సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ యుగం" - GNANA SAMHITHA

Breaking

Post Top Ad

Thursday, March 20, 2025

సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ యుగం"

👉🏻19 శతాబ్ధ ఆరంభంలో భారతదేశంలో అనేక మూఢవిశ్వాసాలు, దురాచారాలు ఉండేవి.‌
👉🏻ఉదా: సతీసహగమనం, బాల్యవివాహాలు, విగ్రహారాధన, వితంతు వివాహాలు లేకపోవుట.‌
👉🏻ఈ మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చుటకు చేసిన ఉద్యమాలను సాంఘిక, సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలు అంటారు.‌
👉🏻ఈ ఉద్యమాలను చేపట్టిన మొట్టమొదటి వ్యక్తి - రాజారామ్మోహన్‌రాయ్‌‌

రాజారామ్మోహన్‌రాయ్:

•రాజారామ్మోహన్‌రాయ్‌ బెంగాల్‌లోని రాధా నగరంలో జన్మించాడు. తండ్రి రమాకాంత్‌ రాయ్‌
•1833 సెప్టెంబర్‌ 27న ఇంగ్లాండ్‌లోని బ్రిస్తాల్‌ (స్టేపల్‌టన్‌)లో మరణించాడు.
బిరుదులు :
1) రాజా (మొగలు చక్రవర్తి 2వ అక్బర్‌ ఇచ్చాడు)
2) ఆధునిక భారతదేశ పితామహ
3) పయనీర్‌ ఆఫ్‌ న్యూ ఇండియా
వార్తాపత్రికలు :
1. మిరాత్‌-ఉల్‌-అక్బర్‌ (పర్షియా)
2. సంవాద కౌముది (బెంగాలీ)
3. బంగదూత
పుస్తకాలు:
1. గిఫ్ట్‌ టు మోనోథీయిస్ట్‌ (పర్షియా)
2. Precepts of Jesus
3. Guide to Piece and Happiness
సంస్థలు:
1 ఆత్మీయ సభ (1815)
2 బ్రహ్మసమాజ్‌ (1828) (మొదట్లో దీనిపేరు బ్రహ్మసభ)
•రామ్మోహన్‌రాయ్‌ అత్యధికంగా సతీసహగమనంనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఇతని పోరాట ఫలితంగా బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ విలియం బెంటింగ్‌ 1829లో సతీసహగమన నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టాడు.
•ఇతను ఏకేశ్వరోపాసనను బోధించాడు.
•విగ్రహారాధనను ఖండించాడు.
•మహిళా విద్యను, పాలనలో మహిళలు పాల్గొనుటను, ఆంగ్ల విద్యను ప్రోత్సహించాడు.
•బాల్య వివాహాలను ఖండించాడు
•ఏకేశ్వరోపాసనను ప్రోత్సహించుట కొరకై బ్రహ్మసమాజంలో తరచూ సమావేశాలు జరిగేవి. అందువలనే బ్రహ్మసమాజ్‌ను ఏకభగవానుని సమాజం అంటారు.
•బ్రహ్మ సమాజ్‌కు వ్యతిరేకంగా రాధాకాంత్‌ 'దేబోధర్మసభ' ను 1829లో స్థాపించాడు.
•తన విదేశీ స్నేహితులైన అలెగ్జాండర్ డఫ్ (స్కాటిష్ మిషనరీ సభ్యుడు) డేవిడ్‌ హ్యరే (డచ్‌ వాచీ తయారీదారుడు)లను ప్రోత్సహించి బెంగాల్‌లో అనేక అంగ్ల కళాశాలలను స్థాపించాడు.
ఉదా: 1817-హిందూ కళాశాల, 1825-వేదాంత కళాశాల
•భారత నమాజంలో పాశ్చాత్య భావాలను పెంపొందించుటకు ప్రయత్నించాడు.
•వేదాలు, ఉపనిషత్తులు ఏకేశ్వరోపాసనను గురించి మాత్రమే చెబుతున్నాయని పేర్కొంటూ కొన్ని శ్లోకాలను బెంగాలీలోకి అనువదించి తన వార్తా పత్రికలో ప్రచురించాడు.
•రాజారామ్మోహనరాయ్‌ సామ్రాజ్యవాద వ్యతిరేకి.
ఉదా: 1821లో నేపూల్స్‌ తిరుగుబాటు విఫలమవడంతో తన సమావేశాలను రద్దు చేసుకొని ఒక రోజు ఉపవాసంను పాటించాడు.
•1828లో దక్షిణ అమెరికాలో స్పానిష్‌ తిరుగుబాటు విజయవంతం కావడంతో ప్రజావిందును ఇచ్చాడు. రాజారామ్మోహనరాయ్‌ లండన్‌ను సందర్శించిన మొట్టమొదటి భారతీయుడు.
•ఇతను 12 భాషల కంటే ఎక్కువ భాషలలో ప్రావీణ్యం గలవాడు.

దేవేంద్రనాథ్‌ఠాగూర్‌

•బిరుదు - బ్రహ్మర్షి (ఆంధ్రప్రదేశ్‌లో బ్రహ్మర్షి బిరుదు రఘుపతి వెంకటరత్నంకు కలదు)
•పత్రిక - తత్త్వబోధిని
•పత్రిక (దీనిలో ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్‌, రాజేంద్రలాల్‌మిశ్రాలు వ్యాసాలు రాశారు)
•సంస్థ - తత్వ బోధిని సభ (1839)
•రాజారామ్మోహన్‌రాయ్‌ యొక్క ప్రధాన శిష్యుల్లో దేవేంద్రనాథ్‌ఠాగూర్ ఒకడు.
•రాజారామ్మోహన్‌రాయ్‌ మరణానంతరం దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ బ్రహ్మసమాజ్‌నకు నేతృత్వం వహించాడు.
•బెంగాల్‌లో అనేక బెంగాలీ పాఠశాలలను ఏర్పాటు చేశాడు.


కేశవచంద్రసేన్‌

•వార్తాపత్రికలు - సులభ్‌ సమాచార్‌, New Dispensation
•సంస్థలు - Indian Reform Association, నవవిధాన్‌సభ (New Dispensation), -సంఘత్‌సభ(Believers Association)
•కేశవ్‌చంద్రసేన్‌ వితంతు వివాహాలను ప్రోత్సహించాడు.
•పురోహితుల ఆధిపత్యంను, బాల్య వివాహములను ఖండించాడు.
•బ్రహ్మసమాజ్‌లో చేరి అనేక వితంతు వివాహాలను జరిపించాడు.
•బ్రహ్మసమాజంలో దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌తో కేశవ చంద్రసేన్‌కు వివాదాలు ఏర్పడుటచే బ్రహ్మసమాజ్‌ రెండుగా చీలిపోయింది (1866).
1) ఆది బ్రహ్మసమాజ్‌ (దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ నేతృత్వంలో)
2) బ్రహ్మసమాజ్‌ ఆఫ్‌ ఇండియా (కేశవ చంద్రసేన్‌ నేతృత్వంలో)
•1878లో కేశవ చంద్రసేన్‌ తన 13 సంవత్సరాల కూతురిని కూచ్‌బీవోర్‌ రాజుకు ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ వివాహంలో పురోహితులను ఆహ్వానించి సంప్రదాయబద్దంగా వివాహం జరిపించాడు. దీని కారణంగా (బ్రహ్మసమాజ్‌ ఆఫ్‌ ఇండియా రెండుగా చీలిపోయింది.
1) నియో బ్రహ్మసమాజ్‌ (కేశవ చంద్రసేన్‌ నేతృత్వంలో)
2) సాధారణ (బ్రహ్మనమాజ్‌ (శివానంద శాస్త్రి, ఆనందమోహన్‌బోస్‌ నేతృత్వంలో)
•అంటరానితనంను నివారించుటకు సాధారణ బ్రహ్మసమాజ్‌ “దాస్‌ ఆశ్రమంను స్థాపించినది.
•కేశవ చంద్రసేన్‌ తర్వాత కాలంలో మహిళలకు ఉన్నత విద్య ఉండకూడదని, సమాజంలో పరదా విధానం పూర్తిగా తొలగించకూడదని పేర్కొన్నాడు.


