బహమనీ సుల్తానులు - GNANA SAMHITHA

Breaking

Post Top Ad

Thursday, March 20, 2025

బహమనీ సుల్తానులు

👉🏻ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్‌పై బహమనీ అమీర్లు తిరుగుబాటు చేసి, క్రీ.శ. 13వ శతాబ్దంలో దక్కనులో రాజ్యాన్ని ఏర్పాటు చేశారు.
👉🏻దక్కను ప్రాంతంలోని గుజరాత్, దౌలతాబాద్ ఈ తిరుగుబాటుకు కేంద్ర బిందు వులు.
👉🏻దౌలతాబాద్ కేంద్రంగా ఇస్మాయిల్- ముఖ్ మొదట నాయకత్వం వహించాడు. ఆ తర్వాత ఇతను మహమ్మద్ బిన్ తుగ్లక్ చేతిలో ఓడిపోయాడు.
👉🏻క్రీ.శ. 1347లో దౌలతాబాద్ కేంద్రంగా ‘హసన్‌గంగూ’ అనే అబుల్ ముజా ఫర్ సుల్తాన్... అల్లాఉద్దీన్ హసన్ మహ్మద్ షా బహమనీ పేరుతో సింహాసనాన్ని అధిష్టించి, స్వతంత్ర బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు.
👉🏻14మంది బహమనీ సుల్తాన్‌లు సుమారు 175 ఏళ్లు దక్కన్‌ను పాలించారు. విజయనగర రాజులు వీరికి సమకాలికులు. గుల్బర్గా ఇతని రాజధాని.

అల్లాఉద్దీన్ హసన్ మహ్మద్ షా బహమనీ
👉🏻క్రీ.శ. 1347లో దౌలతాబాద్ కేంద్రంగా ‘హసన్‌గంగూ’ అనే అబుల్ ముజా ఫర్ సుల్తాన్... అల్లాఉద్దీన్ హసన్ మహ్మద్ షా బహమనీ పేరుతో సింహాసనాన్ని అధిష్టించి, స్వతంత్ర బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు.
👉🏻ఇతను తన రాజ్యాన్ని బీరార్ నుంచి కృష్ణానది దక్షిణ ప్రాంతం వరకు; తూర్పు దిశలో. వరంగల్, ఇతర తెలంగాణా ప్రాంతా లు; పశ్చిమ తీరంలో.. గోవా, దభోల్ ఓడరేవు ప్రాంతాల వరకూ విస్తరించాడు.
👉🏻‘సికిందర్ ఇసానీ’ అనే బిరుదు ఆపాదించుకున్నాడు. సికిందర్ ఇసానీ అంటే రెండో అలెగ్జాండర్ అని అర్థం.
👉🏻ఇతడు తన రాజధాని గుల్బార్గాను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దాడు.
👉🏻రాజ్యాన్ని గుల్బర్గా, దౌలతాబాద్, బీదర్, బీరార్ అనే నాలుగు తరఫీలు (రాష్ట్రాలు)గా విభజించి వాటికి అధిపతులుగా తరఫీదార్ల (గవర్నర్లు)ను నియమించాడు.
👉🏻అల్లావుద్దీన్ బహమనీ షా మలేరియా జ్వరంతో క్రీ.శ. 1358లో మరణించినట్లు ‘బుర్హన్-ఎ-మసీర్’ గ్రంథం ద్వారా తెలుస్తోంది.

మహ్మద్ షా (క్రీ.శ. 1358-1377)
👉🏻ఇతను శాంతికాముకుడిగా పేరు పొందాడు.
👉🏻విద్యా గోష్ఠులు, విద్వాంసులతో ఎక్కువ కాలం గడిపేవాడు.
👉🏻ప్రసిద్ధ పారశీక కవి హఫీజ్‌ను తన ఆస్థానానికి ఆహ్వానించాడు.
👉🏻రెండో అరిస్టాటిల్ (గ్రీకు తత్వవేత్త)గా హఫీజ్‌ను ప్రజలు కీర్తిం చారు.
👉🏻ఇతని కాలంలోనే రెండో హరిహరరాయలు అంతర్వేది ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
👉🏻అనేక మసీదులు, పేదల వసతి గృహాలు, పాఠశాలలు నిర్మించాడు.
👉🏻గుల్బర్గా, బీదర్, ఎలిచ్‌పూర్, దౌలతాబాద్‌లలో అనాథలకు ఉచిత పాఠశాలలు నిర్మించాడు.
👉🏻క్రీ.శ.1387-97ప్రాంతంలో బహమనీ రాజ్యంలో తీవ్ర క్షామం సంభవించింది.
👉🏻పది వేల ఎద్దులను ఉపయోగించి మాళ్వా, గుజరాత్‌ల నుంచి ఆహార ధాన్యాలు తెప్పించాడు.
తాజుద్దీన్ ఫిరోజ్ షా (క్రీ.శ. 1398-1422)
👉🏻ఇతను సింహాసనం అధిష్టించే సమయానికి బహమనీ రాజ్యం అల్లకల్లోలంగా ఉంది.
👉🏻కొండవీటి రెడ్డిరాజుల సహాయంతో రెండో హరిహర రాయల నుంచి అంతర్వేది ప్రాంతాన్ని (దక్కన్) తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.
👉🏻పద్మనాయకుల నుంచి పానగల్లు ప్రాంతాలను ఆక్రమించాలనే ప్రయత్నం విఫలమైంది.
👉🏻ఇతని కాలంలో మహారాష్ర్ట అంతటా పన్నెండేళ్లపాటు తీవ్ర కరవు ఏర్పడింది.
👉🏻ఫిరోజ్ షాను ధర్మబుద్ధి, ఉదార స్వభావ మున్న సుల్తాన్‌గా ‘బుర్హన్-ఎ-మాసిర్’ గ్రంథం పేర్కొంటోంది.
👉🏻బహమనీ సుల్తానుల్లో ఫిరోజ్ షా అగ్రగణ్యుడని ఫెరిస్టా పేర్కొన్నాడు.
👉🏻ఇతను బహుభాషావేత్త, దైవచింతనపరుడు, సహనశీలిగా పేరు పొందాడు.
👉🏻అనేక మంది హిందు వులను ఉన్నతోద్యోగాల్లో నియమించాడు. గుల్బర్గాలో పెద్ద మసీదును హిందూ-ముస్లిం వాస్తురీతిలో నిర్మించాడు.
👉🏻ఫిరోజాబాద్ అనే నూతన నగరాన్ని నిర్మించి గ్రీసు, చైనాల నుంచి తొమ్మిది వందల మంది యువకులను తన నగరానికి రప్పించాడు.
👉🏻చివరిరోజుల్లో అంతఃపురం విడిచి ఫిరోజ్‌షా బయటకు రాలేదు. దాంతో రాజ్య భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందనే భయంతో అతని తమ్ముడు ఫిరోజ్‌షాను బంధించి, రెండో అహ్మద్ షా పేరుతో సింహాసనం అధిష్టించాడు. చివరకు తాజుద్దీన్ ఫిరోజ్ షా జైల్లోనే మరణించాడు.

రెండో అహ్మద్ షా (క్రీ.శ.1422-1435)
👉🏻గుల్బర్గా నుంచి రాజధానిని బీదర్ నగరానికి మార్చాడు.
👉🏻షియా మతస్థులైన పారశీకులు, తురుష్కులను ఉన్నతోద్యోగాల్లో నియమించాడు.
👉🏻అజరీ అనే కవి ‘బహ్మన్‌నామా’ అనే బహమనీ వంశ చరిత్రను రచిం చాడు.
👉🏻ఇతడు అనుసరించిన మత విధానం వల్ల ముస్లింలలో విదేశీయులు, స్వదేశీయులు అనే విభేదాలు తలెత్తాయి.
👉🏻మధ్య ఆసియా ప్రాంతాలైన.. ఇరాన్, తుర్కిస్థాన్‌ల నుంచి వచ్చిన విదేశీయులు షియా శ్వేత వర్ణులుగా; ఆఫ్రికా, టర్కీల నుంచి వచ్చిన నల్లవర్ణం వారిని సున్నీ మతస్థులుగా గుర్తించాడు.
👉🏻ఈ తెగల మధ్య జాతి, మత, భిన్న పర్వాలున్నందువల్ల క్రమం గా ఘర్షణలు ప్రారంభమై, చివరకు బహమనీ రాజ్య విచ్ఛిన్నానికి దారితీశాయి.
👉🏻ఇతని తర్వాత రెండో అల్లావుద్దీన్ (క్రీ.శ. 1435-58), హుమయూన్ (క్రీ.శ.1458-61), నిజాంషా(క్రీ.శ.1461-63) సుల్తానులయ్యారు.
👉🏻క్రూరుడైనందు వల్ల ప్రజలు హుమయూన్‌ను ‘జాలిమ్’ అని పిలిచే వారని ‘ఫెరిస్టా’ పేర్కొన్నాడు.

మూడో మహ్మద్ షా (క్రీ.శ. 1463-1482)
👉🏻ఇతని కాలంలో బహమనీ రాజ్యం ఉన్నత దశను అనుభవించింది.
👉🏻దీనికి ఇతని ప్రధానమంత్రి మహ్మద్ గవాన్ కారకుడు.
👉🏻మహ్మద్ గవాన్ గొప్ప పరిపాలనాధక్షుడు, పారశీక దేశస్థుడు. మూడో మహ్మద్ షా కొలువులో వకీలు, వజీర్‌గా గవాన్ పనిచేశాడు.
👉🏻గవాన్ క్రీ.శ.1447లో బీదర్‌కు వచ్చి, రెండో అల్లావుద్దీన్ కొలువులో చేరాడు. గవాన్ గొప్ప రాజనీతిజ్ఞుడు, యుద్ధ నైపుణ్యంలో దిట్ట.
👉🏻శత్రువుల దాడుల నుంచి బహమనీ రాజ్యా న్ని రక్షించాడు.
👉🏻శక్తి సామర్థ్యాలు, సేవలను గుర్తించి, మూడో మహ్మద్‌షా ఇతన్ని ప్రధాన మంత్రిగా నియమించాడు.
👉🏻గవాన్ నాయకత్వంలో మూడో మహ్మద్ షా బెల్గాం కోటను స్వాధీనం చేసుకున్నాడు.
👉🏻విజయనగర రాజుల నుంచి గోవా, పశ్చిమ తీరాలను; ఒరిస్సా గజపతుల నుంచి కొండపల్లి, రాజ మహేంద్రి, మచిలీపట్నాలను స్వాధీనం చేసు కున్నాడు.
👉🏻తమిళనాడులోని కాంచీపురాన్ని ధ్వంసం చేశాడు. బహమనీ రాజ్యాన్ని పటిష్టం చేసే సంకల్పంతో గవాన్ అనేక సంస్కరణలు చేపట్టాడు.
👉🏻వికేంద్రీకరణ ద్వారా తరఫీదార్ల (గవర్నర్లు) అధికారాన్ని తగ్గించి, నాలుగు రాష్ట్రాలను ఎనిమిది రాష్ట్రాలుగా విభజించాడు. అవి... గుల్బర్గా, బీజాపూర్, దౌలతాబాద్, జున్నార్, గావిల్‌గర్, మహూర్, రాజమహేంద్రి, వరంగల్.
👉🏻గవాన్ పారశీక భాషలో పండితుడు.
👉🏻విద్యాభిమాని, బీదర్ నగరంలో పెద్ద మదర్సా (పాఠశాల)ను నిర్మించి, అందులో మూడువేల గ్రంథాలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడు.
👉🏻గణితం, సాహిత్యం, వైద్యశాస్త్రాలంటే అతనికి ప్రత్యేక అభిమానం.
👉🏻‘రాజట్-ఉల్-ఇన్‌షా’, ‘దివాన్-ఎ-ఇన్‌షా’ అనే రెండు గ్రంథాలను పారశీక భాషలో గవాన్ రాశాడని ఫెరిస్టా పేర్కొన్నాడు.
👉🏻సమర్‌ఖండ్‌లోని విశ్వవిద్యాల యాన్ని పోలి ఉండేలా బీదర్‌లో పెద్ద కళాశాలను స్థాపించాడు.
👉🏻మహ్మద్ గవాన్ వివిధ ప్రాంతాల తరఫీదార్లు, కులీన వంశాలపై అనేక ఆంక్షలు విధించాడు.
👉🏻పశ్చిమాసియా నుంచి కొత్తగా వచ్చిన అపాఖీల ఆధిపత్యం పెరగడం దక్కను కులీన వంశాల వారికి నచ్చలేదు.
👉🏻ఇలా అసంతృప్తి చెందిన వారంతా కుట్రతో సుల్తాన్‌కు ఫిర్యాదులు చేసి, మహ్మద్ గవాన్‌కు క్రీ.శ.1481 లో ఉరిశిక్ష వేయించారు.
👉🏻గవాన్‌ను వధించిన అనంతరం బహమనీ సామ్రాజ్యం క్రమంగా క్షీణించింది.
👉🏻మహ్మద్ గవాన్ ఉరిశిక్షతో సుల్తాన్ మహ్మద్ షా పై ప్రజలు తిరుగుబాటు చేశారు.
👉🏻చివరకు సుల్తాన్ మహ్మద్ షా క్రీ.శ.1482లో మరణించాడు.
👉🏻ఇతని మరణానంతరం బహమనీ రాజ్యం అనేక చిన్న చిన్న రాజ్యాలుగా చీలింది..

బహమనీ, విజయనగర రాజుల మధ్యపోరు
•భారతదేశ మధ్యయుగ చరిత్రలో విజయనగర, బహమనీ రాజ్యాల మధ్య నిరం తరం యుద్ధాలు జరుగుతుండేవి.
• యుద్ధాలు జరిగిన ప్రాంతాల్లో విపరీత జన, ఆస్తినష్టం సంభవించేది.
• ఉభయ పక్షాలు పట్టణాలు, గ్రామాలను భస్మీపటలం చేసేవి.
• స్త్రీలు, పిల్లలు, పురుషులను బందీలుగా పట్టుకొని, బానిసలుగా విక్రయించేవారు.
• విజయనగరం మొదటి బుక్కరాయల కాలంలో ముద్గల్ కోట కోసం ఘర్షణలు ప్రారంభమయ్యాయి.
• విజయనగర రాజులు, బహమనీ సుల్తాన్ లు మూడు ప్రాంతాల ఆధిపత్యం కోసం తరచుగా పోటీపడ్డారు.
• ఆ ప్రాంతాలు.. తుంగ భద్ర మాగాణీ, కృష్ణా-గోదావరి డెల్టా, మర ట్వాడా. ప్రధానంగా కొంకణీ ప్రాంతం.
• ఇది పశ్చిమ కనుమలకు సముద్రానికి మధ్య సన్నని చీలికలా ఉండే ప్రాంతం.
• గోవా రేవుపట్టణం ఈ ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతం సారవంతమైంది.
• ఇరాన్, ఇరాక్‌ల నుంచి మేలు జాతి గుర్రాలు, గోవారేవు ద్వారా భారతదేశానికి దిగుమతి అయ్యేవి.
• అందువల్ల రాజకీయంగా గోవా రేవుకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది.
• విజయనగర రెండో హరిహర రాయలు పశ్చిమ ప్రాంతంలో బెల్గాం, గోవాను బహమనీల నుంచి స్వాధీనం చేసుకున్నాడు.
• ఒకటో దేవరాయల కాలంలో తుంగభద్ర ప్రాంతంపై రెండు రాజ్యాలు ఆధిపత్యం కోసం పోరాడాయి.
• బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా విజయనగర మొదటి దేవరాయలను ఓడించాడు.
• కృష్ణా- గోదావరి డెల్టాపై ఆధిపత్యం కోసం విజయ నగర, బహమనీలు, ఒరిస్సా గజపతులు పోరాడారు.
• సంగమ వంశంలో రెండోదేవరాయలు సైనిక శిక్షణ కోసం ముస్లింలను చేర్చుకున్నాడు.
• శ్రీకృష్ణదేవరాయల మరణానంతరం అతని వారసుల మధ్య సింహాసనం కోసం ఘర్షణలు ప్రారంభమయ్యాయి.
• వీరిలో అళియ రామరాయలు ఆధిపత్యం చెలాయించాడు. బీజాపూర్ సుల్తాన్‌ను రామరాయలు ఓడిం- చాడు.
• ఆ తర్వాత బీజాపూర్ సుల్తాన్‌తో సంధి కుదుర్చుకొని, గోల్కొండ, అహ్మద్‌నగర్ సుల్తాన్ లను ఓడించాడు.
• చివరకు బహమనీ సుల్తాన్‌లు అందరూ కలిసి కట్టుగా క్రీ.శ.1565లో తళ్లికోట సమీపంలోని బన్నిహట్టి అనే ప్రాంతంలో అళియ రామరాయలను ఓడించారు.
• తళ్లికోట యుద్ధానంతరం విజయనగర సామ్రాజ్యం క్రమంగా అంతరించింది.

