1.7 బంధుత్వం - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Thursday, July 6, 2023

1.7 బంధుత్వం

1.7 బంధుత్వం  


    బంధుత్వం భావన మరియు ప్రాథమిక అంశాలు


    సర్ హెన్రీ మెయిన్ తొలిసారిగా భారతీయ పితృస్వామ్య విస్తృత కుటుంబాలని అధ్యయనం చేసి రాసిన Ancient Law అనే గ్రంథంలో మొదటిసారి 1861న బంధుత్వం అనే పదం ఉపయోగించారు. 1865లో మెక్లెన్నిన్ తన ఆదిమ వివాహం అనే గ్రంథంలో సమాజం నందు మనుషుల మధ్య బంధుత్వం యొక్క ప్రాముఖ్యతను తెలిపాడు.


    వివాహం ద్వారా గానీ, రక్త సంబంధం వల్ల గానీ, దత్తత వల్ల గానీ ఏర్పడే సంబంధాన్నే బంధుత్వం అంటారు. బంధుత్వం, కులం, కుటుంబం అనే సమూహాల్లో వ్యక్తి తన ప్రమేయం లేకుండానే సభ్యుడవుతాడు. రక్త సంబంధం, వైవాహిక సంబంధాల వల్ల ఏర్పడిన సాంఘిక బంధాన్ని బంధుత్వం అని 'అబర్ కోంబై' తెలిపాడు.


    ♦ మానవ శాస్త్రవేత్తలు బంధుత్వాన్ని ప్రాథమికంగా 2 విధాలుగా గుర్తించారు.

            1. వైవాహిక బంధుత్వం Affinal kinship ఉదా: భార్య, భర్త, అత్త, మామ లాంటి వారందరు

            2. ఏకరక్త బంధుత్వం Consanguineal kinship ఉదా: తల్లి, తండ్రి, సోదరుడు

    ♦ మేనరిక వివాహాలు, సమాంతర పిత్రీయ సంతతి వివాహాలలో భార్య భర్తలు వైవాహిక & ఏకరక్త బంధువులు అవుతారు.

    ♦ ఒకే తల్లిదండ్రుల సంతానంను సంపూర్ణ రక్త సంబంధీకులు అంటారు.

    ♦ తండ్రి ఒక్క సంతానం యొక్క తల్లులు వేరు వేరు అయినప్పుడు సవతి తల్లి పిల్లలు అంటారు.

    ♦ విభిన్న భర్తల ద్వారా ఒకే స్త్రీకి జన్మించిన వారిని సహోదరులు/ఏక గర్భ జనితులు అంటారు.

    ♦ సహోదరులు & సవతి తల్లి పిల్లలను సాధారణంగా అసంపూర్ణ రక్త సంబంధీకులు అంటారు.


    బంధుత్వ స్థానం/స్థాయిలు


    ♦  గ్లుకమాన్ అనునతడు బంధువులను గుర్తించుటకు ఈ క్రింది ఆంగ్ల అక్షరాలను ఉపయోగించాడు.



    బంధువుల రూపాలు (Forms of Kinship)


    ♦  బంధుత్వాన్ని పంచుకున్న వ్యక్తులంతా ఒకే మూల పురుషుడికి చెందిన వారైతే వారిని సజాతీయ బంధువులు అంటారు. ఉదా...

            1. మాతృవంశ సజాతీయ బంధువులు (ఇద్దరు సోదరీమణుల పిల్లలు)

            2. పితృవ జాతీయ బంధువులు (ఇద్దరు సోదరుల యొక్క పిల్లలు)

            3. ఒకే కుటుంబంలోని పిల్లల మధ్య మాతృవంశ & పితృవంశ సజాతీయ బంధుత్వం ఉంటుంది. ఏకరక్త బంధుత్వం.

    ♦  వ్యష్టి కుటుంబంలోని వ్యక్తుల మధ్య 8 రకాలైన ప్రాథమిక బంధుత్వ సంబంధాలు ఉంటాయి.

    1. భార్య - భర్త

    2. తండ్రి - కొడుకు

    3. తండ్రి - కూతురు

    4. తల్లి - కొడుకు

    5. తల్లి - కూతురు

    6. సోదరుడు - సోదరుడు

    7. సోదరి - సోదరి

    8. సోదరుడు - సోదరి


    ♦ ఒక వ్యక్తికి తన కేంద్రక కుటుంబంలోని వారు దగ్గర బంధువులని మిగతావారు, దూరపు బంధువులని పరిగణిస్తారు. కానీ శాస్త్రీయ దృక్పథంను బట్టి బంధువులు.

    1. ప్రాథమిక బంధువులు 2. ద్వితీయ/గౌణ బంధువులు 3. తృతీయ బంధువులు


    1. ప్రాథమిక బంధువులు (ప్రైమరీ కిన్స్)


    ♦ వివాహం ద్వారా గానీ / రక్త సంబంధం ద్వారా గానీ ఏర్పడే తొలి బంధువులు

    ♦ ఒక వ్యక్తికి వివాహం ద్వారా ప్రాథమిక వైవాహిక బంధువులు, జన్మ ద్వారా ప్రాథమిక ఏకరక్త బంధువులు ఏర్పడుతారు.

    ♦ ప్రాథమిక బంధుత్వంలో ముఖాముఖి సంబంధాలు నిరంతరంగా ఉంటాయి. ప్రతీ వ్యక్తికి గరిష్టంగా 7 రకాల ప్రాథమిక బంధువులు ఉంటారు.

    అవి:

    1. తల్లి

    2. తండ్రి

    3. సోదరుడు

    4. సోదరి

    5. భార్య

    6. కొడుకు

    7. కూతురు


    2. ద్వితీయ బంధువులు (సెకండరీ కిన్స్)


    ♦ ఒక వ్యక్తికి తన ప్రాథమిక బంధువు యొక్క ప్రాథమిక బంధువులందరు ద్వితీయ బంధువులవుతారు. (ఉమ్మడి ప్రాథమిక బంధువులు తప్ప మిగతావారు).

    ♦ వివాహం /రక్త సంబంధం వల్ల ఏర్పడిన మలి బంధువులు.

    ♦ ప్రతీ వ్యక్తికి గరిష్టంగా 33 రకాల ద్వితీయ బంధువులంటారు.


    3. తృతీయ బంధువులు (టెరిషరీ కిన్స్)


    ♦ ఒక వ్యక్తికి తన యొక్క ప్రాథమిక బంధువు యొక్క ద్వితీయ బంధువు తనకు తృతీయ బంధువు అవుతాడు.

    ♦ ద్వితీయ బంధువు యొక్క ప్రాథమిక బంధువు కూడా తృతీయ బంధువు అవుతాడు.

    ♦ ప్రతి వ్యక్తికి గరిష్టంగా 151 మంది తృతీయ బంధువులుంటారు.


    బంధుత్వ ఆచరణలు (Kinship Usages)


    బంధుత్వ సమూహంలోని వ్యక్తులు ఒకరితో మరొకరు పరస్పర చర్యలు జరిపినప్పుడు కొన్ని నిర్ధిష్టమైన ప్రమాణాలని, ప్రవర్తనలని మరియు విలువలని పాటిస్తారు. వీటినే బంధుత్వ ఆచరణలు అంటారు.


    1. పరిహాస సంబంధాలు: (జోకింగ్ రిలేషన్స్)

    ♦  పరిహాసం, హేళనతో కూడిన ప్రవర్తనలు.

    ♦  బంధువుల మధ్య చనువుని, చొరవని & సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తాయి.

    ♦  గోండులు & ఇతర తెగల్లో మితిమీరిన పరిహాసం, ఆస్థి నష్టాలకు కూడా దారి తీస్తుంది.


    ♦ రాధ్ క్లిఫ్ బ్రౌన్ పరిహాస సంబంధాలని

            1. సౌష్టవ పరిహాస సంబంధాలు: బావ, బావమరుదులు చేసుకునే పరస్పర పరిహాసాలు

            2. అసౌష్టవ పరిహాస సంబంధాలు: తాతా, మనవడిపై చేసే పరిహారం. తిరిగి మనవడు (అసౌష్టవ పరిహాసం) పరిహాసం చేయడు. అసౌష్టవ పరిహాసంతో పెద్దవాళ్ళు చిన్నవారి ప్రవర్తనని తీర్చి దిద్దుతారు.

    ♦ పరిహాస సంబంధాలతో బంధుత్వం ప్రాతికుల్య క్రియాశీల భావన అనే రూపంలో వ్యక్తం అవుతుంది.


    2. సంకేత బోధన (Technonomy)

    ♦ ఇద్దరు బంధువులు నేరుగా మాట్లాడుకోకుండా మరోవ్యక్తి ద్వారాగానీ, సంకేత అక్షరాలతోగానీ మాట్లాడడమే సంకేత బోధన. పిలిచేటప్పుడు, ప్రస్తావించేటప్పుడు కూడా సంకేతాలనే ఉపయోగిస్తారు.

    ఉదా: సంతాలుల యందు భర్తని పెద్దకొడుకు పేరుతో పిలువడం జరుగుతుంది. భార్యని కూతురు పేరుతో పిలుస్తారు.


    3. వైదొలుగుడు నడవడి (Avoidance)

    ♦ బంధువులలో నిర్ధిష్ట వ్యక్తుల మధ్య సంభాషణ ఎదురెదురుపడడం లాంటివి పాటించడం జరగదు.

    ఉదా: గోండులు & ఇతర భారతీయ సమాజాల యందు బావ & తమ్ముడి భార్య మధ్య, మామ & కోడలి మధ్య & అత్త అల్లుడు మధ్య ఈ ప్రవర్తన కనబడుతుంది, శ్రీలంకలోని 'వెడ్డాల' యందు సోదర సోదరీమనుల మధ్య కూడా ఈ ప్రవర్తన కనబడుతుంది.

    ♦ నూతన వధువు యొక్క ఇబ్బందులను తొలగించడానికి ఆచరిస్తారని RH లువీ తెలిపాడు.

    ♦ నిర్ధిష్ట వ్యక్తుల మధ్య వ్యతిరేకతను తగ్గించడానికి ఈ ఆచరణ పాటిస్తారని రాడ్క్లిఫ్ బ్రౌన్ తెలిపాడు.

    ♦ కుటుంబ సభ్యుల మధ్య అగమ్యాగమన నిషేధాన్ని పాటించేందుకే ఈ ప్రవర్తనని చూపిస్తారని సిగ్మండ్ ఫ్రాయిడ్ & ఫ్రైజర్లు పేర్కొన్నారు.


    4. కుహనా ప్రసూతి : (కువేడ్)

    ♦ ఈ బంధుత్వ ప్రవర్తనా విధానం కేవలం భార్య భర్తల మధ్య మాత్రమే ఉంటుంది. (భార్య పట్ల భర్త చూపించే ప్రవర్తన). భార్య ప్రసవ సమయంలో భర్త కూడా మాయాపురిటినొప్పులు ప్రదర్శిస్తాడు.

    ఉదా: మలారులు, కాశీలు, తోడాలు & ఆఫ్రికాలోని కరీబాలు

    ♦ భార్య కష్ట సమయంలో ఉన్నప్పుడు భర్త కూడా ఆమెతో సమానంగా కష్టపడుతూ తమ దాంపత్య జీవనంను పటిష్టం చేసుకోవడానికి ఉద్దేశించినదే కుహనా ప్రసూతి అని మలినోవోస్కి తెలిపాడు.


    5. మాతులాధికారం (అవాంక్యులేట్)

    ♦ బంధుత్వ సంబంధాలలో తల్లిదండ్రులకంటే మేనమామకి ఎక్కువ అధికారం & ప్రాముఖ్యతని ఇచ్చేటువంటి ఆచరణను తులాధికారం అంటారు.


    6. పితృశ్వాధికారం (ఎమిటేట్) 

    ♦ మేనత్తకి అధికమైన ప్రాముఖ్యతని, అధికారాన్ని ఇచ్చే ఆచరణని పితృశ్వాధికారం అంటారు. ఉదా: తోడాలు


    7. మన్ననః

    ♦ బంధుత్వంలో ఒక వర్గం వారికి అధిక ప్రాధాన్యత, మరొక వర్గం వారికి తక్కువ ప్రాధాన్యత ఉండటాన్నే మన్నన అంటారు.

    ఉదా: మగపెళ్ళివారు & ఆడపెళ్ళివారికి మధ్య ఉన్న ఆచరణ, పెద్దన్న - చిన్నతమ్ముడు మధ్య ఉన్న ఆచరణలు, పైన కూర్చోవడం, క్రింద కూర్చోవడం & పెద్దవారు రాగానే లేచి నిల్చోవడం.

    ♦ మన్నన భారతదేశం, చైనాలలో అధికంగా గోచరిస్తుంది.

    ♦ మన్నన అనేది బంధువుల మధ్య గౌరవం, విధేయత & అణకువ లాంటి ప్రవర్తనని చూపెడుతుంది.

    ♦ మన్నన బంధువుల మధ్య హెచ్చు అంతస్థు & తక్కువ అంతస్థు అనే ప్రవర్తనలను తెలుపుతుంది.


    బంధుత్వ పదాలు/ బంధుత్వ పరిభాష (Terminology of Kniship)


    బంధు సమూహంలోని సభ్యుల మధ్య నిర్ధిష్ట సంబంధాన్ని తెలిపే పదాన్ని బంధుత్వ పదం అంటారు. ఈ పదాలు బంధువుల మధ్యనున్న సంబంధాల స్వభావాన్ని, విలువలని & ఆచరణలని అంతర్లీనంగా తెల్పుతాయి.


    వావి వరుసలను బట్టి ముర్దాక్ బంధుత్వ పదాలని 3 రకాలుగా వర్గీకరించాడు.

    1. ఉపయోగితా రీతి (Mode of Usage)

    2. బంధుత్వ పదం యొక్క భాషా నిర్మాణం (Linguistic Structure)

    3. బంధుత్వ పదం యొక్క అనువర్తనా పరిధి (Range of Application)



    బంధుత్వపద ఉపయోగితా రీతి

    ఒక బంధుత్వ పదంను ఉపయోగిస్తుంటే/వాడుతున్న తీరును తెల్పుతుంది. దీనిని ఆధారంగా చేసుకొని బంధుత్వ పదాలు.

            1. సంభోదనా పదం (Term of Address)

            2. అన్వయ పదం (Term of Reference)


    1. ఒక వ్యక్తి తన బంధువైన మరోవ్యక్తితో మాట్లాడేటప్పుడు గానీ/పిలిచేటప్పుడు గానీ సంబోధించే పదాలు

    ఉదా: నాన్న, అమ్మ, అక్క లాంటి పదాలు

    2. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడేటప్పుడు అక్కడ లేనటువంటి బంధువును గూర్చి చెప్పేందుకు ఉపయోగించే పదం సూచక పదం అన్వయ పదం.

    ఉదా: ఎ అనేవాడు బి అనే మిత్రునికి 'నిన్న మానాన్న'కి బాగా కోపం వచ్చింది.


    పై వాక్యంలో/ ఈ సందర్భంలో మానాన్న అనునది సూచక పదం. ఇక్కడ వ్యక్తి వాళ్ళ నాన్నని డైరక్ట్ గా పిలువడం లేదు. వేరు వ్యక్తితో అతని గురించి చెబుతున్నాడు.


    అమ్మ, నాన్న, అక్క లాంటి పదాలు సంభోధించిన, సూచించిన దాదాపు ఒకే రకంగా ఉంటాయి. కానీ 'మేనత్త', 'మేనమామ’ అని సూచక పదంగా వాడుతాం. వారినే సంబోధించినప్పుడు కేవలం 'అత్త, మామ' అని మాత్రమే పిలుస్తాం.


    భాషా నిర్మాణం

    వ్యక్తుల మధ్య ఉన్న బంధుత్వాన్ని సూచించేందుకు వాడే బంధుత్వ పదాల యొక్క భాషా నిర్మాణాన్ని బట్టి బంధుత్వ పదాలు 3 రకాలుగా ఉంటాయి.

    1. ప్రాథమిక పదం

    2. ఉత్పన్న

    3. వివరణాత్మక పదం


    1. అతి దగ్గరి సంబంధం ఉన్న ప్రాథమిక బంధువులకు వాడే పదం ప్రాథమిక పదం, ఈ పదాలు విభజించడానికి వీలు లేకుండా నిర్ణీత వ్యక్తులకు మాత్రమే ఉపయోగిస్తాం.

    ఉదా: తల్లి, తండ్రి, భార్య లాంటివి


    2. రెండు పదాల కలయిక వల్ల ఏర్పడ్డ బంధుత్వ పదాల్ని ఉత్పన్న పదాలు అంటారు. వీనిలో ప్రాథమిక బంధుత్వ పదంతో పాటు బింధుత్వ స్థాయిని చూపించే మరొక పదం ఉంటుంది.

    ఉదా: చిన్న + అమ్మ = చిన్నమ్మ

               చిన్న + నాన్న = చిన్నాన్న లాంటి పదాలు


    3. ఒక బంధువుకు మనం ఉపయోగించే పదం రెండు ప్రాథమిక బంధుత్వ పదాల కలయిక వల్ల ఏర్పడితే దానిని వివరణాత్మకమైన పదం అంటారు. ఇలా ఏర్పడిన పదాలు వ్యక్తికి ఏ రకంగా బంధువు అవుతారో కూడా తెలుపుతాయి.

    ఉదా: నాయనమ్మ - నాన్న గారి అమ్మ, అమ్మమ్మ


    బంధుత్వ పదం - అనువర్తనా పరిధి


    ఒక బంధుత్వ పదం ఎంతమంది బంధువులకు వర్తిస్తుందో తెలియజేసే దానిని ఆ పదం యొక్క అనువర్తనా పరిధి అంటారు. కొన్ని పదాలు ఒకే బంధువును సూచిస్తే, మరికొన్ని పదాలు ఒకరికంటే ఎక్కువ మందిని సూచిస్తాయి. నిర్ధిష్టంగా కేవలం ఒకే బంధువునకు వర్తించే పదాలను సూచక పదాలు అంటారు. ఇది లింగ బేధాన్ని, తర భేదాన్ని కూడా సూచిస్తాయి.

    ఉదా: ఒక వ్యక్తి కేవలం ఒక్కరికే తల్లి అనే బంధుత్వ పదాన్ని ఉపయోగిస్తాడు. ఈ పదం వల్ల ఆమె స్త్రీ లింగం అని, అతనికంటే ముందు తరానికి చెందినదని అర్థమవుతుంది.

    ఒకే పదంను బంధువులలో ఒకరికంటే ఎక్కువ మందికి ఉపయోగిస్తే ఆ పదాన్ని వర్గాత్మకపదం అంటారు.

    ఉదా1: తాత అనే పదం తల్లి వాళ్ళ తండ్రికి & తండ్రి వాళ్ళ తండ్రికి కూడా వర్తిస్తుంది. పురుష లింగాన్ని సూచిస్తుంది. రెండు తరాల ముందువాడు అని కూడా తెలుపుతుంది, అత్త, పిన్ని లాంటి ఇతర పదాలు


    బంధుత్వ సమూహాలు

    బంధుత్వం నెలకొల్పుతున్న వ్యక్తుల సముదాయంను బంధుత్వ సమూహాలు అంటారు. ఇవి ప్రధానంగా రెండు రకాలు...

    1. నివాస బంధు సమూహం

    2. వంశానుక్రమ బంధు సమూహం


    1. నివాస బంధు సమూహం


    • దీనినే కుటుంబ బంధు సమూహం అని కూడా అంటారు.
    • వీరి మధ్య ముఖాముఖి సంబంధాలు ఉంటాయి.
    • దాదాపుగా ప్రాథమిక బంధువులై ఉంటారు.
    • నివాస బంధు సమూహంలో ప్రాథమిక రక్త బంధువులు, ప్రాథమిక వైవాహిక బంధువులు మాత్రమే ఉంటే వ్యష్టి కుటుంబం అంటాము. ద్వితీయ వైవాహిక బంధువులు & ద్వితీయ రక్త బంధువులు కూడా కలిసి ఉంటే ఉమ్మడి కుటుంబం అంటారు.
    • నివాస బంధు సమూహం, లైంగిక చర్యలు, సంతానం, పెంపకం, సాంఘీకరణ & సాంస్కృతిక వికాసం లాంటి విధులను నిర్వర్తిస్తాయి.


    2. వంశానుక్రమ బంధు సమూహం/వంశానుక్రమ నియమాలు/ వంశానుక్రమం


    ♦ ఒక తరం నుండి మరొక తరం వారిని కలిపే సామాజిక సూత్రాన్ని వంశానుక్రమం అంటారు.

    ♦ ప్రతీ సమాజం నందు కనిపిస్తాయి. స్పష్టంగా తెలిసిన / ఊహించిన సంబంధాల వల్ల ఒక తరానికి చెందిన వ్యక్తి ఇంకొక తరానికి చెందిన వ్యక్తితో కలుపబడే విధానాన్ని 'వంశానుక్రమ నియమం' అంటారు.

    ప్రపంచవ్యాప్తంగా వంశానుక్రమం

    1. ఏక వంశానుక్రమం

    2. ఏక వంశానుక్రమం కానివి గాగల బంధు సమూహాలుంటాయి.



    ఏక వంశానుక్రమ బంధు సమూహాలు


    ఏక వంశానుక్రమ సమూహంనకు చెందిన వారంతా ఒకే వంశకర్త సంతతికి చెందిన వారమని, తండ్రి వంశానుక్రమం/ తల్లి వంశానుక్రమం నుండి వంశ సభ్యత్వాన్ని ఆచరిస్తారు. కానీ రెండు వైపులా వంశ సభ్యత్వాన్ని ఆచరించరు. ప్రపంచంలో అత్యధిక సమాజాలు పాటిస్తున్నది ఏకవంశానుక్రమ ఆచరణయే. ఈ విధానంలో ఒక వ్యక్తికి చాలా దగ్గరి బంధువు కూడా అతడి వంశానుక్రమంలో సభ్యుడిగా ఉండలేకపోవచ్చు. ఉదా: పితృవంశానుక్రమం నందు ఒక వ్యక్తి యొక్క తల్లి యొక్క తల్లిదండ్రులు అతడి వంశ సభ్యులు కారు. కానీ అతని తండ్రివైపు నాలుగైదు తరాల ముందువారు కూడా వంశ సభ్యులే.


    ♦ తండ్రి ద్వారా పురుష సంతానానికి, సామాజిక సాంస్కృతిక, ఆర్థిక వారసత్వం కొనసాగితే పితృవంశానుక్రమం అంటారు.

    ఉదా: భారతదేశంలోని అధిక సమాజాలు.


    నోట్: వివాహం అయ్యేంత వరకు స్త్రీలకు పితృ వంశానుక్రమం ఉంటుంది.


    ♦ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక వారసత్వం తల్లి నుండి కూతుర్లకి ప్రవహిస్తున్నట్లైతే దానిని మాతృ వంశానుక్రమం అంటారు.

    ఉదా: హిమాలయ కాశీలు, మేఘాలయ గారోలు


    నోట్: పై తెగల యందు పురుషులు వివాహం అయ్యేంతవరకు మాత్రమే మాతృ వంశానుక్రమానికి చెందుతారు.


    ♦  ఒక వ్యక్తి కొన్ని ప్రయోజనాల నిమిత్తం తల్లి వంశానుక్రమాన్ని మరియు మరికొన్ని ప్రయోజనాల నిమిత్తం తండ్రి వంశానుక్రమాన్ని స్వీకరించడాన్ని ద్వంద్వ వంశానుక్రమం అంటారు. ఉదా: నీలగిరి తోడాలు, నైజీరియా యాకోలు, అశాంటీలు


    1. మిశ్రమ వంశానుక్రమం

    ఉదా: సమోవన్లు

    2. ద్విపార్శ్వ వంశానుక్రమం

    ఉదా: ఇబ్బన్లు


    ఏ వంశానుక్రమం కాని సమూహాలు


    పితృ వంశానుక్రమంను & మాతృ వంశానుక్రమంను రెండింటినీ ఏకకాలంలో పాటించే బంధు సమూహాలు. కొన్ని సమాజాలలో తల్లి నుండి కూతురికి, తండ్రి నుండి కొడుకుకి ఏకకాలంలో వంశానుక్రమాన్ని అందిస్తారు. అనగా మాతృ & పితృ వంశానుక్రమాలు రెండూ కూడా ఒకే తరంలో పాటించబడుతాయి. ఇలాంటి విధానాన్ని మిశ్రమ వంశానుక్రమం అంటారు. ఉదా: సమోవన్లు

    ఒక తరంలోని స్త్రీ & పురుషులిద్దరూ ఒకే కాలంలో అటు మాతృవంశానుక్రమాన్ని & పితృ వంశానుక్రమాన్ని పాటిస్తే వారిని ద్విపార్శావంశానుక్రమ సమాజాలు అంటారు. ఈ విధానంలో తల్లి తరపు బంధువులకి & తండ్రి తరపు బంధువులకి సమానమైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి బంధు సమూహాలని కిండ్రెడ్లు అంటారు. ఉదా: ఇబన్లు


    ఏక వంశానుక్రమ బంధు సమూహంలో బంధు సమూహాలు 5 రూపాలలో గోచరిస్తాయి.

    1. వంశము

    2. గోత్రము

    3. కూటమి

    4. ద్విశాఖ

    5. టోటెమ్ సమూహాలు


    వంశము (లీనేజ్):


    • రక్త సంబంధీకుల కూటమినే వంశం అంటారు.
    • ఏక రక్త బంధువులుగా గుర్తించబడే ఒకే పూర్వికుడి వారసుల సమూహాన్ని వంశం అంటారు.
    • ప్రతి వంశానికి ఒక పేరు ఉంటుంది. వంశ సభ్యులందరూ సమిష్టిగా ఉపయోగిస్తారు.
    • వంశం బహిర్వివాహ సమూహం.
    • వంశం నందు ఋజువు చేయగల మూల పురుషుడు ఉంటాడు.
    • 77% సమాజాలు పితృ వంశాన్ని పాటిస్తున్నాయి.
    • భారతదేశంలో వంశ నామాలు ఉంటాయి.
    • వంశము వంశ సభ్యుల యొక్క సాంస్కృతీకరణకు & సామాజీకరణకు తోడ్పడుతుంది.
    • ప్రతీ వంశం తనదైన సాంస్కృతిక ఆచారాలని, పద్ధతులని కలిగి ఉంటుంది.
    • ఆఫ్రికాలోని 'గుస్సి' సమాజాలలో వంశం సైనిక కూటమిగా పనిచేస్తుంది.
    • వంశ ఆచారాలు, ఉల్లంఘించిన వారికి శిక్షలు విధిస్తారు.
    • తెగల యందు వంశ కూటములలో సంఘటిత శక్తి అధికంగా ఉంటుంది.


    గోత్రము (క్లాన్):


    • గోత్రం వంశం కంటే విస్తృతమైనది. పురాతనమైనది.
    • కేవలం విశ్వాస ప్రాతిపదికనే ఏర్పడుతుంది.
    • రెండు కానీ, అంతకన్నా ఎక్కువ కానీ వంశాల సమూహాన్ని గోత్రం అంటారు.
    • ఊహజనితమైన పురాణ పురుషుడ్ని తమ సృష్టికర్తగా భావించే బంధు సమూహాన్ని గోత్ర సమూహం అంటారు.
    • ఉదా 1 : ఇండియా & చైనాలలో పితృ వంశ గోత్రాలని పాటిస్తారు.
      ఉదా 2 : నాయర్లు, క్యాక్యుటల్స్ నందు మాతృవంశ గోత్రాలని పాటిస్తారు.
    • ఈ సమూహాలలో అంతర్వివాహం ఉండదు.
    • వేరు వేరు కుటుంబాలకు చెందిన ఒకే తరం కుటుంబం.
    • సభ్యులు ఉమ్మడి గోత్రాన్ని కల్గి ఉంటే వారి మధ్య అగమ్యా గమన నిషేధాన్ని పాటిస్తారు.
    • గోత్రం, మత, రాజకీయ & ఆర్థిక ప్రకార్యాలను నిర్వహిస్తుంది.
    • రెండు /అంతకుమించి గోత్రాల కలయికను గోత్ర కూటమి అంటారు. ఉదా: కూకీలు, అయిమోలు.
    • ఒక తెగలోని సభ్యులందరూ కేవలం రెండు బంధు సమూహాలుగా మాత్రమే విడిపోతే దానిని ద్విశాఖ గోత్ర కూటమి అంటారు. దీనినే బంధుత్వ ద్వివిధ స్థాపన అంటారు. ఉదా: నీలగిరి తోడాల యందు 1. తార్తరోల్ 2. తివాతియాల్ అనబడే ద్విశాఖ గోత్ర కూటమి ఉంటుంది.


    టోటెమ్ వాదం 


    • ఎమైలీడరమ్ దీనిపై పరిశోధనలు చేశారు.
    • బంధు సమూహాలకి & ప్రకృతిలో ఉన్న వివిధ అంశాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉన్నదని భావించడమే టోటెమ్ వాదం. టోటెమ్ అనగా చిహ్నం లేదా గుర్తు అని అర్థం.
    • ఈ విధానంలో వృక్షాలను/జంతువులను/వస్తువులను ఆరాధిస్తూ వాటి నుండే ఉద్భవించామని, అవియే తమ గోత్రాన్ని రక్షిస్తున్నవని భావిస్తారు.
    • టోటెం సమూహ సభ్యులు బహిర్ వివాహాన్ని మాత్రమే పాటిస్తారు.
    • టోటెం యొక్క గుర్తులని ఒంటిపై, గోడలపై & స్థంభాలపై ప్రదర్శిస్తారు.
    • గోల్డెన్ విజర్ అనునతడు టోటెమ్ పై పరిశోధనలు చేసి దీనిని సామాజిక & మతపరమైన సంస్థ పేర్కొన్నాడు.

    పునశ్చరణ


    • బంధుత్వం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు హెన్రీ మెయిన్.
    • బంధుత్వం అనేది ప్రాథమిక సామాజిక సంస్థ.
    • వివాహం ద్వారా, రక్తసంబంధం ద్వారా, దత్తత ద్వారా మరియు సహజీవనం ద్వారా బంధుత్వ సభ్యులైతారు.
    • ఒక వ్యక్తికి 8 రకాలైన ప్రాథమిక బంధుత్వ సంబంధాలుంటాయి.
    • ఒక వ్యక్తికి గరిష్ఠంగా 7 రకాల ప్రాథమిక బంధువులుంటారు.
    • ఒక వ్యక్తికి గరిష్టంగా 33 రకాల ద్వితీయ బంధువులుంటారు.
    • ఒక వ్యక్తికి గరిష్టంగా 151 రకాల తృతీయ బంధువులుంటారు.
    • బంధువుల మధ్య కనపడే నిర్దిష్ట ప్రమాణాలు, ప్రవర్తనలు మరియు విలువలనే బంధుత్వ ఆచరణలు అంటారు.
    • కుహనా ప్రసూతి అనేది హిమాలయ భాసాలు మరియు నీలగిరి తోడాలలో కనపడుతుంది.
    • శ్రీలంకలోని వెడ్డాలలో వైదొలుగుడు నడవడి అనునది సోదరుడు మరియు సోదరి మధ్య కనపడుతుంది.
    • బంధుత్వ పదాలని ముర్డాక్ అనునతడు 3 ప్రధాన రకాలుగా వర్గీకరించాడు.
    • భారతదేశంలో అధిక శాతం జనాభా పితృవంశానుక్రమాన్ని పాటిస్తారు.
    • నీలగిరి తోడాలు మరియు అషాంటీలు ద్వంద్వ వంశానుక్రమాన్ని పాటిస్తాయి.
    • మిశ్రమ వంశానుక్రమాన్ని పాటిస్తారు.
    • ఇబన్లు ద్విపార్శ్వ వంశానుక్రమాన్ని పాటిస్తారు.


Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


No comments:

Post a Comment

Post Bottom Ad