హెన్రీ వివియన్‌ డిరాజియో (1809-31)

•బిరుదు - భారతదేశ మొట్టమొదటి జాతీయ కవి
•వార్తాపత్రిక - ఈస్ట్‌ ఇండియాన్‌, - హెస్పరెస్‌
•ఇతను ఒక గొప్పకవి. భారతదేశంపై అనేక కవితలను రచించాడు.
•బెంగాల్‌లో యువ బెంగాల్‌ ఉద్యమంను ప్రారంభించాడు. కొన్ని లక్షల మంది బెంగాలీలు ఈ ఉద్యమంలో చేరి బెంగాల్‌ సంస్కృతిని వ్యాప్తి చేశారు. సురేంద్రనాథ్‌ బెనర్జీ డిరాజియాను బెంగాల్‌ సంస్కృతిని వ్యాప్తి చేసినందుకుగాను వారిని అత్యధికంగా కొనియాడాడు.
•1881లో తన హేతుబద్ధత కారణంగా బెంగాల్‌ హిందూ కళాశాల నుంచి తొలగించబడ్డాడు. అదే సంవత్సరంలో కలరాతో మరణించాడు.
•ఇతని ముఖ్య శిష్యుడు - ఖాసీ ప్రసాద్‌ ఘోష్‌
•డిరాజియో (ఫ్రెంచి విప్లవం, బ్రిటీష్‌ రచయితలు అయిన జే.ఎస్‌.మిల్‌, జాన్‌లాకీ మొదలగు వారియొక్క రచనలతో ప్రభావితుడైనాడు.


ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌

•బిరుదులు - పండిత్‌, Champion of woman Reformer in India, విద్యాసాగర్‌
•వార్తాపత్రిక - సోమ్‌ప్రకాష్‌ (బెంగాలీ భాషలో)
•పుస్తకం - బహు వివాహ్‌ బెంగాలీ ప్రాథమిక వాచకం (దీన్ని బెంగాల్‌ పాఠశాలలో ఇప్పటికీ బోధిస్తున్నారు.)
•సంస్థ - బెథూన్‌ పాఠశాల (1849లో కలకత్తాలో బాలికల విద్య కొరకు స్థాపించాడు. ఫిలిప్‌ డ్రింక్‌ వాటర్‌ సహకారంతో)
•విద్యాసాగర్‌ అత్యధికంగా వితంతు పునర్వివాహం కొరకు పోరాటం చేశాడు.
•ఇతని పోరాట ఫలితంగా అప్పటి గవర్నర్‌ జనరల్‌ డల్హౌసీ 1856లో వితంతు పునర్వివాహ చట్టంను ప్రవేశపెట్టాడు.
•J. P గ్రాంట్‌ ఈ చట్ట బిల్లును ప్రవేశపెట్టాడు.
•1856 డిసెంబర్‌ 7న విద్యాసాగర్‌ మొట్టమొదటి అధికారిక వితంతు పునర్వివాహమును కలకత్తాలో జరిపించాడు (శ్రీచంద్‌ విద్యారత్న & కాళీమతిదేవి).
•దక్షిణ భారతదేశంలో వీరేశలింగం 1881 డిసెంబర్‌ 11న మొదటి అధికారిక వితంతు పునర్వివాహంను రాజమండ్రిలో జరిపించాడు.(గోకులపాటి శ్రీరాములు, సీతమ్మ)
•బాల్య వివావాములను, బహు భార్యత్వమును ఖండించాడు.
•ఇతను చిన్నప్పటి నుండి అనేక సమస్యలను ఎదుర్కొని విద్యాభ్యాసం చేశాడు.
•35 పాఠశాలలకు ఇన్‌స్పెక్టర్‌గా నియమించబడ్డాడు.
•ఈ 35 పాఠశాలల్లో 12 పాఠశాలలను తన సొంత ఖర్చుతో నడిపించాడు.
•బెంగాల్‌ సంస్కృత కళాశాలకు ప్రిన్సిపాల్‌గా నియమించబడ్డాడు.
•వెనుకబడిన తరగతుల వారిని, మహిళలను విద్యాభ్యాసం కొరకు ఈ కళాశాలకు ఆహ్వానించాడు.


దయానంద సరస్వతి

•అసలు పేరు - మూల శంకర్‌
•బిరుదు : స్వామి
•పుస్తకాలు:
- సత్యార్థ ప్రకాష్‌(వేదాలపై దయా నంద రాసిన భాష్యం)
- వేద భూమిక
- వేద రహస్య
- వేద భాష్య
•సంస్థ - ఆర్యసమాజ్‌ (1875-బొంబాయి), గో రక్షణ సంఘం (1882)
•దయానంద సరస్వతి గుజరాత్‌లోని ఖతియావాడ్‌లో జన్మించినప్పటికీ తన ఉద్యమాన్ని పంజాబ్‌, లాహోర్‌లలో చేశాడు.
•ఇతను చిన్నతనం నుంచి విగ్రహారాధనను ఖండించాడు. ఇతను 12-13 సం॥ల పాటు దేశసంచారం చేశాడు.
•శృంగేరిలో పరమానంద సరస్వతి వద్ద వేదాలను పఠించాడు.
•మధురలో స్వామి విరజానంద యొక్క శిష్యుడిగా మారాడు. విరజానంద సలహా మేరకు మూలశంకర్‌ అనే తన పేరును దయానంద సరస్వతిగా మార్చుకున్నాడు.
•హిందూ మతం ప్రచారం లేకపోవడం కారణంగా హిందూ మతంలో అనేక మూఢ విశ్వాసాలు పుట్టుకొచ్చాయని పేర్కొని శుద్ధమైన హిందూ మతంను ప్రచారం చేయుటకు 1875లో బొంబాయిలో ఆర్య సమాజంను స్థాపించాడు. తర్వాత లాహోర్‌, ఇతర ప్రాంతాలలో అనేక శాఖలు ఏర్పాటు చేయబడ్డాయి.
•హిందూ మతంను శుద్ధి చేయుటకు హిందూ మతం నుండి వేరొక మతంలో చేరిన హిందువులను తిరిగి హిందూ మతంలో చేర్చించుటకై ఆర్య సమాజంలో శుద్ధి మరియు సంఘాట/సంఘం అనే ఉద్యమాలు ఆరంభమయ్యాయి.
•వీటిని మదన్‌మోహన్‌ మాలవ్య ఉత్తరప్రదేశ్‌లో, లాలాలజపతిరాయ్‌ పంజాబ్‌, లాహోర్‌లలో వ్యాప్తి చేశారు.
•దయానంద సరస్వతి మరణానంతరం విద్యాభివృద్ధి కొరకై ఆర్య సమాజ్‌ దయానంద ఆంగ్లో వేదిక్‌(DAV) అనే పాఠశాలలను స్థాపించినది.
•దయానంద ఆంగ్లో వేదిక్‌ పాఠశాలలో వివాదాలు వచ్చి రెండుగా చీలిపోయింది.
1) గురుకుల పాఠశాలలు -హరిద్వార్‌లో గురుదత్త స్థాపించాడు. దీనిని అభివృద్ధి చేసినది లాలామున్నీరామ్‌. ఇతనిని స్వామి శ్రద్ధానంద అంటారు.
2) ఆధునిక పాఠశాలలు - లాహోర్‌లో లాలా హన్సరాజ్‌ స్థాపించాడు.
•దయానంద ఆర్యులు టిబెట్‌ నుంచి వచ్చారని పేర్కొన్నాడు.
•పరిపాలనకు సంబంధించి 'స్వరాజ్య' అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు.
•ఆంగ్లేయుల మంచి పరిపాలన కంటే స్వపరిపాలన ఉత్తమమైనది అని పేర్కొన్నాడు.
•హిందీ జాతీయ భాషగా ప్రకటించబడాలని పేర్కొన్న మొట్టమొదటి వ్యక్తి దయానంద సరస్వతి.


వివేకానంద(నరేంద్రనాథ్‌) (12 జనవరి 1863- 4 జూలై 1902)

•బిరుదులు - స్వామి, కర్మయోగి, హిందూమత ఆధ్యాత్మిక రాయబారి
•ప్రస్తకాలు -Devine Life, ప్రాచ్య పాశ్చాత్య
•సంస్థ - రామకృష్ణ మిషన్‌. 1897లో బెలూర్‌ (బెంగాల్‌) దగ్గర స్థాపించబడినది.
•రామకృష్ణ మిషన్‌ రెండు వార్తాపత్రికలను ప్రచురించినది.
1) ప్రబుద్ధ భారత 2) ఉద్చోధన
•1863 జనవరి 12న సురేంద్రనాథ్‌ దత్త మరియు భువనేశ్వరీ దేవిలకు వివేకానంద జన్మించాడు.
•1886లో ఇతని పేరు వివేకానందగా మారింది.
•1888 పరిప్రజక లేదా సన్యాసి జీవితాన్ని స్వీకరించాడు.
•1893లో అమెరికాలోని చికాగోలో ప్రపంచ సర్వమత గొవృతనాన్ని ప్రపంచానికి తెలియజేశాడు.
•ఇతని ముఖ్యమైన శిష్యురాలు - మార్గరెట్‌ నోబుల్‌ (సిస్టర్‌. నివేదిత)
•ఈమె 1898లో ఐర్లాండ్‌ నుండి భారత దేశానికి వచ్చింది.
•ఈమె తన శేష జీవితాన్ని ఆర్‌.కె.మిషన్‌ ద్వారా ప్రజా సేవకు అంకితం చేసింది.
•వివేకానంద తన రచనల ద్వారా ప్రాచీన భారతదేశ యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు.
•స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో అనేక మంది నాయకులు ఇతని నుంచి స్ఫూర్తిని పొందారు.
•వివేకానంద పిరికితనాన్ని ఖండించారు.
•రామకృష్ణ మిషన్‌ ఉచిత పాఠశాలలను, ఉచిత వైద్యశాలలను, అనాథ శరణాలయాలను గ్రంథాలయాలను, ఆధ్యాత్మిక కేంద్రాలను ఏర్పాటు చేసింది.
•రామకృష్ణ మిషన్‌ కొన్ని వేల శాఖలు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి.
•ఖేత్రిరాజు సలహా మేరకు నరేంద్రనాథ్‌ తన పేరును వివేకానందగా మార్చుకున్నాడు.

రామకృష్ణ పరమహంస:
•అసలు పేరు - గదాధర్‌ ఛటోపాధ్యాయ •కలకత్తా దగ్గర దక్షిణేశ్వర్‌ వద్ద ఒక పేద బ్రాహ్మణ అర్చక కుటుంబంలో జన్మించాడు. ఇతను కాళీమాత భక్తుడు.
•తాను తెలుసుకున్న సత్యమును చిన్న చిన్న కథల ద్వారా ప్రజలకు తెలియజేసేవాడు.
•ప్రపంచంలో అనేక మతాలున్నాయని ప్రతీ మతం యొక్క అంతిమ లక్ష్యం మోక్షం అని పేర్కొన్నాడు. ఈ మోక్షంను సాధించుటకు ఒక్కొక్క మతం ఒక్కొక్క పధ్ధతిని అవలింభిస్తుందని పేర్కొన్నాడు.
•ఇతని ఆరాధ్య దైవం- శారదాదేవి. ఇతని భార్య పేరు కూడా శారదాదేవి.
•ఇతని ప్రధాన శిష్యుడు - వివేకానంద
•ఇతని గురువు - ఈశ్వర్‌పూరీ


బంకించంద్ర ఛటర్జీ :

•బంకించంద్ర ఛటర్జీ తన “ఆనంద్‌ మఠ్‌(1882)” ద్వారా భారతదేశ గొప్పతనాన్ని తెలియజేశారు. ఈ పుస్తకంలోనే భారత జాతీయ గేయం “వందేమాతరం” సంస్కృతంలో రచించబడినది.
•వందేమాతరంను ఆంగ్లంలోకి అనువదించినవారు - అరబిందో ఘోష్‌ (1909 కర్మయోగిన్‌ అనే గ్రంథంలో)
•ఆనందమఠ్‌లో సన్యాసి తిరుగుబాటు గురించి పేర్కోనబడినది.
•ఇతను 'బంగదర్శన్'” అనే జర్నల్‌ను కటక్‌ నుంచి ప్రచురించాడు. భారతదేశ సంస్కృతిని ప్రజలకు తెలియజేశాడు.


వేద సమాజ్‌:

•కె.సి. సేన్‌ కృషి ఫలితంగా మద్రాస్‌లో సుబ్బరాయలుశెట్టి 1864 “వేద సమాజ్‌” అనే ఆస్తిక సభను స్థాపించారు. తర్వాత కాలంలో ఇది దక్షిణ భారత బ్రహ్మ సమాజ్‌గా మారిపోయింది.
•తత్వబోదిని పత్రికను ప్రచురించింది.


ప్రార్థనా సమాజ్‌:

•ప్రార్ధన సమాజ్‌, బ్రహ్మ సమాజ్‌ వల్ల ఉత్తేజితమైంది.
•1867లో డా॥ ఆత్మారాం పాండురంగ నాయకత్వంలో బొంబాయిలో ఈ సమాజ్‌ ప్రారంభమైనది. కేశవచంద్రసేన్‌ ప్రోత్సాహం వల్ల ఈ సంస్థ ఉద్భవించింది.
•ప్రార్ధనా సమాజ్‌ సభ్యులు ఆస్తికవాదులు
•దీనిలో ముఖ్య సభ్యులు ఎం.జి.రనడే, ఆర్‌. జి.భండార్కర్‌, నారాయణ్‌ గణేష్‌ చంద్రవాడ్కర్‌, పండిత రమాబాయి సరస్వతి.
•ఇది “సుబోధ” పత్రికను ప్రారంభించింది.


పండిత రమాబాయి సరస్వతి:

•స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి, బాల్య వివాహాలను వ్యతికేరించడానికి పుణేలో “మహిళా ఆర్య సమాజ్‌”ను స్థాపించింది.
•బొంబాయిలో 'శారదా నదన్' అనే వితంతు గృహాన్ని, పాఠశాలను ప్రారంభించింది. కరువు బాధితులను ఆదుకోవడానికి “ముక్తి సదన్‌”ను ప్రారంభించింది.
•రమాభాయ్‌ రనడే పూన సేవాసదన్‌ స్థాపించింది.


డి.కె.కార్వే:

•ఈయన గొవ్ప విద్యావేత్త.
•1893లో వితంతు వివాహం చేసుకున్నాడు.
•1896లో “హిందూ వితంతు భవనం లేదా విధువ భవన్‌ (Hindu Widow Home)ను ప్రారంభించాడు.
•1916లో భారతీయ మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాడు.
•సాంఘిక సంస్కరణోద్యమానికి కార్వే చేసిన విశిష్ట సేవకు ప్రభుత్వం “భారతరత్న” బిరుదుతో సత్కరించింది.


ఎం. జి.రనడే:

•ఇతన్ని మహారాష్ట్ర సోక్రటీస్‌ అంటారు.
•ఇతను ఇండియన్‌ నేషనల్‌ సోషల్‌ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేశాడు.
•మహారాష్ట్రలో సాంఘికోద్యమానికి మూల పురుషుడు రనడే.
•ఇతను 'సార్వజనికసభ పత్రికలో సామాజిక, ఆర్థిక సమస్యల గురించి వ్యాసాలు రాశాడు.
•1887లో మద్రాసులో ముఖ్యమైన సాంఘిక సమస్యలను చర్చించడానికి, భారత జాతీయ సామాజిక సమావేశాన్ని ప్రారంభించాడు.
•రనడే “పరిశుద్ధి' ఉద్యమాన్ని ప్రారంభించి ఇతర మతస్తులను చేర్చుకోవడమేగాక, నాట్యవృత్తిని, ఖర్చులతో కూడిన ఆడంబర వివాహ వేడుకలను వ్యతిరేకించాడు.
•కార్వేతో కలసి రనడే “స్తీ పునర్వివాహ” ఉద్యమాన్ని నడిపాడు. ఈ ఉద్యమం మరో ఆశయం వితంతువులకు ఉపాధ్యాయినులుగా, నర్సులుగా శిక్షణ ఇచ్చి వారికి స్వయం శక్తిని కల్పించడం.


దివ్యజ్ఞాన సమాజం(థియోసాఫికల్‌ సొసైటీ)

