చోళులు - GNANA SAMHITHA

Breaking

Post Top Ad

Thursday, March 20, 2025

చోళులు

•మొదటి రాజధాని - తంజావూరు
•రెండవ రాజధాని - గంగైకొండ చోళపురం
•స్థాపకుడు - విజయాలయ

1వ పరాంతకుడు:
•1వ వరాంతకుడు ఉత్తరవేరురు శాసనమును వేయించాడు. ఈ శాసనంలోనే మొట్టమొదటిసారిగా గ్రామ స్థానిక స్వపరిపాలన గురించి పేర్కొనబడింది.
•తమిళనాడులోని ఉత్తరమెరూర్‌ అనే గ్రామంలో గల ఒక దేవాలయంలోని గోడలపై ఈ శాసనం రాయబడింది.
•అతనికి వీరచోళమధురైకొండ అనే బిరుదులు కలదు.

రాజరాజ చోళుడు:
•ఇతని అసలు పేరు - అరుమోలి
•బిరుదు _ ముమ్మడి చోళ
•ఇతను తంజావూరులో బృహదీశ్వర దేవాలయం / రాజరాజేశ్వర దేవాలయమును నిర్మించాడు. ఈ దేవాలయంలో రాజు, రాణి విగ్రహాలను పెట్టి పూజించే విధానమును దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టబడింది (భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ విధానం రాజస్థాన్‌లోని లంతికాదేవి దేవాలయంలో ప్రవేశపెట్టబడింది). అప్పట్లో ఈ బృహదీశ్వర దేవాలయం అత్యంత ధనిక దేవాలయం.
•ఇతను ఉత్తర శ్రీలంకను ఆక్రమించి దానికి ముమ్మడి చోళ మండలం అని పేర్కొన్నాడు.
•క్రీ.శ.1001లో భూమి సర్వే విధానమును ప్రవేశపెట్టాడు.
•ఇతను చైనాకు రాయబారులను పంపాడు.
•ఇతని కుమార్తె కుందవైను వేంగి రాజు విమలాదిత్యునికిచ్చి వివాహం చేశాడు.
•నాగపట్నంలో బౌద్ద మఠం నిర్మించుకొనుటకు శైలేంద్రరాజు శ్రీమారవిజయతుంగ వర్మన్‌కు అనుమతి ఇచ్చాడు.
•ఇతను జావాలో శివుడి, విష్ణు దేవాలయాలు నిర్మించాడు.

రాజేంద్ర చోళుడు (1012-44):
•బిరుదులు - గంగైకొండ, కడరన్‌ కొండ
•ఇతను ఆగ్నేయ ఆసియాలోని శైలేంద్ర సామ్రాజ్య పాలకులను ఓండించాడు. ఇతను గంగానది నుంచి జలమును తీసుకొనివచ్చి కావేరీ నది ఒడ్డున "గందైకొండ చోళపురము” అనే పట్టణాన్ని నిర్మించాడు. ఇక్కడే గంగైకొండ చోళేశ్వరి అనే దేవాలయుమును నిర్మించాడు.
•కలిదిండి యుద్ధంలో కళ్యాణి చాళుక్యులను ఓడించాడు.

కులోత్తుంగ చోళుడు:
•ఇతని బిరుదు -సంగం తివర్త
•ఇతను దూర ప్రాచ్య దీవులను స్వయంగా సందర్శించాడు.
•ఇతని కాలం నుండి చోళులను “చోళ-చాళుక్యులు” అంటారు.

రెండవ రాజాధిరాజ:
•ఇతని బిరుదు -త్రిభువన చక్రవర్తి

3వ రాజేంద్రుడు:
•ఇతను చివరి పాలకుడు
•తొండైమార్‌ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర దేవాలయమును నిర్మించాడు.
•చోళ రాజ్యం మండలంగా, మండలం కొట్టం లేదా వలనాడుగా, కొట్టం నాడులుగా, నాడు కుర్రంగా, కుర్రం గ్రామాలుగా విభజించబడ్డాయి.
•పెద్ద గ్రామాన్ని తనియూర్‌ అనేవారు
•చోళులు కంచు విగ్రహాలకు ప్రసిద్ధి
•13వ శతాబ్ధంలో మార్కోపోలో దక్షిణ భారతదేశంలో పర్యటించాడు. ఒకవేళ చోళరాజు మరణిస్తే అతని అంగరక్షకులందరూ సామూహికంగా ఆత్మహత్యలు చేసుకునేవారని ఇతను పేర్కొన్నాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad