మొఘల్‌ సామ్రాజ్యం - GNANA SAMHITHA

Breaking

Post Top Ad

Thursday, March 20, 2025

మొఘల్‌ సామ్రాజ్యం

👉🏻మొఘల్‌ సామ్రాజ్యం స్థాపించింది -బాబర్‌
👉🏻ఇతని అసలు పేరు -జహీరుద్దీన్‌ మొహ్మద్‌ బాబర్‌
👉🏻టర్కీ అమిర్‌ల ప్రకారం బాబర్‌ అనగా సింహం
👉🏻ఇతని తండ్రి - మీర్జా ఉమర్‌
👉🏻మీర్జా ఉమర్‌ ఆఫ్ఘనిస్థాన్‌ -ఉబ్జెకిస్తాన్‌లో ఫర్ఘాన పాలకుడు.
👉🏻ఫర్ఘాన రాజధాని - ఆండీజన్‌
👉🏻బాబర్‌ తండ్రి తరపున తైమూర్‌ ఇలాంగ్‌ వంశానికి చెందినవాడు.
👉🏻బాబర్‌ తల్లి తరపున చెంఘీజ్‌ఖాన్‌ వంశానికి చెందినవాడు.
👉🏻బాబర్‌ చాగ్‌తాయి తెగకు చెందినవాడు
👉🏻బాబర్‌ 11 సం॥ల వయస్సులో ఉమర్‌ మీర్బా మరణానంతరం పర్ఘాన పాలకుడయ్యాడు.
👉🏻బాబర్‌ తన మామ కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొనిచివరకు కాబూల్‌లో స్థిరపడ్డాడు.
👉🏻బాబర్‌ మొట్టమొదటిసారిగా 1519లో ఇండియాపై దాడి చేశాడు.
👉🏻బాబర్‌ ఈ మొదటి దాడిలో వాయువ్య భారత్‌లో భీరా ప్రాంతంపై దాడి చేశాడు.
👉🏻బాబర్‌ భీరా వద్ద మొట్టమొదటిసారిగా గన్‌పౌడర్‌ ఉపయోగించాడు.
👉🏻బాబర్‌ యొక్క 5వ దాడిలో పానిపట్టు యుద్ధం జరిగింది.
👉🏻బాబర్‌ భారతదేశంపై దాడి చేస్తున్నప్పుడు భారతదేశంలో పాలకులు
•పంజాబ్‌ - దౌలత్‌ఖాన్‌ లోడీ
•ఢిల్లీ - ఇబ్రహీం లోడీ (పినతండ్రి ఆలంఖాన్‌ లోడి)
•మాళ్వా - మొహమ్మద్‌-2 (ప్రధాని-మేథినీరాయ్‌-2)
•మేవార్‌ - రాణా సంగా
•గుజరాత్‌ - మజఫర్‌షా
•బెంగాల్‌ - నుస్రత్‌ షా
•దక్షిణ భారతదేశం- శ్రీకృష్ణ దేవరాయలు


బాబర్ ‌(1526-30):

👉🏻రాణాసంగ్రామ్‌సింగ్‌, ఆలంఖాన్‌ లోడి అభ్యర్థన మేరకు 5వ సారి దాడి చేశాడు.
👉🏻1526(ఏప్రిల్‌ 21) - మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్‌ ఇబ్రహీంభాన్‌ లోడీని ఓడించి ఢిల్లీలో మొఘలుల పాలనను స్థాపించాడు.
👉🏻ఈ యుద్ధంలో ఇబ్రహీంకు సహకరించింది-రాజా విక్రమ్‌జిత్‌ (గ్వాలియర్‌ పాలకుడు)
👉🏻ఈ యుధ్ధంలో బాబర్‌ రూమి(గొయ్యి), తులుగుమ(అశ్వక దళం) అనే యుద్ధ తంత్రాలను ఉపయోగించాడు.
👉🏻1527 - కాణ్వా యుద్ధంలో మేవార్‌ పాలకుడు రాణా సంగ్రామ్‌సింగ్‌ను ఓడించాడు. ఈ యుద్ధంలో బాబర్‌ రాణా సంగాపై జిహాద్‌ ప్రకటించాడు. ఈ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత బాబర్‌ గాజీ బిరుదు పొందాడు. ముస్లింలపై “టంగా'(స్టాంప్‌ డ్యూటీ) అనే పన్ను రద్దు చేశాడు. ఈ యుద్ధ విజయం భారత్‌లో బాబర్‌ స్థానం సుస్థిరం చేసింది. ఈ యుద్ధం మొదటి పానిపట్‌ యుద్ధం కన్నా ముఖ్యమైనది. 👉🏻రాణా సంగా బిరుదులు : 1) మాన్‌ ఆఫ్‌ హండ్రెడ్‌ బ్యాటిల్స్‌ 2) ఫ్రాంగ్మెంటెడ్‌ సోల్డర్‌
👉🏻రాణా సంగా యొక్క తాత రాణా కుంభా(1433-68). చిత్తోడ్‌లో కీర్తిస్తంభాను నిర్మించాడు.
👉🏻1528 - చందేరీ యుద్ధంలో మాళ్వా పాలకుడు మేధినీరాయ్‌ను ఓడించి, చందేరీ కోటను, మాళ్వాను ఆక్రమించాడు.
👉🏻1529 - గోగ్రా యుద్ధంలో నుస్రత్‌ షా, మొహ్మద్‌ షా అనే ఆష్టనులను ఓడించి బెంగాల్‌ను ఆక్రమించాడు.
👉🏻1530 - బాబర్‌ మరణించాడు. (ఇతను మరణం గురించి గుల్‌బదన్‌ బేగం తన హుమయూన్‌ నామా పుస్తకంలో పేర్కొంది)
👉🏻బాబర్‌ తన ఆత్మకథ బాబర్‌నామాను టర్కీ భాషలో రచించాడు. దీన్నే తజుక్‌-ఇ-బాబరి అని కూడా అంటారు
👉🏻అందువల్లనే బాబర్‌ను స్వీయ చరిత్రల రారాజు అంటారు.
👉🏻అతని యొక్క అమీరులు అతనికి, బాబర్‌(సింహం లేక పులి) అనే బిరుదు ఇచ్చారు. బాబర్‌ తన స్వీయగ్రంథమైన తజుక్‌-ఇ-బాబరిలో హిందుస్థాన్‌ జనంతో నిండిన విశేషమైన ఉత్పత్తి కలిగిన చాలా విశాలమైన దేశం అని “అద్భుత దేశంగా వర్ణించాడు. 👉🏻ఇతను మస్నవీ అనే పుస్తకం కూడా రచించాడు.
👉🏻బాబర్‌ కాలంలో కాశ్మీర్ పాలకుడైన మీర్జా హైదర్‌ తారిక్‌-ఇ-రషీదీ అనే పుస్తకాన్ని రచించాడు.
👉🏻ముల్లా షరఫ్‌ జాఫర్‌నామాను రచించాడు.


హుమయూన్‌(1530-40, 1555-56):

👉🏻హుమయూన్‌ అనగా అదృష్టవంతుడు
👉🏻 1530 - డిసెంబర్‌ 29న హుమయూన్‌ మొఘల్‌ చక్రవర్తిగా పట్టాభిషేకం చేశాడు.
👉🏻 1532 - దౌరాయుద్ధంలో మహమ్మద్‌ లోడిని ఓడించాడు.
👉🏻 1535‌ - మాండాసోర్‌ యుద్ధంలో గుజరాత్‌ పాలకుడు బహదూర్‌ షాను ఓడించాడు.
👉🏻 1537 - చునార్‌ యుద్ధంలో షేర్షాను ఓడించి బెంగాల్‌లో గౌడ ప్రాంతం వరకు దండయాత్ర కొనసాగించాడు. - గౌడ్‌లో కొన్ని నెలలపాటు విలాసవంతమైన జీవితం గడుపుతూ దానికి జన్నతాబాద్‌(స్వర్ణాల నగరం) అని పేరు పెట్టాడు.
👉🏻 ఈ మధ్య కాలంలో ఆగ్రాలో హుమయూన్‌ సోదరుడు హిందాల్‌ తానే మొగల్‌ చక్రవర్తినని ప్రకటించుకున్నాడు.
👉🏻 1539 - చౌసా యుధ్ధంలో షేర్షా హుమయూన్‌ను ఓడించాడు. హుమయూన్‌ తన ప్రాణాలను రక్షించుకొనుటకు కర్మనాసా నదిలో దూకాడు. అతని జనరల్‌ నిజాం షా హుమయూన్‌ ప్రాణాలు కాపాడాడు.
👉🏻 1540 - బిలగ్రామ్ /కనాజ్‌ యుద్భంలో షేర్షా హుమయూన్‌ను పూర్తిగా ఓడించాడు. దీంతో హుమయూన్‌ తన రాజ్యం కోల్పోయి. మధ్య భారతదేశ అడవులకు చేరాడు.
👉🏻 1541 - మధ్య భారతదేశ అడవులలో హమీద(భాను)బేగంను వివాహం చేసుకున్నాడు.
👉🏻 1542 - రాజస్థాన్‌-సింధ్‌లోని అమర్‌కోట్‌ (ప్రస్తుతం పాకిస్తాన్‌ సింధ్‌లోని ఉమర్‌కోట్)‌ పాలకుడు రాజా వీర్‌సల్‌/రాణాప్రసాద్‌ ఆస్థానంలో హుమయూన్‌, హమీదాబాను బేగంకు అక్బర్‌ జన్మించాడు. (అక్చర్‌ను మహామంగ పెంచింది)
👉🏻 1545-హుమయాూన్‌, భానుబేగం పర్షియా చేరుకున్నారు. అప్పటి పర్షియా పాలకుడు షాథామాప్స్‌ (సఫావిద్‌ వంశం) సహాయాన్ని హుమయూన్‌ అర్థించాడు. షాదా మాస్స్‌ 'కాందహారొను గెలిచిన తర్వాత దానిని తనకు అప్పగించాలనే షరతుతో ఆశ్రయం ఇచ్చాడు.
👉🏻 1553 - పర్షియా సహాయంతో హుమయూన్‌ కాబూల్‌ పాలకుడు కమ్రాన్‌ను ఓడించి అతన్ని గుడ్డివాణ్ణి చేశాడు. ఇక్కడే హుమయూన్‌ తను పోగొట్టుకున్న అక్చర్‌ను మరలా కలిశాడు. అక్బర్‌ను పంజాబ్‌కు పాలకుడిని చేసి బైరంఖాన్‌ను అతనికి సంరక్షకుడిగా నియమించాడు.
👉🏻 1555 - మచ్చివార, సర్‌హింద్‌ యుద్దాలలో సికిందర్‌ సూర్‌ను ఓడించి మరలా ఢిల్లీపై మొఘలుల పాలనను స్థాపించాడు.
👉🏻 1556 - దీన్‌పన్హాలో తన వ్యక్తిగత గ్రంథాలయం షేర్‌మండల్‌లో మెట్ల పైనుండి జారిపడి ప్రమాదవశాత్తు మరణించాడు.
👉🏻 హుమయూన్‌ ఢిల్లీలో దిన్‌పన్హాను నిర్మించాడు.
👉🏻 హుమయూన్‌ తులాభారంను ప్రవేశపెట్టాడు
👉🏻 హుమయూన్‌ దస్తాన్‌-ఇ-అమీర్‌వాంజా అనే పెయింటింగ్‌ వేయించాడు.
👉🏻 హుమయూన్‌కు పరమ శత్రువు హుమయూనే. అతనికి గల నల్లమందు తినే వ్యసనం కొంతవరకు అతని పతనానికి కారణంగా చెప్పవచ్చు.
👉🏻 ఇతని మరణానంతరం హేమూ ఢిల్లీని ఆక్రమించి కొన్ని రోజులపాటు పాలించాడు.
👉🏻 హేమూ ఢిల్లీకి చివరి హిందూ పాలకుడు
👉🏻 బెంగాల్‌ పాలకుడు ఆలీ అదిల్‌షా హేమూకు విక్రమజిత్‌ అనే బిరుదును ఇచ్చాడు.
👉🏻 హుమయూన్‌ సమాధిని అతని భార్య హాజీ బేగం/ హమిదాభాను బేగం ఢిల్లీలో నిర్మించింది.
👉🏻 మొట్టమొదటిసారిగా ఈ సమాధి నిర్మాణంలో పాలరాయి ఉపయోగించారు. దీని ఆధారంగానే తాజ్‌మహల్‌ నిర్మించబడింది.


షేర్షా(1540-45):

👉🏻సూర్‌ వంశాన్ని స్థాపించినవాడు - షేర్షా
👉🏻 ఇతని అసలు పేరు ఫరీద్‌
👉🏻 ఇతను ఆస్టనిస్థాన్‌కు చెందినవాడు. ఇతని తండ్రి ఒక రెవెన్యూ అధికారి
👉🏻 ఇతను జౌన్‌పూర్‌లో సంస్కృతం, పర్షియా భాషలను నేర్చుకున్నాడు.
👉🏻 బీహార్‌ పాలకుడు బహర్‌ఖాన్‌ లోహనీ వద్ద ఒక టీచర్‌గా పనిచేశాడు.
👉🏻 తర్వాత రెవెన్యూ శాఖలో డిప్యూటీ వకీల్‌దార్‌గా పని చేశాడు.
👉🏻 బహర్‌ఖాన్‌ లోహనీ ఫరీద్‌కు 'షేర్‌ఖాన్‌' అనే బిరుదు ఇచ్చాడు.
👉🏻 1530 - చునార్‌ పాలకుడు మరణంతో అతని వితంతువు లాడ్‌మాలికను వివాహం చేసుకొని చూనార్‌ పాలకుడయ్యాడు.
👉🏻 1533 - తన బద్ద శత్రువు నుస్రత్‌షాను సూరజ్‌ఘర్‌ యుద్ధంలో ఓడించాడు. ఇతను నుస్రత్‌షాపై జిహాద్‌ ప్రకటించాడు.
👉🏻 1537 - చునార్‌ యుద్ధంలో హుమాయున్‌చే ఓడించబద్దాడు.
👉🏻 1539 - చౌసా యుద్ధంలో హుమయూన్‌ను ఓడించాడు.
👉🏻 1540 - బిల్‌గ్రామ్‌/కనౌజ్‌ యుద్ధంలో హుమయూన్‌ను ఓడించి షేర్షా బిరుదు పొంది ఢిల్లీ పాలకుడయ్యాడు.
👉🏻 1545 - కలింజర్‌ కోటను అక్రమిస్తున్నప్పుడు గన్‌పౌడర్‌ పేలుడులో ప్రమాదవశాత్తు మరణించాడు. (అప్పటి కలింజర్‌ రాజు కిరాత్‌సింగ్‌)
👉🏻 షేర్షా తన 5 సం॥ల పరిపాలనా కాలంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. క్షేత్ర స్థాయిలో ఉన్న ఉద్యోగులపై ప్రధానంగా తన దృష్టిని సారించాడు.
👉🏻 గ్రామాలలో శాంతి పరిరక్షణ కొరకై ముకద్దమ్‌ అనే పోలీసు అధికారి ఉండేవాడు.
👉🏻 గ్రామాలలో జరిగే నేరాలకు ముకద్దమ్‌లను బాధ్యులను చేసేవాడు.
👉🏻 బదిలీల విధానంను ప్రవేశపెట్టాడు. ఉన్నత అధికారులను ప్రతీ 2 సం॥లకు ఒకసారి బదిలీ చేసేవాడు.
👉🏻 ఇతను భూమిని 3 రకాలుగా విభజించాడు.
1) ఉత్తమం
2) మధ్యమం
3) అధమం
👉🏻 రెవెన్యూ వసూళ్లలో 3 పద్ధతులను అవలంభించాడు.
1) గల్లాబక్షి - పంట ఆధారంగా శిస్తు వసూలు జరిగేది
2) నస్క్/‌కంకుట్‌ - భూమి సారవంతం ఆధారంగా శిస్తు వసూలు జరిగేది
3) జప్తి - ఒప్పందం ఆధారంగా శిస్తు వసూలు జరిగేది
👉🏻 భూమిని కొలుచుటకు సికిందర్‌-ఇ-గజ్‌ను ఉపయోగించాడు. ఈ కొలత కొరకు జరీబ్‌ అనే కర్రను ఉపయోగించాడు.
👉🏻 రైతులకు పట్టాలు ఇచ్చి వారి వద్ద నుండి కుబిలియాత్‌ పత్రం తీసుకొనేవాడు.
నిర్మాణాలు:
👉🏻పురానా ఖిలా (ఓల్డ్‌ ఫోర్ట్‌) ఢిల్లీ
👉🏻 ససారామ్‌ (షేర్షా సమాధి) బీహార్‌
👉🏻 గ్రాండ్‌ ట్రంక్‌ రోడ్‌ - బెంగాల్‌లో సోనార్గాం నుండి పాక్‌లో అటోక్‌ వరకు వేయించాడు.
👉🏻 రహదారులు - ఆగ్రా-మండ, ఆగ్రా-జోద్‌పూర్‌, ఆగ్రా-చితోర్‌
👉🏻 షేర్షా వెండి రూపాయి నాణెములను, రాగి దమ్‌ నాణెములను ప్రవేశపెట్టాడు.
👉🏻 ఇతని కాలంలో బంగారు నాణెము లను అష్రఫీ అనేవారు.
👉🏻 ఇతని కాలంలో ఆస్థాన చరిత్రకారుడు అబ్బాస్‌ షేర్వాణీ తాజూక్‌-ఇ-షేర్షాహీ అనే పుస్తకం రాశాడు.
👉🏻 ఇతని ఆస్థాన కవి మాలిక్‌ మొహ్మద్‌ జైసీ పద్మావతి పుస్తకం రచించాడు.
👉🏻 ఇతని రెవెన్యూ మంత్రి రాజా తోడర్‌మల్‌
👉🏻 షేర్షా తర్వాత సూర్‌ పాలకులు ఇస్తాం షా, సికిందర్‌ సూర్‌
👉🏻 ఇస్లాం షా “జలాల్‌ఖాన్‌” అనే బిరుదు పొందాడు.


అక్బర్‌ (1556-1605):

👉🏻ఇతని అసలు పేరు జలాలుద్దీన్‌ మహమ్మద్‌
👉🏻 అక్బర్‌ సంరక్షకుడు ఖైరాంఖాన్‌
👉🏻 అక్బర్‌ గురువు -అబ్దుల్ లతీఫ్‌ (ఇతను అక్బర్‌కు సులేకుల్‌/సర్వ మానవ సౌ(భ్రాతృత్వంను/ విశ్వ శాంతిని బోధించాడు).
👉🏻 అక్బర్‌ భార్యలు - 1) రుకయా సుల్తానా బేగం 2) సల్మా సుల్తానా బేగం (బైరాంఖాన్‌ భార్య) 3) హర్మాబాయ్‌ (జోధాబాయ్‌)
👉🏻 జోదాభాయ్‌ బిరుదు - మరియం ఉస్‌ జమానీ
👉🏻 అక్టర్‌ పెంప్రడు తల్లి-మహంమంగ (కుమారుడు ఆదంఖాన్‌)
👉🏻 అక్బర్‌కు పాలిచ్చిన తల్లి - జీజీ అంగ (భర్త అతాగాఖాన్‌)
👉🏻 1556 ఫిబ్రవరి 14న కలనౌర్‌లో పట్టాభిషేకం చేసినపుడు అతని వయస్సు 14 ఏళ్లు.
👉🏻 1556 - 2వ పానిపట్టు యుద్ధంలో ఖైరాంభాన్‌ హేమూను వధించిన తర్వాత అక్బర్ మొఘల్‌ చక్రవర్తి అయ్యాడు. ఈ సందర్భంగా అక్బర్‌ బైరాంఖాన్‌కు ఘాజీఅనే బిరుదు ఇచ్చాడు. అక్బర్‌ పట్టాభిషేకం పంజాబ్‌లో కలనౌర్‌లో జరిగింది.
👉🏻 1560 - బైరాంఖాన్‌ తిరుగుబాటు చేశాడు. కానీ అతను అణిచివేయబడి మక్కాకు పంపబడ్డాడు. కానీ మార్గమధ్యంలో గుజరాత్‌-సింధ్‌ వద్ద బైరాంఖాన్‌ఒక హాన్‌ అయిన హాజీఖాన్‌ మేవాతిచే హత్యకు గురయ్యాడు.
👉🏻 1562 - బానిసత్వంను రద్దు చేశాడు
👉🏻 1563 - తీర్ధయాత్రలపై పన్నును రద్దు చేశాడు
👉🏻 1564 - జిజియా అనే మత పన్ను రద్దు చేశాడు
👉🏻 1571 - రాజధానిని ఆగ్రా నుండి ఫతేపూర్‌ సిక్రీకి మార్చాడు.
👉🏻 1575 - ఇబాదత్‌ ఖానా అనే ప్రార్ధనా మందిరం నిర్మించాడు.
👉🏻 1576 - హల్టీఘాట్‌ యుద్ధంలో అక్బర్‌ మన్సబ్‌దార్‌ మాన్‌సింగ్‌ మేవాడ్‌ పాలకుడైన రాణా ప్రతాప్‌ సింగ్‌ను ఓడించాడు.
👉🏻 1579 - గుజరాత్‌పై విజయానికి గుర్తింపుగా ఫతేపూర్‌ సిక్రీలో బులంద్‌ దర్వాజను నిర్మించాడు.
👉🏻 1581 - ఇబాదత్‌ఖానాలో మత చర్చలు అంతమయ్యాయి.
👉🏻 1582 - దీన్‌-ఇ-ఇలాహి /తొహిద్‌-ఇ-ఇలాహిను తన వ్యక్తిగత మతంగా ప్రకటించాడు. (షేక్‌ ముబారక్‌ యొక్క మఝర్‌ ఆధారంగా)
👉🏻 1601 - అక్బర్‌ చివరి ఆక్రమణ ఆసిర్‌ఘడ్‌ కోట
👉🏻 1605 -అక్బర్‌ మరణం

అక్బర్‌ ఆస్థానంలో ప్రముఖులు:
అబుల్‌ ఫజల్‌ : ఆస్థాన కవి, అక్చర్‌నామ/ ఐనీ అక్బరీని రచించాడు.
అబుల్‌ ఫైజీ : అబుల్‌ ఫజల్‌ సోదరుడు. భగవద్గీతను పర్షియాలోకి అనువాదించాడు.
ఐదౌనీ : ఆస్థాన చరిత్రకారుడు. ముక్తకా-ఉల్‌-తవారిక్‌ని రచించాడు.
తోడర్‌మల్‌ : రెవెన్యూ మంత్రి. ఇతని సలహా మేరకు అక్బర్ ఐనీదాసలా/బందోబస్తు విధానంను ప్రవేశపెట్టాడు. ఈ విధానం ప్రకారం ఒక ప్రాంతం యొక్కశిస్తు ఆ ప్రాంతంలో గత 10 సం॥ల్లో పండిన పంట, వాటి ధర ఆధారంగా నిర్ణయిస్తారు.
తాన్‌సేన్‌ - ఇతను ఆస్థాన సంగీతకారుడు. ఇతను గ్వాలియర్‌కు చెందినవాడు. ఇతను మేగ్‌, హిండోల్‌, రాగదీపిక రాగాలు రచించాడు.
బీర్బల్ : ఇతను ఆస్థాన విదూషకుడు (వాస్యకారుడు) . ఇతని అసలు పేరు మహేష్‌దాస్‌. ఇతను మన్సబ్‌దార్‌ కాదు. అక్బర్‌ యొక్కదిన్‌-ఇ-ఇలాహిలో చేరిన మొదటి వ్యక్తి. ఇతను కైబర్‌ కనుమ వద్ద చంపబడ్డాడు.
భగవాన్‌దాస్‌, మాన్‌సింగ్‌ : వీరిద్దరూ ఉన్నత మన్ఫబ్‌దార్లు
అబ్దుల్ రహీం ఖాన్‌-ఇ-ఖానా : భైరాంఖాన్‌ కుమారుడు. ఇతను జహంగీర్‌ గురువు. బాబర్‌ నామాను టర్కీ భాష నుండి పర్షియాలోకి అనువదించాడు. (బాబర్‌ నామను మొదటిగా జైన్‌ఖాన్‌ పర్షియాలోకి అనువదించాడు)
ఖ్వాజా అబ్దుల్ సమద్‌- చిత్రకారుడు. ఇతని కలం పేరు -షరీన్‌ కలమ్‌ (తియ్యని కలం), లిఖితకారుడు. ఇతని కలం పేరు -జరీమ్‌ కలమ్‌ (బంగారు కలం)


అక్బర్‌ మన్సబ్‌దారీ విధానం:
👉🏻ఇది మొఘలుల మిలిటరీ వ్యవస్థ. దీనిని 1570లో అక్బర్‌ ప్రవేశపెట్టాడు. మూడు తరహా మన్సబ్‌దార్లు ఉండేవారు
1) మన్సబ్‌దార్‌ : 500 కంటే తక్కువ సైనికులకు అధిపతి
2) అమీర్‌ : 500-2500 మంది సైనికులకు అధిపతి
3) అమీర్‌-ఇ-ఆజమ్‌ : 2500 కంటే ఎక్కువ మంది సైనికులకు అధిపతి
👉🏻అశ్వక దళంలో 3 రకాల అధిపతులు ఉండేవారు.
1) సే ఆస్పా - 3 గుర్రాలు ఉంటాయి
2)దో ఆస్పా - 2 గుర్రాలు ఉంటాయి
3) నీమ్‌ సవార్‌ - 1 గుర్రం ఉంటుంది
👉🏻అక్బర్‌ కాలంలో అత్యధిక మన్సబ్‌దార్‌ ర్యాంక్‌ -7000.
👉🏻7000 ర్యాంక్‌ పొందిన ఇద్దరు మన్సబ్‌దార్లు - మాన్‌సింగ్‌, మీర్జా అజీజ్‌ కోకా

దీన్‌-ఇ-ఇలాహి:
👉🏻ఈ మతం ప్రకారం ప్రతి ఉదయం చక్రవర్తి సూర్యున్ని పూజించేవాడు.
👉🏻తన రాజోద్యోగులలో మాన్‌నింగ్' ఈ మతాన్ని అనుసరించడానికి నిరాకరించాడు.
👉🏻అక్బర్‌ తన గురువు అబ్దుల్ లతీఫ్‌ బోధించిన సులేకుల్‌ ఆధారంగా దీన్‌-ఇ-ఇలాహిని ప్రకటించాడు.
👉🏻ఈ మతాన్ని ప్రకటించక ముందు అక్బర్‌ ఇబాదత్‌ ఖానాలో మత చర్చలు నిర్వహించాడు.
👉🏻ఈ మత చర్చల్లో పాల్గొన్నవారు
1) హిందూ మతం - పురుషోత్తమ్‌, దేవి
2) క్రిస్టియానిటీ - అక్వావిరా, మాన్సరేట్‌
3) జైన మతం - హేరవిజయ సూరి (జగద్గురు, యుగప్రదాన్‌)
4) జొరాస్ట్రియన్‌ -నవసారి మహారాజు రాణా
👉🏻అక్బర్‌ దీన్‌-ఇ-ఇలాపా ప్రకటించిన తర్వాత ఇన్సాన్‌-ఇ-కమీన్‌ అనీ బిరుదు పొందాడు.
👉🏻అక్బర్‌ మత విషయాల్లో చక్రవర్తిని సర్వాధికారిని చేస్తూ అమోఘత్వ ప్రకటన జారీ చేశాడు.

నిర్మాణాలు:
ఆగ్రాకోట:
•దీని ఆర్కిటెక్ట్‌ -ఖాసిం
•ఇది భారత్‌లో అతి పటిష్టమైన కోట
•దీనిని రాజపుత్రులు కోటల ఆధారంగా నిర్మించాడు. దీని లోపల ముఖ్య కట్టడాలు
1) అక్చరీ మహల్‌
2) జహంగరీ మహల్‌
3) ముసామమ్‌ బురుజు .
4) అమరసింహ ద్వారం.

ఫతేపూర్‌ సిక్రీ:
•దీని ఆర్కిటెక్ట్‌ -బహవుద్దీన్‌
•ఫతేపూర్‌ సిక్రీలో జామా మసీదు అద్భుతమైన కట్టడం. ఆగ్రాకు దగ్గరలో ఉంది
•దీనిలో ముఖ్య కట్టడాలు
1) బులంద్‌ దర్వాజ ను
2) ఇబాదత్‌ ఖానా (ఇక్కడే సలీంచిస్థీ సమాధి ఉంది)
3) పంచ్‌ మహల్‌ (బౌద్ధ మత ప్రభావం దీనిపై ఉంది)
4) జోదాబాయి ప్యాలెస్‌
5) బీర్బల్‌ భవంతి
6) టర్కీ సుల్తానా ప్యాలెస్‌

సాంఘిక సంస్కరణలు:
•హిందువుల తిరునాళ్లు, ఉత్సవాలలో అక్బర్‌ స్వయంగా పాల్గొన్నాడు.
•బాల్య వివాహాలు, చిన్న పిల్లలను చంపటం(బలి) నిషేధించబడ్డాయి.
•హిందూ వితంతు పునర్వివాహం చట్టబద్ధం చేయబడింది.
•సతీ సహగమన నిషేధాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాడు
•కొన్ని నిర్జీత దినాలలో జంతువధ నిషేధించబడింది.
•అక్బర్‌ స్వయంగా అక్షరజ్ఞానం కలవాడు కాకపోయినా ఫతేపూర్‌ సిక్రీలో ఆడపిల్లలకు పాఠశాలలను స్థాపించాడు.
•షేక్‌ సలీం చిస్థీ ఆశీర్వాదంతో అక్బర్‌, మరియమ్‌కు జన్మించిన బిడ్డకు సలీమ్‌ అని పేరు పెట్టినప్పటికినీ అక్బర్‌ ప్రేమగా ఆ బిడ్డను “షేక్‌బాబా' అని పిలుచుకునేవాడు.

జహంగీర్‌ (1605-27)

👉🏻తల్లి పేరు హీరాకున్వారి లేదా మరియమ్‌-ఉజ్‌ -జమాని/ జోదా (అమీర్‌పాలకుడు రాజా బారామల్‌ కుమార్తె, భగవాన్‌ దాస్‌ సోదరి).
👉🏻 1605 - నూరుద్దీన్‌ మహమ్మద్‌, సలీం జహంగీర్‌ (విశ్వాన్ని జయించాడు) అనే బిరుదు పొంది మొఘల్‌ చక్రవర్తి అయ్యాడు. అదే సం1॥లో 12 ఇస్లామిక్‌ చట్టాలను ప్రకటించాడు.
👉🏻 1606 - జహంగిర్‌పై తిరుగుబాటు చేసిన అతని పెద్ద కుమారుడు ఖుస్రూ మీర్జాకు అర్జున్‌దేవ్‌ సహకరించాడు. దీనితో సిక్కుల 5వ గురువు అర్జున్‌దేవ్‌ ఉరి తీయబడ్డాడు.
👉🏻 1608 - ఈస్ట్‌ ఇండియా కంపెనీ రాయబారి హాకిన్స్‌ జహంగీర్‌ ఆస్థానంను సందర్శించాడు.
👉🏻 1611 - నూర్జహాన్‌ను వివాహమాడాడు
👉🏻 1614 - మేవాడ్‌ అమరసింహను ఓడించాడు
👉🏻 1615 - బ్రిటీష్‌ రాయబారి సర్‌ థామస్‌రో ఇతని ఆస్థానంను సందర్శించాడు.
👉🏻 1626 - జహంగీర్‌ జనరల్‌ మహబత్‌ఖాన్‌ తిరుగుబాటు చేసి జహంగీర్‌ను బంధించాడు. ఈ సమయంలో నూర్జహాన్‌ కీలక పాత్ర పోషించి జహంగీర్‌ను విడిపించి మహబత్‌ఖాన్‌ను అణిచివేసింది.
👉🏻 1627 - జహంగీర్‌ మరణించాడు
👉🏻 జహంగీర్‌ కాలంలో చిత్రలేఖనం అత్యధికంగా అభివృద్ధి చెందింది.
👉🏻 ఇతని కాలంలో 'మసిసుర్‌” మినియేచర్‌ పెయింటింగ్‌లో ప్రసిద్ధి చెందినవాడు.
👉🏻 ఉస్తాద్‌ మన్సూర్‌ జంతు చిత్రలేఖనంలో ప్రసిద్ధి చెందినవాడు.
👉🏻 బిషన్‌దాస్‌ -పోలికల పెయింటింగ్‌కు ప్రసిద్ధి (మాస్టర్‌ ఆఫ్‌ టైట్స్‌)
👉🏻 జహంగీర్‌ చివరి రోజుల్లో ఉబ్బసపు వ్యాధితో బాధపడ్డాడు
👉🏻 జహంగీర్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి. అతనికి భాషలలో, చరిత్రలో, భూగోళశాస్త్రంలో, చిత్రలేఖనంలో, సంగీతంలో, వాస్తు, తోటపనిలో ఆసక్తి కలవు.
👉🏻 జహంగీర్‌ సౌందర్యాధికుడు. అతనికి పాటలంటే ఇష్టం. అతడు శ్రీనగర్‌ వద్దగల షాలిమార్‌, నిషాత్‌ తోటలను ఏర్పరిచాడు.
👉🏻 భారతదేశంలో అక్బర్‌ కాలంలో పొగాకు ప్రవేశపెడితే, జహంగీర్‌ కాలంలో పొగాకు నిషేధించబడింది.
👉🏻 జహంగీర్‌ తన స్వీయ చరిత్ర జహంగీర్‌ నామాను రచించాడు. ఈ రచన ప్రకృతిపై అతనికి గల గాఢమైన అభిమానాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.
👉🏻 జహంగీర్‌ అబుల్‌ ఫజల్‌ను హత్య గావించాడు. ఇతను సింహాసనం అధిష్టించేనాటికి ఇతనికి 36 ఏళ్లు.
👉🏻 జహంగీర్‌ 12 శాసనాలు ప్రవేశపెట్టాడు. వాటిలో ముఖ్యమైనవి
1) ముక్కు చెవులు ఖండించడం ద్వారా అంగ వైకల్యం చేయడమనే క్రూరమైన శిక్షల రద్దు
2) మత్తు పానీయాలు, మత్తు మందు నిషేధం
3) కొన్ని ప్రకటిత దినాల్లో జంతువధ నిషేధం
4) రహదారుల్లో ఉచిత వైద్యశాలలు, మసీదులు, ధర్మశాలల నిర్మాణం.
5) ప్రజలకు న్యాయాన్ని చేకూర్చుటకై బంగారు గొలుసు గంటను అమర్చాడు.
👉🏻 నేను ఒక గిన్నెడు ద్రాక్షా పానానికి, ఒక పాత్ర మాంసానికి నా రాజ్యాన్ని నా ప్రియమైన రాణికి అమ్ముకొన్నా అని జహంగీర్‌ తన స్మృతులలో విచారం వ్యక్తం చేశాడు.
👉🏻 జహంగీర్‌ అక్బర్‌ సమాధిని సికిందరా వద్ద నిర్మించాడు.

నూర్దహాన్‌:
👉🏻నూర్జహాన్‌ మొదటి పేరు మెహరున్నీసా. జహంగీర్‌తో వివాహం అయిన తర్వాత మొదట నూర్‌ మహల్‌ (అంతఃపుర జ్యోతి) అని, ఆ తర్వాత నూర్జహాన్‌ (ప్రపంచజ్యోతి) అని పిలవడం జరిగింది.
👉🏻 మొదటి భర్త షేర్‌ ఆఫ్ఘాన్‌.
👉🏻 మొహరున్నీసా, షేర్‌ ఆష్టాన్‌కు జన్మించిన కుమార్తె లాడ్లీబేగం
👉🏻 ఈమె తండ్రి ఘియాజ్‌బేగ్‌. ఇతని బిరుదు ఇతిముదధౌలా. ఈమె సోదరుడు ఆసఫ్‌ఖాన్‌
👉🏻 తన తండ్రి జ్ఞాపకార్థం ఇతిముడ్దైలా అనే సమాధిని ఆగ్రాకి దగ్గర్లో నిర్మించింది. (పూర్తిగా పాలరాతితో నిర్మితమైన మొట్టమొదటి కట్టడం)
👉🏻 ఈ కట్టడంలో మొట్టమొదటిసారిగా పియత్రాదుర (పిట్రాడ్యూరా) విధానం ఉపయోగించబడింది. (గోడలపై ఖురాన్‌ శ్లోకాలను, ఇతర చిత్రాలను చెక్కడాన్నిి విలువైన రాళ్లను నగీషులుగా అమర్చడాన్ని పియత్రాదుర అంటారు)
👉🏻 ఈమె గులాబీల నుండి మొదటిసారిగా సుగంధం (సెంటు)ను తయారు చేసింది.
👉🏻 ఈమె కుమార్తె లాడ్లీ బేగంను షరయార్‌ కిచ్చి వివాహం చేసింది.
👉🏻 ఈమె నూర్లహాన్‌ జుంటాను ఏర్పాటు చేసింది. దీనిలో సభ్యులు నూర్జహాన్‌, అసఫ్‌ఖాన్‌, షాజహాన్‌, షరయార్‌ మొదలగువారు.


షాజహాన్‌ (1628-1658)

👉🏻తల్లిపేరు తాజ్‌బీబీ- బిల్లిస్‌-మకాని (మార్వార్‌ రాకుమార్తె మన్మతి)
👉🏻 షాజహాన్‌ను అక్బర్‌ మొదటి భార్య రుకయ్య సుల్తాన్‌బేగం పెంచింది.
👉🏻 షాజహాన్‌ పూర్తిపేరు “ఆలా హజరత్‌ అబుల్‌ ముజాఫర్‌ షాహబుద్దీన్‌ మహమ్మద్‌ ఖుర్రం”.
👉🏻 1628-ఖుర్రం షాజహాన్‌ అనే బిరుదును పొంది సింహాసనంను అధిష్టించాడు.
👉🏻 1631-53- తాజ్‌మహల్‌ నిర్మాణం జరిగింది.
👉🏻 1649-కాందహార్‌ శాశ్వతంగా భారతదేశం నుండి వేరు చేయబడింది.
👉🏻 1658-బెరంగజేబు షాజహాన్‌ను తొలగించి మొఘల్‌ చక్రవర్తి అయ్యాడు. షాజహాన్‌ ఆగ్రా కోటలో ఉంచబడ్డాడు. షాజహాన్ కుమార్తె జహానార షాజహాన్ సేవ చేసింది.
👉🏻 1666 -షాజహాన్‌ మరణించాడు
👉🏻 ఇతను మన్సబ్‌దారీ విధానంలో జమాదాని/నెలవారీ జీతం విధానం ప్రవేశపెట్టాడు.
👉🏻 శిస్తు వసూలులో హిజారా(వేలంపాట) ప్రవేశపెట్టాడు

కట్టడాలు:
1) తాజ్‌మహల్‌:
•దీని ఆర్కిటెక్చర్‌ -ఉస్తాద్‌ అహ్మద్‌ లహోరి
• సహాయకుడు - ఉస్తాద్‌ ఇసా
• ఇది ముంతాజ్‌మహాల్‌ సమాధి
• ఈమె బిరుదు - మాలిక్‌-ఇ-జమాలీ
• దీని నిర్మాణంలో అతి ఎత్తైనది మధ్యలో ఉన్న గుమ్మటం. దీన్ని చెక్క పునాదులతో నిర్మించారు (భూకంపాల వల్ల నష్టం ఉండదు).
• ఇస్లాం సాంప్రదాయం ప్రకారం కయామత్‌ నాడు దేవుని సింహాసనం తాజ్‌మహల్‌లాగా ఉంటుందని భావిస్తారు.
• ముంతాజ్‌ను మొదటగా బుర్దాన్‌పూర్‌ (మహారాష్ట్ర)లో గల జైనాబాద్‌లో పూడ్చారు. ఈమె బుర్దాన్‌పూర్‌లో 14వ బిడ్డకు జన్మనిచ్చి మరణించింది. 14వ బిడ్డ పేరు గౌహరాబేగం.
• ముంతాజ్‌మహాల్‌ అసలు పేరు అర్జమంగ్‌ బేగం(అంజుమన్‌ భానుబేగం) లేదా నవాబ్‌ ఆలియా బేగం. ఈమెను ముంతాజ్‌ మహల్‌(అంత:పుర ఆభరణం) అని కూడా పిలుస్తారు. ఈమెకు గుర్తుగా షాజహాన్‌ తాజ్‌మహల్‌ నిర్మాణం 1631లో ప్రారంభించాడు.
• తాజ్‌మహల్‌ ముంతాజ్‌ బేగం జ్ఞాపకార్థంగా యమునా తీరంలో నిర్మించబడింది.
• తాజ్‌మహల్‌ నిర్మాణానికి 22 సంవత్సరాలు పట్టింది. 3 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. 22 వేల మంది పనివారు వినియోగించబడ్డారు.

2) ఎర్రకోట:
•దీని శిల్పి హమీద్‌
•దీనిలో నిర్మాణాలు
1) హీరామహల్‌
2) మోతీమహల్‌
3) రంగామహల్‌ (అతి ముఖ్య కట్టడం)
4) షీష్‌మహల్‌
5) పెర్ల్‌మాస్క్‌ (ఔరంగజేబు నిర్మించాడు)
6) దివానీ ఖాస్‌
•తన ఆస్థానంలో షాజహాన్‌ కోహినూర్‌ వజ్రం, నెమలి సింహాసనంను ఉంచాడు.
•ఇక్కడ ఒక శ్లోకం లభ్యమైంది. “ప్రపంచంలో స్వర్గమంటూ ఉంటే అది ఇదే అది ఇదే" మీర్‌ జుమ్లా షాజహాన్‌కు కోహినూర్‌ వజ్రం ఇచ్చాడు. (అబ్దుల్లా కుతుబ్‌షా ప్రధాని)

షాజహాన్‌ ఇతర అంశాలు:
•షాజహాన్‌ పాలన తొలినాటి కాలంలో దక్కన్‌, గుజరాత్‌లో తీవ్రమైన కరువులు సంభవించాయి.
•మొగల్‌ వాస్తు కళకు షాజహాన్‌ కాలం స్వర్ణయుగంగా చెప్పవచ్చు. ఢిల్లీలోని ఎర్రకోటకు కొద్ది దూరంలో జామా-ఇ-మసీదు ప్రపంచంలోని పెద్ద మసీదులలో ఒకటి.
•షాజహాన్‌ అలీమర్షన్‌ఖాన్‌ పర్యవేక్షణలో షాలిమర్‌ ఉద్యానవనాలు వేయించాడు. నెమలి సింహాసనం, కోహినూర్‌ వజ్రం సామ్రాజ్య వైభవాన్ని పెంపొందించాయి.
•నేటి ఢిల్లీనగర స్థాపకుడు, వాస్తుకళా ప్రభువు, ఇంజనీర్‌ కింగ్‌ అని షాజహాన్‌ను పిలిచారు.


