సింధు నాగరికత - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Friday, June 21, 2024

సింధు నాగరికత

👉 సింధూ నాగరికత 1921లో బయల్పడింది. ఈ నాగరికత త్రవ్వకాలు సర్ జాన్ మార్షల్ నాయకత్వంలో సాగాయి.

👉 ఈ నాగరికత క్రీ.పూ. 2500 నుండి 1750 (వీలర్ ప్రకారం) కాలానికి చెందింది.

👉 భారతదేశపు మొదటి సర్వే జనరల్ - సర్ జాన్ మార్షల్. ఇతను "మెహంజొదారో అండ్ ది ఇండస్ సివిలైజేషన్" అనే పుస్తకంను వ్రాసెను.

👉 ఇతనిని భారతీయ ప్రాచీన చరిత్ర పితామహుడుగా వర్ణిస్తారు.

సింధు నాగరికత సరిహద్దులు : ఉత్తరాన జమ్ము కాశ్మీర్ లోని 'మాండా', దక్షిణాన మహారాష్ట్రలోని దైమాబాద్ (మహారాష్ట్ర), పశ్చిమాన బెలూచిస్థాన్, తూర్పున ఆలంగీర్పూర్ (ఉత్తరప్రదేశ్).
జ మనదేశంలో సింధు నాగరికత ప్రదేశాలు అధికంగా 'గుజరాత్ ' లో బయటపడ్డాయి.

ఈ నాగరికతకు గల ఇతర పేర్లు:

1. హరప్పా నాగరికత : మొదటిసారిగా సింధు త్రవ్వకాలలో బయటపడిన ప్రాంతం [హరప్పా (1921)].
2. కాంస్యయుగ నాగరికత: కాంస్యం అనగా రాగి తగరంల మిశ్రమం.
3. చారిత్రక సంధియుగ నాగరికత : సింధు ప్రజల లిపి బొమ్మల లిపి. దీనిని ఎవ్వరూ వివరించలేకపోయారు.
4. భారతదేశ మూల నాగరికత భారతదేశంలో మొదటి నాగరికత కాబట్టి.
👉 ఈ యుగానికి చారిత్రక సంధియుగం అని పేరు పెట్టింది - H.D. శంకాలియా.
👉 మొత్తం 13,00,000 చ.కి.మీ.లో ఈ నాగరికత విస్తరించి ఉన్నది.
👉 ప్రపంచంలో విస్తీర్ణం దృష్ట్యా పెద్ద కాంస్యయుగ నాగరికత ఇదే.

సింధూ నాగరికత నిర్మాతలు :

1) మంగోళాయిడ్లు
2) ప్రోటో ఆస్ట్రాలయాయిడ్లు
3) ఆల్బినాయిడ్లు
4) మెడిటెరియన్ జాతి

వీరు ద్రావిడ భాష ని అభివృద్ది చేశారు కాబట్టి వీరిని ద్రావిడులు / ద్రావిడ జాతి అంటారు.

👉 సింధు నాగరికతకు సంబంధించి భారత దేశంలో మొత్తం 925 నగరాలు త్రవ్వకాలలో బయటపడ్డాయి.

👉 పాకిస్తాన్లో 475 నగరాలు బయటపడ్డాయి.

👉 మొత్తం 1400 నగరాలు సింధు నాగరికతకు సంబంధించి ఇప్పటివరకు బయటపడడం జరిగింది.

సింధు నాగరికత కాలంలో ముఖ్యమైన నగరాలు:

1) హరప్పా:

👉 ఇక్కడ 1921 లో దయారాం సహాని తవ్వకాలు జరిపారు.
👉 హరప్పా నగరం రావి నది ఒడ్డున కలదు.
👉 హరప్పా నగరం ప్రస్తుతం పాకిస్థాన్లోని పంజాబ్ ప్రాంతంలో మౌంట్ గోవరి జిల్లాలో కలదు.

బయటపడిన వస్తువులు:

👉 ఇక్కడ 6 ధాన్యాగారాలు బయటపడ్డాయి.
👉 కాంస్యంతో చేసిన ఎడ్ల బండి బొమ్మలు దొరికాయి వీటినే ఎక్కాలు అంటారు
👉శివ పేటిక ,H ఆకారం గల స్మశాన వాటిక, కంచు అద్దాలు, రాతితో చేసిన నటరాజ విగ్రహం, ఎర్రరాయితో చెక్కబడిన యక్షుని మొండెం బయటపడ్డాయి.

2. మొహంజోదారో :

👉 ఇక్కడ 1922లో R.D బెనర్జీ తవ్వకాలు జరిపారు.
👉 మొహంజోదారో సింధూ నది ఒడ్డున కలదు.
👉 ప్రస్తుతం ఈ నగరం పాకిస్తాన్లోని సింధూ రాష్ట్రంలో లార్కాన జిల్లాలో కలదు.
👉 మొహంజదారు అనగా వృత్తుల దెబ్బ అని అర్థం.
👉మొహంజోదారో సింధు నాగరికతలో అన్నిటికంటే పెద్ద నగరం.

బయటపడిన వస్తువులు :

👉 మహా స్నాన వాటిక, మహాధాన్యగారం, దేవాలయం లాంటి కట్టడం, కాంస్యపు నాట్యగత్య విగ్రహం, స్టీయోటైట్ తో చేసిన గడ్డంతో కూడిన పురుషుని తల, స్థూపాకారంతో ఉన్న మూడుముద్రికలు.

3) చన్హోదారో
👉 ఇక్కడ 1935లో ఎం.డి.మజుందార్ తవ్వకాలు జరిపారు.
👉 ఇది సింధు నది ఒడ్డున ఉంది .
👉 ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో కలదు .

ఇచ్చట బయటపడిన వస్తువులు
👉 పూసల తయారీ పరిశ్రమలు
👉 పిల్లికి సంబంధించిన ఆనవాళ్లు
👉 లిప్స్టిక్
👉 సిరా బుడ్డి

4)లోథాల్ :
👉 ఇక్కడ 1955లో ఎస్ ఆర్ రావు తవ్వకాలు జరిపారు.
👉 ఇది భోగావా నది ఒడ్డున కలదు
👉ప్రస్తుతం ఈ నగరం గుజరాత్ లో కలదు.
👉 లోధాల్ అనగా సింధు భాషలో మృతుల దిబ్బ
👉 ఇది సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం కృత్రిమ ఓడరేవు
👉 ఒకే సమాధిలో రెండు శవాలు ఇక్కడ లభించాయి
👉 హోమగుండం దొరికింది
👉 ముద్రిక పైన ఓడ బొమ్మ లభించింది 👉 దీనిని మినీ హరప్పా, మినీ మొహంజోదారో అని పిలుస్తారు

5) కాళీ బంగన్:
👉 ఇక్కడ 1961లో B.B లాల్, B.K థాపర్ తవ్వకాలు జరిపారు.
👉 ఇది గగ్గర్ నది ఒడ్డున కలదు.
👉 ప్రస్తుతం ఈ నగరం రాజస్థాన్లో కలదు. 👉 ఇచ్చట ఏడు హోమ గుండాలు లభించాయి వీటి ప్రక్కన ఎముకుల దొరికాయి.
👉 ఖాళీ భంగన్ అనగా నల్లని గాజులు అని అర్థం.
👉 నాగలితో దున్నిన ఆనవాళ్లు ఇక్కడ బయటపడ్డాయి.



