యూరోపియన్ల రాక - GNANA SAMHITHA

Breaking

Post Top Ad

Thursday, March 20, 2025

యూరోపియన్ల రాక

👉🏻యూరోపియన్లు వ్రధానంగా రెండు వన్తువుల కొరకు(సుగంధ ద్రవ్యాలు, సిల్క్)‌ భారతదేశంతో వర్తకం చేశారు.
👉🏻ఈ వర్తకం కొరకు 3 మార్గాలను ఉపయోగించేవారు. అవి
1) యూరప్‌-కాన్‌స్టాంట్‌నోపుల్‌ (టర్కీలోని ఇస్తాంబుల్‌) -మధ్య ఆసియా-భారత్‌
2) యూరప్‌-మద్యధరా సముద్రం - పశ్చిమ ఆసియా - మధ్య ఆసియా - భారత్‌
3) యూరప్‌-మద్యధరా సముద్రం-ఆఫ్రికా-ఎర్ర సముద్రం- పశ్చిమ ఆసియా - మధ్య ఆసియా - భారత్‌
👉🏻పై 3 మార్గాలలో మొదటి మార్గము అతి ముఖ్యమైనది.
👉🏻1453లో టర్కీ రాజు రెండవ మహమ్మద్‌ కాన్‌స్టాంట్‌ నోపుల్‌ను ఆక్రమించి ఈ మార్గం గుండా యూరోపియన్లు భారతదేశంతో లేదా తూర్పు దేశాలతో వర్తకం చేయకూడదని ఆంక్షలు విధించాడు.
👉🏻దీనితో భారతదేశంతో నేరుగా ఒక సముద్ర మార్గమును కనుగొనుటకు యూరోపియన్లు నిర్ణయించారు.
👉🏻యూరప్‌లో సముద్రయానము నౌకాయానమును ప్రోత్సహిం చిన మొట్టమొదటి వ్యక్తి -హెన్రీ (స్పెయిన్‌-పోర్చుగల్‌ రాజు)
👉🏻హెన్రీ జీబ్రాల్టర్‌ జలసంధిని దాటి ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో చేరుకొని తిరిగి సురక్షితముగా స్పెయిన్‌కు చేరుకున్నాడు. నావికుల శిక్షణ కొరకు అనేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశాడు. అందువల్లనే ఇతనికి 'హెన్రీ ద నేవిగేటర్‌' అనే బిరుదు ఇవ్వబడింది.
👉🏻బార్తిలోమియు డయాజ్‌(1485) భారతదేశంతో ఒక సముద్ర మార్గమును కనుగొనుటకు బయలుదేరి ఆఫ్రికా దక్షిణ ప్రాంతమునకు చేరుకున్నాడు. కానీ అక్కడి వాతావరణం సరిగా లేకపోవుటచే తన ప్రయాణాన్ని కొనసాగించలేకపోయాడు. తిరిగి యూరప్‌కు పయనిస్తూ ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి తుపానుల అగాధం (Cape of Storm) అని పేరు పెట్టాడు.
👉🏻తుఫానుల అగాధం భారతదేశంతో ఒక సముద్ర మార్గమును కనుగొనడంలో ప్రోత్సాహకరంగా ఉండాలని భావించి రెండవ 'జాన్‌ దీనికి కేప్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌' అని పేరు పెట్టాడు.
👉🏻కొలంబస్‌ భారతదేశానికి సముద్ర మార్గమును కనుగొనుటకు బయలుదేరి అట్లాంటిక్‌ మహాసముద్రంలో తన దిశ మారి కరేబియన్‌ డీవులకు చేరుకున్నాడు. ఈ దీవులకు వెస్టిండీస్‌ అని పేరు పెట్టాడు.
👉🏻పోర్చుగల్‌ రాజు ఇమ్మన్యువల్-2 భారతదేశంతో నముద్ర మార్గం కనుగొనుటకై వాస్కోడగామను ప్రోత్సహించాడు. 👉🏻వాస్కోడగామా భారతదేశంతో సముద్ర మార్గమును కనుగొనుటకు పోర్చుగల్‌ రాజధాని లిస్బన్‌ నుండి బయలుదేరి కేప్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌కు చేరుకున్నాడు. కేప్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌ వద్ద వాస్కోడిగామా అబ్దుల్ నాజిబ్‌ /మజీద్‌ అనే వర్తకుడిని కలిసి అతని సహాయంతో 1498 మే 17న కాలికట్‌ (ప్రస్తుతం కోజికోడ్‌) చేరుకున్నాడు.
👉🏻ఇతను కాలికట్‌ చేరినపుడు ఇతనితోపాటు మూడు నౌకలు ఉన్నాయి.
1. Sao Gabriel-వాస్కోడగామ
2. Sao Rafael-పౌలోడగామ
3. Caravel Berrio-నికోలవ్‌ కోయిల్హో
👉🏻కాలికట్‌ రాజు జామోరిన్‌ వాస్కోడగామాకు స్వాగతం పలికి అతనికి కావలసిన వస్తువులను కొనిపించి తిరిగి యూరప్‌కు పంపాడు.
👉🏻యూరవ్‌లో ఈ వన్తువులను అమ్మిన తర్వాత వాస్కోడగామాకు తన పెట్టుబడిపై 60 రెట్లు లాభం వచ్చింది. దీని తర్వాత పోర్చుగీసు వారు ఒక శతాబ్ధి కాలంపాటు భారతదేశ వర్తకాన్ని శాసించారు.
👉🏻రెండవసారి వాస్కోడగామా 1502 అక్టోబర్‌ 30న భారతదేశానికి వచ్చాడు. 1524 డిసెంబర్‌ 24న మలేరియాతో కొచ్చిలో మరణించాడు. వాస్కోడగామ తర్వాత కాబ్రల్‌ భారతదేశానికి వచ్చాడు. కాబ్రల్‌ బ్రైజిల్‌ను కనుగొన్నాడు.


పోర్చుగీసు

👉🏻ప్రధాన కేంద్రము -గోవా
👉🏻పోర్చుగీసు యొక్కమొట్టమొదటి గవర్నర్‌ - ఫ్రాన్సిస్‌ -డీ-అల్మీడా. ఇతను నీలినీటి విధానం(Blue Water Policy) ప్రవేశపెట్టాడు.
👉🏻ఈ విధానం ప్రకారం పోర్చుగీసు వారు భారతదేశం యొక్క అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా అరేబియా సముద్ర వర్తకంపై ఆధిపత్యం సాధించుటకు ప్రయత్నించారు.
👉🏻పోర్చుగీసు గవర్నర్‌ అల్బూక్వెర్క్‌ నీలినీటి విధానాన్ని రద్దు చేశాడు. ఇతను 1510లో గోవాను బీజాపూర్‌ నుండి ఆక్రమించాడు. (ఈ ఆక్రమణలో అల్బూక్వెర్క్‌కు సహకరించిన భారతీయ రాజు -శ్రీకృష్ణదేవరాయలు) ఇతను భారతీయ మహిళను వివాహమాడమని ప్రోత్సహించాడు.
👉🏻పోర్చుగీసు గవర్నర్‌ నీనా-డ-కున్హా 1530లో పోర్చుగీసు ప్రధాన కేంద్రాన్ని కొచ్చి నుండి గోవాకు మార్చాడు.
👉🏻కున్హా 1534లో గుజరాత్‌ నుండి బస్సైన్‌ను ఆక్రమించాడు. గుజరాత్‌ పాలకుడు బహదూర్‌షా మరియు కున్హాకు మధ్య డయ్యూ ఆధీనమునకు సంబంధించి వివాదం ఏర్పడింది.
👉🏻దీని కారణంగా కున్హా బహదూర్‌షాను అరేబియా సముద్రంలో ముంచి చంపాడు.
👉🏻మార్టిన్‌ ఆల్‌ఫాన్సో డిసౌజతో కలిసి ఫాదర్‌ జేవియర్‌ భారతదేశానికి వచ్చాడు.
👉🏻1661లో పోర్చుగీసు యువరాణి కాథరిన్‌ బ్రిగాంజ మరియు బ్రిటీష్‌ యువరాజు 2వ చార్లెస్‌ మధ్య వివాహం జరిగింది. ఈ సందర్భంగా పోర్చుగీసు వారు సెయింట్‌ డేవిడ్‌ లేదా బోంబేను 2వ చార్లెస్‌కు కట్నంగా ఇచ్చారు.


బ్రిటీష్‌

👉🏻ప్రధాన కేంద్రము - కలకత్తా (ఫోర్ట్‌ విలియమ్స్‌)
👉🏻బ్రిటీష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీని 1599లో మర్చంట్‌ అడ్వెంచర్స్‌ గ్రూప్‌ అనే సంస్థ స్థాపించింది.
👉🏻కానీ బ్రిటీష్‌ రాణి 1వ ఎలిజబెత్‌ ఈ కంపెనీకి తన అంగీకారమును 1600 డిసెంబర్‌ 31న తెలియజేసింది.
👉🏻1600- బ్రిటీష్‌ నౌక హెక్టార్‌ సూరత్‌ చేరుకుంది.
👉🏻1608- హాకిన్స్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ రాయబారిగా జహంగీర్‌ ఆస్థానాన్ని సందర్శించి సూరత్‌లో ఒక స్థావరమును నిర్మించుట కొరకై అనుమతిని పొందాడు.
👉🏻1615- బ్రిటీష్‌ రాజు 1వ జేమ్స్‌ తన రాయబారిగా సర్‌ థామస్‌రోను జహంగీర్‌ ఆస్టానానికి పంపాడు. భారతదేశంలో మొఘల్‌ సామ్రాజ్యంలో ఎక్కడైనా సరే వర్తకం కొరకు స్థావరాన్ని ఏర్పాటు చేసుకొనేందుకు జహంగీర్‌ నుంచి అనుమతిని పొందాడు.
👉🏻1689- చంద్రగిరి పాలకుడు 3వ వెంకటపతిరాయలు మదరాసు పట్టణాన్ని బ్రిటీష్‌ అధికారి అయిన ఫ్రాన్సిస్‌దేకు ఇచ్చాడు. (దీనిలో మధ్యవర్తిత్వం చేసింది దామెర్ల సోదరులు వెంకటాద్రి అయ్యప్ప. వీరి తండ్రి పేరు చెన్నప్ప). మదరాసులో నిర్మించిన కోటను సెయింట్‌ జార్జి అంటారు.
👉🏻1657- BEIC జాయింట్‌ స్టాక్‌ కంపెనీగా మారింది (చార్జర్‌ ఆఫ్‌ క్రామ్‌వెల్‌ ప్రకారం)
👉🏻1668- బ్రిటీష్‌ రాజు 2వ చార్లెస్‌ సెయింట్‌ డేవిడ్‌ లేదా బోంబేను శాశ్వత లీజుకు బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీకి ఇచ్చివేశాడు.
👉🏻1698- కాలీకత, సుతనాటి, గోవిందాపూర్‌ గ్రామాలు బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీకి ఇవ్వబడ్డాయి. ఈ మూడు గ్రామాలను కలిపి కలకత్తా అంటారు. ఇక్కడ నిర్మించిన కోటను ఫోర్ట్‌ విలియమ్స్‌ అంటారు.
👉🏻1717-మొగలు చక్రవర్తి ఫారూఖ్‌ సియార్‌ బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీకి బంగారు ఫర్మాన్‌ లేదా ఫ్రీ దస్తక్‌లను ఇచ్చాడు.ఫోర్ట్‌ విలియమ్స్‌ అధ్యక్షుడు జాన్‌సుర్మాన్‌, వైద్యుడు విలియం హామిల్టన్‌, బ్రిటీష్‌ అధికారి స్టీఫెన్‌సన్‌ 1715లో ఫారూఖ్‌ సియార్‌ ఆస్టానాన్ని సందర్శించారు. అపుడు ఫారూఖ్‌ సియార్‌ ఒక రాచపుండుతో బాధపడుతుందే వాడు. వైద్యుడు హమిల్టన్‌‌ ఫారూఖ్‌ సియార్‌ యొక్కరాచపుండును నయంచేశాడు. దీంతో సంతోషపడ్డ ఫారూఖ్‌ 1717లో బ్రిటీష్‌కు బంగారు ఫర్మాన్‌ను ఇచ్చాడు.
👉🏻దీని ప్రకారం బ్రిటీష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ సంవత్సరానికి రూ.3 వేలు చెల్లించి బెంగాల్‌, గుజరాత్‌, దక్కన్‌(హైదరాబాద్‌)లలో ఎటువంటి సుంకములు చెల్లించకుండా యథేచ్చగా వర్తకం చేసుకోవచ్చు. దీన్ని 'Magna Carta of the Company' అంటారు.
బ్రిటీష్‌ స్థావరాలు:
👉🏻సూరత్‌ - 1608
👉🏻మచిలీపట్నం - 1611 (దక్షిణ భారతదేశంలో బ్రిటీష్‌ వారి యొక్క మొట్టమొదటి స్థావరం & తూర్పు తీరంలో బ్రిటీష్‌ యొక్క మొదటి స్థావరం)
👉🏻సూరత్‌ - 1613 (బ్రిటీష్‌ కెప్టెన్‌ బెస్ట్‌ పోర్చుగీసు వారిని స్వాహివి యుద్ధంలో ఓడించాడు. దీంతో జహంగీర్‌ సూరత్‌ వద్ద శాశ్వత స్థావర నిర్మాణానికి బ్రిటీష్‌కు అనుమతి ఇచ్చాడు.
👉🏻పులికాట్‌ - 1621
👉🏻బాలాసోర్‌ - 1633(తూర్పు భారతదేశంలో బ్రిటీష్‌ వారి మొట్టమొదటి స్థావరం)
👉🏻మద్రాసు - 1639-1640
👉🏻హుగ్లీ - 1651
👉🏻సుతనాటి. - 1691 (దీనిని జాబ్‌చార్నోక్‌ నిర్మిం చాడు. దీనిచుట్టూ నిర్మించబడిన కోటనే ఫోర్ట్‌ విలియమ్స్‌ అంటారు)


డచ్ (నెదర్లాండ్స్‌ / హాలెండ్‌)

👉🏻ప్రధాన కేంద్రం -సేరంపూర్‌ (1676) (పశ్చిమ ప్రధాన కేంద్రం - నాగపట్టణం మొదట్లో 1690 వరకు డచ్‌ ప్రధాన కేంద్రం పులికాట్‌)
👉🏻1602లో-డచ్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ స్థాపించబడింది.దీని అసలు పేరు VOC (Verinidge Ostinditche Companie)
స్థావరాలు :
•మచిలీపట్నం - 1605
•పులికాట్‌ - 1610
•సూరత్ - 1616
•ఇరైకల్‌ - 1645 (తమిళనాడులో)
•చిన్సూరా - 1653 (బెంగాల్‌)
•కోచి - 1653
•నాగాపట్నం - 1658
•1623లో డచ్‌ అంబోయానా (ఇండోనేషియాలో ఉంది) యుద్ధంలో బ్రిటీష్‌ వారిని ఓడించింది.
•1655లో డచ్‌వారు పోర్చుగీసు నుండి శ్రీలంకను ఆక్రమించారు.
•1782లో బ్రిటీష్‌ వారు శ్రీలంకను డచ్‌ నుండి పొందారు.
•1759లో-చిన్సూరా లేదా బేదరా యుద్ధంలో బ్రిటీష్‌ గవర్నర్‌ రాబర్ట్‌ క్లైవ్‌ డచ్‌ వారిని ఓడించాడు. ఈ యుద్ధం తర్వాత డచ్‌ వారు భారతదేశం వదిలి ఇండోనేషియాకు వెళ్లిపోయారు. తర్వాత ఇండోనేషియాను ఆక్రమించుకొని 1949 వరకు పాలించారు.


డేనిష్‌ వారు /డేన్స్‌ (డెన్మార్క్‌)

👉🏻డేన్స్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ 1616లో స్థాపించబడింది.
👉🏻ప్రధానకేంద్రం - సేరంపూర్ (1676) (పశ్చిమబెంగాల్ )
👉🏻డేన్స్‌ యొక్క ఇతర స్థావరము -(1620) ట్రాంకోబార్‌ (తమిళనాడు)
👉🏻డేన్స్‌ భారతదేశంలో ఉంటూ ప్రధానంగా చైనాతో వర్తకం చేసేవారు. భారతదేశంలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలలో పాల్గొనేవారు.
👉🏻1845లో బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ 1వ హార్టింజ్‌ డేన్స్‌ స్థావరాలైన సేరంపూర్‌, ట్రాంకోబార్‌ లను 120 లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు. దీంతో డేన్స్‌వారు భారతదేశం వదిలి వెళ్లిపోయారు.


ఫ్రెంచి వారు

👉🏻ప్రధాన కేంద్రం - పాండిచ్చేరి
👉🏻ఫ్రెంచి ఈస్ట్‌ ఇండియా కంపెనీని 1664లో ఫ్రెంచి రాజు 14వ లూయీ కాలంలో అతని ప్రధానమంత్రి కోల్‌బర్ట్‌ స్థాపించాడు. దీని అసలు పేరు 'Compaignile Des Indies Orientales'
👉🏻మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు నుండి 'నవాబ్‌ అనే బిరుదుపొందిన మొదటి యూరోపియన్‌ -డ్యూమాస్‌ (ఫ్రెంచ్‌)
👉🏻1668 - ఫ్రెంచివారు మొట్టమొదటి స్థావరం సూరత్‌ వద్ద ఫ్రాన్సిస్‌ కారన్‌ నిర్మించాడు.
👉🏻1669 - ఫ్రెంచివారి 2వ స్థావరం మచిలీపట్నం వద్ద మకారా నిర్మించాడు.
👉🏻1673 - ఆర్కాట్‌ పాలకుడు షేర్‌ఖాన్‌లోడి వాలికొండపురమును ఫ్రెంచి అధికారులైన బెల్లాంజిర్‌-డీ-లెస్పినే, ఫ్రాంకోయిస్‌ మార్టీన్ ‌లకు ఇచ్చాడు.
👉🏻ఫ్రెంచి మొట్టమొదటి గవర్నర్‌ అయిన ఫ్రాంకోయిస్‌ మార్చిన్‌ వాలికొండపురమును పాండిచ్చేరిగా అభివృద్ధి చేశాడు.
👉🏻పాండిచ్చేరిని మొదటగా పోర్చుగీస్‌వారు 16వశతాబ్ధంలో ఆక్రమించి స్థావరాన్ని నిర్మించారు. కానీ స్థానిక జింజీ పాలకులచే తరిమివేయబడ్డారు. తర్వాత డచ్‌, డేన్స్‌వారు కూడా స్థావరాలు నిర్మించారు. వీరు కూడా అక్కడి నుండి బహిష్కరించబడ్డారు. చివరకు ఫ్రెంచి ‌వారు పాండిచ్చేరిలో శాశ్వత స్థావరాన్ని నిర్మించుకోగలిగారు.
👉🏻1690 - చంద్రనాగోర్‌ను షైస్తాఖాన్‌ నుండి పొందారు.
👉🏻1721 - ఫ్రెంచి మారిషస్‌ను ఆక్రమించినది.
👉🏻1725 - ఫ్రెంచి యానాం, మాహె, కాలికట్‌ ప్రాంతాలను పొందినది.
👉🏻1739 - కరైకల్‌ను ఫ్రెంచి కంపెనీ పొందినది.
👉🏻1760 - 'వందవాసి' యుద్ధంలో(కర్ణాటకలో) బ్రిటీష్ జనరల్‌ ఐర్‌కూట్‌ ఫ్రెంచి జనరల్‌ కౌంట్‌-డి-లాలీను ఓడించారు. ఈ యుద్ధంతో ఫ్రెంచి భారతదేశంలో మూర్తిగా తన ఆధిపత్యమును కోల్పోయినది. పాండిచ్చేరికి పరిమితమైంది.
👉🏻పాండిచ్చేరి అనగా 4 ప్రాంతాలు. అవి
1. పాండిచ్చేరి (తమిళనాడు)
2. కరైకల్‌ (తమిళనాడు)
3. యానం (ఆంధ్రప్రదేశ్‌)
4. మాహే (కేరళ)

No comments:

Post a Comment

Post Bottom Ad