37 రోజుల జైలు జీవితం అనంతరం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రెగ్యులర్ బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన తన ఇంటికి చేరుకున్నట్టు తెలుపుతూ ఓ ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో ‘యానిమల్’ సినిమాలోని ‘నాన్న’ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా, జానీ మాస్టర్ తలుపుతట్టి ఇంట్లోకి ప్రవేశించడం, పిల్లలతో హత్తుకొని ఎమోషనల్ అవడం, భార్య కళ్లలోని నీళ్లు తుడవటం వంటి సన్నివేశాలు ఉన్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జానీ మాస్టర్‌పై ఒక మహిళా కొరియోగ్రాఫర్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఆయనను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు రిమాండ్ చేశారు. హైకోర్టు ఇటీవల ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం జైలు నుండి విడుదల అయ్యారు. 37 రోజుల తర్వాత స్వతంత్రంగా బయటికి వచ్చిన జానీ మాస్టర్‌ను కుటుంబ సభ్యులు ఆనందంగా స్వాగతించారు. ఇంటికి చేరుకున్న ఆయన కుటుంబ సభ్యులను చూసి ఎమోషనల్ అయిపోయారు.
తన జీవితంలో 37 రోజుల పాటు ఎన్ని విషయాలు మిస్సయ్యాయని, తన కుటుంబం, మిత్రుల ప్రార్థనలే తనకు శక్తినిచ్చాయన్నారు. ‘‘సత్యం ఆలస్యమైనప్పటికీ ఎప్పుడో ఒకరోజు బయటపడుతుంది. ఈ వ్యవహారంలో నా కుటుంబం పడిన ఇబ్బందులు నన్ను ఎప్పటికీ బాధపెట్టుతూనే ఉంటాయి’’ అంటూ తన భావోద్వేగాన్ని వీడియో ద్వారా వ్యక్తం చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
No comments:
Post a Comment