జాతీయోద్యమం - మితవాద యుగం: 1885 - 1905 - GNANA SAMHITHA

Breaking

Post Top Ad

Thursday, March 20, 2025

జాతీయోద్యమం - మితవాద యుగం: 1885 - 1905

1885 డిసెంబర్ 28న జాతీయ కాంగ్రెస్ స్థాపనతో భారత జాతీయోద్యమం ప్రారంభమైనట్లు చెప్పవచ్చు. జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 1885 నుంచి 1947 వరకు కొనసాగిన జాతీయ ఉద్యమాన్ని మూడు దశలుగా విభజించవచ్చు. అవి:
1. మితవాద యుగం: 1885 - 1905
2. ఆతివాద యుగం: 1905 - 1919
3. గాంధీ యుగం: 1919 - 1947

బ్రిటిష్ ఇండియా సొసైటీ: బ్రిటిష్ ఇండియాలోని భారతీయుల స్థితిగతులను మెరుగుపరచాలనే లక్ష్యంతో కొందరు బ్రిటిష్‌వారు 1839లో లండన్‌లో 'బ్రిటిష్ ఇండియా సొసైటీ'ని స్థాపించారు. దీంట్లో సభ్యులైన లార్డ్ బ్రౌగాయ్ డేనియల్ఓకొనెల్, జార్జి థామ్సన్, సర్ చార్లెస్ ఫోర్‌బెస్ ఇంగ్లండులో విస్తృతంగా పర్యటించి భారతీయుల కష్టాలను తీర్చాలని పేర్కొన్నారు. ఈ సంఘం ఇంగ్లండ్‌లోని భారతీయుల శ్రేయస్సును కాంక్షించే వారందరికీ ఒక వేదిక కల్పించింది.

బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ:
దీన్ని 1843లో థామ్సన్ ద్వారకానాథ్ టాగూర్ మొదలైనవారు బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీని స్థాపించారు. భారతీయుల కష్టాలను ఆంగ్లేయుల దృష్టికి తీసుకురావడమే దీని లక్ష్యం. 1851లో బ్రిటిష్ ఇండియా సొసైటీలో ఈ సంస్థ కలిసిపోయింది.

బ్రిటిష్ ఇండియా సంఘం: 1851లో బెంగాల్‌లోని ప్రముఖులు బ్రిటిష్ ఇండియా సంఘాన్ని స్థాపించారు. భారతీయులకు శాసనసభలో ప్రాతినిథ్యం కల్పించాలని, సివిల్ సర్వీస్ పరీక్షలు ఇండియాలోనే జరపాలని ప్రభుత్వానికి ఇది విన్నవించింది. భారతీయుల్లో రాజకీయ చైతన్యం తేవడానికి ఈ సంఘం గొప్ప కృషి చేసింది.

మద్రాస్ దేశీయ సంఘం:
1852లో మద్రాస్ నేటివ్ సంఘాన్ని స్థాపించారు. దీనిలో ప్రముఖ పాత్ర వహించింది గాజుల లక్ష్మీనరసుసెట్టి.

బొంబాయి సంఘం: దీన్ని 1852లో బొంబాయిలో స్థాపించారు.

పూనా సార్వజనిక సభ:
1870లో రనడే నాయకత్వంలో పూనాలో సార్వజనిక సభను స్థాపించారు. సామాన్య ప్రజలకు రాజకీయాలు పరిచయం చేసి, వారి భాధ్యతలను గుర్తుచేయడం ఈ సభ ముఖ్యోద్దేశం.

ఇండియా లీగ్: 1875లో అమృత బజార్ పత్రికా సంపాదకుడైన శశికుమార్ ఘోష్ బెంగాల్‌లో ఇండియా లీగ్‌ను స్థాపించాడు. భారతీయుల్లో జాతీయ భావాన్ని పెంపొందించడమే దీని లక్ష్యం.

మద్రాస్ మహాజన సభ:
1884లో విద్యావంతులైన యువకులు ఈ సభను స్థాపించారు. దీంట్లో ప్రధాన పాత్రవహించిన నాయకుడు ఆనందాచార్యులు.

లండన్ ఈస్టిండియా సంఘం: 1865లో అన్ని రాష్ట్రాలకూ చెందిన భారతీయులు కలిసి ఇంగ్లండులో దీన్ని స్థాపించారు. ఈ సంఘం ఆంగ్ల పరిపాలనలోని లోపాలను వివరించింది.

తూర్పు ఇండియా సంఘం:
1866లో ఈ సంఘాన్నిస్థాపించారు. దీంట్లో భారతీయులే కాకుండా ఆంగ్లేయులు కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘంలో ముఖ్య పాత్ర వహించిన నాయకుడు దాదాభాయ్ నౌరోజీ.

బొంబాయి ప్రెసిడెన్సీ సంఘం: 1885లో తెలాంగు త్యాబ్జి, ఫిరోజ్‌షా మోహతాలు కలిసి బొంబాయి ప్రెసిడెన్సీ సంఘాన్ని స్థాపించారు. తొలి జాతీయ కాంగ్రెస్ మహాసభను జరపడానికి ఇది ఆతిథ్యమిచ్చింది.



బారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన ముఖ్య సంస్థలు/ పార్టీలు:
1887 -నేషనల్‌ సోషల్‌ కాన్ఫరెన్స్‌ -ఎం. జి.రనడే
1888 -యునైటెడ్‌ ఇండియా పాట్రియటిక్‌ అసొసియేషన్‌ సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌-అలీగడ్‌
1889 -British Committee of INC - A.O. హ్యూమ్‌, దాదాభాయ్‌ నౌరోజీ, వెడిన్‌బర్న్‌ -లండన్‌. ఇది 1890లో ఇండియా అనే జర్నల్‌ను ప్రచురించింది. దీని సంపాదకుడు -దిగ్బీ
1911 -Social Science League - ఎన్‌. జి.చంద్రవార్కర్‌-లాహోర్‌
1925 -సీపీఐ-సత్యభక్త-కాన్సూర్‌
1927 -ఆల్‌ ఇండియా ఉమెన్‌ కాన్ఫరెన్స్‌-సదాశివ అయ్యంగార్‌ -మద్రాస్‌
1928 -లేబర్‌ స్వరాజ్‌ పార్టీ-కాజీ-నజ్రుల్‌ ఇస్లాం
1936 -ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ కాన్ఫరెన్స్‌-మున్నీ ప్రేమ్‌చంద్‌
19039 - India Party Bolshvik -ఎన్‌.డి. మజుందార్‌ -కలకత్తా
1940 -Radical Democratic Praty - M.N. Roy

మితవాద యుగం

        జాతీయోద్యమంలో ప్రారంభ దశను మితవాద యుగం (Moderate Phase)గా పేర్కొంటారు. దీన్ని జాతీయవాదానికి బీజాలు పడిన దశగా చెప్పవచ్చు. మితవాదులు బ్రిటిష్ పాలన వల్లే భారతీయులకు మేలు జరుగుతుందని భావించినా, భారతీయుల కష్టాలకు బ్రిటిష్ పాలకుల అసమానత్వ విధానాలే కారణమని పేర్కొన్నారు. పాశ్చాత్యుల రాజకీయ అనుభవం ద్వారానే భారతదేశ ప్రగతి సాధ్యమని మితవాదుల నమ్మకం. చట్టబద్ధమైన పద్ధతులు, శాంతియుత మార్గాల ద్వారా వీరు తమ లక్ష్యాల సాధనకు కృషి చేశారు.


మితవాదుల విధానం: ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన (Pray, Petition, Protest). ప్రముఖ అతివాద నాయకుడు అరబిందో ఘోష్ దీన్ని P3 విధానంగా పేర్కొన్నారు.
మితవాదుల లక్ష్యాలను రాజకీయ, పాలన, ఆర్థిక లక్ష్యాలుగా విభజించవచ్చు.
రాజకీయ లక్ష్యాలు

  •     శాసన మండలిని విస్తరించాలి.
  •     శాసన మండలి విధులను పెంచాలి.
  •     ప్రజా ప్రతినిధుల సంస్థల సంఖ్యను పెంచాలి.
  •     ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకునే ప్రతినిధులకు పాలనలో ప్రాముఖ్యం ఇవ్వాలి.

పాలనా లక్ష్యాలు

  •     అత్యున్నత పాలనాధికారులుగా భారతీయులను నియమించాలి.
  •     బ్రిటిష్ సామ్రాజ్య అధికార పరిధిలోనే భారతీయులకు స్వయం పాలన ఇవ్వాలి.
  •     ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసీఎస్) పరీక్షలను భారత్, ఇంగ్లండ్‌లో ఒకేసారి నిర్వహించాలి.
  •     న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరు చేయాలి.
  •     పత్రికలకు భావ ప్రకటన స్వేచ్ఛలపై ఆంక్షలు తొలగించాలి.
  •     భారతీయులపై జాతి వివక్షతో చేసిన చట్టాలను రద్దు చేయాలి.
  •     సైన్యంలో భారతీయులకు ఉన్నత పదవులు ఇవ్వాలి.
  •     విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు రక్షణ కల్పించాలి.
  •     అటవీ చట్టాలను, పాలనను సంస్కరించాలి.

ఆర్థిక లక్ష్యాలు

  •     భారతదేశం నుంచి సంపద తరలింపును నిలిపేయాలి.
  •     హోమ్‌చార్జీలు, రక్షణ వ్యయం తగ్గించాలి.
  •     భారతీయ పరిశ్రమలకు దోహదపడేవిధంగా సాంకేతిక విద్యను ప్రోత్సహించాలి.
  •     అసమానత్వ ఎగుమతి సుంకాలు తగ్గించాలి.
  •     నీటి పారుదల సౌకర్యాలు, బ్యాంకుల స్థాపన ద్వారా రైతులను ఆదుకోవాలి.
  •     ఉద్యానవన శ్రామికులకు తగిన సౌకర్యాలు కల్పించాలి.
  •     ఉప్పుపై పన్ను తొలగించాలి.
  •     విదేశాల నుంచి దిగుమతయ్యే కాటన్ వస్త్రాలపై దిగుమతి సుంకాలు విధించాలి.

హోమ్ చార్జీలు

  •     భారతదేశంలో పని చేసి వెళ్లిన పౌర, మిలిటరీ, రైల్వే అధికారుల పింఛన్‌లు, ఇతర అలవెన్స్ లు.
  •     ఆయుధాల కొనుగోలు, భారత్‌లో కార్యాలయాల నిర్వహణ ఖర్చులు.
  •     అప్పులు, రైల్వే పెట్టుబడులపై వడ్డీ.
  •     ఈస్టిండియా కంపెనీ నుంచి పదవీ విరమణ పొందిన అధికారుల పింఛన్, అలవెన్స్ లు.


మితవాదుల విజయాలు

  •     దేశవ్యాప్తంగా ప్రజల్లో జాతీయతా భావం, చైతన్యం కలిగించారు.
  •     రాజకీయ వ్యవహారాల్లో ప్రజలకు శిక్షణ ఇచ్చి, ప్రజాస్వామ్యం పట్ల ఆసక్తి కలిగించారు.
  •     బ్రిటిషర్లు భారత్ నుంచి సంపదను తరలించుకుపోయే విధానం, దాని ప్రభావం గురించి ప్రజలకు వివరించారు.
  •     1892 కౌన్సిల్ చట్టం ద్వారా.. ఎన్నికైన స్థానిక సంస్థలకు కొన్ని అధికారాలు ఇచ్చేలా విజయం సాధించారు.
  •     తర్వాతి కాలంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటానికి బలమైన పునాది వేశారు.

మితవాదుల వైఫల్యాలు

  •     ప్రజా ఉద్యమాల బలాన్ని గుర్తించలేక పోయారు. వీరి కార్యకలాపాలు అతికొద్ది మంది విద్యావంతులు, సంపన్నులకే పరిమితమయ్యాయి.
  •     వీరు సాధించిన విజయాలు తాత్కాలికం.
  •     మితవాదులు చాలా ఆలస్యంగా.. 19 శతాబ్దం చివరినాటికి బ్రిటిషర్ల నిజమైన ప్రవృత్తిని గుర్తించారు.

ప్రముఖ మితవాద నాయకులు నిర్వహించిన పత్రికలు

  •     దాదాభాయ్ నౌరోజి - వాయిస్ ఆఫ్ ఇండియా, రాఫ్త్ గోఫ్తార్
  •     ఫిరోజ్ షా మెహతా - బాంబే క్రానికల్
  •     సురేంద్రనాథ్ బెనర్జీ- బెంగాలీ
  •     గోపాలకృష్ణ గోఖలే - రాష్ట్ర సభ సమాచార్, సుధారఖ్

మితవాద నాయకుల రచనలు

  •     దాదాభాయ్ నౌరోజి - పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, డెబ్ట్ టు ఇండియా.
  •     డబ్ల్యు.సి. బెనర్జీ - ఇండియన్ పాలిటిక్స్
  •     సురేంద్రనాథ్ బెనర్జీ - ఎ నేషన్ ఇన్ ద మేకింగ్.
  •     గోపాలకృష్ణ గోఖలే - ది ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సర్వీస్.


ప్రముఖ మితవాద నాయకులు - బిరుదులు/ విశేషాలు

  • దాదాభాయ్ నౌరోజి - గ్రాండ్ ఓల్డ్‌మ్యాన్ ఆఫ్ ఇండియా, ఫాదర్ ఆఫ్ డ్రెయిన్ థియరీ
  • ఫిరోజ్ షా మెహతా - సర్, అన్‌క్రౌన్‌డ్ కింగ్ ఆఫ్ బాంబే
  • బద్రుద్దీన్ త్యాబ్జి- జాతీయ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించిన తొలి ముస్లిం
  • డబ్ల్యు.సి. బెనర్జీ - విస్మృత దేశ భక్తుడు (Forgotten Patriot)
  • సురేంద్రనాథ్ బెనర్జీ - ఇండియన్ డెమస్తనీస్, సిల్వర్ టంగ్ ఒరేటర్
  • గోపాలకృష్ణ గోఖలే - గాంధీజీ రాజకీయ గురువు
ప్రముఖ మితవాద నాయకులు
పేరు కాలం అధ్యక్షత వహించిన జాతీయ కాంగ్రెస్ సమావేశం స్థాపించిన సంస్థలు
దాదాభాయ్ నౌరోజి 1825-1917 కలకత్తా సమావేశం (1886) లాహోర్ (1893) కలకత్తా (1906) లండన్ ఇండియా సొసైటీ, ఈస్ట్ ఇండియా అసోసియేషన్, పార్శీ రిఫార్‌‌మ అసోసియేషన్
ఫిరోజ్‌షా మెహతా 1845-1915 కలకత్తా (1890) బాంబే ప్రెసిడెన్సీ
బద్రుద్దీన్ త్యాబ్జి 1844-1906 మద్రాస్ (1887) అంజుమన్-ఇ-ఇస్లాం, బాంబే ప్రెసిడెన్సీ (మెహతాతో కలిసి)
ఉమేష్ చంద్ర బెనర్జీ 1844-1906 బొంబాయి (1885) అలహాబాద్ (1892) ---
సురేంద్రనాథ్ బెనర్జీ 1848-1925 పుణే (1895) అహ్మదాబాద్(1902) ఇండియన్ అసోసియేషన్, ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ (ఆనంద మోహన్‌తో కలిసి)
ఆనంద మోహన్ బోస్ 1847-1906 మద్రాస్ (1896) సాధారణ బ్రహ్మసభ, ఇండియన్ సొసైటీ
గోపాలకృష్ణ గోఖలే 1866-1915బెనారస్ (1905)ది సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, దక్కన్ సభ

గోపాలకృష్ణ గోఖలే :

•బిరుదు- భారత జాతీయ ఉద్యమ పితామహుడు
•వార్తాపత్రిక - సుధారఖ్‌ (జి. జి. అగార్కర్‌ కూడా సుధారఖ్‌‌ పత్రికను మహారాష్ట్రలో ప్రచురించాడు)
•పుస్తకము - The Principles of Political Science
•సంస్థ - The Servants of India Society (1905లో బొంబాయిలో)
•గురువు - మహాదేవ గోవింద రెనడే (ఎం. జి.రెనడే )
•గాంధీజీ యొక్క రాజకీయ గురువు - గోఖలే
•నిర్బంధ ప్రాథమిక విద్యను డిమాండ్‌ చేసిన మొట్టమొదటి వ్యక్తి -గోఖలే(భారతదేశ సంస్థానములలో బరోడా మొట్టమొదటిసారిగా నిర్భంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టింది)

దాదాబాయ్‌ నౌరోజీ:

బిరుదులు:
- భారతదేశ కురువృద్ధుడు
- మొదటి ఆర్థికవేత్త (First Economist of India)
- Father of Drain Theory
- First Indian British Parliamentarian
వార్తాపత్రికలు:
- వాయిస్‌ ఆఫ్‌ ఇండియా (లండన్‌లో ఇంగ్రీష్‌లో)
- రాస్ట్‌ గోఫ్తర్‌ (మహారాష్ట్రలో పార్శీ భాషలో)
•పుస్తకము - Poverty and Unbritish Rule in India, Debt to India
•సంస్థలు - ఈస్ట్‌ ఇండియా అసోసియేషన్‌ (లండన్‌లో), Parsi Reform Association (మహారాష్ట్రలో పార్శీ సంస్కరణల కొరకు)
•రాయలసీమ కురువృద్ధుడు -కల్లూరి సుబ్బారావు
•దక్షిణ భారతదేశ కురువృద్ధుడు -సుబ్రహ్మణ్య అయ్యర్‌
•భారతదేశ కురువృద్ధుడు -దాదాబాయి నౌరోజీ
•ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కు మూడు సార్లు అధ్యక్షుడైన మొట్టమొదటి వ్యక్తి -దాదాబాయ్‌నౌరోజీ
1886 - కలకత్తా
1893 - లాహోర్‌
1906 - కలకత్తా
•1906 కలకత్తాలో జరిగిన ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సమావేశంలో నౌరోజీ అధ్యక్షతన 4 తీర్మానాలు ఆమోదించబడ్డాయి. అవి
1) స్వరాజ్య తీర్మానం
2) స్వదేశీ తీర్మానం
3) బహిష్కరణ తీర్మానం
4) జాతీయ విద్య తీర్మానం
•నౌరోజీ లండన్‌లో ఫిన్స్‌బెరి నియోజకవర్గం నుంచి లిబరల్‌ పార్టీ తరపున పోటీ చేసి పార్లమెంటుకు ఎన్నికయ్యాడు.
•ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కు కాంగ్రెస్‌ అనే పదాన్ని ఇచ్చాడు. అంతకుముందు ఇండియన్‌ నేషనల్‌ యూనియన్‌ అని పిలిచేవారు.
•బ్రిటీష్‌ పరిపాలన 'శాశ్వతంగా పాతుకుపోయి, నిత్యం పెరుగుతూపోయే ఒక విదేశీ దురాక్రమణ అని దాదాబాయి నౌరోజీ ప్రకటించారు.
•బ్రిటీష్‌ విధానాల వలన, చేతివృత్తుల పతనం వల్ల పెద్దఎత్తున నిరుద్యోగ సమస్య తలెత్తింది.
•నౌరోజీ తన అభిప్రాయాలను "Poverty and Unbritish Rule in India" అనే గ్రంథంలో ప్రకటించాడు.

సురేంద్రనాథ్‌ బెనర్జీ :

