మౌర్య అనంతర యుగం - GNANA SAMHITHA

Breaking

Post Top Ad

Monday, March 17, 2025

మౌర్య అనంతర యుగం

👉🏻క్రీ.పూ. 2వ శతాబ్ధం నుండి క్రీ.శ. 3వ శతాబ్ధం మధ్యకాలంలో భారతదేశాన్ని అనేక వంశాలు పాలించాయి. ఈ మధ్య కాలాన్నే వర్తకుల యుగం అని కూడా అంటారు.
👉🏻భారతీయ వర్తకులు ప్రపంచ వర్తకంపై ఆధిపత్యమును సాధించారు.
👉🏻విదేశీయులను మ్లేచ్చాలు అనేవారు.

శుంగులు(Shunga dynasty)

👉🏻శుంగ వంశ స్థాపకుడు -పుష్యమిత్ర శుంగుడు
👉🏻ఇతను అశ్వవేధ యాగమును నిర్వపాంచి సింహాసనమును అధిష్టించాడు.
👉🏻ఇతని కాలం నుంచి మరలా పురోహితుల ఆధిపత్యం ప్రారంభమైంది. ఇతని కాలంలోనే భగవత మతం ఆవిర్భవించింది. ఇది కర్మ మార్గం గురించి పేర్కొంది. ఇతని ఆస్థానంలోని పతంజలి 'మహాభాష్యము'ను రచించాడు.
👉🏻ఇతను రాజధానిని విదిశకు (పాటలీపుత్రం నుండి) మార్చాడు.
👉🏻ఇతని తర్వాత శుంగ పాలకుడు అగ్నిమిత్రుడు.
👉🏻కాళిదాసుని మాళవికాగ్నిమిత్రంలో అగ్నిమిత్రుడు కథానాయకుడు.
👉🏻తరువాత ముఖ్యమైన రాజు భాగుడు
👉🏻భాగుని కాలంలో గ్రీకు రాయబారి హెలియో డోరస్‌ శుంగ రాజ్యాన్ని సందర్శించాడు. (ఇతను ఆంటియల్‌ సెడోస్‌ యొక్క రాయబారి)
👉🏻హెలియోడోరస్‌ విదిశ దగ్గర గల బేస్‌నగర్‌ వద్ద విష్ణు స్థంభమును వేయించాడు.
👉🏻శుంగుల చివరి పాలకుడు దేవభూతిని అతని మంత్రి వాసుదేవకణ్వ హతమార్చి మగధపై కణ్వ వంశాన్ని స్థాపించాడు.

కణ్వులు(Kanva Dynasty):


👉🏻స్థాపకుడు - వాసుదేవకణ్వ
👉🏻ఇతను రాజధానిని విదిశ నుంచి పాటలీపుత్రమునకు మార్చాడు.
👉🏻ఇతని తర్వాత పాలకులు
- 1) భూమిమిత్ర
- 2) నారాయణ
- 3) సుశర్మ
👉🏻శాతవాహన రాజు పులోమావి సుశర్మను అంతం చేసి మగధను శాతవాహన రాజ్యంలో విలీనం చేశాడు. దీంతో మగధ ప్రాముఖ్యత అంతమైంది.


ఇండో గ్రీకులు(Indo-Greeks):

👉🏻ఇండో గ్రీకులలో మొట్టమొదటి దండయాత్రికుడు - డెమిట్రియస్‌
👉🏻వీరిలో అతి గొప్పవాడు - మినాందర్‌
👉🏻మినాండర్‌, నాగసేనుడు మధ్య జరిగిన బౌద్ధ సంభాషణపై మిళిందపన్హు అనే పుస్తకం రచించబడినది.
👉🏻భారతదేశంలో మొట్టమొదటిసారిగా బంగారు నాణేలను ఇండోగ్రీకులు ప్రవేశపెట్టారు.
👉🏻వీరి రాజధాని -సియోల్‌కోట్‌ లేదా సాకల
👉🏻గాంధార శిల్చ్పకళ(వీరికాలం) ఇండోగ్రీకుల కాలం నుంచే ప్రారంభమైంది.
👉🏻స్ట్రాటిగో లేదా మెరిడార్చి అనే సైనిక గవర్నర్‌షిప్‌ను (నిర్వహణా విధానం) వీరు ప్రవేశపెట్టారు


శకులు(Sakas Dynasty):

👉🏻శకులు టొకారియన్‌ తెగకు చెందినవారు.
👉🏻వీరులు త్రతార(రక్షకుడు) అనే బిరుదులు పొందేవారు.
👉🏻వీరి మొదటి రాజధాని - జునాగడ్‌ / గిర్నార్‌
👉🏻రెండవ రాజధాని - ఉజ్జయిని
👉🏻చైనాలో శకులను సిథియన్‌లు అనేవారు.
👉🏻సిథియన్‌ల దాడులను అంతం చేయుటకు చైనా రాజు షిా-హుయాంగ్‌-తి క్రీ.పూ.220లో గ్రేట్‌ చైనా వాల్‌ను నిర్మించాడు.
👉🏻దీంతో జీవనాధారం కోల్పోయిన సిథియన్లు భారతదేశం వైపుకు మళ్లారు. వీరు భారతదేశం వైపుకు వస్తూ 5 శాఖలుగా చీలిపోయారు.
👉🏻శకులలో మొట్టమొదటివాడు -మావుజ్‌
👉🏻శకులలో మొదటి గొప్పవాడు -నహపాణుడు. ఇతను అత్యధికంగా వెండి నాణేలను ముద్రించాడు.
👉🏻ఇతని అల్లుడు రిషభదత్త నాసిక్‌శాసనంలో పేర్కొనబడ్డాడు.
👉🏻రిషభదత్తుడు శకుల వంశ పారంపర్య వివరములను పేర్కొన్నాడు.
👉🏻రిషభదత్త బ్రాహ్మణులకు దానధర్మాలు చేశాడు.
👉🏻గౌతమీపుత్ర శాతకర్ణి నహపాణున్ని ఓడించి వెండి నాణెములను తన పేరుతో ముద్రించాడు.
👉🏻శకులలొ అతి గొప్పవాడు -రుద్రదామనుడు (కార్థమాక తెగెకు చెందినవాడు)
👉🏻ఇతను జునాగఢ్‌ శాసనమును వేయించాడు. ఇది భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం.
👉🏻జునాగఢ్‌ శాసనంలో సుదర్శన తటాకము గురించి పేర్కొనబడింది. దీని ప్రకారం సుదర్శన తటాకమును అశోకుడు, రుధ్రదామనుడు, ఖారవేల కళింగుడు మరమ్మతులు చేశారు.
👉🏻క్రీ.పూ. 58లో గరుడబెల్ల కుమారుడు విక్రమాదిత్య శకులను ఉజ్జయిని నుంచి తరిమివేశాడు. ఈ సందర్చంగా క్రీ.వూ. 58లో “విక్రమ శకం”ను ప్రారంభించాడు.


పార్ధియన్‌లు(Parthian Empire):

👉🏻వీరిలో అతి గొప్పవాడు గోండ ఫెర్నస్‌
👉🏻ఇతని కాలంలో జీసస్‌ క్రిస్ట్‌ యొక్క 12 మంది శిష్యులలో ఒకడైన సెయింట్‌ థామస్‌ భారతదేశాన్ని సందర్శించాడు.
👉🏻ఇతను చెన్నై దగ్గర మైలాపూర్‌ వద్ద హత్యకు గురయ్యాడు.
👉🏻ఇతని జ్ఞాపకార్థం కొచ్చిలో సెయింట్‌ థామస్‌ అనే పేరుతో ఒక పెద్ద చర్చి నిర్మించబడింది.


కుషాణులు(Kushan Empire) :

వీరి మొదటి రాజధాని - పురుషపురం / పెషావర్‌
రెండవ రాజధాని - మధుర
కుషాణులు 'యూచీ' తెగకు చెందినవారు.
కుషాణులలో మొట్టమొదటివాడు - కుజల కాద్‌పైజస్‌
విమాఖాడ్‌ స్టైజన్‌ శివుని రూవంతో బంగారు నాణెములను ముద్రించాడు.


కనిష్కుడు(Kanishka):
👉🏻కుషాణులలో అతి గొప్పవాడు - కనిష్కుడు
👉🏻కనిష్కుని బిరుదులు - దేవపుత్ర, రెండవ అశోకుడు, సీజర్‌ (చక్రవర్తి), మహారాజ, మహారాజాధిరాజ
👉🏻ఇతను క్రీ.శ. 78లో శక యుగమును ప్రారంభించాడు.
👉🏻కనిష్కుడు 4వ బౌద్ధ సంగీతిని కుందలవనం(జులంధర్‌- కాశ్మీర్‌)లో నిర్వహించాడు.
👉🏻ఇతని ఆస్థానంలో వసుమిత్రుడు మహా విభాష శాస్త్రమును రచించాడు. ఇది త్రిపీఠకాలపై వ్యాఖ్య. దీన్ని Encyclopedia of Buddhism అంటారు.
👉🏻అశ్వఘోషుడు - బుద్ధ చరితం, సౌందరనందం, మహావిచియ, సారిపుత్ర ప్రకరణం, వజ్రసూచి, సూత్రలంకార (దీనిని అసంగుడు కూడా రాశాడు) అనే గ్రంథాలను రచించాడు.
👉🏻సుస్రోత- సుస్రోత సంహితలో అనేక సర్జరీల గూర్చి పేర్కొన్నాడు. (కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇతను గుప్తలకు సమకాలికుడు)
👉🏻చరకుడు - చరక సంహితమును రచించాడు. భరద్వాజుని ఆయుర్వేద ప్రస్తావన చేశాడు.
👉🏻కనిష్కుడు - సూయి విహార్‌ శాసనమును చెక్కించాడు.
👉🏻ఇతను పెషావర్‌లో ఒక పెద్ద బౌద్ధ విగ్రహాన్ని నిర్మించాడు.
👉🏻ఇతను చైనా జనరల్‌ పాంచియాగో చేతిలో ఓడిపోయాడు.
👉🏻కనిష్కుడు మహాయాన బౌద్ధ మతాన్ని పోషించి మధ్య ఆసియా మొదలగు ప్రాంతాలలో వ్యాప్తి చేశాడు.
👉🏻అప్పట్లో మధురలో 'శతక' అనే వస్త్రము ప్రసిద్ధి చెందినది.
👉🏻కుషాణుల సామంతుడైన సహపానుడు పశ్చిమ భారతదేశంలో విదేశీ వర్తకాన్ని నియంత్రించేవాడు.
👉🏻వీరి కాలంలో బారిగజ (భరకచ్చ లేక బ్రోచ్‌) ఒక ముఖ్య రేవు పట్టణం. ఈ కాలంలో రోమ్‌తో భారతదేశానికి సంబంధాలు ఉన్నట్లు “పెరిప్లస్‌ ఆఫ్‌ ది ఎరిత్రియన్‌ సీ” గ్రంథం ద్వారా తెలుస్తుంది.
👉🏻కుషాణులు భారత దేశంలో బంగారు నాణేలను విరివిగా జారీ చేశారు.
👉🏻వీరి కాలంలోనే ప్రసిద్ధ గాంధార శిల్పకళ విలసిల్లింది.
👉🏻బమియాన్‌ వడ గల బుద్ధ విగ్రహం అత్యంత ప్రాచీనమైనదని పండితుల అభిప్రాయం. దీనిలో బుద్దుడిని రక్షకునిగా మరియు”ఖభయ ముద్రలో చెక్కారు.
👉🏻కుషాణుల కాలంలో మధుర శిల్పకళ కూడా బాగా అభివృద్ధి చెందింది.
👉🏻కుషాణుల చరిత్రలో కనిష్కుని పాలనాకాలం స్వర్ణ ఘట్టంగా ఎంచదగినది.
👉🏻ఇతని కాలంలోనే మధుర శాసనం వేయించబడింది.
👉🏻కనిష్క వంశపు సామ్రాజ్యాల్లో చివరి ప్రభువు వాసుదేవుడు.


ఖారవేల కళింగుడు(Kharavela Kalinga):

👉🏻కళింగ రాజ్యాన్ని స్థాపించినవాడు -మహామేఘవర్మ
👉🏻ఇతని వంశం పేరు కూడా మహామేఘవర్మ
👉🏻ఖారవేలుడు జైన మతాన్ని పోషించాడు. ఇతను ఉదయగిరి కొండల్లో, .హంథిగుంపా శాసనమును చెక్కించాడు.
👉🏻ఇతను దక్షిణాన కన్నబెన్న(కృష్ణా నది) నది వరకు దండయాత్ర చేశాడు.
👉🏻మూసిక నగరంపై కూడా దాడి చేశాడు.
👉🏻ఉత్తరాన మగధపై దాడిచేసి అక్కడ దోచుకున్నా సొత్తుతో భువనేశ్వర్‌లో ఒక దేవాలయమును నిర్మించాడు.v 👉🏻ఖారవేలుని భవంతి పేరు -మహావిజయ ప్రసాదము
👉🏻ఖారవేలుని బిరుదులు - మూసిక అధిపతి, కళింగ చక్రవర్తి, భిక్షు రాజు


సంగమ రాజ్యాలు/ వంశాలు(Sangama Dynasty) :

👉🏻మొత్తం 3 సంగమ వంశాలు ఉన్నాయి
1) చోళ వంశం
2) పాండ్య వంశం
3) చేర వంశం

చోళులు(Chola Dynasty):
👉🏻రాజధాని-ఉరైయూరు. తర్వాత పుహార్‌(కావేరిపట్నం)
👉🏻అతి గొప్పరాజు - కరికాల చోళుడు
👉🏻వీరి చిహ్నం - పులి
👉🏻ఇతను పుహార్‌ లేదా కావేరి పట్టణమును నిర్మించాడు.
👉🏻కావేరి నదిపై 160 కి.మీ. పొడవున కరకట్టలను నిర్మించాడు. దీని కొరకు శ్రీలంక నుండి 12,000 మంది బానిసలను తీసుకువచ్చాడు.
👉🏻ఇతను వెన్ని యుద్ధంలో 11 మంది రాజులను ఓడించాడు.

