తొలి మధ్యయుగము 750 AD- 1200 AD - GNANA SAMHITHA

Breaking

Post Top Ad

Thursday, March 20, 2025

తొలి మధ్యయుగము 750 AD- 1200 AD

దక్షిణ భారతదేశం :
1. పల్లవులు
2. చోళులు
3. బాదామి చాళుక్యులు
4 రాష్ట్రకూటులు
5. కల్యాణీ చాళుక్యులు

ఉత్తర భారతదేశం :
క్రీ.శ. 750 నుంచి 1200 మధ్య కాలంలో ఉత్తర భారతదేశాన్ని ప్రధానంగా రాజపుత్రులు పాలించారు. రెండు రకాల రాజపుత్రులు ఉండేవారు. వారు
అగ్నికుల రాజపుత్రులు (విదేశీ):
1 చౌహానులు
2. గూర్జర ప్రతీహారులు
3. పరమారులు
4. సోలంకీలు
అగ్నికుల రాజపుత్రులు (స్వదేశీ):
1. కాలచూరీలు (ఖేది)
2. చందేళులు
3. గహద్వాలులు
4. రాథోడ్‌లు (జోథ్‌పూర్‌)

బెంగాల్‌ను పాల, సేన వంశాలు పాలించాయి

కాశ్మీర్‌ను కర్కోటకు, ఉత్పాల, లోహార వంశాలు పాలించాయి.

వాయువ్య భారతదేశంలో బ్రవ్మాణ షాహీలు పాలించారు.


చౌహానులు:

👉🏻రాజధాని - శాకాంబరి
👉🏻స్థాపకుడు... - వాసుదేవ/ సింహరాజు
👉🏻అతిగొప్పవాడు - పృథ్విరాజ్‌ చౌహాన్‌ (3వ పృథ్విరాజు)
👉🏻అజ్మీర్‌ పట్టణాన్ని అజయరాజు నిర్మించాడు.
👉🏻క్రీ.శ. 1191 మొదటి తరాయిన్‌ యుద్ధంలో ఘోరీ మహమ్మద్‌, పృథ్వీరాజ్‌పై దాడిచేసి ఓడిపోయాడు.
👉🏻క్రీ.శ. 1192 రెండవ తరాయిన్‌ యుద్ధంలో ఘోరీ మహమ్మద్‌ పృథ్వీరాజ్‌ను ఓడించాడు.
👉🏻పృథ్వీరాజ్‌ కాలంలో సూఫీ సన్యాసి మొయినోద్దీన్‌ చిస్తీ అజ్మీర్‌లో స్థిరపడ్డారు.
👉🏻ఈయన ఆస్థానంలో చాంద్‌ బర్ధాయ్‌ హిందీలో ప్పథ్వీరాజ్‌ రాసో, సంస్కృతంలో 'పృథ్వీరాజ్‌ విజయ' అనే గ్రంథాలను 👉🏻రచించాడు.
👉🏻పృథ్విరాజ్‌ చౌహాన్‌ కనోజ్‌ పాలకుడైన జయచంద్రుని కుమార్తె సంయోగితను(సన్యోగిత) ఎత్తుకుపోయి వివాహం చేసుకున్నాడు.


గూర్జర ప్రతీహరులు :

👉🏻మొదటి రాజధాని - భిమ్మల్‌
👉🏻రెండవ రాజధాని - కనోజ్‌
👉🏻స్థాపకుడు - 1వ నాగభట్టుడు
👉🏻అతి గొప్పరాజు - మిహిర్‌ భోజుడు
👉🏻రాజపుత్రుల్లో రాజకీయంగా మొట్టమొదటగా ప్రసిద్ధి చెందినవారు -ప్రతిహారులు
👉🏻ప్రతిహార అంటే ద్వార పాలకుడు/ కోట రక్షకుడు
👉🏻వీరు రామాయణంలో లక్ష్మణుడి సంతతి వారమని ప్రకటించుకున్నారు.
👉🏻అరబ్‌ యాత్రికుడు సులేమాన్‌ మిహిరభోజుని రాజ్యాన్ని సందర్శించాడు.
👉🏻మిహిర్‌ భోజుడు భోజ్‌పూర్‌ పట్టణాన్ని నిర్మించాడు.
👉🏻మిహిర్‌ భోజునికి 'ఆదివరాహి, “ప్రబోసి అనే బిరుదులు ఉన్నాయి.
👉🏻మహేంద్రపాల లేదా మహిపాల ఆస్థానంలోని రాజశేఖరుడు ఈ క్రింది పుస్తకాలు రచించాడు.
1) కర్పూర మంజరి
2) బాల రామాయణ
3) బాల భారతం
4) విద్యాశాలభంజిక


పరమారులు :

👉🏻రాజధాని - ధార్‌
👉🏻స్థాపకుడు - ఉపేంద్ర
👉🏻గొప్పవాడు. - భోజుడు
👉🏻భోజరాజు గొప్ప కవి.
👉🏻ఇతను కవి పండిత పోషకుడు, తత్వ వ్యాకరణ , అలంకార, శిల్ప వాస్తు, ఖగోళ, న్యాయ శాస్త్రాల్లో పండితుడు.
👉🏻23కు పైగా గ్రంథాలు రచించాడు. వీటిలోముఖ్యమైనవి
1. సమరాంగణ సూత్రధార
2. పతంజలి యొక్క యోగ సూత్రపై వ్యాఖ్యానం
3. ఆయుర్వేద సర్వస్వం
4. రామాయణ చంపు
5. యుక్తికల్ప తరావు
6. సరస్వతి కంఠాభరణ
7. తత్వప్రకాశ
👉🏻ఇతని ఆస్థానంలో గల ప్రముఖ కవులు
1 ధనపాలుడు
2 శాంతిసేనుడు
3 ప్రభాచంద్రసూరి
4 ఉవాతుడు
👉🏻ఇతను గొప్ప భవన నిర్మాత. ఇతను థార్‌లో సరస్వతీ ఆలయంను నిర్మించాడు.
👉🏻భోజుడు భోజ్‌పూర్‌ సరస్సును తవ్వించాడు.
👉🏻వకవతిరాజా ముంజ కాలంలో వద్మగుప్తుడు “నవసహసాంక చరిత్ర అనే పుస్తకాన్ని రచించాడు.
👉🏻మెరుటుంగా -ప్రబంధ చింతామణి రచించాడు.
👉🏻వకపతిరాజా-ముంజసాగర చెరువును థార్‌లో త్రవ్వించాడు.
👉🏻పరమార రాజు ఉదయాదిత్యుడు ఉదయ్‌పూర్‌లోని నీలకంలేశ్వరాలయాన్ని నిర్మించాడు.

సోలంకీలు:

👉🏻రాజధాని - అనిల్‌ పాటక
👉🏻స్థాపకుడు - మూలరాజ-1
👉🏻గొప్పవాడు - జయసింహ సిద్ధిరాజు
👉🏻ఇతను 1113-14లో సింహ శకమును ప్రారంభించాడు.
👉🏻ఇతని ఆస్థానంలోని హేమచంద్రుడు 'పరిశిష్ట పర్వన్‌' అనే పుస్తకాన్ని రచించాడు.
👉🏻కుమారపాల వ. కూడా హేమచంద్రుడు ఉన్నాడు.
👉🏻మొదటి భీమరాజు కాలంలో గజనీ మహమ్మద్‌ సోమనాథ ఆలయాన్ని దోచుకున్నాడు.
👉🏻మౌంట్‌ అబూలోని ప్రసిద్ధ దిల్‌వారా ఆలయాన్ని ఈయన కాలంలో విమల అనే సైన్యాధిపతి నిర్మించడం జరిగింది.
👉🏻2వ భీమదేవ కాలంలో మొహ్మద్‌ ఘోరీ సోమ్‌నాథ్‌ దేవాలయంపై దాడి చేశాడు.
👉🏻సునక్‌లోని నీలకంఠ మహాదేవ దేవాలయం, దెల్‌వెల్‌లోని లింబోజీమాత దేవాలయం వీరి కాలం నాటివే.


కాలచూరీలు(చేది) :

👉🏻రాజధాని - త్రిపురి
👉🏻స్థాపకుడు - కొక్కల
👉🏻గొప్పవాడు - లక్ష్మీకర్ణ (ఇతన్ని త్రి కళింగాధిపతి అంటారు) -
👉🏻ఈ వంశానికి చెందిన 'గార్గేయ దేవుడు' కూడా ఒక గొప్ప వీరుడు.
👉🏻గార్గేయ దేవుడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దిగ్విజయ యాత్ర చేశాడు.
👉🏻ఇతని బిరుదులు -విక్రమాదిత్య, శ్రీకళింగాధిపత్య
👉🏻గార్గేయ దేవుని కుమారుడు -కర్ణదేవ
👉🏻కర్ణదేవుడు వందకుపైగా యుద్దాలు చేశాడని పేర్కొంటారు.
👉🏻చందేల రాజు త్రిలోక్యమల్లుడు కాలచూరి చివరి రాజు అయిన జయసింహుని ఓడించడంతో వీరి వంశం అంతమయింది.


చందేలులు :

👉🏻రాజధాని - ఖజురహో
👉🏻స్థాపకుడు- నన్నుక
👉🏻వీరి పటిష్టమైన కోట -కలింజర్‌ కోట
👉🏻వీరు బుందేల్‌ ఖండ్‌ నుండి పాలించారు
👉🏻ఈ వంశానికి చెందిన ధంగరాజు ఖజురహోలో ఈ క్రింది దేవాలయాలు నిర్మించాడు
1 విశ్వనాథ దేవాలయం
2 జీననాథ దేవాలయం
3 వైద్యనాథ దేవాలయం
👉🏻పై దేవాలయాలను ఇండో ఆర్యన్‌ శైలిలో నిర్మించాడు.
👉🏻విద్యాధర్‌ కాలంలో మహ్మద్‌ గజిని చందేల రాజ్యంపై దాడి చేశాడు.
👉🏻ఈ వంశానికి చెందిన యశోవర్మ(లక్ష్మణ వర్మ) ఖజురహోలో యశోవర్మ చతుర్భుజ (విష్ణు) దేవాలయాన్ని నిర్మించాడు.
👉🏻చందేలులు ఖజురహో దేవాలయాలను నిర్మించారు(ఎరోటిక్‌/ నగ్నశైలి).


గహద్వాలులు:

👉🏻రాజధాని - కనోజ్‌
👉🏻స్థాపకుడు - చంద్రధర
👉🏻గొప్పవాడు. - జయచంద్ర
👉🏻క్రీ.శ. 1194లో మహమ్మద్‌ ఘోరీ చాంద్వార్‌ యుద్ధంలో జయచంద్రను హతమార్చాడు.
👉🏻గహద్వాలు పాలకులలో గోవింద చంద్రుడు మంత్రి లక్ష్మీధరుడు స్ట్రుతికల్ప తరావ/కల్పద్రుమంతో సహా అనేక న్యాయ గ్రంథాలను రచించాడు
👉🏻గోవిందచంద్రుడు “తురువ్కదండి' అనే పన్నును విధించాడు


రాథోడులు :

👉🏻రాజధాని - జోధ్ పూర్
👉🏻వీరు జయచంద్ర నంతతికి చెందినవారమని ప్రకటించుకున్నారు.
👉🏻వీరి ఆస్థానంలోని శ్రీహర్షుడు నైషధ, ఖండన ఖాండ ఖాంద్యక అనే పుస్తకాలను రచించాడు.
👉🏻'నైషధ చరిత' రచయిత అయిన శ్రీహర్షుడుని జయచంద్రుడు పోషించాడు.


