వేములవాడ చాళుక్యులు - GNANA SAMHITHA

Breaking

Post Top Ad

Thursday, March 20, 2025

వేములవాడ చాళుక్యులు

👉🏻వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటుల సామంతులుగా ఉంటూ బోధన్‌, వేములవాడలను కేంద్రాలుగా చేసుకొని తెలంగాణలో పశ్చిమోత్తర ప్రాంతాలను పాలించారు.
👉🏻వీరి రాజధానులు:
1) తొలి రాజధాని - బోధన్‌
2) తర్వాత రాజధాని - వేములవాడ
👉🏻బి.యన్‌. శాస్త్రి గారి అభిప్రాయం ప్రకారం తెలంగాణలోని సపాదలక్ష దేశమును రాష్ట్రకూటుల సామంతులుగా బోధన్‌, గంగాధర, వేములవాడ వట్టణాలను రాజధానులుగా పాలించినవారు వేములవాడ చాళు క్యులు.
👉🏻సపాదలక్ష దేశము అనగా ఒక లక్షా యాఖై వేల బంగారు నాణెముల ఆదాయం కలిగిన దేశం (కొందరి అభిప్రాయం ప్రకారం లక్షా పాతిక వేల గ్రామాలు కలిగిన దేశం).
👉🏻గోదావరి నదికి దక్షిణాన గల మంజీర నది నుండి మహాకాళేశ్వర పర్యంతం వ్యావించివున్న భూభాగమే పోదననాడు. దీన్నే సపాదలక్ష దేశం అంటారు. ఇదే వేములవాడ చాళుక్య రాజ్యం.
👉🏻తర్వాత కాలంలో ఈ ప్రాంతం కరీంనగర్‌ జిల్లాలోని సబ్బినాడని, సబ్బిసాయర్‌ మండలమని పిలువబడింది
👉🏻క్రీ.శ. 750-973 వరకు సుమారు 225 సం॥ల పాటు వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటుల సామంతులుగా పాలించారు

తొలి పాలకులు :
1) సత్యాశయ రణవిక్రముడు క్రీ.శ. 641-660
2) పృథ్వీపతి క్రీ.శ. 660-695
3) మహారాజు క్రీశ. 695-725
4) రాజాధిపత్య పృదువిక్రముడు క్రీ.శ. 725-750
👉🏻వేములవాడ చాళుక్య మూల పురుషుడు సత్యాశయ రణవిక్రముడు (కొల్లిపర శాసనం ప్రకారం)
👉🏻ఇతను బాదామి చాళుక్య రాజైన 2వ పులకేశి నుండి బోధన్‌ ప్రాంతాన్ని పొంది పాలించారు
👉🏻సత్యాశ్రయ రణవిక్రముడి తర్వాత మిగతా వారు ఈ రాజ్యాన్ని పాలించినవ్పటికీ వీరి పరిపాలనకు సంబంధించిన విషయాలు పెద్దగా తెలియలేదు

వినయాదిత్య యుద్ధమల్లుడు (క్రీశ. 750-780) :
👉🏻ఇతను వేములవాడ చాళుక్య రాజ్య స్థాపకుడు
👉🏻ఇతను రాష్ట్రకూట రాజ్య స్థాపకుడైన దంతిదుర్గుడి వద్ద సేనాధిపతిగా ఉంటూ అనేక యుద్ధాలలో పాల్గొని చిత్రకోట దుర్గాన్ని అనగా చిత్తూరు దుర్గాన్ని జయించాడు.
👉🏻దంతిదుర్గుడు ఇతని సేవలకు గుర్తింపుగా బోధన్‌, కరీంనగర్‌ జిల్లాలతో కూడిన సపాదలక్ష అనే దేశానికి సామంతరాజుగా నియమించాడు
👉🏻ఇతను బోధన్‌ పట్టణాన్ని రాజధానిగా చేనుకొని పాలించాడు
👉🏻ఇతను బోధన్‌ నుంచి ఆదిలాబాద్‌ జిల్లాలోని చెన్నూరు వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు
👉🏻విక్రమార్జున విజయం ప్రకారం ఇతనికి గజదళం ఎక్కువగా ఉందని మరియు ఏనుగులు బోధన్‌ పట్టణంలోని నూనె సముద్రంలో స్నానమాదేవని తెలుస్తోంది
👉🏻కొల్లిపర తామ్ర శాసనం ప్రకారం ఇతను తురుష్క యవన, కాంబోజ, ఆపష్మీర, నేపాలీ, మగధ, కళింగ దేశాలను జయించినట్లు తెలుస్తోంది.
👉🏻వినయాదిత్య యుద్ధమల్లుడికి ఇద్దరు కుమారులు
1. మొదటి అరికేసరి
2. భీరన్న గృహుడు

మొదటి అరికేసరి :
👉🏻బిరుదులు - సహస్రనామ, సమస్త లోకాశ్రయ, త్రిభువనమల్ల, రాజత్రినేత్ర
👉🏻ఇతను 'కొల్లిపర' అనే శాసనాన్ని వేయించాడు
👉🏻ఇతను ద్రువిడి సామంతుడిగా తూర్పు చాళుక్య రాజైన 4వ విష్ణువర్థునిపై యుద్ధం చేసి వేంగి, త్రికళింగలను కొల్లిపర శాసనం, విక్రమార్జుని విజయం ద్వారా తెలుస్తోంది.
👉🏻ఈ విజయాలకు గుర్తుగా ధృవుడు మొదటి అరికేసరికి నల్గొండ జిల్లాలోని రామడుగు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నాగర్‌కర్నూల్‌ అనే ప్రాంతాలను బహుమానంగా ఇచ్చాడు.
👉🏻దీంతో వేములవాడ చాళుక్య రాజ్యం తూర్పు వైపున విస్తరించడం వల్ల మొదటి అరికేసరి తన రాజధానిని బోధన్‌ నుండి వేములవాడకు మార్చాడు.
👉🏻మొదటి అరికేనరి కాలాముఖ శైవాచార్యుడైన ముగ్దశివాచార్యునికి రామడుగు విషయంలోని బెల్మోగ అనే గ్రామాన్ని దానం చేని కొల్లివర శాననాన్ని వేయించాడు
👉🏻బి.యన్‌.శాస్తి ప్రకారం బెల్మోగ అనే గ్రామం నల్గొండ జిల్లాలోని పెద్దవూర గ్రామమని తెలుస్తోంది.
👉🏻ఇతను గొప్ప శైవ భక్తుడు
👉🏻మొదటి అరికేసరి సోదరుడు భీరన్న గృహుడి కురవగుట్ట అనే శాసనం ప్రకారం నాగర్‌కర్నూల్‌, దేవరకొండ, పెద్దవూర ప్రాంతాలు కొంతకాలం వేములవాడ చాళుక్య రాజ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.

నరసింహుడు (క్రీ.శ.800-835) :
👉🏻ఇతను అరికేసరి పెద్ద కుమారుడు

2వ యుద్ధమల్లుడు :
👉🏻ఇతను నరసింహుడి యొక్క కుమారుడు

1వ బద్దెగుడు / బద్దెన (క్రీ.శ.870-895) :
👉🏻మొదటి అరికేసరి తర్వాత పేర్కొనదగినవాడు
👉🏻బిరుదు - సోలదండడు (అనగా 42 యుద్దాలు చేసిన వీరుడు)
👉🏻ఇతను 2వ కృష్ణుని తరపున తూర్పు చాళుక్య రాజైన మొదటి భీముని మీద యుద్ధం చేసి, అతడిని ఓడించి బందీగా పట్టుకున్నట్లు పర్భణీ అనే శాసనం వల్ల తెలుస్తోంది.
👉🏻బద్దెగ తన రాజ్యాన్ని బస్తర్‌ (చక్రకూట రాజ్యం) వరకు విస్తరింపజేశాడు
👉🏻ఇతను తన పేరు వీదుగా వేములవాడలో బద్దేశ్వరాలయాన్ని నిర్మించాడు. దీనినే వేములవాడలోని భీమేశ్వరాలయంగా గుర్తించారు

3వ యుద్ధమల్లుడు (క్రీ.శ..895-910) :
👉🏻ఇతను 1వ బద్దెగుడి కుమారుడు

2వ నరసింహుడు (క్రీశ.910-930) :
👉🏻ఇతను 3వ యుద్ధమల్లుడి కుమారుడు
👉🏻ఇతను రాష్ట్రకూట రాజైన 3వ ఇంద్రుడి యొక్క సామంతుడు
👉🏻ఇతను 3వ ఇంద్రుడి పక్షాన ఉత్తర బారతదేశంపై దండెత్తి లాట (గుజరాత్‌), మాళవ (మధ్యప్రదేశ్‌) ప్రాంతాలను జయించినట్లు వేములవాడ శాసనం ద్వారా తెలుస్తోంది.
👉🏻కాలప్రియ అనే చోట 2వ నరసింహుడు గూర్జర ప్రతీహార రాజైన మహిపాలుడిని ఓడించి, తన సైన్యాన్ని గంగా, యమున నదీ తీరాలకు నడిపి కన్యాకుబ్జ అనే నగరం వద్ద తన అశ్వాలకు నీరు తాగించాడు
👉🏻తిరిగి వచ్చేటపుడు తన విజయాలకు గుర్తింపుగా కాలప్రియ వద్ద విజయ స్తంభాన్ని నాటాడు.
👉🏻దీనికి ప్రతిఫలంగా 3వ ఇంద్రుడు తన సోదరి జాకవ్వను ఇతనికి ఇచ్చి వివాహం జరిపించాడు
👉🏻కాలప్రియ అనే ప్రాంతాన్ని నేటి యమునా నదీతీరంలోని కాల్ఫీగా గుర్తించారు
👉🏻ఇతని కాలంలో వేములవాడలో జైన చౌముఖాలు చెక్కబడ్డాయి

2వ అరికేసరి (క్రీశ.930-655) :
👉🏻ఇతను 2వ నరసింహుడు, జాకవ్వల కుమారుడు
👉🏻వేములవాడ చాళుక్యులలో గొప్పవాడు
👉🏻బిరుదులు - త్రిభువనమల్ల, ఉదాత్తనారాయణ, ఆరూడ సర్వజ్ఞ పాంబరాంకుశ, అమ్మన గంధవారణ, గుణార్జవ, గుణనిధి
👉🏻ఇతను తన మేనమామ 3వ ఇంద్రుడి కుమార్తె రేవక నిర్మాడితో పాటు మరో రాష్ట్రకూట రాకుమార్తె అయిన లోకాంబికను కూడా వివాహం చేసుకున్నాడు
👉🏻ఇతని కాలంలో రాష్ట్రకూటుల రాజ్యంలో వారసత్వ యుద్దాలు ప్రారంభమయ్యాయి.
👉🏻రాష్ట్రకూట రాజులైన బద్దెగుడు(3వ అమోఘవర్షుడు), 4వ గోవిందుడికి మధ్య జరిగిన వారసత్వ యుద్దాలలో 2వ అరికేసరి బద్దెగుడకి మద్దతు పలికాడు
👉🏻2వ అరికేసరి గొప్పకవి, పండితుడు
👉🏻ఇతని ఆస్థానకవి - పంపకవి (పంపడు)
👉🏻పంపకవి రచనలు - విక్రమార్జుని విజయం, ఆది పురాణం పంపకవి విక్రమార్జుని విజయంలో 2వ అరికేసరిని నాయకుడిగా అర్జునితో పోల్చి మహాప్రబంధంగా తీర్చిదిద్దాడు.
👉🏻దీనికి గాను 2వ అరికేసరి పంపకవికి జగిత్యాల తాలూకాలోని ధర్మపురి అనే గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చి, కవితా గుణార్ణవుడు అనే బిరుదు ఇచ్చాడు.
👉🏻పంపకవి సోదరుడు జీనవల్లభుడు వేయించిన కర్య్యూల శాసనం ప్రకారం పంపకవి క్రీ.శ.902లో జన్మించాడని, క్రీ.శ.941లో ఆదిపురాణంను రచించాడని తెలుస్తోంది.
👉🏻ఆదివురాణం జైనమత మొదటి తీర్ణంకరుడైన వృషభనాథుని చరిత్ర/పంచ కళ్యాణం గురించి తెలుపుతుంది
👉🏻2వ అరికేనరి అనేకమంది జైన గురువులను, పండితులను ఆదరించాడు
👉🏻జీనవల్లభుడి ప్రోత్సాహంతో మల్లియరేచన అనే అతడు కవిజనాశ్రయం అనే ఛందో గ్రంథాన్ని రచించాడు.
(గమనిక : వేములవాడ భీమకవి కవిజనాాశయం అనే ఛందో గ్రంథాన్ని రచించినట్లు వాడుకలో ఉంది. )
👉🏻2వ అరికేసరి తన పేరుతో బోధన్‌లో అరికేసరి జీనాలయాన్ని నిర్మించాడు.
👉🏻కరీంనగర్‌ శాసనాన్ని బట్టి సబ్బినాడులోని 20 వేల గ్రామాలు ఉన్నట్లు, చెన్నూరు శాసనాన్ని బట్టి పోదననాడు 2వ అరికేసరి రాజ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.

వాగరాజు (క్రీశ.955-960) :
👉🏻ఇతను 2వ అరికేసరి, రేవక నిర్మాడిల కుమారుడు
👉🏻రాష్ట్రకూట రాజు 3వ కృష్ణుని సామంతుడు.
👉🏻గంగాధర వట్టణాన్ని రాజధానిగా చేనుకొని పరిపాలించాడు
👉🏻ఇతని ఆస్థానకవి - సోమదేవసూరి
👉🏻సోమదేవసూరి యశస్తిలక చంపూ అనే కావ్యాన్ని యశోధర మహారాజు చరిత, సన్నావతి ప్రకరణ, యుక్తి చింతామణి అనే గ్రంథాలను రచించాడు.
👉🏻ఇతనికి సంతానం లేని కారణంగా ఇతని సోదరుడు రాజ్యానికి వచ్చాడు.

2వ బద్దెగుడు/భద్రదేవ (క్రీశ.960-65) :
👉🏻ఇతను 2వ అరికేసరి, లోకాంబికల కుమారుడు
👉🏻ఇతను తన విద్యా గురువు అయిన సోమదేవసూరి కోసం శుభదామ జీనాలయమును నిర్మించినట్లు వేములవాడ శాసనం తెలుపుతోంది
👉🏻శుభదామ జీనాలయమునకు బద్దెగ జీనాలయము అనే 'పేరు కూడా ఉంది.

3వ అరికేసరి (క్రీశ.965-973) :
👉🏻ఇతను 2వ బద్దెగుని కుమారుడు
👉🏻ఇతను వేములవాడ వంశ చాళుక్యులలో చివరివాడు
👉🏻ఇతను సోమదేవసూరికి వనికటుపలు గ్రామాన్ని శుభదామ జీనాలయాన్ని దానమిస్తూ క్రీ.శ. 966లో పర్చణీ తామ్ర శాసనం వేయించాడు.
👉🏻వేములవాడ చాళుక్యులు పర్చణీ తామ శాసనంలో తాము సూర్యవంశ క్షత్రియులమని చెప్పుకున్నారు.
👉🏻3వ అరికేసరి రాజధాని - వేములవాడ
👉🏻రేపాక శాసనం ప్రకారం క్రీ.శ.968లో 3వ అరికేసరి రేపాక అనే గ్రామంలో జైనాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. రేపాక అనే గ్రామం కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల తాలూకాలో కలదు.
👉🏻క్రీ.శ.973 నాటికి వేములవాడ చాళుక్య వంశం అంతమయింది.
👉🏻కానీ, కాజీపేట దర్గా శాసనం ప్రకారం కాకతీయ మొదటి ప్రోలరాజు 3వ అరికేసరి కుమారుడైన 3వ బద్దెడుగుని పారద్రోలి ఉంటారని, దీంతో వేములవాడ చాళుక్య రాజ్యం అంతరించిందని బి.యన్‌.శాస్త్రీ గారు పేర్కొన్నారు.
👉🏻వేములవాడ చాళుక్యుల అనంతరం తెలంగాణ ప్రాంతం కళ్యాణి చాళుక్యుల ఆధీనంలోకి వచ్చింది.

పరిపాలన

👉🏻వీరి కాలంలో గ్రామం 12 మంది ఆధీనంలో ఉండేది
1 గ్రామాధికారి
2 న్యాయాధికారి
3 కరణంv 4 గ్రస్థి
5 నీరుడికాడు
6 తలారీ
7 జ్యోతిష్యుడు
8 కమ్మరి
9 వడ్రంగి
10 చాకలి
11 మంగలి
12 గ్రామ ఉపాధ్యాయుడు
👉🏻వీరికి భూమిపై లభించే పన్ను ముఖ్య ఆదాయవనరుగా ఉండేది
👉🏻వడ్డీ వ్యాపారం అమలులో ఉండేది
👉🏻వృత్తికారులు - సాలె, చర్మకార, కంచర
👉🏻అధికారులు - గౌండ, గౌడ, పటేల్‌, రెడ్డి


మతం

👉🏻శైవ మతంతో పాటు జైనమతం కూడా బాగా అభివృద్ధి చెందినది.
👉🏻వేములవాడ చ్వాళుక్య రాజులలో కొందరు జైనమతాన్ని పోషించారు. మరికొందరు శైవ మతాన్ని పోషించారు
👉🏻జీనవల్లభుడు లాంటి వారు జైన మందిరాలను నిర్మించి, జైన మత అభివృద్ధికి తోడ్పడ్డాడు
👉🏻బొమ్మలగుట్ట అనే ప్రాంతం జైన మత కేంద్రం వర్ధిల్లింది.
👉🏻వైదిక మతం నుండి జైన మతంలోకి మారినవారు తమ పూర్ణాన్ని విడిచిపెట్టేవారు కాదు.
👉🏻వేములవాడ చాళుక్యులు తమ పేర్ల మీదుగా అరికేసరి, బౌద్ధేశ్వర లాంటి ఆలయాలు నిర్మించారు.


సాహిత్యం

👉🏻పంపా కవి
👉🏻కన్నడ సాహిత్యంలో ఆదికవి - పంపా కవి
👉🏻ఇతని రచనలు - ఆదిపురాణం, విక్రమార్జుని విజయం
👉🏻పంపా కవి బద్దెగని మొసళాయండిదిరం తీరెనీరో కొత్త
👉🏻భీమననతి గర్వదింపిడియెగా వర్ణించారు. అనగా మడుగులోని మొసలిని పట్టుకున్నట్లు చాళుక్య భీమున్ని బద్దెగ బంధించాడని చెప్పబడింది.
👉🏻ఇతను 2వ అరికేసరి ఆస్థానకవి

జీనవల్లభుడు
👉🏻ఇతను పంపా కవి సోదరుడు
👉🏻ఇతను కర్యాల శాసనాన్ని వేయించాడు
👉🏻తెలంగాణలో క్రీ.శ.940 నాటి కర్యాల శాసనంలో మొదటిసారి పద్యాలు లభించాయి. ఈ శాసనంలో 3 కంద పద్యాలతో పాటు సంస్కృత, కన్నడ పద్యాలు కూడా ఉన్నాయి
👉🏻ఇతను కర్యాలగుట్టపై చక్రీశ్వరీ జీనాలయమును నిర్మాంచాడు.

మల్లియ రేచన
👉🏻ఇతను రచించిన కవిజనాశ్రయం అనే ఛందో గ్రంథం తెలుగులో మొదటి లక్షణ గ్రంథం

సోమదేవసూరి
👉🏻ఇతను సుప్రసిద్ధ జైనమతాచార్యుడు
👉🏻బిరుదులు - శ్యాద్వాద చలసింహ తార్కిక చక్రవర్తి, కవిరాజు
👉🏻రచనలు - యశస్థిలక చంపూకావ్యం, నీతి వాక్యామృత, యుక్తి చింతామణి, సన్నావారి ప్రకరణ, యశోధర మహారాజు చరిత్ర

2వ బద్దెగుడు
👉🏻రచనలు - నీతిశాస్త్ర ముక్తావళి, సుమతీ శతకం
👉🏻కొందరు చరిత్రకారుల ప్రకారం బద్దెన మరియు బద్దెగుడు ఒకరేనని పేర్కొంటారు

No comments:

Post a Comment

Post Bottom Ad