సూర్య తన కెరీర్ విషయంలో రజనీకాంత్ మాట వల్ల తన ఆలోచనలో మార్పు వచ్చిందని వెల్లడించారు. 'కంగువా' సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం తెలిపారు. ‘‘కొన్ని సంవత్సరాల క్రితం నేను, రజనీకాంత్ సర్ ఒకసారి విమానంలో కలిసి ప్రయాణించాం. అనేక విషయాలపై చర్చించాం. అప్పట్లో ఆయన నాకు, 'మీలో స్టార్ మాత్రమే కాదు, మంచి నటుడున్నాడు. అందుకే యాక్షన్, కమర్షియల్ సినిమాలతోనే కంఫర్ట్ జోన్‌లో ఉండకండి. విభిన్నమైన చిత్రాలు చేయాలని ప్రయత్నించండి' అని చెప్పారు. ఆ మాటల ప్రభావంతోనే నేను 'సింగం' వంటి యాక్షన్ చిత్రంలోనూ, 'జై భీమ్' వంటి లీగల్ డ్రామాలోనూ నటించాను. నా కుమార్తె కూడా చాలాసార్లు 'రెండు చిత్రాల్లో నువ్వు వైవిధ్యం ఎలా చూపించావ్?' అని అడిగింది’’ అని సూర్య అన్నారు.
No comments:
Post a Comment