•బిరుదు - దేశకోత్తమ, Silver Tongue Orator
•పుస్తకము - A Nation in the Making
•సంస్థ - ఇండియన్‌ అసోసియేషన్‌ (ఆనందమోహన్‌బోస్‌తో కలిసి)
•ఎస్‌.ఎన్‌. బెనర్జీ ఒక ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ అధికారి
•రాజకీయ ఆశయాలు నేత పరిశ్రమను ఆర్థికంగా పోత్సపించడానికి 'జాతీయ నిధి ఏర్పరచాలని సూచించిన మొదటి నాయకుడు.
•1895లో పూనేలోను, 1902లో అవ్మాదాబాద్‌ సమావేశంలోను రెండుసార్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడయ్యాడు.
•జాతీయ ఉద్యమంలో కీలకంగా పాల్గొంటున్నాడనే నెపంతో బ్రిటీష్‌ ఎస్‌. ఎన్‌. బెనర్జీని ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ నుండి తొలగించింది.
•ఇండియన్‌ అసోసియేషన్‌ యొక్క శాఖ అయిన ఇండియన్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ బ్రిటీష్‌ వద్ద నుంచి పరిపాలనా సంస్కరణలను డిమాండ్‌ చేసింది.
•1917 ఆగష్టు డిక్లరేషన్‌ (1919 చట్టానికి సంబంధించినది)ను సమర్థిస్తూ 1918లో నేషనల్‌ లిబరల్‌ పార్టీని ఏర్పాటు చేశాడు.
•1905 బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా విభజన ఉద్యమాలను మొట్టమొదటిగా ఎస్‌. ఎన్‌. బెనర్జీ, కృష్ణకుమార్‌
•మిత్రాలు ప్రారంభించారు. (కె.కె.మిత్రా యొక్క సంజీవని వార్తాపత్రికలో మొదటిసారిగా “బహిష్కరణ” అనే పదం పేర్కోనబడింది)
•కలకత్తా భారతీయ సంఘం (Indian Association):
1876లో సురేంద్రనాథ్‌బెనర్జీ ప్రోత్సాహంతో ఏర్పడింది.
•సివిల్స్‌ వయోపరిమితిని 21 సం॥ నుంచి 19 సం॥లకు తగ్గించడంతో ఇండియన్‌ అసోసియేషన్‌ ఈ చర్యను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించింది.
•1886లో ఈ సంస్థ ఐఎన్‌సీలో విలీనమైంది.
•1883లో కలకత్తాలో జరిగిన ప్రథమ జాతీయ సమావేశంలో వందలమంది హిందూ, ముస్లింలు పాల్గొన్నారు. భారతీయ సంఘం రెండవ సమావేశం 1885 డిసెంబర్‌ 25, 26, 27 తేదీల్లో కలకత్తాలో జరిగింది. భారతీయ సంఘం రెండు జాతీయ సమావేశాల్లో చర్చించిన సమస్యలనే 1885 డిసెంబర్‌ 28న బొంబాయిలో జరిగిన భారతీయ కాంగ్రెస్‌ సమావేశంలో ప్రతినిధులు చర్చించారు.

ఆనందమోహన్‌బోస్‌ :

•ఇతను కూదా ఒక ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ అధికారి
•1905 బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించాడు.
•ఈ సమావేశం తర్వాత కలకత్తాలోని టౌన్‌హాల్‌ వద్ద బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమాలను, వందేమాతరం, స్వదేశీ ఉద్యమాలను బెంగాల్‌ అంతటా వ్యాప్తి చేయుటకు నిర్ణయించాడు.

మౌలానా అబుల్‌ కలామ్‌ అజాద్‌ : (11-11-1888 : 22-02-1958)

•ఇతను సౌదీ అరేబియాలో జన్మించాడు
•వార్తాపత్రికలు:
- అల్‌హిలాల్‌
- బిల్‌హిలాల్‌
- అల్‌ బలగ్‌
- గబ్బార్‌-ఇ-ఖాతిర్‌
•పుస్తకము - India Wins Freedom
•1945లో గవర్నర్‌ జనరల్‌ వేవెల్‌ ఏర్పాటు చేసిన సిమ్లా సమావేశమునకు ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ప్రతినిధిగా మౌలానా పాల్గొన్నాడు.
•స్వతంత్ర భారతదేశమునకు మొట్టమొదటి విద్యామంత్రి -మౌలానా ఆజాద్‌
•ఆజాద్‌ జన్మదినమైన నవంబర్‌ 11ను జాతీయ విద్యా దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది.

ఫిరోజ్‌షా మెహతా:

•స్థాపించిన పత్రిక - బోంబే క్రానికల్‌
•ఇతను బద్రుద్దీన్‌ త్యాబి, కె.టి.తెలాంగ్‌లతో కలిసి బోంబే ప్రెసిడెన్సీ అసోసియేసన్‌ను స్థాపించాడు.
•1893లో జరిగిన సంఘటనలు:
•గాంధీ దక్షిణాఫ్రికా వెళ్లుట
•వివేకానంద చికాగో సర్వ మత నమ్మేళనంలో ప్రసంగించుట
•అనిబిసెంట్‌ ఐర్లాండ్‌ నుండి భారతదేశానికి వచ్చుట
•అరమిందో ఘోష్‌ 14 సం॥ల తర్వాత లండన్‌ నుండి భారత్‌కు వచ్చుట
•తిలక్‌ మహారాష్ట్రలో గణేష్‌ ఉత్సవాలను ప్రారంభించుట

No comments:

Post a Comment

Post Bottom Ad