గుప్తులు - GNANA SAMHITHA

Breaking

Post Top Ad

Monday, March 17, 2025

గుప్తులు

👉🏻గుప్తులు వైశ్య వర్ణానికి చెందినవారు.
👉🏻శాసనాలు, నాణేలు, సాహిత్యం గుప్తుల గురించి తెలుపుతాయి.
👉🏻గుప్తులు కుషాణుల సామంతులుగా ఉండేవారు.
👉🏻కె.పి.జైస్వాల్‌ ప్రకారం గుప్తులు పంజాబ్‌ ప్రాంతానికి చెందినవారు.

శ్రీగుప్తుడు:
👉🏻ఇతను గుప్త వంశ స్థాపకుడు.
👉🏻ఇతని బిరుదులు -మహారాజు, ఆదిరాజు
👉🏻ఇతను చైనా బౌద్ధ సన్యాసుల కొరకు 'మృగశిఖ నగరము వద్ద ఒక మఠాన్ని నిర్మించాడు. దీనికి 24 గ్రామాలు దానమిచ్చినట్లు ఇత్సింగ్‌ తన రచనల్లో పేర్కొన్నాడు.
👉🏻ఇత్సింగ్‌ శ్రీగుప్తున్ని చలికిత మహారాజు (చ-లికి-ట్)‌ అని పేర్కొన్నాడు.
👉🏻ఇతని తర్వాత పాలకుడు ఘటోత్కచుడు
👉🏻ఘటోత్కచుని కుమారుడు- మొదటి చంద్రగుప్తుడు
👉🏻క్రీ.శ. 319-20 లో 1వ చంద్రగుప్తుడు గుప్త పాలకుడు అయ్యాడు.

1వ చంద్రగుప్తుడు (క్రీ.శ. 320-885):
👉🏻ఇతను క్రీ.శ.319/320లో గువ్త శకమును ప్రారంభించాడు.
👉🏻ఇతను నిజమైన గుప్త రాజ్య స్థాపకుడు. ఇతను సర్వ స్వతంత్ర పరిపాలన చేపట్టిన తొలి గుప్త రాజు.
👉🏻ఇతని బిరుదులు -మహారాజాధిరాజు, రారాజు
👉🏻ఇతను లిచ్చివీ రాకుమార్తె కుమారదేవిని వివాహమాడి నేపాల్‌, బీహార్‌లను కట్నంగా పొందాడు.
👉🏻ఇతను రెండు రకాల బంగారు నాణెములను ముద్రించాడు( తన రూపం, తన భార్య రూపంతో)
👉🏻కామాంధకుడు ఇతని ఆస్థానంలో ఉండేవాడని పేర్కొంటారు.

సముద్రగుప్తుడు (క్రీ.శ. 885-380):
👉🏻ఇతని బిరుదులు -
1) ఇండియన్‌ నెపోలియన్‌ (1862లో వి.ఎ.స్మిత్‌ పేర్కోన్నాడు)
2) వ్యాగ్రహ పరాక్రమ
3) కవిరాజు
4) కుండలహీన
👉🏻ఇతను ఒక గొప్ప సంగీతకారుడు (వీణ వాయిస్తాడు)
👉🏻ఇతని భార్య దత్తాదేవి
👉🏻ఇతను గుప్త రాజులలో అతి గొప్పవాడు.
👉🏻ఇతని సేనాని హరిసేనుడు అలహాబాద్‌ శాసనమును చెక్కించాడు(ఈ శాసనం-సంస్కృత భాష, దేవనాగరి లిపి). ఈ అలహాబాద్‌ శాసనంలో సముద్రగుప్తుని ఈ క్రింది దండయాత్ర గురించి పేర్కొనబడింది.
1) మొదటి ఉత్తర భారతదేశ దండయాత్ర
2) దక్షిణ భారతదేశ దండయాత్ర
3) రెండవ ఉత్తర భారతదేశ దండయాత్ర
4) ఐదు సరిహద్దు రాజ్యాలు, 9 గణ రాజ్యాలు
1) మొదటి ఉత్తర భారతదేశ దండయాత్ర :
ఈ దండయాత్రలో ఈ క్రింది 4 రాజ్యాలను ఓడించాడు.
S.No. రాజ్యం రాజు
1అహిచ్చేత్రఅచ్యుతుడు
2మధురనాగసేనుడు
3పద్మావతిగణపతి నాగు
4శ్రావస్ధికోట వంశీయులు
దక్షిణ భారతదేశ దండయాత్ర :
ఈ దండయాత్రలో సముద్రగుప్తుడు ఈక్రింది 12 మంది రాజ్యాలను ఓడించి వారి నుంచి కప్పం వసూలు చేసాడు.
S.No. రాజ్యం రాజు
1మహేంద్రుడుమహాకాంతారా
2వ్యాఘ్రారాజు కురాల
3ముంతరాజు గణపతి నాగు
4కొత్తూరు స్వామి దత్తుడు
5మహేంద్రుడుపిష్ఠపురం
6ధమనుడుఎరండపల్లి
7విష్ణుగోపుడుకంచి
8హస్తివర్మవేంగి
9నీలరాజు అపముక్త
10కుభేరుడు దేవరాష్ట్ర
11ధనుంజయుడుకుశస్థలపురం
12ఉగ్రరాజుపాలక
2వ ఉత్తర భారతదేశ దండయాత్ర:
👉🏻సముద్ర గుప్తుడు దక్షిణ భారతదేశ దండయాత్రలో ఉన్నప్రడు ఉత్తర భారతదేశంలో 9మంది రాజుల కూటమి తిరుగుబాటు చేసింది.
👉🏻ఈ 9మంది రాజుల కూటమి(నవరాజ్య కూటమికి నాయకత్వం వహించినవాడు వాకాటక 1వ రుద్రసేనుడు.
👉🏻సముద్ర గుప్తుడు కౌసంబి యుద్ధంలో (బుందేల్‌ఖండ్‌) ఈ నవరాజ్య కూటమిని ఓడించాడు.
👉🏻కౌశాంబి యుద్ధం విజయానికి చిహ్నంగా సముద్ర గుప్తుడు ఎరాన్ లో విష్ణు దేవాలయంను నిర్మించాడు.
👉🏻గంగా నదీ మైదాన ప్రాంతంలో సముద్రగుప్తడు 9మంది నాగరాజులను ఓడించాడు. వారు
1 రుద్రదేవ
2 నాగరుద్ర
3 నాగదత్త
4 చంద్రవర్మ
5 నాగాపతి
6 నాగసేన
7 అచ్యుత
8 నందిన్‌
9 బలవర్మ
👉🏻సముద్ర గుప్తుని ఆదివత్యాన్ని అంగీకరించిన రాజ్యాలు (5 ఆటవిక రాజ్యాలు)
1) సమతట (తూర్చుబెంగాల్‌)
2) దావక (అస్సాం)
3) కామరూప (అస్సాం)
4) నేపాల (నేపాల్‌)
5) కర్తిపుర (కాశ్మీర్‌)
👉🏻9 గణరాజ్యాలు:
👉🏻సముద్ర గుప్తుని ఆదివత్యాన్ని అంగీకరించిన 9 గణరాజ్యాలు(ఎరాన్‌ శాసనం ఆధారంగా)
1) మాళవులు
2) అర్జున నాయకులు
3) బెధేయులు
4) మద్రకులు
5) అభీరులు
6) ప్రారార్జునులు
7) సనకానికులు
8) ఖరపరికులు
9) కాకలు (విదిశ)
👉🏻ఇతని కాలంలో బంగారు నాణేలను సువర్జాలు అని, వెండి నాణేలను పణి, రూపక అని, రాగి నాణేలను కాకిని లేదా కౌరీలని పిలిచేవారు.
👉🏻సింహళ రాజైన మేఘవర్ణుడు బుద్దగయలో బౌద్ద విహారాన్ని నిర్మించేందుకు సముద్రగుప్తుని అంగీకారం కోరినాడాడని చైనా ఆధారం వల్ల తెలుస్తుంది.
👉🏻సముద్ర గుప్తుడు అశ్వమేధ యాగపరాక్రమ అని లిఖించబడిన వీణ వ్రాయించే ప్రతిమ గల బంగారు నాణేలు జారీ చేశాడు.
👉🏻ఇతను 6 రకాల బంగారు నాణేలను ముద్రించాడు.
ఉదా॥ శివుని రూపంతో, వీసి వాయిస్తున్నట్లుగా, లక్ష్మీ రూపంతో, యుద్ధం చేస్తున్నటుగా, అశ్వమేధయాగ

రెండవ చంద్రగుప్తుడు (క్రీ, శ. 380-415):
👉🏻సముద్రగుప్తని మరణానంతరం రామగుప్తడు గుప్త పాలకుడు అయ్యాడు.
👉🏻ఇతని భార్య ధృవదేవి. ఉజ్జయిని శకరాజు 3వ రుద్రసింహుడు రామగుప్తుని ఓడించి ధృవదేవిని బంధించాడు.
👉🏻రామగుప్తుని సోదరుడు 2వ చంద్రగుప్తుడు 3వ రుద్రసింహుడిని వధించి ధృవదేవిని విడిపించాడు. ఈ సందర్భంగా రెండవ చంద్రగుప్తడు 'శకారి” అనే బిరుదును పొందాడు.
👉🏻ఈ వృత్తాంతమంతటిని విశాఖదత్తుడు 'దేవీచంద్రగ్తుము'లో పేర్కొన్నాడు.
👉🏻తర్వాత రామగుప్తుడిని వధించి “విక్రమాదిత్య” అనే బిరుదును పొంది 2వ చంద్రగుప్తుడు సింహాసనాన్ని అధిష్టించాడు.
👉🏻2వ చంద్రగుప్తుడు ధృవదేవిల గురించి ఈ క్రింది పుస్తకాలలో ప్రస్తావించబడింది.
1) కావ్య మీమాంస -రాజశేఖరుడు
2) శృంగార ప్రకాశ్‌ -భోజరాజు
3) కౌముదీ మహోత్సవం -వజ్జిక
4) నాట్య దర్చణి -రామచంద్ర
5) అభినవ్‌ భారత్‌ -అభినవ్‌ గుప్త
6) దేవీ చంద్రగుప్తం -విశాఖ దత్తుడు
👉🏻ఇతని బిరుదులు:
1) సింహావిక్రమ
2) రాజాధిరాజ
3) శూరి
4) విక్రమాదిత్య
👉🏻ఇతని ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారు.
1) కాళిదాసు:
•అభిజ్ఞాన శకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమౌర్వశీయం (నాటకాలు)
•రవథలవంశం, మేఘదూతం, రుతుసంహారం, కుమారసంభవం (కావ్యాలు) రచించాడు.
2) అమర సింహుడు: అమరకోశము (మొట్టమొదటి సంస్కృతం-సంస్కతం నిఘంటువు)
3) వరాహ మిహిరుడు : బృహత్‌సంహిత, పంచ సిద్ధాంత, లఘుజాతక, బృహత్‌జాతక
4) ధన్వంతరి
5) వరారుచి
6) షప్నకుడు
7) శంఖుడు
8) బేతాళభట్టు
9) ఘట్‌కర్పార్‌
👉🏻2వ చంద్రగుప్తుని యుగాన్ని ఎలిజబెత్‌ యుగంతో పోలుస్తారు. (ఆమె కాలంలో షేక్స్‌పియర్‌ మొదలగువారు ఉండేవారు)
👉🏻ఇతని కాలంలోనే రామాయణం, మహాభారతం, పురాణాలు మొదలగునవి రచించబడ్డాయి. అందువల్లనే ఇతని యుగాన్ని స్వర్ణ యుగమని (ప్రధానంగా సాహిత్యం ఆధారంగా) అంటారు.
👉🏻కామాంధకుడు -నీతి శాస్త్రమును
👉🏻పాలకాప్యుడు - హస్తాయుర్వేదమును
👉🏻శూద్రకుడు - మత్స్యకటికమును
👉🏻వాత్సాయనుడు - కామసూత్రము, ఆర్య మంజశ్రీని రచించారు.
👉🏻క్రీ.శ.405లో చైనా యాత్రికుడు ఫాహియాన్‌ గుప్త సామ్రాజ్యాన్ని దర్శించాడు.
👉🏻ఇతను ఫోకోకో అనే పుస్తకాన్ని రచించాడు.
👉🏻ఈ పుస్తకంలో గుప్తుల ఆర్థిక, సామాజిక, రాజకీయ విషయాలను పేర్కొనబడ్డాయి.
👉🏻ఇతర చైనా యాత్రికుల వ్యాఖ్యలు :
•ఫాహియాన్‌ -చండాలులు గ్రామ బయట ఉండేవారు. వీరు మాంసం, చేపలు తింటుండేవారు.
•హుయాంగ్‌త్సాంగ్‌-శూద్రులు వ్యవసాయం చేసేవారు.
•ఇత్సింగ్‌ -బౌద్ధం క్షీణ దశలో ఉంది. గయలో మఠంలో నిర్మాణం.
•ఇతను ఢిల్లీ దగ్గర మొహ్రాలీ ఇనుప స్తంభ శాషనమును వేయించాడు. ఈ శాసనంలో బెంగాల్‌ ఆక్రమణ గురించి పేర్కొనబడింది.
•చంద్రగుప్త విక్రమాదిత్యుడు తన కుమార్తె ప్రభావతిగుప్తను వాకాటక రాజు రెండవ రుద్రసేనుడికి ఇచ్చి వివాహం చేశాడు.
•వాకాటకాలు ఎలిఫెంటా, కన్హరి గుహలను తొలిచారు.

కుమారగుప్తుడు(క్రీ. శ. &415-455):
👉🏻ఇతన్ని వ్యాఘ్రహ బలపరాక్రమ అంటారు.
👉🏻ఇతను తన పరిపాలనను వివరిస్తూ తామ్ర పత్రాలను విడుదల చేశాడు.
👉🏻నలంద విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేశాడు.
👉🏻ఇతని కాలం నుంచే హణుల దండయాత్ర ప్రారంభమైనది.
👉🏻ఇతను వేయించిన నాణేలు
1. ఏనుగుపై స్వారీ చేస్తున్నట్లు
2. ఖడ్గ మృగాన్ని వధిస్తున్నట్లు
3. అశ్వమేధ నిర్వహణ

స్కందగుప్తుడు (క్రీ.శ. 455-467):
👉🏻ఇతను చివరి గొప్ప గుప్త పాలకుడు
👉🏻ఇతని కాలంలోనే హుణుల దండయాత్ర అత్యధికమైనది. ఇతను చైనాకు రాయబారిని పంపాడు.
👉🏻స్కందగుప్తుని గుజరాత్‌ వైస్రాయి చక్రపాలిత, అతని కుమారుడు పన్నదత్తుడు సుదర్శన తటాకమునకు మరమ్మతులు చేశారు.
👉🏻ఇతని తర్వాత పాలకులను మలి గుప్తులు అంటారు.
భానుగుప్తుడు:
👉🏻క్రీ.శ. 510 లో ఎరాన్‌ శాసనమును వేయించాడు. ఈ శాసనంలో మొట్టమొదటిసారిగా సతీసహగమనం గురించి పేర్కొనబడింది.
👉🏻మలి గుప్తులలో గొప్పవాడు -నరసింహగుప్త బాలాదిత్య.
👉🏻ఇతను మాళ్వా పాలకుడు యశోధర్శన్‌తో కలిసి హూణా దండయాత్రికుడు మిహిర్‌కులుడిని ఓడించాడు.
👉🏻హూనా దండయాత్రికుల్లో ప్రముఖులు- తోరమానుడు, మిహిర్ములుడు

పరిపాలన:

👉🏻గుప్తులు తమ రాజ్యాన్ని ఈ క్రింది విధంగా విభజించారు.
•రాజ్యం -భుక్తులుగా
•భుక్తి -విషయాలుగా
•విషయ -విత్తిలుగా
•విత్తి - గ్రామాలుగా
👉🏻భుక్తి అధికారిని. ఉపరికుడు అంటారు. ఇతనికే భోగిక, భోగపతి, గోప్త, రాజస్థానీయ అనే పేర్లు కూడా కలవు.
👉🏻విషయ అధిపతిని విషయపతి లేదా అయుక్త అనేవారు
👉🏻విషయపతికి సలహాలిచ్చే సభ నగర సభ
👉🏻నగరసభలో నలుగురు సభ్యులుంటారు
1 నగర శ్రేష్టి -వర్తక సంఘ అధ్యక్షుడు
2 సార్ధవాహ -వర్తక సంఘాల రక్షణ నాయకుడు
3 ప్రథమ కులిక- పురాధ్యక్షుడు (కార్మికాధ్యక్షుడు)
4 ప్రథమ కాయస్థ -ముఖ్య లేఖకుడు
👉🏻విత్తి అనగా కొన్ని గ్రామాల కలయిక
👉🏻గ్రామ అధ్యక్షున్ని గ్రామికుడు అంటారు.
👉🏻గ్రామం అనేది పరిపాలనాపరంగా ప్రాథమికమైన విభాగం.
👉🏻అడవుల పరిరక్షణ కొరకు నియమించబడిన అధికారి-గౌల్మికుడు
👉🏻గుప్తుల కాలంలో రాజుల వద ఉన్న ప్రధాన భూస్వాములను ఉక్కకల్ప అనేవారు.

సమాజం:

👉🏻చతుర్వర్ణ వ్యవస్థ ఉండేది.
👉🏻బ్రాహ్మణులకు అత్యున్నత స్థానం కల్పించబడింది. గుప్తుల కాలంలోనే బ్రాహ్మణులు తాము భూమిపై కన్పిస్తున్న దేవుళ్లమని ప్రకటించుకున్నాడు.
👉🏻గుప్తుల కాలంలో వివిధ గ్రామాలు వివిధ వ్యక్తులకు దానంగా ఇవ్వబడేది
ఉదా||
1) అగ్రహార గ్రామాలు -బ్రాహ్మణులకు దానమిచ్చిన గ్రామాలు
2) బ్రహ్మధేయ గ్రామాలు -మత కార్యక్రమాల నిర్వహణ కోసం బ్రాహ్మణేతర వర్ణాలకు దానమిచ్చిన గ్రామాలు
3) భూస్వామ్య గ్రామాలు -సేవలకు ప్రతిఫలంగా ఉద్యోగులకు, సేనానులకు దానమిచ్చిన గ్రామాలు
👉🏻2వ చంద్రగుప్తుడు బ్రాహ్మణులకు తన ఆస్థానంలో ఉన్నత స్థానం ఇచ్చాడు. అప్పుడే బ్రాహ్మణులు భారతదేశ ఇతిహాసాలైన రామాయణం, మహాభారతంలను లిఖించారు.
👉🏻18 వురాణాల్లో అధిక వురాణాలు అప్పుడే లిఖించబడ్డాయి.
👉🏻గుప్తుల కాలంలోనే సమాజంలో జాజ్‌మనీ అనే విధానం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం సమాజం వృత్తుల ఆధారంగా శాస్ర్తీయ పద్ధతిలో విభజించబడింది.
👉🏻గుప్తుల కాలంలో నైపుణ్యత ఆధారంగా కుల వృత్తులు అనేవి పెద్దఎత్తున చేపట్టబడ్డాయి. వారి వృత్తులకు వారు యజమానులుగా వ్యవహరించేవారు. దీనినే జాజ్‌మని విధానంగా పరిగణిస్తారు. 'జాజ్‌మని' అనే పదం సంస్కృత పదమైన 'యజమాన' నుంచి వచ్చింది.
👉🏻సతీ సహగమనం గుప్తుల కాలంలో ఉండేదని చెప్పుటకు క్రీ.శ. 510లో వేయించబడిన ఎరాన్‌ శాసనం ద్వారా తెలుస్తుంది.

ఆర్ధిక వ్యవస్థ :

👉🏻ప్రధాన ఆదాయం భూమి శిస్తు 1/9వ వంతు నుంచి 1/6వ వంతు శిస్తు వసూలు చేసేవారు.
👉🏻ఖనిజ సంపదలో సగభాగం రాజ్యానికి చెందుతుంది.
👉🏻గుప్తుల కాలంలో ఈ క్రింది రకాల భూములు ఉండేవి
1) క్షేత్రం -అన్ని రకాల పంటలు పండేవి
2) ఖిల -3 సం॥లుగా పంట పండనిది.
3) వస్తి -నివాసయోగ్యమైన భూమి
4) అప్రహత -అటవీ భూములు
5) గోపథ సరాహీ -పచ్చిక బయళ్లు
👉🏻వివిధ రకాల పన్నులు
1) భాగ -భూమిపన్ను (1/6వ వంతు)
2) భోగ -గ్రామస్తులు పండ్లు, వంట చెరుకు రూపంలో చెల్లించే పన్ను
3) కర -న్యాయ బుద్ధి గల రాజులు చెల్లించే ప్రత్యేక పన్ను
4) ఉదయాంగ -పోలీస్‌ పన్ను
5) హిరణ్య -బంగారు నాణేల రూపంలో చెల్లించే భూమి శిస్తు
6) హాలీగర -నాగలి పన్ను
7) శుల్క -వర్తకుని పన్ను/రేవు పట్టణాలపై పన్ను
👉🏻గుప్తుల కాలం నాటి నాణేలు
1 దీనార్‌ (సువర్ణ-బంగారు నాణెం)
2 రూపిక (వెండి నాణం)
3 కౌరీలు (గవ్వలు)
(నాణేల కొరత కారణంగా మారక ద్రవ్యంగా గవ్వలను ఉపయోగించారు. ఈ గవ్వలనే కౌరీలు అంటారు)
👉🏻ఈ కాలంలో అప్పుపై వడ్డీ 25% ఉండేది. గుప్తులు అధికసంఖ్యలో బంగారు నాణేలు చెలామణి చేసినా, రాగి, వెండి నాణేలను రోజువారీ మారకంగా వాడేవారు.
👉🏻వీరికాలంలో శకులు, యవనులను “మ్లేచ్భులుగా పేర్కోనేవారు.
👉🏻అరగట్ట మరియు గటీయంత్రం/ఉద్గటగట - ఉత్తర భారతదేశంలో నీటిపారుదల వసతి.
👉🏻తడగ -దక్షిణ భారతదేశంలో చెరువు ద్వారా నీటిపారుదల
👉🏻కుల్యవాప -భూమి కొలత (3 ఎకరాలు)
👉🏻ద్రౌనవాప -భూమీ కొలత (కుల్యవాపకు 1/8వ వంతు)

గుప్తుల సాహిత్యం:

👉🏻సంస్కృతం, రాజస్థానీ ఉన్నత కులాలవారి భాషగా ఉంది. రాజశాసనాలు. చక్కని సంస్కృతంలో లిఖించబడ్దాయి. అలహాబాద్‌ స్తంభ శాసనాన్ని సంకలనం చేసిన హరిసేనుడు, ఒకటో కుమారగుప్తని కాలంనాటి సిల్క్‌ నేత పనివారి దశపురి శాసనాన్ని సంకలనం చేసిన వత్సభట్టి గుప్త యుగంలో పేరొందిన శాసన రచయితలు.
👉🏻ప్రాకృతం సామాన్య ప్రజల భాషగా ఉంది. బౌద్ద, జైనం ఈ భాషను వాడారు.

కాళిదాసు:
•ఇతను గుప్తుల కాలంలో ప్రసిద్ధి చెందిన కవి
•ఇతని బిరుదు-ఇండియన్‌ షేక్స్‌పియర్‌
•ఇతని రచనలు ప్రాకృతంలో ఉంటాయి
•ఇతని రచనల్లో ప్రకృతి ఆరాధన, ప్రేమ కన్పిస్తుంది
•ఇతను రచించిన నాటకాలు :
1) అభిజ్ఞాన శాకుంతలం : శకుంతల, దుష్యంత చక్రవర్తుల సమాగమ వృత్తాంతం
2) మాళవికాగ్నిమిత్రం : అగ్నిమిత్రుడు, మాళవికల ప్రణయ వృత్తాంతం
3) విక్రమోర్వశీయం _ : ఊర్వశి, పరూరవనికి మధ్య గల ప్రేమ వృత్తాంతం
•ఇతను రచించిన కావ్యాలు
1) రఘువంశం : సూర్యవంశానికి చెందిన 30 మంది రాజులు-వారి కాలంలోని సంఘటనలు
2) కుమార సంభవం : శివ పార్వతుల ప్రణయ వృత్తాంతంv 3) మేఘదూతం : యక్షుడు తన విరహవేదనను రామగిరి నుండి ప్రియురాలు ఉండే అలకా నగరానికి చేరవేయమని
మేఘాన్ని కోరుతున్న సంఘటన

విశాఖదత్తుడు:
•'ముద్రారాక్షసం'-మౌర్యచంద్రగుప్పడు నందులను పదవీచ్యుతులని గావించిన విధము వర్ణించబడింది.
•దేవీ చంద్రగుప్తం రామగుప్తుని కాలంలో జరిగిన సంఘటనలు పునశ్చరణ చేసింది.

శూద్రకుడు:
•మరొక ప్రసిద్ధ నాటకకర్త. అతను రచించిన “మృచ్చకటికం”లో చారుదత్తుడు, ఆస్థాన నాట్యగత్తె వసంతసేనల ప్రేమ వృత్తాంతం.
•తాలి యుగాల్లో బుషుల చేత రాయబడిన పురాణాలు, గుప్త యుగంలో సంస్కరించబడ్డాయి. మార్కండేయ పురాణం, బ్రహ్మాండ పురాణం, వాయు పురాణం, విష్ణుపురాణం, మత్స్య పురాణం వీరి కాలానికి చెందినవిగా భావిస్తున్నారు.
•మహాభారతం కూడా సంస్కరించబడి మొదట్లో 24000 శ్లోకాలు ఉండగా క్రమేణా అవి 10,00,000 శ్లోకాల వరకు పెరిగాయి.
•విష్ణుశర్మ “పంచతంత్రం” కూడా సేకరించబడిన కథలతో రాయబడిన గ్రంథం.
•అమరసింహుడు అమరకోశాని, చంద్రగోమియా చంద్ర వ్యాకరణం రచించారు.


కళలు:

దేవాలయాలు
•దేవాలయాల నిర్మాణం కొండ ప్రాంతాల నుండి మైదానాలకు మారాయి.
•దేవతలకు ఆలయాలు నిర్మించడం వీరితో ప్రారంభమయింది.
•వీరి కాలంలో నిర్మించిన దేవాలయాలు
1 నాబ్నా పార్వతీ దేవాలయం
2 భూమ శివాలయంలు (క్రీ.శ. 5వ శతాబ్ధికి చెందినవి)
3 భిటార్గం ఇటుకలతో నిర్మించిన దేవాలయం (క్రీ.శ. 6వ శతాబ్దానికి చెందింది.)
4 బుద్ద గయ లోని మహాబోధి దేవాలయం భిటార్గం దేవాలయాన్ని పోలి ఉంది.
5 దియోగడ్‌ దశావతార దేవాలయం

విగ్రహాలు
•వీరి కాలంలోని విగ్రహాలు
1 రాజషాహి కృష్ణుడు, అతని అనుచరుల ప్రతిమలు
2 సారనాథ్‌ పద్మాసీనుడై ధర్మచక్ర ప్రవర్తన చేసున్న బుద్ధ విగ్రహం 3 మధుర గుండు కల్చ్టి నిల్చుని ఉన్న బుద్ధ విగ్రహం
4 పావయా (గ్వాలియర్‌) స్త్రీ వాద్యకారులతో పరివేష్టించి ఉన్న నర్తకి ప్రతిమ
•బితోర్గం మరియు దియోగడ్‌ దేవాలయాలు చతురస్రాకారంలో నిర్మించబడ్డాయి.
•గుప్తుల కళ పువ్వులు, తీగలతో కూడిన అలంకరణను, రేఖా గణిత ప్రామాణికతకు ఎంతో పేరు పొందింది.

లోహకారకళ
•వీరి కాలంలో లోహకారకళ గుప్తుల కాలంలో లోహాలను వెలికితీసి కరిగించి పోతపోసిన కళ -లోహకారకళ (మహాకారకళ)
•గుప్తులు లోహకారకళలో ఉపయోగించిన లోహాలు -వెండి, బంగారం, రాగి, ఉక్కు కంచు
vబృహత్తర విగ్రహాలకు ఉపయోగించిన లోహం -కంచు
•గుప్తులు విగ్రహాలను పోత పోయడానికి ఎక్కువగా ఉపయోగించిన పద్ధతి -సైర్‌
•లోహకారకళకు ఉదాహరణలు-
1) బుద్దుని తామ్ర విగ్రహం -నలంద (దీని ఎత్తు 81 అడుగులు, హుయాన్‌త్సాంగ్‌ చూసినట్టు వ్రాశారు)
2) బుద్ధుని తామ్ర విగ్రహం -సుల్తాన్‌గంజ్‌ (దీని ఎత్తు 71/2 అడుగులు, 1 టన్ను బరువు)

మనోహర చిత్రకళ
•వీరి కాలంలో మనోహర చిత్రకళ ముఖ్యంగా 4 ప్రదేశాల్లో జరిగింది.
1 అజంతా
2 ఎల్లోరా
3 బాగ్‌
4 బాదామి
•వాస్తును బట్టి అజంతా శిల్చ్పకళను 3విధాలుగా విభజించవచ్చు
1) గరుడు, యక్ష, గంధర్వ, అప్సరసల చిత్రాలు
2) పద్మపాణి, అవలోకితేశ్వర, బోధిసత్వ విగ్రహాలు
3) జాతక కథల చిత్రాలు

అజంతాలోని 16వ గుహలో చిత్రాలు
1 నందుని సన్యాస స్వీకారం
2 గౌతముని జన్మ, జాతక పరీక్ష
3 గౌతముని విద్యాభ్యాసం
4 గౌతముని పురవీధి విహారం
5 సుజాత పాయసాన్నమివ్వడం
6 మరణాసన్నమైన రాకుమారి చిత్రం

అజంతాలోని 17వ గుహలోని చిత్రాలు
1 జాతక కథలు
2 తల్లి బిడ్డ చిత్రం
3 రాజ ప్రసాదంలో శృంగారం మూర్తీభవించిన రాజతనయ
•అజంతా చిత్రాల్లో తలమానికమైన చిత్రం -మరణాసన్న రాకుమారి చిత్రం
•అజంతా చిత్రాలకు అనుకరణలు -బాగ్‌ చిత్రాలు (ఇవి అజంతాకు 150 కి.మీ. దూరంలో కలవు)

బాగ్‌ గుహలు
•బాగ్‌ గుహలలో నిలిచి ఉన్న గుహల సంఖ్య -6
గుహ స్థానికనామం
1వ గుహ-
2వ గుహ/td>పాండవ గుహ
3వ గుహగజశాల
4వ గుహరంగమహల్‌
5వ గుహశాల
6వ గుహ-
•విష్ణు ధర్మోత్తర పురాణం -గుప్తుల కాలం నాటి చిత్ర కళను గురించి వర్ణిస్తుంది.
•అలంగ్రంగయానసూటత్ర -పెయింటింగ్‌ పై మొదటి పుస్తకం.
•కాళిదాసు మాళవికాగ్నిమిత్రం -గుప్తులకాలం నాటి సంగీత పద్ధతిని వివరించడం జరిగింది.


గుప్తుల కాలంలో విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాలు:

ఆర్యభట్ట (క్రీ.శ. 6వ శతాబ్ధం):
•ప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడైన ఆర్యభట్ట “ఆర్యభట్టీయం” రచించాడు. సున్నా సిద్ధాంతాన్నిరూపొందించాడు. "పై అనగా
•3.146 అని, సూర్య సంవత్సర కాలం 365-358 రోజులని వివరించాడు. సూర్య సిద్ధాంతాన్ని వివరించాడు. దశాంశ పద్ధతిని ఉపయోగించాడు. భూమి తన అక్షం మీద పరిభ్రమిస్తుందని ప్రకటించిన మొదటి భారతీయ ఖగోళ శాస్త్రవేత్త.

వరాహా మిహిరుడు (క్రీ.శ.6వ శతాబ్ధం):
•ఇతని అతి ముఖ్య గ్రంథం 'బృహత్‌ సంహిత' ఇదొక విజ్ఞాన సర్వస్వం. అలాగే 'పంచ సిద్ధాంతిక' అను గ్రంథాన్ని రచించాడు.

బ్రహ్మగుప్తుడు (క్రీ.శ.7వ శతాబ్ధం):
•ప్రకృతి నియమం ద్వారా వస్తువులన్నీ భూమి మీదకి పడతాయని పేర్కొనడం ద్వారా న్యూటన్‌ నియమాన్ని ముందుగానే గ్రహించాడు.

•బ్రహ్మస్ఫుట సిద్ధాంత, ఖందఖాద్యకం ఇతని రచనలు. వాగ్భటుడు :
•ఇతను వైద్యశాస్త్రంలో అష్టాంగ సంగ్రహాన్ని రచించాడు.

ఇతర పుస్తకాలు:
•భాసుడు - స్వప్నవాసవదత్తం
•విజ్ఞానేశ్వరుడు - మీతాక్షరం (యజ్ఞవాల్ముని ధర్మశాస్త్రంపై వ్యాఖ్య)
•జీమూతవాహన -దయబాగ
•భాస్కరాచార్య - సిద్ధాంత శిరోమణి
•ధన్వంతరి -ధన్వంతరి నిఘంటువు
•మెరుటుంగా -ప్రబంద చింతామణి
•టోలమి -జాగ్రఫీ ఆఫ్‌ ఇండియా
•పుగలెంది -నలవెంబ
•క్షేమేంద్రుడు -బృహత్‌కథా మంజరి
•భల్లాట -పద్మమంజరి
•మదన -పారిజాతమంజరి
•రాజశేఖర -కర్పూరమంజరి
•దండిన్‌ -దశకుమారచరిత, అవంతి సుందరీకథ
•నారాయణ పండిత్‌ -హితోపదేశ
•పాణిని - అష్టధ్యాయిని (ప్రాచీన కాలం నాటి అతి ముఖ్యమైన సంస్కృత గ్రంథం. దీని ప్రకారం శివుని ధమరుకం నుంచి సంస్కృత పదాలు ఉద్భవించాయి)

No comments:

Post a Comment

Post Bottom Ad