ఔరంగజేబు (1658-1707)

👉🏻పూర్తిపేరు అబుల్‌ ముజఫర్‌ మొహిద్దీన్‌ మహమ్మద్‌ ఔరంగజేబు
👉🏻 ఇతను షాజహాన్‌ యొక్క 3వ కుమారుడు లేదా 6వ. సంతానం. 1618లో గుజరాత్‌లోని దాహోద్‌లో జన్మించాడు.
👉🏻 ఇతను 1637లో దిల్‌రాస్‌ భాను బేగం (రబీవద్దీన్‌ దురానీ)ను వివాహం చేసుకున్నాడు.
👉🏻 ఇతను మొగల్‌ ప్రతినిధిగా దక్కన్‌లో ఉన్నపుడు వీణ వాయించడం నేర్చుకున్నాడు. ఇతను హీరాబాయ్‌ అనే మహిళను ప్రేమించాడు.
👉🏻 ఇతని మరో భార్య ఉదయ్‌పూరీబాయ్‌
👉🏻 1658 - సముర్‌ఘడ్‌, ధర్శత్‌ యుద్ధాలలో ఔరంగజేబు ధారాషుకోను ఓడించి మొఘల్‌ చక్రవర్తి అయ్యాడు.
👉🏻 ఇతని బిరుదులు - 1) ఆలంగీర్‌ (ప్రపంచ విజేత) 2) జిందాపీర్‌ 3) దార్వేష్‌
👉🏻 1660-63 - శివాజీని పట్టుకొనుటకు షహస్థాఖాన్‌ మరాఠా రాజ్యానికి పంపబడ్డాడు.
👉🏻 1665 - బెరంగజేబు మన్సబ్‌దార్‌ జైసింగ్‌ శివాజీని ఓడించి పురందర్‌ ఒప్పందంపై నంతకం చేయించాడు.v 1675 - సిక్కుల 9వ గురువు తేజ్‌ బహదూర్‌ చంపబద్దాడు
👉🏻 1679 - జిజియా పన్నును తిరిగి ప్రవేశపెట్టాడు.
👉🏻 1686 - భీజాపూర్‌ను ఆక్రమించాడు
👉🏻 1687 - గోల్కొండను ఆక్రమించాడు
👉🏻 1689 - సంగమేశ్వర్‌ యుద్ధంలో శివాజీ కుమారుడు శంభాజీ చంపబడ్డాడు.
👉🏻 1707 - బెరంగజేబు మరణం.
👉🏻 ఔరంగజేబు మరణం తర్వాత మువాజం మరియు ఆజంల మధ్య వారనత్వ పోరు జరిగింది. మువాజం గురుగోవింద్‌ యొక్క సహాయంతో జజవ్ అనే యుద్ధంలో ఆజంను ఓడించి, సింహాసనాన్ని అధిష్టించాడు. మువాజం గురుగోవింద్‌కు “హింద్‌ కా పీర్‌” అనే బిరుదు ఇచ్చాడు.
👉🏻 బెరంగజేబు నౌరోజీ ఉత్సవాలను, తులాభారంను, ఝరోకా దర్శన్‌ను రద్దు చేశాడు. సతీ సహగమనంను నిషేధించాడు.
👉🏻 నాణెములపై ఖురాన్‌ శ్లోకాలను తొలగించాడు. ఖురాన్‌ను కంఠస్థం చేశాడు. సంగీతాన్ని లోతుగా మట్టిలో పాతిపెట్టమన్నాడు

దక్కన్‌ విధానం:
•దీనిలో 4 దశలు ఉన్నాయి 1) 1658-66: ఈ దశలో కేవలం షోలాపూర్‌ను ఆక్రమించాడు. శివాజీ ఓడించబడ్డాడు.
2) 1666-85: గోల్కొండ, బీజాపూర్‌, శివాజీల కూటమి కారణంగా ఇతను విజయాలు సాధించలేకపోయాడు. ఈ కూటమిలో కీలకపాత్ర పోషించింది అక్కన్న-మాదన్న
3) 1686-87: 1686లో బీజాపూర్‌ను, 1687లో గోల్కొండను ఆక్రమించాడు.
4) 1689: సంగమేశ్వర్‌ యుధ్ధంలో శంభాజీ చంపబడ్డాడు.
•ఔరంగజేబు తన భార్య రబివుద్దీన్‌ దురానీ జ్ఞాపకార్థం ఔరంగాబాద్‌లో బీబీకా మక్సారా/ మినీ తాజ్‌మహల్‌ను నిర్మించాడు.
•జాట్స్‌ స్థాపకులు -చూరామన్‌ మరియు బాదన్‌సింగ్‌
•ఔరంగజేబు జాట్స్‌ నాయకుడైన గోకుల్‌ను తిల్పోత్‌ యుద్దంలో ఓడించాడు.
•జాట్స్‌ పాలకుడు రాజారాం సికిందరాలోని అక్బర్‌ సమాధిని దోచుకున్నాడు.
•జాట్స్‌ నాయకుడు సూరజ్‌మల్‌ను ప్లాటో ఆఫ్‌ జాట్స్‌ అంటారు.
•1707లో ఔరంగజేబు మరణానంతరం మొఘల్స్ బలహీనమయ్యారు. అందువల్లనే బెరంగజేబు తర్వాత పాలకులను మలి మొఘలులు అంటారు.


మలి మొగల్‌ చక్రవర్తులు:

1. బహదుర్‌షా -1 (1707-12)
2. జహందర్‌ -(1712-13)
3. ఫారుక్‌ సియార్‌ -1718-19
4. రఫి ఉద్‌ ధర్దట్‌ -క719
5. రఫి ఉద్దౌలా (షాజహాన్‌-2) - 1719
6. మొహ్మద్‌షా రంగీలా(రోషన్‌ అక్తర్‌) -1719-48
7. అహ్మద్‌షా -1748-54
8. ఆలంగిర్‌-2 (అజీజద్దీన్‌) -1754-59
9. షాజహాన్‌-3 -1759
10. ఆలీ గౌహర్‌/షాఆలం-2 -1759-1806
11. అక్చర్‌-2 -1806-37
12. బహదుర్‌షా-2 -1837-62

జహందర్‌ (1712-13)
👉🏻జహందర్‌ ఆస్థానంలో ప్రధాని జుల్‌ఫికర్‌ కింగ్‌ మేకర్‌గా ప్రసిద్ధి చెందాడు.
👉🏻 జహందర్‌ జిజియా పన్ను రద్దు చేశాడు.
👉🏻 జహందర్‌ మీర్జా రాజాసవాయ్‌(అంబర్‌ పాలకుడు)కు జైసింగ్‌ అనే బిరుదును, అజిత్‌సింగ్‌కు మహరాజా అనే బిరుదును ఇచ్చాడు.
👉🏻 సవాయి జైసింగ్‌(1699-1743) -ఢిల్లీ, జైపూర్‌, ఉజ్ఞయిని, వారణాసి, మధురలలో అబ్జర్వేటరీ (ఖగోళ పరిశోధన కేంద్రం) ఏర్పాటు చేశాడు.
👉🏻 సవాయి జైసింగ్‌ జిజ్‌ మొహమ్మద్‌ షాహి అనే టేబుల్‌/ పట్టికను రూపొందించాడు.
👉🏻 యూక్లిడ్‌ యొక్క ఎలిమెంట్స్‌ ఆఫ్‌ జామెంట్రీను సంస్కృతంలోకి అనువదించాడు.
👉🏻 జైసింగ్‌ వితంతు పునర్వివాహమును ప్రోత్సహించాడు.
👉🏻 మొగల్‌ ఆస్థానంలో సయ్యద్‌ సోదరులు(అబ్దుల్లా, హుస్సేన్‌) కింగ్‌ మేకర్స్‌గా ప్రసిద్ధి చెందారు. వీరు జహందర్‌ను తొలగించి ఫరూక్‌సియార్‌ని మొఘల్‌ పాలకున్ని చేశారు.

ఫరూఖ్‌ సియర్‌ (1718-19)
👉🏻ఫరూఖ్‌ సియర్‌ పాలనా కాలంలో సిక్కుల నాయకుడైన బందాబహదూర్‌ ఉరితీయబడ్డాడు.
👉🏻 ఇతను 1717లో బ్రిటిష్‌వారికి బంగారు ఫర్మాన్‌ జారీచేశాడు.
👉🏻 ఇతను సయ్యద్‌ సోదరులచే హతమార్చబద్దాడు.
👉🏻 1719లో ఇతని మరణానంతరం రఫీఉద్‌ దర్దట్‌, రఫీ ఉద్‌ దౌలాలు మొఘల్‌ పాలకులయ్యారు.

మొహహ్మద్‌ షా రంగీలా (1719-48)
👉🏻ఇతన్ని రోషన్‌ అక్తర్‌ అని కూడా అంటారు.
👉🏻 ఇతను సయ్యద్‌ సోదరుల మద్దతుతో పాలకుడయ్యాడు.
👉🏻 ఇతని పాలనాకాలంలో భారతదేశంలో మొఘల్స్‌ నుంచి వేరై 4 కొత్త రాజ్యాలు ఆవిర్భవించాయి. అవి
1 హైదరాబాద్‌ -నిజాముల్‌ ముల్మ్‌
2 కర్ణాటిక్‌ -సాదతుల్లాఖాన్‌
3 అవధ్‌ -సాదత్‌ అలీ
4 బెంగాల్‌ -ముర్షీద్‌ కులీ ఖాన్‌
👉🏻 ఇతని కాలంలో 1789లో నాదిర్‌షా కర్నల్‌ యుద్ధంలో మొఘల్‌ సైన్యాన్ని ఓడించి ఢిల్లీని ఆక్రమించి, ప్రసిద్ధ కోహినూర్‌ వజ్రం మరియు షాజహాన్‌ తయారుచేయించిన నెమలి సింహాసనంను ఎత్తుకుపోయాడు.
👉🏻 మొహ్మద్‌షా రంగీలా కథక్‌నాట్యంలో ప్రావీణ్యం గలవాడు.
👉🏻 ఇతను నిజాముల్‌ ముల్క్‌ సహాయాన్ని పొంది, సయ్యద్‌ సోదరులను హతమార్చాడు.
👉🏻 ఇతనికి చివరిగా ప్రధాన మంత్రిగా వ్యవహరించినవాడు ఇమాదుల్‌ ముల్క్‌

అహ్మద్‌ షా (1748-54)
👉🏻ఇతను ఇమాదుల్‌ ముల్క్‌ సహాయంతో పాలకుడయ్యాడు.
👉🏻ఇతనికి, ప్రధాని ఇమాదుల్‌ ముల్మ్‌ మధ్య విభేదాలు రావడంతో ఇమాదుల్‌ ముల్క్‌ అహ్మద్‌ షాను గుడ్దివాడిని చేసి సింహాసనం నుండి తొలగించాడు.

2వ ఆలంగీర్‌ (1754-59)
👉🏻ఇతను కూడా ఇమాదుల్‌ ములక్ ‌సహాయంతో పాలకుడయ్యాడు.
👉🏻ఇతను ప్రధానితో విభేదాలు ఏర్పరచుకోవడంతో ఇమాదుల్‌ ముల్క్‌ రెండవ ఆలంగిర్‌ను హత్యచేసి అతని శవాన్ని యమునా నదిలో పడేశాడు.
👉🏻ఇతని తర్వాత నామమాథత్రంగా 3వ షాజహాన్‌ సింహాసనంను అధిష్టించాడు.

2వ షా ఆలం/ షా గౌహర్‌ (1759-1806)
👉🏻ఇతను ప్రధాని ఇమాదుల్‌ ముల్మ్‌కి భయపడి ఢిల్లీని విడిచిపెట్టి అలహాబాద్‌కు పారిపోయాడు. (ఫ్యూజిటివ్‌ ఎంఫెరర్‌)
👉🏻ఇతని కాలంలోనే 1764లో బాక్సర్‌ యుద్ధం జరిగింది. దీని తరువాత ఇతను అలహాబాద్‌లో బ్రిటిష్‌ బందీగా వున్నాడు. ఇతని కాలం నుంచే మొఘల్‌ చక్రవర్తులు బ్రిటిష్‌ యొక్క పెన్షనర్లుగా మారారు.
👉🏻మరాఠా పీష్వా 1వ మాధవరావు 2వ షా ఆలంను తిరిగి ఢిల్లీకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు.

2వ అక్చర్‌ (1806-87)
👉🏻రెండవ అక్బర్‌ రామ్మోహన్‌రాయ్‌కి రాజా అనే బిరుదు ఇచ్చి, ప్రోత్సహించి అతన్ని లండన్‌కు పంపాడు.
(భారతదేశంలో కొన్ని సంఘసంస్కరణ చట్టాలు, తన పెన్షన్‌ పెంచమని విజ్ఞప్తులు చేయుటకు)
👉🏻మొఘల్‌ రాజులలో చివరివాడు రెండవ బహదుర్‌షా(1837-58). ఇతడు 1857లో జరిగిన తిరుగుబాటులో నాయకత్వం వహించాడు. తిరుగుబాటు అణచివేసిన తర్వాత అంగ్లేయులు బహదుర్‌షాను ఖైదీగా 'రంగూన్‌'కు పంపారు. అచటనే బహదుర్‌షా 1862లో మరణించాడు.

మొఘల్‌ పరిపాలన

👉🏻మొగలుల కాలంలో జాగీర్‌(అనేది ఒక భూభాగం). ఇది ఢిల్లీ సుల్తాన్‌ల కాలంలో ఇక్తాను పోలి ఉంది.
👉🏻 వీరి పాలనలో వకీల్‌ -రాజప్రతినిధి
👉🏻 వజీర్‌ లేదా దివాన్‌ - రెవెన్యూ శాఖాధిపతి (ప్రధానమంత్రిగా/ ఆర్థిక మంత్రిగా)
👉🏻 మీర్‌ బక్షి - సైనిక శాఖాధిపతి
👉🏻 కాజీ - ఫిర్యాదులను విని తీర్పు చెప్పేవాడు
👉🏻 అమీల్‌ - భూమిశిస్తును వసూలు చేసేవాడు
👉🏻 మొగల్‌ పాలనలో దస్తూర్‌ ఉల్‌ అమీర్‌ అనే గ్రంథం రచించబడింది.
👉🏻 వీరి కాలంలో ప్రామాణిక బంగారు నాణెంను మహర్ అనేవారు.
👉🏻 వీరికి పర్షియన్‌ రాజభాషగా ఉండేది.
👉🏻 అక్బర్‌ సైనికుల గుర్తింపు చిహ్నాలను, గుర్రాలకు ముద్రవేసే పద్ధతి, పట్టికలలో సైనికుల వివరాలను నమోదు చేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు.
👉🏻 అక్బర్‌ పరిపాలనలో సాధించిన గొప్ప విజయం భూమిశిస్తు విధానం. దీన్ని రెవెన్యూ మంత్రి తొడర్‌మల్‌ ప్రవేశపెట్టాడు. ఈ విధానాన్ని “బందోబస్త్‌ / ఐనీదాసలి విధానం అని కూడా అంటారు. దీని ప్రకారం శిస్తు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్ణయించబడుతుంది.
👉🏻 దీనిలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన శిస్తు సరాసరి ఫలసాయంలో మూడో వంతు నిర్ణయించబడింది.
👉🏻 కరువు కాలంలో రైతులు కట్టవలసిన శిస్తు తగ్గించి వారికి విత్తనాలు, పశువులు కొనడానికి 'తక్కావీ' బుణాలు ఇచ్చేవారు.
👉🏻 మొఘల్‌ల కాలంలో నేత పరిశ్రమ మొదటిగా అభివృద్ధి చెందింది. దీనికి ఆగ్రా, వారణాసి(బనారస్‌), పాట్నాలో దీని ఉత్పత్తి కేంద్రాలున్నాయి. ఢాకాలో పట్టు పరిశ్రమ, లాహోర్‌లో శాలువల పరిశ్రమ, సియల్‌కోటలో కాగితపు పరిశ్రమలున్నాయి.
👉🏻 భూమి 4 విధాలుగా విభజించబడింది. అవి
1. పోలజ్‌
2. పరౌతి
3. కాచల్‌
4. బంజర్‌
👉🏻 అక్బర్‌ ఆస్థానంలో వచ్చిన రాల్ఫ్‌పిచ్‌ అనే ఆంగ్లేయ యాత్రికుడు ఆగ్రా, ఫతేపూర్‌ సిక్రీలను రెండు మహానగరాలనీ, రెండూ లండన్‌ నగరానికన్నా పెద్దవనివర్లించాడు.
👉🏻 ఫాదర్‌ మాన్సరోట్‌ అనే జెసూట్‌ మత ప్రచారకుడు లాహోర్‌ మహానగరాన్ని వర్ణించాడు.