•దీనిని 1875లో హెచ్‌.పి.బ్లాపట్స్కి, హెచ్‌.ఎస్‌. ఆల్కాట్‌ లు అమెరికాలోని న్యూయార్క్‌లో స్థాపించారు.
•దీనిని ప్రధానంగా మూడు ఉద్ధేశాలతో స్థాపించారు
1) విశ్వమానవ సౌభ్రాతృత్వం
2) అన్ని మతాల అంతిమ లక్ష్యం మోక్షం. ఈ మతాల తత్వంను తెలుసుకొనుట కొరకు వాటిని అధ్యయనం చేయాలి.
3) ప్రకృతిలో, మానవునిలోపల ఉండే అంతర్గత శక్తులను పరిశోధన చేయాలి.
•దివ్యజ్ఞాన సమాజం ప్రధాన లక్ష్యము 'మానవసేవ'. ప్రాచీన మతాలైన హిందూ మతం, బౌద్ధ మతం, జుడాయిజం మతాల యొక్క సమ్మేళనం కొరకు ఈ సమాజం ప్రయత్నించినది.
•1879లో దీని ప్రధాన కేంద్రం బొంబాయికి మార్చబడినది.
•కానీ బొంబాయిలో ఖర్చులు అధికంగా ఉండడం వల్ల ప్రధాన కేంద్రం మద్రాన్‌ దగ్గర అడయార్‌కు మార్చబడినది.
•హెచ్‌.పి.బ్లాపట్స్కి మరణానంతరం కల్నల్‌ హెచ్‌.ఎస్‌. ఆల్మాట్‌ దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షుడు అయ్యాడు.
•హెచ్‌.పి.బ్లాపట్స్కి యొక్క “రహస్య సిద్ధాంతం” అనే వ్యాసంను చదివిన అనిబిసెంట్‌ ప్రభావితమై 1889లో దివ్యజ్ఞాన సమాజంలో చేరినది.
•1907లో అనిబిసెంట్‌ దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షురాలు అయింది.
•ఈమె వితంతు వివాహాలను. ప్రోత్సహించింది.
•అనిబిసెంట్‌ మద్రాస్ సంఘ సంస్కరణ సభను ఏర్పాటు చేసినది.
•అనిబిసెంట్‌ భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించినది.
•విద్యాభివృద్ధి కొరకై బెనారస్‌ హిందూ పాఠశాలను, మదనపల్లిలో జాతీయ కళాశాలను(బి.టి. కళాశాల), ఆర్కాట్‌లో ఆర్కాట్‌ పంచమ పాఠశాలను స్టాపించినది.
•అనిబిసెంట్‌ వార్తాపత్రికలు - న్యూఇండియా, కామన్‌వీల్‌
•అనిబిసెంట్‌ అసలు పేరు - అనీవుడ్‌
•ఈమె ఐర్లాండ్‌కు చెందిన మహిళ
•అనిబిసెంట్‌ 1914లో అఖిల భారత కాంగ్రెస్‌లో చేరింది.
•1916లో ఐర్లాండ్‌ తరహాలో భారతదేశంలో హోంరూల్‌ ఉద్యమాన్ని మద్రాస్‌ నుండి ప్రారంభించింది. (దీనికంటే ముందు తిలక్‌ హోంరూల్‌ లీగ్‌ ఉద్యమాన్ని మహారాష్ట్రలో ప్రారంభించాడు. తర్వాత తిలక్‌ యొక్క హోంరూల్‌ లీగ్‌ ఉద్యమం అనిబిసెంట్‌ యొక్క ఆల్‌ ఇండియా హోంరూల్‌ ఉద్యమంలో విలీనం అయినది)
•ఆల్‌ ఇండియా హోంరూల్‌ లీగ్‌ యొక్క మొట్టమొదటి కార్యదర్శి -జార్జ్ అరుండేల్‌
•1916లో లక్నోలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో మితవాదులు, అతివాదులు, ముస్లింలీగ్‌ విలీనం అవడంలో తిలక్‌, జిన్నాలతో పాటు అనిబిసెంట్‌ కూడా కీలకపాత్ర పోషించింది.
•1917లో కలకత్తా కాంగ్రెస్‌ సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్‌కు అనిబిసెంట్‌ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైనది.
•లూసిఫేర్‌ లేదా లిజాఫేర్‌ జర్నల్‌కు ఈమె ఎడిటర్‌.
•అనిబెసెంట్‌ స్థాపించిన బెనారస్‌ హిందూ పాఠశాల మదన్మోహన్ మాలవ్యచే బెనారన్‌ హిందూ విశ్వవిద్యాలయంగా మార్చబడినది.
•అనిబిసెంట్‌ యొక్కదత్తత కుమారుడు - జిడ్డు కృష్ణమూర్తి
•జిడ్డు కృష్ణమూర్తి సిద్ధాంతం - గురువు లేకుండా సత్యంను సాధించుట (Endevour alone in search of truth)
•జిడ్డు కృష్ణమూర్తి పుస్తకం- At the feet of the master

No comments:

Post a Comment

Post Bottom Ad