పాండ్య వంశం(Pandya Dynasty) :
👉🏻రాజధాని - మధురై
👉🏻చిహ్నం - చేప
👉🏻అతి గొప్పరాజు - నెడుంజెలియన్‌
👉🏻ఇతను తలైలంగనం యుద్ధంలో చోళ మరియు చేర వంశ రాజులను ఓడించాడు.

చేర(Chera Dynasty):
👉🏻రాజధాని - వంజి
👉🏻చిహ్నం - ధనుస్సు
👉🏻గొప్ప రాజు - సెంగుత్తవాన్‌
👉🏻సెంగుత్తవాన్‌ను ఎర్ర చేర అని అంటారు.
👉🏻ఇతను కన్నగి లేదా పట్టిని మతాన్ని ఆవిష్కరించాడు.


సంగమ పరిషత్తులు(Sangama Parishat's) :

మొదటి సంగమ పరిషత్తు :
•ఇది తిన్‌ మధురైలో జరిగింది.
•అధ్యక్షుడు - అగస్తుడు
•దీనికి దేవుళ్లు, దేవతలు హాజరయ్యారని పేర్కొంటారు.

రెండవ సంగమ పరిషత్తు :
•ఇది కపటపురంలో జరిగింది.
•అధ్యక్షుడు - తోల్‌కప్పియార్‌
•దీనిలో అనేక మంది కవులు పాల్గొన్నారు.
•తోల్‌కప్పియార్‌ తోల్‌కప్పియంను రచించాడు. ఇది తమిళంలో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం.

మూడవ సంగమ పరిషత్తు :
•ఇది మధురైలో జరిగింది.
•అధ్యక్షుడు - నక్కిరార్‌
•దీనిలో అనేక మంది కవులు పాల్గొన్నారు.
•పట్టు పట్టు (10 పుస్తకాలు), ఎట్టుతోగై (8 పుస్తకాలు) రచించబడ్డాయి. ఈ 18 ప్రధాన పుస్తకాలను మెల్మినక్కు అంటారు.
•18 చిన్న పుస్తకాలను కల్మినక్కు అంటారు.
•కల్మినక్కులో అతి ముఖ్యమైనది తిరుకురల్‌. దీనిని తిరువళ్లు వర్‌ రచించాడు. దీనిని తమిళ బైబిల్‌ అంటారు. దీనిని తమిళులు పంచమ వేదంగా పరిగణిస్తారు.
•శిలప్పధికారంను ఇలంగో అడిగల్‌ రచించాడు (ప్రముఖపాత్ర-కోవలన్స, కన్నగి, మాధవి).
•మణిమేఖలైను సత్తినార్‌ రచించాడు (ప్రిన్స్‌ ఉదయ్‌కుమార్‌, మణిమేఖలై).
•జీవక సింథామణిని తిరుటక్కర తేవర్‌ రచించాడు (జీవకుడు-విన్యాసాలు).
•పెరుందేవనార్‌ తమిళంలో మహాభారతాన్ని రచించాడు.
•సంగమ ప్రజల ప్రధాన దేవుడు -మురుగన్‌/ కుమారస్వామి
•సైనికులకు 'ఎనాడి' అనే బిరుదు ఇవ్వబడేది.
•సైనిక వీరుల కొరకు విరుగల్‌ (విగ్రహాలు ప్రతిష్టించడం) సాంప్రదాయంగా ఉండేది.
•నాణేలు- కాసు, కణకం, పోన్‌, వేంగ్‌పోన్‌
•ఎర్రిపట్టి గ్రామాలు - వీటినుండి వసూలు చేసిన పన్నులు కేవలం నీటిపారుదల కొరకు-మూత్రమే ఉపయోగిస్తారు.
•వేలాండర్‌ -మతపరమైన నృత్యం
•కోయిల్‌ -దేవాలయాలు
•ఖాజా-దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన గుహ

No comments:

Post a Comment

Post Bottom Ad