సమాధులు:

•బాబర్‌ - కాబూల్‌ (మొదట్లో ఆగ్రా వద్ద పూడ్చబడ్డాడు)
•హుమయూన్‌ - ఢిల్లీ
•షేర్షా - ససారామ్‌ (బీహార్‌)
•అక్బర్‌ - సికిందరా
•జహంగీర్‌ - లాహోర్‌ (షహాదరా వద్ద)
•నూర్జహాన్‌ - లాహోర్‌
•షాజహాన్‌ - ఆగ్రా
•ఔరంగజేబు - ఔరంగాబాద్‌ (ఖుల్దాబాద్‌)


గార్డెన్స్‌ /ఉద్యావనాలు:

•బాబర్‌ -చార్‌బాగ్‌, కాబూల్‌బాగ్‌, రామ్‌బాగ్‌
•అక్బర్ -పింజోర్‌(పంజాబ్‌), రాంబాగ్‌(ఢిల్లీ), నాసింబాగ్‌(శ్రీనగర్‌)
•జహంగీర్‌ -నిషామద్‌(లాహోర్‌), షాలిమర్‌(శ్రీనగర్‌)
•షాజహాన్ -షాలిమర్‌(లాహోర్‌), మొగల్‌ గార్డెన్స్‌ (ఆగ్రా), అంగూరీబాగ్‌(ఆగ్రా)
•ముంతాజ్‌మహల్‌ -రోజ్‌ గార్డెన్‌ (ఆగ్రా)
•కాశ్మీర్ లోని దారా గార్డెన్‌ను వజీర్‌బాగ్‌ అంటారు.


మొఘల్‌ల రాజధానులు :

•అగ్రా (1526 - 1571)
•ఫతేపూర్‌సిక్రి ( 1571-1585)
•లాహోర్‌ (1585-1598)
•ఆగ్రా ( 1598-1648)
•ధిల్లీ / షాజహానాబాద్‌ (1648-1857)


సాహిత్యం:

బాబర్‌:
•బాబర్‌ - బాబర్‌నామా, /తుజ్కి బాబరీ (టర్కీ భాషలో), మస్నవి
•మీర్జా హైదర్‌ - తారిక్‌-ఇ-రషీదీ

హుమాయూన్‌ :
•గుల్‌బదన్‌ బేగం - హుమయూన్‌ నామా
•నిజాముద్దీన్‌ అహ్మద్‌ -తబాకత్‌-ఇ-అక్చరీ

షేర్షా:
•అబ్బాస్‌ షేర్వాణీ - తాజుకీ-ఇ-షేర్హాహీ
•మాలిక్‌ మహ్మద్‌ జైసి _ - పద్మావతి (హిందీ)

అక్బర్‌:
•బదౌనీ : ముక్తకా-ఉల్‌-తవారిక్‌, రామాయణంను పర్షియాలోకి అనువదించాడు.
•అబుల్‌ ఫజల్‌ : అక్బర్‌ నామా/ఐనీ అక్బరీ, పంచతంత్రంను పర్షియాలోకి అనువదించాడు(కలీలదిమ్మ అనే పేరుతో)
•అబుల్‌ ఫైజీ : భగవద్గీతను పర్షియాలోకి, గణితశాస్త్ర గ్రంథమైన లీలావతిని పర్షియాలోకి అనువాదించాడు. నలదమయంతిని కూడా పర్షియాలోకి అనువదించాడు.
•బదౌనీ, నాకిబ్‌ఖాన్‌: మహాభారతాన్ని పర్షియాలోకి అనువదించారు(రజంనామా అనే పేరుతో)
•హజీ ఇబ్రహీం : అధర్వణవేదంను పర్షియాలోకి అనువదించాడు.
•నాకిబ్‌ఖాన్‌, ముల్లా మొహ్మద్‌, జాఫర్‌బేగ్‌:తారిక్‌-ఇ-అల్ఫీ రచించారు. (ఇస్లాం మతాన్ని స్థాపించి 1000సం॥లు పూర్తైన సందర్భంగా)
•అబ్బాస్‌ షేర్వాణి: తోఫా-ఇ-అక్చర్‌ షాహీ
•తులసీదాస్‌ - రామచరితమానస్‌

జహంగీర్‌:
•జహంగీర్‌ - జహంగీర్‌ నామా
•ముతామిద్‌ ఖాన్‌ -ఇక్చాల్‌-ఇ-నామా జహంగరీ

షాజహాన్‌:
•ఉస్తాద్‌-హమీద్‌ లహోరి : బాద్‌షా నామా (ఆస్థాన చరిత్రకారుడు)
•మొహ్మద్‌ షా/ఇనాయత్‌ షా : షాజహాన్‌ నామా
•జగన్నాథ పండితుడు : రసగంగాధరం (హిందీ), గంగాలహరి(హిందీ)
•ధారాషుకో : మజ్మ-ఉల్‌-బహ్రాయిన్‌, ఇతను ఉపనిషత్తులను, భగవద్గీతను, దోహాస్‌, యోగవిస్తారను పర్షియాాలోకి అనువధించాడు. ఇతను ఉపనిషత్తులను షకినల్‌- ఉల్-ఔలియా అనే పేరుతో పర్షియాలోకి అనువదించాడు.

ఔరంగజేబు:
•ఔరంగజేబు యొక్క ఉత్తరాలు రకాలుత్‌-ఉల్‌-ఆలంగిర్‌ అనే పుస్తకంలో సేకరించబడ్డాయి.
•కాఫీఖాన్‌ : ఇతను ఆస్థాన చరిత్రకారుడు. ముక్తక్‌-ఉల్‌-లుబాబ్‌ను రచించాడు. దబిస్తాన్‌ మజ్‌హబ్‌ను కూడా రచించాడు.
•ముస్టైదీఖాన్‌ : మజరీ ఆలంగిరి
•మీర్జా మొహమ్మద్‌: ఆలంగిర్‌ నామా
•సర్జునరాయ : కులాసా-ఉల్‌-తవారిక్‌
•అనేకమంది కలసి ఫత్వా-ఇ-ఆలంగిరిని రచించారు.

ఇతర పుస్తకాలు:
•మజ్డా - జాఫర్‌నామా
•తూసి - సియాసత్‌ నామా
•ఉర్దూ పదం ఓర్దు అనే టర్కీ పదం నుంచి వచ్చింది. ఓర్దు అంటే సైనిక శిబిరం.

మొఘల్‌ సామ్రాజ్యానికి విచ్చేసిన ఆంగ్ల రాయబారులు/ యాత్రికులు:

అక్బర్‌:
1) మాన్సరేట్‌ (పోర్చుగీసు)
2) రాల్ఫ్‌ఫిచ్‌ (ఆంగ్లేయుడు) (1588-91)

జహంగీర్‌:
1) హాకిన్స్‌ (1608-13)
2) విలియం ఫిచ్‌ (1608)
3) జాన్‌ జౌర్దన్‌ (1608-18) ఆంగ్లేయుడు, ఆగ్రాను వర్ణించాడు.
4) సర్‌ థామస్‌రో (1615-19)
5) నికోలస్‌ వితింగ్టన్‌ (1616-19) (ఇతను సతీసహగమనంను పొగుడుతూ వ్యాసాలు రాశాడు)

షాజహాన్‌:
1) ట్రావెర్నియర్‌ (1641-87) (ఫ్రెంచ్ వజ్రాల వర్తకుడు)
2) పీటర్‌ ముండీ (షాజహాన్‌ కాలంలో కరువును వివరించాడు)
3) బెర్నియర్‌ (ఫ్రెంచ్ వైద్యుడు) (దారాషుకో ఉరిని గూర్చి వివరించాడు)
4) మనుక్కి (ఇటలీ) -దారాషుకో యొక్క ఆర్టిలరీ అధికారి

ఔరంగజేబు:
నోరిస్ - (ఇతను బ్రిటీష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ రాయబారి)

No comments:

Post a Comment

Post Bottom Ad