పాల వంశము:

👉🏻రాజధాని - మొంఘీర్‌
👉🏻స్థాపకుడు - గోపాలుడు
👉🏻ఇతడు ఉద్ధండపుర విశ్వవిద్యాలయంను స్థాపించాడు.
👉🏻అతి గొవ్వరాజు -ధర్మపాలుడు
👉🏻ఇతను విక్రమశిల విశ్వవిద్యాలయమును స్థాపించాడు.
👉🏻బౌధ్ధ మతంలో తాంత్రిక మతం/ వజ్రయానం (మంత్ర, తంత్రాలను విశ్వసించుట) ఈ విక్రమశిల విశ్వవిద్యాలయం ద్వారా వ్యాప్తి చెందింది.
👉🏻దీపాంకరుడు ఈ విశ్వవిద్యాలయంకు చెందినవాడు.
👉🏻దేవపాలుడు ఒక గొప్ప యుద్ధవీరుడు
👉🏻రామపాలుని ఆస్థానంలోని సంద్యాకరనందిని రామపాల చరిత అనే పుస్తకాన్ని రచించాడు.
👉🏻రామపాలుడు కైవర్త అనే మత్స్యకారులతో పోరాటం చేసాడు.
👉🏻రామపాలుడు రమావతి అనే పట్టణాన్ని నిర్మించాడు.


సేన వంశము:

👉🏻మొదటి రాజధాని - నాడియా
👉🏻రెండవ రాజధాని - గౌడ్‌
👉🏻స్థాపకుడు - సామంతసేన
👉🏻బల్లలసేనుడు కులినిజం అనే ఒక కొత్త నియమావళిని బ్రాహ్మణుల కొరకు ప్రవేశపెట్టాడు.
👉🏻ఇతను గౌడ్‌/లక్నోటి పట్టణాన్ని నిర్మించాడు.
👉🏻గొప్పవాడు - లక్ష్మణసేనుడు
👉🏻లక్ష్మణసేనుడి ఆస్థానంలో పంచరత్నాలు(5గురు కవులు) ఉండేవారు. వీరు
1) జయదేవుడు -గీత గోవిందము
2) ధోయీ - పవనదూతము
3) హాలయుద్ధ - బ్రాహ్మణ సర్వస్వం
4) శ్రీధరదాస -సదుక్తి కర్ణామృత
5) ఉమాపతి


కాశ్మీర్‌ను పాలించిన వంశాలు:

1) కర్కోటకులు:
ముఖపిద లలితాదిత్య కాశ్మీర్‌లో మార్తాండ దేవాలయము(సూర్య దేవాలయము)ను నిర్మించాడు.
ఇతని గురించి కల్హణుడి రాజతరంగిణిలో పేర్కొనబడింది.

2) ఉత్పల వంశం:
అవంతి వర్మ స్థాపించాడు. ఇతని ఆస్థానంలో అనందవర్ధనుడు ఉన్నాడు. ఆనందవర్ధనుడు “ధ్వన్యాలోకం” అనే సంస్కృత అలంకార శాస్త్రంను రచించాడు.

3) లోహరా వంశం
3వ జయసింహుని కాలంలో కల్హణుడు రాజతరంగిణిని రచించాడు. దీనిలో కాశ్మీర్ వర్ణన గూర్చి, పాలన గూర్చి ఉంది.

👉🏻షమీర్‌ వంశానికి చెందిన జైనుల్‌ అబిదిన్‌ కాశ్మీర్‌ అక్చర్‌గా పేర్కోనబడతాడు.
👉🏻కాశ్మీర్ పాలకుడు హర్షుడు నీరో ఆఫ్‌ కాశ్మీర్ ‌గా పిలవబడతాడు.


బ్రాహ్మణ షాహీలు:

👉🏻రాజధాని -ఉదబందాపూర్‌
👉🏻స్థాపకుడు -లల్లియషాహీ
👉🏻భీముని మనవరాలు రాణి దిగ్ద కాశ్మీర్‌కు చెందిన క్షేమగుప్తను వివాహమాడింది.
👉🏻గజనీ దాడుల కారణంగా జయపాల రాజధానిని భతిండాకు మార్చాడు.
👉🏻తర్వాత పాలకుడైన ఆనందపాల క్రీ.శ. 1007-08లో వైహింద్‌ యుద్దంలో గజనీ చేతిలో మరణించాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad