ఫ్రెజ్లర్' తన Premitive Relegions in India అనే గ్రంథంలో తెలిపాడు.
              ఉదా: 1. కత్తికి అతీత శక్తులున్నాయని నమ్మడం. ఉదా: మహారాష్ట్రలోని ఖండోబా దేవాలయం.
                          2. కిరీటానికి అతీత శక్తులున్నాయని నమ్మడం వాటినే దేవుడిగా పూజించడం.


    .
    భారతదేశం నందు గల మత రూపాలు

    భారతదేశాన్ని మతాల ప్రయోగశాల అని పరిగణిస్తారు. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉద్భవించనన్ని మతాలు భారతీయ సమాజంలో ఉద్భవించినవి. భారతదేశంలో నున్న 
    ప్రధాన మతరూపాలు

    1. చార్వాకులు 
    2. అజీవకులు
    3. హిందువులు
    4. బౌద్ధులు
    5. జీనులు
    6. ఇస్లాం
    7. క్రైస్తవం
    8. జొరాస్ట్రియనిజం
    9. సిక్కులు
    10. అంబేద్కర్ స్థాపించిన నవ్యబౌద్ధమతం

    చార్వాకులు

    • హిందూమతాన్ని విమర్షించిన ప్రథమ తాత్విక విప్లవకారులు.
    • బృహస్పతి ఈ వాదాన్ని స్థాపించాడు, చార్వాకుడు ప్రచారంలోకి తీసుకువచ్చాడు.
    • భారతదేశం సమాజం నందు గల మొదటి నాస్థిక వాదులు.
    • వీరినే లోకాయుతులు అని కూడా అంటారు.
    • చారు అనగా అందమైన, వాక్కు అనగా మాట కావున చార్వాకులు అనగా అందమైన మాటలు మాట్లాడేవారు.
    • వీరి యొక్క తత్త్వ విధానం జైన, బౌద్ధమతాలకి కావలసిన తాత్విక పునాదులను ఏర్పాటు చేశారు.
    • వీరు శాస్త్రీయ దృక్పథానికి, భౌతిక వాదానికి ఆధ్యులు.

    అజీవకులు

    • పురాణ కష్యపుడు ఈ వాదకర్త అనే అభిప్రాయం కలదు.
    • ఇతని శిష్యుడు గోసలిపుత్ర ఈ వాదాన్ని ప్రచారం చేశాడు.
    • వీరిది సన్యాస జీవనం, మధ్యపానం, దిమ్మరి జీవనం లాంటి లక్షణాలను కలిగి ఉంటారు.
    • అజిత కౌశ కంబలి, కాత్సాయణ అనువారు ఈ మతానికి చెందిన ఇతర ప్రముఖులు.
    • వీరు అనాగరిక జీవన విధానాన్ని కలిగి ఉంటారు.

    హిందూమతం


    ప్రస్తుతం ఆచరిస్తున్న మతాలలో అత్యంత పురాతనమైన మతం, దీనినే సనాతన ధర్మం అని కూడా అంటారు. అన్ని మతాలలో కెల్లా అత్యంత వైవిధ్యమైన విశ్వాసాలు, సంస్కారాలు, కర్మకాండలు, పూజా విధానాలు కల్గి యున్నది. ఈ మత స్థాపకుడు ఎవరనేది చెప్పలేము, వేదాలే మూలం.

    బహుదేవతారాధన, విగ్రహారాధన, వైవిధ్యమైన విశ్వాసాలు, మత శాఖలు, యజ్ఞ యాగాదులు, పునర్జన్మలపై నమ్మకం, ఆత్మభావన, కర్మఫలం, పంచమహా యజ్ఞాలు, అరిషడ్ వర్గాలు, త్రిగుణాలు, వర్ణాశ్రమ ధర్మాలు లాంటి సంస్కారాలతో కూడినదే హిందూ మతం

    • ఇది వివిధ జీవన పద్ధతుల సమ్మేళనం, విలీనత్వాన్ని చేసుకునే లక్షణంను కల్గి ఉంది.
    • సంగీత, నాట్యం, సంస్కృతులు, సాహిత్యం, పండుగలు లాంటి రూపాలలో ఆచరించబడుతుంది.
    • హిందూ మతానికి మూలం వేద సాహిత్యం.


    వేద సాహిత్యం: ఇవి అత్యంత పురాతనమైన మతగ్రంథాలు మరియు లిఖిత రూపకంలో ఉన్న అత్యంత పురాతన గ్రంథాలు. అవి... 4 వేదాలు.

    4 వేదాలు: 1. ఋగ్వేదం 2. యజుర్వేదం 3. సామవేదం 4. అధర్వణ వేదం

    • యజ్ఞయాగాదుల గురించి తెలిపేటువంటి బ్రాహ్మణులు.
    • వేదాల సారాన్ని వివరించేటటువంటి, మత సమానత్వాన్ని & సామాజిక సమానత్వాన్ని అంగీకరించినవి 108 ఉపనిషత్తులు.
    • అరణ్యాలలో జీవించే మునులు & వానప్రస్థాశ్రమాన్ని గురించి తెలిపేవి అరణ్యకాలు.

    వేదములకు అంగాలుగా పిలువబడే 6 వేదాంగాలు

    1. పాణిని యొక్క శబ్ద శాస్త్రము (శిక్ష)
    2. యాస్కుడు రచించిన నిరుక్త
    3. పాణిని యొక్క వ్యాకరణం
    4. పింగళుని యొక్క ఛందస్సు
    5. గార్థుని యొక్క జ్యోతిష్యం
    6. అశ్వాళాయనుడి యొక్క కల్పము

    4 రకాల ఉపవేదాలు

    1. ఋగ్వేదం నుండి ఆవిర్భవించి ఆయుశ్శుకు సంబంధించిన విషయాలను తెలిపే ఆయుర్వేదము.
    2. సామవేదము నుండి ఉద్భవించి సంగీతం గురించి తెలిపే గాంధర్వ వేదము.
    3. రము నుండి ఉద్భవించి విలువిద్యకు సంబంధించిన అంశాలను తెలిపే ధనుర్వేదము
    4. అధర్వణ వేదము నుండి ఉద్భవించి శిల్ప విద్యను బోధించే శిల్ప వేదము

    ధర్మ సూత్రాల యందు ముఖ్యమైనవి.

    1. న్యాయ సూత్ర : ధర్మ సూత్రాలను తెలుపుతాయి
    2. సులువ సూత్ర : హెూమగుండాల నిర్మాణాన్ని తెలుపుతాయి.
    3. గృహ సూత్ర : గృహము నందు నిర్వహించవలసిన కార్యాలను తెలుపుతాయి.
    4. శ్రాత సూత్ర రాజులు చేయవలసిన యాగాలను తెలుపుతాయి.


    ఇతిహాసాలు - ఇతిహాసం అనగా ఇలా జరిగిందని అర్థం. ఇవి 2 కలవు. 1. రామాయణం 2. మహాభారతం. రామాయణంను వాల్మీకి సంస్కృత భాషలో రాశారు. దీనినే ఆదికావ్యం అనికూడా అంటారు. దీని యందు 7 కాండలు, 24,000 శ్లోకాలు కలవు. మహాభారతాన్ని పంచమవేదం, జయసంహిత, శత సహస్ర సంహిత అని కూడా పిలుస్తారు. దీనియందు 18 పర్వాలు కలవు.


    6 తత్వ సిద్ధాంతాలు కలవు.

    1. నాస్తిక వాదాన్ని తెలిపే కపిలుని యొక్క సాంఖ్య
    2. భౌతిక శాస్త్రానికి పునాది వంటిది కణాథుడు రాసిన వైశేషిత
    3. పతంజలి - యోగ
    4. గౌతముని యొక్క న్యాయం
    5. జైమిని రాసిన పూర్వమీమాంస
    6. బాదరాయణుడు రాసిన ఉత్తర మీమాంస

    రాజుల వంశాలని తెలిపేవి 18 పురాణాలు మరియు 18 అధ్యాయాలతో కూడిన భగవద్గీత (ఇది మహాభారతంలో భాగం) కలదు.

    హిందూ సామాజిక వ్యవస్థలోని ముఖ్యాంశాలు

    1. చతుర్విధ పురుషార్థాలు
    2. వర్ణ వ్యవస్థ
    3. వర్ణాశ్రమ ధర్మాలు
    4. గుణకర్మలు
    5. పంచమహా యజ్ఞాలు

    1. చతుర్విధ పురుషార్థాలు : ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్ధాలంటారు. వీటిని సాధించిన వారే పరిపూర్ణత చెందుతారు. వీటిలో అర్థ మరియు కామాలను ధర్మబద్ధంగా తీర్చుకున్నప్పుడు మోక్షాన్ని పొందుతారు. వీటిలో మోక్షం అత్యుత్తమమైన పురుషార్ధం.

    2. చాతుర్వర్ణ వ్యవస్థః : ఋగ్వేదంలోని 10వ కాండం అయిన పురుష సూక్తం నందు తెలుపబడింది. పురుష సూక్తం ఆధారంగా దైవం నుండి వర్ణాలు ఏర్పడినివని తెలిపేదే దైవ సిద్ధాంతం, దీని ప్రకారం దేవుడి తల నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు మరియు పాదాల నుండి శూద్రులు ఉద్భవించారు. ఈ నాలుగు వర్ణాలనే కలిపి చాతుర్వర్ణ వ్యవస్థ అంటారు. త్రి గుణాలను అనుసరించి వర్ణవ్యవస్థ ఏర్పడినదని తెలిపేవి భగవద్గీత యొక్క త్రిగుణ సిద్ధాంతం, పూర్వజన్మ కర్మలను అనుసరించి వర్ణం సిద్ధిస్తుందని తెలిపే మనుస్మృతి యొక్క కర్మ సిద్ధాంతం, ఆర్యుల వల్లనే వర్ణం ఏర్పడిందని తెలిపే రిస్లే యొక్క ఆర్య సిద్ధాంతం లాంటివి కూడా వర్ణవ్యవస్థ పుట్టుకను తెలిపినవి.

    3. వర్ణాశ్రమ ధర్మాలు: హిందూ సామాజిక వ్యవస్థలో ప్రతి వ్యక్తి తన జీవితంలో 4 దశలను పాటించాలి. వాటిని వర్ణాశ్రమ ధర్మాలు అంటారు. అవి..

    1.బ్రహ్మచర్యం : మనువు ప్రకారం పుట్టుకతో అందరూ శూద్రులే అనగా ఏకజలే విద్యను అభ్యసించిన తర్వాత మరో జన్మను తీసుకున్నట్లుగా భావించేవారు. అనగా విద్య ద్వారా ద్విజులుగా మారే అవకాశం కలదు. పుట్టుకతో శూద్రులుగా ఉన్న అన్ని వర్ణాలకు చెందిన వ్యక్తులు వారు అభ్యసించిన వ్యక్తుల ఆధారంగా వర్ణ వ్యవస్థలోని వర్గాలకు చెందుతారు. అనగా విద్యను అభ్యసిస్తే బ్రాహ్మణులుగా, యుద్ధ విద్యలను అభ్యసిస్తే క్షత్రియులుగా, వ్యవసాయం మరియు వాణిజ్యాన్ని అభ్యసిస్తే వైశ్యులుగా మరియు విద్యను అభ్యసించనట్లయితే శారీరక శ్రమను నమ్ముకునే శూద్రులుగా మారే అవకాశం కలదు. కావున ప్రతి వ్యక్తి తన విద్యారంభం నుండి విద్యను పూర్తి చేసుకొనేంత వరకు ఉన్నటువంటి దశనే బ్రహ్మచర్యం అంటారు. అయితే విద్యావకాశాలు అన్ని వర్ణాల వారికి లేకుండా కేవలం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యు లకే పరిమితం చేయడం జరిగింది. విద్యారాంభాన్ని ఉపనయనం అనే సంస్కారంతో ప్రారంభిస్తారు. బ్రాహ్మణులకు 8వ ఏటా, క్షత్రియులకు 10వ ఏటా, వైశ్యులకు 12వ ఏటా ఉపనయనం చేపించేవారు. ఈ సమయంలో విద్యా, క్రమశిక్షణ, శీలం అనునవి ముఖ్యాంశాలు.

    2. గృహస్థాశ్రమం : విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత బ్రహ్మచర్యం ముగుస్తుంది, బ్రహ్మచర్య దశ తర్వాత వివాహం చేసుకోవడంతో గృహస్థాశ్రమం ప్రారంభమవుతుంది. ఈ దశలో వివాహం కుటుంబ స్థాపనను గావించి చతుర్విద పురుషార్ధాలను అనుసరించాలి మరియు పంచమహాయజ్ఞాలను నిర్వహించాలి.

    పంచమహాయజ్ఞాలు: 1. దైవయజ్ఞం 2. ఋషి యజ్ఞం 3. పితృ యజ్ఞం 4. నరయజ్ఞం 5. భూత యజ్ఞం

    3. వానప్రస్థాశ్రయం : గృహస్థాశ్రమం చివరిదశలో అనగా వృద్ధాప్యం ప్రారంభమైన తర్వాత కుటుంబ జీవనాన్ని వదిలి అడవులకు వెళ్ళి సామాజిక సంబంధాలకు దూరంగా ఆధ్యాత్మిక జీవనాన్ని గడపాలి.

    4. సన్యాసాశ్రమం : ఇది జీవితంలో చివరి దశ, ఈ దశలో సర్వసంగ పరిత్యాగాన్ని చేసి దేశాటనం చేస్తూ సమాజ సంక్షేమం కోసం పాటుపడుతు భిక్షాటనతో జీవించాలి.

    4. గుణకర్మలు: భగవద్గీత, ఇతిహాసాలు మరియు పురాణాల ప్రకారం వర్ణవ్యవస్థ గుణకర్మల ఆధారంగా ఏర్పడింది. ప్రపంచంలోని కర్మ అంత గుణాల కలయిక వల్లనే ఏర్పడింది. గుణాలు 3 రకాలు అవి...

    1. సత్వ గుణం: సమాజ శ్రేయస్సు కోసం నిస్వార్ధంగా జీవిస్తూ ఎవరికి హానికల్గించకుండా పవిత్రంగా ఉంటూ యజ్ఞ యాగాదులు చేసుకోవడం లాంటి వాటితో కూడుకున్నది.

    2. రజోగుణం: ప్రేరేపించే మనస్తత్వం, నాయకత్వం వహించే మనస్తత్వం, కర్మాచరణలకు పాల్పడటం లాంటి వాటితో కూడుకొని ఉంటుంది.

    3. తమో గుణం: నిర్లక్ష్యం, సోమరితనంతో మరియు అవిద్యతతో కూడుకొని ఉంటుంది.

    సత్వగుణం ప్రధానంగా ఉన్నటువంటి వారిని బ్రాహ్మణులుగా, సత్వ మరియు రజోగుణం కలగలిపి ఉన్న వారిని క్షత్రియులుగా, రజో మరియు తమో గుణం కలగలిపి ఉన్నవారిని వైశ్యులుగా, కేవలం తమో గుణం ఉన్నవారిని శూద్రులుగా పరిగణిస్తారు, అంతేకాని ఈ సిద్ధాంతం ప్రకారం పుట్టుకతో ఎవరిని ఏ వర్ణం వారని చెప్పడం కుదరదు.

    • అధర్వణ వేదం ప్రకారం కూడా వ్యక్తి యొక్క వర్ణం అతన్ని గుణాన్ని బట్టి ఆపాదించబడుతుంది.
    • ఉపనిషత్తులు మొదటిసారి కర్మలను గూర్చి తెలిపినవి. శారీరకంగా, మానసికంగా మరియు మౌఖికంగా చేసేవే కర్మలు, ధర్మం ప్రకారం కర్మలు చేయాలి.
    • యజ్ఞవల్యుని ప్రకారం కర్మలు 1. మంచి కర్మలు
                                                                  2. చెడు కర్మలు

    మనువు ప్రకారం కర్మలు

    1. పవిత్ర కర్మలు
    2. అపవిత్ర కర్మలు
    3. సాత్విక కర్మలు
    4. రాజసిక కర్మలు కలవు

    హిందూమతంలో కనబడే ప్రధానమైన లోపాలు

    • అసమానతలతో కూడిన వర్ణవ్యవస్థ మరియు కులవ్యవస్థ.
    • స్త్రీలకి రెండోస్థానం మరియు పురుషాధిక్యత.
    • బ్రాహ్మణాధిపత్యం.
    • కఠినమైన కర్మకాండలు, పూజావిధానాలు.
    • పశుపోషణకి & వ్యవసాయానికి ఆటంకంగా మారిన యజ్ఞయాగాదులు.


    జైనమతం

    జిన అనే పదం నుండి వచ్చింది, జిన అనగా జయించిన వాడు అని అర్ధం, జైనమతం అంటే జయించిన మతం అని అర్థం.

    జైనం పుట్టుకకు తోడ్పడిన కారణాలు:

    • ఉపనిషత్తుల తత్వం
    • తీవ్రమైన బ్రాహ్మణాధిపత్యం
    • వర్ణవ్యవస్థలో గల లోపాలు
    • కఠినమైన యజ్ఞ యాగాలు
    • సముద్రంపై నిషేధం విధించడం
    • వైశ్యుల తోడ్పాడు

    ♦️ జైనమత గురువులను తీర్థంకరులు అంటారు. తీర్థంకరులు అనగా జీవితం అనే అగాధంను దాటడానికి వారధి కట్టినవారు అని అర్థం.

    ♦️ సాధు స్థాయి, ఉపాధ్యాయస్థాయి, అర్హత స్థాయి దాటిన వారిని తీర్థంకరులు లేదా అరిహంతులు లేదా జీనులు అని అంటారు.

    ♦️ మొత్తం 24 తీర్థంకరులలో 1వ వాడు - వృషభనాదుడు, 23వ వాడు - పార్శ్వనాధుడు మరియు 24వ వాడు - మహావీరుడు. ఋగ్వేదం నారాయణుని యొక్క అవతారమే వృషభనాధుడు అని పేర్కొంది.

    ♦️ పార్శ్వనాధుడు: ఇతడు కాశీరాజైన అశ్వసేన మరియు రమల యొక్క పుత్రుడు. ఇతడు 4 సూత్రాలను తెలిపాడు. అవి.. 1. అసత్య 2. అహింస 3. అస్తేయ 4. అపరిగ్రహ

    మహావీరుడు

    • ఇతడు జ్ఞాత్రిక వంశ క్షత్రియుడు, వైశాలి రాజ్యంలోని కుండా గ్రామంలో సిద్ధార్థునికి మరియు త్రిశలాదేవికి జన్మించాడు.
    • ఇతని కూతురు అనోజ్ఞ, అల్లుడు జామాలి. మహావీరుని భార్యపేరు యశోద.
    • మహావీరుడు బి.సి. 540లో జన్మించాడు మరియు క్రీ.పూ. 468న పావాపురిలో మరణించాడు.
    • పార్శ్వనాధుని కాలం వరకు కూడా జైనంలో నిర్గ్రంథులు అనగా ప్రాపంచిక సుఖాలను త్యజించిన వారిగా పిలిచేవారు.
    • 30 సంవత్సరాల వయస్సు నుండి మోక్షాన్ని అన్వేషిస్తూ 12 సంవత్సరాలు దేశాటన చేసాడు. ఇందులో 6 సంవత్సరాలు మక్కలి గోసలి పుత్రతో కలిసి తిరిగాడు.
    • నిగ్రంధ మతమును అనుసరించి తీర్థంకర స్థాయికి వెళ్ళాడు.
    • పార్శ్వనాధుని యొక్క 4 సూత్రాలకు 5వ చర్య అయిన బ్రహ్మచర్యాన్ని జతపర్చాడు.
    • వర్ధమాన మహావీరునకు జీన, కేవలి, వతపుత్త, జ్ఞానపుత్ర, దేహదిన్నే అనే బిరుదులు కూడా కలవు.
    • వర్ధమాన మహావీరుడు పావాపురిలో షష్ఠిపాలుని ఇంట్లో సల్లేఖన వ్రతాన్ని చేసి శరీరాన్ని శుష్కింప చేసుకొని మరణించాడు. (సల్లేఖన వ్రతం అనగా ఆహార పానీయాలు మానివేయడం).
    • వర్ధమాన మహావీరుడికి జ్రుంభిక గ్రామం నందు 'ఋజుపాలిక' నదీ తీరంలో సాల వృక్షం క్రింద 42వ సం॥లో జ్ఞానోదయం అయ్యింది. అందుకే జినుడు అయ్యాడు మరియు వీరిమతం జైనమతం అయ్యింది.
    • జైనులు స్థాపించిన గచ్చాలను అనుసరించి హిందువులలో మఠాలు, బౌద్ధులలో సంఘాలు ఏర్పడినవి.

    జైనమత సిద్ధాంతాలు

    ప్రతి వ్యక్తి పాటించవలసిన పంచవ్రతాలు/సూత్రాలు

    1. అసత్యం పలుకరాదు
    2. అహింస 
    3. అజ్ఞేయం 
    4. అపరిగ్రహ 
    5. బ్రహ్మచర్య

    ♦️ మొదటి 4 పంచసూత్రాలని పార్శ్వనాధుడు చెప్పగా చివరిది మహావీరుడు తెలిపాడు.

    ♦️ మోక్షాన్ని సాధించడానికి ఆచరించవలసినవే త్రిరత్నాలు
    • 1. సమ్యక్ క్రియ
    • 2. సమ్యక్ విశ్వాసం
    • 3. సమ్యక్ జ్ఞాన
    ♦️ విపరీతమైన అహింసను పాటించాలి, ఏ దేవుడైనా తీర్థంకరుల తర్వాతనే, పునర్జన్మలు & కర్మలు కలవు మరియు కులవ్యవస్థకు ఈ మతం నందు చోటులేదు.

    ♦️ జైనమత పవిత్ర గ్రంథాలని 12 అంగాలు అంటారు. వీటిని ప్రాకృతం & అర్థమగధి భాషలో పొందుపరిచారు.

    ♦️ ఇతర జైన సాహిత్యాన్ని ద్వాదశాంగాలు అంటారు. జైన మతం నందు మహావీరుడి అనుచరులైన దిగంబరులు & పార్శ్వనాధ అనుచరులైన శ్వేతాంబరులు అనే ప్రధాన శాఖలు కలవు.

    ♦️ హేమచంద్రుని యొక్క పరిశిష్ట పర్వన్ గ్రంథం ప్రకారం మగధలో సంభవించిన 12 సం||ల వరుస కరువు కాటకాల వల్ల
    • 1. బధ్రబాహు, చంద్రగుప్తులతో కూడిన సమూహం శ్రావణ బెలగోలకు వచ్చి దిగంబరాన్ని పాటించారు.
    • 2. స్థూల భద్రుని నాయకత్వంలోని సమూహం మగధలోనే ఉండిపోయి శ్వేతాంబరాన్ని పాటించారు.
    • 3. తర్వాతి కాలంలో శ్వేతాంబరులు తేరా పంధీలుగా & దిగంబరులు సమెయాలుగా విడిపోయారు.

    భారతీయ సమాజంపై జైనం యొక్క ప్రభావం

    జైనం ఆవిర్భావం నాటికి హిందూమతంలో ఉన్నటువంటి అసంతృప్తులు, ఆచారాలు, యజ్ఞకాండలు, జంతుబలులు, తీవ్రమైన హింస, సముద్రయానంపై నిషేధం లాంటి కఠిన నియమాలుండేవి. వీరియొక్క ఆగమనంతో ఈ క్రింది మార్పులు జరిగినవి.

    1. తీవ్ర స్థాయిలో ఉన్న జంతు బలులను తగ్గించారు.
    2.  వర్ణవ్యవస్థలో గల అసమానతలను వ్యతిరేకించారు.
    3.  స్త్రీల సమానత్వం కోసం విశేష కృషి సలిపారు.
    4.  సముద్రయానంనకు అనుమతినిచ్చారు ఫలితంగా ఆర్థిక పురోగతి, విదేశాలతో సంబంధాలు ఏర్పడినవి.
    5.  నిమ్న వర్గాలు & వైశ్యుల నుండి మంచి ఆదరణ లభించింది.
    6.  కొంతవరకు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తగ్గించగలిగారు.

    బౌద్ధమతం

    • ఉపనిషత్తుల నుండి స్ఫూర్తిని పొంది గౌతమబుద్ధుడు స్థాపించాడు.
    • బుద్ధుడు B.C 563లో జన్మించారు. అసలు పేరు సిద్ధార్థుడు. తల్లిదండ్రులు - శుద్ధోధనుడు, మహామాయ. లుంబినీ వనంలో జన్మించాడు.
    • బుద్ధుని పెంపుడు తల్లి - గౌతమి, భార్య - యశోధర, కుమారుడు రాహులుడు.
    • బుద్ధుని గుర్రం - కంతక, సారధి- చెన్న.
    • బుద్ధుడు కపిలవస్తు నగరంలో 1. వయోవృద్ధుడు 2. రోగిష్టి 3. శవం 4. సన్యాసి లను చూసి జీవితంపై విరక్తి చెందాడు మరియు ఇంటినుండి నిష్క్రమించాడు. దీనినే మహాభినిష్క్రమణం అంటారు. ఉపనిషత్తులు & సాంఖ్యా అభ్యసించాడు.
    • గయ ప్రాంతంలోని నిరంజన్ నది వద్ద స్నానమాచరించి, బోధివృక్ష క్రింద ధ్యానం చేసి 49వ రోజు వైశాఖ పౌర్ణమి రోజున జ్ఞానోదయాన్ని పొంది బుద్ధుడయ్యాడు.
    • సుజాత అనే మహిళ ఇతనికి పాయసం & ఆహారాన్ని ఇచ్చింది. ఇతని గురువులు: అలారకామ మరియు రుద్రకలు.
    • సారనాథ్లోని జింకల వనంలో మొదటిసారి తన జ్ఞానాన్ని 5 గురు శిష్యులకు బోధించాడు. దీనినే ధర్మచక్ర పరివర్తన అంటారు. బుద్ధుడు ఖుషి నగరం దగ్గర బోధి వృక్షం క్రింద మరణించాడు. దీనినే మహానిర్యాణం అంటారు.
    • బౌద్ధ సన్యాసం / బుద్ధుని శరీర అవయావలపై నిర్మించిన కట్టడాలను స్థూపాలు అంటారు. బౌద్ధుల యొక్క ప్రార్ధనా మందిరాలని చైత్యాలు అంటారు. బౌద్ధ సన్యాసుల విశ్రాంతి గృహాలను ఆరామాలు అంటారు.
    • బుద్ధుడు నాస్తిక వాది. అయిననూ జన్మ, పునర్జన్మ, కర్మ లాంటి హిందు మత భావాలను గ్రహించాడు. స్వర్గం, నరకం లేదన్నాడు.

    బౌద్ధ మత సిద్ధాంతాలు

    ♦️ ప్రపంచానికి సంబంధించి 4 ఆర్య సత్యాలను బుద్ధుడు పేర్కొన్నాడు. అవి....
    • 1. ప్రపంచమంతా దుఃఖమయం
    • 2. ఈ దుఃఖానికి కారణం కోరికలు
    • 3. ఈ కోరికలను జయించాలి
    • 4. కోరికలను జయించడానికి అష్టాంగ మార్గాన్ని పాటించాలి
    ♦️ ఈ ఆర్య సత్యాలను సార్నాధ్ నందు బోధించాడు.

    అష్టాంగ మార్గాలు

    1. సరైన దృష్టి
    2. సరైన ఆలోచన
    3. సరైన వాక్కు
    4. సరైన క్రియ
    5. సరైన జీవనం
    6. సరైన శ్రమ
    7. సరైన మనోనిశ్చయం 
    8. సరైన ధ్యానం

    పాళీ భాషలో రచించిన త్రిపీఠకాలు బౌద్ధమత పవిత్ర గ్రంథాలు

    1.సుత్త పీఠకం
    2. వినయ పీఠకం
    3. అభిదమ్మ పీఠకం

    ♦️ త్రిపీఠకాలు అనగా బోర్లించిన 3 గంపలు అని అర్థం.

    ♦️ బుద్ధుని మొదటి బోధనలను పంచశీలా అంటారు. అవి...
    1. అహింస 2. సత్యం 3. దొంగతనం చేయరాదు 4. మత్తుపానీయాలు తాగరాదు 5. వ్యభిచారం చేయరాదు.

    ♦️ బుద్ధుని జీవితంలో గల 5 ముఖ్య ఘట్టాలను పంచకళ్యాణాలు అంటారు.
    • 1. పుట్టుక  -  తామర పువ్వుతో పోలుస్తారు
    • 2. మహాపరిత్యాగం  -  గుర్రం
    • 3. సంభోధి  -  బోధి వృక్షం
    • 4. మొదటి భోదన  -  చక్రం (8 Spokes)
    • 5. మరణం  -  స్థూపం లతో పోలుస్తారు.

    బౌద్ధమత శాఖలు


    ♦️ బౌద్ధం నందు హీనయానం, మహాయానం & వజ్రాయనం అనబడే ప్రధాన శాఖలు కలవు.

    ♦️ రెండవ బౌద్ధ సంగీతి నందు బౌద్ధులు 1. థేరవాదులుగా 2. మహాసాంధీకులుగా విడిపోయారు మరియు 4వ బౌద్ధ సంగీతి నందు ధేరవాదులు హీనయాన బౌద్ధులుగా & మహా సాంఘికులు మహాయాన బౌద్ధులుగా మారారు.


    హీనయానం

    • సనాతన వాదులు, మతంలో వస్తున్న మార్పులను తీవ్రంగా వ్యతిరేకించేవారు.
    • హీనయానం అనగా, చిన్నవాహనం అని అర్థం.
    • వీరికి బుద్ధఘోషుడు రాసిన విశుద్ధిమాగ ప్రామాణిక గ్రంథం.
    • వీరు బుద్ధుడ్ని గురువుగా పూజిస్తారు.
    • వీరు విగ్రహారాధనకు వ్యతిరేకులు.

    మహాయానం

    • మహాయానం అనగా పెద్దవాహనం అని అర్థం.
    • ఆంధ్రప్రదేశ్లో జన్మించింది.
    • నాగార్జునుడి యొక్క ప్రజ్ఞాపారమిత వీరి యొక్క ప్రామాణిక గ్రంథం.
    • వీరు సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మతంలో కూడా మార్పులను ఆహ్వానించారు.
    • వీరికి బుద్ధుడే దేవుడు, విగ్రహారాధనను కూడా పాటించేవారు.

    వజ్రయానం

    • దీనినే తాంత్రిక బౌద్ధం అంటారు.
    • వజ్రపాణి వీరి ఆరాధ్య దైవం.
    • మంత్ర తంత్రాలు, స్త్రీ దేవతారాధన & లైంగిక సంబంధమైన యోగ సాధనలను పాటిస్తూ బౌద్ధంలో అనైతికతకు దారితీశారు.
    • బౌద్ధమతం అంతరించడానికి వజ్రయానం కూడా ఒక కారణం.

    భారతీయ సమాజంపై బౌద్ధం ప్రభావం

    జైన బౌద్ధమతాలు అనునవి భారతదేశంలో సంస్కరణలకు పునాదులు వేసినవి. జైనం వలనే బౌద్ధం కూడా హిందూమతంలోని సంస్కరణలకు దోహదపడింది.

    • పూర్తి స్థాయిలో భారతీయ సామాజిక నిర్మాణంలో సంస్కరణలకు పాటు పడింది బౌద్ధమతం.
    • బ్రాహ్మణాధిపత్యంపై వ్యతిరేకత, సామాజిక సమానత్వం, లింగపరమైన సమానత్వంనకు దోహదపడింది.
    • బౌద్ధాన్ని హేతువాదంతో కూడిన ఆధ్యాత్మిక వికాసం అని పిలుస్తారు.
    • వేదాలను తిరస్కరించింది, జంతు బలులను నిరోధించింది.
    • బుద్ధం, ధర్మం, సంఘం, శరణం గచ్చామి అనబడే ప్రతిజ్ఞ ద్వారా సామాజిక ఐకమత్యానికి తోడ్పడింది.
    • జైనం వలే కాకుండా సాధారణ ప్రజలు కూడా మోక్షాన్ని పొందే విధంగా మధ్యే మార్గాన్ని బోధించింది.
    • పర్షియన్లు, శకులు, కుషాణులు & ఇతర విదేశీయులందరినీ భారతీయ సమాజంలో విలీనీకరణం చేసింది.
    • సంస్కృతం యొక్క ఆధిపత్యాన్ని తగ్గించి స్థానిక భాషలు & సాహిత్య వృద్ధి చెందేందుకు తోడ్పడింది.
    • విదేశాలలో సాంస్కృతిక & వాణిజ్య సంబంధాలు పెంపొందించి భారతీయ సంస్కృతిని విదేశాలలో చాటింది.
    • జాదూనాధ్ సర్కార్ అభిప్రాయంలో, ఇండియాలో విగ్రహారాధనను సంఘ సంస్కృతిని ప్రారంభించింది బౌద్ధమే.
    • బుద్ధ విహారాలు సామాజిక సేవా కేంద్రాలుగా & విద్యా కేంద్రాలుగా పని చేసినవి.
    • ప్రపంచంపై బౌద్ధం యొక్క అహింసా సిద్ధాంత ప్రభావాన్ని గమనించి వివేకానందుడు, బుద్ధున్ని ఆసియా జ్యోతిగా పిలిచాడు.
    • ఇండియాలో నిమ్న కులాల వారు, ముఖ్యంగా మహారాష్ట్రలోని మొహర్లు, ఉత్తరప్రదేశ్లోని చమర్లు బౌద్ధంను ఆదరించారు.
    • ఇండియాలో, గాంధార, మధుర & అమరావతి శిల్ప శైలులకు బీజం వేసినవారు - బౌద్ధులు

    ఇస్లాం మతం

    మహమ్మద్ ప్రవక్త ఇస్లాం స్థాపకుడు, వీరు సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో క్రీ.శ. 570లో జన్మించారు. మరియు బాబాయి - అబుతాలీబ్ సంరక్షణలో పెరిగారు. 35వ ఏట ఖదీజా అనే మహిళని వివాహం చేసుకున్నారు 40వ ఏట జ్ఞానోదయం అయ్యింది. గాబ్రియల్ దేవత ద్వారా తన 40వ ఏట దైవ సందేశాన్ని అందుకున్నారు, మరియు అతని కుటుంబ సభ్యులే అతడి మొదటి శిష్యులు.

    విగ్రహారాధనను వ్యతిరేకించడంలో స్థానిక మతాధికారుల ఆగ్రహానికి గురై నగరం నుండి బహిష్కరింపబడ్డారు. నగర బహిష్కరణతో క్రీ.శ. 622న తన అనుచరులతో మదీనాను చేరుకున్నారు. దీనినే శాంతికోసం ప్రయాణం/ఇజ్రత్ అందురు. ఈ |సమయాన్నే మహమ్మదీయ శకారంభంగా పరిగణిస్తారు.

    మహ్మద్ ప్రవక్త మదీనాలో లభించిన ఆదరణతో 'ఉమ్మా' అనబడే స్వంత రాజకీయ సంస్థను ఏర్పాటు చేశారు. క్రీ.శ. 632లో మహ్మద్ ప్రవక్త మరణించారు. మహ్మద్ ప్రవక్త ప్రవర్తనాలు అనుసరించేవారితో ఇస్లాం మతం ఏర్పడింది. అరబిక్ భాషలో ఇస్లాం అంటే భగవంతుని యొక్క ఆదేశాలకు తలొగ్గి ఉండమని అర్థం, భగవంతున్ని అల్లాహ్ అని సంభోదిస్తారు.

    ఇస్లాం మత ముఖ్య సిద్ధాంతాలు

    ♦️ ఈ క్రింది వాటిని ఇస్లాం మతం యొక్క మూల సూత్రాలుగా పరిగణిస్తారు.

    1. అల్లాహ్ ఈ సృష్టికి మూలము
    2. దైవం నిర్వికారుడు & నిరంజనుడు
    3. విగ్రహారాధనకు వ్యతిరేకం
    4. సర్వ మానవ సమానత్వం
    5. ప్రవక్త ప్రవచనములకు తిరుగులేదు.

    ♦️ ఖురాన్ అనునది మార్చడానికి వీలులేదు.



    ఇస్లాం నందు గల 5 మూల స్థంభాలు

    • అల్లాహ్ యందు తిరుగులేని విశ్వాసాన్ని చూపించడం. దీనినే 'ఇమాన్' అంటారు.
    • ప్రతిరోజు 5 సార్లు ప్రార్ధన చేయాలి. దీనినే నమాజ్ అంటారు.
    • ప్రతివ్యక్తి నిరుపేదలకు సహాయం చేయాలి. దీనినే జకాత్ అంటారు.
    • పవిత్ర దినాల యందు ప్రతి వ్యక్తి ఉపవాసాన్ని పాటించాలి. దీనినే సాన్ అంటారు.
    • ప్రతివ్యక్తి తన జీవితంలో ఒక్కసారి అయినా మక్కాదర్శనం చేయాలి. దీనినే హాజి అంటారు.
    • నోట్: కొంత మంది అతివాదులు జిహాద్ని 6వ స్థంభంగా చేర్చినారని అయితే మెజార్టీ గ్రూప్ ఆమోదించలేదనే అభిప్రాయం కలదు.
    • భారతదేశంపై మహ్మద్ బీన్ ఖాసిమ్ దాడులతో క్రీ.శ. 711లో ఇస్లాం భారతదేశంలోనికి ప్రవేశించింది.
    • ప్రపంచంలో ఇస్లామ్ 2వ అతిపెద్ద మతం, ఇండోనేషియా దేశం నందు ఇస్లాం జనాభా అధికంగా కలదు. 2వ స్థానం భారతదేశం.
    • వృత్తుల విషయంలో ఇస్లాంను హిందూయిజంతో పోల్చవచ్చని ఎం.ఎన్. శ్రీనివాస్ తెలిపారు.
    • ఇస్లాం ఆలోచన విధానం ప్రకారం దేవుడొక్కడే ఉన్నాడు అతడే సర్వమానవాళికి దేవుడు.

    భారతీయ సమాజంపై ఇస్లాం యొక్క ప్రభావం

    ఇస్లాం భారతదేశంలోకి చేరుకున్న తర్వాత భారతీయ సమాజంపై ఈ మతం రుణాత్మకమైన మరియు ధనాత్మకమైన ప్రభావాన్ని చూపెట్టింద. అవి...

    • మత సంఘర్షణలు మరియు బలవంతపు మతమార్పిడులు ప్రారంభమయినవి.
    • పురాతన హిందూకట్టడాలు మరియు దేవాలయాలు దాడులకు గురయినవి.
    • హిందువులపై అరాచకమైన జిజియా లాంటి పన్నులు విధించడం జరిగింది.
    • ఇండో ఇస్లామిక్ వాస్తు శైలిని పుట్టుకకు కారణం అయ్యింది.
    • బాల్య వివాహాలు, పరదా పద్ధతి, సతీ ఆచారం, బానిస వ్యవస్థ లాంటి అంశాలను ప్రవేశపెట్టింది.
    • విగ్రహారాధనను, బహుదేవతారాధనను ఖండించి భక్తి & సూఫీ ఉద్యమాలకు కారణం అయ్యింది.
    • భారతదేశంలో పట్టణీకరణను పెంపొందించింది.
    • సారంగి, షహనామ్, రహబ్ & మిశ్రమ హిందూస్థాన్ సంగీత సాంప్రదాయాలు ఏర్పడుటకు దోహదం చేసింది.
    • ఆహారం & వేషధారణలో మార్పులను తీసుకొని వచ్చింది.
    • పర్షియన్ & స్థానిక హిందీభాషలు కలిసి ధక్కాని లేదా ఉర్దూ భాష అవతరించింది.
    • వృత్తుల విషయంలో ఇస్లాంను హిందుయిజంతో పోల్చవచ్చని యం. ఎన్. శ్రీనివాస్ తెలిపారు.
    • ఇస్లాంలోని సంస్కరణవాదులని, అబూబకర్ & అతని వారసులను ఖలీఫాలుగా అంగీకరించిన వారిని సున్నీలు అంటారు.
    • మహ్మద్ ప్రవక్త సొంత అల్లుడు అలీనే తమ యొక్క నిజమైన ధార్మిక గురువు అని భావించే సనాతన వాదులను షియాలు అంటారు.

    క్రైస్తవ మతం

    • క్రీ.శ. 29 నుండి క్రైస్తవ మతం ఆరంభం అయినట్లుగా భావిస్తారు. దీనినే పెంతకోస్తు దినంగా జరుపుతారు. క్రీస్తు అనునది బిరుదు, హిబ్రూ భాషలో క్రీస్తూ అనగా యేసయ్య అని అర్థం.
    • ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతం. భక్తిపారవశ్యం, వినయ విశ్వాసాలు మరియు ప్రేమానురాగాలు అనే అంశాలపై ఆధారపడింది. ఏసుక్రీస్తూ ప్రభోదించిన మతమే క్రైస్తవ మతం, క్రీస్తు అంటే అభిశక్తుడు అని అర్థం మరియు యేసు అంటే రక్షకుడు అని అర్థం.
    • హిబ్రూల భాషలో క్రీస్తూ అనగా మేసయ్య అని అర్థం.
    • క్రైస్తవం జూడాయిజంతో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంది.
    • ఏసుక్రీస్తూ పాలస్తీనాలోని నజరేతు అనే గ్రామంలో మేరి అనే కన్యకు జన్మించాడు మరియు జోసెఫ్ పెంపకంలో పెరిగాడు.
    • ఏసుక్రీస్తూ మొదటగా 12 మంది శిష్యులకు తన బోధనలను బోధించాడు. రాజాధిరాజు, పరలోకాధిపతి మరియు పరిపూర్ణుడు ఈ ముగ్గురు దేవునిలో గల మూర్ఖులు.
    • దేవుడి తనయుడే నరరూపంలో జన్మించిన ఏసుప్రభువు ఇతడే పరలోకదూత మరియు స్వర్గానికి వారసుడు ఇతడు మానవుల పాపకార్యాలను కడతేర్చేందుకు వచ్చినాడు.
    • క్రైస్తవం కూడా ఏకదేవతారాధనను మరియు నిర్గుణోపాసనను పాటిస్తుంది. వీరికి వాటికన్ సిటి పవిత్ర నగరం.
    • క్రైస్తవ మతానికి జుడాయిజంతో దగ్గరి సంబంధం కలదు, ఏసు 'జ్యుయి' పురుషుడు.
    • సర్వమానవ సమానత్వం, భక్తి పారవశ్యం & దేవుడి పట్ల వినయవిశ్వాసాలు ముఖ్యమైన విలువలుగా పాటిస్తారు.
    • ఏకదేవతారాధనను పాటిస్తారు.
    • క్రీస్తు అనగా అభిషక్తుడు అను అభిప్రాయం కలదు.


    ముఖ్యమైన క్రైస్తవ సిద్ధాంతాలు

    • తండ్రి, తనయుడు పరిశుద్ధాత్మల సంకలనమే దేవుడు.
    • దేవుడి మూర్తులలో ఒకరైన తనయుడే నర రూపంలో జన్మించిన ఏసు ప్రభువు. ఇతడు నరలోక దూత స్వర్గానికి వారసుడు.
    • దేవుడు మొదట సృష్టించిన ఆదిపురుషుడు Adam, ఆదిస్త్రీ Eve లు దుష్టసైతాన్ మాయలో పడి చేసిన పాపకార్యం వల్ల మనుష్యులు సృష్టింపబడినారని బోధిస్తుంది.
    • ఏసు మొదటగా తన బోధనలలో 12 మంది శిష్యులను తయారుచేశాడు.
    • బైబిల్ పవిత్ర గ్రంథం.
    • హిబ్రూ భాషలో గల బైబిల్ని Old testiment అంటారు.
    • క్రీ.శ. 52 న ఏసుక్రీస్తు యొక్క ప్రథమ శిష్యులైన
                        1. సెయింట్ థామస్
                        
                        2. బెర్తలోమ్లు మత ప్రచారం నిమిత్తమై భారతదేశంనకు వచ్చారు.
    • 1498లో వాస్కోడిగామా ఆగమనంతో చర్చిల స్థాపనకు అంకురార్పణ జరిగింది.
    • విలియం కారీ అను క్రైస్తవ సన్యాసి 1793లో హుగ్లీ నది ఒడ్డున షరంపురం మిషనరీలు స్థాపించి క్రైస్తవ వ్యాప్తికి దోహదపడ్డాయి. ఇతడే మొదటగా బైబిల్ని స్థానిక భాషలలోకి తర్జుమా చేయించాడు.

    క్రైస్తవం నందు గల ముఖ్యశాఖలు

    1. రోమన్ క్యాథలిక్స్
    2. ఆంగ్లిక
    4. సిరియన్ క్యాథలిక్కులు
    3. మెథడిస్టులు
    5. బాప్టిస్టులు
    6. ప్రొటెస్టంట్స్

    భారతీయ సమాజంపై క్రైస్తవం యొక్క ప్రభావం

    • భారత సమాజంలోని లోపాలని బహిర్గతం చేసింది. తద్వారా, మతపరమైన & సామాజిక పరమైన సంస్కరణలు ఆరంభమైనవి.
    • భారతదేశంలో మధ్యతరగతి వర్గం వృద్ధి చెందుటకు పరోక్షంగా దోహదపడింది.
    • నిమ్న వర్గాలకు, గిరిజనులకు & మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ప్రాథమిక విద్య & వైద్యంను అందించే ప్రయత్నం చేసింది.
    • సామాజిక అసమానతలు, లింగపరమైన అసమానతలు, తొలిగేలా సామాజిక సేవా కార్యక్రమాలని చర్చిలు & స్వచ్ఛంద సంస్థల సహకారంతో కృషి చేసింది.
    • సామాజిక సంక్షేమ రంగంలో 5వ ఎస్టేట్గా పిలువబడుతున్న పౌర సమాజాలు & సేవా సంస్థలు ఏర్పడుటకు కావలసిన పూర్వ రంగాన్ని ఏర్పాటు చేసింది.
    • ఆధునీకరణ, ఆధునిక విద్య & సాంకేతిక విద్యలకు అంకురార్పణ చేసింది.

    సిక్కులు

    భారతదేశంలో 15వ శతాబ్ధంలో ఏర్పడిన ఆధునిక మతం. హిందూ ఛాందస భావాలకు వ్యతిరేకంగా గురు స్థాపించాడు. ఇతని తర్వాత 9 మంది గురువులు సిక్కుమత భావాలను, సిద్ధాంతాలను అభివృద్ధి పరిచారు, ఇలా 10వ గురైన గురుగోవింద్ సింగ్ తో గురు పరంపర అంతమయ్యింది. గురుగోవింద్సంగ్ తర్వాత క్రీ.శ. 1708 నుండి సిక్కుల పవిత్ర గ్రంథం గురుగ్రంథ సాహెబు సిక్కుల శాశ్వత గరువుగా పరిగణిస్తున్నాడు.

    గురుగోవింద్ సింగ్ సిక్కుమతంను ఒక మిలటరీ వ్యవస్థగా తీర్చిదిద్దాడు. దీనినే ఖల్సా అని పిలిచాడు.

    గురునానక్: 1469న పంజాబ్లోని తల్వండి అనే గ్రామంలో హిందూ ఖాత్రి కుటుంబంలో జన్మించాడు. హిందూ మతంలోని అసమానతలను కులవ్యవస్థను ఖండించి, సంఘసంస్కర్త అయిన కబీర్ యొక్క బోధనలకు ఆకర్షితుడయి వివాహం తర్వాత సన్యాసం స్వీకరించి 35వ ఏట అడవులకు వెళ్ళాడు.

    గురునానక్ తర్వాత అతని వారసుడిగా గురుఅంగజ్ మతగురువైనాడు, ఇతడే గురుముఖలిపిని ప్రవేశపెట్టాడు. 4వ గురువు గురు రామాస్, ఇతడు కులవ్యవస్థ నిర్మూలనకు కృషిచేసాడు మరియు అక్బర్ సహకారంతో అమృత్సర్లో స్వర్ణదేవాలయం నిర్మించాడు.



    5వ గురు అర్జున్సింగ్ ఇతను ఆదిగ్రంథుని సంకలనం చేసాడు మరియు ప్రచురించాడు. ఇతని తర్వాత గురుఅరిగోవింద్ సింగ్ సిక్కులను మిలటరీ శక్తిగా మార్చాడు మరియు జహంగీర్ తో ఘర్షణ పడ్డాడు. ఔరంగజేబ్ ఉరితీయించిన సిక్కుల గురువు గురు తేజ్బహుదూర్ సింగ్.

    ఈ మతం యొక్క ముఖ్య సిద్ధాంతాలు

    ఒకే దేవుడు, భగవన్నామస్మరణ, సత్యం, సమానత్వం, అంధవిశ్వాసాలని నమ్మకపోవడం, ఒకే దేవుడు, న్యాయం, ధర్మం, దయా, ప్రేమ, వాత్సల్యం, సామాజిక బాధ్యత మరియు పరమత సహనం లాంటివి ముఖ్యమైన బోధనలు.

    సిక్కు అనే పదం శిష్య అనే సంస్కృత పదం నుండి ఆవిర్భవించింది. శిష్య అనగా నేర్చుకునే వాడు మరియు సత్యాన్ని గ్రహించేవాడు అని అర్థం. సిక్కు మతస్థుల ప్రార్థనా మందిరం గురుద్వారా, ఇది పంజాబి పదం దీని యొక్క గురువును చేరుటకు ఉన్నటువంటి మార్గం.

    సామాజిక న్యాయం, సామాజిక బాధ్యత, పరమత సహనం, స్త్రీ పురుష సమానత్వం, నిరాడంబరత & న్యాయబద్ధమైన జీవనం అనునవి ముఖ్య సూత్రాలు, వీటిని ఆచరించాలంటే

    1. క్రమశిక్షణ
    2. సమాజం పట్ల అంకితభావం
    3. ఉమ్మడి అభివృద్ధి అనబడే 3 నైతిక విలువల్ని సూచించింది.

    సిక్కు మతం ఈ క్రింది నాలుగు పాపకార్యాలు చేయకూడదని తెల్పింది.

    1. కేశాలు కత్తిరించరాదు.
    2. ఇతర మతస్థులు వండిన మాంసాహారం తినరాదు
    3. పొగాకు వాడరాదు
    4. అక్రమ సంబంధాలు కల్గి ఉండరాదు.

    వైయుక్తిక స్థాయిలో పాటించవలసిన సిక్కు మత సూత్రాలు

    ♦️ 1/10 వంతు సొమ్ముని సమాజ సేవకు ఉపయోగించాలి.

    ♦️ జీవితాంతం గృహస్థుగా ఉండాలి.

    ♦️ దుష్టులకు దూరంగా ఉండాలి.

    ♦️ గురు సన్నిధిలో జీవనం గడపాలి

    ♦️ కుటుంబం కోసం & సమాజం కోసం కర్మలను ఆచరించాలి.

    ♦️ సిక్కుల పవిత్ర గ్రంథం - ఆది గ్రంథా, ఇది గురుముఖి లిపిలో రచించబడింది.

    ♦️ వీరు అన్నివేళలా ధరించి ఉండే చిహ్నాలను పంచకల్సా అంటారు.

    1. కేశ (జుట్టు)
    2. ఖంగ (దువ్వెన)
    3. కర (కడియం)
    4. కృపాణ్ (చిన్న ఖడ్గం)
    5. కఛ (శుద్ధతకు చిహ్నమైన లో వస్త్రం)

    పార్శీలు: (జొరాస్ట్రియనిజం)

    • ఇస్లాం దాడులకు భీతి చెంది భయపడి పర్షియా నుండి పారిపోయి భారతదేశంలో స్థిరపడినారు.
    • పర్షియాలోని పార్స్ అనే ప్రాంతం నుండి వచ్చారు కావున వీరిని పారశీలందురు.
    • వీరి పవిత్ర గ్రంథం - జెండ్ అవెస్తా.
    • కాంతి, సత్యము, పవిత్రత, దయ, విజ్ఞానము, జయము & సంక్షేమము అనబడే 7 కారకాలతో రూపొందిన అహురమజ్జ అనేవారు దేవుని ప్రతినిధిగా వచ్చాడని విశ్వసిస్తారు.
    • వీరు ఎత్తైన ప్రదేశాలలో మృతదేహాలను వదిలివేస్తారు.
    • వీరి యందు కూడా పురోహితుడు, సైనికుడు, వ్యవసాయదారుడు మరియు పనివారనే సామాజిక విభజన కలదు.
    • వీరిలో హుమత అనబడే మంచి ఆలోచన, హుక్త అనబడే మంచి మాటలు హెూవరిస్టా అనబడే మంచి కార్యాలు పాటించాలనే విలువలు కలవు.
    • నూతన సంవత్సర వేడుకలలో ఏర్పడిన వివాదాలు వల్ల: 1. షహిన్ మరియు 2. కాడ్మిన్ అనే వర్గాలుగా విడిపోయారు. తర్వాతి కాలంలో ప్లాస్టిన్ అనే శాఖ కూడా ఏర్పడింది.


    భక్తి & సూఫీ ఉద్యమాలు

    మతంలోని సనాతన భావాలను కఠినమైన కర్మకాండాలను, బ్రాహ్మణుల ఆధిక్యతను నిరసిస్తూ దేవుడ్ని & మతాన్ని మధ్యతరగతి ప్రజలకు & నిమ్న వర్గాలకు అందుబాటులోకి తీసుకొని వచ్చిన ఉద్యమం భక్తి మరియు సూఫీ ఉద్యమం. భక్తి ఉద్యమం హిందూ మతాన్ని సాధారణ మరియు నిమ్న వర్గాల హిందువులకు అందుబాటులోకి తీసుకొనివచ్చింది అలాగే సూఫీ మతం ఇస్లాం మతం నందు సంస్కరణలను ప్రతిపాదించింది.

    శ్వేతేశ్వరోపనిషత్లో మొదటి సారి నిరాండబరమైన భక్తిని గురించి తెలిపిన వివరణయే భక్తి ఉద్యమానికి ప్రేరణనిచ్చింది. కఠినమైన నియమాలు కాకుండా సాధారణ పద్ధతులలో మోక్ష సాధనకై చేసే ప్రయత్నాన్నే భక్తి అంటారు. దీనిని ప్రచారం చేయడమే భక్తి ఉద్యమం.

    భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు

    • దేవుడితో గాఢమైన మానసిక అనురక్తి.
    • పవిత్ర మనస్సు, సాధారణ జీవనం, ఏకదేవతారాధన లాంటివి.
    • జ్ఞానం పొందుటకు గురువు అవసరం అని భావించే వారు.
    • కుల, మత, వర్గ, విబేధాలకు వ్యతిరేకం.

    భక్తి సూఫీ ఉద్యమ కారులు సంస్కృతాన్ని తీవ్రంగా నిరసించారు. కావున స్థానిక భాషల వృద్ధి జరిగింది. ఆక్రమంలోనే ప్రాంతీయ సాహిత్యాలు వృద్ధి చెందినవి, హిందీ, బెంగాలీ, గుజరాతి & మరాఠి భాషలు పామర భాష నుండి పండిత భాషగా మారినవి.

    భగవంతుడ్ని చేరడానికి సంగీతం, భజనలు, పాటలు & కీర్తనలు మాధ్యమంగా పనిచేసినవి. సమాజంలో మతం పట్ల దిగువ కులాలకు ఉన్న అసంతృప్తి & అసమానత విధానాలు భక్తి ఉద్యమం ద్వారా తొలగించడం జరిగింది.

    భక్తి ఉద్యమ బోధనలపై విజయనగర సామ్రాజ్యం & మరాఠాల సామ్రాజ్యం నిర్మితమైంది. సమాజంలో మత మార్పిడులను నివారించి మతంలో సంస్కరణలు తీసుకువచ్చింది.

    ముఖ్యమైన భక్తి ఉద్యమకారులు


    మహారాష్ట్రకు చెందిన భక్తి ఉద్యమకారులు

    • దర్జీగా జన్మించి భక్తి ఉద్యమకారుడిగా మారిన వారు - నామదేవ్
    • మరాఠా కబీర్గా పిలుబడే వారు - భక్త తుకారాంలు
    • శివాజీ యొక్క మత గురువు, దశభోద అనే రచనద్వారా హిందూ ధర్మ రక్షణ కోసం ప్రయత్నించిన వారు - సమర్ధ రామదాసు
    • మరాఠీ భవద్గీతను రచించిన వారు - ఏకనాధుడు

    ఉత్తర & తూర్పు భారతదేశంకి చెందిన భక్తి ఉద్యమకారులు

    • అలహాబాద్ కేంద్రంగా రామభక్తిని చాటిన రామానందుడు.
    • కబీర్: ఈయనని మధ్యయుగ కారల్ మార్క్స్ అంటారు, ఇతడు నేతన్న (పద్మశాలి), ఇతని రచనల్ని దోహాలు అంటారు, ఇతనికి హిందూ-ముస్లింలు ఇద్దరూ సమాధులు నిర్మించారు.
    • మీరాబాయి - కృష్ణ భక్తురాలు.
    • అపర వాల్మీకిగా పిలువబడే తులసీ దాస్, రామచరిత మానస్ రచించాడు.
    • సూర్సాగర్, సూరావళి రచించిన వారు - ఆగ్రా అంధకవి సూరదాసు.
    • శ్రీకృష్ణుడ్ని ప్రేమించినవారు (నేనే రాధనని) ఛండీదాస్.
    • రాధాకృష్ణ భక్తిని ప్రచారం చేసిన జయదేవుడే గీతాగోవిందాన్ని రచించాడు.

    సూఫీ ఉద్యమం

    • ఇస్లాం నందుగల మార్మిక వాదాన్ని సూఫీ వాదం /సూఫీ ఉద్యమం అందురు.
    • సూఫీ అనునది అరబిక్ పదం, ఉన్ని లేదా ఊలు అని దీని అర్థం.
    • సూఫీలో ఉత్సవాలని ఇస్లాం & హిందూ సమాజం సమానంగా ఆదరిస్తుంది.
    • వీరి వర్ధంతిని ఉర్స్ అని, సమాధిని దర్గా అని అంటారు.
    • హిందూ ముస్లిం ఐక్యతకి గణనీయంగా తోడ్పడింది.

    ఇతరాంశాలు

    ♦️ గుప్తుల కాలంలో పౌరాణికం, దశావతారాలు & బుద్ధుడు విష్ణువు యొక్క 9వ అవతారం అనే చింతనలు ఏర్పడినవి.

    ♦️ 1582లో అక్బర్ దీన్-ఇ-ఇలాహి అనే మతాన్ని ఏర్పాటు చేశాడు.

    ♦️ అంబేద్కర్ తన జీవిత చరమాంకంలో నవ్య బౌద్ధమతంను ఏర్పాటు చేశాడు.

    ♦️ 5గురు దేవతలను పూజించే విధానాన్ని పంచాయతనం /స్మార్థం /స్మార్ధ మతం అంటారు.

    1. శివుడు
    2. విష్ణువు
    3. దేవి
    4. గణపతి
    5. ఆదిత్యుడు

    భారతదేశంలో మత జనాభా వివరాలు: (2011 జనాభా లెక్కల ప్రకారం)

    1. హిందువులు - 96.62 కోట్లు, మొత్తం జనాభాలో 79.8%
    2. ముస్లింలు - 17.22 కోట్లు, మొత్తం జనాభాలో 14.23%
    3. క్రిస్టియన్లు - 2.78 కోట్లు, మొత్తం జనాభాలో 2.30%
    4. సిక్కులు - 2.08 కోట్లు, మొత్తం జనాభాలో 1.7%
    5. బౌద్ధులు - 0.84 కోట్లు, మొత్తం జనాభాలో 0.7%
    6. జైనులు- 0.45 కోట్లు, మొత్తం జనాభాలో 0.37%

    భారతదేశంలో మత పరంగా లింగ నిష్పత్తి: (2011 జనాభా లెక్కల ప్రకారం)

    1. హిందువులు - 939
    2. ముస్లింలు - 951
    3. క్రిస్టియన్లు 1023
    4. సిక్కులు - 903

    భారతదేశంలో మతపరంగా 2001-2011 నకుగాను జనాభా వృద్ధిరేటు

    1. ముస్లింలు - 24.65%
    2. హిందువులు - 16.76%
    3. క్రైస్తవులు - 15.53%
    4. సిక్కులు - 8.42%
    5. బౌద్ధులు - 6.1%
    6. జైనుల - (-)5.4%

    • ప్రపంచ మత స్వేచ్ఛా సూచికలో భారతదేశాన్ని Tire-II దేశాల జాబితాతో చేర్చారు.
    • ప్రపంచంలో ముస్లిం జనాభాలో భారత్ - 2వ స్థానం మరియు అధిక సంఖ్యలో హిందువులను కలిగి యున్న దేశం - భారతదేశం.
    • రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం క్రిస్టియన్స్ని కలిగి ఉన్న రాష్ట్రం - నాగాలాండ్.
    • ముస్లిం జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం - ఉత్తరప్రదేశ్.
    • హిందూ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం - మధ్యప్రదేశ్.
    • క్రిస్టియన్ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం - కేరళ.
    • హిందూ జనాభాని తన జనాభాలో అధిక శాతం కలిగి ఉన్న రాష్ట్రం - హిమాచల్ ప్రదేశ్.
    • అన్ని రాష్ట్రాలతో పోల్చినప్పుడు తన జనాభాలో అధికశాతం క్రిస్టియన్ జనాభాను కలిగి ఉన్న రాష్ట్రం - నాగాలాండ్.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత జనాభా వివరాలు: (2011 జనాభా లెక్కల ప్రకారం)

    1. హిందువులు - 4.4875 కోట్లు, మొత్తం జనాభాలో 90.8%
    2. ముస్లింలు 36.17 లక్షలు, మొత్తం జనాభాలో 7.3%
    3. క్రిస్టియన్లు 6.82 లక్షలు, మొత్తం జనాభాలో 1.38%
    4. సిక్కులు - 9,904, మొత్తం జనాభాలో 0.02%
    5. బౌద్ధులు - 4,139, మొత్తం జనాభాలో 0.01%
    6,159 మొత్తం జనాభాలో 0.05%
    7. ఇతర మతస్తులు - 4,125 మొత్తం జనాభాలో 0.01%
    8. మతాన్ని నమ్మనివారు - 1,65,401 (0.33%)

    పునశ్చరణ

    • మతం సమాజానికి మత్తుమందు మరియు ఉపశమన కారిణి లాంటిదని కారల్ మార్క్స్ పేర్కొన్నాడు.
    • మతం అనేది ప్రాథమిక, సామాజిక సంస్థ.
    • టాబు అనగా నిషేధాలు, వీటినే అలిఖిత చట్టాలు అని అంటారు.
    • దేవుడికి రూపాన్ని ఇవ్వడాన్నే సద్గుణోపాసన అని మరియు రూపం లేకుండా పూజించడాన్ని నిర్గుణోపాసన అని అంటారు.
    • మతం యొక్క ఆవిర్భావాన్ని గురించి సర్వాత్మ వాదం ద్వారా టైలర్, జీవాత్మ వాదం ద్వారా ఫ్రాయిస్ & ముల్లర్, ప్రకృతి ఆరాధన వాదం ద్వారా ముల్లర్ మరియు ప్రకార్య వాదం ద్వారా రాడ్క్లిఫ్ బ్రౌన్ & మలినౌస్కి లు తెలియజేసారు.
    • వేదాలు 4, వేదాంగాలు 6, ఉపవేదాలు 4, తత్వసిద్ధాంతాలు 6, పురుషార్థాలు 4, వరుణాశ్రమ ధర్మాలు 4, గుణాలు 3, పంచమహాయజ్ఞాలు 5 కలవు.
    • జైన మతం అంటే జయించిన వారి మతం అని అర్థం.
    • త్రిపీఠకాలు అనగా బోర్లించిన 3 గంపలు అని అర్థం.
    • ఇస్లాం మత స్థాపకుడు మహ్మద్ ప్రవక్త, వీరు స్థాపించిన రాజకీయ సంస్థ ఉమ్మా.
    • వృత్తుల విషయంలో ఇస్లాంను హిందూయిజంతో పోల్చవచ్చని ఎం.ఎన్ శ్రీనివాస్  అభిప్రాయపడ్డారు.
    • క్రీస్తూ అనగా అభిశక్తుడు అని అర్థం.
    • క్రీ.శ. 52 ఏసుక్రీస్తు యొక్క శిష్యులైన సెయింట్ థామస్ మరియు బెర్త్ూమ్లు భారతదేశంనకు విచ్చేసారు.
    • సిక్కుమతస్థాపకుడు గురునానక్.
    • లింగనిష్పత్తి క్రిస్టియన్లలో అధికంగా కలదు మరియు సిక్కులలో అత్యల్పంగా కలదు.
    • జనాభా వృద్ధిరేటు ఇస్లాం నందు అధికంగా కలదు.



Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


No comments:

Post a Comment

Post Bottom Ad