జాతీయోద్యమం - విప్లవాత్మక తీవ్రవాదులు (1897-1931) - GNANA SAMHITHA

Breaking

Post Top Ad

Thursday, March 20, 2025

జాతీయోద్యమం - విప్లవాత్మక తీవ్రవాదులు (1897-1931)

లక్ష్యం:
👉🏻వివ్లవాత్మక తీవ్రవాదుల యొక్క ఏకైక లక్ష్యం ఆంగ్లేయులను భారతదేశం నుంచి తరిమివేయుట.

పద్దతులు:
👉🏻విదేశాల సహాయంతో ఆంగ్లేయులను తరిమివేయుటకు ప్రయత్నించుట
👉🏻తప్పు చేసిన ఆంగ్లేయులను దండించుట/ శిక్షించుట
👉🏻రష్యా యొక్క నిహిలిస్ట్‌ (సైనికదళం), ఐర్లాండ్‌ యొక్క సిన్‌ఫెన్‌ (సైనికదళం) సైనికుల్లా బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయుట.
👉🏻రహస్య సంస్థలను ఏర్పాటు చేయుట
👉🏻పత్రికలు స్థాపించుట (భవానీ మందిర్‌, వర్తమాన రణనీతి, కోల్‌ యుగాంతర్‌ మొ|| )
👉🏻పుస్తకాలు
👉🏻కాళీమాత ఎదుట ప్రతిజ్ఞ చేయుట
👉🏻విప్లవాత్మక తీవ్రవాదాన్ని భారతదేశంలో 2 దశలుగా వర్గీకరించవచ్చు. అవి
1) 1897-1919
2) 1919-1931

మొదటి దశ (1897-1919) :

1897:
                చాపేకర్‌ సోదరులు(బాలకృష్ణ, దామోదర్‌) ప్లేగ్‌ కమిషన్‌ చైర్మన్‌ రాండ్‌, అతని అంగరక్షకుడు లెప్టినెంట్‌ ఐరెస్ట్‌ను హత్య చేశారు. (చాపేకర్‌ సోదరులు 1893లో హిందూ ధర్మ సంరక్షిణి సభను ఏర్పాటు చేశారు)

1907:
                కొంతమంది విప్లవాత్మక తీవ్రవాదులు బెంగాల్‌ గవర్నర్‌ను హత్య చేయుటకు ప్రయత్నించారు. కానీ విపలమైనారు (ట్రైయిన్‌లో బాంబ్‌ పేల్చుట ద్వారా)

1908:
                ప్రపుల్లాచాకీ, కుడీరామ్‌ బోస్‌ (15 సం॥ల వయస్సు) ముజాఫరాపూర్‌ జడ్జి కింగ్స్‌ ఫోర్ట్‌ను హత్య చేయుటకు ప్రయత్నించారు. కానీ ఇద్దరు మహిళలు మరణించారు. దీంతో ప్రపుల్లాచాకీ తనకు తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుడీరామ్‌బోస్‌ను ఉరి తీశారు.

1909:
                అభినవ్‌ భారత్‌ సొసైటీకి చెందిన అనంతలక్ష్మణ్‌ కార్కారే నాసిక్‌ జడ్జి అయిన జాక్సన్‌ (స్టీఫెన్‌సన్‌)ను ఔరంగాబాద్‌ వద్ద హత్య చేశాడు. దీనిని నాసిక్‌ కుట్ర అంటారు ( ఈ కేసులో ప్రధాన నిందితుడు -వి.డి.సావర్కర్‌) జాక్సన్‌ తిలక్‌కు 6 సం॥ల జైలుశిక్ష విధించినవాడు.

1911:
                దక్షిణ భారతదేశంలో ఏకైక తీవ్రవాద సంస్థ అయిన భారతమాత అసోసియేషన్‌ను నీలకంఠ బ్రహ్మచారి, వంఛీ అయ్యర్‌లు స్థాపించారు. వంచీ అయ్యర్‌ తిరునల్వేలి (తమిళనాడు) న్యాయమూర్తి ఆష్‌ను హత్య చేశాడు. వంచీ అయ్యర్‌ తరఫున టంగుటూరి ప్రకాశం వాదించాడు.

1912:
                రాజ్‌బిహారీ ఘోష్‌ సచిన్‌ సన్యాల్‌లు గవర్నర్‌ జనరల్‌ 2వ హార్టింజ్‌ను ఢిల్లీలోని చాందినీ చౌక్‌ వద్ద హత్య చేయుటకు ప్రయత్నించారు. కానీ విఫలమైనారు. రాజ్‌ బిహారీ ఘోష్‌ జపాన్‌కు పారిపోయాడు. తర్వాత కాలంలో సచిన్‌ సన్యాల్‌ హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశాడు. (ఈ హత్యా ప్రయత్నం రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చిన సందర్భంగా జరిగే ఉత్సవాలలో జరిగింది) 20వ శతాబ్ధ ఆరంభంలో విప్లవాత్మక తీవ్రవాదాన్ని అనేక వార్తాపత్రికలు బహిరంగంగా ప్రోత్సహించాయి.

     పత్రిక పేరు                    స్థాపకుడు

1 కోల్‌                              -పరంజీత్‌  (మహారాష్ట్రలో)
2 సంధ్య                           -బ్రహ్మబందోప్‌ ఉపాధ్యాయ (బెంగాల్‌లో)
3 యుగాంతర్‌                   -భూపేంద్రదత్త (బెంగాల్‌)
4 అమృత్‌బజార్‌                -సుశీల్‌కుమార్‌ ఘోష్‌ (బెంగాల్‌)
5 భవానీ మందిర్‌              -భరీంద్రకుమార్‌ ఘోష్‌(బెంగాల్)‌
6 వర్తమాన రననీతి            -భరీంద్రకుమార్‌ ఘోష్‌(బెంగాల్‌)
7 సర్క్యులర్‌-ఇ-ఆజాదీ        -రామనాథ పూరీ
8 జగత్‌మిత్ర, జగత్‌ప్రేమ       -ఎస్‌. ఎస్‌. గంగూలీ
9 డాన్‌ సొసైటీ                     -సతీష్‌ ముఖర్జీ
10 జమిందార్‌                     -జాఫర్‌ అలీఖాన్‌

 

ఇతర తీవ్రవాద సంస్థలు:
1) కలకత్తా అనుశీలన సమితి

  • దీనిని స్థాపించింది- భరీంద్ర కుమార్‌ ఘోష్‌ ప్రమోద్‌మిత్ర
  • దీనిలో అత్యధికంగా మహిళలు పాల్గొన్నారు.

2) డాకా అనుశీలన సమితి

  • దీనిని స్థాపించినది పులిని బీహారీదాస్‌

3) ఇతర సంస్థలు

  • కమగార్‌ హితవర్ధక్‌ సభ-ఎస్‌.కె.బోస్‌
  • స్వదేశీ సేవక్‌ హోమ్‌-జి.డి.కుమార్‌
  • హిందూ మేళా-రాజానారయణ్‌, నవగోపాల్‌మిత్ర


రెండవ దశ (1919-1981) :

  • 1919 జలియన్‌వాలాబాగ్‌ సంఘటన తర్వాత భారతదేశంలో విప్లవాత్మక తీవ్రవాదం తీవ్ర రూపమును దాల్చింది.
  • 1924 - సచిన్‌ సన్యాల్‌, జోగేష్‌ ఛటర్జీ, రాంప్రసాద్‌ బిస్మిల్,‌ సబీంద్రనాథ్‌ భక్షిలు కాన్పూర్‌ వద్ద HRAను స్థాపించారు.
  • 1925 ఆగస్టు 9 (కాకోరికుట్ర)- HRA సభ్యులు అయిన రామ్‌ప్రసాద్‌ బిస్మిల్‌, రాజేంద్ర సహారి, రోషన్‌సింగ్‌, అష్ఫకుల్లాలు బ్రిటీష్‌ రైల్వే సొమ్మును కాకోరి ప్రాంతం (ఉత్తరప్రదేశ్‌) వద్ద దోచుకున్నారు. తర్వాత నలుగురూ అరెస్ట్‌ చేయబడి ఉరి తీయబడ్డారు.
  • రామ్‌ప్రసాద్‌ ఉరికంబంపై “బ్రిటీష్‌ సామ్రాజ్య పతనాన్ని నేను కోరుతున్నాను” అని పలికాడు. ఇతను మెయిన్‌పురి కుట్ర(1918)లో కూడా పాల్గొన్నాడు.
  • రామ్‌ప్రసాద్‌ బిస్మిల్‌ How Did America Win the Freedom అనే పుస్తకాన్ని రచించారు.
  • రామ్‌ప్రసాద్‌ బిస్మిల్‌ A Message to Countrymen అనే వ్యాసాన్ని రచించాడు.
  • ఇతని కలం పేర్లు -రామ్‌, బిస్మిల్‌, అగ్యాత్‌
  • ఇతను మైత్రివేది, శివాజీ సమితి అనే సంస్థలను స్థాపించాడు.
  • ఇతని ప్రాణ స్నేహితుడు అష్ఫకుల్లాఖాన్‌. అష్ఫకుల్లాఖాన్‌ కూడా ఒక కవి
  • ఇతని కలం పేర్లు : హస్రత్‌, వార్సి.
  • భారతదేశ స్వాతంత్రం కొరకు ప్రాణాలు అర్పించిన ఒక నిస్వార్ధ పోరాటవీరుడు.
  • ఇతను భగత్‌సింగ్‌కు స్ఫూర్తినిచ్చాడు. ఉరికంబాన్ని లేదా చావుని తన భార్యగా స్వీకరించాడు.
  • ఇతను ఉరిశిక్ష అమలుపరిచేముందు ఇలా పలికాడు 'నేను భారతదేశాన్ని స్వేచ్భారాజ్యంగా చేయవలెనని తలచాను. ఈ ప్రయత్నం నా చావుతో ముగియదు'.
  • 1927 డిసెంబర్‌ 19న రాంప్రసాద్‌ బిస్మిల్‌, అష్ఫకుల్లాఖాన్‌లను ఒకేరోజున ఒకే సమయంలో వేర్వేరు జైళ్లలో ఉరితీశారు. రాంప్రసాద్‌ బిస్మిల్‌ను గోరఖ్‌పూర్‌లో, అష్ఫకుల్లా ఖాన్‌ను ఫైజాబాద్‌లో ఉరితీశారు.
  • 1928-లాహోర్‌ కుట్ర: భగత్‌సింగ్‌, రాజ్‌గురు, చంద్రశేఖర్‌ ఆజాద్‌లు లాహోర్‌ ఏసీపీ శాందర్స్‌ను హత్య చేశారు.
  • 1929 ఏప్రిల్‌ 8: ఢిల్లీలోని సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీపై భగత్‌సింగ్‌, బాతుకేశ్వర్‌ దత్‌(బి.కె.దత్‌)లు దాడి చేశారు. ఈ సమయంలో సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీలో రెండు బిల్లులు ఆమోదం కొరకు ప్రవేశపెట్టబడ్డాయి.

1) ట్రేడ్‌ డిస్ప్యూట్‌ బిల్లు
2) పబ్లిక్‌ సేప్టీ బిల్లు

  • ఈ బిల్లులు కమ్యూనిస్టులను అణచివేయుటకు, స్ప్రాట్ అనే బ్రిటీష్‌ కమ్యూనిస్టు నాయకుడిని భారతదేశం నుండి ఇంగ్లండ్‌కు పంపుటకొరకు ప్రవేశపెట్టబడ్డాయి.
  • 1929: జతిన్‌దాస్‌/జతీంద్రనాథ్‌ దాస్‌ లాహోర్‌ జైలు సంస్కరణల కొరకు 62 రోజులు నిరాహారదీక్ష చేసి 63వ రోజున మరణించారు.
  • 1930: సూర్యాసేన్‌ చిట్టగాంగ్‌లో బ్రిటీషుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఇతను 10-15 సం॥ల పిల్లలతోఇండియన్‌ రిపబ్లికన్‌ ఆర్మీ అనే సైనిక దళాన్ని ఏర్పాటుచేశాడు. ఈ దళంతో చిటగాంగ్‌లోని ఆయుధ కర్మాగారం, ఆఫీసర్స్‌ క్లబ్‌, టెలికమ్యూనికేషన్స్‌ స్థావరాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. దీనినే చిట్టగాంగ్‌ కుట్ర అంటారు. బ్రిటీష్‌ వారు ఈ తిరుగుబాటును అతి దారుణంగా అణచివేసి సూర్యాసేన్‌ను ఉరి తీశారు. ఇతనికి సహకరించిన మహిళ ప్రీతీలత వడ్దేదార్‌.
  • 1931 ఫిబ్రవరి 27: అలహాబాద్‌లోని ఆల్ఫ్రెడ్ పార్క్‌ వద్ద ఆంగ్లేయులు చంద్రశేఖర్‌ ఆజాద్‌ తివారీను ముట్టడించుట కారణంగా ఆజాద్‌ తనకు తాను కాల్చుకుని మరణించాడు.
  • 1931 మార్చి 28వ తేదీన భగత్‌సింగ్‌, రాజ్‌గురు. సుఖ్‌దేవ్‌లను ఉరి తీశారు.
  • చనిపోయేముందు వారు ముగ్గురు జైలు అధికారికి సంయుక్తంగా ఒక లేఖ రాస్తూ “అనతికాలంలోనే అంతిమ యుద్ధం ప్రారంభం కాగలదు. అది నిర్ణయాత్మకమైనది కాగలదు. ఈ పోరాటంలో మేము పాల్గొన్నందుకు గర్విస్తున్నాం” అని పలికారు.
  • భగత్‌సింగ్‌ రాసిన ఒక పుస్తకం - Why am I an Athiest
  • Philosophy of Bomb  అనే పుస్తకాన్ని భగవతి చరన్‌వొహ్ర రచించాడు.
  • History of Hindu Chemistry ను PC రే రచించాడు.


విదేశాలలో విప్లవాత్మక తీవ్రవాదం :

శ్యామ్‌జీ కృష్ణవర్మ :
•ఇతను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు.
•1905లో లండన్‌లో హోమ్‌ రూల్‌ సొసైటీని స్థాపించాడు. దీనిని ఇండియా హౌస్‌ అని కూడా అంటారు. దీని యొక్క జర్నల్‌ ఇండియన్‌ సోషియాలజిస్ట్‌.
•దీనిలోని ముఖ్యమైన సభ్యులు - వి.డి.సావర్కర్‌, అజిత్‌సింగ్‌, లాలాహర్‌దయాళ్‌ మొదలైనవారు.
•బ్రిటీషు వారి అణచివేత కారణంగా శ్యామ్‌జీ కృష్ణవర్మ ఇండియా హౌస్‌ ప్రధాన కేంద్రాన్ని లండన్‌ నుంచి పారిస్‌కు మార్చాడు.

మదన్‌లాల్‌ ధింగ్రా:
•ఇతను మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదువుటకు లండన్‌కు వచ్చాడు.
•వి.డి.సావర్కర్‌ ప్రభావంతో 1909లో కర్జన్‌ విల్లీ(ఇండియా కౌన్సిల్‌ సలహాదారుడు)ను హత్య చేశాడు.

వి.డి.సావర్కర్‌ (వినాయక దామోదర్‌ సావర్కర్‌):
•బిరుదులు - వీర్‌, యుగపురుష్‌  
•పుస్తకం. - భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం (మరాఠీ)
•సంస్థలు - మిత్రమేళా లేదా అభినవ్‌భారత్‌ సొసైటీ, న్యూ ఇండియా అసోసియేషన్‌ (లండన్‌లో)
•వి.డి.సావర్కర్  ఫెర్లూసన్‌ కళాశాలలో చదువుకున్నాడు. ఇతని గురువు తిలక్‌
•లండన్‌లో ఇండియా హౌస్‌లో సభ్యుడిగా చేరి విప్లవాత్మక తీవ్రవాదం వ్యాప్తి చేయడంలో కీలకపాత్ర పోషించాడు.
•1907 మే 10న 1857 తిరుగుబాటు యొక్క స్వర్ణోత్సవాలను జరపాలని నిర్ణయించాడు. ఈ సందర్భంగా మరాఠీ భాషలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం అనే పుస్తకాన్ని రచించాడు.
•1909 నాసిక్‌ కుట్రలో వి.డి.సావర్కర్‌ ప్రధాన నిందితుడిగా పేర్కొనబడి లండన్‌లో అరెస్ట్‌ చేయబడ్డాడు.
•వివి.డి.సావర్కర్‌ నౌకలో భారత్‌కు పంపబడుచున్నప్పుడు ఇతను ఫ్రాన్స్‌ తీరం వద్ద సముద్రంలో దూకి ఫ్రాన్స్‌ తీరం చేరుకున్నాడు. కానీ ఫ్రెంచ్‌ పోలీసులు ఇతన్ని అరెస్టు చేసి బ్రిటీష్‌కు అప్పగించారు. తర్వాత ఇతన్ని పూర్తిగా •గొలుసులతో బంధించి భారత్‌ తీసుకువచ్చారు.
•నాసిక్‌ కుట్రపై విచారణ జరిగి వి.డి.సావర్కర్కు యావజ్జీవ శిక్ష విధించబడింది.
•1911 నుంచి 1924 మధ్యకాలంలో వి.డి.సావర్కర్ అండమాన్‌ జైలులో నిర్భంధించబడినాడు.
•1924లో క్షమాభిక్ష కోరుతూ వి.డి.సావర్కర్‌ Mercy Petition పెట్టుకోవడంతో విడుదల చేయబడ్డాడు.
•మహారాష్ట్రలో స్థిరపడి ఆల్‌ ఇండియా హిందూ మహాసభలో సభ్యుడిగా చేరాడు.
•1938లో వి.డి.సావర్కర్ ఆల్‌ ఇండియా హిందూ మహాసభ యొక్క అధ్యక్షుడయ్యాడు.
•హిందూవర్గ ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నాడు. హిందూ రాష్ట్ర అనే సిద్ధాంతాన్ని పేర్కొన్నాడు.
•ఇతను గాంధీ హత్య కేసులో 20వ ముద్దాయిగా విచారణ ఎదుర్కొన్నాడు. తర్వాత విడుదల చేయబడ్డాడు.

మేడమ్‌ బికాజీ కామా:
•ఈమె పార్శీ మహిళ
•ఈమె దాదాబాయ్‌ నౌరోజీ వద్ద కార్యదర్శిగా పని చేసింది.
•పారిన్‌ ఇండియా సొసైటీని స్థాపించింది.
•వందేమాతరం అనే పత్రిక ప్రచురించింది.
•1907లో జర్మనీలోని స్టట్‌గార్ట్  వద్ద జరిగిన ఇంటర్నేషనల్‌ సోషలిస్ట్‌ కాన్ఫరెన్స్‌లో భారతదేశ స్వాతంత్ర్య పతాకమును ఎగురవేసింది. దీనిలోని రంగులు ఆకుపచ్చ, పసుపు, ఎరుపు.
•ఈమె తల్వార్‌ పత్రికను మదన్‌లాల్‌ డింగ్రాకు మద్ధతుగా ప్రచురించింది. తర్వాత వీరేంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ తల్వార్‌ అనే పత్రికకు సంపాదకీయం చేశాడు. (ఇతను సరోజినినాయుడు సోదరుడు)


గదర్ పార్టీ:
•గదర్‌ అనగా విప్లవం.
•దీనిని 1913లో లాలాహర్‌దయాళ్‌, సోహాన్‌సింగ్‌ బక్నా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో స్థాపించారు.
•దీని మొట్టమొదటి అధ్యక్షుడు - సోహన్‌సింగ్‌ బక్నా
•దీని అసలు పేరు హింద్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అమెరికా. దీని యొక్క పత్రిక - గదర్‌
•గదర్‌ పత్రిక గురుముఖి, ఉర్దూ భాషలలో ప్రచురణ అయ్యేది.
•గదర్‌ పత్రిక నినాదం “అంగ్రేజీ రాజ్‌క దుష్మన్‌”
•1914లో బాబా గుర్దిత్‌ సింగ్‌ కొంతమంది భారతీయులను గదర్‌ పార్టీలో చేర్చించుటకై కోమగటమారు అనే
నౌకను ఆగ్నేయ ఆసియా నుంచి లీజుకు పొందాడు.
•కోమగటమారు నౌకలోని ఉద్యమకారులందరినీ కెనడా పోలీసులు వాంకోవర్‌ వద్ద (ఉత్తర అమెరికా ఖండం) ఆరెస్ట్‌ చేసి తిరిగి భారత్‌కు పంపారు.
•కలకత్తా దగ్గర బడ్జ్‌ బడ్జ్‌ అనే ప్రాంతమునకు ఈ నౌక చేరుకుంది.
•అమెరికా మొదటి ప్రపంచ యుద్దంలో పాల్గొన్న తర్వాత గదర్‌ పార్టీ కార్యకలాపాలను 1918లో అణచివేసినది (హిందూ కుట్ర ద్వారా).
•గదర్‌ పార్టీలో చేరిన తెలుగువాడు -దర్శి చెంచయ్య

No comments:

Post a Comment

Post Bottom Ad