ఇది రెండోసారి కూడా చూడాలని అనిపించే స్థాయి ఉన్న చిత్రం : విశ్వక్షేన్ - GNANA SAMHITHA

Breaking

Post Top Ad

Monday, October 21, 2024

ఇది రెండోసారి కూడా చూడాలని అనిపించే స్థాయి ఉన్న చిత్రం : విశ్వక్షేన్



విష్వక్ సేన్ హీరోగా నటించిన 'మెకానిక్ రాకీ' నవంబర్‌లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ సినిమాను రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించగా, రామ్ తాళ్లూరి నిర్మించారు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటించారు. సునీల్, నరేశ్ వి.కె ముఖ్యపాత్రలు పోషించారు. నవంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో భాగంగా, హైదరాబాద్‌లో ఆదివారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో విష్వక్ సేన్ మాట్లాడుతూ, “ఇటీవలే సినిమా చూశాను, చాలా విశ్వాసంగా ఉన్నాం. ఇది ప్రేక్షకులను కుర్చీల అంచున ఉంచే సినిమా. రెండోసారి కూడా చూడాలని అనిపించేలా ఉంటుంది. ద్వితీయార్థంలో థియేటర్లు ఆడిటోరియంలా మారిపోతాయి. నవంబర్ 21 సాయంత్రం నుంచే పెయిడ్ ప్రీమియర్స్ ప్రారంభిస్తాం” అన్నారు. దర్శకుడు రవితేజ మాట్లాడుతూ, “ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా, ఇంకా చాలా కంటెంట్ సినిమాలో ఉంది. అందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నా” అన్నారు. నిర్మాత రామ్ తాళ్లూరి, “నవంబర్ 22న థియేటర్లలో మాస్ జాతర ఉంటుంది” అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రద్ధా శ్రీనాథ్, క్రాంతి ప్రియం తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad