3.1 సామాజిక విధానాలు మరియు సంక్షేమం - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Monday, July 17, 2023

3.1 సామాజిక విధానాలు మరియు సంక్షేమం

3.1 సామాజిక విధానాలు మరియు సంక్షేమం


    సంక్షేమం భావన


    విలియం వివరెడ్డ్‌ మరియు కీన్‌ ల యొక్క నివేదిక నందు సామాజిక సంక్షేమం యొక్క ఆధునిక భావనలు గోచరిస్తాయి. సంక్షేమ రాజ్యం అనే భావనను మొదటిసారిగా ఉపయోగించిన వారు టిట్మస్‌ మరియు మార్చల్‌. విలియం బివరెడ్డ్‌ అనునతడిని ఆధునిక సంక్షేమానికి పితామహుడిగా  పేర్కొంటారు, వీరు ఇంగ్లాండ్‌కు చెందిన వారు. 


    మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు అయ్యే విధంగా మరియు వికాసం చెందే విధంగా చేపట్టే వ్యవస్థీకృత రార్యక్రమాలనే సంక్షేమం అందురు - ఐక్యరాజ్యసమితి.


    సంక్షేమ సేవలు మరియు ప్రజాసేవలు అనునవి వేరువేరు అంశాలు, బలహీన వర్గాలను వృద్ధిచెందించేందుకు ఉద్దేశించిన సేవలు సంక్షేమ సేవలు కాగా, విద్యా, వైద్యం, రోడ్లు లాంటి సేవలు ప్రజలందరికి ఉద్దేశించినవి. వీటిని ప్రజాసేవలు అని అంటారు - దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌.


    సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం మరియు సామాజిక సమరసతను పెంచే విధంగా దోహదపడే కార్యక్రమాల మొత్తాన్ని సంక్షేమ కార్యక్రమాలు అంటారు- పంచవర్ష ప్రణాళికలు


    తారతమ్యాలను & దోపిడీలను తొలగించి అభివృద్ధి అవకాశాలను ఐలహీనవర్గాలకు అందించేదే సంక్షేమసేవలు - జవహర్‌లాల్‌ నెహ్రు


    పై నిర్వచనాల ఆధారంగా సంక్షేమ సేవలు అనగా సమాజంలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక కారణాల వల్ల సామాజిక వెలికి, సామాజిక వెనుకబాటుతనానికి, హక్కుల ఉల్లంఘనలకు & కనీస జీవన ప్రమాణాలకు దూరమైన వర్గాలకు అందించే సేవలు.


    సంక్షేమ సేవల యొక్క లక్ష్యాలు


    • బలహీన వర్గాలను సాధారణ స్థితికి తీసుకురావడం.
    • బలహీన వర్గాల హక్కుల సంరక్షణ మరియు వారిపై జరుగుతున్న దాడులను అరికట్టడం.
    • కనీస సౌకర్యాలు కల్పించడం.
    • బలహీన వర్ణాలను సామాజిక సంలీనంనకు గురిచెయ్యడం
    • ప్రత్యేక అవకాశాలు, రక్షణలు మరియు సేవలు అందించడం.
    • బలహీన వర్గాలను సమాజంలో అభివృద్ధి చెందిన వర్గాల స్థాయికి తీసుకురావడం.
    • బలహీన వర్గాలకు విద్య, వైద్యం, సాధికారిత, రక్షణ లాంటి ప్రత్యేక సేవలు అందించడం.
    • సంక్షేమ సేవల అంతిమలక్ష్యం సామాజిక న్యాయాన్ని సమానత్వాన్ని మరియు సామాజిక నియంత్రణని సాధించడం.


    ప్రజాసేవలు వర్సెస్‌ సంక్షేమ సేవలు


    ప్రజలందరి కోసం ఉద్దేశించిన వాటిని ప్రజాసేవలు లేదా సాధారణ సేవలు అంటారు. కేవలం బలహీన వర్ణాల అభ్యున్నతి కోసం మరియు వారి వెనుకబాటుతనాన్ని రూపుమాపడం కోసం ఉద్దేశించిన సేవలనే సంక్షేమ సేవలు అంటారు.

    ప్రజాసేవలు: రోడ్డు సౌకర్యాలు, ఆసుపత్రి సౌకర్యాలు, విద్యా సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు, పార్కు సౌకర్యాలు మొదలగునవి.

    సంక్షేమ సేవలు: రిజర్వేషన్లు, ప్రత్యేక కార్బోరేషన్లు, ప్రత్యేక సంక్షేమ పథకాలు, ప్రత్యేక సంస్థలు.


    భారతదేశంలో సంక్షేమ యంత్రాంగం


    రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యం సంక్షేమ రాష్ట్రాన్ని స్థాపించడం.

    రాజ్యాంగం రూపొందించే నాటికి భారతదేశంలో ఉన్నటువంటి వివక్షతలు, వెనుకబాటు తనం, పేదరికం, కులపరమైన దాడులు, మహిళలల్లో వెనుకబాటు తనం, అసమానతలు తీవ్రంగా ఉందేవి వాటిని రూపుమాపేందుకై రాజ్యాంగం అనే మూలశాసనం మార్గదర్శకత్వంలో ఎన్నికైన ప్రభుత్వాలు ఈ క్రింది మార్గాలలో సంక్షేమాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నవి.


    ఎ. రాజ్యాంగం ద్వారా సంక్షేమం: రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వాల నిర్మాణం మరియు అవి పనిచేయవలసిన విధానాన్ని తెలపడం మాత్రమే కాకుండా సంక్షేమ రాజ్యాన్ని స్థాపించేందుకు పాటించవలసిన అంశాలను కూడా తెలుపుతుంది.

    • రాజ్యాంగ పీఠికలో సామాజిక, ఆర్థిక న్యాయం, స్వేచ్చ, సమానత్వం అనే అంశాలను సంక్షేమ రాజ్య లక్ష్యాలుగా భావించవచ్చు.
    • తరతరాలుగా పీడనాలకు లోనైన బలహీన వర్గాలకు ప్రాథమిక హక్కుల రూపంలో వ్యక్తిగత స్థాయిలో సంక్షేమాన్ని అందించినవి.
    • సమాజ స్థాయిలో సంక్షేమం ఎలా ఉండాలి బలహీన వర్ణాలను ఎలా అభివృద్ధి చెందించాలి మరియు సామాజిక విధానాలను ఎలా రూపొందించాలి అనునవే రాజ్యవిధాన ఆదేశిక సూత్రాలరూపంలో కలవు.
    • రాజ్యాంగంలోని వివిధ విభాగాలలో సంక్షేమ రాజ్యానికి సంబంధించిన అంశాలు పొందుపర్చబడినవి.


    నోట్‌: బలహీన వర్గాలు మరియు రాజ్యాంగం నందు గల అంశాలను రాబోయే ఛాష్టర్లయందు వివరించడం జరిగింది.


    బి. పంచవర్న ప్రణాళికలు-సామాజిక సంక్షేమం: నీతిఅయోగ్‌ ఏర్పడేంత వరకు ఒక ప్రణాళిక ప్రకారం సంక్షేమ రాజ్యాన్ని స్థాపించేందుకు 12 పంచవర్ష ప్రణాళికలను అమలుచేయడం జరిగింది. ప్రస్తుతం దాని స్థానంలో నీతిఅయోగ్‌ సేవలను అందిస్తున్నది.


    సి. బలహీన వర్గాల రక్షణ కోసం ప్రత్యేక శాసనాలను రూపొందించి అమలుచేస్తుంది (ఎస్‌.సి, ఎస్‌.టి, వి.సి, మైనార్టీ వికలాంగులు, మహిళలు, వృద్ధులు)


    డి. జాతీయ స్థాయిలో హక్కుల సంరక్షణ సంస్థలను స్థాపించడం జరిగింది. ఉదా: ఎస్‌.సి కమీషన్‌, ఎస్‌.టి.


    ఇ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను రూపొందించి అమలుపరుస్తున్నవి. ఇందుకోసమే ప్రత్యేక మంత్రిత్వ శాఖలను ఏర్పాటుచేయడం జరిగింది.


    1. 1958వ సంవత్సరంలో కేంద్రంలో సామాజిక సంక్షేమ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేశారు 1998 నుండి ఈ మంత్రిత్వశాఖను సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వశాఖగా పిలుస్తున్నారు. ఈ మంత్రిత్వశాఖ ఎస్‌.సి. ల సంక్షేమం, ఓ.బి.సి. ల సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, వృద్ధుల సంక్షేమం, ౩3వ లింగం వారి సంక్షేమం మరియు భిక్షాటన ఉ మాదక ద్రవ్యాల బానిసలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను మరియు విధానాలను అమలుపరుస్తున్నది.

    2. 1999వ సంవత్సరంలో కేంద్రంలో గిరిజన అభివృద్ధి మంత్రిత్వశాఖను ఏర్పాటుచేశారు.

    3. 30 జనవరి 2006న మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖను ఏర్పాటుచేశారు.


    సామాజిక విధానం (సోషల్‌ పాలసీ)


    ఆధునిక రాజ్యాలు రాజ్యాంగ బద్ధంగా ప్రజలయొక్క అభివృద్ధి కోసం ప్రజలచేత ఎన్నుకోబడి 'సేవలందిస్తాయి అందులో భాగంగా ప్రజల యొక్క అవసరాలను అధ్యయనం చేసి వనరులను సమీకరించుకొని, లక్ష్యాలను నిర్ధారించుకొని, ఆయా లక్ష్యాలను చేరుకునే మార్గాలను నిర్వచించుకొని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసేందుకై రూపొందించుకునే ప్రణాళికనే సామాజిక విధానం అంటారు.


    ప్రజల యొక్క స్థితిగతులను, బలహీన వర్షాల అభివృద్ధిని మరియు కావలసిన సామాజిక మార్చును తీసుకురావడానికి ప్రభుత్వాలు రూపొందించుకునే కార్యాచరణ ప్రణాళికనే సామాజిక విధానం అంటారు.


    ప్రభుత్వం తనయొక్క విధి నిర్వహణలో ఖాగంగా వివిధ రకాల కార్యచరణ ప్రణాళికలను రూపొందించుకుంటుంది.

    ఉదా.... 

    • రక్షణ సంబంధిత అంశాల కోసం - రక్షణ విధానాలు
    • ఆర్థిక సంబంధిత అంశాల కోసం - ఆర్థిక విధానాలు
    • విదేశాలతో సంబంధ బాంధవ్యాల కోసం - విదేశాంగ విధానం
    • విదేశీ వాణిజ్యం కోసం - ఎగుమతులు, దిగుమతుల విధానం

    పై విధంగానే దేశంలోని సామాజిక సమస్యలను ఎదుర్మోవడానికి, బలహీన వర్గాల యొక్క సమస్యలను రూపుమాపడానికి మరియు ఆయా వర్గాలను సంక్షేమాన్ని అందించడానికి ప్రభుత్వాలు ఏర్పరుచుకున్న లేదా అనుసరిస్తున్న కార్యాచరణ ప్రణాళికనే సామాజిక విధానాలు అంటారు.


    ♦ సామాజిక విధానాల రూపకల్పన అనునది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత. సామాజిక విధానాలను మంత్రి మండలి ఉమ్మడిగా రూపొందించగా సంబంధిత మంత్రిత్వశాఖ ఆ విధానాలను అమలు పరుస్తుంది.

    ♦ నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో విధానాల రూపకల్పన యందు ప్రజాభాగస్వామ్యం అనునది ప్రజాభిప్రాయ సేకరణ, పౌరసంఘాల అభిప్రాయ సేకరణ, లక్షిత వర్గాల అఖభిప్రాయసేకరణ, శాసన సభలలో చర్చలు, రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు మరియు అభ్యంతరాల సేకరణ లాంటి రూపాలలో కొనసాగుతుంది.

    ఉదా: నూతన విద్యా విధానాన్ని రూపొందించినప్పుడు ప్రజలు మరియు పౌరసమాజం యొక్క సూచనలు మరియు సలహాలు తీసుకునేందుకు సమయం ఇవ్వడం జరిగింది.


    ప్రస్తుతం అమలులోనున్న సామాజిక విధానాలు





Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


1 comment:

Post Bottom Ad