1950 లో రాజ్యాంగం అమలు నాటికి మనదేశంలోని భూభాగాల్ని 4 విభాగాలుగా ఏర్పాటు చేశారు.
1.పార్ట్ - A రాష్ట్రాలు :: బ్రిటిష్ పాలిత ప్రాంతాలుగా ఉన్న వాటిని ఈ విభాగంలో చేర్చారు.వీటి సంఖ్య -- '9'.
2. పార్ట్ - B రాష్ట్రాలు :: ప్రత్యేకమైన శాసనసభలను కలిగివున్న స్వదేశీ సంస్థానల్నీ ఈ భాగంలో చేర్చారు.వీటీ సంఖ్య-- '10'.
3. పార్ట్ - C రాష్ట్రాలు :: స్వదేశీ సంస్థానాలు కొన్ని మరియు గతంలో చీఫ్ కమిషనరేటు ప్రాంతాలుగా ఉన్నవాటిని ఈ విభాగంలో చేర్చారు.వీటి సంఖ్య -- '9'.
4. పార్ట్ - D రాష్ట్రాలు :: అండమాన్ నికోబార్ దీవులు ఈ భాగంలో చేర్చారు..
•భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ భాషాప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పాటు జరగాలని 20 వ శతాబ్ధం మొదటి నుండీ ఒక ప్రధానమైన డిమాండు కలదు.
•రాబర్ట్ రిస్లే యొక్క నివేదికననుసరించి 1905 లో లార్డ్ కర్జన్ బెంగాల్‌ను రెండుగా విభజించాడు.
•బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం బెంగాలీ భాష మాట్లాడేవారందరీకి ఒకే రాష్ట్రం ఉండాలని డిమాంద్ చేసినది.
•1911 లో లార్డ్ హర్జింగ్ బెంగాల్ విభజనను రద్దు చేశాడు. ఈ అంశం మనదేశంలో 'ఒకే భాష ఒకే రాష్ట్రం' ప్రతిపాదనకు దారితీసింది.
•1913 లో బాపట్లలో జరిగిన ఆంధ్రమహసభ సమావేశం ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు డిమాండ్ చేసింది.
•1921 లో మహత్మగాంధీ భారతజాతీయ కాంగ్రెస్ కమిటీలను భాషాప్రాతిపదికపై ఏర్పాటు చేయాలని సూచించాడు.
•1927 లో కాంగ్రెస్ సమావేశం భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమర్ధిస్తూ తీర్మానించింది.
•1928 లో నెహ్రూ నివేదిక కూడా భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించింది.
•1931లో గాంధీజీ లండన్‌లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి హజరు సందర్భంగా ప్రత్యేకాంధ్రరాష్ట్ర ఏర్పాటును ఒక డిమాండ్‌గా ప్రస్తావించాలని డా భోగరాజు పట్టాభి సీతారామయ్య ప్రతిపాదించారు.
•1942 లో ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు సర్.విజయ్ క్రిప్స్‌మిషన్‌ను కలిసి ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేశాడు.
•1945 లో భారత జాతీయ కాంగ్రెస్ (లేజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్) సంధర్బంగా తన ఎన్నికల మేనిఫెస్టోలో భాషారాష్ట్రాల ఏర్పాటుకు హామీ ఇచ్చింది.
•1948 లో నెహ్రూ విశాఖపట్నం సందర్శించినప్పుడు ప్రత్యేకాంధ్ర ఏర్పాటు తమ పరిశీలనలో ఉందని పేర్కోన్నారు...
S.K థార్ కమిషన్ -1948
👉🏻రాజ్యాంగ పరిషత్ ఛైర్మన్ రాజేంద్రప్రసాద్ కమిటీని ప్రకటించారు.
👉🏻భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై పరిశీలనకు రాజ్యాంగ పరిషత్తు 1948లో ఉత్తరప్రదేశ్ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఎస్.కె.థార్ నాయకత్వంలో ఇద్దరు సభ్యులతో (పన్నాలాల్, జగత్ నారాయణ్‌లాల్) ఒక కమిషన్‌ను నియమించింది. ఈ క మిషన్ కేవలం భాషా ప్రాతిపదిక పైన రాష్ట్రాలు ఏర్పాటు చేయడాన్ని తిరస్కరించింది. పరిపాలనా సౌలభ్య ప్రాతిపదికపైనే రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది.
👉🏻థార్ కమిషన్ నివేదిక పట్ల ఆంధ్రలో తీవ్రనిరసనలు వ్యక్తమైనవి.
జె.వి.పి. కమిటీ
థార్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనను విరమింపజేయడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 1948 డిసెంబర్‌లో జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్‌భాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య సభ్యులుగా ఒక కమిటీని నియమించింది.
ఈ కమిటీ కూడా దేశం మొత్తం మీద రాష్ట్రాల పునర్‌నిర్మాణాన్ని వాయిదా వేయాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం దానికి మినహాయింపుగా భావించాలని నివేదించింది.
👉🏻35 రోజుల తర్వాత ఆచార్య వినోభా భావే అతడి నిరాహారదీక్షను విరమింపజేశారు.
👉🏻1952 అక్టోబర్ 19 నుంచి మద్రాసులో బులుసు సాంబమూర్తి ఇంట్లో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు.
👉🏻దీక్ష 50వ రోజుకు చేరుకున్న సందర్భంగా మద్రాసును సందర్శించిన జవహర్‌లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇచ్చారు.
👉🏻కానీ పొట్టి శ్రీరాములు తన దీక్షను కొనసాగించారు. 58వ రోజున డిసెంబర్ 15న ఆయన అమరుడయ్యారు.
👉🏻పొట్టి శ్రీరాములు మృతితో హింసాత్మక సంఘటనలు చెలరేగాయి.
👉🏻దీంతో 1952 డిసెంబర్ 19న పార్లమెంటులో నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటును ప్రకటించారు.
👉🏻కైలాసనాథ్ వాంచూ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ ప్రత్యేకాంధ్ర విధివిధానాలను సూచించినది.
👉🏻S.N మిశ్రా కమిటీ సూచననుసరించి బళ్లారిని మైసూర్‌లో విలీనం చేశారు.
👉🏻11 జిల్లాలతో కూడిన ప్రత్యేకాంధ్ర ఏర్పాటును 1953, అక్టోంబర్ 1 న ప్రకటించారు..
👉🏻1937 లో జరిగిన 'శ్రీ బాగ్ ఒప్పందం' ను అనుసరించి రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయించారు.
👉🏻ఆంధ్రా, రాయలసీమ నాయకుల మధ్య జరిగిన ఒప్పందంపై 6 గురు సంతకాలు చేశారు.
👉🏻ఈ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధానినీ, ఆంధ్రాలో హైకోర్టును ఏర్పరచాలని నిర్ణయించారు.
👉🏻టంగుటూరు ప్రకాశం సూచన ప్రకారం కర్నూలులో రాజధానినీ, గుంటూరులో హైకోర్టుల ఏర్పాటూ జరిగింది.
👉🏻ఆంధ్రరాష్ట్ర మొదటి గవర్నర్ - సి.యం త్రివేది.
👉🏻ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి - టంగుటూరి ప్రకాశం పంతులు.
👉🏻ఆంధ్రరాష్ట్ర మొదటి ఉపముఖ్యమంత్రి - నీలం సంజీవరెడ్డి.
👉🏻ఆంధ్రరాష్ట్ర చివరి ముఖ్యమంత్రి - బెజవాడ గోపాల్ రెడ్డి.
👉🏻1954 లో గుంటూరులో ఏర్పాటు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్ కోకా సుబ్బారావు.
👉🏻1952 చివర్లో నెహ్రూ ప్రభుత్వం దేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణపై ఒక ప్రెత్యేక కమీషన్‌ను ఏర్పాటు చేసింది.
👉🏻కె.ఎం.ఫణిక్కర్, హెచ్.ఎం.కుంజ్రు(పండిట్ హృదయనాథ్ ఖుంజ్రూ) సభ్యులుగా ఉన్న ఈ కమిషన్‌కు ఫజల్ అలీ నేతృత్వం వహించారు.
👉🏻1955 సెప్టెంబర్‌లో ఈ కమిషన్ నివేదిక సమర్పించింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును ఫజల్ అలీ కమిషన్ సమర్థించింది. కానీ ఒక భాష-ఒక రాష్ర్టం అనే డిమాండ్‌ను తిరస్కరించింది.
👉🏻ఫజల్ అలీ కమిషన్ ప్రతిపాదనలు..
👉🏻దేశంలో గల ప్రాంతీయ విభాగాలు (30) ను రెండు విభాగాలుగా పునర్వ్యవస్థీకరించాలి. 1) రాష్ట్రాలు 2) కేంద్రపాలిత ప్రాంతాలు.
👉🏻మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలేర్పరచాలి.
👉🏻రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణలో దేశ ఐక్యతను, రక్షణను బలోపేతం చేసేలా చర్యలు ఉండాలి.
👉🏻భాష, సాంస్కృతికపరమైన సజాతీయత ఉండాలి.
👉🏻ఆర్థిక, పరిపాలనాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
👉🏻జాతీయాభివృద్ధితోపాటు రాష్ట్రాల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
👉🏻దీనికి అనుగుణంగా 1956లో పార్లమెంట్ రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం, ఏడో రాజ్యాంగ సవరణ చేసింది.
👉🏻ఈ సవరణ ద్వారా పార్‌ట-ఎ, పార్‌ట-బి, పార్‌ట-సి అనే వ్యత్యాసాలను రద్దు చేసి రాష్ట్రాలను పునర్‌వ్యవస్థీకరించింది. ఫలితంగా 14 రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాలతో నూతన వ్యవస్థ అమల్లోకి వచ్చింది.
👉🏻రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ద్వారా 1956 నాటికి గల రాష్ట్రాలు :
1. అస్సాం
2. బెంగాల్
3. బీహర్
4. ఒరిస్సా
5. ఆంధ్రప్రదేశ్
6. మద్రాస్
7. కేరళ
8. మైసూర్
9. బొంబాయి
10. మధ్యప్రదేశ్
11. ఉత్తరప్రదేశ్
12. రాజస్థాన్
13. పంజాబ్
14. జమ్మూ&కాశ్మీర్
👉🏻కేంద్రపాలిత ప్రాంతాలు
1. ఢిల్లీ
2. హిమాచల్ ప్రదేశ్
3. అమెనీ,మినికాయ్ దీవులు
4. అండమాన్ నికోబార్ దీవులు
5. త్రిపుర
6. మణిపూర్
👉🏻నైజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాకిస్తాన్‌లో విలీనం చేస్తామనీ లేదా స్వతంత్ర దేశంగా ఏర్పడతామనీ ప్రకటించాడు.
👉🏻ఆర్య మహాసభ, కాంగ్రెస్‌ల నేతృత్వంలో హైద్రాబాద్‌ను భారతదేశంలో విలీనం చెయ్యాలని కోరుతూ ఒక ఉద్యమం నిర్వహించారు.
👉🏻1948 లో కమ్యూనిస్టుల నేతృత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది.
👉🏻ఇండియన్ యూనియన్ సైన్యాలు ఆపరేషన్ పోలో పేరుతో హైద్రాబాద్ పై సైనిక చర్య జరిపించారు.
👉🏻1948 సెప్టెంబర్ 17 న హైద్రాబాద్‌కు విముక్తి లభించింది.
👉🏻మీర్ ఉస్మాన్ అలీఖాన్ వీలీన పత్రంపై సంతంకాలు చేశాడు
👉🏻యూనియన్ సైన్యాలకు నేతృత్వం వహించిన మేజర్ చౌదరిని 1948 డిసెంబర్ వరకు హైద్రాబాద్‌కు పాలకుడిగా వ్యవహరించారు.
👉🏻హైద్రాబాద్ మనదేశంలో విలీనం చెందినప్పటినుండి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు హైద్రాబాద్‌కు రాష్ట్రానికి ఉస్మాన్ అలీఖాన్ రాజ్ ప్రముఖ్ గా వ్యవహరించారు.
👉🏻1949 నుండి 1952 లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగే వరకు హైద్రాబాద్‌కు పాలకుడిగా వ్యవహరించినది ప్రముఖ ICS(సివిల్ సర్వీస్) M.K. వెల్లోడీ
👉🏻1952 లో మొదటి సాధారణ ఎన్నికల తదనంతరం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి -- బూర్గుల రామకృష్ణరావు.
👉🏻1948 లో అయ్యదేవర కాళేశ్వరరావు నేతృత్వంలో విశాలాంధ్ర సంస్థ స్థాపించారు.
👉🏻తెలుగు భాష మాట్లాడేవారందర్నీ కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనేది విశాలాంధ్ర ప్రధాన నినాదం.
👉🏻నాటికి తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ముఖ్యమైన పార్టీలు-కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీల్లోని మెజార్టీ వర్గం ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటును సమర్థించారు.
👉🏻ఫజల్ అలీ కమీషన్ సమైక్య రాష్ట్ర ఏర్పాటు విషయంలో హైద్రాబాద్ శాసనసభ అభిప్రాయానికి వదిలేశారు.
👉🏻1961 వరకు ప్రత్యేక రాష్ట్రాలుగా కొనసాగి తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఫజల్ అలీ సూచించారు.
👉🏻1956 లో ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటు విషయమై హైద్రాబాద్ శాసనసభ తీర్మానంలో 103 సభ్యులు అనుకూలంగానూ, 29 మంది వ్యతిరేకంగానూ మరియు 15 మంది తటస్థంగానూ వ్యవహరించారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ - పెద్ద మనుషుల ఒప్పందం
•1948లో అయ్యదేవర కాళేశ్వరరావు విశాలాంధ్ర సంస్థను స్థాపించారు.
•తెలుగు మాట్లాడే వారందరినీ కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనేది విశాలాంధ్ర ప్రధాన నినాదం.
•ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు విషయంలో నిర్ణయాన్ని హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ అభిప్రాయానికి వదిలిపెట్టారు.
•హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో విశాలాంధ్ర ఏర్పాటు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, 103 మంది సభ్యులు అనుకూలంగా ఓటేశారు.
•1956 ఫిబ్రవరి 20న తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన 8 మంది నాయకుల మధ్య ఢిల్లీలో ఒక ఒప్పందం కుదిరింది.
•దీన్నే ‘పెద్ద మనుషుల ఒప్పందం’ అంటారు. ఈ ఒప్పందంపై
1. బూర్గుల రామకృష్ణారావు,
2. కె.వి.రంగారెడ్డి,
3. జె.వి.నరసింగరావు,
4. మర్రి చెన్నారెడ్డి,
5. బెజవాడ గోపాలరెడ్డి,
6. అల్లూరి సత్యనారాయణ,
7. నీలం సంజీవరెడ్డి,
8. సర్దార్ గౌతు లచ్చన్న సంతకాలు చేశారు.
ముఖ్యాంశాలు •ఆంధ్రాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినపుడు,తెలంగాణా ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఉపముఖ్యమంత్రి పదవీనీ, తెలంగాణకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినపుడు ఆంధ్రాకు చెందిన వ్యక్తి ఉపముఖ్యమంత్రి పదవిని చెపట్టాలి.
•హైద్రాబాద్ ప్రాంతంలో వచ్చే ఆదాయాన్ని ఈ ప్రాంత అభివృద్ధికే ఖర్చుచేయాలి.
•ప్రత్యేక తెలంగాణ ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేయాలి.
•వృత్తి విద్యాపరమైన కోర్సులలో 20% సీట్లను ఈ ప్రాంతానికి రిజర్వు చేయాలి.
•ఉద్యోగాలలో ప్రాంతీయంగా రిజర్వేషన్లు కల్పించాలి.
•రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకొని ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని పునర్‌వ్యవస్థీకరించారు.
•ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణతో కలిపి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరించింది
•ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి - నీలం సంజీవరెడ్డి .
•ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ - సి.యం. త్రివేది .
•ఆంధ్రప్రదేశ్ మొదటి హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి - జస్తిస్ కోకా సుబ్బారావు.
బొంబాయి రాష్ట్రాన్ని విడగొట్టి గుజరాత్‌ను 15వ రాష్ర్టంగా ఏర్పాటు చేశారు. బొంబాయి రాష్ర్టం పేరును మహారాష్ట్రాగా మార్చారు.
2) నాగాలాండ్ (1 డిసెంబర్, 1963)
అస్సాం రాష్ట్రాన్ని పునర్ వ్యవస్థీకరించి నాగా కొండ ప్రాంతాలు, ట్యూన్‌సాంగ్ ప్రాంతాలతో నాగాలాండ్‌ను ఏర్పాటు చేశారు. ఇది 16వ రాష్ట్రంగా ఏర్పాటైంది.
3) హర్యానా(1 నవంబర్, 1966)
పంజాబ్‌ను పునర్‌వ్యవస్థీకరించి హిందీ మాట్లాడే ప్రాంతాన్ని హర్యానా రాష్ర్టంగా ఏర్పాటు చేశారు. షా కమిషన్ సూచన మేరకు చండీగఢ్‌ను పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చేశారు. దీంతోపాటు చండీగఢ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించారు.
హిమాచల్ ప్రదేశ్ (25 జనవరి, 1971)
పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలతో కలిపి కేంద్రపాలిత ప్రాంతమైన హిమాచల్‌కు రాష్ర్ట హోదా కల్పించారు. ఇది 18వ రాష్ట్రం.
5) మణిపూర్ (21 జనవరి, 1972)
ఈశాన్య రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం ద్వారా మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన మణిపూర్‌ను 19వ రాష్ట్రంగా మార్చారు.
6) త్రిపుర (21 జనవరి, 1972)
కేంద్రపాలిత ప్రాంతమైన త్రిపురను 20వ రాష్ట్రంగా మార్చారు.
7) మేఘాలయ (21 జనవరి, 1972)
అస్సాంలో ఉపరాష్ట్రంగా ఉన్న మేఘాలయను పూర్తి రాష్ర్టంగా మార్చారు. 1969లో మేఘాలయకు ఉపరాష్ట్ర హోదా కల్పించారు.
8) సిక్కిం (16 మే, 1975)
36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింకు సంపూర్ణ రాష్ట్ర ప్రతిపత్తి కల్పించారు. సిక్కిం రాష్ట్రానికి ప్రత్యేక చరిత్ర ఉంది. 1947 వరకు సిక్కిం ఛోగ్యాల్ రాజవంశ పాలనలో ఉండేది. 1974లో 35వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింకు అసోసియేట్ రాష్ట్ర పతిపత్తి కల్పించారు. 10వ షెడ్యూల్‌లో నూతన ప్రకరణ 2ఎను చేర్చారు. 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను సంపూర్ణ రాష్ట్రంగా గుర్తించారు. ఈ విధంగా సిక్కిం 22వ రాష్ట్రాంగా ఏర్పాటైంది. 1974లో చేసిన 35వ రాజ్యాంగ సవరణను రద్దుచేశారు. ప్రకరణ 2ఎను, 10వ షెడ్యూల్‌లోని ప్రత్యేకతను తొలగించారు. ప్రకరణ 371ఎఫ్ ద్వారా సిక్కిం రాష్ట్రానికి ప్రత్యేక రక్షణ కల్పించారు.
9) మిజోరాం (20 ఫిబ్రవరి, 1987)
కేంద్రపాలిత ప్రాంతమైన మిజోరాంకు 53వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర హోదా కల్పించారు. ఇది 23వ రాష్ట్రాంగా ఏర్పాటైంది.
10) అరుణాచల్ ప్రదేశ్ (20 ఫిబ్రవరి, 1987)
55వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్‌కు సంపూర్ణ రాష్ట్ర హోదాను కల్పించారు. అరుణాచల్ ప్రదేశ్‌ను నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ (ఎన్‌ఈఎఫ్‌ఏ) అని పిలిచేవారు.
11) గోవా (30 మే, 1987)
56వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతమైన గోవాకు సంపూర్ణ రాష్ట్ర ప్రతిపత్తి కల్పించారు. 1961లో పోర్చుగీసువారు గోవాను భారతదేశానికి అప్పగించారు. గోవా, డయ్యూ, డామన్‌లను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. ఇందు కోసం 1962లో 12వ రాజ్యాంగ సవరణ చేశారు.
12) ఛత్తీస్‌గఢ్(1 నవంబర్, 2000)
మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్‌వ్యవస్థీకరించి ఛత్తీస్‌గఢ్‌ను 26వ రాష్ట్రాంగా ఏర్పాటు చేశారు.
13) ఉత్తరాఖండ్ (9 నవంబర్, 2000)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. ఉత్తరాఖండ్ 27వ రాష్ట్రాంగా ఏర్పాటైంది.
14) జార్ఖండ్ (15 నవంబర్, 2000)
బిహార్ రాష్ట్రాన్ని పునర్‌వ్యవస్థీకరించి 28వ రాష్ట్రాంగా జార్ఖండ్‌ను ఏర్పాటు చేశారు.
15) తెలంగాణ (2 జూన్, 2014)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్‌వ్యవస్థీకరించి 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రాన్ని 29వ రాష్ట్రాంగా ఏర్పాటు చేశారు.
31 అక్టోబర్ 2019 జమ్మూ&కాశ్మీర్, లఢక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు
1954 వరకు ఈ ప్రాంతం పోర్చుగీసు వారి ఆధీనంలో ఉండేది. 1961లో పదో రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు.
2) డామన్ - డయ్యూ
భారత ప్రభుత్వం 1961లో సైనిక చర్య ద్వారా ఈ ప్రాంతాలను పోర్చుగీసు వారి నుంచి స్వాధీనం చేసుకుంది. 12వ రాజ్యాంగ సవరణ ద్వారా 1962లో కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. 1987లో గోవా ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా కొనసాగించారు.
3) పాండిచ్చేరి
ఇది పుదుచ్చేరి, కరైకల్, మహే, యానాం అనే నాలుగు ప్రాంతాల కలయిక. 1964లో ఫ్రెంచివారు ఈ ప్రాంతాలను భారత్‌కు అప్పగించారు. 1962లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాంతాలకు కేంద్రపాలిత ప్రాంత హోదా కల్పించారు.
4) చంఢీగఢ్
1966లో పంజాబ్ పునర్‌వ్యవస్థీకరణ ద్వారా హర్యానా, పంజాబ్‌లకు ఉమ్మడి రాజధాని అయిన చండీగఢ్‌కు కేంద్రపాలిత ప్రాంత హోదా కల్పించారు.
5) జమ్మూ&కాశ్మీర్
6) లఢక్
2) 1956 ట్రావెన్‌కోర్ కొచ్చిన్ --->కేరళ
3) 1959 మధ్యభారత్--->మధ్యప్రదేశ్
4) 1960 బొంబాయి--->మహారాష్ర్ట
5) 1968 మద్రాసు--->తమిళనాడు
6) 1973 మైసూరు--->కర్ణాటక
7) 1973 లక్కదీవి, మినికాయ్ అమిన్ దీవి--->లక్షదీవులు
8) 2006 ఉత్తరాంచల్--->ఉత్తరాఖండ్
9) 2006 >పాండిచ్చేరి--->పుదుచ్చేరి
10) 2007 అస్సాం--->అసోం
11) 2011 ఒరిస్సా--->ఒడిశా
12) 2011పశ్చిమ బెంగాల్--->పశ్చిమ బంగ
భారత దేశం లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు కొనసాగుతున్న ప్రాంతాలు :-
1.పార్ట్ - A రాష్ట్రాలు :: బ్రిటిష్ పాలిత ప్రాంతాలుగా ఉన్న వాటిని ఈ విభాగంలో చేర్చారు.వీటి సంఖ్య -- '9'.
2. పార్ట్ - B రాష్ట్రాలు :: ప్రత్యేకమైన శాసనసభలను కలిగివున్న స్వదేశీ సంస్థానల్నీ ఈ భాగంలో చేర్చారు.వీటీ సంఖ్య-- '10'.
3. పార్ట్ - C రాష్ట్రాలు :: స్వదేశీ సంస్థానాలు కొన్ని మరియు గతంలో చీఫ్ కమిషనరేటు ప్రాంతాలుగా ఉన్నవాటిని ఈ విభాగంలో చేర్చారు.వీటి సంఖ్య -- '9'.
4. పార్ట్ - D రాష్ట్రాలు :: అండమాన్ నికోబార్ దీవులు ఈ భాగంలో చేర్చారు..
•భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ భాషాప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పాటు జరగాలని 20 వ శతాబ్ధం మొదటి నుండీ ఒక ప్రధానమైన డిమాండు కలదు.
•రాబర్ట్ రిస్లే యొక్క నివేదికననుసరించి 1905 లో లార్డ్ కర్జన్ బెంగాల్‌ను రెండుగా విభజించాడు.
•బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం బెంగాలీ భాష మాట్లాడేవారందరీకి ఒకే రాష్ట్రం ఉండాలని డిమాంద్ చేసినది.
•1911 లో లార్డ్ హర్జింగ్ బెంగాల్ విభజనను రద్దు చేశాడు. ఈ అంశం మనదేశంలో 'ఒకే భాష ఒకే రాష్ట్రం' ప్రతిపాదనకు దారితీసింది.
•1913 లో బాపట్లలో జరిగిన ఆంధ్రమహసభ సమావేశం ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు డిమాండ్ చేసింది.
•1921 లో మహత్మగాంధీ భారతజాతీయ కాంగ్రెస్ కమిటీలను భాషాప్రాతిపదికపై ఏర్పాటు చేయాలని సూచించాడు.
•1927 లో కాంగ్రెస్ సమావేశం భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమర్ధిస్తూ తీర్మానించింది.
•1928 లో నెహ్రూ నివేదిక కూడా భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించింది.
•1931లో గాంధీజీ లండన్‌లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి హజరు సందర్భంగా ప్రత్యేకాంధ్రరాష్ట్ర ఏర్పాటును ఒక డిమాండ్‌గా ప్రస్తావించాలని డా భోగరాజు పట్టాభి సీతారామయ్య ప్రతిపాదించారు.
•1942 లో ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు సర్.విజయ్ క్రిప్స్‌మిషన్‌ను కలిసి ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేశాడు.
•1945 లో భారత జాతీయ కాంగ్రెస్ (లేజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్) సంధర్బంగా తన ఎన్నికల మేనిఫెస్టోలో భాషారాష్ట్రాల ఏర్పాటుకు హామీ ఇచ్చింది.
•1948 లో నెహ్రూ విశాఖపట్నం సందర్శించినప్పుడు ప్రత్యేకాంధ్ర ఏర్పాటు తమ పరిశీలనలో ఉందని పేర్కోన్నారు...
S.K థార్ కమిషన్ -1948
👉🏻రాజ్యాంగ పరిషత్ ఛైర్మన్ రాజేంద్రప్రసాద్ కమిటీని ప్రకటించారు.
👉🏻భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై పరిశీలనకు రాజ్యాంగ పరిషత్తు 1948లో ఉత్తరప్రదేశ్ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఎస్.కె.థార్ నాయకత్వంలో ఇద్దరు సభ్యులతో (పన్నాలాల్, జగత్ నారాయణ్‌లాల్) ఒక కమిషన్‌ను నియమించింది. ఈ క మిషన్ కేవలం భాషా ప్రాతిపదిక పైన రాష్ట్రాలు ఏర్పాటు చేయడాన్ని తిరస్కరించింది. పరిపాలనా సౌలభ్య ప్రాతిపదికపైనే రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది.
👉🏻థార్ కమిషన్ నివేదిక పట్ల ఆంధ్రలో తీవ్రనిరసనలు వ్యక్తమైనవి.
జె.వి.పి. కమిటీ
థార్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనను విరమింపజేయడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 1948 డిసెంబర్‌లో జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్‌భాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య సభ్యులుగా ఒక కమిటీని నియమించింది.
ఈ కమిటీ కూడా దేశం మొత్తం మీద రాష్ట్రాల పునర్‌నిర్మాణాన్ని వాయిదా వేయాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం దానికి మినహాయింపుగా భావించాలని నివేదించింది.
ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు
👉🏻1952 ఆగస్టు 15 నుంచి 35 రోజుల పాటు గొల్లపూడి సీతారామయ్య శాస్త్రి ప్రత్యేక ఆంధ్రరాష్ర్ట ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.👉🏻35 రోజుల తర్వాత ఆచార్య వినోభా భావే అతడి నిరాహారదీక్షను విరమింపజేశారు.
👉🏻1952 అక్టోబర్ 19 నుంచి మద్రాసులో బులుసు సాంబమూర్తి ఇంట్లో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు.
👉🏻దీక్ష 50వ రోజుకు చేరుకున్న సందర్భంగా మద్రాసును సందర్శించిన జవహర్‌లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇచ్చారు.
👉🏻కానీ పొట్టి శ్రీరాములు తన దీక్షను కొనసాగించారు. 58వ రోజున డిసెంబర్ 15న ఆయన అమరుడయ్యారు.
👉🏻పొట్టి శ్రీరాములు మృతితో హింసాత్మక సంఘటనలు చెలరేగాయి.
👉🏻దీంతో 1952 డిసెంబర్ 19న పార్లమెంటులో నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటును ప్రకటించారు.
👉🏻కైలాసనాథ్ వాంచూ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ ప్రత్యేకాంధ్ర విధివిధానాలను సూచించినది.
👉🏻S.N మిశ్రా కమిటీ సూచననుసరించి బళ్లారిని మైసూర్‌లో విలీనం చేశారు.
👉🏻11 జిల్లాలతో కూడిన ప్రత్యేకాంధ్ర ఏర్పాటును 1953, అక్టోంబర్ 1 న ప్రకటించారు..
👉🏻1937 లో జరిగిన 'శ్రీ బాగ్ ఒప్పందం' ను అనుసరించి రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయించారు.
👉🏻ఆంధ్రా, రాయలసీమ నాయకుల మధ్య జరిగిన ఒప్పందంపై 6 గురు సంతకాలు చేశారు.
👉🏻ఈ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధానినీ, ఆంధ్రాలో హైకోర్టును ఏర్పరచాలని నిర్ణయించారు.
👉🏻టంగుటూరు ప్రకాశం సూచన ప్రకారం కర్నూలులో రాజధానినీ, గుంటూరులో హైకోర్టుల ఏర్పాటూ జరిగింది.
👉🏻ఆంధ్రరాష్ట్ర మొదటి గవర్నర్ - సి.యం త్రివేది.
👉🏻ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి - టంగుటూరి ప్రకాశం పంతులు.
👉🏻ఆంధ్రరాష్ట్ర మొదటి ఉపముఖ్యమంత్రి - నీలం సంజీవరెడ్డి.
👉🏻ఆంధ్రరాష్ట్ర చివరి ముఖ్యమంత్రి - బెజవాడ గోపాల్ రెడ్డి.
👉🏻1954 లో గుంటూరులో ఏర్పాటు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్ కోకా సుబ్బారావు.
👉🏻1952 చివర్లో నెహ్రూ ప్రభుత్వం దేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణపై ఒక ప్రెత్యేక కమీషన్‌ను ఏర్పాటు చేసింది.
పునర్‌వ్యవస్థీకరణ - ఫజల్ అలీ కమిషన్
👉🏻భాషాప్రయుక్త ప్రాతిపదికన ఆంధ్రరాష్ర్టం ఏర్పడింది. దీంతో దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ భాషా ప్రాతిపదికపై రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలంగా ప్రస్తావనకు వచ్చింది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్‌ను 1952 లో నియమించింది.👉🏻కె.ఎం.ఫణిక్కర్, హెచ్.ఎం.కుంజ్రు(పండిట్ హృదయనాథ్ ఖుంజ్రూ) సభ్యులుగా ఉన్న ఈ కమిషన్‌కు ఫజల్ అలీ నేతృత్వం వహించారు.
👉🏻1955 సెప్టెంబర్‌లో ఈ కమిషన్ నివేదిక సమర్పించింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును ఫజల్ అలీ కమిషన్ సమర్థించింది. కానీ ఒక భాష-ఒక రాష్ర్టం అనే డిమాండ్‌ను తిరస్కరించింది.
👉🏻ఫజల్ అలీ కమిషన్ ప్రతిపాదనలు..
👉🏻దేశంలో గల ప్రాంతీయ విభాగాలు (30) ను రెండు విభాగాలుగా పునర్వ్యవస్థీకరించాలి. 1) రాష్ట్రాలు 2) కేంద్రపాలిత ప్రాంతాలు.
👉🏻మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలేర్పరచాలి.
👉🏻రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణలో దేశ ఐక్యతను, రక్షణను బలోపేతం చేసేలా చర్యలు ఉండాలి.
👉🏻భాష, సాంస్కృతికపరమైన సజాతీయత ఉండాలి.
👉🏻ఆర్థిక, పరిపాలనాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
👉🏻జాతీయాభివృద్ధితోపాటు రాష్ట్రాల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
👉🏻దీనికి అనుగుణంగా 1956లో పార్లమెంట్ రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం, ఏడో రాజ్యాంగ సవరణ చేసింది.
👉🏻ఈ సవరణ ద్వారా పార్‌ట-ఎ, పార్‌ట-బి, పార్‌ట-సి అనే వ్యత్యాసాలను రద్దు చేసి రాష్ట్రాలను పునర్‌వ్యవస్థీకరించింది. ఫలితంగా 14 రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాలతో నూతన వ్యవస్థ అమల్లోకి వచ్చింది.
👉🏻రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ద్వారా 1956 నాటికి గల రాష్ట్రాలు :
1. అస్సాం
2. బెంగాల్
3. బీహర్
4. ఒరిస్సా
5. ఆంధ్రప్రదేశ్
6. మద్రాస్
7. కేరళ
8. మైసూర్
9. బొంబాయి
10. మధ్యప్రదేశ్
11. ఉత్తరప్రదేశ్
12. రాజస్థాన్
13. పంజాబ్
14. జమ్మూ&కాశ్మీర్
👉🏻కేంద్రపాలిత ప్రాంతాలు
1. ఢిల్లీ
2. హిమాచల్ ప్రదేశ్
3. అమెనీ,మినికాయ్ దీవులు
4. అండమాన్ నికోబార్ దీవులు
5. త్రిపుర
6. మణిపూర్
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు
👉🏻1947 లో స్వాతంత్య్రం సందర్భంగా హైద్రాబాద్ సంస్థానాన్ని నైజాం నవాబు మనదేశంలో వీలీనం చేయలేదు.👉🏻నైజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాకిస్తాన్‌లో విలీనం చేస్తామనీ లేదా స్వతంత్ర దేశంగా ఏర్పడతామనీ ప్రకటించాడు.
👉🏻ఆర్య మహాసభ, కాంగ్రెస్‌ల నేతృత్వంలో హైద్రాబాద్‌ను భారతదేశంలో విలీనం చెయ్యాలని కోరుతూ ఒక ఉద్యమం నిర్వహించారు.
👉🏻1948 లో కమ్యూనిస్టుల నేతృత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది.
👉🏻ఇండియన్ యూనియన్ సైన్యాలు ఆపరేషన్ పోలో పేరుతో హైద్రాబాద్ పై సైనిక చర్య జరిపించారు.
👉🏻1948 సెప్టెంబర్ 17 న హైద్రాబాద్‌కు విముక్తి లభించింది.
👉🏻మీర్ ఉస్మాన్ అలీఖాన్ వీలీన పత్రంపై సంతంకాలు చేశాడు
👉🏻యూనియన్ సైన్యాలకు నేతృత్వం వహించిన మేజర్ చౌదరిని 1948 డిసెంబర్ వరకు హైద్రాబాద్‌కు పాలకుడిగా వ్యవహరించారు.
👉🏻హైద్రాబాద్ మనదేశంలో విలీనం చెందినప్పటినుండి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు హైద్రాబాద్‌కు రాష్ట్రానికి ఉస్మాన్ అలీఖాన్ రాజ్ ప్రముఖ్ గా వ్యవహరించారు.
👉🏻1949 నుండి 1952 లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగే వరకు హైద్రాబాద్‌కు పాలకుడిగా వ్యవహరించినది ప్రముఖ ICS(సివిల్ సర్వీస్) M.K. వెల్లోడీ
👉🏻1952 లో మొదటి సాధారణ ఎన్నికల తదనంతరం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి -- బూర్గుల రామకృష్ణరావు.
👉🏻1948 లో అయ్యదేవర కాళేశ్వరరావు నేతృత్వంలో విశాలాంధ్ర సంస్థ స్థాపించారు.
👉🏻తెలుగు భాష మాట్లాడేవారందర్నీ కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనేది విశాలాంధ్ర ప్రధాన నినాదం.
👉🏻నాటికి తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ముఖ్యమైన పార్టీలు-కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీల్లోని మెజార్టీ వర్గం ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటును సమర్థించారు.
👉🏻ఫజల్ అలీ కమీషన్ సమైక్య రాష్ట్ర ఏర్పాటు విషయంలో హైద్రాబాద్ శాసనసభ అభిప్రాయానికి వదిలేశారు.
👉🏻1961 వరకు ప్రత్యేక రాష్ట్రాలుగా కొనసాగి తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఫజల్ అలీ సూచించారు.
👉🏻1956 లో ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటు విషయమై హైద్రాబాద్ శాసనసభ తీర్మానంలో 103 సభ్యులు అనుకూలంగానూ, 29 మంది వ్యతిరేకంగానూ మరియు 15 మంది తటస్థంగానూ వ్యవహరించారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ - పెద్ద మనుషుల ఒప్పందం
•1948లో అయ్యదేవర కాళేశ్వరరావు విశాలాంధ్ర సంస్థను స్థాపించారు.
•తెలుగు మాట్లాడే వారందరినీ కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనేది విశాలాంధ్ర ప్రధాన నినాదం.
•ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు విషయంలో నిర్ణయాన్ని హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ అభిప్రాయానికి వదిలిపెట్టారు.
•హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో విశాలాంధ్ర ఏర్పాటు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, 103 మంది సభ్యులు అనుకూలంగా ఓటేశారు.
•1956 ఫిబ్రవరి 20న తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన 8 మంది నాయకుల మధ్య ఢిల్లీలో ఒక ఒప్పందం కుదిరింది.
•దీన్నే ‘పెద్ద మనుషుల ఒప్పందం’ అంటారు. ఈ ఒప్పందంపై
1. బూర్గుల రామకృష్ణారావు,
2. కె.వి.రంగారెడ్డి,
3. జె.వి.నరసింగరావు,
4. మర్రి చెన్నారెడ్డి,
5. బెజవాడ గోపాలరెడ్డి,
6. అల్లూరి సత్యనారాయణ,
7. నీలం సంజీవరెడ్డి,
8. సర్దార్ గౌతు లచ్చన్న సంతకాలు చేశారు.
ముఖ్యాంశాలు •ఆంధ్రాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినపుడు,తెలంగాణా ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఉపముఖ్యమంత్రి పదవీనీ, తెలంగాణకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినపుడు ఆంధ్రాకు చెందిన వ్యక్తి ఉపముఖ్యమంత్రి పదవిని చెపట్టాలి.
•హైద్రాబాద్ ప్రాంతంలో వచ్చే ఆదాయాన్ని ఈ ప్రాంత అభివృద్ధికే ఖర్చుచేయాలి.
•ప్రత్యేక తెలంగాణ ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేయాలి.
•వృత్తి విద్యాపరమైన కోర్సులలో 20% సీట్లను ఈ ప్రాంతానికి రిజర్వు చేయాలి.
•ఉద్యోగాలలో ప్రాంతీయంగా రిజర్వేషన్లు కల్పించాలి.
•రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకొని ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని పునర్‌వ్యవస్థీకరించారు.
•ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణతో కలిపి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరించింది
•ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి - నీలం సంజీవరెడ్డి .
•ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ - సి.యం. త్రివేది .
•ఆంధ్రప్రదేశ్ మొదటి హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి - జస్తిస్ కోకా సుబ్బారావు.
1956 తర్వాత ఏర్పాటైన రాష్ట్రాలు
1) గుజరాత్ (1 మే, 1960)బొంబాయి రాష్ట్రాన్ని విడగొట్టి గుజరాత్‌ను 15వ రాష్ర్టంగా ఏర్పాటు చేశారు. బొంబాయి రాష్ర్టం పేరును మహారాష్ట్రాగా మార్చారు.
2) నాగాలాండ్ (1 డిసెంబర్, 1963)
అస్సాం రాష్ట్రాన్ని పునర్ వ్యవస్థీకరించి నాగా కొండ ప్రాంతాలు, ట్యూన్‌సాంగ్ ప్రాంతాలతో నాగాలాండ్‌ను ఏర్పాటు చేశారు. ఇది 16వ రాష్ట్రంగా ఏర్పాటైంది.
3) హర్యానా(1 నవంబర్, 1966)
పంజాబ్‌ను పునర్‌వ్యవస్థీకరించి హిందీ మాట్లాడే ప్రాంతాన్ని హర్యానా రాష్ర్టంగా ఏర్పాటు చేశారు. షా కమిషన్ సూచన మేరకు చండీగఢ్‌ను పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చేశారు. దీంతోపాటు చండీగఢ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించారు.
హిమాచల్ ప్రదేశ్ (25 జనవరి, 1971)
పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలతో కలిపి కేంద్రపాలిత ప్రాంతమైన హిమాచల్‌కు రాష్ర్ట హోదా కల్పించారు. ఇది 18వ రాష్ట్రం.
5) మణిపూర్ (21 జనవరి, 1972)
ఈశాన్య రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం ద్వారా మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన మణిపూర్‌ను 19వ రాష్ట్రంగా మార్చారు.
6) త్రిపుర (21 జనవరి, 1972)
కేంద్రపాలిత ప్రాంతమైన త్రిపురను 20వ రాష్ట్రంగా మార్చారు.
7) మేఘాలయ (21 జనవరి, 1972)
అస్సాంలో ఉపరాష్ట్రంగా ఉన్న మేఘాలయను పూర్తి రాష్ర్టంగా మార్చారు. 1969లో మేఘాలయకు ఉపరాష్ట్ర హోదా కల్పించారు.
8) సిక్కిం (16 మే, 1975)
36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింకు సంపూర్ణ రాష్ట్ర ప్రతిపత్తి కల్పించారు. సిక్కిం రాష్ట్రానికి ప్రత్యేక చరిత్ర ఉంది. 1947 వరకు సిక్కిం ఛోగ్యాల్ రాజవంశ పాలనలో ఉండేది. 1974లో 35వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింకు అసోసియేట్ రాష్ట్ర పతిపత్తి కల్పించారు. 10వ షెడ్యూల్‌లో నూతన ప్రకరణ 2ఎను చేర్చారు. 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను సంపూర్ణ రాష్ట్రంగా గుర్తించారు. ఈ విధంగా సిక్కిం 22వ రాష్ట్రాంగా ఏర్పాటైంది. 1974లో చేసిన 35వ రాజ్యాంగ సవరణను రద్దుచేశారు. ప్రకరణ 2ఎను, 10వ షెడ్యూల్‌లోని ప్రత్యేకతను తొలగించారు. ప్రకరణ 371ఎఫ్ ద్వారా సిక్కిం రాష్ట్రానికి ప్రత్యేక రక్షణ కల్పించారు.
9) మిజోరాం (20 ఫిబ్రవరి, 1987)
కేంద్రపాలిత ప్రాంతమైన మిజోరాంకు 53వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర హోదా కల్పించారు. ఇది 23వ రాష్ట్రాంగా ఏర్పాటైంది.
10) అరుణాచల్ ప్రదేశ్ (20 ఫిబ్రవరి, 1987)
55వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్‌కు సంపూర్ణ రాష్ట్ర హోదాను కల్పించారు. అరుణాచల్ ప్రదేశ్‌ను నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ (ఎన్‌ఈఎఫ్‌ఏ) అని పిలిచేవారు.
11) గోవా (30 మే, 1987)
56వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతమైన గోవాకు సంపూర్ణ రాష్ట్ర ప్రతిపత్తి కల్పించారు. 1961లో పోర్చుగీసువారు గోవాను భారతదేశానికి అప్పగించారు. గోవా, డయ్యూ, డామన్‌లను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. ఇందు కోసం 1962లో 12వ రాజ్యాంగ సవరణ చేశారు.
12) ఛత్తీస్‌గఢ్(1 నవంబర్, 2000)
మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్‌వ్యవస్థీకరించి ఛత్తీస్‌గఢ్‌ను 26వ రాష్ట్రాంగా ఏర్పాటు చేశారు.
13) ఉత్తరాఖండ్ (9 నవంబర్, 2000)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. ఉత్తరాఖండ్ 27వ రాష్ట్రాంగా ఏర్పాటైంది.
14) జార్ఖండ్ (15 నవంబర్, 2000)
బిహార్ రాష్ట్రాన్ని పునర్‌వ్యవస్థీకరించి 28వ రాష్ట్రాంగా జార్ఖండ్‌ను ఏర్పాటు చేశారు.
15) తెలంగాణ (2 జూన్, 2014)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్‌వ్యవస్థీకరించి 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రాన్ని 29వ రాష్ట్రాంగా ఏర్పాటు చేశారు.
రాష్ట్ర హోదా కోల్పోయిన రాష్ట్రాలు
👉🏻జమ్మూ&కాశ్మీర్31 అక్టోబర్ 2019 జమ్మూ&కాశ్మీర్, లఢక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు
కేంద్రపాలిత ప్రాంతాలు- ఏర్పాట్లు
1) దాద్రానగర్ హవేలి1954 వరకు ఈ ప్రాంతం పోర్చుగీసు వారి ఆధీనంలో ఉండేది. 1961లో పదో రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు.
2) డామన్ - డయ్యూ
భారత ప్రభుత్వం 1961లో సైనిక చర్య ద్వారా ఈ ప్రాంతాలను పోర్చుగీసు వారి నుంచి స్వాధీనం చేసుకుంది. 12వ రాజ్యాంగ సవరణ ద్వారా 1962లో కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. 1987లో గోవా ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా కొనసాగించారు.
3) పాండిచ్చేరి
ఇది పుదుచ్చేరి, కరైకల్, మహే, యానాం అనే నాలుగు ప్రాంతాల కలయిక. 1964లో ఫ్రెంచివారు ఈ ప్రాంతాలను భారత్‌కు అప్పగించారు. 1962లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాంతాలకు కేంద్రపాలిత ప్రాంత హోదా కల్పించారు.
4) చంఢీగఢ్
1966లో పంజాబ్ పునర్‌వ్యవస్థీకరణ ద్వారా హర్యానా, పంజాబ్‌లకు ఉమ్మడి రాజధాని అయిన చండీగఢ్‌కు కేంద్రపాలిత ప్రాంత హోదా కల్పించారు.
5) జమ్మూ&కాశ్మీర్
6) లఢక్
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు - పాత పేర్లు - నూతన పేర్లు
1) 1950 యునెటైడ్ ప్రావిన్‌స--->ఉత్తరప్రదేశ్2) 1956 ట్రావెన్‌కోర్ కొచ్చిన్ --->కేరళ
3) 1959 మధ్యభారత్--->మధ్యప్రదేశ్
4) 1960 బొంబాయి--->మహారాష్ర్ట
5) 1968 మద్రాసు--->తమిళనాడు
6) 1973 మైసూరు--->కర్ణాటక
7) 1973 లక్కదీవి, మినికాయ్ అమిన్ దీవి--->లక్షదీవులు
8) 2006 ఉత్తరాంచల్--->ఉత్తరాఖండ్
9) 2006 >పాండిచ్చేరి--->పుదుచ్చేరి
10) 2007 అస్సాం--->అసోం
11) 2011 ఒరిస్సా--->ఒడిశా
12) 2011పశ్చిమ బెంగాల్--->పశ్చిమ బంగ
భారత దేశం లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు కొనసాగుతున్న ప్రాంతాలు :-
అసోం | బోడో లాండ్ |
కర్ణాటక | కొడగు |
మహారాష్ట్ర | విదర్భ |
గుజరాత్ | సౌరాష్ట్ర |
ఉత్తర ప్రదేశ్ | హరిత ప్రదేశ్, పశ్చిమ ప్రదేశ్,అవధ్,పూర్వాంచల్ |
మధ్య ప్రదేశ్ | వింధ్య ప్రదేశ్ |
బీహార్ | మిథిలాంచల్ |
కేరళ,కర్ణాటక సరిహాద్దు | తుళునాడు |
పశ్చిమ బెంగాల్ | గూర్ఖాలాండ్ |
ఒరిస్సా | కోసల్ |
No comments:
Post a Comment