భారతదేశ ఆక్రమణ (British Conquest of India) - GNANA SAMHITHA

Breaking

Post Top Ad

Thursday, March 20, 2025

భారతదేశ ఆక్రమణ (British Conquest of India)

👉🏻భారతదేశాన్ని (బ్రిటిష్ వారు వివిధ దశలలో ఆక్రమించారు).
👉🏻మొదటిగా కర్టాటక ‌ తర్వాత వరుసగా బెంగాల్‌, మైసూర్‌, మరాఠా, సింధ్‌, పంజాబ్‌, అవధ్‌లను ఆక్రమించారు.


అంగ్లో-కర్ణాటక యుద్ధాలు

కర్ణాటక అక్రమణ (లేదా) అంగ్లో-కర్ణాటక యుద్ధాలు
👉🏻భారతదేశంలో బ్రిటీష్‌ మరియు ఫ్రెంచి వారి మధ్య జరిగిన యుద్ధాలను ఆంగ్లో-కర్ణాటక యుద్ధాలు అంటారు. మొత్తం మూడు ఆంగ్లో-కర్ణాటక‌ యుద్దాలు జరిగాయి.
👉🏻కర్ణాటక్‌ రాజ్యమును స్థాపించినది - సాదతుల్లాఖాన్‌
👉🏻ఇతని తర్వాత నవాబు -దోస్త్‌ అలీ అన్వరుద్దీన్‌ కాలంలో మొదటి, రెండవ కర్గాటక‌ యుద్దాలు జరిగాయి.
1) మొదటి ఆంగ్లో-కర్ణాటక‌ యుద్ధం (1746-48) (History of The First Carnatic War):
•ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా భారతదేశంలో బ్రిటీష్‌ మరియు ఫ్రెంచి వారి మధ్య మొదటి ఆంగ్లో కర్ణాటక‌ యుద్ధం ఆరంభమైంది.
•భారతదేశంలో బ్రిటీష్‌ జనరల్‌ అయిన బార్నెట్‌ ఫ్రెంచి నౌకలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేశాడు.
•భారతదేశంలో ఫ్రెంచి జనరల్‌ అయిన డూప్లే మారిషస్‌లో ఉన్న బోర్జినాయిస్‌/ బోర్డేను భారత్‌కు పిలిపించి, ఇద్దరూ
•కలిసి బ్రిటీషు స్థావరం అయిన మద్రాసును ఆక్రమించారు.
•కానీ బోర్డినాయిస్‌ లంచం తీసుకొని మద్రాసును బ్రిటీష్‌ వారికి అప్పగించి తిరిగి మారిషస్‌కు వెళ్లిపోయాడు.
•అపుడు డూప్లే కర్టాటక్‌ నవాబు అన్వరుద్దీన్‌ సహాయంతో మద్రాసును తిరిగి ఆక్రమించాడు.
•దీనికంటే ముందు డూప్లే అన్వరుద్దీన్‌ మధ్య ఒక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం మద్రాసును ఆక్రమించిన తర్వాత దీనిని అన్వరుద్దీన్‌ ఆధీనంలో ఉంచాలి. కానీ డూప్లే మద్రాసును అన్వరుద్దీన్‌ ఆధీనంలో ఉంచుటకు నిరాకరించాడు.
•దీంతో అన్వరుద్దీన్‌ తన డిమాండ్లను పూర్తి చేయ వలసిందిగా హెచ్చరిస్తూ 10 వేల మంది సైనికులను మద్రాసు వైపుకు పంపాడు.
•డూప్తే కెప్టెన్‌ పారడైజ్‌ నేతృత్వంలో 500 మంది సైనికులను కర్టాటక‌ వైపుకు పంపాడు.
•వీరిద్దరి మధ్య(1748లో) సెయింట్‌ థోమ్‌ లేదా అడయార్‌(నది) యుద్ధం జరిగింది. అన్వరుద్దీన్‌ సైనికులు ఓడించబడ్డారు.
•1748లో ఆక్సిలా చాపెల్‌ (ఫ్రాన్స్‌లోని పట్టణం) ఒప్పందం ప్రకారం యూరప్‌లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అంతమైంది.
•దీంతో భారతదేశంలో కూడా మొదటి ఆంగ్లో కర్టాటక యుద్ధం అంతమైంది. ఈ ఒప్పందం ప్రకారం మద్రాసు తిరిగి బ్రిటీష్‌ వారికి ఇవ్వబడినది.

2) 2వ అంగ్లో-కర్ణాటక్‌ యుద్ధం (1749-1754):
•1748లో హైదరాబాద్‌ నవాబ్‌ నిజాం ఉల్‌ ముల్క్‌ మరణించాడు.
•ఇతని మరణానంతరం నాజర్‌జంగ్‌ హైదరాబాద్‌ నవాబు అయ్యాడు. ఇతని వ్యతిరేకి ముజాఫర్‌జంగ్‌ (నిజాముల్‌ ముల్క్‌ మనవడు & ఖైరున్నీసా కుమారుడు)
•కర్టాటక‌లో అన్వరుద్దీన్‌ యొక్క వ్యతిరేకి చందాసాహెబ్‌ (అసలుపేరు హుస్సేన్‌ దోస్త్‌ అలీ)
•ఫ్రెంచి గవర్నర్‌ డూప్లే ముజాఫర్‌జంగ్‌నకు, చందా సాహెబ్‌నకు మద్దతు పలికాడు. వీరి కూటమి 1749లో అంబూరు యుద్ధంలో అన్వరుద్దీన్‌ను వధించింది. దీంతో చందాసాహెబ్‌ కర్టాటక‌ నవాబు అయ్యాడు.
•1750లో నాజర్‌జంగ్‌ తొలగించబడి ముజాఫర్‌జంగ్‌ హైదరాబాద్‌ నవాబు అయ్యాడు.
•ముజాఫర్‌జంగ్‌ మచిలీపట్నం, యానాం, దివి ప్రాంతాలను ఫ్రెంచి వారికి ఇచ్చాడు.
•1751లో ముజాఫర్‌జంగ్‌ కడపలోని రాయచోటి దగ్గర లక్కిరెడ్డిపల్లి వద్ద కడప కర్నూలు నవాబులకు నాయకుడైన హిమ్మత్‌ఖాన్‌చే హత్యకు గురయ్యాడు.
•హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెంచి అధికారి బుస్సీ సలాబత్‌ జంగ్‌ను నవాబును చేశాడు. దీనికి గాను 1752లో సలాబత్‌ జంగ్‌ ఉత్తర సర్కారులను (కొండపల్లి, ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళం) ఫ్రెంచి వారికి ఇచ్చాడు.
•కర్టాటక ‌లో అన్వరుద్దీన్‌ కుమారుడు మహ్మద్‌అలీ తిరుచిరాపల్లిలో బ్రిటీష్‌ ఆభ్రయమును పొందాడు.
•తిరుచిరావల్సిలో బ్రిటీష్‌ సైనికాధికారి అయిన రాబర్ట్‌ క్లైవ్‌ 500 మంది సైనికులతో కర్జాటక రాజధాని అయిన ఆర్కాట్‌పై దాడిచేసి దానిని ఆక్రమించాడు. అందువల్లనే రాబర్ట్‌ క్రైవ్‌ను ఆర్కాట్‌ వీరుడు అంటారు.
•అనేక చిన్న చిన్న యుద్ధాలలో చందాసాహెబ్‌ మద్దతుదారులు ఓడించబడద్దారు. చివరకు చందాసాహెబ్‌ పట్టుబడి ఉరితీయబడ్డాడు.
•మహ్మద్‌ అలీ కర్టాటక‌ నవాబు అయ్యాడు. ఇతను “వల్లాజా' అనే బిరుదు పొందాడు. ఇతని వంశాన్ని వల్లజా వంశం అంటారు.
•చందాసాహెబ్‌, పరాజయాలను తెలుసుకున్న ఫ్రెంచి ప్రభుత్వం డూప్లేను వెనకకు పిలిపించి గదాహోను ఫ్రెంచి గవర్నరుగా భారత దేశానికి పంపినది.
•1754లో గదాహో పాండిచ్చేరి ఒప్పందమును బ్రిటీష్ వారి‌తో కుదుర్చుకొని 2వ ఆంగ్లో కర్ణాటక యుద్ధమును అంతం చేశాడు.

3) 3వ ఆంగ్లో-కర్ణాటక‌ యుద్ధం (1756-1763):
•యూరప్‌లోని సప్తవర్ష యుద్ధాల కారణంగా భారతదేశంలో 3వ ఆంగ్లో-కర్టాటక్ యుద్ధం ప్రారంభమైనది.
•ఫ్రెంచి ప్రభుత్వం కౌంట్‌-డీ-లాలీను గవర్నర్‌గా భారతదేశానికి పంపినది.
•కౌంట్‌-డి-లాలీ భారతదేశానికి వచ్చి హైదరాబాద్‌లో ఉన్న బుస్సీని పిలిపించి బ్రిటీషు స్థావరాలపై దాడి చేశాడు.
•1760లో వందవాసి యుద్ధంలో బ్రిటీష్‌ జనరల్‌ ఐర్‌కూట్‌ ఫ్రెంచి జనరల్‌ కౌంట్‌-డీ-లాలీని, బుస్సీలను ఓడించి ఖైదీలుగా పట్టుకున్నాడు. ఈ యుద్ధంతో ఫ్రెంచివారు భారతదేశంలో పూర్తిగా తమ ఆధివత్యమును కోల్పోయారు.
•1763లో పారిస్‌ ఒప్పందంతో సప్తవర్ష యుద్దాలు యూరప్‌లో అంతమయ్యాయి.
•దీని ప్రకారం భారతదేశంలో కూడా 3వ ఆంగ్లో కర్ణాటక యుధ్ధం అంతమైంది. ఫ్రెంచివారు పాండిచ్చేరికి పరిమితమైనారు. పాండిచ్చేరి అనగా 4 ప్రాంతాలు
1. పాండిచ్చేరి
2. కరైకల్‌
3. యానంv 4. మాహే
•కర్టాటక‌ నవాబు మహ్మద్‌అలీ మద్రాసులోని చెపాక్‌ భవంతిలో విశ్రాంతి పొందుతూ పాలనా బాధ్యతలను 'బ్రిటీష్‌కు అప్పగించాడు.


బెంగాల్‌ అక్రమణ (1764)

👉🏻బెంగాల్‌ రాజ్యమును స్థాపించినది ముర్షీద్‌ కూలీఖాన్‌. ఇతని తర్వాత నవాబులు ఘజావుద్దీన్‌, సర్పరాజ్‌ఖాన్‌, ఆలీవర్దిఖాన్‌.
👉🏻1756లో ఆలీవర్ధిఖాన్‌ మరణించడంతో అతని మనుమడు సిరాజ్‌ ఉద్దౌలా బెంగాల్‌ నవాబు అయ్యాడు.
👉🏻ఇదే సమయంలో దక్షిణ భారతదేశంలో బ్రిటీష్‌ మరియు మ్రైంచివారి మధ్య 3వ ఆంగ్లో కర్ణాటక‌ యుద్ధం ఆరంభమైనది.
👉🏻బెంగాల్‌లో బ్రిటీష్‌ మరియు ఫ్రెంచి తమ స్థావరాల చుట్టూ రక్షణ గోడలను నిర్మించుకోవడం ప్రారంభించారు.
👉🏻3 సిరాజ్‌ ఈ రక్షణ గోడల నిర్మాణమును ఆపివేయవలసినదిగా ఆజ్ఞలను జారీ చేశాడు.
👉🏻చంద్రనాగోర్‌లో ఉన్న ఫ్రెంచి దీనిని అంగీకరించగా బ్రిటీష్‌వారు తిరస్కరించారు. కోపోద్రిక్తుడైన సిరాజ్‌ ఖాసిం బజార్‌పై దాడి చేసి బ్రిటీషు స్థావరాలను ధ్వంసం చేసి సుమారు 150 మందిని ఒక చీకటి గదిలో బంధించాడు.
👉🏻ఈ దాడి సమయంలో కొంతమంది ఆంగ్రేయులు (వారెన్‌ హేస్టింగ్‌, కలకత్తా గవర్నర్‌తో సహా) ఫాల్టా దీవులకు పారిపోయారు.
👉🏻ఈ విషయం మద్రాసులో ఉన్న రాబర్ట్‌క్లైవ్‌కు తెలిసింది. దీనితో రాబర్ట్‌క్లైవ్‌, అడ్మిరల్‌ వాట్సన్‌ ముందుగా ఫాల్బా దీవికి చేరుకొని అక్కడి ఆంగ్రేయులను రక్షించి తర్వాత చీకటి గది యొక్క తలుపులను తెరిచారు.
👉🏻150 మందిలో కేవలం 21 మంది మాత్రమే బ్రతికిఉ న్నారు. దీనినే చీకటి గది ఉందంతం(Black Hole Tragedy) అంటారు.
👉🏻21 మందిలో ఒకడైన హోల్‌వెల్‌ చీకటి గది ఉదంతమును రాబర్ట్‌ క్లైవ్‌కు వివరించాడు.
👉🏻రాబర్ట్‌ క్లైవ్‌ కలకత్తా, హుగ్రీలను ఆక్రమించడంతో సిరాజ్‌ ఆలీనగర్‌ అనే ఒప్పందమును కుదుర్చుకొని బ్రిటీష్‌ వారికి
👉🏻పూర్వపు హోదాను కల్పించాడు. కానీ రాబర్ట్‌క్షైవ్‌ కుట్రల ద్వారా బెంగాల్‌ను ఆక్రమించుటకు నిర్ణయించాడు.

కుట్రదారులు :
•మీర్‌జాఫర్‌ - సిరాజ్‌ యొక్క సైన్యాధ్యక్షుడు (మీర్‌బక్షి)
•మిరాన్‌ - మీర్‌జాఫర్‌ కుమారుడు
•అమీన్‌చంద్‌ - వ్యాపారి, మధ్యవర్తి
•మాణిక్‌చంద్‌ - కలకత్తా ఇన్‌చార్జి
•జగత్‌ సేఠ్‌ - బెంగాల్‌లో అత్యంత ధనికుడు
•రాయ్‌దుర్లభ్‌, ఖాదిమ్‌ఖాన్‌- సిరాజ్‌ యొక్క సైనికాధికారులు
•1757 జూన్‌ 2న ప్లాసీ యుద్ధంలో రాబర్ట్‌క్లైవ్‌ సిరాజ్‌ ఉద్దౌలాను ఓడించాడు. ‌
•మీర్‌ మదన్‌, మోహన్‌లాల్‌ అనే సిరాజ్‌ సైనికులు సిరాజ్‌ తరపున వీరోచితంగా పోరాడి మరణించారు.
•మిరాన్‌ పారిపోతున్న సిరాజ్‌ను పట్టుకొని ఉరితీసాడు.
•భారతదేశంలో బ్రిటీష్‌ సామ్రాజ్య స్థాపనకు పునాదిలాంటి యుద్ధం - ప్లాసీ యుద్ధం
•1757లో మీర్‌ జాఫర్‌ బెంగాల్‌ నవాబు అయ్యాడు. 3 కోట్ల రూపాయలను, 24 పరగణాల జమిందారీ హక్కులను బ్రిటీష్‌కు ఇచ్చాడు.
•1760 నాటికి బెంగాల్‌ ఖజానా ఖాళీ అవుటచే మీర్‌ జాఫర్‌ బహుమానాలు ఇచ్చుటకు నిరాకరించాడు. దీంతో మీర్‌జాఫర్‌ను తొలగించి అతని అల్లుడైన మీర్‌ ఖాసీంను బెంగాల్‌ నవాబును చేశారు.
•దీనికిగాను మీర్‌ఖాసిం 3 ప్రాంతాలను బ్రిటీష్‌కు ఇచ్చాడు. అవి
1. మిద్నాపూర్‌.
2. చిట్టగాంగ్‌
3. బుర్దామాన్‌
•మీర్‌ ఖాసిం సమర్దుడైన పాలకుడు. బ్రిటీష్‌ జోక్యం వరిపాలనలో ఉండకూడదని తన రాజధానిని ముర్షీదాబాద్‌ నుండి మొంఘీర్‌కు మార్చాడు.
•బెంగాల్‌ వర్తకులు ఎవ్వరునూ సుంకములు చెల్లించ వలసిన అవసరం లేదని ప్రకటించుట కారణంగా మీర్‌ఖాసీం మరియు బ్రిటీష్‌ వారిమధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి.
•చిన్న చిన్న యుద్దాలలో మీర్‌ ఖాసీం ఓటమిపాలై అవధ్‌కు పారిపోయాడు.
•1763లో మీర్‌ జాఫర్‌ మరలా బెంగాల్‌ నవాబుగా నియమించబడ్డాడు.
•మీర్‌ఖాసీం అవధ్‌ పాలకుడు అయిన ఘజా ఉద్దౌలాతో, మొగల్‌ చక్రవర్తి అయిన 2వ షాఆలంతో బ్రిటీషుకు వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేశాడు.
•1764లో బ్రిటీష్‌ జనరల్‌ మన్రో ఈ కూటమిని బాక్సర్‌ యుద్ధంలో ఓడించాడు. దీంతో బెంగాల్‌ (పశ్చిమ బెంగాల్, ‌బీహార్‌, బంగ్లాదేశ్‌, ఒరిస్సా) పూర్తిగా ఆధీనంలోకి వచ్చింది.
•1765లో అలహాబాద్‌ ఒప్పందం తర్వాత రాబర్ట్‌క్లైవ్ ‌ బెంగాల్‌లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాడు.


ఆంగ్లోమైసూరు యుద్దాలు

👉🏻మైసూర్‌ రాజ్యం క్రీ.శ. 1399లో యడురాయ విజయ చే స్థాపించబడింది.
👉🏻అధునిక మైసూరు రాజ్యమును సాపకుడు- చిలక కృష్ణరాజ్‌ ఒడయార్‌/ 4వ చామరాజ
👉🏻ఇతని ఇద్దరు మంత్రులు -నంద్యరాజ్‌, దేవరాజ్‌
👉🏻హైదర్‌ అలీ ఒక సాధారణ సిపాయిగా మైసూరు సైన్యంలో చేరాడు. తన యుద్ధ నైపుణ్యం కారణంగా అంచెలంచెలుగా ఎదిగి దుండిగల్‌ ప్రాంతంనందు ఫౌజ్‌దారు (సైనికాధికారి) గా నియమించబడ్డాడు.
👉🏻1755లో ఫ్రెంచి సహాయంతో దుండిగల్‌ వద్ద ఆధునిక ఆయుధ కర్మాగారాన్ని ఏర్పాటు చేశాడు.
👉🏻1761లో నంద్యరాజ్‌, దేవరాజ్‌లను తొలగించి హైదర్‌అలీ మైసూరును ఆక్రమించాడు.
👉🏻మైసూరుకు పాలకుడైన తర్వాత హైదర్‌ అలీ తన రాజ్యమును అన్ని వైపులా విస్తరింవజేయడం ప్రారంభించాడు.

మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం (1767-69):
•బ్రిటీష్‌ గవర్నర్‌ - వేరెల్ట్స్
•హైదర్‌అలీ తన రాజ్యమును అన్ని వైపులా విస్తరింపజేయుట కారణంగా బ్రిటీష్‌, హైదరాబాద్‌, మరాఠాలు ఈర్ష్య చెందాయి.
•ఈ ఈర్ష్య మొదటి ఆంగ్లో మైసూరు యుద్దానికి దారితీసింది.
•మొదట్లో హైదర్‌ అలీ ఓడించబడ్డాడు.
•తర్వాత హైదర్‌అలీ తన సైన్యమును పునర్‌వ్యవస్థీకరించి బ్రిటీష్‌ వారిపై విజయాలు సాధించాడు. చెంగమ, తిరువన్న మలై యుద్ధాలలో బ్రిటీష్‌ను ఓడించాడు. బ్రిటీష్‌ స్థావరం అయిన మద్రాస్‌పై దాడి చేశాడు.
•మద్రాస్‌ ఒప్పందంతో 1769లో మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం అంతమైంది.

రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధం (1780-81):
•బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ -వారెన్‌ హేస్టింగ్స్‌
•1770 దశకంలో అమెరికాలో బ్రిటీష్‌కు వ్యతిరేకంగా జార్జి వాషింగ్టన్‌ నేతృత్వంలో అమెరికా స్వాతంత్ర్య పోరాటం ప్రారంభ మైంది.
•ఫ్రెంచివారు జార్జి వాషింగ్టన్‌కు మద్దతు పలికారు. దీని కారణంగా బ్రిటీషు, ఫ్రెంచి వారి మధ్య యుద్ధం ప్రారంభమైంది.
•భారతదేశంలో ఫ్రెంచి స్థావరం అయిన మాహేపై దాడి చేయుటకు బ్రిటీష్‌ నిర్ణయించింది.
•మాహే మైసూరు రాజ్యం లోపల ఉంది. మైసూరు రాజ్యంలోకి బ్రిటీషు సైన్యం ప్రవేశించకూడదని హైదర్‌అలీ బ్రిటీషు వారికి హెచ్చరికలు జారీ చేశాడు.
•కానీ ఈ హెచ్చరికలను బేఖాతరు చేసి బ్రిటీష్‌ మైసూరు రాజ్యంలోకి ప్రవేశించి మాహేపై దాడి చేసింది. దీంతో రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధం ఆరంభమైంది.
•మొదట్లో హైదర్‌ అలీ విజయాలు సాధించాడు.
•1781లో పోర్టోనోవో యుద్ధంలో బ్రిటీష్‌ జనరల్‌ ఐర్‌కూట్‌ హైదర్‌అలీని ఓడించాడు. అప్పుడే పొల్లిలూరు యుద్ధం కూడా జరిగింది.
•తర్వాత ఒక విషపూరితమైన ముల్లు గుచ్చుకోవడంతో హైదర్‌ అలీ 1782 డిసెంబర్‌ 7నమరణించాడు.
•హైదర్‌ మరణానంతరం అతని కుమారుడు టిప్పుసుల్తాన్‌ 2వ ఆంగ్లో మైసూరు యుద్దాన్ని కొనసాగించాడు.
•1784 నాటికి ఎవ్వరునూ గెలిచే స్థితిలో లేకపోవుటచే మంగుళూరు ఒప్పందంతో 2వ ఆంగ్లో మైసూరు యుద్ధం అంతమైంది.

టిప్పుసుల్తాన్‌ :
👉🏻ఇతని బిరుదు - మైసూర్‌ పులి
👉🏻ఇతను మొట్టమొదటి జాతీయవాది
👉🏻ఇతని చిహ్నం - పులి
👉🏻ఇతను అనేక పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టాడు. రైతులు అధికంగా లబ్ధి పొందారు. కొత్త క్యాలెండర్‌, కొత్త నాణెములను ప్రవేశపెట్టాడు.
👉🏻మైసూరు ప్యాలెస్‌ దగ్గర శ్రీరంగనాథ దేవాలయమును నిర్మించాడు.
👉🏻శృంగేరి వద్ద శారదాదేవి ఆలయ నిర్మాణం కొరకు నిధులను ఇచ్చాడు.
👉🏻స్వేచ్చకు గుర్తింపుగా తన రాజధాని శ్రీరంగ పట్టణంలో ఒక వృక్షమును నాటాడు. దీనినే ట్రీ ఆఫ్‌ లిబర్టీ లేదా “స్వేచ్భా వృక్షం” అంటారు.
👉🏻బ్రిటీషు వారిని భారతదేశం అంతటి నుంచి తరిమివేయుట కొరకై రాయబారులను ఫ్రాన్స్‌, ఈజిప్టు (1వ అబ్దుల్ హమీద్‌), అరేబియా, ఆఫ్ఘనిస్థాన్‌(జమాన్‌ షా దురానీ)లకు పంపాడు.
👉🏻టిప్పుసుల్తాన్‌ ఫ్రెంచి యొక్క జాకోబిన్‌ క్లబ్ లో సభ్యుడు (రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసే సంస్థ)
👉🏻వర్తకాన్ని అభివృద్ధి చేయుటకు ఫ్రాన్స్‌, ఈజిప్టులకు రాయబారులను పంపాడు.

3వ ఆంగ్లో మైసూరు యుద్ధం(1790-92):
•బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ - కారన్‌ వాలీస్‌
•1790లో టిప్పుసుల్తాన్‌ ట్రావెన్‌కోర్‌పై దాడి చేశాడు. ట్రావెన్‌కోర్‌ యొక్క సార్వభౌమత్వమునకు బ్రిటీష్‌ రక్షణ కల్పిస్తుంది.
•దీని కారణంగా అప్పటి గవర్నర్‌ జనరల్‌ కారన్‌వాలీస్‌ మైసూరుపై యుద్ధం ప్రకటించాడు.
•జనరల్‌ మెడో మైసూరు పైకి పంపబడ్డాడు. జనరల్‌ మెడో టిప్పుసుల్తాన్‌ సైన్యమును అనేక చిన్న చిన్న యుద్ధాలలో ఓడించాడు.
•1792లో టిప్పుసుల్తాన్‌ తన పరాజయాన్ని అంగీకరించి శ్రీరంగపట్టణం అనే ఒప్పందంపై సంతకం చేశాడు.
•అంశాలు:
1) టిప్పు తన సగ రాజ్యాన్ని కోల్పోయాడు
2) 3.30 కోట్ల రూపాయలు బ్రిటీష్‌కు ఇచ్చుటకు టిప్పు అంగీకరించాడు.
3) తన ఇద్దరు కుమారులను బ్రిటీష్‌ ఆస్థానానికి బందీలుగా పంపుటకు అంగీకరించాడు.

