1.11 ఎథ్నిసిటి - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Monday, July 10, 2023

1.11 ఎథ్నిసిటి

1.11 ఎథ్నిసిటి


    ఎథ్నిసిటి అనే పదం గ్రీకు పదమైన ఎథ్నో నుండి గ్రహించబడింది, దీని యొక్క అర్థం 'నేషన్'. ఎవరైతే ఆదిమ తెగలు సాధారణ ప్రభుత్వం మరియు సరళమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పరచుకొని తద్వారా తమయొక్క భౌగోళికతతో కూడిన జాతిపరమైనటువంటి అస్తిత్వాన్ని కలిగి ఉండేవారో వారిని ఉద్దేశించి ఎన్నిసిటి అనే పదం ఉపయోగించేవారు. కాని ప్రస్తుతం ఒకే రకమైన అస్తిత్వాన్ని కలిగి ఉన్న సమూహాన్ని ఉద్దేశించి ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు.

    ఉదా: మతపరమైన ఎథ్నిసిటీ, జాతిపరమైన ఎథ్నిసిటి, భాషాపరమైన ఎథ్నిసిటి మొ||


    ఎథ్నిసిటి బావన మరియు లక్షణాలు


    ♦ ఒకేరకమైన జన్యుపరమైన వారసత్వ లక్షణాలు లేదా ఒకేరకమైన భాష మరియు సంస్కృతి లేదా ఒకేరకమైన మతమును ఆచరించే జన సమూహాన్ని ఎథ్నిక్ సమూహాం అందురు. ప్రతి ఎథ్నిక్ సమూహం నందు ఏదో ఒక కోణంలో ఏకరూపకత ఉంటుంది.


    ఉదా: వర్ణం పరంగా: నీగ్రోలు, ఆర్యన్లు, ద్రవిడియన్లు మొ॥

               మత పరంగా: హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు మొ॥

               భాష పరంగా: తెలుగు ప్రజలు, తమిళులు, మరాఠీలు మొ॥

               జాతీయత పరంగా: భారతీయులు, చైనీయులు, అమెరికన్లు మొ||

               ఆదిమ లక్షణాల పరంగా: గిరిజనులు, ఆదివాసులు మొ||


    ♦ వర్ణం అనునది జన్యుపరమైన మరియు జైవిక పరమైన ఏకరూపకతను తెలియజేస్తుంది. కాగా ఎథ్నిసిటి అనే పదం పైన తెలిపిన విధంగా ఏదో ఒక కోణంలో ఏకరూపకత ఉన్నప్పుడు వినియోగించబడుతుంది.

    ♦ ఎథ్నిసిటి అనే బావన యందు మన సమూహం వారు మరియు బయటి సమూహం వారు అనే భావన బలంగా ఉంటుంది.

    ఉదా: ఒక మతాన్ని పాటించే వారికి వారి మతస్థుల పట్ల మన సమూహం వారు అనే బావన ఇతర మతస్థుల పట్ల బయటివారు అనే భావన ఉంటుంది.

    ♦ ఎథ్నిసిటి నందు ఉప ఎథ్నిసిటి కూడా ఉండవచ్చు.

    ఉదా:  హిందువులలో శైవం మరియు వైష్ణవం అనే మత శాఖలో, ద్రవిడియన్లలో ఉప విభాగాలుగా తమిళులు, మళయాళీలుగా ఉండడం మనందరికి తెలుసు.

    ♦ ఒకే సాంస్కృతిక, మత, వర్ణ, ప్రాంత, భాష లేదా జాతికి సంబంధించిన సభ్యుల మధ్య ఉమ్మడి లక్షణాలు ఉంటాయి, ఆయా ఉమ్మడి లక్షణాలనే జాతిపరమైన గుర్తింపు లేదా జాతిపరమైన అస్తిత్వం లేదా ఎథ్నిక్ ఐడెంటిటి అందురు. ఒక సమూహ సభ్యులను ఈ జాతిపరమైన అస్తిత్వం అనునది సిమెంట్ వలె అందరిని కలిపి ఉంచుతుంది.

    ♦ ఒక వ్యక్తికి వివిధ రకాల ఎథ్నిక్ ఐడెంటిటీలు ఉండవచ్చు.

    ఉదా: శర్మ అనునతడు కుల గుర్తింపు పరంగా బ్రాహ్మణుడు, జాతి ఆధారంగా ఆర్యుడు, మతం ఆధారంగా హిందువు, భాషా ఆధారంగా తెలుగువాడు మరియు పౌర కోణంలో భారతీయుడు.

    ♦ ఒక దేశంనందు గల ప్రధాన ఎథ్నిక్ సమూహం నందు వివిధ ఉప ఎథ్నిక్ సమూహాలు ఉండవచ్చు.

    ♦ వివిధ రకాల ఎథిక్ సమూహాల మధ్య అనుబంధ సామాజిక ప్రక్రియలు లేదా అననుబంధ సామాజిక ప్రక్రియలు ఉండవచ్చు.

    గమనిక: సహకారం, సమన్వయం, సర్దుబాటు, విలీణీకరణ లాంటివి అనుబంధ సామాజిక ప్రక్రియలు కాగా ఘర్షణ, పోటీ మరియు యుద్ధం లాంటివి అననుబంద సామాజిక ప్రక్రియలు.

    ఉదా: వివిధ మత సమూహాల మధ్య జరిగే ఘర్షణలు.

                బిన్న సంస్కృతులను కలిగి ఉన్న ప్రజలు ఏకత్వాన్ని ప్రదర్శించడం.

    ♦ తన జాతి సంస్కృతే గొప్పదనే భావన కలిగి ఉండడాన్నే ఎథ్నో సెంట్రిజం అని డబ్ల్యు.జి. సమ్నర్ అనునతడు తన యొక్క ఫోక్వేస్ అనే గ్రంథమునందు తెలిపాడు.

    ♦ ఒక ప్రాంతంలో నివసిస్తున్న వివిధ రకాల ఎథ్నిక్ సమూహాల మధ్యగల అసమానతలు, ప్రభుత్వ వివక్షత, అణచివేతలు, సంస్కృతిక పెత్తనం లాంటివి ఆయా సమూహాల మధ్య సంఘర్షణలకు దారి తీయవచ్చు.

    ♦ ఎథ్నిసిటి అనునది ఒక ప్రాబల్య సమూహంగా, సంస్కృతిక సమూహంగా మరియు రాజకీయ సమూహంగా కూడా ప్రవర్తిస్తుంది.

    ♦ జాతీయత అనే భావం నందు ఒకే ఎథ్నిసిటికి చెందిన ప్రజలు ఉండవచ్చు లేదా వివిధ రకాల ఎథ్నిక్ సమూహాలు కూడా ఉండవచ్చు.

    ఉదా: ఇజ్రాయెల్ జాతీయత నందు యూదులు మాత్రమే ఉంటారు, కానీ భారత జాతీయత నందు వివిధ రకాల మతాలకు, సంస్కృతులకు చెందినవారు కూడా ఉంటారు.

    ♦ ఆధునికత, నగరీకరణ, పారిశ్రామికీకరణ, ధరిత్రీకరణ, వస్తు సంస్కృతీ పెరగడం మరియు సేవా రంగం దినదినం అభివృద్ధి చెందడం లాంటివి మనుషులు ఎథ్నిసిటి హద్దులు దాటి ఆలోచించేలా చేస్తున్నాయి.


    భారతదేశంలో ఎథ్నిక్ సంబంధాలు


    భారతదేశం నందు ఎథ్నిక్ పరమైన భిన్నత్వం కలదు, ఇది ప్రధానంగా: వర్ణపరమైన ఎథ్నిక్ సమూహాలు, భాషపరమైన, గిరిజన పరమైన, ప్రాంతం పరమైన, మత పరమైన, కుల పరమైన భిన్నత్వంతో కూడిన ఎథ్నిక్ సమూహాలు కలవు, ఆయా సమూహాల మధ్య అనుబంద మరియు అననుబంద సామాజిక ప్రక్రియలు గోచరిస్తూ ఉంటాయి. ఇవి భాషతత్త్వం, కుల తత్త్వం, మత తత్త్వం, ప్రాంతీయతత్త్వం లాంటి రూపాలలో వ్యక్తమవుతాయి.


    గమనిక: పైన పేర్కొన్న బిన్నత్వానికి సంబంధించిన అంశాలను మొదటి చాప్టర్లో మరియు రెండవ యూనిట్ నందు వివరంగా తెలపడమైనది.


    ముఖ్యమైన పదజాలం


     
         
       
       


    సంప్రదింపు గ్రంథాలు


    1. అహుజ, రామ్, ఇండియన్ సోషల్ సిస్టమ్, రావత్ పబ్లికేషన్, జైపూర్

    2. కపాడియా, కె.యం. మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, బాంబే

    3. మండెల్బామ్, సొసైటీ ఇన్ ఇండియా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రీస్

    4. శంకర్ రావ్ సి.ఎన్., సోషియాలజి ఆఫ్ ఇండియన్ సొసైటీ, ఎస్ చాంద్ అండ్ కంపెనీ.

    5. శంకర్రావ్ సి.ఎన్, సోషియాలజి ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషియాలజి, ఎస్ చాంద్ అండ్ కంపెనీ

    6. సామాజిక నిర్మితి, వివాదాలు మరియు విధానాలు, తెలుగు అకాడమీ, తెలంగాణ

    7. సోషల్ ఇష్యూస్ ఇన్ ఇండియా, తెలుగు అకాడమీ, తెలంగాణ

    8. భారతీయ సమాజం, తెలుగు అకాడమీ, తెలంగాణ

    9. భారతీయ సమాజం అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ పాఠ్యపుస్తకం

    10. వార్షిక నివేదిక, గిరిజన అభివృద్ధి మంత్రిత్వ శాఖ

    11. పెండ్యాల సత్యనారాయణ ఇస్లాం ధర్మశాస్త్రం, స్నేహ పబ్లికేషన్స్

    12. ఎన్. హెచ్.ఎఫ్. ఎస్ నివేదికలు


     వివాహ చిత్రాలు




Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


No comments:

Post a Comment

Post Bottom Ad