•తండ్రిపేరు - కరంచంద్
•తల్లిపేరు - పుత్లిబాయ్(కరంచంద్ యొక్క 4వ భార్య)
•గాంధీ రాజ్‌కోట్‌లో ఆల్‌ఫ్రెడ్ హై స్కూల్, భావనగర్‌లో సమర్‌దాస్ కాలేజిలో చదువుకున్నాడు.
•1888లో తన 13వ యేట 14 సంవత్సరాల కస్తూర్భా మఖాంజీని వివాహామాడాడు.
•1888లో లండన్‌కు వెళ్లి యూసిఎల్ యూనివర్శిటీలోని లా ఇన్నర్ టెంపుల్‌లో 'లా'ను పూర్తి చేసి 1891 జూన్‌లో భారతదేశానికి తిరిగి వచ్చాడు.
•గాంధీ మొదటిగా బాంబేలో లా ప్రాక్టీస్ చేశాడు. కానీ అచ్చట విజయం సాదించలేక పోయాడు.
•గాంధీ కుమారులు
-హరిలాల్(1888)
-మణిలాల్(1892)
-రాందాస్ (1897)
-దేవదాస్ (1900)
•1948 జనవరి 30న ఢిల్లీలో హత్యకు గురయ్యాడు.
•బిరుదులు:
- జాతిపిత (సుభాష్ చంద్రబోస్ ఇచ్చాడు)
- మహాత్మ (రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చాడు)
- బాపూజీ (జవహర్‌లాల్ నెహ్రూ ఇచ్చాడు)
- కైజర్-ఇ-హింద్(హిందుస్తాన్ చక్రవర్తి) (బ్రిటీష్ వారు ఇచ్చారు)
- హిందూదేశ సింహం అనికూడా అంటారు.
•వార్తా పత్రికలు:
- Young India
- హరిజన్
- నవజీవన్
- Indian Opinion (దక్షిణాఫ్రికాలో)
•పుస్తకాలు:
- The Story of My Experiments (గుజరాత్‌భాషలో రాశాడు)
- Conquest of Self
- Hind Swaraj
•సంస్థలు:
- సబర్మతి (గుజరాత్), వార్ధా, నివేదిత ఆశ్రమాలు (మహారాష్ట్ర)
- All India Spinners Association
- All India Depressed Class Association
మొదటి దశ (మితవాద దశ)
•గాంధీ దాడే అబ్దుల్లా యొక్క వ్యాపారంలో చట్టపరమైన సమస్యలను పరిష్కరించుటకై ఒక సంవత్సరం కాంట్రాక్టు పైన 1893లో దక్షిణాఫ్రికాకు చేరుకున్నాడు.
దర్బన్ నుండి జోహన్‌బర్ల్ .
•మీదుగా ప్రిటోరియో (ప్రస్తుతం ష్వానే) వెళ్లుటకు
ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ చేయించుకున్నాడు. Standarton అనే ప్రాంతం చేరినపుడు ఆంగ్లేయులు గాంధీని ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్ నుండి బయటకు నెట్టివేశారు. ఆ రోజు రాత్రి గాంధీ దగ్గరలో ఉన్న St. Peter Maritzberg రైల్వేస్టేషన్‌లో గడిపాడు.
•దక్షిణాఫ్రికాలో ఉన్న జాతి వివక్షతను చూసిన గాంధీ ఒక సం.నికి బదులు 22 సం.లు దక్షిణాప్రికాలో ఉండిపోయాడు.
దక్షిణాఫ్రికాలో గాంధీ ఉద్యమాన్ని 2 దశలుగా విభజించవచ్చును. అవి
1) 1898-1906 మొదటి దశ
2) 1906-1915 రెండవ దశ
మొదటి దశ (మితవాద దశ):
•ఈ దశలో గాంధీ బ్రిటీషు వారికి పిటిషన్లను పంపేవాడు.
•ఈ దశలోనే ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను. 1894లో నాటల్ ఇండియన్ కాంగ్రెస్(జాతీయ)ను స్థాపించాడు.
రెండవ దశ (ప్రతిఘటన దశ):
•1906లో బ్రిటీష్ దక్షిణాఫ్రికా ప్రభుత్వం రిజిస్టేషన్ చట్టమును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం దక్షిణాఫ్రికాలోని. ప్రతి ఆసియావాసి తన వేలి ముద్రలతో ఒక సర్టిఫికెట్‌ను పొందాలి.
•ఈ సర్టిఫికెట్‌లో తన వ్యక్తిగత సమాచారం ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా గాంధీ మొట్టమొదటిసారిగా 1906లో సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు.
•గాంధీ దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహీల కుటుంబాల కొరకు
ఫినిక్స్ కాలనీ/టాల్‌స్టాయ్ ఫార్మ్‌ను ట్రాన్స్‌వాల్‌లో ఏర్పాటుచేశాడు. (దీనిలో గాంధీకి సహకరించినది జర్మన్ దేశస్తుడు అయిన అలెన్‌బెక్)
•దక్షిణాఫ్రికాలో గాంధీని 'భాయ్' అని పిలిచేవారు.
•తర్వాత ఈ రిజిస్ట్రేషన్ చట్టం వెనకకు తీసుకోబడింది.
•1913లో బ్రిటీష్ దక్షిణాఫ్రికా ప్రభుత్వం రెండు చట్టాలను ప్రవేశపెట్టింది. అవి
1) క్రిస్టియనేతర తరహాలో జరిగిన వివాహాలు రద్దు అవుతాయి.
2) సరైన పత్రాలు లేకుండా దక్షిణాఫ్రికాలో ప్రవేశించిన ఆసియావాసులకై 3 పౌండ్లు పన్ను విధించుట.
ఈ చట్టాలకు వ్యతిరేకంగా 1913లో గాంధీ 2వ సారి సత్యాగ్రహాన్ని చేపట్టాడు.
•అప్పటి బ్రిటీష్ దక్షిణాఫ్రికా గవర్నర్ జనరల్ స్మట్స్‌చే గాంధీజీ అరెస్ట్ చేయబడ్డాడు.
•1914లో రిలీఫ్ చట్టంతో పై చట్టాలు విరమించబడ్దాయి. ఇది బ్రహ్మాండమైన విజయం. దక్షిణాఫ్రికాలోని భారతీయులకు గాంధీ ఏకైక నియుక్తుడయ్యాడు. గాంధీ సత్యాగ్రహం అనగా 'శాంతియుత ప్రతిఘటన' గా నిర్వచించాడు. అహింసా విధానం సత్యాగ్రహ ఉద్యమానికి మూలం.
•'హింస కన్నా అహింస పరమోత్కృష్టమైనది. శిక్షించడం కన్నా క్షమించడం ధైర్యవంతుల లక్షణం' అని గాంధీ పలికాడు.
•1915లో స్మట్స్ గాంధీని విడుదల చేశాడు.
•1915 జనవరి 9వ తేదీన గాంధీ భారత్‌కు చేరుకున్నాడు. (గోఖలే అభ్యర్థనపై)
భారతదేశంలో గాంధీ ఉద్యమం
•1915 - గోఖలే పిలుపు మేరకు గాంధీ జనవరి 9వ తేదీన భారతదేశానికి తిరిగి వచ్చాడు. అందువల్లనే ప్రస్తుతం జనవరి 9ని ప్రవాస భారతీయ దివస్‌గా జరుపుతున్నారు.•అప్పటి భారత గవర్నర్ జనరల్ - 2వ హార్దెంజ్
•1916 - సబర్మతీ ఆశ్రమాన్ని గుజరాత్‌లోని అహ్మదాబాద్ వద్ద స్థాపించాడు.
దక్షిణాఫ్రికాలో గాంధీ ప్రయత్నాల గురించి విద్యావంతులకేగాక, సామాన్య ప్రజలకు కూడా తెలిసింది. దేశంలో సామాన్య ప్రజల పరిస్థితిని తెలుసుకోవడానికి భారతదేశమంతటా పర్యటించాలని గాంధీజీ నిర్ణయించుకున్నారు. బ్రిటన్ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్న సమయంలో హోమ్ రూల్ ఉద్యమం చేయడం మంచిది కాదని భావించారు. జాతీయవాదుల లక్ష్యాలను సాధించడానికి అహింసాయుత సత్యాగ్రహమే సరైన విధానమని పేర్కొన్నారు. 1917-18 మధ్య కాలంలో మూడు పోరాటాల్లో పాల్గొన్నారు.
1917 (చంపారన్ సత్యాగ్రహం):
•బీహార్‌లోని చంపారన్ ప్రాంతంలో తిన్‌కథియా విధానం ఉండేది. దీని కారణంగా చంపారన్ రైతులు అనేక సమస్యలను ఎదుర్శొనేవారు.
•ఇట్టి పరిస్థితులు బెంగాల్‌లో ఇంతకుముందే ఉండగా 1859-61లో రైతులు తిరుగుబాటు చేసి తోట యజమానుల పీడ నుంచి విముక్తులైనారు. ఈ విప్లవాన్ని 'నీలి విప్లవం'గా పిలుస్తారు.
•రాజ్‌కుమార్ శుక్లా లక్నో నుంచి గాంధీని చంపారన్ ప్రాంతాన్ని సందర్శించవలసిందిగా పిలుపునిచ్చాడు. •రాజేంద్రప్రసాద్, మహాదేవ్ దేశాయ్, ఆచార్య కృపాలనీ మొదలగు వారితో బయలుదేరి గాంధీ చంపారన్ చేరుకున్నాడు. కానీ చంపారన్ జిల్లా యంత్రాంగం గాంధీపై నిషేధ ఆజ్ఞలను విధించింది. వెంటనే గాంధీ సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు.
•చంపారన్ ప్రజలు గాంధీ యొక్క సత్యాగ్రహంలో చేరారు. దీనికి భయపడిన చంపారన్ జిల్లా యంత్రాంగం గాంధీపై ఉన్న నిషేధ ఆజ్ఞలను ఎత్తివేసి, గాంధీని సభ్యునిగా చేస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
•ఈ కమిటీ నివేదిక ఆధారంగా చంపారన్‌లో తీన్‌కథియా విధానం రద్దు చేయబడినది.
•జమిందారులు చట్ట వ్యతిరేకంగా వసూలు చేసిన పన్నులలో 25% పన్నులను రైతులకు తిరిగి ఇచ్చుటకు అంగీకరించారు. ఇది భారతదేశంలో గాంధీ యొక్క మొట్టమొదటి విజయం.
1917-18 ఖేదా ఉద్యమం (గుజరాత్):
•1917లో గుజరాత్‌లోని ఖేదాలో పంటల దిగుబడి లేకపోవుటచే ఆ సంవత్సరం శిస్తు వసూలు చేయకూడదని మోహన్‌లాల్ పాంద్యా ఖేదా ఉద్యమాన్ని చేపట్టాడు.
•1918లో గాంధీ ఈ ఉద్యమానికి నేతృత్వం వహించాడు. దీంతో ఖేదాలో పన్ను వసూలును రద్దు చేయుటకు బ్రిటీష్ అంగీకరించింది.
1918 అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె:
•మిల్లు కార్మికులు వేతనాల పెంపు కొరకు సమ్మె చేపట్టారు. గాంధీ ఈ సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ మొట్టమొదటిసారిగా నిరాహారదీక్ష అనే అహింసా ఆయుధాన్ని ఉపయోగించాడు.
•దీంతో మిల్లుల యాజమాన్యం 35% వేతనాలను పెంచింది.
పై మూడు పోరాటాల ద్వారా గాంధీజీ సామాన్య ప్రజల నమ్మకాన్ని, గౌరవాన్ని పొందగలిగారు. అలాగే వారి బలాలు, బలహీనతలను అర్థం చేసుకోగలిగారు.
సహాయ నిరాకరణ ఉద్యమం
1919లో జరిగిన సంఘటనలు1. రౌలత్ చట్టము
2, జలియన్‌వాలాబాగ్ సంఘటన
3. ఖిలాఫత్ ఉద్యమం
1. రౌలత్ చట్టం:
•మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో(1914-1918) ఇండియాలో, ఉన్న అత్యవనర చట్టాలను సమీక్షించుటకై బ్రిటిష్ ప్రభుత్వం జస్టిస్ రౌలత్ కమిటీని ఏర్పాటుచేసింది.
•జస్టిస్ రౌలత్ కింది అంశాలతో తన నివేదికను సమర్పించాడు.
1) మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఉన్న అన్ని అత్యవసర చట్టాలు కొనసాగాలి.
2) అనుమానితులను అరెస్ట్ చేసి రెండు సంవత్సరాలపాటు ఎటువంటి విచారణ లేకుండా నిర్భంధించవచ్చు.
3) విచారణ కొరకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయవచ్చు.
•బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ యొక్క నివేదికను ఆమోదించి దానిని ఒక చట్టంగా మార్చింది. దీనినే “రౌలత్ చట్టం” అని అంటారు. దీనినే “బ్లాక్ యాక్ట్ అని కూడా అంటారు.
•రౌలత్ చట్టం 1919 మార్చిలో అమలులోకి వచ్చింది. తక్షణమే భారతదేశంలో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టబడ్డాయి.
•1919 ఏప్రిల్ 6న భారతదేశంలో 'హర్తాళ్ జరగాలనిన గాంధీ పిలుపుఇచ్చాడు.
జలియన్ వాలాబాగ్ సంఘటన (1919 ఏప్రిల్ 13):
•రౌలత్ చట్ట వ్యతిరేక ఉద్యమాల తీవ్రత పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో అధికంగా ఉందేది.
•సైఫుద్దీన్ కిచ్లూ, సత్యపాల్ అమృత్‌సర్ లో రౌలత్ చట్ట వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు. వీరిద్దరూ అరెస్ట్ చేయబడ్డారు.
•పంజాబ్ గవర్నర్ ఒ. డయ్యర్ అమృత్‌నర్‌లో ఉద్యమ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అమృత్‌సర్ పట్టణాన్ని “జనరల్ డయ్యర్'కు అప్పగించాడు.
•జనరల్ డయ్యర్ వచ్చీరాగానే అమృత్‌సర్‌లో నిషేధ ఆజ్ఞలు జారీచేశాడు.
•ఏప్రిల్ 13న పంజాబీల కొత్త సంవత్సరం 'బైసాఖీ' రోజున అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌లో సమావేశమై తమ నాయకుల అరెస్ట్ ను ఖండించవలెనని ప్రజలు నిర్ణయించారు.
•ఏప్రిల్ 13న అమృత్‌సర్ ప్రజలు జనరల్ డయ్యర్ విధించిన నిషేధ ఆజ్ఞలను ఉల్లంఫించి జలియన్ వాలాబాగ్‌లో సమావేశమయ్యారు.
•హన్సరాజ్ అనే వ్యక్తి ప్రసంగిస్తున్నపుడు జనరల్ డయ్యర్ జలియన్ వాలాబాగ్ చేరుకొని ఎటువంటి ముందస్తు హెచ్చరికలు జారీచేయకుండా సమావేశమైన వారిపై కాల్పులకు ఆదేశించాడు.
•సుమారు 10 నిమిషాలపాటు కొనసాగిన ఈ కాల్పులలో వందలమంది ప్రజలు మరణించారు.
•జలియన్‌వాలాబాగ్ సంఘటన గురించి తెలుసుకొన్న వెంటనే రవీంద్రనాథ్ ఠాగూర్ తన సర్ లేదా నైట్‌హుడ్ బిరుదును బ్రిటిష్ వారికి తిరిగి ఇచ్చివేశాడు.
•ఓ జలియన్ వాలాబాగ్ సంఘటన తరువాత జనరల్ డయ్యర్ అమృత్‌సర్‌లోని ప్రజలపై తనేక అకృత్యాలను చేశాడు. అనేకమంది యువకులు అంగవైకల్యానికి గురయ్యారు.
•ఐ.యన్.సి జనరల్ డయ్యర్‌పై చర్య తీసుకోవలసిందిగా
•డిమాండ్ చేయడంతో బ్రిటిష్ ప్రభుత్వం జలియన్‌వాలాబాగ్ సంఘటనపై హంటర్ కమిషన్‌ను నియమించింది.
•హంటర్ కమిషన్ జనరల్ డయ్యర్ నిర్దోషి అని పేర్కొన్నది.
•దీనితో గాంధీ హంటర్ కమిషన్‌ను వైట్ వాష్ అని పేర్కొన్నాడు.
•పంజాబి సిక్కువాడైన '“ఉధమ్‌సింగ్” జనరల్ డయ్యర్ మరియు ఒ డయ్యర్‌లను హతమార్చాలని నిర్ణయించుకొన్నాడు.
•1940లో ఉధమ్‌సింగ్ వీరిని చంపడానికి లండన్‌కు వెళ్లాడు. కానీ అప్పటికే జనరల్ డయ్యర్ అనేక బాధాకరమైన రోగాలతో మరణించాడు. ఉధమ్ సింగ్ ఒ.డయ్యర్‌ను హతమార్చాడు.
•ఆంధ్రాకు చెందిన దామరాజు పుందరీకాక్షుడు జనరల్ డయ్యర్‌పై “పాంచాల పరాభవం” అనే నాటకాన్ని రచించాడు.
ఖిలాఫత్ ఉద్యమం:
•మొదటి ప్రపంచ యుద్ధంలో “టర్కీ ఓడిపోయిన దేశం. అప్పట్లో ముస్లిములకు మత, రాజకీయ పెద్ద అయిన “ఖలీఫా టర్కీలో ఉందేవాడు.
•బ్రిటన్ మొదటి ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన తరువాత టర్కీలోని 'ఖలీఫా' పదవిని రద్దు చేసింది.
•తక్షణమే మొత్తం ప్రపంచంలోని ముస్లింలు ఖలీఫా పదవి పునరుద్దరణ కొరకు ఉద్యమాలు చేపట్టారు.
•భారతదేశంలో కూడా ఖలీఫాకు మద్దతుగా ఉద్యమ ప్రారంభమయింది. దీనినే ఖిలాఫత్ ఉద్యమం అని పేర్కొంటారు.
•భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించినవారు అలీ సోదరులు (మహ్మద్ ఆలీ, షౌకత్ ఆలీ)
•తర్వాత హస్రత్ మొహాని, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మొదలగువారు ఖిలాఫత్ ఉద్యమంలో చేరారు.
•ఖిలాఫత్ ఉద్యమానికి అధ్యక్షత వహించవలసిందిగా అఖిల భారత ఖిలాఫత్ కమిటీ గాంధీకి విజ్ఞప్తి చేసింది.
•హిందూ-ముస్లిం ఐక్యతకు ఈ ఉద్యమం తోడ్పడుతుందని భావించిన గాంధీ ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించాడు.
•గాంధీ ఖిలాపత్ ఉద్యమానికి నాయకత్వం వహించడంతో ఈ ఉద్యమం భారతదేశం అంతా విస్తరించింది.
•1920-21లో టర్కీ నూతన పాలకుడు అయిన “ముస్తఫా కెమాల్ పాషా” టర్కీలో ఆధునీకరణ లేదా అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాడు.
•దీనిలో భాగంగా ఇక నుండి టటర్కీలో ఖలీఫా పదవి ఉ౦డదని కెమాల్ పాషా స్వయంగా ప్రకటించాడు. దీనితో మొత్తం ప్రపంచంలో ఖలీఫాకు మద్దతుగా జరుగుతున్న ఉద్యమాలు అంతమయ్యాయి.
గాంధీజీ 1919-22 మధ్య బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హాయ నిరాకరణ ఉద్యమం ద్వారా పోరాడారు.
ఉద్యమ ప్రాధాన్యం:
1. మొదటిసారిగా భారతదేశంలోని అన్ని వర్గాలవారు, ముఖ్యంగా రైతులు, కార్మికులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్త్రీలు, వ్యాపారులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే పెద్ద పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, జమీందారులు ఉద్యమంలో పాల్గొనలేదు.
2. జాతీయతా భావాలు దేశంలోని మారుమూల ప్రాంతాలకు వ్యాప్తి చెందడానికి ఈ ఉద్యమం దోహదపడింది.
3. హిందూ, ముస్లింల మధ్య ఐక్యత తారస్థాయికి చేరింది.
4. స్వాతంత్య్రం కోసం సామాన్య ప్రజలు ఎలాంటి త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారనే విషయం స్పష్టమైంది.
ఈ ఉద్యమాన్ని మూడు ప్రధాన డిమాండ్ల సాధన కోసం ప్రారంభించినా, ఏ ఒక్క డిమాండూ నెరవేరలేదు. అయినా భారత జాతీయోద్యమ చరిత్రలో సహాయ నిరాకరణ ఉద్యమం గొప్ప ముందడుగుగా పేర్కొనవచ్చు.
ఉద్యమ లక్ష్యాలు:
1. రౌలత్ చట్టాన్ని రద్దుచేసి, జలియన్ వాలాబాగ్ దురంతంపై బ్రిటిష్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేయాలి.
2. బ్రిటిష్ ప్రభుత్వం టర్కీ పట్ల ఉదార వైఖరిని అవలంబించాలి. టర్కీ సుల్తానుకు ఖలీఫా పదవిని తిరిగి కట్టబెట్టాలి. 3. స్వరాజ్య డిమాండ్‌ను అంగీకరించాలి.
ఉద్యమ కార్యక్రమాలు
నకారాత్మక కార్యక్రమాలు:
1. బిరుదులు, గౌరవ పదవులను వెనక్కి ఇచ్చివేయాలి.
2. ప్రభుత్వ దర్బారుకు, అధికార ఉత్సవాలకు ఆహ్వానాలను తిరస్కరించాలి.
3. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను బహిష్కరించాలి.
4. బ్రిటిష్ న్యాయస్థానాలను బహిష్కరించాలి.
5. మెసపటోమియాలో పని చేయడానికి అన్ని వర్గాల వారు తిరస్కరించాలి.
6. రాష్ట్ర, కేంద్ర శాసనసభలకు జరిగే ఎన్నికలను బహిష్కరించాలి.
7. విదేశీ వస్తువులను బహిష్కరించాలి.
సకారాత్మక కార్యక్రమాలు:
1. ఆచార్య నరేంద్రదేవ్, చిత్తరంజన్ దాస్, లాలా లజపతిరాయ్, జాకీర్ హుస్సేన్, సుభాష్ చంద్రబోస్ లాంటి జాతీయ నాయకుల ఆధ్వర్యంలో విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి.
2. తిలక్ స్వరాజ్య నిధికి కోటి రూపాయలు విరాళంగా సేకరించారు.
3. స్వదేశీ పరిశ్రమల అభివృద్ధికి ప్రయత్నాలు జరిగాయి. 1921 జులైలో అలీ సోదరులు బ్రిటిష్ సైన్యం నుంచి ముస్లింలు వైదొలగాలని పిలుపునిచ్చారు. 1921 మేలో గాంధీ, వైస్రాయి లార్డ్ రీడింగ్ చర్చలు విఫలమయ్యాయి. 1922 ఫిబ్రవరి 1న గాంధీజీ బార్డోలి నుంచి శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభిస్తానని బ్రిటిష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో భారత దేశంలో జరిగిన ఉద్యమాలు:
పంజాబ్:
•సిక్కులు గురుద్వారాల సంస్కరణల కొరకు మహంతులకు వ్యతిరేకంగా అకాలీ ఉద్యమాన్ని చేపట్టారు.
•ఈ ఉద్యమ ఫలితంగా అవినీతిపరులైన మహంతులను గురుద్వారాల నుండి తొలగించి గురుద్వారాల పరిపాలన కొరకు శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ ఏర్పాటు చేయబడింది.
ఆంధ్ర:
1. చీరాల-పేరాల ఉద్యమం-దుగ్గిరాల గోపాలక్రిష్టయ్య
2. పల్నాడు సత్యాగ్రహం-కన్నెగంటి హనుమంతరావు
3. పెదనందిపాడు ఉద్యమం-పర్వతనేని వీరయ్య చౌదరి
కేరళ:
•మోష్లా ఉద్యమం కేరళలోని మలబార్ తీరంలో జరిగింది. దీని నాయకుడు కున్ అహ్మద్ హజ్
•మోష్లా ఉద్యమం బ్రిటీష్ మరియు జమీందార్లకు వ్యతిరేకంగా జరిగింది
•సహాయ నిరాకరణ ఉద్యమంలో ఏర్పడిన విద్యాసంస్థలు:
1 జామియా మిలియా ఇస్లామియా
2 గుజరాత్ విద్యాపీఠ్
3 కాశీ విద్యాపీఠ్
చౌరీ చౌరా సంఘటన:
ఉద్యమం తారస్థాయికి చేరుకున్న సమయంలో, 1922 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా చౌరీ చౌరా గ్రామంలో ఒక సంఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామంలో ఊరేగింపుగా వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు పోలీసులను స్టేషన్‌లో బంధించి నిప్పుపెట్టారు. ఈ సంఘటనలో 22 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో గాంధీజీ ఉద్యమాన్ని నిలిపేశారు.
సహాయ నిరాకరణ ఉద్యమం విరమించబడిన తరువాత గాంధీపై క్రింది వ్యాఖ్యలు చేశారు
1. ఇది గాంధీ బలహీన నాయకత్వానికి ఉదాహరణ - ఎం.ఎన్ రాయ్
2. ప్రజల ఆశలపై చల్లని నీటిని చల్లడం? - సుభాష్ చంద్రబోస్
3. సి.ఆర్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ ఇక చట్టసభలోకి ప్రవేశించి మనకు కావలసినది పొందవలెనని గాంధీని కోరారు. కానీ చట్టసభలలోకి ప్రవేశించేందుకు గాంధీ నిరాకరించాడు.
సహాయ నిరాకరణ ఉద్యమం విరమించబడిన తరువాత సంఘటనలు
స్వరాజ్య పార్టీ👉🏻922 డిసెంబర్‌లో ఐ.యన్.సి వార్షిక సమావేశం సి.ఆర్ దాస్ అధ్యతన గయలో జరిగింది.
👉🏻ఈ సమావేశంలో సి.ఆర్.దాస్ కౌన్సిల్ ఎంట్రీ (Wreck with in) తీర్మానమును ప్రవేశపెట్టాడు.
👉🏻కానీ గాంధీ వ్యతిరేకించడంతో ఈ తీర్మానం తిరస్కరించబడింది.
👉🏻దీనితో సి.ఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ, విఠల్‌బాయ్ పటేల్‌లు స్వరాజ్య పార్టీని స్థాపిస్తున్నట్లు గయలో 1922 డిసెంబర్ 31న ప్రకటించారు.
👉🏻అప్పుడు సి.ఆర్ దాస్ అధ్యక్షుడిగా ఎన్నికకాగా, మోతీలాల్ నెహ్రూ కార్యదర్శి అయ్యాడు.
👉🏻1924లో 'గంజాం'లోని ఒక సభలో 'మహర్షి' బులుసు సాంబమూర్తి భారతదేశంలోనే మొట్టమొదటిగా పూర్ణ స్వరాజ్ తీర్మానం చేశాడు.
👉🏻1924 డిసెంబర్‌లో బెల్లాంలో గాంధీ అధ్యక్షతన ఐ.యన్.సి సమావేశంలో కౌన్సిల్ ఎంట్రీ తీర్మానం ఆమోదించబడింది.
👉🏻దీనితో స్వరాజ్య పార్టీ కార్యకలాపాలు ఐ.యన్.సిలో విలీనమయ్యాయి.
1927:All India States People Conference
👉🏻All India States People Conference ను 1927లో బల్వంతరాయ్ మెహతా, జి.ఆర్. అభ్యాంకర్, మాణిక్‌లాల్ కొఠారీలు స్థాపించారు.
👉🏻సంస్థానాలలో పాలకులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలను ఏకం చేసి కలసికట్టుగా పోరాటం చేయడం వీరి యొక్క ముఖ్య ఉద్దేశం.
👉🏻1939లో జవహర్‌లాల్ నెహ్రూ దీనికి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు.
బార్దోలి ఉద్యమం (1928):
👉🏻గుజరాత్‌లోని బార్దోలి ప్రాంతంలో 1928లో పంటలకు సరైన గిట్టుబాటు ధర లభ్యం కాలేదు. అదే సమయంలో బ్రిటీష్ వారు పన్నును 22% పెంచారు.
👉🏻దీని కారణంగా పట్టీదార్ యువక్ మండలి సభ్యులు కల్యాణ్‌జీ మెహతా, కున్వర్‌జీ మెహతా బ్రిటీష్‌కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు.
👉🏻తర్వాత వల్లబాయ్ పటేల్ ఈ ఉద్యమానికి నేతృత్వం వహించాడు.
👉🏻అమెరికా స్వాతంత్ర్య పోరాటంలో నినాదం అయిన 'No Taxation without Representation' అనే నినాదమును వ్యాప్తి చేశాడు.
👉🏻దీనికి భయపడిన బ్రిటీష్ వారు మాక్స్‌వెల్డ్ బ్రూమ్ ఫీల్డ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బ్రిటీషు ప్రభుత్వం శిస్తు వసూలును ఆపివేయడానికి నిర్ణయించింది.
👉🏻అప్పుడే వల్లబాయ్ పటేల్‌కు సర్దార్ అనే బిరుదు ఇవ్వబడింది. (గాంధీ లేదా బార్దోలి లోని మహిళలు ఈ బిరుదు ఇచ్చారని పేర్కొంటారు)
👉🏻వల్లబాయ్ పటేల్‌ను 'లెనిన్ ఆఫ్ బార్దోలి అని కూడా అంటారు.
సైమన్ కమిషన్
👉🏻1923 ఎన్నికలలో స్వరాజ్య పార్టీ జాతీయస్థాయిలో 40శాతం సీట్లతో కేంద్ర చట్టసభలోకి ప్రవేశించింది.
👉🏻కేంద్ర చట్టసభకు సభాధ్యక్షుడు - విఠల్‌ఖాయ్ పటేల్
👉🏻1919 చట్టాన్ని తక్షణమే పునఃసమీక్షించి భారతీయులకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని స్వరాజ్య పార్టీ డిమాండ్ చేసింది.
👉🏻దీనితో 1924లో బ్రిటన్‌లోని లేబర్ పార్టీ ప్రభుత్వం 'ముద్దిమాన్ కమిటీని ఏర్పాటుచేసి ఇండియాకు పంపింది.
👉🏻'ముద్దిమాన్ కమిటీ భారతదేశంలో 1919 చట్టాన్ని సమీక్షిస్తున్నపుడు బ్రిటన్‌లోని లేబర్ పార్టీ ప్రభుత్వం కూలిపోయి కన్సర్వేటివ్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
👉🏻కన్సర్వేటివ్ పార్టీ ప్రభుత్వం ముద్దిమాన్ కమిటీని వెనక్కి పిలిచి అనేక సంవత్సరాల కాలయాపన తరువాత, 1927 నవంబర్‌లో 7 మంది ఆంగ్లేయులతో సైమన్ కమిషన్(1+-6)ను ఏర్పాటుచేసింది.
👉🏻సైమన్ కమిషన్‌లో ఏడుగురు కూడా ఆంగ్రేయులే ఉ౦డడంతో దానిని White Commission అంటారు.
👉🏻సైమన్ కమిషన్‌కు పూర్తి చట్టబద్ధత కారణంగా దీనిని ఇండియన్ స్టాచ్యుటరీ కమిషన్ (చట్టబద్ధ) అని కూడా అంటారు.
👉🏻జస్టిస్ పార్టీ, యూనియనిస్ట్ పార్టీ మినహాయించి ఇండియాలో అన్ని పార్టీలు సైమన్ కమిషన్‌ను బహిష్మరించాయి.
👉🏻1927 డిసెంబర్‌లో సైమన్ కమిషన్‌ను బహిష్కరిస్తూ
👉🏻 సైమన్ గో బ్యాక్ ఉద్యమాలను చేపట్టాలని ఐ.యన్.సి ఎం.ఎ అన్సారీ అధ్యక్షతన మద్రాస్‌లో తీర్మానించింది. (సైమన్ కమిషన్‌లో ఒక్క భారతీయుడికి కూడా స్థానం కల్పించకపోవడం కారణంగా)
👉🏻1928 ఫిబ్రవరి 3న సైమన్ కమిషన్ ఇండియాకు చేరుకుంది.
👉🏻బాంబేలో ఉద్యమకారులు నల్లజెండాలతో స్వాగతం పలికి సైమన్ గో బ్యాక్ అని నినాదాలు చేశారు.
👉🏻ఫిబ్రవరి 3న అనేక ప్రాంతాలలో సైమన్ గో బ్యాక్ ఉద్యమాలు చేపట్టబడ్డాయి.
👉🏻జాతీయస్థాయిలో సైమన్ గో బ్యాక్ ఉద్యమాల తీవ్రత క్రింది ప్రాంతాలలో ప్రధానంగా కనిపించింది.
1. మద్రాస్ - టంగుటూరి ప్రకాశం
2 లక్నో - జవహర్‌లాల్ నెహ్రూ, జి.బి పంత్
3. లాహోర్ - లాలాలజపతిరాయ్
👉🏻ఫిబ్రవరి 3న కాశీనాధుని నాగేశ్వరరావు మద్రాసులో ఒక సభను నిర్వహించి సైమన్ గో బ్యాక్ ఉద్యమాలలో పాల్గొనాలని పిలుపు ఇచ్చాడు.
👉🏻సైమన్ కమిషన్‌ను బహిష్కరించాల్సందిగా రుక్ష్మిణి లక్ష్మీపతి మహిళలకు పిలుపునిచ్చింది
👉🏻గుంటూరులో నడింపల్లి నరసింహారావు సైమన్ గో బ్యాక్ ఉద్యమాన్ని చేపట్టాడు. ఇతన్ని గుంటూరు కేసరి అంటారు.
👉🏻విజయవాడ రైల్వేస్టేషన్‌లో అప్పటి విజయవాడ మున్సివల్ చైర్మన్ అయిన అయ్యదేవర కాళేశ్వరరావు సైమన్ గో బ్యాక్ అని రాసి ఉన్న ఉత్తరాన్ని సైమన్‌కు అందజేశాడు.
👉🏻టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసులోని ప్యారిస్ కార్నర్ వద్ద సైమన్ గో బ్యాక్ ఉద్యమాన్ని చేపట్టినపుడు పోలీస్ కాల్పులలో పార్ధసారథి అనే వ్యక్తి మరణించాడు.
👉🏻పార్ధసారథి శవం వద్దకు వేగంగా వెళుతున్న టంగుటూరి ప్రకాశంను పోలీసులు తుపాకీతో బెదిరించి అడ్డుకున్నారు.
👉🏻తక్షణమే టంగుటూరి తన ఛాతీని చూపించి దమ్ముంటే కాల్చండి అని సవాలు విసిరాడు. ఈ ధైర్యసాహసానికిగాను టంగుటూరికి 'ఆంధ్రకేసరి/షేర్-ఇ-ఆంధ్ర' అనే బిరుదు ఇవ్వబడింది.
నెహ్రూ రిపోర్ట్-1928:
👉🏻సైమన్ కమిషన్ బ్రిటన్‌కు తిరిగి వెళ్లిపోయి భారతదేశంలోని పరిస్థితులను అప్పటి బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ “బిర్కెన్‌హెడ్”కు వివరించింది.
👉🏻దీనితో ఐ.యన్.సి యే ఒక రాజ్యాంగాన్ని రూపొందించాలని, దానిని ప్రతి ఒక్క భారతీయుడు అంగీకరించాలని పేర్కొంటూ బిర్మెన్ హెడ్ ఐ.యన్.సికి ఒక సవాలు విసిరాడు.
👉🏻దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న ఐ.యన్.సి మోతీలాల్ నెహ్రూ నేతృత్వంలో భారత రాజ్యాంగ సూత్రాలను రూపొందించడానికి ఒక కమిటీని ఏర్పాటుచేసింది.
👉🏻సుభాష్ చంద్రబోస్, తేజ్ బహదూర్ సప్రూ, జయకర్ కట్జూ మొదలగువారి సహాయం పొంది మోతీలాల్ నెహ్రూ తన నివేదికను రూపొందించి ఐ.యన్.సికి సమర్పించాడు. దీనినే 'నెహ్రూ రిపోర్ట్' అని పేర్కొంటారు.
👉🏻1928 డిసెంబర్‌లో కలకత్తా ఐ.యన్.సిలో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన నెహ్రూ రిపోర్ట్ చర్చించబడింది.
👉🏻నెహ్రూ రిపోర్ట్‌లో ప్రధాన అంశాలు:
1) స్వపరిపాలన
2) కేంద్రీకృత ప్రభుత్వం
3) వయోజన ఓటు హక్కు
4) హిందువులు, ముస్లింలు మైనారిటీలుగా ఉన్న ప్రాంతాలలో వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు
5) జాయింట్ ఎలెక్టోరేట్ సిస్టమ్
👉🏻నెహ్రూ రిపోర్ట్ ఆధారంగా ఐ.యన్.సి బ్రిటిష్ వారికి క్రింది అల్టిమేటంను జారీచేసింది.
👉🏻'ఒక సంవత్సరంలోపు భారతదేశానికి స్వపరిపాలన కల్పించాలి'.
👉🏻జిన్నా 14 పాయింట్ ఫార్ములా (14 Point Formula )ను ఢిల్లీ నుంచి 1929లో ప్రకటించాడు.
దీనిలోని ముఖ్య అంశాలు
1) సమాఖ్య ప్రభుత్వం
2) ప్రత్యేక ఎలక్టోరేట్ (Separate Electorate)
3) భవిష్యత్తులో ఏర్పడే ప్రభుత్వాలలో 1/3వ వంతు ముస్లింలు ఉండాలి.
4) సివిల్ సర్వీసెస్‌లో 1/3 వంతు ముస్లింలు ఉండాలి.
5) బోంబే ప్రెసిడెన్సీ నుంచి సింధ్‌ను వేరు చేసి ఒక రాష్ట్రంగా ప్రకటించాలి.
జిన్నాయొక్క14 సూత్రాలను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తిరస్కరించింది.
1929:
👉🏻దీపావళి డిక్లరేషన్‌ను గవర్నర్ జనరల్ ఇర్విన్ ప్రకటించాడు. దీని ప్రకారం భారతదేశానికి స్వపరిపాలన, నెమ్మదిగా సహజసిద్ధంగా లభ్యమవుతుంది.
లాహోర్ ఐ.యన్.సి సమావేశం (1929)
👉🏻జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్ ఐ.యన్.సి సమావేశం జరిగింది.
👉🏻స్వపరిపాలనకు సంబంధించి బ్రిటిష్ నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో 1929 డిసెంబర్ 31న ఐ.యన్.సి మూడు తీర్మానాలను చేసింది.
1) పూర్ణ స్వరాజ్
2) ప్రతి సంవత్సరం జనవరి 26ను స్వాతంత్ర్య దినంగా జరుపుట (1930 జనవరి 26న మొదటి స్వాతంత్ర్యదినం జరుపబడింది)
3) శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించుట
శాసనోల్లంఘన ఉద్యమం
👉🏻శాసన ఉల్లంఘన ఉద్యమం ప్రారంభించాలనే నిర్ణయం 1929 లాహోర్ ఐ.యన్.సి సమావేశంలో తీసుకున్నారు.👉🏻 1930 జనవరి 26న భారతదేశంలో మొదటి స్వాతంత్ర్య
👉🏻 దినోత్సవం జరుపబడింది. ఈ సందర్భంగా జవహర్‌లాల్ నెహ్రూ లాహోర్‌లో రావీ నది తీరాన మొట్ట మొదటిగా భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసాడు.
👉🏻 1930 జనవరి 31న గాంధీ 11 డిమాండ్స్ అల్టిమేటంను గవర్నర్ జనరల్ 'ఇర్విన్'కు పంపాడు. (11 డిమాండ్లను గాంధీ తన యంగ్ ఇండియా పత్రికలో ప్రచురించాడు).
👉🏻 ఇర్విన్ ఈ 11 డిమాండ్లను తిరస్కరించాడు. దీనితో శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించడానికి గాంధీ చర్యలు చేపట్టాడు.
👉🏻 ఉప్పు చట్టాలను ఉల్లంఘించడం ద్వారా శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించాలని గాంధీ నిర్ణయించాడు.
👉🏻 సబర్మతి నుండి దండికి బయలుదేరి దండిలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించుటకు గాంధీ ఒక ప్రణాళికను రూపొందించాడు.
👉🏻 1930 మార్చి 12న గాంధీ 78 మంది అనుచరులతో అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుండి కాలినడకన దండికి బయలుదేరాడు.
👉🏻 ఈ 78మందిలో ఏకైక తెలుగువాడు - యెర్నేని సుబ్రమణ్యం
👉🏻 మార్గంమధ్యలో సరోజనినాయుడు, దుర్గాభాయ్ దేశ్‌ముఖ్‌లు ఉద్యమ యాత్రలో పాల్గొన్నారు.
👉🏻 దండికి చేరుకున్న గాంధీ ఏప్రిల్ 6, 1980న ఉప్పు చట్టాలను ఉల్లంఘించాడు. దీనితో భారతదేశంలో శాసనఉల్లంఘన ఉద్యమం ప్రారంభం అయింది.
👉🏻 గాంధీ శాసన ఉల్లంఘన ఉద్యమ కాలంలో అబ్బాస్ త్యాభ్జీని మొదటి సత్యాగ్రాహిగా, సరోజిని నాయుడును రెండవ సత్యాగ్రాహిగా ప్రకటించాడు.
👉🏻 1930 మే నెలలో గుజరాత్ తీరంలో 'దర్శన్'లో జరిగిన సంఘటనను ప్రపంచానికి తెలియజేసిన అమెరికన్ జర్నలిస్ట్ - వెబ్ మిల్లర్
👉🏻 గాంధీ పిలుపుమేరకు ఇండియాలో అనేక ప్రాంతాలలో ఉప్పు చట్టాలు లేదా బ్రిటిష్ వారి యొక్క భూమి శిస్తు చట్టాలు, అటవీ చట్టాలు ఉల్లంఘించబడ్డాయి.
👉🏻 ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్(సరిహద్దు గాంధీ) వాయువ్య సరిహద్దు ప్రాంతంలో ఖుదాయి ఖిద్మత్‌గార్ (దేవుని సేవకులు) అనే ఉద్యమాన్ని చేపట్టాడు.
👉🏻 ఈ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు ఎర్ర చొక్కాలు ధరించుటచే దీనిని రెడ్ షర్ట్స్ ఉద్యమం అనికూడా అంటారు.
👉🏻 ఈశాన్య రాష్ట్రాలలో రైణీ గైడీలు బ్రిటిష్ చట్టాలను ఉల్లంఘించింది.
👉🏻 యునైటెడ్ ప్రావిన్స్ / ఉత్తర ప్రదేశ్‌లో 'No Tax, No Rent' ఉద్యమం చేపట్టబడింది. No Tax అనే పిలుపు జమిందారులకు (జమిందారులు బ్రిటిష్ వారికి పన్ను చెల్లించకూడదు) Rent అనే పిలుపు రైతులకు(రైతులు జమిందారులకు అద్దె చెల్లించకూడదు) ఇవ్వబడింది.
👉🏻 ఆంధ్రాలో శాసన ఉల్లంఘన ఉద్యమానికి మొదటి డిక్టేటర్ లేదా నియంత - కొండా వెంకటప్పయ్య.
👉🏻 ఆంధ్రాలో మొదటిగా మచిలీపట్నం వద్ద ఉప్పు చట్టాలు ఉల్లంఘించబడ్డాయి.
👉🏻 శాసన ఉల్లంఘన ఉద్యమ కాలంలో ఆరునెలల పసిబిడ్డతో జైలుకెళ్లిన వీర వనిత - కంభంపాటి మాణిక్యాంబ
👉🏻 శాసన ఉల్లంఘన ఉద్యమ కాలంలో ఆంధ్రాలో ఈ క్రింది గీతాలు ప్రసిద్ధి చెందాయి.
👉🏻 1. వీరగంధము తెచ్చినాము వీరులెవరో తెలుపుడి - త్రిపురనేని రామస్వామి చౌదరి
👉🏻 2. కల్లు మానండోయ్ - గొల్లపూడి సీతారామశాస్త్రి
👉🏻 3. బార్దోలి సత్యాగ్రహ విజయం, భారత స్వరాజ్య యుద్ధం - మాడుగంటి జగ్గన్న(జగన్నాథశాస్త్రి)
👉🏻 సైమన్ సలహా మేరకు బ్రిటన్‌లోని జేమ్స్ పాలెస్‌లో మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి.
మొదటి రౌండ్ టేబుల్ సమావేశం(1980 నవంబర్ - డిసెంబర్)
👉🏻ఈ సమావేశంలో పాల్గొన్నవారు
1. ముస్లిం లీగ్ - మవామ్మద్ అలీ, మవామ్మద్ షఫీ, ఆగాఖాన్, ఫజల్ ఉల్ హక్, మహ్మద్ అలీ జిన్నా
2. హిందూ మహాసభ - మూంజే, యన్.సి కేల్కర్ జయకర్
3. లిబరల్స్ పార్టీ - శ్రీనివాన చింతామణి, తేజ్ బహదూర్ సహ్రూ
4. బడుగు వర్గాలు బి.ఆర్ అంబేద్కర్
5. సంస్థానాలు -అక్బర్ హైదరీ (హైదరాబాద్ ప్రధాని), ఇస్మాయిల్ (మైసూర్ ప్రధాని)
👉🏻ఐ.యన్.ని మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని బపాష్కరించింది. దీనితో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం విఫలమైంది.
👉🏻రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఐ.యన్.సి తప్పనిసరిగా పాల్గొనాలని బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్ డొనాల్డ్ గవర్నర్ జనరల్ ఇర్విన్‌పై ఒత్తిడిచేశాడు.
👉🏻దీనితో 1931 మార్చి 5న గాంధీ మరియు ఇర్విన్ మద్య ఢిల్లీలో ఒక ఒడంబడిక జరిగింది. దీనినే “ఢిల్లీ ఒడంబడిక” అంటారు. (ఇర్విన్-గాంధీ ఒడంబడిక). ఎం.ఎ. అన్సారీ, జయకర్‌ల మధ్యవర్తిత్వం.
👉🏻ఢిల్లీ ఒడంబడికలోని ప్రధాన అంశాలు
1. గాంధీ తన శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేసి రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు.
2. దీనికి బదులుగా బ్రిటిష్‌వారు శాసన ఉల్లంఘన ఉద్యమ కాలంలో అరెస్ట్ అయిన వారందరినీ విడుదలచేస్తారు. జప్తు చేసిన ఆస్థూలు కూడా తిరిగి ఇవ్వబడుతాయి.
గాంధీ-ఇర్విన్ లేదా ఢిల్లీ ఒడంబడిక ప్రకారం గాంధీ తన శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసి 1931 నవంబర్, డిసెంబర్‌లలో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొన్నాడు.
రెండవ రౌండ్ టేబుల్ సమావేశం(1931 నవంబర్, డిసెంబర్)
👉🏻ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్, సరోజనీ నాయుడు, మహమ్మద్ ఇక్బాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
👉🏻రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో బడుగు వర్గాల వారి రిజర్వేషన్లకు సంబంధించి విభేదాలు ఏర్పడుట కారణంగా ఇది విఫలమైంది.
👉🏻శాసన ఉల్లంఘన ఉద్యమం పునఃప్రారంభం
•రెండవ రౌండ్ టేబుల్ సమావేశం విఫలమయిన తర్వాత 1932 జనవరిలో గాంధీ బ్రిటన్ నుండి ఇండియాకు తిరిగివచ్చాడు.
•దీనితో గాంధీని అరెస్ట్ చేసి 'పూనే'లోని ఎరవాడ జైలుకు తరలించారు.
•శాసన ఉల్లంఘన ఉద్యమం రెండవ దశలో చెప్పుకోదగ్గ సంఘటనలు చోటుచేసుకోలేదు.
•1932 ఆగస్టులో బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్ డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు.
•దీని ప్రకారం ఇండియాలోని ప్రజలు వివిధ గ్రూపులుగా విభజించబడ్డారు.
•హిందూ మతం అగ్రవర్ణాలు, బడుగు వర్గాలుగా విభజించబడింది.
•ప్రతి గ్రూపుకు ప్రత్యేక ఎలక్టోరేట్ కల్పించబడింది.
•బడుగువర్గాల వారికి కూడా ప్రత్యేక ఎలక్టోరేట్ కల్పించబడింది.
•తక్షణమే దీనిని ఖండిస్తూ గాంధీ ఎరవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు.
•కమ్యూనల్ అవార్డును బి.ఆర్ అంబేద్కర్ స్వాగతించాడు.
•గాంధీ నిరాహార దీక్ష కారణంగా కమ్యూనల్ అవార్డ్ విరమించబడుతుందేమోనని అంబేద్కర్ ఆందోళనకు గురయ్యాడు.
•దీనితో గాంధీ, అంబేద్కర్‌ల మధ్య మదన్ మోహన్ మాలవ్య మధ్యవర్తిత్వం చేశాడు. దీని ఫలితమే పూనా ఒడంబడిక.
•గాంధీ, అంబేద్కర్‌ల మద్య జరిగిన పూనా ఒడంబడిక ప్రకారం బడుగు వర్గాల ప్రత్యేక ఎలక్టోరేట్‌కు బదులు ద్వంద్వ ప్రాతినిధ్యం / ఎలక్టార్ ప్రవేశపెట్టబడింది.
•గతంలో బడుగువర్గాలవారికి కేటాయించిన 74 సీట్లు 148కి 'పెంచబడ్డాయి.
మూడవ రౌండ్ టేబుల్ సమావేశం(1982 నవంబర్)
👉🏻కేవలం 416 మంది ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు.
👉🏻మూడవ రౌండ్ టేబుల్ సమావేశంలో సైమన్ కమిషన్ నివేదిక చర్చించబడింది. దీని ఆధారంగా 1935 చట్టానికి తుది రూపాన్ని ఇచ్చారు.
👉🏻అంబేద్కర్ మరియు జిన్నాలు మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొన్నారు.
👉🏻రెండవ దశలోని శానన ఉల్లంఘన ఉద్యమం భారతదేశంలో పెద్దగా ప్రభావాన్ని చూపలేదు.
గాంధీ దళితుల ఉద్ధరణ కొరకు పోరాటం
1👉🏻933-34లలో గాంధీ ప్రధానంగా దళితుల ఉద్ధరణ కొరకు కృషి చేశారు. భారతదేశ అనేక ప్రాంతాల్లో పర్యటించి కుల వివక్షతను ఖండిస్తూ దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేశాడు.
👉🏻దళితులను హరిజనులు అనగా దేవుని బిడ్డలు అని పేర్కోన్నాడు.
👉🏻దళిత ఉద్ధరణ కొరకు హరిజన్ అనే పత్రికను ప్రచురించి స్వయంగా సంపాదకీయం చేశాడు.
👉🏻ఆలిండియా డిప్రెస్‌డ్ క్లాస్ అసోసియేషన్‌ను దళితులకొరకు స్థాపించాడు.
👉🏻1933లో ఆంధ్రాలో పర్యటించి కృష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకాలోగల సిద్ధాంతం అనే గ్రామంలో ఆలయ ప్రవేశ ఉద్యమాన్ని చేపట్టాడు.
👉🏻1934లో హైదరాబాద్‌లో పర్యటించి కుల వివక్షతను ఖండించాడు.
శాసన ఉల్లంఘన ఉద్యమం విరమించబడిన తరువాత సంఘటనలు
కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ(సి.ఎస్.పి) - 1934👉🏻దీనిని 1934లో ఆచార్య నరేంద్రదేవ్, జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా, మిన్నూ మాసానీలు బొంబాయిలో స్థాపించారు.
👉🏻మొదటి కార్యదర్శి = ఆచార్య నరేంద్ర. దేవ్
👉🏻సోషలిస్ట్ పార్టీ కార్యదర్శి - తెన్నేటి విశ్వనాథం
👉🏻సి.ఎస్.పి క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో కీలకపాత్ర పోషించింది.
ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ(ఎ.ఎస్.పి) - 1934
👉🏻దీనిని 1984లో యన్.జి రంగా విజయవాడలో స్థాపించాడు.
👉🏻ఆంధ్రా సోషలిన్ట్ పార్టీ మొదటి అధ్యక్షుడు -యన్.జిరంగా.
👉🏻ఆంధ్రా సోషలిస్ట్ పార్టీ కార్యదర్శి - మద్దూరి అన్నపూర్ణయ్య
👉🏻తరువాత కాలంలో ఎ.ఎస్.పి కమ్యూనిస్టుల వశం అయింది.
మద్దూరి అన్నపూర్ణయ్య - కాంగ్రెస్ పత్రిక
👉🏻మద్దూరి అన్నపూర్ణయ్య 1940లో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన “ఫార్వర్డ్ బ్లాక్” పార్టీలో చేరిన మొదటి తెలుగువాడు.
👉🏻ఆంధ్ర స్వరాజ్య పార్టీ - గాడిచర్ల
ఐ.యన్.సి ప్రభుత్వం (1937-39)
👉🏻1935 చట్టం ప్రకారం 1937లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారతదేశంలోని మతతత్వపార్టీలు ఘోరపరాజయాన్ని చవిచూశాయి.
👉🏻ముస్లిం లీగ్ మరియు హిందూ మహాసభ ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయాయి.
👉🏻దీనితో ఈ రెండు పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి మతతత్వాన్ని ప్రోత్సపించాయి.
👉🏻1938లో వి.డి సావర్కర్ హిందూ మహాసభకు అధ్యక్షుడై హిందూ రాష్ట్రం అనే సిద్ధాంతాన్ని వ్యాప్తి చేశాడు. జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు.
👉🏻అప్పుడు భారతదేశంలో మొత్తం 11 గవర్నర్ ప్రావిన్సెస్ / రాష్ట్రాలు ఉండేవి.
👉🏻ఈ ఎన్నికలలో ఐ.యన్.సి 8 రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగా, ఒక రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం, మిగిలిన రెండు రాష్ట్రాలలో ఐ.యన్.సియేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
👉🏻సంకీర్ణ ప్రభుత్వం - సింధ్ - అల్లాభక్షి సిఎం
👉🏻భారత జాతీయ కాంగ్రెసేతర ప్రభుత్వాలు
1. బెంగాల్ - ఫజల్-ఉల్-హక్(ఇతను ప్రజా క్రిషక్ పార్టీకి చెందినవాడు)
2. పంజాబ్ - హయత్‌ఖాన్( ఇతను యూనియనిస్ట్ పార్టీకి చెందినవాడు)
భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వాలు
1. మద్రాస్ ప్రెసిడెన్సీ
2. బాంబే ప్రెసిడెన్సీ
3. సెంట్రల్ ప్రావిన్స్
4. యునైటెడ్ ప్రావిన్స్
5. బీహార్
6. ఒరిస్సా
7. అస్సాం
8. వాయువ్య సరిహద్దు ప్రాంతం
👉🏻మద్రాస్ ప్రెసిడెన్సీలో రాజగోపాలాచారి ముఖ్యమంత్రి అయ్యాడు.
👉🏻1939 సెప్టెంబర్‌లో జర్మన్ హిట్లర్ పోలాండ్‌పై దాడి చేశాడు. తక్షణమే బ్రిటన్ జర్మనీపై యుద్ధం ప్రకటించింది.
👉🏻దీనితో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అయింది.
👉🏻భారత జాతీయ కాంగ్రెస్ ను సంప్రదించకుండా అప్పటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ లిన్‌లిత్‌గో భారతదేశం కూడా రెండవ ప్రపంచ యుధ్ధంలో పాల్గొంటుందని ప్రకటన చేశాడు.
👉🏻తక్షణమే భారత జాతీయ కాంగ్రెస్ దీనిని ఖండిస్తూ నిరసనగా తన ఎనిమిది రాష్ట్రాలలోని ప్రభుత్వాలకు రాజీనామా చేసింది.
👉🏻ఐ.యన్.సి తన ప్రభుత్వాలకు రాజీనామా చేయడంతో ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా దీన్ని ఒక విముక్తి లేదా డెలివరెన్స్‌గా పరిగణించాడు.
👉🏻ఈ సందర్భంగా 1939 డిసెంబర్ 22న డే ఆఫ్ డెలివరెన్స్ నిర్వహించారు.
👉🏻బొంబాయిలో జిన్నాతోపాటు బి.ఆర్ అంబేద్కర్ ఈ డే ఆఫ్ డెలివరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
వ్యక్తిగత సత్యాగ్రహం(1940 అక్టోబర్ 17)
👉🏻భారత జాతీయ కాంగ్రెస్ తన ప్రభుత్వాలకు రాజీనామాలు చేసిన తరువాత భారతదేశ స్వాతంత్ర్యం కొరకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
👉🏻దీనిలో భాగంగా 1940 అక్టోబర్ 17న మహారాష్ట్రలోని వార్దాలో గల 'పల్లనార్' అనే గ్రామం నుండి గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహంను ప్రారంభించాడు.
👉🏻ఈ సందర్భంగా గాంధీ ఆచార్య వినోభాభావేను మొదటి సత్యాగ్రాహి మరియు జవహర్‌లాల్ నెహ్రూను రెండవ సత్యాగ్రాహిగా ప్రకటించాడు.
👉🏻ఆంధ్రాలో వావిలాల గోపాలకృష్ణయ్య వ్యక్తిగత సత్యాగ్రహం చేపట్టాడు.
క్రిప్స్ రాయబారం(1942)
👉🏻రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంలో జర్మన్ హిట్లర్ సంకీర్ణ సేనలను అతిదారుణంగా ఓడించాడు.
👉🏻ఇదే సమయంలో జపాన్ భారతదేశంపై దాడికి సిద్ధంగా ఉంది.
👉🏻ఈ సంఘటనలు అమెరికా మరియు చైనా దేశాలను ఆందోళనకు గురిచేశాయి.
👉🏻యూరప్‌లో హిట్లర్‌ను నియంత్రించడానికి మరియు జపాన్ దాడిని అడ్డుకొనడానికి భారతదేశం మద్దతు కోరవలెనని అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్డ్ మరియు చైనా ప్రధాని ఛాంగై షేకొలు బ్రిటిష్ ప్రధాని “విన్‌స్టన్ చర్చిల్ పై ఒత్తిడిచేశారు.
👉🏻దీనితో చర్చిల్‌కు ఇష్టం లేకపోయినప్పటికీ భారత్ మద్దతు పొందటానికి క్రిప్స్ రాయబారం పంపాడు.. ఇందులో ఈ క్రింది అంశాలు ఉన్నాయి.
1. భారతీయులే భారత రాజ్యాంగాన్ని.రూపొందించుకొనే అవకాశం కల్పించబడును(రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత)
2. రెండవ ప్రపంచ యుద్ధం అంతం అయిన తర్వాత ఇండియాలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకోబడతాయి.
3. జపాన్ దాడిని అడ్డుకొనుట కొరకు బ్రిటిష్ నేతృత్వంలో ఒక యుద్ధమండలి ఏర్పాటు.
👉🏻గాంధీ క్రిప్స్ రాయబారాన్ని తిరస్కరించి క్రింది విధంగా పేర్కొన్నాడు.
ముందస్తు తేదీ వేసిన చెక్కు(A Post Date Cheque).
👉🏻జవహర్‌లాల్ నెహ్రూ పై పదాలకు క్రింది పదాలను చేర్చాడు.
“దివాలా తీసిన బ్యాంకులో(On A Crashing Bank )"
క్విట్ ఇండియా ఉద్యమం (1942)
👉🏻క్రిప్స్ రాయబారాన్ని తిరస్కరించిన తరువాత ఇండియాలో బ్రిటిష్‌కు వ్యతిరేకంగా చివరి మహత్తర ఉద్యమాన్ని చేపట్టాలని గాంధీ నిర్ణయించాడు.👉🏻ఈ మహత్తర ఉద్యమానికి “క్విట్ ఇండియా” అని పేరు పెట్టాడు. (జపాన్ భారతదేశంపై దాడిచేయుటకు సిద్ధంగా ఉండుటచే ఈ పేరు పెట్టాడు)
👉🏻1942 ఆగస్టు 8న బాంబేలోని 'గవాలియా ట్యాంక్' నుండి క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమయింది.
👉🏻క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభాన్ని ఆగస్టు తీర్మానం (లేదా) వార్దా తీర్మానం అంటారు.
👉🏻క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన వెంటనే భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు అందరూ అరెస్ట్ చేయబడ్డారు.
👉🏻గాంధీని 'ఆగాఖాన్ ప్యాలెస్'లో గృహనిర్బంధం చేశారు
👉🏻దీనితో క్విట్ ఇండియా ఉద్యమం నాయకుడు లేని ఉద్యమంగా మారింది.
👉🏻కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీకి చెందిన రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ, ఆచార్య నరేంద్రదేవ్ మొదలగువారు క్విట్ ఇండియా ఉద్యమవ్యాప్తిలో కీలకపాత్ర పోషించారు.
👉🏻అరుణా అసఫ్ అలీ భారత్ అంతా పర్యటించి క్విట్ ఇండియా ఉద్యమ వ్యాప్తికి కృషిచేసింది.
👉🏻దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, ఉషా మెహతా, సరోజిని నాయుడు మొదలగు మహిళలు రహస్య కార్యకలాపాల ద్వారా క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యాప్తిచేశారు.
👉🏻ఉషా మెహతా బాంబేలో ఒక రేడియో సర్వీసు ద్వారా ఉద్యమాన్ని వ్యాప్తిచేసి౦ది.
👉🏻క్విట్ ఇండియా ఉద్యమం భారతదేశంలో అత్యంత హింసాత్మకంగా జరిగిన ఉద్యమం.
👉🏻అమెరికా సలహా మేరకు బ్రిటిష్. ప్రభుత్వం గాంధీని గృహ నిర్బంధం నుండి విడుదల చేసింది.
👉🏻భారతదేశంలో తాత్మాలిక ప్రభుత్వ ఏర్పాటు కొరకు మంచి పరిస్థితులను ఏర్పరచుకోవలసిందిగా బ్రిటిష్ వారు భారత జాతీయ కాంగ్రెస్‌కు సూచించారు. దీనితో మంచి పరిస్థితులను ఏర్పరచడానికి జిన్నాతో గాంధీజీ చర్చలు జరిపాడు. కానీ గాంధీ-జిన్నా చర్చలు విఫలమయ్యాయి.
రాజాజీ ప్రణాళిక(1944)
👉🏻ఈ ప్రణాళికలోని ప్రధాన అంశాలు
1. భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. ముస్లిం లీగ్ దీనికి మద్దతు ఇవ్వాలి.
2. దీనికి బదులుగా రెండవ ప్రపంచ యుద్ధం అంతమైన తరువాత ముస్లిములు అధికంగా ఉన్న ప్రాంతాలలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించబడుతుంది. ఒకవేళ ముస్లింలు వేరుగా ఉంటామని తమ నిర్ణయాన్ని తెలియజేస్తే వారికి స్వయంప్రతిపత్తి కల్పించబడుతుంది.
భారత జాతీయ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ రాజాజీ ప్రణాళికను తిరస్కరించాయి. కానీ గాంధీ రాజాజీ ప్రణాళికకు మద్దతు ప్రకటించాడు.
వేవెల్ ప్రణాళిక (లేదా) సిమ్లా ప్రణాళిక(1945)
👉🏻భారత జాతీయ కాంగ్రెస్, ముస్లింలీగ్ మధ్య సయోధ్య సాధించడానికి మరియు తాత్కాలిక ప్రభుత్వ చర్చ జరుపుటకు అప్పటి గవర్నర్ జనరల్ వేవెల్ సిమ్లాలో ఒక సమావేశాన్ని నిర్వహించాడు.
👉🏻ఈ సమావేశానికి భారత జాతీయ కాంగ్రెస్ తరపున మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పాల్గొనగా ముస్లిం లీగ్ తరపున జిన్నా పాల్గొన్నాడు.
👉🏻వేవెల్ తన ప్రణాళికలో హిందువులకు, ముస్లింలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాడు.
👉🏻ముస్లింలు కేవలం ముస్లింలీగ్ పార్టీ నుంచి మాత్రమే పాల్గొనాలని జిన్నా పట్టుబట్టడంతో వేవెల్ ప్రణాళిక విఫలమయింది.
కేబినెట్ మిషన్ ప్రణాళిక(1946 మార్చి - మే)
👉🏻అప్పటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ అట్లీ(లేబర్ పార్టీ) తన మంత్రివర్గం లేదా కేబినెట్‌లోని మంత్రులను భారతదేశానికి పంపి భారతదేశంలోని స్థానిక పరిస్థితు లను అధ్యయనం చేసి తగిన సూచనలు చేయవలసిందిగా పేర్కొన్నాడు.
👉🏻కేబినెట్ మిషన్ సభ్యులు:
1. పెద్విక్ లారెన్స్ (అధ్యక్షుడు)
2, ఎ.వి. అలెగ్జాండర్
3. స్టాఫర్డ్ క్రిప్స్
👉🏻1946 మేలో కేబినెట్ మిషన్ సిమ్లాలో తన ప్రణాళికను ప్రకటించింది.
1. తక్షణమే భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలి
2. రాజ్యాంగాన్ని రచించడానికి రాజ్యాంగ వరిషత్ ఏర్పాటుచేయాలి.
3. భారతదేశంలో రాష్ట్రాలు ఎ,బి,సి అని గ్రూపులుగా విభజించబడతాయి(ఇది అమలులోకి రాలేదు)
ప్రత్యక్ష చర్య(1946 ఆగస్టు 6)
👉🏻1946 జులైలో జిన్నా గవర్నర్ జనరల్ వేవెల్‌ను కలుసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరాడు. కానీ భారత జాతీయ కాంగ్రెస్ లేకుండా ప్రభుత్వ ఏర్పాటు కుదరదని వేవెల్ పేర్కొన్నాడు.
👉🏻1946 ఆగస్ట్ లో భారత జాతీయ కాంగ్రెస్ సుముఖత చూపడంతో వేవెల్ ప్రభుత్వ ఏర్పాటుకు భారత జాతీయ కాంగ్రెస్‌కు అనుమతి ఇచ్చాడు. తక్షణమే దీనిని ఖండిస్తూ ఆగస్టు 16వ తేదీన బంద్ జరగాలని జిన్నా పిలుపునిచ్చాడు.
👉🏻ఈ సందర్భంగా జిన్నా క్రింది నినాదాన్నిఇచ్చాడు.
'లేకర్ రహేంగే పాకిస్తాన్, లద్‌కర్ లేయింగే పాకిస్తాన్'
👉🏻1946 ఆగస్టు 16వ తేదీన ముస్లింలీగ్ ఆధిపత్యం ఉన్న ప్రాంతాలలో మాత్రమే బంద్ జరిగింది.
👉🏻ఆగస్టు 16వ తేదీన కలకత్తాలో రెండు వర్గాల మధ్య జరిగిన చిన్న గొడవ మతకల్లోలంగా మారి బెంగాల్, పంజాబ్‌లతో పాటు ఉత్తర భారతదేశం అంతా వ్యాపించింది.
👉🏻ఈ ఒక్కరోజులో జరిగిన మత కల్లోహల్లో ఇరువర్గాలకు చెందిన
👉🏻అనేక వేలమంది అమాయక ప్రజలు మరణించారు. దీనినే Direct Action Day గా పేర్కొంటారు.
👉🏻1946 సెప్టెంబర్‌లో భారత జాతీయ కాంగ్రెస్ జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
👉🏻1946 అక్టోబర్‌లో ముస్లింలీగ్ ఈ ప్రభుత్వంలో చేరింది. ముస్లింలీగ్‌కు చెందిన “లియాఖత్ ఆలీఖాన్” కొంతకాలం ఈ తాత్కాలిక ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేసాడు.
👉🏻1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగింది.
మౌంట్‌బాటన్ ప్రణాళిక(1947 జూన్ 3):
•1947 ఫిబ్రవరి 20న బ్రిటిష్ ప్రధాని అట్లీ క్రింది ప్రకటన చేశాడు.
• "1948 జూన్ 30 లోపు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వబడుతుంది"
•ఈ ప్రక్రియని పూర్తిచేయడానికి లార్డ్ మౌంట్‌బాటన్ చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్‌గా పంపబడ్డాడు.
•1947 మార్చిలో మౌంట్ బాటన్ భారతదేశానికి గవర్నర్ జనరల్‌గా వచ్చాడు. మొదటిగా అఖండ భారతదేశాన్ని ఏర్పాటుచేయాలని ఇతడు ప్రయత్నించాడు. కానీ స్థానిక పరిస్థితులను గమనించిన తరువాత భారత్‌ను రెండుగా విభజించాలని నిర్ణయించాడు.
•వి.పి మీనన్, ముఖర్జీ అనే అధికారుల సహాయంతో మౌంట్ బాటన్ భారతదేశ స్వాతంత్ర్యం మరియు విభజన ప్రణాళిక రూపొందించి బ్రిటన్‌కు పంపాడు.
•1947 జూన్ 8న లార్డ్ అట్లీ మౌంట్ బాటన్ ప్రణాళికను బ్రిటిష్ పార్లమెంట్‌లో చదివాడు. అందువల్లనే మౌంట్ బాటన్ ప్రణాళికను జూన్ 3 ప్రణాళిక అని కూడా అంటారు. ఈ ప్రణాళికను 'డిక్కీబర్డ్ ప్రణాళిక' అని కూడా అంటారు.
•జూన్ 3 ప్రణాళికలో ప్రధానాంశాలు:
1. 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినం ఈ రోజు రెండు స్వతంత్ర్య దేశాలు ఏర్పడతాయి.
ఎ) ఇండియా
బి) 'పాకిస్తాన్
2. ఇండియా మరియు పాక్ మధ్య సరిహద్దు నిర్ణయించుటకు రాడ్ క్లిప్ కమిటీ ఏర్పాటు చేయబడుతుంది.
3. బెంగాల్ మరియు పంజాబ్‌లలో హిందువులు మరియు ముస్లింలు ఉన్న ప్రాంతాలలో వేర్వేరుగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించబడుతుంది. ఆ ప్రాంత ప్రజలు ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుంది. (తూర్పు బెంగాల్ మరియు పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్‌లో విలీనం కాగా, పశ్చిమ బెంగాల్ మరియు తూర్పు పంజాబ్ ఇండియాలో విలీనం అయ్యాయి)
4. సింధ్ అసెంబ్లీ తన నిర్ణయం తీసుకుంటుంది (సింధ్ పాక్‌లో విలీనం)
5. బెలూచిస్తాన్ ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. (పాకిస్తాన్‌లో ఉండుటకు నిర్ణయం)
6. సంస్థానాలు భారత్ లేదా పాకిస్తాన్‌లో విలీనం అవ్వాలి. వీటికి స్వతంత్ర్య హోదా కల్పించబడదు. (భారత స్వాతంత్ర్య చట్టం ప్రకారం సంస్థానాలకు స్వతంత్రంగా ఉండే అవకాశం కల్పించబడింది.)
•బ్రిటిష్ పార్లమెంట్ మౌంట్ బాటన్ ప్రణాళికను భారత స్వాతంత్ర్య చట్టంగా మార్చి తన ఆమోదాన్ని తెలియజేసింది.
•1947 జులై 18న అప్పటి బ్రిటిష్ చక్రవర్తి జార్డ్ -IV భారత స్వాతంత్ర్య చట్టానికి రాచరికపు ఆమోదాన్ని (Royal Assent ) ఇచ్చాడు.
•దీనితో 1947 ఆగస్టు 14న పాకిస్తాన్, 1947 ఆగస్టు 15న ఇండియా స్వాతంత్ర్యం పొందాయి.
•1947 ఆగస్టు 15 నుండి 1950 జనవరి 26 వరకు 6వ జార్జ్ భారతదేశంలో King of UK and India అనే హోదాలో కొనసాగాడు.
•1947 ఆగస్టు 14 నుండి 1952 ఫిబ్రవరి వరకు 6వ జార్జ్ పాకిస్తాన్‌కు King of UK and Pakistan అనే హోదాలో కొనసాగాడు.
•1952 ఫిబ్రవరిలో జార్జ్మరణానంతరం ఆయన పెద్ద కుమార్తె రెండవ ఎలిజబెత్ పాక్‌లో Queen of UK and Pak అనే హోదాలో కొనసాగింది.
•భారతదేశ మొదటి ప్రధాని - జవహర్‌లాల్ నెహ్రు (ఆగస్టు 15వ తేదీన మౌంట్ బాటన్ జవహర్‌లాల్ నెహ్రూను ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించాడు)
•స్వతంత్ర్య భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ - మౌంట్ బాటన్
•భారతదేశ చిట్టచివరి గవర్నర్ జనరల్ - రాజగోపాలాచారి
•స్వతంత్ర్య భారతదేశ తొలి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ మరియు ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ - రాజాజీ
•భారత రాజధాని - న్యూఢిల్లీ
•పాక్ మొదటి ప్రధాని - లియాకత్ ఆలీఖాన్
•పాక్ గవర్నర్ జనరల్ - మహ్మద్ ఆలీ జిన్నా
•పాక్ రాజధాని - కరాచీ( తరువాత ఇస్లామాబాద్‌కు మార్చబడింది.)
భారతదేశ ఏకీకరణ
భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చినపుడు 562 సంస్థానాలు ఉడేవి. వీటిలో నాలుగు మినహాయించి మిగతా సంస్థానాలు భారత్ లేదా పాకిస్థాన్‌లో విలీనమయ్యాయి. విలీనం కాని నాలుగు సంస్థానాలు1. హైదరాబాద్
2, ట్రావెన్‌కోర్
3. జునాఘద్
4 కాశ్మీర్
•భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చినప్పటికీ ఫ్రెంచ్ వారి ఆధీనంలో పాండిచ్చేరి, పోర్చ్‌గీస్ వారి ఆధీనంలో గోవా డామన్ మరియు డయ్యూలు ఉండేవి.
•ఈ ప్రాంతాలు క్రిందివిధంగా భారతదేశంలో విలీనమయ్యాయి
ట్రావెన్‌కోర్ విలీనం (కేరళ)
•ట్రావెన్‌కోర్ విలీనం (కేరళ)
•కులశేఖర వంశస్తులు ట్రావెన్‌కోర్‌ను పాలించారు.
•దీని పాలకుడు బలరాం వర్మ ఇతని ప్రధాని సి.పి రామస్వామి అయ్యర్.
•ట్రావెన్‌కోర్ ఎటువంటి షరతులు పెట్టకుండా భారతదేశంలో విలీనమైంది.
హైదరాబాద్ విలీనం
•హైదరాబాద్‌ను అసఫ్ జాహీ పాలకులు పాలించారు.
•7వ నిజాంగా పిలువబడే మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ హైదరాబాద్‌కు పాలకుడిగా ఉన్నపుడు హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయ్యింది.
•ఇతని ప్రధానమంత్రి లాయక్ ఆలీ.
•1948 సెప్టెంబర్ 13-17 మధ్య మేజర్ జనరల్ చౌదరి నేతృత్వంలో “ఆపరేషన్ పోలో” జరిగింది.
•1948 సెప్టెంబర్ 17న ఉస్మాన్ ఆలీఖాన్ లొంగిపోతున్నట్లు ప్రకటించి హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేశాడు.
జునాఘద్ విలీనం(గుజరాత్)
•దీని పాలకుడు - మొహమ్మద్ మహబత్‌కాన్ జీ III
•ఇతని ప్రధాని - షానవాజ్ భుట్టో(బెనజీర్ భుట్టో తాత)
•జునాఘడ్‌లో హిందువులు అధికంగా ఉండేవారు. మహాబత్‌ఖాన్‌జీ తరువాత కాలంలో జునాఘడ్ ను పాకిస్తాన్‌లో విలీనం చేయడానికి ప్రయత్నించాడు.
•ఈ విషయాన్ని తెలుసుకొన్న భారత సైన్యం జునాఘడ్‌ను ముట్టడించి ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకొని ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది.
•జునాఘడ్ ప్రజలు భారతదేశంలో ఉంటామని తమ అభిప్రాయాన్ని తెలియజేయడంతో జునాఘడ్ భారతదేశంలో విలీనం అయింది.
కాశ్మీర్ విలీనం
•దీని పాలకుడు హర్‌సింగ్.
•గతంలో మహారాజా రంజిత్ సింగ్ కాశ్మీర్ ను ఆక్రమించి కొంతకాలం పాలించాడు.
•మహారాజా రంజిత్‌సింగ్ మరణానంతరం పంజాబ్ బలహీనమయింది.
•1844-1846 మధ్యకాలంలో మొదటి ఆంగ్లో-సిఖ్ యుద్ధం జరిగింది. పంజాబ్ ఈ యుద్ధంలో పరాజయం పాలై 1846లో లాహోర్ ఒప్పందం కుదుర్చుకొని బ్రిటిష్ వారికి అనేక ప్రాంతాలను యుద్ధ నష్టపరిహారంగా ఇచ్చింది. వీటిలో కాశ్మీర్ ఒకటి.
•బ్రిటిష్ వారు ఈ కాశ్మీర్ ను రూ. 50లక్షలకు 'గులాబ్ సింగ్'కు అమ్మారు.
•హర్‌సింగ్ గులాబ్‌సింగ్ సంతతికి చెందినవాడు.
•1947 నంవత్సరంలో పాకిస్తాన్ అఫ్ఘాన్ పఠాన్ల సహాయంతో హర్‌సింగ్ యొక్క కాశ్మీర్ లోకి చొరబడి సుమారు 80% కాశ్మీర్‌ను ఆక్రమించింది.
•దీనితో హర్‌సింగ్ ఢిల్లీ చేరుకొని జవహర్‌లాల్ నెహ్రూ సహాయాన్ని అర్ధించాడు.
•Treaty of Accessation పై సంతకం చేసి కాశ్మీర్ ను భారతదేశంలో విలీనం చేస్తే సహాయం చేయగలనని జవహర్‌లాల్ నెహ్రూ పేర్కొన్నాడు.
•హర్‌సింగ్‌ను. రాజ్ ప్రముఖ్‌ను చేసి కాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తానని జవహర్‌లాల్ నెహ్రూ పేర్కొన్నాడు. (దీని ప్రకారం ఆర్టికల్ 370 రూపొందించడబడింది)
•దీనితో హర్‌సింగ్ Treaty of Accessation పై సంతకం చేశాడు.
•ఫలితంగా కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అయింది.
•అప్పుడు భారత సైన్యం పాకిస్తాన్ సైనికులను వెనక్కు పంపడం ప్రారంభించింది. ప్రస్తుత LOC (ప్రస్తుతం పుంచ్) (Line of Control ) వద్ద భారత సైన్యం చేరుకొన్నప్రుడు అది పూర్తి తరహా యుద్ధంగా మారింది.
•ప్రాణనష్టం, ఆస్తి నష్టం అధికంగా ఉండడంతో ఈ యుద్దాన్ని నిలిపివేయవలసిందిగా కోరుతూ జవహర్‌లాల్ నెహ్రూ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు.
•తక్షణమే ఐరాస రెండు తీర్మానాలు చేసింది.
1. యధాతధస్థితిను పాటించుట
2. ఒక సంవత్సరంలోపు భారత్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్‌లో మరియు పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాళ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించాలి.
•అప్పటి నుండి వాయువ్య కాశ్మీర్ (30% కాశ్మీర్) పాకిస్తాన్ ఆధీనంలో ఉండిపోయింది.
•దీనినే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌గా పేర్కొంటారు.
పాండిచ్చేరి
•1760 వందవాసి యుద్ధం తరువాత (ఫెంచ్ వారు తమ ఆధివత్యాన్ని కోల్పోయి పాండిచ్చేరికి పరిమితం అయ్యారు.
•1954లో ఒక ఒప్పందం ప్రకారం ఫ్రెంచ్ ప్రభుత్వం పాండిచ్చేరిని భారత ప్రభుత్వానికి అప్పగించింది.
•పాండిచ్చేరి అనగా నాలుగు ప్రాంతాలు
1. పాండిచ్చేరి(తమిళనాడు)
2. కరైకల్ (తమిళనాడు)
3. యానాం(ఆంధ్రప్రదేశ్)
4. మాహే(కేరళ)
గోవా, డామన్ డయ్యూ
•1661లో పోర్చుగీసు యువరాణి కాథరిన్ బ్రిగాంజా మరియు బ్రిటిష్ యువరాజు రెండవ చార్లెస్ మధ్య వివాహం జరిగింది.
•ఈ వివాహ సందర్భంగా పోర్చ్‌గీసు వారు బాంబే లేదా సెయింట్ డేవిడ్‌ను రెండవ చార్తెస్‌కు కట్నంగా ఇచ్చారు.
•అప్పటి నుండి బ్రిటిష్ మరియు పోర్చుగీసు మధ్య మంచి సంబంధాలు ఏర్పడి పోర్చుగీసు వారు గోవా, డామన్ డయ్యూ ప్రాంతాలకు పరిమితమయ్యారు.
•1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చిన తరువాత గోవా, డామన్, డయ్యూలను తమకు అవ్చగించవలసిందిగా భారత ప్రభుత్వం పోర్చుగీసు వారిని అనేకసార్లు విజ్ఞప్తి చేసింది.
•వీటిని తిరస్కరించడంతో అహింసా మార్గంలో సత్యాగ్రహాలు చేపట్టి ఈ ప్రాంతాలను పొందవలెనని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
•1961 డిసెంబర్‌లో శాంతియుతంగా ఊరేగింపు నిర్వహిస్తున్న సత్యాగ్రాహిలపై పోర్చుగీసువారు కాల్పులు జరిపారు.
•ఈ కాల్పుల్లో కొంతమంది మరణించారు. దీనితో భారత ప్రభుత్వం మేజర్ జనరల్ కాండేత్ నేతృత్వంలో సైన్యాన్ని గోవాకు పంపింది.
•1961 డిసెంబర్‌లో మేజర్ జనరల్ కాండేత్ నేతృత్వంలో “ఆపరేషన్ విజయ్” జరిగింది.
•దీనితో గోవా, డామన్ డయ్యూలు భారత్‌లో విలీనమయ్యాయి.
No comments:
Post a Comment