4వ అంగ్ల మైసూరు యుద్ధం(1799):
•గవర్నర్‌ జనరల్‌ - వెల్లస్లీ
•ఫ్రెంచి సైన్యం మైసూరులోకి ప్రవేశించినది (మారిషస్‌ నుండి) అనే నెపంతో టిప్పుపై యుద్ధం ప్రకటించి వెల్లస్లీ జనరల్‌ స్టువర్ట్‌ను మైసూరు పైకి పంపాడు.
•1799లో శ్రీరంగపట్టణం యుద్ధంలో స్టువర్ట్‌ టిప్పుసుల్తాన్‌ను వధించాడు. దీంతో మైసూరు బ్రిటీష్‌ ఆధీనంలోకి వచ్చింది.
•టిప్పు ఖడ్గం బ్రిటీష్‌ దేశానికి తీసుకెళ్లబడినది.
•టిప్పు మరణం తర్వాత బ్రిటీషువారు వడయారు వంశానికి చెందిన 3వకృష్ణరాజ అనే 5 సం॥ల బాలుడిని మైసూరు సింహాసనంపై కూర్చోబెట్టారు.
•ఇతని ప్రధాన మంత్రి పూర్ణయ్య.
•అప్పటి మైసూర్‌ బ్రిటీష్‌ రెసిడెంట్‌ అధికారి బ్యారీ క్లోజ్‌.
•1832లో విలియం బెంటిక్‌ మైసూర్‌ను ఆక్రమించాడు.
•1882లో లార్ట్‌రిప్పన్‌ మైసూర్‌ను వడయార్‌ కుటుంబానికి తిరిగిఇచ్చాడు. అప్పటి మైసూర్‌ పాలకుడు చామరాజా.
•ఇతని తర్వాత కృష్ణరాజ-IV పాలకుడు అయ్యాడు. ఇతని ప్రధానమంత్రియే మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
•1947లో జయచామరాజ వడయార్‌ మైసూర్‌ను భారత్‌లో విలీనం చేశాడు.
•వడయార్‌ వంశంలో (బతికి ఉన్న చివరి వ్యక్తి నరసింహరాజ వడయార్‌ 2013లో మరణించాడు.
•ఇతని భార్య ప్రమోదాదేవి యుద్ధవీర్‌ కృష్ణ దత్త చామరాజ వడయార్‌ను దత్తకు తీసుకుని వడయార్‌ వారసునిగా ప్రకటించింది.

ఆంగ్లోమరాఠా యుద్దాలు

👉🏻మరాఠా రాజ్యాన్ని స్థావించినవాడు- శివాజీ (1627-80)
- శంభాజీ (1680-89) (కుమారుడు షాహూ)
- రాజారామ్‌ (1689-1700) (భార్య తారాబాయి)
- శివాజీ-8 (1700-08) (తల్లి తారాబాయి)
- షాహూ (1708-79) (తల్లి ఏసుబాయి)
- రామరాజ (1749-80)

👉🏻పీష్వాలు:
- బాలాజీ విశ్వనాథ్‌ (1713-20) (నానాసాహెబ్‌)
- బాజీరావు-1 (1720-40)
- బాలాజీ బాజీరావు (1740-61)
- మాధవరావు (1761-73)
- నారాయణరావు (1773-74)
- రఘోబా (రఘునాథరావు) 1774-75
- మాధవరావు-2 (1775-95)
- బాజీరావు-2 (1795-1818)

మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం(1775-82) :
•గవర్నర్‌ జనరల్‌ - వారెన్‌ హేస్టింగ్‌
•మాధవరావు మరణానంతరం నారాయణరావు పీష్వా అయ్యాడు
•రఘునాథరావు నారాయణరావును వ్యతిరేకించి అతనిని హత్య చేసి తనకు తాను పీష్వాగా ప్రకటించుకున్నాడు.
•నారాయణరావు మరణానంతరం కొన్ని నెలలకు అతనికి 2వ మాధవరావు అనే కొడుకు జన్మించాడు.
•మరాఠా మేధావులు అయిన నానా ఫాద్నిస్‌ (బాలాజీ జనార్ధన్‌), మహాధ్జి సింధియా మొదలగువారు 2వ మాధవరావును పీష్వాగా పేర్కొని రఘోబాపై యుద్ధం ప్రకటించారు.
•దీనికి భయపడిన రఘోబా బ్రిటీష్‌ బొంబే ప్రభుత్వ సహాయమును ఆర్జి స్తూ సూరత్‌ అనే ఒప్పందంపై సంతకం చేశాడు. కానీ ఈ ఒప్పందం గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్స్‌కు తెలియకుండా జరగడంతో అతను దీనిని తిరస్కరించి నానాఫాద్నిస్‌తో పురంధర్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. (దీని ప్రకారం బ్రిటీష్‌ రఘోబాకు సహాయం చేయదు) •బ్రిటీష్‌ బోంబే ప్రభుత్వం సూరత్‌, పురంధర్‌ ఒప్పందాలను లండన్‌కు పంపింది. బ్రిటన్‌ ప్రభుత్వం సూరత్‌ ఒప్పందాన్ని సమర్థించింది. దీంతో బ్రిటీషు బోంబే ప్రభుత్వ సైనికులు, రఘోబా సైనికులు నానా ఫాద్నిన్‌పై దాడులు ప్రారంభించారు. •కానీ నానాఫాద్నిస్‌ తెలగామ్‌ అనే యుద్ధంలో వీరిని ఓడించి బ్రిటీష్‌ చే వడగాం అనే ఒప్పందంపై సంతకం చేయించాడు.
•కానీ వారెన్‌ హేస్టింగ్స్‌ 'వడగాం' ఒప్పందమును తిరస్కరించి జనరల్‌ గుడార్డ్‌ను మరాఠాపైకి పంపాడు.
•1782 నాటికి ఎవ్వరునూ గెలిచే స్థితిలో లేకపోవుటచే “సాల్బాయ్‌” అనే ఒప్పందంతో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం అంతమైంది.
•మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధంలో జరిగిన ఒప్పందాలు
-సూరత్‌ ఒప్పందం - 1775
-పురంధర్‌ = 1776
-వడగాం - 1778
-సాల్బాయ్‌ - 1782 (ఈ ఒప్పందం ప్రకారం సాల్‌సెట్టి బ్రిటీష్‌ వారికి ఇవ్వబడింది. ఇది బొంబాయి దగ్గర ఉంది)
రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం(1802-05) :
•బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ - లార్డ్‌ వెల్లస్లీ
•ఒకటవ బాజిరావు కాలం నుంచి మరాఠాలు అనేక సర్ధారులుగా వీడిపోయారు.
1) పూణె. - పీష్వాలు
2) నాగ్‌పూర్‌ - బోంస్లేలు
3) గ్వాలియర్‌ - సింధియాలు
4) ఇండోర్‌ - హోల్కారులు
5) బరోడా - గైక్వాడ్‌లు
•1802లో ఇండోర్‌ పాలకుడు జస్వంత్‌రావు హోల్కార్‌ పూణే వద్ద 2వ బాజిరావును కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఓడించాడు.
•దీనికి ప్రతీకారం తీర్చుకొనుటకు పీష్వా 2వ బాజిరావు బ్రిటీష్‌ సహాయమును అర్జిస్తూ బస్సైన్‌ అనే ఒప్పందంపై సంతకం చేశాడు.
•దీంతో 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం ఆరంభమైంది.
•బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ వెల్లస్లీ ఇద్దరు జనరల్స్‌ను (ఆర్ధర్‌ వెల్లస్లీ, లేక్‌) మరాఠాపైకి పంపాడు.
•ఆర్ధర్‌ వెల్లస్లీ నాగ్‌పూర్‌పై దాడిచేసి బోంస్లేలను ఓడించి వారిచే 'డియోగం' అనే ఒప్పందంపై సంతకం చేయించాడు. ఈ ఒప్పందం ప్రకారం బోంస్లేలు కటక్‌, బాలాసోర్‌, వార్థా నది పశ్చిమాన ఉన్న భూభాగాన్ని బ్రిటీష్‌కు ఇచ్చారు.
•జనరల్‌ లేక్‌ గ్వాలియర్‌పై దాడిచేసి సింధియాలను ఓడించి వారిచే సుర్జీ అర్జనగామ్‌ అనే ఒప్పందంపై సంతకం చేయించాడు. ఈ ఒప్పందం ప్రకారం సింధియాలు జైపూర్‌, జోధ్‌పూర్‌, గోహాధ్‌ కోటలను, గంగా యమున నదుల మధ్య ఉన్న భూభాగాన్ని బ్రిటీష్‌కు ఇచ్చారు.
•తర్వాత జస్వంత్‌రావు హోల్కార్‌పై (ఇండోర్‌పై) బ్రిటీష్‌ వారు దాడులు చేశారు. కానీ జస్వంత్‌రావు హోల్కార్‌, భరత్‌పూర్‌ రాజు బ్రిటీషు వారి దాడులను తిప్పికొట్టారు.
•1805 నాటికి ఎవ్వరునూ గెలిచే స్థితిలో లేకపోవుటచే రాజ్‌ఘాట్‌ అనే ఒప్పందం ప్రకారం 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం అంతమైంది.
•2వ ఆంగ్లో మరాఠా యుద్ధంలో జరిగిన ఒప్పందాలు:
-బస్పైన్స్‌ ఒప్పందం - 1802
-డియోగాం - 1803
-సుర్జీ అర్జనగామ్‌ - 1803
-రాజ్‌ఘాట్‌ - 1805

3వ ఆంగ్లో మరాఠా యుద్ధం(1817-18):
•బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ - లార్డ్‌ హేస్టింగ్స్‌ (లేదా) మార్క్య్స్‌ హేస్టింగ్స్‌.
•పీష్వా 2వ బాజిరావు బస్సైన్‌ ఒప్పందం తర్వాత పూర్తిగా తన అధికారాలను కోల్పోయి బ్రిటీషు వారి యొక్క కీలుబొమ్మగా మారాడు.
•తాను పోగొట్టుకున్న ప్రతిష్టను తిరిగి పొందుటకు ప్రయత్నించి పూణేలోని బ్రిటీష్‌ రెసిడెంట్‌ కార్యాలయంపై దాడిచేసి అక్కడి నుంచి ఆంగ్లేయులను తరిమివేశాడు.
•దీంతో అప్పటి బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ హేస్టింగ్ యుద్ధం ప్రకటించి జనరల్‌ మాల్మోన్‌ను మరాఠాపై పంపాడు.
•జనరల్‌ మాల్కోన్‌ ఈ క్రింది యుద్ధాలలో మరాఠాలను ఓడించాడు.
1) కిర్కీ - పీష్వాలను 1817లో
2) సీతల్‌బల్ది - బోంస్లేలను 1817లో
3) మహదీపూర్‌-హోల్కార్‌లను _ 1817లో
4) కోరేగాం - పీష్వాలను 1817లో
•ఈ క్రింది ఒప్పందాలు జరిగాయి
1) పూణే ఒప్పందం - 1817
2) గ్వాలియర్‌ ఒప్పందం 1817
3) నాగ్‌పూర్‌ ఒప్పందం - 1817
4) మాండసోర్‌(హోల్కార్లతో) - 1818
•మాందడసోర్‌ ఒప్పందం తర్వాత మరాఠా రాజ్యం పూర్తిగా బ్రిటీష్‌ ఆధీనంలోకి వచ్చింది.
•మరాఠా ప్రతిష్టను కాపాడుటకై సతారా. అనే ఒక చిన్న రాజ్యం ఏర్పాటు చేయబడి. శివాజీ సంతతికి చెందిన ప్రతాప్‌సిన్హాకు అప్పగించబడింది.
•పీష్వా 2వ బాజిరావు కాన్పూర్‌ (యూపీ) దగ్గర భీతూర్‌కు పంపబడ్డాడు.


సింధ్‌ ఆక్రమణ (1843)

•గవర్నర్‌ జనరల్‌ -ఎలెన్‌బరో •సింధ్‌ను బెలుచిస్తాన్‌కు చెందిన తల్పూరా అనే తెగ పాలించింది.
•సింధ్‌ అనేక ప్రాంతాలుగా విభజించబడి ఉండేది. ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క గిరిజన నాయకుడు పాలించేవాడు. ఈ నాయకుడిని అమీర్‌ అనేవారు.
•1889లో సింధ్‌ అమీర్‌లు బ్రిటీష్‌ వారితో సైనిక సహకార ఒప్పందమును కుదుర్చుకున్నారు. దీని ప్రకారం సింధ్‌ సరిహద్దు ప్రాంతాలకు బ్రిటీష్‌ రక్షణ కల్పించింది.
•1843లో రష్యా భారతదేశంపై సింధ్‌ మీదుగా దాడిచేసే అవకాశం ఉందని భావించి సింధ్‌ను ఆక్రమించుటకు బ్రిటీష్‌ వారు నిర్ణయించారు.
•అప్పటి గవర్నర్‌ జనరల్‌ ఎలెన్‌ఐబరో సింధ్‌ ఆక్రమణ కొరకై చార్లెస్‌ నేపియర్‌ అనే జనరల్‌ను పంపాడు.
•1848లో అతి సునాయసముగా చార్లెస్‌ నేపియర్‌ సింధ్‌ అమీర్‌లను ఓడించి సింధ్‌ను ఆక్రమించాడు.
•నేపియర్‌ ఈ క్రింది సందేశాన్ని ఎలెన్‌బరోకు పంపాడు.
•"I have sin(ne)d"


అంగ్లో సిక్కు యుద్దాలు

సిక్కు మతాన్ని స్థాపించినది - గురునానక్‌
సిక్కు మతంలో మొత్తం 10 మంది సిక్కు గురువులు ఉన్నారు.

నానక్‌ (1469-1538):
•ఇతను పాకిస్థాన్‌ పంజా బ్‌లో తాల్వండి (ప్రస్తు త పేరు - -నన్‌కానా సాహెబ్) లో జన్మించాడు.
•ఇతని సంగీత వాయిద్యం - రబాబ్‌
•ఇతని ప్రధాన శిష్యుడు - మదన

అంగధ్‌ (1538-52):
•ఇతను గురుముఖి లిపిని వ్యాప్తి చేశాడు. (పంజాబీ భాష)
•మొగల్‌ చక్రవర్తి హుమాయూన్‌ ఇతనిని సందర్శించాడు.

అమర్‌దాస్‌ (1552-74):
•ఇతను మొదట్లో విష్ణు భక్తుడు
•సరీసహగమనమును, పరదా విధానమును, మత్తు పానీయాలు సేవించడాన్ని ఖండించాడు.
రామ్‌దాస్‌ (1574-81):
•ఇతను రామ్‌దాస్‌పురా(అమృత్‌సర్‌)ను నిర్మించాడు
•అమృత్‌సర్‌లో స్వర్ణ దేవాలయ నిర్మాణానికి అక్బర్‌ భూమిని రామ్‌దాసుకు ఇచ్చాడు.

అర్జున్‌దేవ్‌ (1581-1606):
•ఇతను స్వర్ణ దేవాలయమును నిర్మించాడు.
•సిక్కుల పవిత్ర గ్రంథము అయిన ఆదిగ్రంథ్‌ లేదా గురుగ్రంథ్‌ సాహెబ్‌ను రచించాడు.
•ప్రతి సిక్కు తన సంపాదనలో 1/10వ వంతు సిక్కు గురువులకు ఇవ్వాలని పేర్కొన్నాడు. దీనినే మన్సద్‌ అంటారు.
•ఇతను జహంగీర్‌చే చంపబడ్డాడు.

హరిగోవింద్(1606-44):
•ఇతను తనకు తానూ సచ్చబాదుషా (నిజమైన చక్రవర్తి) అని ప్రకటించుకున్నాడు.
•ఇతని కాలం నుండే సిక్కులు మొగలులకు వ్యతిరేకంగా ఆయుధాలను చేపట్టారు.
•ప్రతీ సిక్కుతన సంపాదనలో కొంత భాగంతో గుర్రాలను, ఆయుధాలను కొనుగోలు చేసి సిక్కుగురువుకు ఇవ్వాలని పేర్కొన్నాడు.
•ఇతను ప్రధాన కేంద్రాన్ని అమృత్‌సర్‌ నుండి కిరాత్‌పూర్‌కు మార్చాడు.

హర్‌రాయ్‌ (1644-61):
•ఇతను బెరంగజేబు ఆస్థానాన్ని సందర్శించాడు.

హరికిషన్‌ (1661-64):
•ఇతను అతి చిన్న వయస్సులో(5 సం॥లు) సిక్కు గురువు అయ్యాడు.
మశూచీ వ్యాధితో బెరంగజేబు ఆస్థానంలోనే మరణించాడు.

తేజ్‌ బహదూర్‌ (1664-75):
•ఇతను బెరంగజేబుచే చంపబడ్డాడు.

గురుగోవింద్‌ (1675-1708):
•తన ప్రధాన కేంద్రాన్ని ఆనందపూర్‌ వద్ద ఏర్పాటు చేశాడు.
•ఇతను 1699లో ఖల్సాను (ఆనంద్‌సాహెబ్‌ వధ్ద) ఏర్పాటు చేశాడు. ఇది మొగలులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం ఏర్పాటు చేయబడిన సైనిక దళం. ఖల్సాలో చేరినవారు తప్పనిసరిగా 5K లను పాటించాలి.
K -కిర్పన్‌ - ఖడ్గం
K -కేశ్ ‌ - జుట్టు
K -కంగీ - దువ్వెన
K -కర - కడియంv K -కచ్చ.. - అంతర తొడుగు
•గురుగోబింద్‌ ఔరంగ జేబుకు రాసిన చివరి ఉత్తరాన్ని జాఫర్‌ అంటారు.
•ఇతని గుర్రం పేరు- దిల్‌బాగ్‌ (ఆఖానీలా ఘోడా)
•ఇతను ఆదిగ్రంథ్‌ను 11వ సిక్కు గురువుగా పేర్కొని, దానికి గురుగ్రంథ్‌ సాహెబ్‌ అని పేరు పెట్టాడు.
•1708లో మహారాష్ట్రలో గోదావరి నది ఒడ్డున నాందేడ్‌ వద్ద సర్‌హింద్‌ మొఘల్‌ అధికారి వజీర్‌ఖాన్‌ ఆదేశాల మేరకు జంషెడ్‌ఖాన్‌ మరియు వాసిల్‌బేగ్‌ గురుగోవింద్‌ను హత్య చేశారు.
•ఇతని మరణానంతరం ఇతని శిష్యుడు బందా బహదూర్‌ లేదా (లచ్చమన్‌దాస్‌) సిక్కులకు నేతృత్వం వహించాడు.

బందా బహదూర్‌ :
•ఇతన్ని గురు భక్ష్‌సింగ్‌ అని కూడా అంటారు.
•ఇతను తనకు తాను సచ్చాబాదుషాగా ప్రకటించుకున్నాడు.
•సిక్కుమతాన్ని పాటించేవారిని సింగ్‌(సింహ్‌)గా పిలవాలని పేర్కొన్నాడు.
•ఫత్‌దరాస్‌ (విజయం కలుగుగాక) అనే పలకరింపును ప్రవేశపెట్టాడు.
•1716 లో మొగలు చక్రవర్తి ఫారుఖ్‌ సియార్‌ కాలంలో చంపబద్దాడు. (ఫారుక్‌ సియర్‌ జనరల్‌ అబ్దుస్ సమద్‌ఖాన్‌ ఇతన్ని చంపాడు)
•ఇతని మరణానంతరం సిక్కులు 12 తెగలు లేదా శాఖలు(మీజిల్స్‌)గా విడిపోయారు.
•ఉదా: సుఖర్‌చాకియా, బంగి, నఖాయి, దాలేవాలియ, ఆహ్లువాలియా, నిషాన్‌వాలా, నిహాంగ్‌, షహీద్‌ మొదలగునవి
•ఈ తెగలలో అతి ముఖ్యమైనది సుఖర్‌చాకియా.
•దీనిని స్థాపించినది- చరత్‌సింగ్‌.
•సుఖర్‌చాకియాలో అతి ముఖ్యమైనవాడు మహరాజా రంజిత్‌సింగ్‌

మహఠాజా రంజిత్‌సింగ్‌ :
•బిరుదులు :
- మహరాజ
-సిక్కు రాజ్య నిర్మాత
- One Eyed Giant
•ఇతని అతిముఖ్యమైన మంత్రులు - 1) దివాన్‌ దీనానాథ్‌ 2) అజీజుద్దీన్‌
•ఇతను కోహినూర్‌ వజ్రాన్ని ఆఫ్ఘన్‌ పాలకుడు “షాషుజా” నుంచి సేకరించాడు.
•ఇతను అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయానికి బంగారుపూతను వేయించాడు.
•లాహోర్‌లో ఆధునిక ఆయుధ కార్మాగారాన్ని నిర్మించాడు.
•1799 - రంజిత్‌సింగ్‌ లాహోర్‌ను ఆక్రమించి తన రాజకీయ రాజధానిగా ప్రకటించాడు.
•1802 - అమృత్‌సర్‌ని ఆక్రమించి తన మత రాజధానిగా ప్రకటించాడు.
•1809 - బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ 1వ మింటోతో అమృత్‌సర్‌ ఒప్పందమును కుదుర్చుకున్నాడు. (ఈ ఒప్పందం ప్రకారం సట్లెజ్ నది బ్రిటీష్‌ మరియు పంజాబ్‌ మధ్య సరిహద్దుగా మారింది)
•1831 - బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ విలియం బెంటింగ్‌తో సింధూనావికా ఒప్పందంను కుదర్చుకున్నాడు. (దీని ప్రకారం ఆంగ్లేయులు వర్తకం కోసం సింధూనదిని ఉపయోగించుకోవచ్చు)
•1838 - త్రైపాక్షిక ఒవృందం (రంజిత్‌సింగ్‌, బ్రిటీష్‌, ఆఫ్ఘన్‌ పాలకుడు షాషుజా). ఈ ఒప్పందం ప్రకారం రంజిత్‌
•సింగ్‌ ఆఫ్ఘనిస్థాన్‌లో షాషుజాకు వ్యతిరేకంగా ఉన్న తిరుగుబాట్లను అణిచివేశాడు.
•1839- రంజిత్‌సింగ్‌ మరణించాడు. ఇతని మరణానంతరం ఖరక్‌, షేర్‌ మొదలగు బలహీన పాలకులు పంజాబును పాలించారు.
•1843- రంజిత్‌సింగ్‌ చిన్న కుమారుడు దిలీప్‌సింగ్‌ పంజాబ్‌ పాలకుడు అయ్యాడు. ఇతని సంరక్షకురాలు రాణి జిందాన్‌(తల్లి).

ఆంగ్లో సిక్కు యుద్ధం (1815-46):
•గవర్నర్‌ జనరల్‌ - 1వ హార్టింజ్‌
•1844 లో బలహీనమైన పంజాబ్‌ను ఆక్రమించుటకు బ్రిటీష్‌ నిర్ణయించిరి. సట్లెజ్‌ నది దాటి పంజాబ్‌పై దాడి చేశారు. దీంతో మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం ప్రారంభమైంది.
•మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధంలో మొత్తం 5 యుద్దాలు జరిగాయి. (ఈ యుద్దాలలో పాల్గొన్న బ్రిటీష్‌ జనరల్‌- గాఫ్‌)
1) ముడ్కి యుద్ధం
2) ఫిరోజా యుద్ధం
3) బుద్దేవాల్‌ యుద్ధం
4) ఆలీవాల్‌ యుద్ధం
5) సోబ్రాన్‌ యుద్ధం (తుపాకుల యుద్ధం)
•సోబ్రాన్‌ యుద్ధంలో కొన్ని వందల మంది సిక్కులు వధించబడ్డారు. ఈ యుద్ధం తర్వాత సిక్కులు తమ పరాజయాన్ని అంగీకరించారు.
•1846లో లాహోర్‌ ఒప్పందంతో మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం అంతమైంది. ఈ ఒప్పందంలోని అంశాలు :
1) కోహినూర్‌ వజ్రం బ్రిటీష్‌ వారికి ఇవ్వబడింది.
2) 1.5 కోట్లు బ్రిటీషు వారికి ఇచ్చుటకు పంజాబ్‌ అంగీకరించింది.
3) కాశ్మీర్‌ బ్రిటీష్‌కు ఇవ్వబడింది. (బ్రిటీష్‌ వారు తర్వాత కాలంలో కాళ్మీర్‌ను 50 లక్షల రూపాయలకు గులాబ్‌సింగ్‌కు అమ్మివేశారు)
4) సట్లేజ్‌ నది రావి నది మధ్య ఉన్న భూభాగం బ్రిటీష్‌కు ఇవ్వబడింది.
•లాహోర్‌ ఒప్పందానికి కొన్ని మార్పులు చేస్తూ భైరోవల్ అనే ఒప్పందం చేయబడినది.
•ఈ ఒప్పందం ప్రకారం పంజాబ్ ను పాలించుటకు 8 మంది సభ్యులతో ఒక కౌన్సిల్ అఫ్ రీజెన్సీ ఏర్పాటుచేయబడింది. దీనికి మొదటి అధ్యక్షుడు హెన్రీ లారెన్స్.

2వ ఆంగ్లో సిక్కు యుద్ధం (1848-49):
•గవర్నర్‌ జనరల్‌ - డల్హౌసీ
•1848లో లాహోర్‌లో చిత్తూర్‌సింగ్‌, ముల్తాన్‌లో మూల్‌రాజ్‌ బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దీంతో అవ్పటి గవర్నర్‌ జనరల్‌ డల్హౌసీ ఈ తిరుగుబాటులను అణిచివేయుటకు పంజాబ్‌పై యుద్ధం ప్రకటించి శ్యాన్‌ ఆండ్రూస్‌ అనే జనరల్‌ను పంజాబ్‌పైకి పంపాడు.
•శాన్‌ ఆండ్రూస్‌ లాహోర్‌, ముల్తాన్‌లలో తిరుగుబాట్లను అణిచివేసి సిక్కు మధద్దతుదారులను రామ్‌నగర్‌, చిలియన్‌వాలా, గుజరాత్‌ యుద్ధాలలో ఓడించాడు ఈ యుద్ధాల తర్వాత పంజాబ్‌ పూర్తిగా బ్రిటీష్‌ ఆధీనంలోకి వచ్చింది.

అవధ్‌ ఆక్రమణ (1856) :
•గవర్నర్‌ జనరల్‌ - డల్హౌసీ
•అవధ్ రాజ్యాన్ని స్తాపించినవాడు - సాదత్ అలీ
•చివరి పాలకుడు - వాజిద్‌ అలీషా
•1856లో వాజిద్‌ అలీషా తప్పుడు పాలన (Maladministration) చేస్తున్నాడనే నెపంతో బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ గవర్నర్‌ జనరల్‌ డల్హౌసీ అవధ్‌ను ఆక్రమించాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad