పారశీకుల (ఇరాక్) దండయాత్ర
భారతదేశంపై మొదటిసారిగా దండయాత్ర చేసిన విదేశీయులు పర్షియన్లు. వీరు ఇరాన్ దేశానికి చెందినవారు. క్రీ.పూ. 530 ప్రాంతంలో పర్షియన్ చక్రవర్తి 'సైరస్' హిందూకుష్ పర్వతాన్ని దాటి వాయువ్య భారతదేశంలో ప్రవేశించాడు. గాంధార, కాంభోజ మొదలైన రాజ్యాలు సైరస్‌కు కప్పం చెల్లించాయి.ఆ తర్వాత మొదటి డేరియస్ క్రీ.పూ. 516లో పంజాబ్, సింధు ప్రాంతాలను జయించి తన రాజ్యంలో కలిపాడు. (డేరియస్-1 రాజ్యంలో పంజాబ్-సింధు 20వ సాత్రపి అయ్యాయి. సాత్రపి అంటే రాష్ట్రం.)
ఈ దండయాత్రల వల్ల పర్షియన్ భావ ధోరణుల ప్రభావం భారతీయ జీవనంలో అనేక రంగాల మీద పడింది.
పర్షియన్ నాణేలని భారతదేశం అనుకరించింది. పర్షియన్ లిపితో దగ్గర సంబంధం ఉన్న ఖరోష్ఠి లిపి వాయువ్య భారతదేశంలో వ్యాప్తి చెందింది.
డేరియస్ కాలంలో పర్షియాలోని శిలాశాసనాల సాంప్రదాయమే అశోకుడు శిలాశాసనాలు వేయించటానికి ప్రేరణ కావచ్చు.
గ్రీకు దండయాత్రలు
అలెగ్జాండర్ 'గ్రీకు'ల రాజు. అలెగ్జాండర్ 'మాసిడోనియా'కు చెందిన రాజు. ఈయనకు ప్రపంచాన్నంతా జయించి ప్రపంచ విజేతగా పేరు పొందాలని కోరిక. ఇతను గ్రీసులో మాసిడోనియా నుంచి బయలుదేరి ఆసియా ఖండాన్నంతా ఆక్రమించి 'పర్షియా' సామ్రాజ్యాన్ని జయించి భారత్‌లోకి ప్రవేశించాడు.అలెగ్జాండర్ భారత్‌లో ప్రవేశించినప్పుడు
- తక్షశిల రాజ్యానికి రాజుగా ఉన్న 'అంబి' 'అలెగ్జాండర్' కు లొంగిపోయినాడు.
- జీలం-చినాబ్ నదుల మధ్య రాజ్యాన్ని పాలిస్తున్న రాజు 'పురుషోత్తముడు'. అలెగ్జాండర్‌తో యుద్ధం చేసిన పురుషోత్తముడు ఓడిపోయాడు. కాని అతని ధైర్య సాహసాలు మెచ్చి అతని రాజ్యం అతనికిచ్చాడు.
- తరువాత 'ఉత్తర భారతదేశం'లో 'నందుల'తో యుద్ధం చేసి వారి రాజ్యాలను స్వాధీనం చేసుకోవాలని అనుకున్నాడు. కాని నందుల సైనిక బలాన్ని గురించి విని భారత్ నుంచి వెనుదిరిగి పోయాడు.
అలెగ్జాండర్ దండయాత్రలు
- అలెగ్జాండర్ తండ్రి 'ఫిలిప్స్' మరణం తరువాత అలెగ్జాండర్ తన 20వ ఏట క్రీ.పూ. 336 లో సింహాసనం అధిష్టించాడు.
- అలెగ్జాండర్ 'మాసిడోనియా' ప్రాంతానికి చెందిన వ్యక్తి.
- గ్రీకు, పర్షియా, ఆసియా మైనర్, ఈజిప్ట్‌లను జయించాడు.
- అలెగ్జాండర్ పారశీక రాజ్యంపై దండెత్తి మూడో డెరియాను క్రీ.పూ. 330 లో ఓడించాడు.
- అలెగ్జాండర్ దండయాత్రకు ఆధారాలు గ్రీకు రచనలు.
- భారతదేశ సిరిసంపదల గురించి విని భారత్ వైపు సైన్యాన్ని నడిపించాడు.
- అలెగ్జాండర్ ప్రపంచ విజేత కావాలనే కోరిక గలవాడు.
- అనాబాసిన్ ఆఫ్ అలెగ్జాండర్ (Aఅabaరఱరశీట Aశ్రీవఞస్త్రఅసవతీ) అనే గ్రంథంలో భారతదేశంపై తను చేసిన దండయాత్రలు వర్ణించాడు.
- ఒనిసిక్రిటన్ - అతని జీవిత చరిత్ర గ్రంథం.
- నియర్చ్‌న్- అతని దండయాత్రలు క్రమం.
- అలెగ్జాండర్ క్రీ.పూ. 324లో 'బ్యాబిన్‌లో మరణించాడు.
- 2 సంవత్సరాల తర్వాత నందులను ఓడించి 'చంద్రగుప్త మౌర్యుడు' మగధ రాజ్యాన్ని ఆక్రమించాడు.
No comments:
Post a Comment