బీరార్‌:
•1484లో ఏర్పడింది
•స్థాపకుడు - ఫతే ఉల్లా ఇమాద్‌ షా
•వంశం - ఇమాద్‌ షాహీ
•అక్బర్‌ దీనిని ఆక్రమించాడు

అహ్మద్‌నగర్‌:
•1489లో ఏర్పడింది
•స్థాపకుడు - మాలిక్‌ అహ్మద్‌
•వంశం - నిజాం షాహీ
•చాంద్‌బీబీ ఈ వంశానికి చెందినది.
•ఈమె ప్రధాన మంత్రి మాలిక్‌ అంబర్‌. మాలిక్‌ అంబర్‌ భారతదేశంలో గెరిల్లా యుధ్ధం ప్రవేశపెట్టాడు.
•1633లో షాజహాన్‌ అహ్మద్‌నగర్‌ను మొగల్‌ సామ్రాజ్యంలో విలీనం చేశాడు.
బీజాపూర్‌ :
•స్థాపకుడు - యూసఫ్‌ అదిల్‌ షా
•వంశం - అదిల్‌ షాహీ
•గొప్పవాడు - ఇబ్రహీం అదిల్‌ షా
•ఇతని బిరుదులు- అబ్లాబాబా (రైతుల/పేదల స్నేహితుడు), జగత్‌గురు
•ఇతను నారస్‌పూర్‌ పట్టణాన్ని నిర్మించాడు
•ఇతను కితాబ్‌-ఇ-నారజ్‌ అనే పుస్తకాన్ని రచించాడు.
•ప్రపంచం రెండో అతిపెద్ద గుమ్మటం (రోమ్‌లోని సెయింట్‌పాల్‌ చర్చి ప్రపంచంలోని అతిపెద్ద గుమ్మటం) గల గోల్‌ గుంభజ్‌ను ఆదిత్‌షాహీ పాలకులలో ఒకడైన మహమ్మద్‌ ఆదిల్‌షా బీజాపూర్‌లో నిర్మించాడు. ఇది “విస్ఫరింగ్‌ గాలరీ"కి కూడా ప్రసిద్ధి చెందింది.
•1686లో బెరంగజేబు బీజాపూర్‌ను ఆక్రమించాడు.
గోల్కొండ(1512):
•స్థాపకుడు - సుల్తాన్‌ కులీకుతుబ్‌ షా
•వంశం - కుతుబ్‌ షాహీ
•గొప్పవాడు -మొహమ్మద్‌ కులీకుతుబ్‌షా
•మొహమ్మద్‌ కులీకుతుబ్‌షా 1591లో హైదరాబాద్‌ను, 1594లో చార్మినార్‌ను నిర్మించాడు.
•చివరి పాలకుడైన హసన్‌ తానీషా కాలంలో కంచర్ల (భక్త రామదాసు), అక్కన్న మాదన్నలు ఉండేవారు.
•1687లో ఔరంగజేబు హసన్‌ తానీషాను ఓడించి గోల్కొండను ఆక్రమించాడు.

బీదర్‌(1526):
•స్థాపకుడు - అమీర్‌ అలీ బదీద్‌ (దక్కన్‌ నక్క)
•వంశం - బరీద్‌ షాహీ
•ఇది తర్వాత కాలంలో బీజాపూర్‌లో విలీనం అయింది.

No comments:

Post a Comment

Post Bottom Ad