9. స్కూల్ అసిస్టెంట్ - అదనపు అంశాలు - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Thursday, June 13, 2024

9. స్కూల్ అసిస్టెంట్ - అదనపు అంశాలు

IX స్కూల్ అసిస్టెంట్ - అదనపు అంశాలు


స్కూల్ అసిస్టెంట్ కు ప్రిపేర్ అయ్యేవారు ముందు వివరించిన పాఠ్యాంశాలతో పాటు ఈ అనుబంధంలో ఇవ్వబడిన అంశాలను కూడా అధ్యయనం చేయవలసి ఉంటుంది.

1. తరగతి గది నిర్వహణ - ప్రేరణ

2. తరగతి గది నిర్వహణ - సామూహిక గతిశీలత

3. ప్రత్యక్షం

4. అభ్యసనం - రకాలు

5. ఆలోచన


1. తరగతి గది నిర్వహణ- ప్రేరణ

  • శరీరావసరాల నుంచి ఏర్పడి, ఏదైనా గమ్యంవైపుకు ఉద్దేశించిన ప్రవర్తనను ప్రేరణ అంటారు.
  • ప్రేరణ లేని అభ్యసనం జరగదు.
  • Motivation అనే ఆంగ్లపదం "Movere" అనే లాటిన్ పదంనుండి ఉద్భవించింది.
  • "Movere" అనగా కదలిక అని అర్ధం.
  • వ్యక్తి అవసరాలు, అభిరుచులు, సహజాతాలు, ప్రోత్సాహకాలు మొదలైన కారకాలు వ్యక్తిలో చర్యను ఉద్దీపింపచేసి ప్రేరణను కలుగచేస్తాయి.
  • ప్రేరణ అనేది “గమ్యనిర్ధేశిక చర్య" - మేయర్.
  • “ప్రేరణ వ్యక్తి అవసరాలను అనుసరించి ఉంటుంది." - మాస్లో.

ప్రేరణ రకాలు:

ప్రేరణ రెండు రకాలు అవి : 1. అంతర్గత ప్రేరణ 2. బాహ్య ప్రేరణ


1. అంతర్గత ప్రేరణ :

- ఒక పని చేయాలంటే ఎవరి బలవంతం లేకుండా చేయడాన్ని అమతర్గత ప్రేరణ అని అందురు.

- విద్యార్థి తనంతటతానే పాఠశాలకు వెళ్ళడం అంతర్గత ప్రేరణ గా చెప్పవచ్చు.

- బహుమతులుగాని, ఇతరుల మెప్పు పొందడానికి కూడా చేసే పనులు కూడా చేసే పనులు కూడా అంతర్గత ప్రేరణకు ఉదాహరణలు.

- వ్యక్తి తనంతట తానే స్వయంగా నేర్చుకోవాలనే కోరిక కలగటం, గౌరవం లేదా కీర్తి పొందాలనే తపన, తన అభిరుచికి అనుగుణంగా శారీరక అవసరాలు, సంతృప్తి కోసం చేసే పనులు మొ||అంతర్గత ప్రేరణలు.


2. బహిర్గత ప్రేరణ :

- విద్యార్థి అవసరాలకు గాని, అభిరుచులకు గాని సంబంధం లేకుండా ఒక పని చేయడానికి సహకరించే ప్రతీ కారకాన్ని బహిర్గత ప్రేరణ లేదా కృత్రిమ ప్రేరణ అంటారు.

ఉదా : విద్యార్ధిని పొగడటం ద్వారా, అభినందించడం ద్వారా, గౌరవించడం ద్వారా అతన్ని లక్ష్య సాధనకు

- ఒకరు నిర్దేశించిన గమ్యం, భయపెట్టి చేయించడం బహిర్గత ప్రేరణ కింద చెప్పవచ్చు.


మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం :

మాస్లో అయిదు అవసరాలను పేర్కోని వాటిని రెండు వర్గాలుగా చేసారు.

A. నిమ్నక్రమ అవసరాలు : శారీరక అవసరాలు, రక్షణ అవసరాలు.

B. ఉన్నత క్రమ అవసరాలు : ప్రేమ సంబంధిత అవసరాలు, గుర్తింపు, గౌరవ అవసరాలు, ఆత్మ ప్రస్తావన అవసరాలు.


1. శారీరక అవసరాలు : గాలి, నీరు, ఆహారం, దప్పిక, నిద్ర, లైంగిక ఉత్సుకత, మాతృ ఉత్సుకత.

2. రక్షణ అవసరాలు : భద్రత, గృహం, ఇతరులతో కలసి ఉండటం, పెద్దలు తోడు కావాలనుకోవడం

3. ప్రేమ సంబంధిత అవసరాలు : ఇతరుల ప్రేమ, మమత, అనురాగం కావాలనుకోవడం, స్నేహం, వ్యక్తిగత సంబంధాలు.

4. గుర్తింపు, గౌరవ అవసరాలు : ఇతరులు గుర్తించాలనుకోవడం, గౌరవించాలనుకోవడం, పరువు ప్రతిష్టలు సంపాందించాలనుకోవడం, సమాజంలో సమాజిక అంతస్థు ఉండాలనుకోవడం.

5. ఆత్మ ప్రస్తావన : అన్ని విషయాలలో ఆత్మసాఫల్యం సాధించాలనుకోవడం.


గమనిక:

- పొగడ్త - నింద రెండూ కూడా సమర్ధవంమైన ప్రోత్సాహకాలే అని ఎలిజబెత్ హార్లాక్ తాను నిర్వహించిన పరిశోధనల ద్వారా తెలిపింది.

- పొగడ్త, నిందలలో ఏది ఎక్కువగా ప్రభావం చూపిస్తుందనేది విద్యార్ధుల మూర్తిమత్వంపై ఆధారపడి ఉంటుంది.


2. తరగతి గది నిర్వహణ- సమూహ గతిశీలత

"సమూహం లో ఒక కావ్యం నిమిత్తమై కొందరు వ్యక్తులు సమగ్రత తో కొన్ని విలువలకు కట్టుబడి ప్రవర్తించడం." - షరీఫ్ అండ్ షరీఫ్.

సమూహ లక్షణాలు :

- సభ్యులకు ఏకాభిప్రాయం ఉంటుంది.

- సభ్యుల మధ్య కొంత బంధం ఉంటుంది.

- సహకార గుణం ఉంటుంది.

- అభిరుచులు కలుస్తాయి.

- కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటారు.

- ఒకే విధమైన నమ్మకాలు, విలువలు ఉంటాయి.

- అందరిలో 'మన' అనే భావన ఉంటుంది.

సమూహాలు - రకాలు:

- వ్యవస్థీకృత సమూహం : కొన్ని నియమాలు పాటిస్తారు.

- అవ్యవస్థీకృత సమూహం : సమూహంలో నిర్ధిష్టమైన నియమాలుండవు.

- నియత సమూహం : కొన్ని నియమాలు పాటించడం జరుగుతుంది.

- అనియత సమూహం : నిర్ధిష్టమైన నియమాలు ఉండవు.

- గుంపు : ఎప్పటికప్పుడు ఏర్పడే సమూహం, నిర్ధిష్ట నియమాలు ఉండవు.

- క్లబ్ : కొద్దికాలం లేదా కొన్ని సంవత్సరాల కలిసి ఉండే సమూహం. నిర్ధిష్ట నియమాలు ఉంటాయి. ఉదా : బడి, పరిశ్రమ, లయన్స్ క్లబ్,

- సంఘం : సుదీర్ఘకాలం, అనేక సంవత్సరాలు కలిసి ఉండే సమూహం. నిర్ధిష్ట నియమాలు జీవితాంతం పాటిస్తూ ఉంటారు. సభ్యులు మధ్య గట్టి సంబంధాలు వుంటాయి. ఉదా : ఒక ప్రదేశంలో దీర్ఘకాలంగా నివసించే వ్యక్తులు.


సమూహిక గతి శాస్త్రం : వ్యక్తి సమూహం పైన ఉపయోగించిన శక్తులను, సమూహం వ్యక్తిపైన ఉపయోగించిన శక్తులను గురించి అధ్యయనం చేసే దానిని సామూహిక గతిశాస్త్రం అంటారు.

- డైనమిక్స్ అనే పదం భౌతిక శాస్త్రానికి సంబంధించినది.

- డైనమిక్స్ అనే ఆంగ్లపదం Dynamique అనే ఫ్రెంచ్ పదంనుండి, Dynamikos అనే గ్రీకు పదం నుండి తీసుకోబడింది. దీని అర్ధం శక్తి.

- కొన్ని లక్ష్యాల సాధనకు కొందరు వ్యక్తులు కలిసి పని చేయడం వల్ల సమూహం ఏర్పడుతుంది. దీనిని సమూహ నిర్మాణం అంటారు.

- 'సమూహంలో జరిగే మార్పులనే సమూహగతి శాస్త్రం అంటారు.'- క్రెచ్, క్రచ్ఫీల్డ్.

- “సమూహాల స్వభావాన్ని, అభివృద్ధి సూత్రాలని, పరస్పర సంబంధాలని ఇతర సమూహాలతో, పెద్దసంస్థల సంబంధాలని అంచనావేసే శాస్త్రమే సమూహ గతిశాస్త్రం." - కార్టరైట్.డి, జాండర్.ఎ.

తరగతి నాయకత్వం :

- “సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను తానుకొచ్చేవాడే నాయకుడు." - కెటిల్.

- "ఇతరులు తనను అనుసరించేలా చేసే కార్యసిద్ధి కలవాడే నాయకుడు." - కౌలీ.
సమూహ సభ్యుల మధ్య పరస్పర సంబంధాలు కలిగించే చొరవ తీసుకొనేవాడే నాయకుడు." - బెక్,


నాయకత్వం- రకాలు:

- సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు నాయకులను మూడురకాలుగా వర్గీకరించారు.

1. సహభాగి నాయకత్వం:

- ఈ నాయకులు ప్రజాస్వామికంగా ఉంటుంది.

- వీరు అనుచరులతో కలిసి పోతుంటారు.

-సభ్యుల భావాలను తెలుసుకుంటారు.

- పరస్పర సంప్రదింపుల ద్వారా, అభిప్రాయసేకరన ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు.

- సభ్యులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలియపరుస్తారు.

-సభ్యుల నుంచి సహకారం ఉంటుంది.

- అందరు విద్యార్థులు పాల్గొనే సంఘసేవా కార్యక్రమం, స్కౌట్సు, గైడ్స్, ఆటలు మొదలైన కార్యక్రమంలో ఉపాధ్యాయుడు ఒక ప్రజాస్వామిక నాయకునిగా పాల్గొంటాడు.

- తరగతిలో ఇది అన్ని విధాల ఆమోదయోగ్యమైన నాయకత్వం.

2. నిర్దేశిత నాయకత్వం :

- ఈ రకం నాయకులు తమ ఆదేశాలను బలవంతంగా పాటింపచేస్తారు.

- సభ్యులు తనను అనుసరించేలా చూస్తారు.

- అనేక కఠిన నిబంధనలు విధిస్తారు.

- ఇతరులతో చర్చించినా నిర్ణయాలు తామే తీసుకుంటారు.

- తమ నిర్ణయాలు ఆమోదయోగ్యమైనవి కాకున్నా వాటిని వారు మార్చరు.

- సభ్యులు నాయకుని ఆదేశాల కోసం ఎదురు చూస్తుంటారు.

- పాఠశాలలో నిర్ధేశిత నాయకుడైన ఉపాధ్యాయుడు విద్యార్థులలో భయాన్ని పెంచుతాడు.

- విద్యార్థులు అయిష్టత తో ఆజ్ఞలను పాటిస్తుంటారు.

- ఈ నాయకత్వం ఆమోదయోగ్యమైనది కాదు.

3. అనుజ్ఞ నాయకత్వం :

- ఈ నాయకుడు సభ్యులలో ఒకరిగా మెలుగుతాడు.

- కోరిన మీదట మాతమ్రే సలహాలిస్తుంటాడు.

- సమూహంలో నామమాత్ర నాయకునిగా ఉంటాడు.

- సభ్యులకు వారి భావాలను వ్యక్తపరచడానికి పూర్తి స్వేచ్ఛవుంటుంది.

- నిర్ణయాలు తీసుకోవడం లో సభ్యులకు పూర్తి స్వేచ్ఛ వుంటుంది.

- నాయకుడు ప్రేక్షకుడిలా ఉంటాడు.

- తరగతిలో ఇలాంటి నాయకత్వం లో విద్యార్థులు ఉదాసీనంగా ఉంటారు.

- సమయం వృధా అవుతుంది.

- క్రమశిక్షణ లోపిస్తుంది.

- ఇలాంటి నాయకత్వం తరగతిలో ఆమోదయోగ్యమైనది కాదు.

గమనిక:

  • తరగతిలో ఉపాధ్యాయుడు విద్యార్థుల పరస్పర చర్యను అంచనావేయడానికి ప్లాండర్ పరస్పర విశ్లేషణ పద్ధతిని ఉపయోగించడం జరిగింది.
  • ఈ పద్ధతిలో తరగతి గది చర్యలను 10 రకాలుగా చెప్పారు.
  • 10లో 1 నుండి 7 వరకు ఉపాధ్యాయచర్యలు, 8, 9 విద్యార్థి సంభాషణ, 10 నిశ్శబ్దం.
  • ఉపాధ్యాయ చర్యలు : 1. సంవేదనలను అంగీకరించడం 2. పొగడటం లేదా ప్రోత్సాహించడం 3. విద్యార్థుల అభిప్రాయాలను అంగీకరించడం 4. ప్రశ్నలు అడగడం 5. ఉపన్యసించడం 6. నిర్దేశాలను ఇవ్వడం 7. విమర్శించడం.
  • విద్యార్థి సంభాషణ : 8. విద్యార్థి సంభాషణ / ప్రతిస్పందన 9. విద్యార్థి సంభాషణ, ఉపదేశం.


3. ప్రత్యక్షం

  • అవధాన, యోజన శక్తుల సముదాయాన్ని 'ప్రత్యక్షం' అని అంటారు.
  • "ప్రపంచం మన కళ్ళకు ఎలా కనబడుతుందో, చెవులకు ఏ రీతిగా వినబడుతుందో, స్పర్శ ద్యారా చర్మానికి ఎలా తెలుస్తుందో, నాలుకకు ఎలా దుఃఖిస్తుందో, ముక్కుకు ఎలా వాసన వస్తుందో ఆ విధానంలో సంభంవించిన గ్రహణ శక్తిని ప్రత్యక్షం" అని అంటారు. - క్లిఫర్క్ మోర్గన్, జాన్ వీజ్, రిచర్డ్. ఎ. కింగ్.
  • జ్ఞానేంద్రియాల పరిసరాల జ్ఞానాన్ని మనకు ఆపాదించే ప్రధాన అవయవాలు సంవేదనలకు అర్ధాన్ని ఆపాదించడమే ప్రత్యక్షం.
  • సంవేదనలను అర్ధం చేసుకున్న ప్రక్రియ “ప్రత్యక్ష్యం”.

ప్రత్యక్ష్యం లక్షణాలు :

  • ఇది గత అనుభవాల ఫలితం పై ఆధారపడి ఉంటుంది.
  • అది ఒక సంశ్లేషణ, విశ్లేషణలలో కూడిన ప్రక్రియ.
  • ప్రత్యానికి నిశిత పరిశీలన చాలా అవసరం.
  • జ్ఞానేంద్రియాల సహాయంతో దీన్ని ఆరంభిస్తారు.
  • సంవేదనలపై ఆధారపడిన ప్రక్రియ.
  • అంతర్గత, బహిర్గత ప్రేరకాలతో ప్రభావితం అయ్యే ప్రక్రియ.
  • ప్రతిమలను ఉపయోగిస్తుంది.
  • జ్ఞానేంద్రియాల ద్వారా పరిసరాల జ్ఞానాన్ని పొందడానికి ప్రత్యక్షమున్న మన పరిసరాల గురించి తెలిపే గ్రాహక నాడీ ప్రత్యక్షం.
  • ప్రకృతిలో ఏ వస్తువుకైనా, వ్యవస్థీకృత మొత్తంగా ప్రత్యక్షించే ధోరణిని గెస్టాల్టు దృక్పధం అంటారు.

ప్రత్యక్ష నియమాలు:

1. అవిరళ నియమం : దీనినే సాంతత్య నియమం అంటారు. కొన్ని ఉద్దీపనలను అవిరళంగా అమరిస్తే ప్రత్యక్ష వ్యవస్థాపనం ఏర్పడుతుంది.

2. సామీప్య నియమం : ఒక దానికొకటి దగ్గరగా ఉన్న అంశాలకు ఒక సమూహంగా ఏర్పరచడమే సామీప్య నియమం.

3. సామ్యనియమం : ఒకేవిధంగా ఉండే అంశాలు ఒక సమూహముగా చూసే ఎక్కుగ అవకాశం వుంటుంది.

4. పూరణ నియమం : అసంపూర్ణ ఆకృతులను అర్ధవంతమైన పూర్తి వస్తువులుగా పరికించి చూస్తాం.

5. ఆకృతి క్షేత్ర నియమం : రూబిన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొదటిసారిగా ఆకృతిక్షేత్ర సంబంధాన్ని వివరించి చెప్పాడు.

ప్రత్యక్ష్య ప్రక్రియకు కారకాలు : 1. మానసిక విన్యాసం 2. సాన్నిహిత్యం 3. గతానుభవం 4. వైఖరి 5. సందర్భం


4. అభ్యసనం - రకాలు

ప్రయోజనం ఆధారంగా అభ్యసనం లో అనేక రకాలు ఉన్నాయి. అవి :

1. చలన అభ్యసనం : శరీర అవయవాలు, వాటిలో కండరాలు ప్రధానంగా వినియోగిస్తూ నేర్చుకునే కౌశలాలను 'చలన అభ్యసనం' అంటారు. ఉదా: పాకడం, టైపింగ్, సైకిల్ తొక్కడం, ఈత.

2. శాబ్దిక అభ్యసనం : ఒక వస్తువును చూసి, పోల్చుకు ఆ వస్తువుకు పేరు పెట్టి తెలపడం అతిచిన్న శాబ్దిక అభ్యసనం. భావాన్ని విశదం చేసేందుకు కొన్ని వాక్యాలను కలిపి రాయడం ఇవన్నీ పెరుగైన శాబ్దిక అభ్యసనానికి ఉదాహరణలు.

3. విచక్షణా అభ్యసనం : రెండు అంశాల మధ్య, సన్నివేశాల మధ్య గల బేధాన్ని గుర్తించడం ను విచక్షణా అభ్యసనం అందురు. ఉదా: ఇతర కుటుంబ సభ్యులమధ్య అమ్మను గుర్తించడం.

4. ప్రత్యక్ష అభ్యసనం : పరిసరాలకు ప్రేరితుడై, ఉద్దీపన పొంది, వీటికి సరైన అర్థాలను ఇవ్వడంతో పాటు వాటిని గురించి తెలుసుకొనే దానిని ప్రత్యక్ష అభ్యసనం అంటారు. ఉదా: బిస్కెట్ తినేందుకని, పెన్సిల్ రాసేందుకని తెలుసుకోవడం.

5. భావనాత్మక అభ్యసనం : ఒకే విధమైన లక్షణాలు, సామాన్య గుణాలున్న వస్తువులు, అంశాల పట్ల సాధారణ భావాలు ఏర్పరుచుకోవడం. ఉదా: 1, 4, 9, 16, 25 లు వర్గసంఖ్యలు అని పేర్కొనడం.

6. సమస్యా పరిష్కార అభ్యసనం : ఆలోచన, పరిశీలన, వివేచనల పరిశీలన ఫలితాన్ని తెలపడం లాంటి అంశాల కలయిక. ఉదా: 1, 4, 9, a, 25 లలో a విలువను చెప్పడం.


5. ఆలోచన

ఆలోచన - లక్షణాలు :

  • ఇది ఒక మానసిక చర్య.
  • గమ్య సాధనకు నిర్దేశించిన ప్రక్రియ.
  • సమస్యా పరిష్కార ప్రవర్తన కలిగి ఉంటుంది.
  • చలనాత్మక అన్వేషణ కంటే మానసిక అన్వేషణకు ప్రధానంగా కీలకపాత్ర ఉంటుంది.
  • ఇది ప్రతీకాత్మక భావన.
  • బయటికి వినిపించని మానసిక సంభాషణ రూపంలో ఉంటుంది.
  • యత్నదోష పద్ధతిని కూడి ఉంటుంది.
  • అంతర్ దృష్టితో ముడిపడి ఉన్న ప్రక్రియ.

ఆలోచన - రకాలు:

1. మూర్త ఆలోచన :- ఇది చాలా సులభమైన ఆలోచనా పద్దతి.

- ఒక విషయాన్ని ఏదో ఒక జ్ఞానం ద్వారా పొందుతూ ప్రత్యక్షంగా దాని గురించి ఆలోచించడాన్నే మూర్త ఆలోచన అంటారు.

- ఉదా : 'సింహం' బొమ్మని చూస్తూ దాని గురించి ఆలోచించడం.

2. అమూర్త ఆలోచన: భావనల మీద ఆధారపడి నిరాకారమైన విషయాలను గురించి ఆలోచించడం.

- తెలియని వాటి గురించి ఆలోచించడం.

- కొత్త విషయాలు కనుక్కోవడంలో తోడ్పడే ఆలోచన.

- దీనినే భావనాత్మక ఆలోచన అంటారు.

- ఉదా : 'సత్యం' అన్న భావన.

3. ఊహాలోచన:

- పూర్తిగా మానసిక ప్రతిరూపాలపై ఆధారపడి ఉంటుంది.

- స్మృతి పధకం లో మిగిలిన పూర్తి స్మృతి చిహ్నాల ప్రతిరూపాల ఆధారంగా భవిష్యత్ను ఊహించడం.

- ఉదా: భవిష్యత్లో భారత రాజకీయ వ్యవస్థను గురించి ఆలోచించడం.

4. హేతుబద్ధ ఆలోచన : దీనినే తాత్విక ఆలోచన అని కూడా అంటారు.

- ఇది అత్యున్నతమైన ఆలోచనా పద్ధతి.

- ఈ పద్ధతిలో వివిధ రకాల భావనలను నిర్ధిష్టమైన లక్ష్యాలతో హేతుబద్దమైన వరుసక్రమంలో ఆలోచించి సమస్యా పరిష్కారం ను చేయడం జరుగుతుంది.

- ఉదా : త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180° కావున విషమ బాహుత్రిభుజంలో కూడా మూడు కోణాల మొత్తం 180° అని నిర్ధారించడం.

5. సమైక్య ఆలోచన : వ్యక్తి తనకు అందుబాటులో దత్తాంశాలను ఉపయోగించి సమస్యకు ఒకే పరిష్కారాన్ని సూచిస్తాడు.

- సమాధానాన్ని ఇవ్వడానికి ఉపయోగించే సాంప్రదాయక పద్ధతి ఇది.

-సమైక్య ఆలోచనాశక్తి గలవారు ప్రజ్ఞా పరీక్షలో ఎక్కువ స్కోరు సాధిస్తారు.

6. విభిన్న ఆలోచన : సమస్యకు ఒక పరిష్కారం మార్గం కాక సమాన ప్రాధాన్యంగల అనేక పరిష్కార మార్గాలను సూచించగల శక్తి.

- వీరు సృజనాత్మక పరీక్షలలో అత్యధిక స్కోరును సాధిస్తారు.


Important Points

  • There are no bad students, there are made as bad students - Socrates.
  • All power is within you; you can do anything and everything - Vivekananda.
  • Give me a few men and women who are pure and selfless, and I shall shake the world - Vivekananda.
  • The great aim of education is not knowledge but action - Herbert Spencer.
  • The direction in which education starts a man will determine his future - Plato.
  • Education is like a double-edged sword. It may be turned to dangerous uses if it is not properly handled. - Wu- Ting-Fang.




No comments:

Post a Comment

Post Bottom Ad