👉 సింధు ప్రజలు పట్టణాలలో నివశించారు.
👉 నగర పశ్చిమ భాగంలో కోటల రూపంలో ప్రధాన నిర్మాణాలు గలవు.
👉 రక్షణగోడ కోటలేని ఏకైక నగరం - ఛానుదారో.
👉 మూడు భాగాలుగా విభజించబడిన నగరం - ధోలవీర.
👉 రోడ్ల నిర్మాణం, చదరంగంను పోలి ఉంటుంది. (గ్రిడ్ వ్యవస్థ)
👉 గ్రిడ్ వ్యవస్థలో లేని నగరం - బన్వాలీ.
👉 భూగర్భ మురుగు నీరు వ్యవస్థ ఉండేది.
👉 భూగర్భ కాలువలు లేని నగరం బనవాళి.
👉 ప్రస్తుతం గ్రిడ్ వ్యవస్థలో నిర్మించబడిన ఏకైక నగరం - చంఢీఘర్ .
👉 గ్రిడ్ పద్ధతిలో నిర్మించబడిన కట్టడం - తాజ్మహల్,
👉 కాల్చిన ఇటుకలను నిర్మాణాలకు ఉపయోగించారు. వీరు ఇటుకల తయారీలో గొప్ప నైపుణ్యం ప్రదర్శించారు.
👉 జాన్ మార్షల్ అభిప్రాయం ప్రకారం మాతృస్వామ్య వ్యవస్థ ఉంది.
👉 సింధు నాగరికతకు సంబంధించిన పరిపాలన (రాజకీయ వ్యవస్థ) స్వరూపం గూర్చిన సమాచారం లభించుటలేదు.
👉 వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం.
👉 వీరు ప్రధానంగా వ్యవసాయం రబీ పంటకాలంలో చేసేవారు.
👉 వరదనీటికి అడ్డుకట్టలు నిర్మించి వ్యవసాయం చేసేవారు. వీటిని గబర్ బంద్ (డ్యాం)లు అందురు.
👉 వీరి ప్రధాన పంటలు - గోధుమ, బార్లీ, వరి, నువ్వులు, ప్రత్తి.
👉 ప్రపంచంలో తొలిసారి ప్రత్తి, వరిని సాగుచేసినవారు - సింధు ప్రజలు.
👉 లోథాల్లో వరి గింజలు, రంగాపూర్లో వరి పొట్టు (గుజరాత్) లభించాయి.
👉 బనవాలి (హర్యానా) టెర్రకోటలో నాగలి బొమ్మ లభించింది.
👉 కాళీభంగన్ (రాజస్థాన్) నాగలి చారలు కలిగిన భూములు (Furrous) కన్పించాయి.
👉 వీరికి గుర్రం తెలియదని సాధారణంగా భావిస్తారు. కాని గుర్రం యొక్క ఆధారాలు లభించిన ప్రాంతం - సుర్కోటడ (గుజరాత్) - గుర్రం అస్థిపంజరం.
👉 లోథాల్ - టెర్రకోట గుర్రం బొమ్మ,
👉 నౌకాపరిశ్రమ కేంద్రం - లోథాల్.
👉 ప్రపంచంలో వెండిని మొదటిసారిగా వాడినవారు సింధు ప్రజలు.
👉 వీరు మెసపటోమియా, పర్షియా, ఆఫ్ఘనిస్థాన్లతో విదేశీ వ్యాపారం చేశారు.
👉 హరప్పా, మెసపటోమియాల మధ్య వ్యాపార కేంద్రంగా ‘దిలున్' (బహ్రెయిన్) ద్వీపకల్పం వ్యవహరించేది.
👉 సుమేరియా గ్రంథాలు సింధు ప్రాంతాన్ని మొలుహగా వర్ణించాయి.
👉 వీరు కుమ్మరి చక్రాన్ని విస్తృతంగా ఉపయోగించారు.
👉 వీరు తూకాలలో 16 యొక్క గుణిజాలు వాడారు.
👉 వీరు నిర్మాణాలలో 'ఇంగ్లీష్ బాండ్' అనే పద్ధతి ఉపయోగించారు.
👉 సింధు ప్రజలు ముద్రలు మెత్తటి స్టియోటాయిట్ రాతి పైన ముద్రించేవారు.
👉 వీరి లిపికి బొమ్మల లిపి (పిక్టోగ్రఫీ) అని పేరు.
👉 ఈ లిపిని ఇంతవరకు సమగ్రంగా ఎవ్వరూ వివరించలేకపోయారు. ఇది ద్రవిడ లిపిని పోలి ఉన్నది.
👉 ఎడమ నుండి కుడికి, కుడి నుంచి ఎడమకు వ్రాసేవారు. ఈ విధానానికి సర్పలేఖనమని పేరు.
👉 వస్తు మార్పిడి పద్ధతి ద్వారా వ్యాపారం.

సింధు ప్రజలకు పవిత్రమైనవి పూజ్యనీయమైనవి :

1) జంతువు - మూపురం గల ఎద్దు (వృషభం)
2) పక్షి - పావురం
3) చెట్టు - రావి చెట్టు
4) గుర్తు - స్వస్తిక్
5) నదీ జంతువు - మొసలి

సింధు ప్రజలకు తెలియనివి :

1) జంతువు - గుర్రం
2) అడవి జంతువు - సింహం
3) లోహం - ఇనుము
4) పంట - చెరకు
5) ఆయుధాలు - డాలు, శిరస్త్రాణం

మత వ్యవస్థ:

👉 అమ్మతల్లి అనే స్త్రీ దేవతను పూజించారు.
👉 పశుపతి మహాదేవ అనే పురుష దైవంను పూజించారు.
👉 పశుపతి మహదేవ్ ముద్రలపై గల జంతువులు - ఏనుగు, పులి, ఖడ్గమృగం, దున్న.

సింధూ నాగరికత అంతానికి కారణాలు :
1. మార్టిమర్ వీలర్ (1945) ప్రకారం, ఆర్యుల దండయాత్ర వలన అంతమైంది. ఇతను "ఇండియన్ సివిలైజేషన్" అనే గ్రంథం వ్రాసాడు.
2. G.F. డేల్స్ ప్రకారం వరదల వల్ల అంతమైంది.
3. రాబర్ట్ L. రైక్స్ ప్రకారం భూకంపాల వల్ల అంతమైంది.
4. సింధు సమాజంలోని అంతర్గత క్షీణత వలన పతనం చెందింది - గార్డెన్ చైల్డ్.
5. 7 సార్లు వరదల వల్ల అంతమై, పునర్నిర్మించబడింది - మొహంజొదారో
ఆ సమాధులలో శవాలతోపాటు కానుకలు, వస్తువులు ఉంచేవారు.
లోథాల్లో సతీ సహగమన ఆచారం తెలిపే సమాధి బయటపడింది.







No comments:

Post a Comment

Post Bottom Ad